అన్ని ఒకేచోటే దొరుకుతాయి కదా అని

అన్ని ఒకేచోటే దొరుకుతాయి కదా అని

తరుచుగా కొంతమంది కుర్రాళ్ళు గుడికి రావడం చూసిన ఆ గుడిలోని పూజారి వాళ్ళని

సరదాగా అడిగాడు.

" ఏమోయ్ మీరంతా ఈ మధ్య గుడి దగ్గర ఎక్కువ కనిపిస్తున్నారు, ఇంత భక్తి ఎప్పుడు

పుట్టుకొచ్చింది? " అని అడిగాడు.

" అవును పూజారి గారు. ‘శ్రద్ధ’గా గుడికెళ్తే ‘శాంతి’ దొరుకుతుంది. మంచి ‘భావన’తో

‘పూజ’, ’ఆరతి’, ‘అర్చన’, ‘ఆరాధన’ చేయించి దేవుడి ముందు ‘జ్యోతి’ వెలిగిస్తే ’తృప్తి’,

’ముక్తి’ లభిస్తాయని. " అని చెప్పి పకపక నవ్వారు ఆ కొంటె కుర్రాళ్ళు.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ పూజారి.