TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Brahmanandam Son Funny Joke
.jpg)
బ్రహ్మానందం కొడుకు
బ్రహ్మానందం తన కొడుకు గౌతంను తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లాడు ఒక రోజు.
ఆ బంధువులు వీళ్ళకి ఎన్నో మర్యాదలు చేశారు.
గౌతం కోసం బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీంలు పెట్టారు. గౌతమ్ కి ఐస్ క్రీంలు అంటే చాలా ఇష్టం
కావడంతో ఐస్ క్రీంలు అన్నీ తినేశాడు. వాళ్ళ కోసం పెట్టినవి కాకుండా ఇంట్లోకి వెళ్లి తెచ్చుకుని
తినడం మొదలు పెట్టాడు గౌతం. అలా తొమ్మిదిసార్లు వెళ్లి తెచ్చుకుని తొమ్మిది ఐస్ క్రీంలు తిన్నాడు.
పదో ఐస్ క్రీం కోసం లోపలికి వెళ్తుంటే బ్రహ్మానందం కోపంగా " ఓరేయ్ గౌతం...నీకసలు బుద్దుందా ?
నువ్వు ఇలా ఐస్ క్రీంలు తెచ్చుకుని తీనేస్తుంటే లోపల ఆంటీగారు ఏమనుకుంటారు చెప్పు . నిన్ను
తిండిపోతూ అని అనుకోరూ..కదలకుండా కూర్చో " అన్నాడు.
" అనుకోరు నాన్నా...ఎందుకంటె..ఇప్పటిదాకా లోపలికి వెళ్లి తెచ్చిన ఐస్ క్రీంలు అన్నీ మా నాన్న
తీసుకు రమ్మన్నారు. ఆయన ఐస్ క్రీంలు అంటే చాలా ఇష్టం అని చెప్పి తెచ్చాను నాన్నా.." అని
చెప్పి పకపక నవ్వాడు గౌతం.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు బ్రహ్మానందం.
|
|