మై డియర్ రోమియో - 33

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 33

 

స్వప్న కంఠంనేని

 

మీనా నవ్వుకుంది.
ఈలోగా సుధేష్ణ వెడ్డింగ్ కార్డ్స్ తీసుకుని హనిత దగ్గరికి వచ్చింది.
"ఫస్ట్ కార్డ్ నీకే'' నవ్వుతూ చెప్పి వెడ్డింగ్ కార్డ్ ని హనిత చేతిలో పెట్టింది సుధేష్ణ.
ఓ! సో నైస్ ఆఫ్ యూ. కంగ్రాట్యులేషన్స్'' హనిత తీయగా నవ్వుతూ కార్డ్ తీసుకుంది.
"ఫ్రెండ్స్! ఈరోజు గాళ్స్ అందరికీ సుధేష్ణ వాళ్ళింట్లో పార్టీ, బాయ్స్ కి మాత్రం నేను ఇవాళ నైట్ సెవన్ కి చందనా బార్ అండ్ రెస్టారెంట్ లో పార్టీ ఇస్తున్నాను.''
కార్డులన్నీ పంచాక క్లాస్ లో అందర్నీ కలియజూస్తూ అన్నాడు సురేష్.
"ఇంట్లో పార్టీలంటే పెద్ద బోర్! అయినా అదేమిటి సురేష్? మాకు ఇంట్లోనూ బాయ్స్ కి హోటల్ లోనూ ఏమిటి? మాక్కూడా హోటల్ లోనే పార్టీ ఇవ్వు'' అంది హనిత.
"అలా కాదు హనీ! మేము వెళ్ళే బార్ లో క్యాబరే డాన్స్ కూడా ఉంటుంది. అలాంటి చోట్లకి ఆడపిలలు రావటం బాగుండదు. అందుకనీ ...'' చిన్నపిల్లకి నచ్చ చెబుతున్నట్లుగా అన్నాడు సురేష్.
"అంటే ... నివ్విచ్చే హోటల్ పార్టీకి మమ్మల్ని రావద్దంటావ్. అంతేనా?'' బెదిరిస్తున్నట్టుగా అంది హనిత.
"నో! నో! అలా కాదు. అదీ ... అదీ ...'' మాటలకోసం తడుకుమున్నాడు సురేష్.
"సరేలే! నాకర్థమైంది. మేము రాములే ... నువ్వు భయపడకు'' అభాయమిచ్చింది హనిత.
తర్వాత సుధేష్ణ, సురేష్ లు లెక్చరర్స్ కి కూడా కార్డ్స్ ఇచ్చి అందర్నీ పార్టీకి రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళారు.
వాళ్ళు వెళ్ళగానే మీనా వైభవ్ ని అడిగింది. "బావా! మరి మనం ఎప్పుడు చేసుకుందాం పెళ్ళి?''
అంతకు ముందులా వైభవ్ ఆమె మాటల్ని సీరియస్ గా తీసుకోలేదు. నవ్వుతూనే అన్నాడు "నీ పెళ్లెప్పుడో నాకు తెలీదు. కానీ నేను మాత్రం ఇప్పుడే చేసుకోవటం లేదు''
హనిత మీనాతో అంది "అవునే మీనా. మన ఆయా ఒప్పుకుంటేనే కదా అతని పెళ్లయ్యేది''
"షటప్!'' కోపంగా అన్నాడు వైభవ్. కిసుక్కున నవ్వింది మీనా.
కాలేజీ అయిపోయాక మగపిల్లల్ని వెళ్ళిపోనిచ్చి తర్వాత ఆడపిలలు అందరూ సమావేశమయ్యారు.
"సుధేష్ణ ఇచ్చే పార్టీకి ఎలా వెళ్ళాలి? ఏ చీర కట్టుకోవాలి?'' అన్న విషయం మీద చర్చ జరపసాగారు.
హనితకి నవ్వొచ్చింది. ఏ చీర కట్టుకోవాలన్న విషయాన్నివాళ్లోక పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్ లాగా చర్చిస్తుంటే పెళ్ళి చేసుకోబోతున్న సుధేష్ణ కంటే ఎక్కువగా వీళ్ళే మేకప్ అయ్యేటట్టున్నారే అనుకుంది.
సడన్ గా హనిత అంది "మనం కూడా చందనా బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్ళి సురేష్ వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామా?''
"అమ్మో. నేను రాను'' అందొక అమ్మాయి.
"ఛీ. ఛీ, లాంటి చోట్లకి వెళ్ళానని తెలిస్తే మా ఇంట్లో నన్ను చంపేస్తారు. నేను రాను'' అంది మరో అమ్మాయి.
మొత్తానికి అందరూ చందనా బార్ అండ్ రెస్టారెంట్ కి రావటానికి తిరస్కరించారు.
"పోనీ! నువ్వయినా వస్తావా మీనా?'' అడిగింది హనిత.
"సారీ హనీ! మా అమ్మకి ఒంట్లో బాగాలేదు. కాబట్టి నేనివ్వాళ చందనా బార్ కి రాలేను. సుధేష్ణ ఇచ్చే పార్టీకి రాలేను. అసలైనా నువ్వు కూడా బార్ కి వెళ్ళకు. అలనాటి చోట్లకి ఆడపిల్లలు వెళ్లటం మంచిది కాదు'' చెప్పింది మీనా.
"చూద్దాంలే! నిర్లక్ష్యంగా అంది హనిత.