మై డియర్ రోమియో - 12

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 12

 

స్వప్న కంఠంనేని

 

నీకెందుకు? నా ఇష్టమొచ్చినట్టు నేను పిలుస్తాను'' బుంగమూతి పెట్టి అన్నాడు వైభవ్.
విననట్లుగా దిక్కులు చూడసాగింది హనిత.
"మన క్లాస్ మొత్తం అమ్మాయిలందర్లోకీ నువ్వే బావుంటావ్ తెలుసా?'' సుధేష్ణ కళ్ళలోకి చూస్తూ అన్నాడు వైభవ్.
"ఛీ ఫో వైభవ్!'' అంది సుధేష్ణ సిగ్గుపడుతూ.
హనిత ఉడుక్కుంది లోపల్లోపలే.
పైకి మాత్రం "కానీ ఎత్తొక్కటే లోపం. మరీ మూడడుగులే పాపం'' అంది.
సుధేష్ణా, వైభవ్ అందరూ గిరుక్కున వెనక్కి తిరిగి హనితని కోపంగా చూశారు. చేతిని నోటికడ్డంగా పెట్టుకుని నవ్వుకుంది హనిత.
"ఛీ! ఈ హనితకి వేరే వాళ్ళని పొగిడితే ఎంత కుళ్లో! తనొక పెద్ద అందగత్తెని అనుకుంటోంది కాబోలు. డిప్పకటింగ్ చేయించిన కోటి మొహమూ అదీనూ!'' అన్నాడు వైభవ్.
"ఏమన్నావ్?'' కోపంగా అంది హనిత.
తనని కాదన్నట్లుగా వైభవ్ పక్కకి చూడసాగాడు.
"నిన్నే!'' వైభవ్ చొక్కా పట్టుకుని లాగింది హనిత.
హనిత వైపుకి తలతిప్పి చూసిన వైభవ్ భయంతో కెవ్వున కేకేశాడు.
"ఏమైంది? ఏమైంది?'' అంటూ క్లాస్ మేట్స్ అంతా వైభవ్ చుట్టూ గుమికూడారు.
"నాకు చిన్నప్పటి నుంచి కోజ్జాలంటే భయం. సడెన్ గా కొజ్జా షర్టు పట్టుకుని గుంజేసరికి భయం వేసింది!''
అతని మాటలకు హనిత మొహం మాడిపోయింది.
"ఈ వైభవ్ గాడేంటి నెత్తికెక్కుతున్నాడు?'' అనుకుంది మనసులో.
"ఎవడ్రా కొజ్జా?'' అంది క్రూరంగా చూస్తూ.
"నువ్వేనే!'' అన్నాడు వైభవ్. తర్వాత మిగతా వాళ్ళవైపు తిరిగి అన్నాడు. "అవునూ! కోజ్జాలను నువ్వేనా అనాలా? లేకపోతే నువ్వేరా అనాలా?''
క్లాస్ అందరూ ఎప్పుడో ఒకప్పుడు హనిత వేధింపులకి గురైన వాళ్ళే. కాబట్టి వాళ్లకి వైభవ్ ఏడిపించటం సరదాగానే అనిపించింది.
"పోన్లే! నువ్వే అణు. అయినా ఈ కోజ్జాస్ తో వచ్చిన ప్రాబ్లమే ఇది. వాళ్ళనేమనాలో, ఎలా పిలవాలో తెలీదు. ఖర్మ''అంటూ వైభవ్ కి సర్ది చెప్పాడో స్టూడెంట్.
అందరూ ఎకమయ్యేసరికి హనితకేం చేయాలో అర్థం కాలేదు. మీనా వైపు చూసింది. మీనా అప్పటికే బంచ్ మీద తలవాల్చి నిద్రపోతున్నట్లుగా నటిస్తోంది.
ఇంతలోకి ఇంగ్లీష్ లెక్చరర్ మిసెస్ షర్మిల క్లాస్ లోకి వచ్చింది. దాంతో అంతా ఎవరి సీట్లలోకి వాళ్ళు జారుకున్నారు.
ఆవిడని చూడగానే హనితకి ప్రొద్దున జరిగిన సంఘటన గుర్తొచ్చింది.
హనిత అప్పుడే కాలేజ్ లోపలికి అడుగుపెట్టింది. లాన్ పక్కగా నడుస్తోంది.
ఆమే నడుస్తున్న దారికి మరో వైపున అశోక చెట్లున్నాయి. సడెన్ గా హనిత దృష్టి తనకి కాస్త ముందుగా నడుస్తున్న ఇంగ్లీష్ లెక్చరర్ షర్మిల పైన పడింది.
ముప్పై ఏళ్లుంటాయి ఆవిడకి. కానీ ఆమే డ్రెస్సింగ్ చూసిన వాళ్ళెవరైనా సరే ఆమెకి కనీసం యాభై  ఏళ్లుంటాయనుకుంటారు.
బూడిద రంగు నేత చీర, బాగా నూనె రాసుకుని ముడేసుకున్న జుట్టు, రెండు చేతులకీ డజన్  మట్టిగాజులు. నుదుట రూపాయి కాసంత కుంకుమ, ఇదీ ఆవిడ అవతారం. ఆవిడ్ టీచ్ చేసే సబ్జెక్టు ఇంగ్లీషు కావటం మరో వింత.
ఫ్యాషన్ల కోసమే బ్రతకటం, కొత్త ఫ్యాషన్స్ రాగానే వెర్రిగా వాటిని అనుకరించటానికి అలవాటుపడ్డ కాలేజీ ఆడపిల్లలకి ఆవిడ రూపం రుచించకపోవటం పెద్ద వింతేం కాదు. ఆ కాలేజీలో ఏం నలుగురు ఆడపిల్లలు మాట్లాడుకున్నా ఆవిడ డ్రెస్ స్ ని విమర్శించనిదే సంభాషణ అంతం కాదు.
అలాంటి ఇంగ్లీష్ మేడం పొద్దున్నే దర్శనమ్నిచ్చేసరికి హనితకి ఎక్కడలేని సంతోషమూ ఆవరించింది. ఆవిడని చూస్తూ హుషారుగా విజిలేసింది.
విజిల్ విన్న ఆవిడ వెనక్కి తిరిగి హనితని చూసింది.
హనిత ఆవిడను చూడనట్టుగా నటిస్తూ స్కర్ట్ పాకెట్స్ లో చేతులు పెట్టుకుని నడుస్తూ పాట లంకించుకుంది.
"ముడురాకులలో ముసలమ్మా''
పాత సినిమాపాట "చిగురాకులలో చిలకమ్మా''కి పారడీ అది.
ఆ పాట తనను గురించే పాడుతోందని అర్థమైంది ఆవిడకి. యాభైయ్యేళ్ళ ముసలావిడ కూడా "నువ్వు ముసలిదానివి'' అంటే హర్టవుతుంది. కోపమొస్తుంది. అల్లాంటిది 30ఏళ్ళ షర్మిలకు హనిత మాటలు పుండు మీద కారంలా అనిపించాయి.
"సరే చూస్తాను నీ పని'' అని లోపల్లోపలే అనుకుని ఆవిడ అక్కడి నుంచి విసవిసా నిష్క్రమించింది.
హనిత గుసగుసగా అంది మీనాతో "ఏంటే? ఈ వెధవలంతా కలిసి నన్ను టీజ్ చేస్తుంటే నువ్వు నిద్రపోయినట్లు స్టిల్లిచ్చావ్! సిగ్గులేదూ?''
"ఏం చేయాలి మరి?'' నన్ను కూడా ఏమైనా అంటారేమోనని ...'' సణిగింది మీనా.
"అయితే మాత్రం ...'' ఇంకా ఏదో తిట్టబోయింది హనిత.
ఈలోగా మిసెస్ షర్మిల దృష్టి వీళ్ళపై పడనే పడింది.
హనితనీ, మీనానీ వేలితో సైగచేస్తూ లేచి నిలబడమంది.
ఆ సంఘటనని ఆవిడ మర్చిపోలేదు. మనస్సులో ఉంచుకుంది. హనిత మీద మనసులో హాలా కసిగా కూడా వుంది. అంతకు ముందురోజే "ఎప్పుడూ ముసలిదాన్లా ఉంటావెందుకు? నిన్ను చూస్తేనే మనుషుల్లో బతకాలనే కోరిక కూడా చచ్చిపోతుంది'' పరాయి ఆడవాళ్ళ కోసం పరుగులు తీసే భర్త అన్న మాటలు కూడా గుర్తొచి అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ఆమే మనసు కుతకుతా ఉడికిపోయింది.
ఇవ్వాళ ఎలాగైనా సారే, ఏదో ఒక వంకన హనితని ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆవిడ క్లాస్ లోకి అడుగుపెట్టింది. దాని పరిణామాలెలాంటివినా సరే ఎదుర్కోవటానికే సిద్ధపడిందావిడ.
"ఏం మాట్లాడుతున్నారు?'' కోపంగా అడిగిందావిడ.
"ఏం లేదు'' నిర్లక్ష్యంగా అంది హనిత.
"అయితే లెసన్ వింటున్నారన్నమాటేగా'' వ్యంగ్యంగా అందావిడ.
"అవును'' ఠక్కున జవాబిచ్చారు హనిత, మీనాలు.
"అయితే చెప్పండి. షేక్ స్పియర్ ఎవరు?''
బుర్రగోక్కున్నారిద్దరూ. ఆ పేరెక్కడా విన్నట్లుగా అనిపించలేదు వాళ్లకి. మీనాకి సడెన్ గా ఒక ఆలోచన తట్టింది. షేక్ అంటే ముస్లీం పేరు కదా కాబట్టి ముస్లీం లీడర్ అయ్యుంటాడు అనుకుంది. సంబరంగా "షేక్ స్పియర్ అంటే ఒక ముస్లీం లీడర్'' అని చెప్పింది.
అప్పుడావిడ చూసిన చూపుకే గనక శక్తి ఉంటే హనిత, మీనాలు మాడి మసైపోయేవారే.
ముందుగా మీనాని "ఎప్పుడూ తిని ఒళ్ళు పెంచడమేనా? ఏమైనా చదివే పనుందా?'' అని తిట్టి హనిత వేపు తిరిగి "ఎప్పుడూ వాళ్ళనీ, వీళ్ళనీ కామెంట్స్ చేసి ఆటలు పట్టించటానికి నీకు బుద్ది లేదా?'' అంది.
హనిత మీ మాట్లాడలేదు.
ఇంతలో వైభవ్ లేచి నిలబడి చెప్పాడు.
"ఇప్పుడే మిమ్మల్ని దరిద్రపు మొహం అని కూడా తిట్టింది మేడమ్!''
హనిత స్టన్నయింది. "నేను తిట్టలేదు ...'' అంటూ ఏదో చెప్పబోయింది.
కానీ హనిత మాటలు వినిపించుకోలేదావిడ.
అరగంట సేపు ఫుల్ స్టాప్ లేకుండా చెడామడా తిట్టేసిందావిడ హనితని.
తిట్టే తిట్టే అలసిపోయి అప్పుడు బుక్ తీసిందావిడ క్లాస్ తీసుకోవటానికి. ఇంతలో లంచ్ బెల్ మోగింది.
హనితని కోపంగా చూస్తూ క్లాస్ లో నుంచి వెళ్ళిపోయింది షర్మిల.షర్మిల మాటలని కొంచెం కూడా లెక్కచేయలేదు హనిత. కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేశారు హనిత, మీనాలు.
హనిత టిఫిన్ బాక్స్ కి మూట పెడుతుంటే వైభవ్ అన్నాడు.
"వచ్చిన పనయిందిగా. ఇక ఇంటికి బయల్దేరండి''
నిర్లక్ష్యంగా చూసిందతని వేపు హనిత.
చేతులు కడుక్కోవడానికి బయటికెళ్ళారు హనిత, మీనా.
వాళ్ళు బయటికి వెళ్ళగానే వైభవ్ తన జేబులో నుంచి ఒక బాటిల్ బయటికి తీశాడు. రెడ్ ఇంక్, జిల్లేడు రసం కలిపి ఉన్నాయందులో.