మై డియర్ రోమియో - 2

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 1

 

స్వప్న కంఠంనేని

 

గదిలో ప్రిన్సిపాల్ ఆమెను గంటసేపు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశాడు.
తప్పు తనదే కాబట్టి తలొంచుకుని తిట్లన్నిటినీ మౌనంగా భరించింది హానిత.
"సారీ సార! ఇంకెప్పుడూ ఇలా చేయను'' ఆఖరున బుద్ధిమంతురాలిగా అన్నది.
"ఇదే నీకు ఆఖరి వార్నింగ్! ఇంకెప్పుడైనా కాలేజీకి లేట్ గా రావటంగాని గోడలు దూకటంగాని చేశావంటే టీసీ ఇచ్చి పంపించేస్తాను. నౌ గో ఎవే'' అన్నాడు ప్రిన్సిపాల్ తలమీది బొప్పిని సవరించుకుంటూ.
"థాంక్యూ సర్'' చేప్పి వెనక్కి తిరిగింది హానిత.
పళ్ళికిలిస్తూ చేతులు కట్టుకుని ప్రిన్సిపాల్ ని వినయంగా చూస్తున్న గెట్ కీపర్ ని చూసేసరికి ఆమెకు అరికాలి మంట నెత్తికెక్కింది.
బయటకు వెళ్ళి క్లాస్ కి వెళ్ళకుండా కారిడార్ లో ఉన్న కుర్చీలో కూర్చుంది. గెట్ కీపర్ ప్రిన్సిపాల్ రూమ్ లో నుంచి బయటకు రాగానే దగ్గరగా వెళ్ళి అంది.
"పేను వెధవా! చస్తావ్ రోరేయ్''
మరికాసేపు అక్కడే ఉంటే ఏం జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు కనక అనడలుచుకుంది అన్నాక పరిగెత్తుకుంటూ క్లాస్ కి వెళ్ళిపోయింది.
క్లాస్ లోకి వెళ్ళేసరికి ఫిజిక్స్ లెక్చరర్ గోలగోలగా 'రిలేటివిటీ' మీద క్లాస్ తీసుకుంటోంది. చప్పుడు చేయకుండా పిల్లిలా వెళ్ళి చివరి వరసలో కూర్చుంది.
"హాయ్!'' తనకు ముందు వరసలో కూర్చున్న రాజానీ, మీనానీ పిలుస్తూ అంది. రాజా, మీనాలు వెనక్కి తిరిగి చూసి 'హాయ్' అంటూ లేచివచ్చి ఆమెకు చెరో పక్కనా కూర్చున్నారు.
వాళ్ళిద్దరూ హనితకు బెస్ట్ ఫ్రెండ్స్.
హనితకు సడెన్ గా తమకి ఎడమవైపు ఉన్న బెంచీల్లో మొదటి వరసలో ఒక కొత్త శాల్తీ కనిపించింది.
మీనాతో అంది "ఏయ్! ఎవరే ఆ దేభ్యం?''
"కొత్తగా చేరాడు. ఇప్పుడే ఎర్రబస్సు దిగినట్లున్నాడు. నిన్న జాయిన్ అయ్యాడట'' మీనా రాజాలిద్దరూ ఒకేసారి సమాధానమిచ్చారు.
"అవునా? నిన్న నేను రాలేదుగా. నిన్న నేను సినిమాకెళ్ళాను తెలుసా? 'ఘరానా బుల్లోడు'కి. అబ్బ సినిమా ఎంత బావుందో!ఆగార్జున అదరగొట్టేశాడు. అది సరికాని, ఈ బుద్ధూగాడిని నిన్న మీరేమీ ఏడిపించలేదా? ధైర్యంగా ఎలా కూర్చున్నాడో. ఏంటి రాజా! నువ్వు రోజురోజుకీ మరీ వేస్ట్ గా తయారవుతున్నావ్'' అంది హానిత.
"అలా అంటావేంటి హనీ? నువ్వు వచ్చాక అయితే మజా వస్తుందనీ, నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావనీ అతన్ని మేమింతవరకూ కదిలించలేదు. కావాలంటే చూడు లంచ్ అవార్ లో అతన్నెలా ఏడిపిస్తానో'' ఉత్సాహంగా అన్నాడు రాజా.
"ఏమో! నాకయితే డౌటే'' రెచ్చగొట్టింది హానిత.
లంచ్ బెల్ కోసం ముగ్గురూ ఆత్రంగా ఎదురు చూడసాగారు.
తర్వాత మరో గంట పాటు ఫిజిక్స్ లెక్చరర్ ఎడాపెడా పాఠం వాయించింది. అంతలో లంచ్ బెల్ మోగింది.
బెల్ వింటూనే హానిత, మీనా, రాజాల మొహాలు వెలిగిపోయాయి.
గబగబా ముగ్గురూ ఆ కొత్త స్టూడెంట్ దగ్గరకు వెళ్ళారు.
"మే ఐనో యువర్ గుడ్ నేమ్?'' రాజా అడిగాడు ఆ కొత్త స్టూడెంట్ ని.
"వైభవ్'' ప్లెజెంట్ గా సమాధానం చెప్పాడతను.
"బొమ్మన కాదా?'' సీరియస్ గా అడిగింది మీనా.
వైభవ్ కి ఏం మాట్లాడుతోందో అర్థం కాలేదు. అయోమయంగా చూశాడామె వేపు. మీనా మళ్ళీ రెట్టించింది "ఏమిటి 'బొమ్మన' కాదా?''
"కాదు ఎందుకూ?'' అడిగాడు వైభవ్.
"ఏం లేదు లేవయ్యా! ఊరికనే అడిగింది'' అన్నాడు రాజా.
తర్వాత వొంగి వైభవ్ చెవిలో చెప్పాడు "ఆ అమ్మాయికి కొంచెం స్క్రూ లూజ్!''
"ఓహో'' అన్నాడు వైభవ్ అర్థమైనట్టుగా తలూపుతూ.
"ఏం చెప్పాడు నీతో?'' మెల్లకన్ను పెట్టి, బరబరా బుర్రగోక్కుంటూ అడిగింది మీనా.
"ఏం ... ఏం ... లేదు'' భయం భయంగా అన్నాడు వైభవ్.
ఆమె నిజంగానే పిచ్చిదాని మనసులో నిర్థారించేసుకున్నాడు.
నడుస్తూ వాళ్ళంతా ముందు లాన్ లోకి వచ్చారు.
ఉన్నట్లుంది మీనా వైభవ్ తో అన్నది "అంకుల్! నన్నెతుకోవూ?''
అలా అన్న మీనా వేపు చూసిన వైభవ్ కి గుండె గుభేలుమంది.
అయిదడుగుల పదంగుళాల ఎత్తు, పర్వతకాయం, పచ్చడి బండకున్నంత మోటుతనం ఆమె ఒంటికుంది.
మనసులో కసిగా అనుకున్నాడు.
"తల్లీ నీ పేరు మీనా కానీ ఏనుగుని మింగినట్టున్నావు. నిన్ను ఎత్తుకున్నానంటే ఇంకేం లేదు. పచ్చడైపోతాను. పైగా అంకుల్ అట అంకుల్. ఇదేదో బుల్లికుచ్చయినట్టు. దీని పిచ్చి సంగతేమో గాని ముందు నాకు పిచ్చేకించేటట్లుంది.''
ఈలోగా క్లాస్ లో మిగతా వాళ్ళు కూడా వీళ్ళ చుట్టూ గుమికూడారు. వాళ్లకు ముందే అర్థమైపోయింది, హానిత వాళ్ళు కొత్త కుర్రాడ్ని ఏడిపించబోతున్నారని''