TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
రాత్రి పదిగంటలైంది... ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఇల్లు.... బెడ్ రూం..... అప్పారావ్ మంచం మీద కూర్చుని గజదొంగ గజగజ వణుకుతున్నాడు. అప్పారావ్ అలా వణుకుతున్నా
డంటే అతనికి చీకటంటే లేదా రాత్రంటే భయమని కాదు.
మరి? అతని ఎదురుగా వున్న ఆకారాన్ని చూసి అతను వణికిపోతున్నాడు. అతని ఎదురుగా వున్నది ఎవరు? బ్రహ్మ రాక్షసా.... కాదు. అతను ఏరికోరి చేస్కున్న అతని రెండో భార్య మదన మనోహరి. మదన మనోహరి అతనికి అలవాటైన మనిషే.... మరి ఎందుకు అలా గజగజా వణకడం? ఎందుకంటే ఆ రోజు వాళ్ళ పెళ్లిరోజు. అంతేకాదు... మదన మనోహరి తెల్లచీర కట్టుకుని, తలనిండా మల్లెపూలు పెట్టుకుని, చేతిలో పాలగ్లాసుతో నిల్చుని వుంది.
ఆమెతో జరగబోయే శృంగారాన్ని తలుచుకునే ఇన్స్ పెక్టర్ అప్పారావ్ విపరీతంగా వణికిపోతున్నాడు. అంతకుమించి కృంగిపోతున్నాడు. మదన మనోహరి అతన్ని సమీపించింది.
“ప్లేజ్ ... మదనా... వద్దే.... ప్లేజ్...” అన్నాడు మంచంమీద వెనక్కి జరుగుతూ.
“ఒక్కే.... మీకు వద్దయితే నేనే తాగుతా!” మదన మనోహరి పాలని గటగటా తాగేసి గ్లాసుని గది మూలకి విసిరేసింది.
“నేను వద్దన్నది పాలని కాదే బాబూ! ఏంటో నాకీవేళ నడ్డి పీకుడుగా వుంది... హిహిహి...” బలవంతంగా నవ్వుతూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“నోర్ముయ్యండి.... నడ్డిపీకుడూ లేదూ పాడూ లేదు... మన మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేస్కోపోతే ఎలా? ఇది చేతకాదంటే పోనీ ఆ గజదొంగ మంగులుగాడ్ని పట్టుకోగలిగారా? అబ్బే అదేం లేదు... వాడిచేత మొహం బద్దలు కొట్టించుకున్నారు... మీకంటే ఆ రాంబాబు, చిన్నారావ్ లే నయం.... ఊ.... రండి.....” అంది విసుగ్గా.
“అమ్మో వద్దు మాన” భయంగా అన్నాడు అప్పారావ్.
“రా ఎహె!” అంటూ అప్పారావ్ ని రెండు భుజాలు పట్టి వెనక్కి తోసింది.
గజదొంగ మంగులు డెన్....
మంగులు హాల్లో నిటారుగా నిల్చున్నాడు. కాస్త దూరంలో డజను మంది దొంగలు నిలబడి వున్నారు. “బాస్... ఏంటి బాస్ మీరిలా అయిపోయారు?” ఆందోళనగా అడిగాడు ఒక దొంగ.
“ఏం... ఏమైందీ?” అంతకంటే కంగారుగా అడిగాడు గజదొంగ మంగులు.
“ఎప్పుడూ దిక్కుతోచనివాడిలా పచార్లు చేసే మీరెంటి అలా కుదురుగా నిలబడ్డారు?” అన్నాడు దొంగ.
గజదొంగ మంగులు నాలుక కర్చుకున్నాడు. “అర్రే....నిజమే.....” అనుకుని పచార్లు చెయ్యడం మొదలుపెట్టాడు. అయిదు నిముషాల తర్వాత మంగులుకి ఒక సందేహం వచ్చి పచార్లు ఆపాడు. “అవునూ... వీరూగాడు కనబడ్డం లేదేం?” అడిగాడు దొంగల్ని.
“ఈ వేళ శలపెట్టాడండి” చెప్పాడో దొంగ.
మంగులు “ఆ...” అని బాధగా అరుస్తూ జుట్టు పీక్కున్నాడు.
“ఇదేమైనా గవర్నమెంటాఫీసా శలవెట్టడానికి?” అంటూ అడిచాడు.
దొంగలందరూ తలలు దించుకున్నారు. అంతలోనే మంగులుకి ఓ ఆలోచన వచ్చి రిలీఫ్ పీలయ్యాడు. వీరూగాడు వుంటే ఇంతింత లావు కొవ్వొత్తిల్ని వెలిగించి వాటిల్తో శవధాల పేర్తో తన చేతులు కాలుస్తాడు........... వాడు రాకపోవడమే మంచిదైంది.
“బాస్!” ఒక దొంగ మెల్లగా పిలిచాడు.
గజదొంగ మంగులు వాడివైపు చూశాడు ప్రశ్నార్ధకంగా. “వీరూ లేని లోటు మీరు ఫీలవకుండా నేను చేస్తాను బాస్!” అన్నాడు వాడు వినయంగా.
“అంటే?” అడిగాడు మంగులు.
“ఏం లేదు బాస్! నేను మీ కోసం వీరూ తెచ్చే కొవ్వొత్తులకంటే లావు కొవ్వొత్తులు వెలిగించి తెస్తా బాస్!”
ఆ మాట వినగానే మంగులుకి చిర్రెత్తుకొచ్చేసింది. స్థంభంమీద పిచ్చెక్కినట్టు గుద్దుతూ “వద్దూ... వద్దూ... వద్దూ... వద్దూ...” అని వెర్రికేకలు పెట్టాడు.
ఆ దొంగ పాపం బిక్కమొహం పెట్టాడు. “ఏం బాస్....... ఈ వేళ మీరేం శాపధాలు చెయ్యరా?” అడిగాడు భయపడుతూ.
“లేదు... శపధాలు చెయ్యడానికి ఏమీలేవు” ఆయాసపడుతూ అన్నాడు మంగులు.
“రాంబాబు, చిన్నారావ్ లని ఖతం చేస్తానని శపథం చెయ్యరా?” మరో దొంగ అడిగాడు.
“ఏరా... మీరు నా చేతిని చిలకడ దుంపలా కాల్చేసే ఉద్దేశంతో వున్నారా?” మండిపడ్డాడు మంగులు.
“వాళ్ళని చంపుతానని ఇప్పటికి బోల్డన్ని సార్లు శపథం చేశాను..... ఇప్పుడు దాన్ని ప్లాన్ చెయ్యడమే” అని ఇద్దర్ని దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేశాడు.
డేవిడ్, జాకబ్ అనబడే ఆ ఇద్దరూ గూండాలూ మంగులు ఎదురుగా వచ్చి నిలబడ్డారు. రాంబాబు, చిన్నారావ్ లు ప్రస్తుతం ఎక్కడ వున్నారు?” అడిగాడు మంగులు.
“వాళ్ళిద్దరూ హాస్పిటల్ లోనే వున్నారు బాస్! ఇంకా డిశ్చార్జ్ గా లేదు” చెప్పాడు డేవిడ్.
“వాళ్ళిహ బతకడానికి వీల్లేదు.... మీరు హాస్పిటల్ కెళ్ళి వాళ్ళని అక్కడే ఖతం చేసెయ్యండి” గర్జించాడు మంగులు.
|
|