TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
అయిదు నిమిషాల తర్వాత రెండు కప్పుల్లో వేడి వేడి కాఫీతో వచ్చింది. “సారీ! సడెన్ గా మా అభిప్రాయం మారిపోయింది. మాకిప్పుడు టీ తాగాలని వుంది. వెళ్ళి టీ పెట్టుకురా” అన్నాడు చిన్నారావ్. మదనమనోహరి వాళ్ళిద్దర్నీ బండబూతులు తిట్టుకుంటూ లోపలికెళ్ళి టీ కాచుకుని వచ్చింది. వాళ్ళిద్దరూ టీ తాగి కప్పులు టీపాయ్ మీద పెడ్తుండగా ఫోన్ మోగింది. ఇ
న్స్ పెక్టర్ అప్పారావ్ రిసీవర్ తీసి “హలో!” అన్నాడు.
అవతలినుండి కమీషనర్ లింగారావ్ “హలో... అప్పారావా?” అని అడిగాడు.
కమీషనర్ గొంతు వినగానే అప్పారావ్ బూటుకాలు నేలకేసి గట్టిగా తాకించి సెల్యూట్ తీసి”హలో... నమస్కారం సార్... నేనే సార్.. చెప్పండి సార్...” అన్నాడు కంగారుగా.
“స్టేషన్ కి చేస్తే నువ్వు రాంబాబు, చిన్నారావ్ లని తీస్కుని ఇంటికెళ్ళావని చెప్పారు ఓసారి రాంబాబుకి ఫోనివ్వు!” అన్నాడు లింగారావ్.
అప్పారావ్ రాంబాబుని దగ్గరికి రమ్మని సైగచేసి “కమీషనర్ గారు!” అంటూ రిసీవర్ రాంబాబుకి అందించాడు.
రాంబాబు కూడా సెల్యూట్ చేసి “గుడ్ఆఫ్టర్ నూన్ సార్!...” అన్నాడు.
“ఏం లేదోయ్! రేపు మా దీప బర్త్ డే వుంది. సాయంత్రం పార్టీకి నువ్వూ చిన్నారావ్ ఇద్దరూ రావాలి!’ అన్నాడు లింగారావ్.
రాంబాబుకి వెంటనే సరోజ గుర్తొచ్చింది. మర్నాడు సాయంత్రం తప్పకుండా పార్కుకి రమ్మంది. వెళ్ళకపొతే చాలా కోపం వస్తుంది.... ఇవతల బిగ్ బాస్, అవతల ప్రేయసి... ఎలా?
“ఏంటీ ఆలోచిస్తున్నావ్?” అడిగాడు లింగారావ్.
“పోనీ పొద్దున్నే వచ్చి విషెష్ చెప్పి వెళ్ళొచ్చా సార్?” అడిగాడు రాంబాబు.
“ఏం? సాయంత్రం మీ ఇద్దరికీ గర్ల్ ఫ్రెండ్స్ తో ప్రోగ్రామ్ ఏదైనా వుందా!?” నవ్వుతూ అడిగాడు కమీషనర్.
“సార్!...”
“మాకు ఏదో విధంగా విషయాలన్నీ తెలుస్తాయోయ్! పోనీ మీ గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా పార్టీకి తీసుకురండి. మీరు పార్టీకి మాత్రం తప్పకుండా రావాలి! అంతే!” అని ఫోన్ పెట్టేశాడు కమీషనర్.
“కమీషనర్ గారు రేపు వాళ్ళ పాప బర్త్ డే పార్టీకి మా ఇద్దర్నీ రమ్మంటున్నారు!” ఇన్స్ పెక్టర్ అప్పారావ్ వంక గర్వంగా చూస్తూ చెప్పాడు రాంబాబు.
“ఆ.... ఇక్కడాపు” అన్నాడు రాంబాబు ఓ పబ్లిక్ ఫోన్ ని చూపించి.
జీపు పబ్లిక్ ఫోన్ ముందు ఆపాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. రాంబాబు, చిన్నారావు లు జీపు దిగారు.
“ఇంక నువ్వెళ్ళొచ్చు!” అన్నాడు రాంబాబు.
“నాకు కుక్క కిడ్నీని అమర్చిన సంగతీ...” అంటూ ఆగాడు అప్పారావ్.
“ఎవర్తోనూ చెప్పనులే... నువ్వెళ్ళు.” అభయం ఇచ్చాడు రాంబాబు.
థాంక్స్ చెప్పి జీపు తోలుకుంటూ వెళ్ళిపోయాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“ఇప్పుడు పబ్లిక్ ఫోన్ దగ్గర జీపునెందుకు ఆపించావు?” అడిగాడు చిన్నారావ్.
“కమీషనర్ గారు మీ గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా పార్టీకి తీసుకురండి కావాలంటే అన్నారు! నర్సింగ్ హోంకి ఫోన్ చేసి వాళ్ళకి చెప్దామని” అన్నాడు రాంబాబు.
“మరి ఇందాకే అప్పారావ్ ఇంట్లోంచి ఫోన్ చేసుండాల్సింది!”
“అప్పుడు నాకు తట్టలేదు!” అని టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళాడు. రాంబాబు.
అతనితో పాటే చిన్నారావ్ కూడా బూత్ లోకి వెళ్ళాడు. రాంబాబు నర్సింగ్ హోం నెంబరు డయల్ చేసి అవతల ఫోన్ ఎత్తిన వాళ్ళని సరోజ, సునీతలని పిలవమని చెప్పాడు.
ఓ పది సెకన్ల తర్వాత సరోజ లైన్లోకొచ్చి “హలో!...” అంది.
రాంబాబు కమీషనర్ ఇంట్లో పార్టీ గురించి చెప్పి మీరు కూడా మాతో రండి అని ఇన్ వైట్ చేశాడు.
"ఆయనేదో మాట వరుసకి పిలిచాడు. అలా ముక్కూ మొహం తెలీని వాళ్ళింటికి పార్టీ కొస్తే బాగుండదు... కావాలంటే పార్కుకి ఎల్లుండి సాయంత్రం వెళదాం అని చెప్పింది
సరోజ. రాంబాబు, సరోజ ఓ అయిదు నిమిషాలపాటు కబుర్లు చెప్పుకున్నాక చిన్నారావ్, సునీతలు కబుర్లు చెప్పుకున్నారు. ఇద్దరూ ఫోన్ బూత్ లోంచి బయటికి వచ్చారు. మెల్లగా తమ రూమ్ వైపు అడుగులు వేశారు. అక్కడికి దగ్గరే వాళ్ళ రూమ్. ఓ అయిదు నిమిషాల నడక. కబుర్లు చెప్పుకుంటూ రూమ్ ని సమీపంచిన రాంబాబు, చిన్నారావ్ లు అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి, నోరు పూర్తిగా తెరిచి పెట్టి అలానే చూస్తూ నిల్చుండిపోయారు.
|
|