జూ.ఎన్టీఆర్ కాళ్లు పట్టేసుకున్న అభిమానులు..!
on Jun 3, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ఇండియా వైడ్ గా, వరల్డ్ వైడ్ గా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఫాలోయింగ్ కు ఎలా ఉందో చెన్నై జనతా గ్యారేజ్ సెట్స్ కు వస్తున్న అభిమానులు సంఖ్య బట్టే అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం చెన్నైలో తారక్ పై యాక్షన్ సీక్వెన్స్ లు తీస్తున్నారు. ఆ సెట్స్ కు రోజూ వందలాదిగా ఎన్టీఆర్ అభిమానులు వస్తున్నారట. తారక్ యాక్టింగ్, ఫైటింగ్ ను లైవ్ చూడటానికి అభిమానులు ఎగబడుతున్నారు. ఈ ప్రాసెస్ లో కొంత మంది అభిమానులను మీట్ అయ్యాడు ఎన్టీఆర్. అయితే తారక్ ను చూడగానే ఫస్ట్ కాళ్ల మీద పడిపోవడానికి ప్రయత్నించారట హార్డ్ కోర్ ఫ్యాన్స్. అలా చేయద్దంటూ వాళ్లను వారించి షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషపరిచాడట తారక్. అభిమానులు కాళ్ల మీద పడుతున్నఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ హీరోకు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో చూసి మురిసిపోతున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. సినిమా విషయానికొస్తే, ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్స్ లో ఉంది జనతా గ్యారేజ్ షూటింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని ఆగష్ట్ 12 కు ప్లాన్ చేస్తున్నారు కొరటాల అండ్ కో.