Home

»

Latest News

'చక్కిలి గింత'లు పెడతారా..!

Nov 03, 2014

'తూనీగాతూనీగా' చిత్రం తో కధానాయకుడిగా పరిచయమైన సుమంత్ అశ్విన్ 'చక్కిలి గింత' పెట్టడ్డానికి రెడీ అవుతున్నాడు. సుకుమార్ దగ్గర సహాయకునిగా పనిచేసిన వేమారెడ్డి ఈ చిత్రం ద్వార దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కు తగట్టే సాఫ్ట్ గా, క్లాసీ గా, రొమాంటిక్ గా వుంది ఫస్ట్ లుక్.   సుకుమార్‌ మాట్లాడుతూ ''నేనూ, వేమారెడ్డి, మరో దర్శకుడు ప్రకాష్‌ తోలేటి ఒకేసారి మా ప్రయాణం ప్రారంభించాం. కష్టసుఖాలు పంచుకొన్నాం. వేమారెడ్డి ఇప్పుడు దర్శకుడిగా మారడం సంతోషంగా ఉంది. పాటలు విన్నాను.. బాగున్నాయి.'' అని అన్నారు. రెహానా అనే కొత్తమ్మాయి ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి  మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com