గ్యారేజ్ లో సమంత అందాల మోత..!
on Jun 11, 2016

వరస మిలియన్ డాలర్ సినిమాలతో గోల్డెన్ లెగ్ గా ఇరగదీస్తోంది సమంత. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ కొడుతున్న ఈ సుందరి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అ ఆ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో, గ్యారేజ్ లో కూడా ఆమెపై అభిమానులకు అంచనాలుంటాయి. అయితే ఎన్టీఆర్ లాంటి యాక్టర్, డ్యాన్సర్ పక్కన ఎలాంటి హీరోయిన్ అయినా కనబడటం కష్టమే. అందుకే సమంత ఇప్పుడు కొత్త దారి ఎంచుకుందట. ఎన్టీఆర్ డ్యాన్సులతో పాటల్ని ఇరగదీస్తుంటే, తను అందాల ఆరబోతతో కళ్లు తనవైపు తిప్పుకోవాలనుకుంటోందట సమంత. ఆమె ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నింటికంటే, గ్యారేజ్ లో గ్లామర్ డోస్ హెవీగా ఉంటుందని అంటున్నారు మూవీ వర్గాలు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఆగష్ట్ 12కు లాక్ చేశారు మూవీ టీం. మరి స్యామ్ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



