Home

»

Latest News

రామ్...ర‌వితేజ - డ‌బ్బులే డ‌బ్బులు

May 13, 2015

శాటిలైట్ మార్కెట్ డ‌ల్ అయిపోయింద‌ని గ‌గ్గోలు పెడుతున్నారు గానీ, అదంతా చిన్న సినిమాల వ‌ర‌కే. స్టార్ బ‌ల‌మున్న చిత్రాలు ముందే అమ్ముడుపోతున్నాయి. ల‌య‌న్ శాటిలైట్ హ‌క్కులు విడుద‌ల‌కు ముందే అమ్మేశారు. రూ.5.5 కోట్ల‌కు జెమినీ సొంతం చేసుకొంది. ఇప్పుడు పండగ చేస్కో, కిక్ 2 రైట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కిక్ 2 ని రూ.7.5 కోట్ల‌కు జెమిని ద‌క్కించుకొంది. పండ‌గ చేస్కో రూ.6.5 కోట్ల‌కు జి తెలుగు అందుకొంది. ర‌వితేజ‌, సురేంద‌ర్‌రెడ్డిల కిక్ సినిమా రైట్స్ జెమిని ద‌గ్గ‌రే ఉన్నాయి. ఆసినిమా ఎన్నిసార్లు టీవీలోవేసినా జ‌నం చూస్తూనే ఉన్నారు. ఆ న‌మ్మ‌కంతోనే కిక్ 2 కూడా జెమిని జేజిక్కించుకొంది. రామ్ సినిమాకి ఇంత పెద్ద మొత్తంలో రేటు ప‌ల‌క‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈచిత్రానికి ఇండ్ర‌స్ట్రీలో పాజిటివ్ టాక్ ఉంది. అందుకే... విడుద‌ల‌కు ముందే కొనేసుకొన్నారు. మొత్తానికి శాటిలైట్ మార్కెట్‌కి పెద్ద సినిమాల వ‌ల్ల కొత్త క‌ళ వ‌చ్చేసింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com