Home

»

Latest News

పవన్ కళ్యాణ్ కంటే అల్లు అర్జున్ ఎక్కువ..!

Apr 28, 2016

వివాదాల వర్మ మరోసారి తన ట్విట్టర్లో కొత్త కాంట్రవర్సీ కి తెరలేపారు. ఈ సారి మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టడానికి ట్రై చేశారు వర్మ. అతి పెద్ద సినిమా అయిన సర్దార్ గబ్బర్ సింగ్ కంటే బన్నీ సరైనోడు అతి పెద్ద హిట్టయింది. అంటే బన్నీది కూడా అతి పెద్ద రేంజా..అని ట్వీట్ చేశారు వర్మ. పవన్ కంటే బన్నీది అతి పెద్ద రేంజ్ ఆ ట్వీట్ సారాంశం. ట్వీట్ లో ఎక్కడా పవన్ అన్న పదం వాడకుండా హిమ్ అని సంబోధిస్తూ, పవన్ కు బన్నీకి మధ్య పోలిక పెట్టాడు వర్మగారు.

బన్నీ అతని కంటే పెద్దోడని నెనెప్పుడూ ఆలోచించలేదు. కానీ సరైనోడు సినిమాతో నాకు చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఈ సినిమాతో అతని కంటే బన్నీ చాలా పెద్దగా అయిపోయాడు అని ట్వీట్ చేశాడు. కేవలం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి ఈ ట్వీట్స్ చేశాడన్నది సుస్పష్టం. ఇన్నాళ్లూ కేవలం పవన్ మీదే ఉన్న వర్మగారి కళ్లు ఈ సారి మెగా ఫ్యామిలీ మీద పడ్డాయి. మరి ఈ ట్వీట్ కు పవన్, బన్నీ లు ఏమైనా రిప్లై ఇస్తారేమో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com