Home

»

Latest News

'ధృవ' కోసం రామ్ చరణ్ అలా చేస్తున్నాడు..!

May 26, 2016 12:20AM

బ్రూస్ లీ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ధృవ. తమిళంలో సూపర్ హిట్టయిన తనీ ఒరువన్ ను రీమేక్ చేస్తున్న చెర్రీ, సినిమా కోసం కంప్లీట్ ఛేంజోవర్ అవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే వర్కవుట్ టైమింగ్స్ ను పెంచేసిన మెగా పవర్ స్టార్, ఇప్పుడు ఫుడ్ లో కూడా ఛేంజెస్ తీసుకొచ్చేశాడు. మాంసాహారం మానేసి, పూర్తి శాకాహారిగా మారిపోయాడు. సినిమాలో చెర్రీ అథ్లెటిక్ బాడీతో కనిపించాలని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పడంతో, కాస్త కష్టంగా ఉన్నా తప్పడం లేదు చరణ్ కు. ఆకుకూరలు, హెల్తీ వెజిటబుల్స్ ను ఫుడ్ గా తీసుకుంటున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్న చెర్రీ, దానికోసం తన శరీరాన్ని మార్చే పనిలో ఉన్నాడు. సినిమాలో చెర్రీ పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మూవీ టీం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com