Home

»

Latest News

నందినీ రెడ్డి మళ్లీ పెళ్లంటోంది!

Jun 27, 2015 11:11AM

అలామొదలైందితో డైరెక్టర్ గా కెరీర్ మొదలెట్టిన నందినీరెడ్డికి మనోళ్లు మంచి మార్కులే వేశారు. అప్పట్లో పెద్దగా క్రేజ్ లేని నాని-తొలిపరిచయం అయిన నిత్యామీనన్ తో బాగానే మాయచేసింది. షభాస్ అనిపించుకుంది. కానీ రెండో సినిమాతో బోల్తాపడింది. బాలీవుడ్ లో హిట్టైన ఓ సినిమాని కాపీ కొట్టేసి జబర్ధస్త్ అనే సినిమా తీసి విమర్శలు ఎదుర్కొంది. ఆ దెబ్బకు రెండేళ్ల వరకూ సినిమా ఊసేలేదు. ఇప్పుడిప్పుడే కళ్యాణ వైభోగమే అంటోందట. పెళ్లెవరకమ్మా అంటే నాగశౌర్య కే అని చెబుతోంది.

అదేనండీ జాదుగాడు గా మెప్పించిన నాగశౌర్య హీరోగా...నందినీ రెడ్డి ఓ చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అయితే జబర్ధస్త్ కూడా వెడ్డింగ్ ప్లానర్ నేపథ్యంలో తెరకెక్కి నిండా ముంచింది. మళ్లీ పెళ్లికాన్సెప్ట్ తోనే ఎందుకు వస్తోందో అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈసారైనా కాపీ మూవీ కాకుండా సొంతంగా కథ తయారు చేసుకో...లేదా ఫలానా మూవీ రీమేక్ అని ముందే చెప్పేసెయ్ అని సలహా ఇస్తున్నారంతా. వినపడుతోందా నందినీ....?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com