Home

»

Latest News

పెళ్లిగుట్టు విప్పిన చైతూ

Apr 28, 2015

నాగ‌చైత‌న్య పెళ్లెప్పుడు? ప్రేమ వివాహం చేసుకొంటాడా, లేదంటే గుడ్‌బోయ్‌లా ఇంట్లో చూసిన అమ్మాయినే పెళ్లాడ‌తాడా?? ఇదే విష‌యాన్ని నాగ‌చైత‌న్య‌ని అడిగితే ఏం చెప్పాడో తెలుసా..?? ''నేను పెళ్లికి సిద్ధ‌మే. ఇంట్లోవాళ్లు చూసినా స‌రే.. లేదంటే నేనే చూసుకొంటా..'' అంటూ న‌వ్వేస్తున్నాడు. ''ప్రేమ పెళ్లి, పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి.. రెండింటికీ సిద్ధ‌మే. ఆల్రెడీ ఇంట్లో ఈ విష‌యం చెప్పేశా. మీరు సంబంధం చూడండి... లేదంటే నేనే ఓ అమ్మాయిని చూసుకొంటా.. అన్నాను. ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. ఎప్పుడైనా పెళ్లిక‌బురు వినొచ్చు. అది రేపే కావ‌చ్చు.. లేదంటే ఓ ప‌దేళ్లు ప‌ట్టొచ్చు. ఎప్పుడ‌నేది మాత్రం నా చేతుల్లో లేని వ్య‌వ‌హారం..'' అంటూ త‌న పెళ్లి విష‌య‌మై ఓ క్లారిటీ ఇచ్చాడు నాగ‌చైత‌న్య‌.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com