Home

»

Latest News

ప‌వ‌న్ సినిమాకు పిచ్చ క్రేజ్‌

Nov 6, 2014 12:17PM

Good Craze For pawan Gopala Gopala, pawan Craze For Gopala Gopala, venkatesh,   Gopala Gopala release

టాలీవుడ్‌లో ముస్తాబ‌వుతున్న మ‌రో క్రేజీ చిత్రం.. గోపాల గోపాల‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కృష్ణుడు అన‌గానే ఈ సినిమాపై అంచ‌నాలు ఎక్క‌డికో వెళ్లిపోయాయి. పైగా అత్తారింటికి దారేది త‌ర‌వాత వ‌స్తున్న సినిమా ఆయె. అందుకే ఈ సినిమాపై అటు ప్రేక్ష‌కులు ఇటు బ‌య్య‌ర్లు.. మొత్తానికి టాలీవుడ్ అంతా దృష్టి పెట్టింది. ఎప్పుడో సంక్రాంతికి వ‌చ్చే సినిమా ఇది. కానీ అప్పుడే బిజినెస్ మొద‌లైపోయింది. నైజాంలో ఈసినిమా రూ.15 కోట్లు ప‌లుకుతోంద‌ట‌. ఇక్క‌డ అత్తారింటికి దారేది దాదాపుగా రూ.20 కోట్లు వ‌సూలు చేసింది. టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదే రికార్డ్‌. అదే భ‌రోసాతో ఈ సినిమాని కొనుక్కోవ‌డానికి బ‌య్య‌ర్లు ముందుకొస్తున్నార్ట‌. మొత్త‌మ్మీద ఈజీగా రూ.50 కోట్ల బిజినెస్ జ‌రిగిపోతుంద‌ని నిర్మాత‌లు లెక్క‌లు వేసుకొంటున్నారు. దాంతో ఈ సినిమా విడుద‌ల‌కు ముందే లాభాల్ని సంపాదించిన‌ట్టైంది. ఎందుకంటే.. ఈ సినిమాకి ఇద్ద‌రు నిర్మాత‌లు. ఒక‌రు డి.సురేష్‌బాబు, ఇంకొక‌రు శ‌ర‌త్ మ‌రార్‌. సురేష్‌బాబు వెంకీనీ, శ‌ర‌త్ మ‌రార్ ప‌వ‌న్‌నీ పెట్టుబ‌డిగా వాడుకొంటున్నారు. వీరిద్ద‌రి పారితోషికాలు మిన‌హాయిస్తే ఈ సినిమాకి రూ.15 కోట్లు కూడా ఖ‌ర్చు కావు. సో.. రూ.35 కోట్లు మిగులున్న‌మాట‌. ఇంకా ఓవ‌ర్సీస్ హ‌క్కులు, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదు. సో.. వాటి ద్వారా వ‌చ్చిన‌దంతా ఈ ప్రొడ్యూస‌ర్ల ఖాతాకే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com