ఒకరోజుకు రెండు కోట్లు డిమాండ్ చేస్తోంది..!
on Jun 8, 2016
ఈ రోజుల్లో డబ్బు మంచినీళ్ల ప్రాయంగా మారిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఏదో విధంగా, ఎంత వీలయితే అంత డబ్బును పిండేసుకుంటున్నారు సినీతారలు. ముఖ్యంగా హీరోయిన్లను ఏ షాప్ ఓపెనింగ్ కో, ఈవెంట్ కో రమ్మంటే వాళ్లు అడిగేది కోట్లలోనే ఉంటుంది. ప్రస్తుతం ఒక బాలీవుడ్ హీరోయిన్ అయితే 4 రోజులకే 8 కోట్లు డిమాండ్ చేస్తోంది.
ఆ భామ పేరు దీపికా పదుకొనే. ఈ మధ్యే హాలీవుడ్ సినిమా చేసి వచ్చిన ఈ భామ చేస్తున్న డిమాండ్ అలా ఇలా లేదు. ఒక పేరు పొందిన ఎయిర్ లైన్స్ సంస్థ, దీపికను తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని కోరిందట. వాళ్లు అడిగిందే తడవుగా ఈ భామ తన మనీ డిమాండ్ చిట్టా విప్పేసిందట. ఒక రోజుకు 2 కోట్లు ఇవ్వాలని, టోటల్ గా నాలుగు రోజుల షూటింగ్ కు 8 కోట్లు ఇవ్వాలనేది తన షరతు గా చెప్పిందట. ఇప్పటి వరకూ ఈ రేంజ్ డీల్స్ కేవలం షారుఖ్, అమీర్, రణ్ బీర్ కపూర్లు మాత్రమే చేశారు. దీంతో ఆ సంస్థ ఆలోచనలో పడిందని, ఒక ఐదు కోట్ల వరకూ తెగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. కేవలం ఒకరోజు వెళ్లి షూటింగ్ లో కనిపించినందుకు రెండు కోట్లా..? భలే మంచి చౌక బేరం..!