'లయన్' గర్జించడం ఖాయం
on Apr 20, 2015

'లెజెండ్'తో సూపర్ హిట్టు కొట్టి అదే ఊపుతో ఇప్పుడు బాలయ్య 'లయన్' అంటూ గర్జించడానికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు బాలయ్య 'లయన్'తో మరో హిట్టు కొట్టడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య డబల్ రోల్ చేస్తున్నారు. బాలయ్య అభిమానులకు ఇది డబల్ బొనాంజా. సినిమా బాగా వచ్చిందని, ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్ లో ఉందని ఫిలింనగర్ లో వినిపిస్తుంది. 'లెజెండ్'లో నటసింహ బాలకృష్ణ తన సత్తా చూపించి అదే కసితో ఇప్పుడు 'లయన్'లో నటిస్తున్నారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించడానికి రానున్నారు. 'సింహా'లో డ్యుయల్ రోల్, 'లెజెండ్'లో డ్యుయల్ రోల్ చేసి ఇప్పుడు అదే సెంటిమెంట్ తో 'లయన్'లో కూడా డ్యుయల్ రోల్ పోషిస్తున్నారు. లయన్ హిట్టయితే ఈ సెంటిమెంట్ కూడా వర్కవుట్ అయినట్టే. డ్యుయల్ రోల్ లో హ్యాట్రిక్ కొట్టినట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



