Home

»

Latest News

అర్థ‌రాత్రి ప్ర‌భాస్ గ‌ది త‌లుపు త‌ట్టిన త‌మ‌న్నా!

Jun 27, 2015

దేశ‌మంతా బాహుబ‌లి గురించి ఎదురుచూస్తోంది. ప్ర‌భాస్ అభిమానులైతే.. బాహుబ‌లి గురించిన ఒక్క వార్త బ‌య‌ట‌కు వ‌చ్చినా సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఈ సినిమాకి ప‌నిచేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణ‌లు కూడా `బాహుబ‌లి`కి తాము ప‌డిన క‌ష్టాల్ని క‌థ‌లు క‌థ‌లుగా బ‌య‌ట‌పెడుతున్నారు. ఇప్పుడు త‌మ‌న్నా వంతు వ‌చ్చింది.

ఈ సినిమా కోసం తానెంత క‌ష్ట‌ప‌డిందో, త‌న‌కెవ‌రెవ‌రు ఎలా స‌హాయ‌ప‌డ్డారో పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించింది. త‌న ప‌దేళ్ల కెరీర్‌లో ఏ సినిమాకీ ప‌డ‌ని క‌ష్టం ఈ సినిమాకి ప‌డింద‌ట త‌మ‌న్నా. ఒక్కొక్క సీన్ కోసం ఏకంగా ప‌ద్దెనిమిది గంట‌లు క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింద‌ట‌. శారీర‌కంగా మాన‌సికంగా బాగా అల‌సిపోయేద‌ట‌.

రాజమౌళి, ప్ర‌భాస్‌లు త‌న‌కెంతో స‌హ‌కారం అందించాట‌. మ‌రీ ముఖ్యంగా ప్ర‌భాస్ ఇచ్చిన చిట్కాల‌తోనే తాను.. అంత‌బాగా న‌టించ‌గ‌లిగింద‌ట‌. త‌నకు ఏ డౌట్ వ‌చ్చినా.. అది అర్థ‌రాత్ర‌యినా స‌రే.. ప్ర‌భాస్ గ‌ది త‌లుపు త‌ట్టేద‌ట‌. ప్ర‌భాస్ కూడా ఓపిగ్గా.. త‌న సందేహాలు తీర్చేవాడ‌ట‌. కత్తి ఎలా ప‌ట్టాలా?  ఫైట్స్ ఎలా చేయాలి?  అనే విష‌యంపై ప్ర‌భాస్ త‌న‌కు విలువైన స‌ల‌హాలు ఇచ్చాడ‌ని మురిసిపోతోంది త‌మ‌న్నా.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com