Home

»

Latest News

అసలు పూరీ తగ్గడం లేదుగా..!!

May 16, 2015

టాలీవుడ్ లో స్టార్‌ కాంబినేషన్లో సినిమా అంటే కనీసం ఏడాది పడుతుంది ఈ రోజుల్లో. కానీ పూరి జగన్నాథ్‌ మాత్రం మిగతా డైరెక్టర్లకు చాలా భిన్నం. తాను పని చేసేది చిన్న హీరోతోనా, పెద్ద హీరోతోనా అనేది పూరి పట్టించుకోడు. మూణ్నాలుగు నెలల్లో సినిమా తీసి.. ఫస్ట్‌ కాపీ రెడీ చేసేయగల ఘనుడతను. మహేష్‌ బాబు లాంటి స్టార్‌తో 74 రోజుల్లో ‘బిజినెస్‌మేన్‌’ తీసేసిన ఘనత పూరిది. ఈ మధ్య ఛార్మితో ‘జ్యోతి లక్ష్మి’ సినిమాను కేవలం 37 రోజుల్లో పూర్తి చేశాడు పూరి. ఐతే ఇప్పటిదాకా తీసిన సినిమాలు వేరు. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవితో తీయబోయే సినిమా వేరు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత చిరు చేస్తున్న చిత్రం.. పైగా ఆయనకు 150వ సినిమా.. అలాంటపుడు చాలా జాగ్రత్తగా షూట్‌ చేయాలి. ప్రతి సన్నివేశం తరచి తరచి చూసుకోవాలి. ఔట్‌పుట్‌ పక్కాగా ఉండాలి. కానీ పూరి మాత్రం చిరు సినిమాను కూడా 75 రోజుల్లోనే పూర్తి చేయడానికి ప్లాన్‌ గీసేశాడట. ఐతే ఓ ప్రెస్టీజియస్‌ మూవీని ఇలా హడావుడిగా పూర్తి చేయడం కరెక్టా.. అందుకు చిరు కానీ, నిర్మాత రామ్‌చరణ్‌ కానీ ఒప్పుకుంటారా అనేది సందేహం. కానీ స్క్రిప్టు పక్కాగా ఉంది కాబట్టి తన ప్లాన్‌లో ఏ మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదని పూరి భావిస్తున్నాడట. చిరు సినిమా పూర్తి చేసి.. ఈ ఏడాదే మహేష్‌ సినిమాను కూడా మొదలుపెట్టాలన్న ప్రణాళికలో ఉన్నాడట పూరి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com