Home

»

Latest News

'బాహుబలి' వర్సెస్ 'బజరంగి భాయ్‌జాన్‌'

Jul 18, 2015 1:59PM

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల కలెక్షన్లు రాబడుతున్న 'బాహుబలి'కి అసలు పరీక్ష మొదలుకాబోతుంది. మొదటి వారంలో ఎలాంటి పోటీలేకుండా కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకి, రెండో వారంలోకి వచ్చే సరికి అసలైన పోటీ ఏర్పడింది. సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగి భాయ్‌జాన్‌' సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా 5000 థియేటర్లలో  భారీగా రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..'బజరంగి భాయ్‌జాన్‌' తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్ల తో  బహుబలికి గట్టి పోటీని ఇస్తోంది. సల్మాన్ ఖాన్ కి ఓవర్సీస్, ఇండియ డొమెస్టిక్ మార్కెట్ లలో కూడా మంచి క్రేజ్ వుండడంతో బాహుబలి కలెక్షన్లు చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

మరి సల్మాన్ ఖాన్ క్రేజ్ ని కూడా తట్టుకొని 'బాహుబలి' బాక్స్ ఆఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తుందా? లేక 'బజరంగి భాయ్‌జాన్‌' 'బాహుబలి' కలెక్షన్లకు గండి కొడతారా అనేది తెలియాలంటే మనం కొద్ది రోజులు వేచి చూడాలి.   

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com