Home

»

Gossips

మళ్ళీ హిట్ కాంబినేషన్..మాయ చేస్తారా

Apr 29, 2015 3:51PM

తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌కు సౌత్‌ ఇండియా అంతటా సూపర్‌ క్రేజ్‌ ఉంది. ఈ విలక్షణ దర్శకుడితో పని చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు. ఐతే ఆయన మాత్రం చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. తెలుగులో మీనన్‌తో పని చేసే అవకాశం ముగ్గురు హీరోలకు దక్కింది. అందులో ఒకరు సీనియర్‌ హీరో వెంకటేష్‌ కాగా.. మిగతా ఇద్దరు యువ కథానాయకులు నాగచైతన్య, నాని. చైతూకు తొలి సక్సెస్‌ అందించింది గౌతమ్‌ మీననే. ఏమాయ చేసావె కమర్షియల్‌ సక్సెస్‌ ఇవ్వడమే కాదు.. నాగచైతన్యను మంచి నటుడిగానూ నిరూపించింది. తన కెరీర్‌ను మలుపు తిప్పిన మీనన్‌తో మరోసారి పని చేయబోతున్నట్లు చెప్పాడు చైతూ. ఆ సినిమా వివరాలేమీ చెప్పలేదు కానీ.. త్వరలో గౌతమ్‌తో పనిచేసే అవకాశాలు మాత్రం ఉన్నాయని చైతూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రస్తుతం చైతూ ‘కార్తికేయ’ ఫేమ్‌ చందూ మొండేటితో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అదయ్యాక మీనన్‌తో పని చేసే అవకాశాలున్నాయి. ఐతే ఈసారైనా డైరెక్ట్‌ తెలుగు సినిమా ఉంటుందా.. లేక తాను తమిళంలో తీసిన సినిమానే తెలుగులో చైతూను పెట్టి తీస్తాడా అన్నది చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com