బాలయ్య ఎన్టీఆర్ ని తొక్కేస్తున్నడా?
on Nov 3, 2015
.jpg)
గత కొంతకాలంగా ఎడమొహం, పెడమొహంగా వుంటున్న నందమూరి బాబాయి అబ్బాయిల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయా? ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుత పరిస్థితులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎట్టి పరిస్థితులలో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాని ఢీ కొట్టాలని బాలయ్య గట్టిగా డిసైడ్ అయ్యాడట. దీని కోసం దర్శకుడు శ్రీవాస్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట.
‘డిక్టేటర్’ని సంక్రాంతి బరిలో దించడానికి బాలయ్య రెండు యూనిట్లతో షూటింగ్ చేస్తున్నప్పటికీ ఆ సినిమా పనులు నత్తనడకన నడుస్తున్నాయట. టాకీ పార్ట్ ఇంకా 40 శాతం దాకా బ్యాలెన్స్ ఉందట. ఇది గమనించిన బాలయ్య డైరెక్టర్ శ్రీవాస్ కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడట. మరి సింహం వార్నింగ్ ఇస్తే ఎలా వుంటుందో తెలుసు కదా..ఆ దెబ్బకి ఈ సినిమాని ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి డైరెక్టర్ నయా ప్లాన్ రెడీ చేస్తున్నాడట.
మరోవైపు అబ్బాయి ఎన్టీఆర్ పరిస్థితి ఘోరంగా వుంది. ఇప్పటికే ఇరవై నాలుగు సినిమాలు చేసిన ఒక్క యాభై కోట్ల సినిమానే లేదు. వెనక వచ్చిన హీరోలందరూ యాభై కోట్ల క్లబ్ ను అవలీలగా దాటేస్తుంటే..ఎన్టీఆర్ ఏం చేయాలో తెలియక నానా అవస్థలు పడుతున్నాడు. ఇప్పుడు సుకుమార్ సినిమాకి కొంచెం పాజిటివ్ బజ్ నెలకొంది అనుకుంటే దానికి పోటీగా రావడానికి బాబాయి సిద్దమయ్యాడు. దీంతో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కి టెన్షన్ మొదలైంది. అసలకే నందమూరి అభిమానుల్లో విభేదాల వల్ల సగం దెబ్బతిన్నాడు. ఇప్పుడు బాబాయి తో పోటీ అంటే విభేదాలు ముదురుతాయని భావిస్తున్నాడట. అలా అని పోనీ పోటి నుంచి విరమించుకుందామా అంటే ..రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ చేసి అనౌన్స్ కూడా చేసారు. ఇప్పుడు వెనక్కి తగ్గటం కష్టమే. అటు చూస్తే బాలయ్య కేమో సంక్రాంతి హీరో అనే పేరు వుంది. కాబట్టి ఆయన ని కూడా వెనక్కి తగ్గమని అడగలేడు. మరి పరిష్కారం ఏంటి. ? బాబాయి తో మాట్లాడటమే అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఏది ఏమయినా ఒక కుటుంబం నుంచి హీరోలు ఎక్కువయిన కొద్ది ..వాళ్ళ మధ్య పోటి కూడా పెరుగుతూ పోతోంది...ఒక్కో పండగా ఒక్కో కుటుంబ౦ పంచుకుంటోంది...ఈ సంక్రాంతి నందమూరి వారిదన్న మాట ...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



