మోస్ట్ వాంటెడ్ రకుల్
on May 8, 2015
.jpg)
టాలీవుడ్ యంగ్ హీరోలంతా ఇప్పుడు రకుల్ మంత్రం జపిస్తున్నారట. ఏంతైనా ఇస్తాం...మాక్కావాలి అంటే మాక్కావాలి అంటూ అమ్మడికోసం పోటీపడుతున్నారు. ఎంట్రీ ఇచ్చిన కొత్తో ఎవ్వరూ పట్టించుకోపోయినా...వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తోదూసుకొచ్చింది. అప్పటి నుండి ఆఫర్లే ఆఫర్లు. ఇప్పటికే మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, రవితేజ లాంటి క్రేజీ హీరోలతో రొమాన్స్ చేస్తోంది. ఈ మధ్యే రేసులో చేరిన నితిన్ ఏకందా కోటి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో....నిఖిల్ కూడా నాక్కావాలి అంటూ తెగ సొదపెట్టేస్తున్నాడట. కోన వెంకట్ తెరకెక్కించనున్న 'శంకరాభరణం'లో తన సరసన రకుల్ కావాలని నిఖిల్ పట్టుబట్టాడట. ఆమె బిజీ షెడ్యూళ్ చూసిన దర్శకనిర్మాతలు కష్టం బాబూ అన్నా....ఓ సారి అడిగి చూడరాదే అంటున్నాడట. మరి ఒకేసారి ఇంతమందిని రకుల్ ఎలా మేనేజ్ చేస్తుందో ఏమో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



