శ్రియ పలు తెలుగు, తమిళ,మళయాళం, కన్నడ, హిందీ, హాలివుడ్ చిత్రాల్లో నటించింది. ఈమెను మనోన్యం శ్రియ అని కూడా పిలుస్తారు. ఈమె తొలి చిత్రం 2001లో వచ్చిన తెలుగు చిత్రం 'ఇష్టం'. 2002 లో నాగార్జున హీరోగా నటించిన 'సంతోషం' చిత్రంలో ఆయన మరదలు భానుగా నటించింది. ఈమె శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన 'శివాజీ'ది బాస్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
పద్మశ్రీ శోవన నారాయణ్ వద్ద కథక్ నృత్యంలో శిక్షణ తీసుకుంది శ్రియ. ఇష్టం, సంతోషం, చెన్నకేశవ రెడ్డి, నువ్వు నువ్వు, టాగూర్, నీకు నేను - నాకు నువ్వు వంటి తెలుగు చిత్రాల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న శ్రియ 'తుఝే మేరీ కసమ్' అనే హిందీ చిత్రంలో రితేష్ దేశ్ ముఖ్ సరసన, జెనీలియాతో సహా హీరోయిన్ గా నటించి బాలీవుడ్ లో ప్రవేశించింది శ్రియ.
అవార్డులు
2007 - సౌత్ స్కోప్ - 'శివాజి' చిత్రానికి ఉత్తమ తమిళ నటిగా అవార్డు
2008 - 'మిషన్ ఇస్తాంబుల్'చిత్రానికి గాను స్టార్ డస్ట్ ఎగ్జయిటింగ్ న్యూ ఫేస్ అవార్డ్
2009 - 'కందస్వామి'అమృత మాతృభూమి అవార్డ్ నామినేషన్స్
2002 - వ్యూవర్స్ ఛాయిస్ - 'సంతోషం' చిత్రానికి 'మా'ఉత్తమ నటి అవార్డు.
2005 - 'ఛత్రపతి' సినిమాకి ఉత్తమ నటి తేలుగు ఫిలిం ఫేర్ అవార్డ్
2007 - 'ఆవారాపన్'చిత్రానికి ఉత్తమ నటి ఫిలిం ఫేర్ అవార్డు,
'ఆవారాపన్' స్టార్ డస్ట్ ఉత్తమ నటి అవార్డు,
'శివాజి' చిత్రానికి ఉత్తమనటి విజయ్ అవార్డు
2009 - 'కందస్వామి' చిత్రానికి ఉత్తమ నటిగా విజయ్ అవార్డు |