మనసు
రచన - ఆచార్య ఫణీంద్ర

బొమ్మలను చూస్తే మనకు,
మనను చూస్తే దేవుడికి
ఆడుకోవాలనిపిస్తుంది
బొమ్మల గుండెల్లోని ఆవేదనను
మనం గ్రహించలేం - కాని,
మనకు మనసుంది
మన గుండెల్లోని ఆవేదనను
దేవుడు గ్రహించగలడు - కాని
వాడికి మనసు లేదు









