political-news-img

అమెరికా హౌసింగ్ ఎందుక‌లా స్థంభించి పోయింది?

2026 ఏప్రిల్ నెలలో అమెరికా హౌసింగ్ మార్కెట్‌లో నమోదైన తాజా గణాంకాలు, ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ఒత్తిడిని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 5.8శాతం గృహ లిస్టింగులు విక్రయానికి ముందే మార్కెట్‌ నుంచి ఉపసంహరించబడ్డాయి. అమ్మకానికి పెట్టిన మొత్తం ఇళ్లలో.. దాదాపు 6 శాతం ఇళ్లు... అమ్మకం పూర్తికాకముందే వెనక్కి తీసుకోబడ్డాయి. ఈ స్థాయి డీలిస్టింగ్ రేటు- 2020 మార్చి- కోవిడ్ మహమ్మారి ప్రారంభ దశలో క‌నిపించింది. చూసిన అత్యధిక స్థాయికి ద‌గ్గ‌ర‌గా ఉంది. 2020కు ముందు ఇలాంటి ఉపసంహరణలు అరుదుగా కనిపించేవి. ఇది గృహ మార్కెట్‌లో కొనుగోలుదారులు–అమ్మకందారుల మధ్య సంబంధం- మహమ్మారి త‌ర్వాత‌ నిర్మాణాత్మకంగా మారిపోయిందని సూచిస్తుంది. 2026 ఏప్రిల్‌లో 5.8 శాతం గృహాలు డీలిస్టయ్యాయి. 2020 తర్వాత ఇదే అత్యధికం. అట్లాంటా, సాన్ జోస్, లాస్ ఏంజెలెస్ వంటి మెట్రోల్లో.. డీలిస్టింగ్ రేట్లు 8–11శాతంగా ఉంది. అధిక వడ్డీ రేట్లు, ధరల అంచనాలు, ఇన్వెంటరీ–డిమాండ్ అసమతుల్యత ప్రధాన కారణాలు.. లాక్-ఇన్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్‌లో ట్రాన్సాక్షన్లు గణనీయంగా తగ్గుముఖం ప‌ట్టాయి. అమెరికా గృహ మార్కెట్ ప్రస్తుతం ఫ్రోజెన్–ఈక్విలిబ్రియం దశలో ఉన్నాయి. 2020 మార్చిలో కోవిడ్-19 కారణంగా గృహ మార్కెట్ ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆ సంఘటన ఒక తీవ్రమైన షాక్‌ను సూచించింది. అయితే 2026 నాటి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఇప్పుడు ఒక్క పెద్ద సంఘటన కాదు. వడ్డీ రేట్లు, ధరల అంచనాలు, ఇన్వెంటరీ పెరుగుదల, ఆర్థిక–భౌగోళిక అనిశ్చితి వంటి అనేక అంశాలు కలిసి మార్కెట్‌ను ఒత్తిడిలోకి నెడుతున్నాయి. 2006–07 కాలంలో ఉన్నట్లుగా సబ్‌ప్రైమ్ రుణాల సంక్షోభం, అధిక ప్రమాద గల ఆర్థిక ఉత్పత్తులు వంటి వ్యవస్థాపక ప్రమాదాలు ప్రస్తుతం లేవు. అందువల్ల 2008 తరహా పతనం సంభవించే అవకాశాలు బాగా తక్కువ. 2020–2022.. చరిత్రలోనే అత్యల్ప వడ్డీ రేట్లు, అంటే, 2.5–3శాతం గ‌ల కాలం.. ఈ టైంలో ఇళ్ల‌ ధరలు వేగంగా పెరుగుదల, భారీ డిమాండ్, బిడ్డింగ్ వార్స్ జ‌రిగాయి. ఆపై 2023–2025 మ‌ధ్య కాలంలో.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, కొనుగోలుదారుల సామర్థ్యం తగ్గుదల న‌డిచాయి. ఇక ఇన్వెంటరీ పెరుగుదల సంగ‌తి చూస్తే.. 2026లో డీలిస్టింగ్ రేట్లు 5.8శాతం వరకు పెరిగింది. అట్లాంటా వంటి నగరాల్లో 10శాతం పైగా ఉపసంహరణలు, మార్కెట్‌లో గ్రిడ్‌లాక్ తేట తెల్ల‌మైంది. అమెరికా మెట్రోల్లో డీలిస్టింగ్ భౌగోళిక వ్యత్యాసాలు ఎలాంటివో చూస్తే.. గణాంకాలు ఎంతో స్పష్టంగా చూపుతున్నాయి. అధిక డీలిస్టింగ్ గ‌ల‌ నగరాలు ఎలాంటివంటే, అట్లాంటా- 10.7శాతం, సాన్ జోస్- 9.3శాతం, లాస్ ఏంజెలెస్-7.8శాతం, డల్లాస్- 7.8శాతం, సియాటిల్- 7.7శాతం, ఈ నగరాల్లో గృహ ధరలు స్థానిక ఆదాయ స్థాయిని మించి ఉండటం, కొనుగోలుదారుల బేరసార శక్తి పెరగడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. తక్కువ డీలిస్టింగ్ గ‌ల‌ నగరాలు ఎలాంటివంటే, పిట్స్‌బర్గ్- 3.5శాతం, కొలంబస్- 3.6శాతం, చికాగో- 3.6శాతం. ఇవి మరింత అందుబాటులో ఉన్న మార్కెట్లు. ధరలు స్థానిక కొనుగోలుదారుల సామర్థ్యానికి దగ్గరగా ఉన్నాయి. డీలిస్టింగ్ పెరుగుదలకు ప్రధాన కారణాలు ఎలాంటివో చూస్తే.. అధిక వడ్డీ రేట్లు – కొనుగోలుదారుల సామర్థ్యంపై దెబ్బగా తెలుస్తోంది. పాండమిక్ బూమ్ సమయంతో పోలిస్తే ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేట్లు దాదాపు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. 6.5-7శాతం వడ్డీ రేట్లు- ఇంటి కొనుగోలును చాలా ఖరీదైన వ్య‌వ‌హారంగా మార్చాయి. అర్హత పొందే కొనుగోలుదారుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ధరలపై బేరసారాల‌ శక్తి సైతం బాగా పెరిగింది. దీంతో అమ్మకందారులు ఫ్యాన్సీ రేట్ కి అమ్మలేకపోతున్నారు. ఇన్వెంటరీ వేగంగా పెరుగుతుండగా, కొనుగోలుదారుల సంఖ్య క్ర‌మంగా తగ్గుతోంది. దీని వల్ల.. మార్కెట్‌లో పోటీ పెరుగుతోంది. ఎక్కువకాలం అమ్మకానికి ఉండే ఇళ్లకు స్టిగ్మా ఏర్పడుతోంది. అమ్మకందారులు ధర తగ్గించడానికి ఇష్టపడక, డీలిస్టింగ్‌ను ఎంచుకుంటున్నారు. 2020–22లో గృహ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈ పీక్ రేట్స్ ని చాలా మంది యజమానులు నిజమైన విలువగా భావిస్తున్నారు. కానీ, 2026లో కొనుగోలుదారులు ఆ ధరలను భరించలేరు. ఈ అంచనాల–సామర్థ్యాల మధ్య గ్యాప్ డీలిస్టింగ్‌కు దారితీస్తోంది. ఇరాన్ ఘర్షణ, ద్రవ్యోల్బణం, టారిఫ్ విధానాలు, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి—ఇవి పెద్ద ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేయించే అంశాలు. కొంతమంది అమ్మకందారులు.. లిస్టింగ్ స్టేల్ అవకుండా, ధరలు సవరించడానికి.. చిన్న రీనోవేషన్లు చేయడానికి సీజనల్ డిమాండ్ కోసం, తాత్కాలికంగా డీలిస్టింగ్ చేస్తున్నారు. ఏప్రిల్ 2026లో, ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్న మొత్తం గృహాల యాక్టివ్ లిస్టింగ్స్ లో సుమారు 2.5 శాతం తిరిగి అమ్మకానికి పెట్టినవి- అంటే రీలిస్టింగ్స్ అన్న‌మాట‌. లాక్-ఇన్ ఎఫెక్ట్- మార్కెట్ గ్రిడ్‌లాక్‌కు మూల కారణం.. మహమ్మారి సమయంలో 2.5–3.5శాతం వడ్డీ రేట్లతో రుణాలు తీసుకున్న లక్షలాది అమెరికన్లు ఇప్పుడు 7శాతం రేటుతో కొత్త ఇల్లు కొనలేరు. వారు అదే ధర కలిగిన మరొక ఇల్లు కొనుగోలు చేసినప్పటికీ, వారి నెలవారీ వాయిదాలు దాదాపు రెట్టింపు కావచ్చు... అమ్మకందారులు మార్కెట్‌లోకి రావడం తగ్గింది. వచ్చిన వారు అధిక ధరలు కోరుతున్నారు. కొనుగోలుదారులు అధిక వడ్డీ రేట్లతో వెనుకంజ వేస్తున్నారు. ఇది ఫ్రోజెన్ మార్కెట్ పరిస్థితిని సృష్టించింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం.. ప్రధాన చర్చ‌నీయాంశం. గృహ అందుబాటు ఎంపిక‌లో ఇది కీలకాంశంగా మారుతోంది. సామాజిక ప్రభావం ఎలాంటిదో చూస్తే.. యువతలో గృహ యాజమాన్యం కల మరింత దూరమవుతోంది. కుటుంబాల మొబిలిటీ తగ్గుతోంది. అద్దె మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రధాన మీడియా సంస్థలు.. డీలిస్టింగ్ పెరుగుదలను మార్కెట్ కుప్ప‌ కూలిపోవడం కాదు, కానీ నిలిచిపోవడం గా వర్ణిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫార్ములు కొనుగోలుదారుల బేరసార శక్తి పెరిగిందని హైలైట్ చేస్తున్నాయి. భవిష్యత్ దిశ. 2026 రెండోార్థంలో ఏమి జరుగుతుంది? ఆర్థిక నిపుణుల అంచనా ఏంట‌ని చూస్తే.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే, కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం క‌లుగుతుంది. కానీ, 2021 తరహా బూమ్ తిరిగి రావడం అసాధ్యంగా భావిస్తున్నారు. గృహ ధరలు అధికంగానే ఉండే అవకాశం ఏర్ప‌డుతోంది. ట్రాన్సాక్షన్లు తక్కువ స్థాయిలోనే కొనసాగవచ్చని అంటున్నారు. ఓవ‌రాల్ గా చూస్తే.. అమెరికా హౌసింగ్ మార్కెట్ తాత్కాలిక నిలకడ దశలో ప‌రిశీల‌న చేస్తే.. ప్రస్తుతం అమెరికా గృహ మార్కెట్.. పతనం కాదు, బూమ్ కాదు- కానీ, లో-ట్రాన్సాక్షన్ ఈక్విలిబ్రియం దశలో ఉంది. అధిక వడ్డీ రేట్లు, ధరల అంచనాలు, ఇన్వెంటరీ–డిమాండ్ అసమతుల్యత, లాక్-ఇన్ ఎఫెక్ట్.. ఇవన్నీ కలిసి యూఎస్ హౌసింగ్ ఎకోసిస్ట‌మ్ లో ఒక అడుగు కూడా ముందుకు పడని గందరగోళ పరిస్థితిని సూచిస్తోంది. వీట‌న్నిటి వ‌ల్ల అమెరికా హౌసింగ్ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 10, 2026 9:58PM

political-news-img

తృణమూల్‌లో చారిత్రక తిరుగుబాటు సంకేతం ఏంటి?

మమతా బెనర్జీ–అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై బహిరంగ సవాలు. పశ్చిమ బెంగాల్‌లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో ఉద్భవించిన అంతర్గత సంక్షోభం.. ఇప్పుడు పార్టీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన తిరుగుబాటుగా రూపుదిద్దుకుంటోంది. మమతా బెనర్జీ కలైఘాట్ నివాసంలో నిర్వహించిన కీలక సమావేశానికి.. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ఎంపీలు మాత్రమే హాజరు కావడం, పార్టీ శాసన విభాగం, పార్లమెంటరీ విభాగం.. రెండింటిలోనూ నాయకత్వంపై విశ్వాస సంక్షోభం ఎంత లోతుగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. టీఎంసీ ఎదుగుదల నుంచి- 2026 పరాజయం వరకు చూస్తే.. కాంగ్రెస్ నుంచి విడిపోయిన మమతా బెన‌ర్జీ, 28 ఏళ్ల పార్టీ ప్రయాణం, ఆమె రాజకీయ ప్రయాణం రెండూ ఒక‌టే. 1984లో జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి- CPI(M) నేత సోమనాథ్ చటర్జీని ఓడించి మొదటిసారి పార్లమెంట్‌కు వెళ్లారామె. తరువాత కాలక్రమంలో.. కలకత్తా సౌత్ నుంచి పలుమార్లు ఎంపీగా ఎన్నికై, జాతీయ రాజకీయాల్లో బలమైన స్వరం వినిపించారు. కాంగ్రెస్ నుంచి విడిపోయి, తృణమూల్ కాంగ్రెస్ స్థాపన చేశారు. 2011లో వామపక్షాల 34 ఏళ్ల పాలనకు ముగింపు పలికిన చారిత్రక విజయం అందుకున్నారు మ‌మ‌త‌. 2011–2021 మధ్య టీఎంసీ- పశ్చిమ బెంగాల్‌లో దాదాపు అజేయ శక్తిగా నిలిచింది. మైనారిటీ ఓటు బ్యాంక్, గ్రామీణ పేదల మద్దతు, నగర మధ్యతరగతి అసంతృప్తిని సమీకరించి, మమతా దీది బ్రాండ్‌ను బలపరిచింది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో.. టీఎంసీ పరాజయం, ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప‌రిణామ క్ర‌మాల‌కు దారి తీశాయో చూస్తే.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో, టీఎంసీ కేవలం 80 స్థానాలు మాత్రమే గెలుచుకోగా.. BJP మేజర్ విక్టరీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 15 ఏళ్ల నిరంతర పాలన తర్వాత వచ్చిన ఈ పరాజయం, పార్టీ అంతర్గత నిర్మాణం, నాయకత్వ శైలి, వారసత్వ రాజకీయాలపై.. ప్రశ్నలు లేవనెత్తింది. భవానిపూర్ ఓటమి చాలా పెద్ద‌ దెబ్బగా మారింది. మమతా బెనర్జీ స్వయంగా.. భవానిపూర్ నుంచి ఓడిపోవడం, ఆమె వ్యక్తిగత నాయకత్వ ప్రతిష్ఠకు గట్టి దెబ్బ త‌గిలింద‌ని చెప్పాల్సి ఉంటుంది. భవానిపూర్ ఓటమి, దీది అజేయం కాదు- అనే సంకేతాన్ని పార్టీ అంతర్గతంగా, ప్రజలలోనూ బలంగా పంపింది. కలైఘాట్ సమావేశం నుంచి- తిరుగుబాటు వరకు.. ఒక సారి స‌మీక్షిస్తే.. మమతా బెనర్జీ నివాసం కలైఘాట్‌లో నిర్వహించిన కీలక సమావేశానికి, 80 ఎమ్మెల్యేలలో కేవలం 8 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. 41 పార్లమెంటు సభ్యులలో 6 మంది మాత్రమే హాజరయ్యారు. హాజరైన ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు ఎవ‌ర‌ని చూస్తే.. మదన్ మిత్ర, బీనా మోండల్, అశిమా పాత్ర, ఫిర్హాద్ హకీమ్, కునాల్ ఘోష్, సోవన్‌దేబ్ చట్టోపాధ్యాయ, బిమాన బెనర్జీ- మాజీ స్పీకర్, అశోక్ దేబ్. కాగా ఇక హాజ‌రైన‌ లోక్‌సభ సభ్యులు ఎవ‌రంటే- అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీ, మాలా రాయ్, సుదీప్ బంద్యోపాధ్యాయగా ఉన్నారు. ఇక‌ రాజ్యసభ సభ్యులు-డెరెక్ ఓ’బ్రియన్, దోలా సేన్ హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉంటే, పార్టీ అధికారిక వివరణ- వాస్తవ సంకేతాల మ‌ధ్య వ్య‌త్యాసం ఎలాంటిదంటే.. టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్- గ్రౌండ్‌లో జరిగిన దాడులు, అరెస్టుల కారణంగా.. ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నార‌ని వివరణ ఇచ్చారు. కానీ, వరుసగా రెండు సమావేశాలకు మెజారిటీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం, తిరుగుబాటు శక్తులు బహిరంగంగా నాయకత్వంపై ప‌లు ప్రశ్నలు లేవనెత్తడం, బ‌హిష్కృత‌ నాయకులు రితబ్రత బెనర్జీ, సందీపన్ సహా చుట్టూ 57–58 మంది ఎమ్మెల్యేల సమీకరణ.. ఇవన్నీ కలిపి చూస్తే, ఇది కేవలం గ్రౌండ్ సిట్యుయేషన్ కాదు.. సంస్థాగత తిరుగుబాటుగా స్పష్టమవుతోందని అంటారు ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు. 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది తిరుగుబాటు శ్రేణిలో – ఇది పార్టీ విభజనకు సమానమైన చారిత్రక సంక్షోభం. మమతా బెనర్జీపై వ్యక్తిగత గౌరవం ఉన్నా, అభిషేక్ బెనర్జీ కార్పొరేట్ స్టైల్ నాయకత్వాన్ని తాము అంగీకరించమంటూ, తిరుగుబాటు ఎమ్మెల్యేలు- స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. బహరంపూర్ లోక్‌సభ సీటు ఖాళీ చేయమన్న అభ్యర్థనను, యుసుఫ్ పఠాన్ తిరస్కరించడం, టీఎంసీ లో మైనారిటీ నాయకత్వం కూడా స్వతంత్ర ధోరణి అవలంబిస్తున్నదనే సంకేతాన్ని ఇస్తోంది. న్యాయపరమైన అంశాలు, విభజన, తిరుగుబాటు, స్పీకర్ పాత్ర ఎలాంటిదో ప‌రిశీలిస్తే.. భారత రాజ్యాంగంలోని యాంటీ డిఫెక్ష‌న్ లా- అంటే దళబంధు నిరోధక చట్టం ప్రాథమిక నిబంధనలు 10వ షెడ్యూల్ ప్రకారం, పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం, పార్టీని విడిచి మరో పార్టీకి వెళ్లడం, స్వతంత్ర సభ్యుడు ఏదైనా పార్టీకి చేరడం, ఇవన్నీ సభ్యత్వం రద్దుకు దారితీసే చర్యలు. విభజన వ‌ర్సెస్ విలీనం విష‌యానికి వ‌స్తే.. గతంలో స్ప్లిట్ అనే కాన్సెప్ట్ ఉండేది. అదిప్పుడు ప్రధానంగా మెర్జ‌ర్ గా మాత్రమే చట్టపరంగా గుర్తింపు పొందుతోంది. అయితే, ఒకే పార్టీకి చెందిన పెద్ద శాసన సమూహం, పార్టీ అధికారిక నాయకత్వాన్ని బహిరంగంగా తిరస్కరించి, కొత్త శాసన నాయకత్వాన్ని ప్రకటిస్తే.. అది పార్టీ అంతర్గత విభజనగా రాజకీయంగా పరిగణించబడుతుంది. కానీ చట్టపరంగా సభ్యత్వం రద్దు, స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో స్పీకర్, గవర్నర్, ఎన్నికల కమిషన్ పాత్ర ఎలాంటిదో చూస్తే.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై దళబంధు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటే, పార్టీ అధికారిక విప్, పార్టీ అధ్యక్షురాలు అంటే మమతా బెనర్జీ.. లేదా అధికారిక శాసన నాయకుడు, స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలి. స్పీకర్, సభ్యత్వం రద్దు, లేదా విచారణకు సమయం తీసుకోవడం, ద్వారా రాజకీయ సమీకరణాలకు అవకాశం ఇవ్వగలడు. ఎన్నికల కమిషన్ కోణంలోంచి చూస్తే.. పార్టీ విభజన, కొత్త పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్, లేదా టీఎంసీ పేరుతోనే కొత్త నాయకత్వం ప్రకటించడం వంటి అంశాలు, ఎన్నికల కమిషన్ ముందుకు రావచ్చు. ప్రస్తుతం, తిరుగుబాటు శ్రేణి టీఎంసీ పేరును వదిలి కొత్త పార్టీగా రిజిస్టర్ అవుతుందా?, లేదా టీఎంసీ- రెబెల్ వంటి రాజకీయ బ్రాండ్‌తో ముందుకు వస్తుందా? ఇది త‌ర్వాతి దశలో స్పష్టమవుతుంది. రాజకీయ, సామాజిక, మీడియా కోణాలు.. అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తి, కార్పొరేట్ స్టైల్, కేంద్రీకృత నిర్ణయాలు.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు, మమతా బెనర్జీపై గౌరవం ఉంది, కానీ పార్టీని కార్పొరేట్ కంపెనీలా నడిపించే అభిషేక్ బెనర్జీ శైలి అంగీకారయోగ్యం కాద‌ని స్పష్టంగా ప్రకటించారు. యువ నాయకత్వం పేరుతో.. నిర్ణయాలు కేంద్రీకృతమవడం, జిల్లా స్థాయి, బూత్ స్థాయి నాయకత్వం అభిప్రాయాలు పక్కన పెట్ట‌డం, ఇవన్నీ అసంతృప్తికి కారణమయ్యాయి. ఫిర్హాద్ హకీమ్ రాజీనామా – మైనారిటీ నాయకత్వంలోనూ చలనం వ‌చ్చేలా చేసింది. కోల్‌కతా మేయర్ పదవి నుంచి రాజీనామా చేశారు ఫిర్హాద్ హకీమ్. నేను చారిత్రక వ్యక్తులు పనిచేసిన కుర్చీని అవమానించలేను. నేను సరిగా పని చేయలేకపోతున్నాను అంటూ మేయర్ పదవి నుంచి తప్పుకున్నారాయ‌న‌. ఆయనను కొత్త ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్‌లో కీలక స్థానంలో చేర్చకపోవడం, మైనారిటీ నాయకత్వం, పాత లాబీయిస్టుల మధ్య కొత్త సమీకరణలకు దారితీస్తోంది. యుసుఫ్ పఠాన్ – బహరంపూర్ సీటు, మమతా లోక్‌సభ ప్రవేశం, బహరంపూర్ నియోజకవర్గం ప్రాధాన్యం, ఈ సెగ్మెంట్ లో సుమారు 70శాతం ముస్లిం ఓటర్లు ఉన్న మైనారిటీ బలమైన నియోజకవర్గం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో, మాజీ క్రికెటర్ యుసుఫ్ పఠాన్, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురిని 85వేల‌ పైగా ఓట్ల మెజారిటీతో ఓడించి, టీఎంసీకి ఈ సీటును అందించారు. 2026 అసెంబ్లీ పరాజయం తర్వాత, మమతా బెనర్జీ మళ్లీ లోక్‌సభకు రావాలనే ఆలోచన- రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, బహరంపూర్ సీటు నుంచి మమతా పోటీ చేయాలంటే, యుసుఫ్ పఠాన్ రాజీనామా చేయాలని కోరార‌ని అంటాయి హిందీ, బెంగాలీ మీడియా క‌థ‌నాలు. అయితే, యుసుఫ్ పఠాన్, సీటు ఖాళీ చేయడానికి సిద్ధం లేను అనే స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లు వార్తలు విన‌వ‌చ్చాయి. కొన్ని కథనాల ప్రకారం, మాజీ కెప్టెన్ సౌరవ్ గాంగూలీ ద్వారా.. యుసుఫ్ పఠాన్‌కు సీటు ఖాళీ చేయవచ్చు క‌దా? అనే సందేశం వెళ్లినట్లు బెంగాలీ రాజకీయ వర్గాల్లో చర్చ న‌డుస్తోంది. అధికారిక ధృవీకరణ లేకపోయినా, ఇది టీఎంసీ లో క్రికెట్ ఐకాన్‌లను కూడా రాజకీయ మధ్యవర్తులుగా ఉపయోగించే ప్రయత్నం జరుగుతోందనే ఆసక్తికర సంకేతం. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు- మైనారిటీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. 104 ముస్లిం ఎమ్మెల్యేలుండ‌గా – BJP ద‌గ్గ‌ర‌ ఒక్కరూ లేరు. దక్షిణ భారత, తూర్పు భారత రాష్ట్రాల ఫలితాల్లో.. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ రాష్ట్రాల్లో మొత్తం క‌ల‌సి 104 ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో ఒక్కరూ BJPకి చెందిన వారు కాకపోవడం, ముస్లిం ఓటు బ్యాంక్ BJPకి దూరంగా ఉందనే రాజకీయ క‌ఠిన‌ వాస్తవాన్ని మరోసారి రుజువు చేస్తోంది. టీఎంసీ ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు- 17 ముస్లిం ఎమ్మెల్యేల బహిరంగ అసంతృప్తి- టీఎంసీకి చెందిన 17 ముస్లిం ఎమ్మెల్యేలు, మమతా బెనర్జీపై వ్యక్తిగత గౌరవం ఉన్నప్పటికీ, అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని, పార్టీ ఆర్గనైజేషనల్ స్టైల్‌ను బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ఇది, టీఎంసీ మైనారిటీ ఓటు బ్యాంక్‌లో కూడా స్వతంత్ర రాజకీయ చైతన్యం పెరుగుతోందన‌డానికి సంకేతం. 2026 జూన్ లో టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది, తిరుగుబాటు శ్రేణిగా సమీకరించి, డామినెంట్ లెజిస్లేటివ్ ఫ్యాక్షన్ గా తమను ప్రకటించుకున్నారు. ఈ 58 మందిలో, 17 ముస్లిం ఎమ్మెల్యేల భాగస్వామ్యం, టీఎంసీ మైనారిటీ నాయకత్వం కూడా కేవలం దీది బ్రాండ్ కు ప‌రిమితం కాదు అనే వాస్తవాన్ని బయటపెడుతోంది. టీఎంసీ భవిష్యత్తు- పార్టీ బతుకుతుందా, బ్రాండ్ బతుకుతుందా? అనే డిబేట్ కి తెర‌లేచింది. పార్టీ విభజన, బ్రాండ్ నిలకడ, 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. 15–17 ఎంపీలు కూడా స్పీకర్‌కు లేఖ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు, ఇవన్నీ కలిపి చూస్తే.. టీఎంసీ శాసన విభాగం, పార్లమెంటరీ విభాగం రెండింటిలోనూ విభజనకు దారితీసే అవకాశం క‌నిపిస్తోంది. ఇక టీఎంసీ అనే బ్రాండ్ విష‌యానికి వ‌స్తే.. మమతా బెనర్జీతో ముడిపడి ఉన్నప్పటికీ, తిరుగుబాటు శ్రేణి కూడా మమతా బెనర్జీని పూర్తిగా తిరస్కరించడం లేదు, కానీ ఆమె వారసత్వ రాజకీయాన్ని ప్రశ్నిస్తోన్న‌ట్టు తెలుస్తోంది. మమతా లోక్‌సభ ప్రవేశం – రక్షణా వ్యూహమా, లేక‌ కొత్త ఆరంభమా? జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్రకు సంకేత‌మా? అన్న‌ది కూడా ప్ర‌శ్నార్ధ‌క‌మైంది. మమతా బెనర్జీ, లోక్‌సభలో ప్రత్యక్షంగా ఉండటం ద్వారా, టీఎంసీ పార్లమెంటరీ విభాగంపై తన నియంత్రణను బలపరచాలని భావిస్తున్నట్లు- ఒక‌ రాజకీయ విశ్లేషణ. కానీ, బహరంపూర్ వంటి ముస్లిం మెజారిటీ సీటు నుంచి ఆమె పోటీ చేయాలంటే, యుసుఫ్ పఠాన్ వంటి మైనారిటీ నాయకుడిని సీటు ఖాళీ చేయమని ఒత్తిడి చేయడం, మైనారిటీ రాజకీయాల్లో నాయకత్వంలో- గ్రాస్‌రూట్ ప్రతినిధిత్వం అనే కొత్త చర్చకు దారితీస్తోంది. ఇక మీడియా క‌థ‌నాల‌ను అనుస‌రించి చూస్తే.. టీఎంసీ చరిత్రలోనే మొదటి పెద్ద స్ప్లిట్, మమతా పార్టీ తనను తాను తినుకుంటుందా? వంటి శీర్షికలతో, ఈ సంక్షోభాన్ని ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ గా చిత్రీకరిస్తున్నాయి.. బెంగాలి, హిందీ మీడియా వ‌ర్గాలు. యుసుఫ్ పఠాన్, సౌరవ్ గాంగూలీ, వంటి క్రికెట్ ఐకాన్‌ల పేర్లను కూడా రాజకీయ కథనాల్లోకి లాగుతూ, ప్రజా ఆసక్తిని మ‌రింత పెంచుతున్నాయి. సామాజిక కోణం పాయింటాఫ్ వ్యూలో చూస్తే.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు.. ముస్లిం ఓటు బ్యాంక్ ఒకే పార్టీకి శాశ్వతంగా బంధించబడదు అనే స‌త్యాన్ని ఎత్తి చూపుతోంది. ఇక నాయకత్వం బాధ్యతాయుతంగా లేకపోతే, మైనారిటీ నాయకత్వం కూడా.. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంద‌నే సందేశాన్ని బలపరుస్తోంది. యువత, నగర మధ్యతరగతి, డైనస్టిక్ పాలిటిక్స్ వ‌ర్సెస్ ఇంటర్నల్ డెమోక్రసీ అనే చర్చను మరింత పదును పెడుతోంది. ఈ మొత్తం పరిణామంలో, టీఎంసీ లో సంక్షోభం కేవలం BJP దాడులు, పోలీస్ యాక్షన్, పోస్ట్-పోల్ టెరర్ వల్ల కాదు. ఇది, దీర్ఘకాలిక కేంద్రీకృత నాయకత్వం, వారసత్వ రాజకీయాలు, కార్పొరేట్ స్టైల్ ఆర్గనైజేషన్, గ్రాస్‌రూట్ నాయకత్వం, మైనారిటీ ప్రతినిధుల అసంతృప్తి, ఇవన్నీ కలిసిన సంస్థాగత సంక్షోభంగా చెప్పాలి. మమతా బెనర్జీ, ఒకప్పుడు వామపక్షాల ఏకపక్ష పాలనను కూల్చిన రెబెల్ లీడ‌ర్షిప్ కి సంకేతం. ఇప్పుడు, తన స్వంత పార్టీ లోనే, కొత్త తరం, మైనారిటీ నాయకత్వం, తిరుగుబాటు శ్రేణి నుంచి అదే రకం ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎంసీ భవిష్యత్తు, నాయకత్వం బాధ్యతాయుతంగా మారుతుందా? అభిషేక్ బెనర్జీ పాత్ర పునర్నిర్వచనం జరుగుతుందా? తిరుగుబాటు శ్రేణి కొత్త పార్టీగా రూపుదిద్దుకుంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం, వచ్చే నెలల్లో పశ్చిమ బెంగాల్, జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారబోతోంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 10, 2026 9:52PM

political-news-img

ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఖతర్

ఖతర్ దేశ భద్రత, దాని అపారమైన గ్యాస్ సంపదతో వచ్చే ఆదాయంపై ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం పెనుప్రభావం చూపుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం ఖతర్ యొక్క ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లలో భయాందోళనలు సృష్టిస్తూ, ఆసియా, యూరప్ దేశాలకు గ్యాస్ కొరతను సృష్టిస్తున్నది. ఖతర్ యొక్క అతిపెద్ద ధృవీకృత సహజ వాయువు (ఎల్ఎన్‌జీ) హబ్ అయిన రాస్ లాఫాన్ పై ఇరాన్ క్షిపణి దాడులు జరిగాయి. దాంతో ఆ దేశం మొత్తం ఎగువ ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు 17శాతం వరకు దెబ్బతింది. ఖతర్ , ఇరాన్‌లు ప్రపంచంలోనే అతిపెద్దదైన సహజ వాయువు క్షేత్రాన్ని పంచుకుంటున్నాయి . ఖతర్ లో నార్త్ ఫీల్డ్, ఇరాన్ లో సౌత్ పార్స్ సహజవాయువు ఉత్పత్తిలో కీలకం. ఖతర్ తన గ్యాస్ సంపదను ఆ క్షేత్రం నుండి వెలికితీసినప్పటికీ, రవాణాకు భౌగోళికంగా ఇరాన్ నియంత్రణలో ఉన్న హార్ముజ్ జలసంధిపై ఆధారడాల్సి వస్తోంది. ఆ క్రమంలో ముడిసరుకు ఎగువ సరఫరాలు నిలిచిపోవడంతో ఖతర్ ఎనర్జీ 'ఫోర్స్ మేజ్యూర్' ప్రకటించింది. దీని ఫలితంగా ఏర్పడిన గ్యాస్ కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియా దేశాలలో గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. భారత్ ఏటా దిగుమతి చేసుకునే 2.7 కోట్ల టన్నుల ఎల్ఎన్‌జీలో ఖతర్ వాటా 40 శాతం ఉంది. ఖతర్ నుంచి దిగుమతులకు ఆటంకం భారత్‌పై గట్టిగానే పడుతోంది. దశాబ్దాలుగా అమెరికా మద్దతుతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొల్పిన భద్రతా వ్యవస్థకు ఈ సంక్షోభం పెద్ద సవాలుగా నిలిచింది. ఖతర్ లో అమెరికన్ అల్-ఉదీద్ వైమానిక స్థావరం ఉన్నప్పటికీ, ఆ దేశంపై ప్రత్యక్ష దాడులను నివారించడంలో విఫలమైంది. 2026 మార్చిలో ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్ దక్షిణ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్‌పై దాడి చేయడం, దాని ప్రత్యక్ష ప్రభావం ఖతర్‌పై పడటం, గల్ఫ్ ప్రాంత భద్రతా సమీకరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఖతర్ ఒక చిన్న, ఎడారి ద్వీపకల్పం. 1961లో దాని జనాభా కేవలం 36,000. హైడ్రోకార్బన్ లభించకపోతే ఖతర్ నేటి రూపంలో ఉండేది కాదు.1940లో డుఖాన్లో చమురు, 1971లో నార్త్ ఫీల్డ్ ఖతర్‌ను ఒక్కసారిగా ప్రపం. ఇరాన్–ఖతర్ మధ్య జాయింట్ రిజర్వాయర్ ఉండటంతో ఒక దేశం చర్యలు మరొకదానిపై ప్రభావం చూపుతాయి. అదే ఇప్పుడు ఖతర్‌కు శాపమైంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 10, 2026 9:47PM

political-news-img

నారాయణగూడలో విషాదం.. మామిడి పండ్లు తిన్న అక్కాచెల్లెళ్లు మృతి

హైదరాబాద్‌లోని నారాయ ణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. బీదర్‌కు చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి విఠల్‌వాడిలో నివసిస్తున్నారు. ఇటీవల వారి బంధువు రేణుక ఇంటికి వస్తూ నారాయణగూడ జలమండలి సమీపంలో మామిడి పండ్లు కొనుగోలు చేసి తీసుకొచ్చింది. ఆ పండ్లను తల్లి ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు.ఆదివారం సాయం త్రం నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమవడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో పెద్ద కుమార్తె భువనేశ్వరి (17) సోమవారం మృతి చెందగా, చెల్లెలు సంధ్య (10) మంగళవారం కన్నుమూసింది. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరో ఇద్దరు బాలికలు, తల్లి ఇంకా చికిత్స పొందుతున్నారు. మామిడి పండ్లు తినడం వల్లే ఈ ఘటన జరిగిందా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలు, వైద్య పరీక్షల అనంతరం అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన స్థానికులను కలచివేస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Publish Date: Jun 10, 2026 9:38PM

political-news-img

200 కోట్ల ఆస్తులు.. విల్లాలు.. పామ్ హౌస్‌లు.." అంటూ యువతులను మోసం చేసిన మోసగాడు

హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన వెంకట కామేష్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బయటకు చూస్తే కోటీశ్వరుడు.. మాటల్లో చూస్తే పెద్ద వ్యాపారవేత్త.. కానీ వాస్తవానికి మాత్రం మ్యాట్రిమోని సైట్లను అడ్డాగా చేసుకుని యువతులను మోసం చేసిన కేటుగాడిగా పోలీసులు గుర్తించారు.దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ వెంకట కామేష్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 18 కేసులు నమోదవగా, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే యువతులే అతని మోసానికి ఎక్కువగా బలైనట్లు విచారణలో తేలింది. ప్రముఖ మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో తనను రూ.200 కోట్ల ఆస్తులున్న వ్యక్తిగా పరిచయం చేసుకునే కామేష్. విల్లాలు, వ్యవసాయ భూములు, పామ్ హౌస్‌లు, భారీ వ్యాపారాలు ఉన్నట్లు ప్రొఫైళ్లలో పేర్కొని యువతులను ఆకర్షించేవాడు. ఉన్నత వర్గాలకు చెందిన మ్యాట్రిమోని సైట్లలో అదే సామాజిక, ఆర్థిక వర్గానికి చెందిన వ్యక్తిగా రిజిస్ట్రేషన్ చేసుకుని నమ్మకం సంపాదించేవాడని పోలీసులు చెబుతున్నారు. మొదట స్నేహం, ఆ తర్వాత ప్రేమ, చివరికి పెళ్లి హామీ.. ఇదే కామేష్ అనుసరించిన వ్యూహంగా పోలీసులు గుర్తించారు. యువతులతో సన్నిహితంగా మెలిగిన తర్వాత వ్యాపార అవసరాలు, అత్యవసర పరిస్థితులు, పెట్టుబడుల పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి మాట నమ్మి కొందరు యువతులు భారీ మొత్తాలు ఇచ్చినట్లు సమాచారం.బాధితుల నుంచి సేకరించిన డబ్బును వ్యాపారాల్లో పెట్టకుండా ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌లలో ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. లక్షల్లో వచ్చిన డబ్బును జూదం తరహా కార్యకలాపాల్లో పోగొట్టుకు న్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కామేష్‌పై ఆరు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో యువతి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా మరో కేసు నమోదు కావడంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అతడిని అరెస్టు చేసిన పోలీసులు, మచిలీపట్నంలో నమోదైన మరో కేసు దర్యాప్తు కోసం పీటీ వారెంట్‌పై కస్టడీకి తీసుకున్నారు. అతని బ్యాంకు లావాదేవీలు, మ్యాట్రిమోని ఖాతాలు, ఫోన్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. "పెళ్లి పేరుతో నమ్మకం... కోటీశ్వరుడి ముసుగులో మోసం... మ్యాట్రిమోని సైట్లను ఆయుధంగా మార్చుకున్న వెంకట కామేష్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Publish Date: Jun 10, 2026 9:30PM

political-news-img

ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మిత్రపక్షాల కీలక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు ఒక ఆసక్తికరమైన, సానుకూల పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ, అప్రతిహత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర లిఖించినందుకు మోదీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. ప్రధాని మోదీతో చంద్రబాబు జరిపిన ఈ ప్రత్యేక భేటీలో ఉభయ నాయకులు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఏపీ ప్రయోజనాలతో పాటు కూటమి బలోపేతంపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, రాష్ట్రానికి అందాల్సిన కేంద్ర సహాయం, విభజన హామీల అమలుపై చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్లు తెలిసింది.

Publish Date: Jun 10, 2026 9:24PM

MOVIE NEWS