అంతా 'ఆకలి' మయం

ఆకలి.. ఆకలి.. ఆకలి
అంతంలేని ఆకలి
అంతుచిక్కని ఆకలి
అనుక్షణం ఆకలి
కళ్ళల్లో ఆకలి
చేతుల్లో ఆకలి
చేతల్లో ఆకలి
చెక్కుచెదరని ఆకలి
బతికించే ఆకలి
చంపేసే ఆకలి
నిలువెల్లా ఆకలి
నిప్పును మించిన ఆకలి
ఎదిరించే ఆకలి
'ఎవర్‌ గ్రీన్‌' ఆకలి
తరగని చీకటిలా ఆకలి
తప్పని మృత్యువులా ఆకలి
కనిపించని ఆకలి, కనికరంలేని ఆకలి
ప్రతిజీవికి ఆకలి,  ప్రపంచాన్ని ఏలే ఆకలి
రుధిరం చిమ్మే ఆకలి
విశ్వమంతా ఆకలి
విశ్వాసం చూపే ఆకలి
దేహమంతా ఆకలి
దేన్నీ లెక్కచేయని ఆకలి
అబద్ధాలాడించే ఆకలి
అవమానాల్ని దిగమింగే ఆకలి
దరిద్రుడికి ఆకలి
ధనవంతుడికి ఆకలి
అసమానతలు ఎన్నున్నా
అందరికీ సమానమీఆకలి

బొమ్మరాత యల్లయ్య
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

Latest News
Cinema
Sahityam Special
Movies
Recipes
TeluguOne For Your Business
About TeluguOne