LATEST NEWS
తెలుగు దేశం పార్టీ కి మొదటి నుండి స్నేహ హస్తం ఇస్తూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ మధ్య ఆ పార్టీ పై పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. 2014 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన జన సేన అధినేత, ప్రతిసారి, రాష్ట్రంలో టీడీపీ ని కేంద్రంలో బీజేపీ ని వెనకేసుకుంటూ వచ్చారు. కానీ, ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డాడు. అసలు, పవన్ తిరుగుబాటుకు అసలు కారణం ఏమై ఉండోచ్చబ్బా అని ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు. అయితే, పవన్ కి బాబు మీద కన్నా ఆయన పుత్రుడు లోకేష్ మీదే కోపం ఎక్కువ ఉందట. దీనికి కారణం ఏంటంటే, లోకేష్ మొదటి నుండి పవన్ కళ్యాణ్ ని చిన్న చూపు చూస్తున్నాడట. పార్టీ మీటింగ్స్ లో గానీ, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే, ఆయన వల్ల ఒరిగేదేమి లేదు, లైట్ తీసుకోండి అంటూ సమాధానం ఇచ్చేవాడట. జన సేన తో పొత్తు కావాలంటే, తమకు ఎక్కువ సీట్లు కావాలని పవన్ డిమాండ్ చేస్తే, లోకేష్ ససేమీరా అన్నాడట. ఆ మధ్య పవన్ ని చంద్రబాబు ఎక్కువగా పట్టించుకోకపోవడానికి కారణం కూడా లోకేషే నట. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఇక టీడీపీ కి దూరం గా ఉందామని డిసైడ్ అయ్యాడట. తన స్పీచ్ ద్వారా మొత్తానికి బాబు, లోకేష్ పై కక్ష తీసుకున్నాడని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్  బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో జరిగిన భేటీకి అపోజిషన్ పార్టీ లీడర్ వై యస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరవడం చర్చనీయాంశం అయింది. బీజేపీకి జాతీయ స్థాయిలో వ్యూహకర్తగా నియమితుడయిన ప్రశాంత్ కిషోర్ ఈ భేటీకి హాజరై... రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై వివరించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పొత్తుకు లైన్ క్లియర్ చేశారు అని ప్రచారం జరుగుతుంది. అయితే, పీకే కి చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. తన ట్విట్టర్ అకౌంట్లో ఓ టీవీ ఛానల్ క్లిప్ను జతచేస్తూ మరీ...`పూర్తిగా అవాస్తవ కథనం. అసత్యకథనాలను ప్రచారం చేసేందుకు దురుద్దేశపూరితంగా చేస్తున్న ప్రచారం ఇది. ఇలాంటి ప్రచారం గురించి వదిలేయండి. ఎందుకంటే ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలోనే లేరు` అంటూ తేల్చిచెప్పింది. అంతేకాకుండా  బీజేపీ జాతీయ స్థాయి వ్యూహకర్తగా  ప్రశాంత్ కిషోర్ను నియమించడం కూడా పూర్తిగా అబద్దమని పేర్కొంది. ఇదిలా ఉంటె, రాజకీయ విశ్లేషకులు మాత్రం బీజేపీ కి, వైకాపా కి పోతుకుదుర్చే పనిలో ఉన్నారని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్‌కు గుండెపోటు రావడంతో చెన్నై లోని గ్లోబల్ హెల్త్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వెంటలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో తన భర్తని చూసేందుకు తనకు వెంటనే పెరోల్ మంజూరు చేయాలని శశికళ దరఖాస్తు చేసుకున్నారు. కాగా, 72 ఏళ్ల నటరాజన్‌కు లివర్ చెడిపోవడంతో 2017 అక్టోబర్‌లో కిడ్నీ మరియు లివర్ మార్పిడి ఆపరేషన్ జరిపారు. అయితే రెండు వారాల క్రితం ఆయన అస్వస్థతతో తిరిగి ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి హృద్రోగ సమస్య తలెత్తడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇంతకు మునుపు నటరాజన్ కి హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చినప్పుడు, శశికళ పెరోల్ పై వచ్చి భర్తని పరామర్శించి వెళ్లిన సంగతి తెలిసిందే.
Income Tax officials conducted raids on the premises of Tamil actor Vishal’s production house- Vishal Film Factory (VFF) yesterday. As per reports, the production house has failed to pay Rs. 51 lakh collected as TDS (Tax Deducted at Source). The team is said to have left the office after the VFF staff assured to pay the due amount in two installments.  Earlier, it was wrongly reported in the media that the raid was conducted by the GST Intelligence Agency. A top GST official clarified on it later stating the agency had not conducted any search at VFF. Interestingly, IT raids were conducted on Vishal’s office just a day after the actor criticized a BJP (Bhartiya Janata Party) local leader H Raja who has been leading the charge against actor Vijay's film Mersal for allegedly defaming GST. When a media house asked Vishal regarding IT raids, he clarified saying, “It was TDS assessment by IT wing. Issue needs to be sorted officially and I will do so. The timing of IT department's visit to my office is suspect. The BJP's demand to chop Mersal dialogues is a curb on freedom of expression.” Curiously, no action has been taken against H Raja who directly announced to have watched Mersal online piracy version. If BJP continues to struggle those who question their government or leaders, they will lose faith in public who are already vexed with demonetization and GST schemes.
Indian ace Tennis Player Leander Paes appeared at the Bandra Magistrate Court in Mumbai couple of days ago over the hearing of a domestic violence case slapped on him in 2014 by his former girlfriend and live-in partner Rhea Pillai who demands Rs 1 crore in compensation from him. Pillai claimed that Leander Paes had no interest in taking care of their daughter Aiyana. Rhea has said in her petition: "Paes has always given priority to his own life and neglected the child and her feelings. He has been an absentee father. Besides being out of country for nearly 10 months of the year, he is also not reachable for days at length." Interim, Rhea Pillai's lawyers made a gaffe by mentioning the compensation amount demanded by her in the domestic violence case as Rs 10 lakh and not Rs 1 crore. The lawyers later told Magistrate that the correct amount Rhea had demanded was Rs 1 crore. The missing zero here made all the difference. Rhea Pillai demands one time settlement of Rs 1.43 Cr from Leander Paes. She also demands monthly-maintenance of Rs. 2.6 lakh. Her list of demands includes monetary assistance for buying a mid-budget car in the range of Rs 15-20 lakh. The cars given as examples are Toyota Innova, Toyota Corolla Altis and Honda City. Actual compensation demanded by Rhea was Rs 1 Cr, but the lawyers mistakenly wrote Rs 10 lakhs in the petition.
ALSO ON TELUGUONE N E W S
Superstar Mahesh Babu’s Bharath Ane Nenu (BAN) is in last leg of shooting. The film’s production unit will soon fly to Spain to shoot songs there. Mahesh Babu is romancing Kiara Advani in this political drama film directed by Koratala Siva under DVV Entertainments. Audio of BAN will be released on April 7th at RK Beach in Vizag, where Ram Charan’s Rangasthalam pre-release function was held recently. It is heard that, they have completed all the formalities to obtain permission from police and other authorities to hold the function without any trouble. It is not a simple audio launch event. The makers have their own plans to celebrate BAN audio launch. As per insiders, a huge assembly set will be erected in RK beach for the event, which means, the film’s audio will be launched in a huge assembly set. Currently, set department is working on designs to lock one for the event. Meanwhile, BAN is scheduled for grand release on April 20th.
  మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహ రెడ్డి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎప్పటి నుండో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి బయోపిక్ చేద్దాం అనుకుంటే మొత్తానికి మెగాస్టార్ కోరిక ఇప్పటికి నెరవేరుతుంది. అయితే, సైరా కథని అప్పుడెప్పుడో సిద్ధం చేసినప్పటికీ, చిరంజీవి రాజకీయాల్లో బిజీ గా ఉండడంతో దాన్ని కొన్ని సంవత్సరాలు పక్కకు పెట్టారట. ఆ తర్వాత, బాలకృష్ణ తన 100 వ చిత్రానికి మంచి కథ కోసం చూస్తున్న తరుణంలో, పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ కథ చెప్పారట. కానీ, స్క్రిప్ట్ అసంపూర్తిగా ఉండడంతో అప్పటికే క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణి బౌండెడ్ స్క్రిప్ట్ తో రావడంతో రెండో దానికే ఓటేశాడట. గౌతమీపుత్ర శాతకర్ణి ఎంత పెద్ద హిట్టయిందో మనందరికీ తెలిసిందే. ఇంక తన 150 వ సినిమా ఖైదీ నం 150 తో సూపర్ హిట్ కొట్టిన చిరు, తన తదుపరి చిత్రం గా  సైరా కథని సిద్ధం చేయమన్నాడట. ఇంకొందరు రైటర్స్ టీం తీస్కొని రీసెర్చ్ చేసి పూర్తి కథ సిద్ధం చేశారట పరుచూరి బ్రదర్స్. మెగాస్టార్ తృప్తి చెందాక, షూటింగ్ మొదలు పెట్టారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి లాంటి అగ్ర నటులు చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ లో పార్ట్ అయ్యేందుకు ఒప్పుకున్నారు. ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్న రామ్ చరణ్ ప్రతి విషయంలో ఫుల్ కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న సైరా వచ్చే సంవత్సరం వేసవి కి ప్రేక్షకుల ముందుకి రానుందని సమాచారం.
Macho hero Gopichand’s 25th film Pantham first look has been unveiled. In the poster, Gopichand is seen with slightly grown beard. The actor sported a new hairstyle is looking handsome here. The tagline ‘For A Cause’ hints that Gopichand has a strong reason to take revenge on his enemies. Billed to be an action drama, Gopichand will be seen in a complete action avatar in Pantham directed by K Chakravarthy and produced by KK Radhamohan. The film that has Mehreen Kaur playing female lead is slated for release on May 18th. We need to wait and see whether Pantham will provide much needed break for Gopichand or not!
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒక సినిమాకు కలిసి పని చేస్తారు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో షూట్ చేసి, ఇతర భాషల్లో అనువదిస్తారు అని ప్రచారం జరిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టిస్టారర్ తర్వాత రాజమౌళి ఈ మూవీ ని స్టార్ట్ చేస్తాడు అని అన్నారు. అయితే, ఎందుకో తెలియదు కానీ రాజమౌళి కి మహేష్ బాబు కి మధ్య చెడింది అంటూ కొత్తగా  గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. రంగస్థలం పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ట్వీట్లు వేస్తున్న జక్కన్న, భరత్ అనే నేను సినిమా గురించి మౌనం వహిస్తున్నారు. అసలు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న భరత్ అనే నేను గురించి రాజమౌళి ఇంతవరకు ఒక్క సారి కూడా రెస్పాండ్ అవ్వ లేదు. అయితే, కొందరు మాత్రం రాజమౌళి కి మహేష్ బాబు మధ్య అంతా బానే ఉందని... మహేష్ బాబు సినిమా పై ట్రైలర్ రిలీజ్ తర్వాత మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా, మహేష్ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే, 2019 చివరలో మహేష్, రాజమౌళి సినిమా మొదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
ఎవరి అండదండలు లేకుండా, మంచి సినిమాలు, అందులోనూ ఫాన్స్ మెచ్చే సినిమాలు చేస్తూ మెగాస్టార్ గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు చిరంజీవి. ఇండస్ట్రీ లో ఎంతో మంది యువ నటులకి ఇన్స్పిరేషన్ మెగాస్టార్. అయితే, మంచి సినిమాలు చేయడమే కాకుండా, ఫాన్స్ తో మెదిలిన పద్ధతి, చిరంజీవి కి అశేష అభిమాన గణం తెచ్చి పెట్టింది. ప్రతి సినిమాకి ముందు, తర్వాత ఫాన్స్ ని కలవడం చిరు కి అలవాటు. సెట్స్ లో కూడా ఏ అభిమాని వచ్చినా ఫొటోలకి టైం ఇచ్చేవాడు. ఇలా చిరు ఒక ట్రెండ్ సెట్ చేయగా, ఆ ట్రెండ్ ని మెగా ఫామిలీ లో ఆ తర్వాత వచ్చిన హీరోలు ఫాలో అయ్యారు. ఇప్పుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా, చిరంజీవి బాటలో నడుస్తున్నాడు. చిరు అంటే మహేష్ కి, మహేష్ అంటే చిరు కి ప్రత్యేక అభిమానం ఉన్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ మంచి సినిమా చేసిన ప్రతిసారి, చిరు కాల్ చేసి అభినందించడం జరుగుతుంది. అయితే, అభిమానుల్ని పెంచుకోవడం విషయంలో మహేష్ ఇప్పుడు చిరు స్ట్రాటజీస్ తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాడు. అభిమానుల్ని తరచూ కలవడం, వాళ్ళతో ఫొటోలకి టైం ఇవ్వడం చేస్తున్నాడట. మహేష్ లో వచ్చిన ఈ మార్పుకి ఫాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారట. బ్రహ్మోత్సవం, స్పైడర్ లు డిజాస్టర్ అవ్వడంతో, మహేష్ తన ఆశలన్నీ ఏప్రిల్ 20 న విడుదలవనున్న భరత్ అనే నేను పైన పెట్టుకున్నాడు.
దుబాయ్ లో సన్నిహితుల పెళ్ళికని వెళ్లిన అతిలోక సుందరి శ్రీదేవి బాత్ టబ్ లో పడి మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. దుబాయ్ పోలీసులు ఈ కేసు ని క్లోజ్ చేసినప్పటికీ, మీడియా మాత్రం రక, రకాల కోణాల్లో ఎవరికి వచ్చినట్లు వాళ్ళు కథనాలు ప్రచురించారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరిట శ్రీదేవి మృతిని కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసారు. ఇంటర్నేషనల్ మీడియా, ఈ అతి పై విమర్శలు గుప్పించాయి. కొందరు, శ్రీదేవి మృతి పై విచారణ చేపట్టాలని పిటిషన్ వేసినప్పటికీ కోర్ట్ స్వీకరించలేదు. మరో వైపు, బోనీ కపూర్ తన మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ తో శ్రీదేవి కూతుళ్ళని దగ్గర చేసే విధంగా అడుగులు వేస్తున్నాడని అంటున్నారు. మొన్నామధ్య, ఫ్యామిలీ లో అందర్నీ డిన్నర్ కి తీసుకెళ్లి ఈ వార్తలకి ఊతం ఇచ్చాడు బోనీ.  దాదాపు, అందరూ శ్రీదేవి విషయం మరచిపోతున్న వేళ, ఒక ప్రముఖ వ్యక్తి పెద్ద బాంబు పేల్చాడు. ఒక పాపులర్ జ్యోతిష్కుడు శ్రీదేవి మృతి పట్ల సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఉగాది పంచాంగ శ్రవణం చెబుతూ, శ్రీదేవి ది సహజ మరణం కాదు అని. ఆమెకు అత్యంత దగ్గరి వాళ్ళు మర్డర్ చేయించారని ఆరోపించారు.ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.
ప్రొఫెషనల్ రైవల్రి కారణంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ ల మధ్య చెడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎందుకో కానీ, ఒకరి సినిమా ఫంక్షన్ కి మరొకరు స్కిప్ చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు ఎవరి సినిమా అయినా, మొత్తం మెగా ఫామిలీ అటెండ్ అయ్యేది. కానీ, ఈ మధ్య ఇది జరగడం లేదు. ఇలాంటి ఈ సందర్భంలో బన్నీ, చరణ్ తో గ్యాప్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు అని ప్రముఖ మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. ఈ వార్తల సారాంశం ఏంటంటే, రంగస్థలం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, తన సినిమా నా పేరు సూర్య సినిమా కి సంబంధించి ప్రమోషన్స్ పూర్తిగా పక్కకు పెట్టాలి అని. ఎలాంటి ప్రత్యేక సందర్భంలోను కూడా, తన సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేయకూడదని బన్నీ తన దర్శక, నిర్మాతలతో ఖరాఖండీగా చెప్పాడట. అంత వరకు ఒకే కానీ, మొన్న రాత్రి రిలీజ్ అయిన, రంగస్థలం ట్రైలర్ గురించి అల్లు అర్జున్ నోరు మెదపకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. బన్నీ కి చరణ్ పై అంత ప్రేమ, గౌరవం ఉంటే, రంగస్థలం ట్రైలర్ గురించి ఏదో ఒకటి మాట్లాడే వాడు కదా అని విమర్శలు వస్తున్నాయి. మరి, అల్లు అర్జున్ ఇలాగే సైలెంట్ గా ఉంటాడా, లేక రంగస్థలం గురించి ఏదయినా మాట్లాడుతాడా చూడాలి.
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అలీకి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే పవన్ ప్రతి సినిమాలో అలీ ఉండాల్సిందే. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. గత కొద్దిరోజులుగా పవన్ కు అలీకి మధ్య మనస్పర్థలు వచ్చాయని... అందుకనే ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా అలీ లేడని గుసగుసలు వినిపించాయి. ఆ తరువాత ఈ వార్తలపై స్పందించిన అలీ..తనకు పవన్ కల్యాణ్ కు ఎలాంటి మనస్పర్థలు రాలేదని, బిజీ షెడ్యల్ కారణంగానే తాను ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించలేకపోయాని ఎన్నోసార్లు వివరణ ఇచ్చారు. కానీ వార్తలు మాత్రం ఆగలేదు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రశ్న అలీని అడుగగా... చిర్రెత్తుకొచ్చిన అలీ...  ’పవన్ కల్యాణ్  హీరో కాకముందు నుంచే మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆయన తొలి సినిమాలో నేను చేయలేదు.  అలాగే ‘అజ్ఞాతవాసి’లోనూ చేయలేదు. మిగిలిన అన్నీ సినిమాల్లో నేను ఉన్నప్పటికీ మా ఇద్దరి మధ్య గొడవైందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవునండీ నిజమే మా ఇద్దరికీ గొడవైంది .. అదీ ‘ఇవాంకా ట్రంప్’ వల్ల.‘  అంటూ నవ్వేశారు.  గుంటూరులో జరిగిన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కూడా పవన్ కల్యాన్ నన్ను పిలిచారని, తాను కూడా వెళ్లానని.. ఎన్నిసార్లు చెప్పాలని అన్నారు.
ఎన్టీఆర్ సినిమాకి ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యార‌య్యాడు అనిరుధ్‌. ఈ సినిమా క్రేజ్ అనిరుధ్ వ‌ల్ల స‌ర్వ‌నాశ‌నం అయ్యేలా క‌నిపిస్తోందిప్పుడు. దానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా క‌థ గురించి, క‌థ‌లోకి కీల‌క‌మైన విష‌యాల గురించి బ‌య‌ట చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా వార్త‌లొస్తున్నాయి. వీటి వెనుక అనిరుధ్ హ‌స్తం ఉంద‌ని టాక్‌.  ఎన్టీఆర్ సినిమాకీ అనిరుధ్‌కీ లింకేమిటి?  అనుకుంటున్నారా?   అక్క‌డికే వ‌స్తున్నాం.. ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ముందు అనిరుధ్ ద‌గ్గ‌ర‌కే వెళ్లింది. ఆ త‌ర‌వాత ఏమైందో ఏంటో.. త్రివిక్ర‌మ్ అనిరుధ్‌ని ప‌క్క‌న పెట్టి దేవిశ్రీ ప్రసాద్‌ని తీసుకున్నాడు. త‌న‌ని స‌డ‌న్‌గా ప‌క్క‌న పెట్ట‌డం అనిరుధ్‌కి న‌చ్చ‌డం లేదు. అందుకే ఎన్టీఆర్ సినిమా క‌థ‌ని అడిగిన వాళ్ల‌కీ, అడ‌గ‌నివాళ్ల‌కీ చెప్పేస్తున్నాడ‌ట‌. అలా.. ఈ సినిమా విశేషాలు బ‌య‌ట‌కు లీకైపోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ విష‌యం తెలుసుకున్న ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ అనిరుధ్‌ని పిలిచి మ‌రీ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చిన‌ట్టు ఫిల్మ్‌న‌గర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సినిమా అవ‌కాశం చేజారినంత మాత్రాన‌.. ఇలా ర‌హ‌స్యాల‌న్నీ బ‌య‌ట‌పెట్టేస్తారా??  ఈ విష‌యంలో ఎన్టీఆర్‌కి అనిరుధ్ మోస‌మే చేస్తున్నాడు మ‌రి.
  జ‌బ‌ర్‌ద‌స్త్ జంట‌... ర‌ష్మీ.. సుధీర్‌ల‌కు ఘ‌నంగా పెళ్లి జ‌రిగిపోయింది. అదీ.. జ‌బ‌ర్ ద‌స్త్ టీమ్ మ‌ధ్యే. నాగ‌బాబు, రోజా ఈ పెళ్లికి పెద్ద‌లు. జ‌బ‌ర్‌ద‌స్త్‌లో ఎంత గోల చేస్తారో, ఈ పెళ్లి వేడుక‌లోనూ ఈ జంట అంతే గోల చేశారు. అంతే కాదు.. ఇద్ద‌రూ డ్యూయెట్లు పాడి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఇంత స‌డ‌న్‌గా వీళ్లిద్ద‌రి పెళ్లి ఎప్పుడు జ‌రిగిపోయింది, ఎలా జ‌రిగిపోయింది అనుకుంటున్నారా?  ఇదీ... ఓ టీవీ షోలో భాగ‌మే.  జ‌బ‌ర్ ద‌స్త్ ఎప్పుడు మొద‌లైందో అప్పటి నుంచీ.. ర‌ష్మీ, సుధీర్‌ల‌పై ర‌క‌ర‌కాల పుకార్లు. ఇద్ద‌రూ ల‌వ్‌లో ఉన్నార‌ని, పెళ్లి చేసుకోబోతున్నార‌ని ర‌క‌ర‌కాల కామెంట్లు. సుధీర్ కూడా.. ర‌ష్మీపై ఇలాంటి ప్రాక్టిక‌ల్ జోక్సే వేస్తుంటాడు. దాంతో నిజంగానే వీళ్లిద్ద‌రి మ‌ధ్యా ఏదో ఉందేమో అన్న అనుమానాలు రేకెత్తాయి. దానికి త‌గ్గ‌ట్టుగా... ఓ టీవీ ఛాన‌ల్ వీరిద్ద‌రికీ ఉత్తుత్తి పెళ్లి చేసి ఆ అనుమానాలకు మ‌రింత ప్రాణం పోసింది. ఏమాట‌కామాట చెప్పుకోవాలంటే పెళ్లి దుస్తుల్లో ర‌ష్మీ, సుధీర్ అదిరిపోయారు. నిజం పెళ్లిలా.. వాళ్లిచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ చూస్తుంటే.. మ‌న‌సులోనూ అలాంటి ఆలోచ‌న‌లు ఏమైనా ఉన్నాయేమో అనిపిస్తోంది.  ఓ టీవీ షో యాంక‌ర్ల‌కు ఇలా.. సెట్లో ఉత్తుత్తి పెళ్లి చేయ‌డం బ‌హుశా... ఇదే తొలిసారేమో. ఇది ఉత్తుత్తి పెళ్లేనా.. లేదంటే పెళ్లికి రిహార్స‌ల్స్ ఏమైనా చేసుకున్నారా? అంటూ నెటిజ‌న్లు కౌంట‌ర్లు కూడా వేసుకుంటున్నారు.
  గత నాలుగేళ్ల నుండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చాలా సన్నిహత సంబంధం ఏర్పడింది. ఈ నాలుగేళ్లలో పవన్ వైసీపీ పై విమర్శలు గుప్పించడమే కానీ.. ప్రభుత్వాన్ని పెద్దగా టార్గెట్ చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా ఏదైనా సమస్యపై పవన్ ప్రభుత్వాన్ని నిలదీసిన.. ఈ పని చేయాలని డిమాండ్ చేసినా.. వెంటనే చంద్రబాబు ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేవారు. అలా ఇద్దరి మధ్య చాలా కోఆర్డినేషన్ ఉండేది. అంతలా పవన్ ను చంద్రబాబు నమ్మారు. అయితే ఉన్నట్టుండి పవన్ యూటర్న్ తీసుకొని టీడీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు.   జనసేన పార్టీ ఆవిర్భావం రోజు నుండి ఈరోజు వరకూ పవన్ టీడీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక పవన్ చేసిన విమర్శలపై స్పందించిన టీడీపీ నేతలు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు అయితే పవన్ పై నిప్పులు చెరిగారు. తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడిన పవన్... మరోసారి టీడీపీపై, చంద్రబాబుపై విమర్సలు గుప్పించారు. దీంతో ఈ ఉదయం ఎంపీలతో సుదీర్ఘ టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించిన ఆయన.. పవన్ వ్యాఖ్యలపై స్పందించి తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీని, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలతో ఇంత డ్యామేజ్ చేస్తారని ఎన్నడూ అనుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారట. వివిధ కాంట్రాక్టుల్లో కమీషన్లు తీసుకుంటున్నామని పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు లోకేష్ పై పవన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని మరోసారి తేల్చి చెప్పారు.   తన స్వార్థ ప్రయోజనాల కోసం మరొకరి ప్రయోజనాల కోసం పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పవన్ వంటి వ్యక్తి ఓ విమర్శ చేసేముందు నిజానిజాలను తెలుసుకోవాలని.. తెలుగు ప్రజలు ఎంతో అభిమానించే నటుల్లో ఒకరైన పవన్ ఇటువంటి విమర్శలు చేస్తే, నమ్మేవారు కొందరైనా ఉంటారని, అది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందని అన్నారు. మొత్తానికి పవన్ ను ఇంతలా నమ్మిన చంద్రబాబుకు.. పవన్ ఇలా చేస్తాడని కనీసం కలలో కూడా అనుకోని ఉండరు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పవన్ ఇప్పుడే ఏకంగా చంద్రబాబుపై, ఆయన తనయుడిపైనే డైరెక్ట్ గా విమర్శలు గుప్పించడంతో చంద్రబాబు బాగానే ఫీలవుతున్నట్టున్నారు.
  ఎవ్వరూ ఉహించని విధంగా గుంటూరు జనసేన ఆవిర్భావ సభలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ టీడీపీ పై విమర్శలు గుప్పించి ఏపీ రాజకీయ పరిణామాలనే మార్చేశారు. అసలు పవన్ కళ్యాణ్ టీడీపీ పై యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి.. ఇన్ని రోజులు టీడీపీని విమర్సించని పవన్ కళ్యాణ్ టీడీపీపై ఈ రేంజ్ లో విమర్శలు గుప్పించడానికి కారణం ఏంటీ అని.. ఆలోచనపడ్డారు. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేశ్ పై అవినీతి ఆరోపణలు గుప్పించారు.. ఇసుక నుంచి  మట్టి వరకు  నేల తల్లిని అమ్ముకుంటున్నారు..  ఇదంతా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నా మీద్రుష్టికి రాలేదా? ఒకవేల వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. లేకపోతే మీకు తెలిసే అన్నీ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అలాగే తమిళనాడుకు చెందిన టీటీడీ మాజీ బోర్డ్ మెంబర్ శేఖర్ రెడ్డికి లోకేష్ కు సబంధాలున్నాయని దీనికి మీరు ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు పవన్.   దీంతో అసలు పవన్ స్ట్రాటజీ ఏంటని అనుకుంటున్నారు. ఇక పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎదురుదాడికి దిగింది. పవన్ వెనుక బీజేపీ ఉందని కొంతమంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పై తాను అవినీతి ఆరోపణలు చేయడానికి కారణం ఏంటో పవన్ చెప్పాడు. ఓ న్యూస్ ఆఫీస్ కు వెళ్లిన పవన్ ను ఒక ముఖ్యమంత్రి కొడుకుపై మీ లాంటి సెలబ్రిటీ అటువంటి ఆరోపణలు చేశారు.. మీ దగ్గరేమన్నా.. ఆధారాలున్నాయా అని అడుగగా.. దీనికి పవన్ సమాధానం చెప్తూ.. లోకేష్ పై ఉన్న ఆరోపణలు అందరి దృష్టిలో ఉన్నవేనని.. వాటినే నేను మళ్లీ గుర్తు చేశానని అన్నారు. అందరి దృష్టిలో ఉండి నీ దృష్టికి రాలేదా అని అందరూ అడుగుతారనే తాను ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. మరి శేఖర్ రెడ్డితో తనకు పరిచయాలు ఉన్నాయని అంటున్నారు అది ఎంత వరకూ నిజమో చెప్పాలి అని అన్నారు...దానికి లోకేశ్..  శేఖర్ రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కదా అని అడుగగా.. అంటే.. ఇలాంటివి కూడా ఉన్నాయి ఒకసారి చూసుకోండి అంటూ చెప్పాను అంతే అంటూ చాలా తేలిగ్గా తేల్చారు.
  రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో అన్న దానికి పవన్ కళ్యాణ్ స్పీచే ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. నిన్నటి వరకూ టీడీపీ పై ఎలాంటి విమర్సలు గుప్పించని పవన్.. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ ని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి. ఎప్పుడు సభలు పెట్టినా.. వైసీపీ పార్టీ పై లేదా బీజేపీ పై సెటైర్లు, విమర్శలు చేసే పవన్ ఈసారి మాత్రం టీడీపీ పైనే విమర్శలు గుప్పించారు. కేంద్రంపై, వైసీపీపై ఏదో రెండు మూడు విమర్శలు చేసినా.. టార్గెట్ మొత్తం టీడీపీపైనే చేశారు. ముఖ్యంగా టీడీపీపై అవినీతి ఆరోపణలు గుప్పించారు.   అయితే ఇక్కడే ఓ ఆసక్తిర విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా జనసేనను తీర్చిదిద్దాలని పవన్ ఆలోచన చేస్తున్నట్టుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రతిపక్షపార్టీగా ఉంది. అయితే ఆ విషయం జనాలు ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే... వైసీపీ ప్రతిపక్షపార్టీ అన్న పేరే కానీ ప్రజా సమస్యలపై అధికార పార్టీతో పోరాడింది లేదు. ఇక పాదయాత్ర కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం మానేశారు. పోనీ తాను రాకపోయినా.. పార్టీ నేతలను అయినా పంపిస్తారంటే అదీ లేదు... తాను వెళ్లకపోతే.. ఎవ్వరూ వెళ్లడానికి వీల్లేదు అని కండీషన్స్ పెడుతుంటాడు. సరే ప్రజలు ఏదైనా సమస్యలు చెప్పినా.. దానిని పరిష్కరించకుండా.. నేను సీఎం అయిన తరువాత చేస్తా.. అప్పుడు చూస్తా అని కబుర్లు చెబుతుంటాడు. దీంతో వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైపోయింది. ఇక సీబీఐ కేసుల భయంతో పూర్తిగా ఢిల్లీకి లొంగిపోయింది. పొత్తో.. విలీనమో.. ఖరారు చేసుకోవడానికి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష స్థానానికి పూర్తి స్థాయి ఖాళీ ఏర్పడింది.   ఇక దీన్నే పవన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్… తెలుగుదేశం పార్టీకి అనేక విషయాన్ని మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్ లేవనెత్తే అంశాపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ… పరిష్కరించే ప్రయత్నం చేశారు. అందుకే పవన్ కల్యాణ్ టీడీపీ పార్టనర్ అంటూ… విమర్శలు ప్రారంభించారు. దీనిని తిప్పికొట్టడంతో పాటు.. ఇక నుంచి తామే ప్రతిపక్షం అన్నట్లుగా ఉండేలా.. పవన్ కల్యాణ్ .. టీడీపీకి పూర్తి స్థాయిలో తన విధానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అలా వెళితేనే రాజకీయంగా ముందుంటామని నిర్ణయించుకున్నట్టుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే కనుక నిజమైతే.. జగన్ సీఎం అవ్వడం ఏమో కానీ.... ప్రతిపక్ష నేతగా ఉండటం కష్టమవుతుంది. మరి ఇన్ని రోజులు టీడీపీకి సపోర్ట్ గా ఉన్న పవన్ ఇప్పుడు ఇలా రివర్స్ పంచ్ ఇవ్వడానికి అసలు రీజన్ ఏంటో పవన్ కే తెలియాలి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
  తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసింది నిజంగా ఘోరం, నేరం! తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు సదరు ఎమ్మెల్యేలందర్నీ సస్పెండ్ చేసేసి, అవసరమైతే డిస్మిస్ కూడా చేసేయాల్సినంత దారుణం. లేకపోతే ఏమిటండీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు అసెంబ్లీలో కళ్ళకి, చెవులకి పని చెప్పి సైలెంట్‌గా కూర్చోవాలి. అధికార పార్టీ ఎలా పరిపాలించినా కిక్కురుమనకుండా పడి వుండాలి. అంతే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడమేంటసలు? పైగా బంగారు తెలంగాణను సాధించడానికి నిరంతరం శ్రమపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన తెలియజేయడమేంటి? తప్పుకదా? అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి తగిన శాస్తి చేయడానికి ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తోందట.   అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది. వాళ్ళ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పాలన భలే నచ్చేసి ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరిపోయి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. మిగిలిన కొద్దిమంది కూడా టీఆర్ఎస్ జీవన స్రవంతిలో కలసిపోయి ధన్యులైపోవాలి. అలా కాకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే వుంది ఆందోళనలు చేయడం ఏమైనా పద్ధతిగా వుందా? పైగా గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు గోలగోల చేయడం ఎంతమాత్రం బాగాలేదని టీఆర్ఎస్ నాయకులు ఎంత బాధపడిపోతున్నారో చూడండి. ఏంటీ? తెలంగాణ ఉద్యమం సమయంలో అసెంబ్లీలో టీఆర్ఎస్ నాయకులు చేసిన గోలతో పోల్చుకుంటే ఈ గోల ఏపాటిదని అంటున్నారా? అప్పుడు ఇదే గవర్నర్ నరసింహన్ మీద టీఆర్ఎస్ సభ్యులు కాగితాలు చించి విసిరారని, మైకు లాగారని, ఎమ్మెల్యే జె.పి. మీద డ్రైవర్ చేత దాడి చేయించారని గుర్తు చేసుకోండని అంటున్నారా? అసలు మీ వాదనలో అర్థం వుందా? అప్పుడంటే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏది చేసినా కరెక్ట్... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం అది తప్పున్నర తప్పు. అలాంటి తప్పు చేశారు కాబట్టి కాంగ్రెస్ సభ్యులకు తగిన శిక్ష పడాల్సిందే.   అది సరేగానీ, తెలంగాణ విధాన మండలిని ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్న శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్ విసిరారు. అది డైరెక్టుగా వెళ్ళి ఛైర్మన్ గారి కంటిమీద తగిలింది. ఆ దెబ్బ చాలా బాధ కలిగిస్తున్నప్పటికీ ఆయన బాధ్యతాయుతమైన పదవిలో వున్నారు కాబట్టి ఆ బాధని చాలాసేపు భరించారు. గవర్నర్ గారి ప్రసంగం పూర్తయ్యే వరకూ ఆయన ఆ బాధని భరిస్తూనే వున్నారు. ఆయన ఓర్పుకి జోహార్. ఆ తర్వాత ఆయన సీఎం గారి సలహా మేరకు కంటి డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. కంటి డాక్టర్లు ఆయన కంటికి డాక్టర్ గారు పెద్ద కట్టు కట్టారు. గౌరవనీయులైన స్వామి గౌడ్ గారి కంటికి వున్న ఆ కట్టును చూసి తెలంగాణలో ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. స్వామి గౌడ్ గారి కంటికి ఏమీ కాదని డాక్టర్లు భరోసా ఇచ్చారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ పెద్ద దెబ్బ తగిలి ఒక కన్ను పోతే పరిస్థితి ఎంత దారుణంగా వుండేదో! ఒక కంటితో ఆయన సమావేశం హాలు మొత్తాన్నీ ఒకేసారి చూడలేక చాలా ఇబ్బంది పడేవారు. అలా జరగనందుకు దేవుడికి ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తూ రయ్యిమని దూసుకుని వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తగిన విధంగా శిక్షించాల్సిందే.
  వైసీపీ పార్టీ పరిస్థితి ఏపీలో ఏంటో అందరికీ తెలిసిందే. పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్ తీరు నచ్చక పార్టీ నుండి కీలక నేతల సైతం జంప్ అవ్వడం ఇవన్నీ పార్టీ స్థాయిని ఎప్పుడో పడేశాయి. ఇక జగన్ పాదయాత్ర గురించి తమ ఛానెల్ కు తప్ప మరో ఛానెల్ కు గుర్తుండదు. అలాంటిది జగన్ గురించి జాతీయా మీడియాలో రావడం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దీనికి కారణం.. బీజేపీతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఎలాంటి సంబంధం లేకపోయినా... బీజేపీ మౌత్ పీస్ గా పేరున్న రిపబ్లిక్ టీవి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. అప్పుడే బీజేపీ-వైసీపీ పొత్తు పెట్టుకుంటాయేమో అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే చెబుతూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పకనే చెబుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.   ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలందరూ పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. రాజీనామాలు చేస్తున్నారు. ఏపీలో కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా గురించే మాట్లాడుకుంటున్నారు. అలాంటిది... దాని గురించి వార్తలు రాయడం మానేసి.. సమయం సందర్బం లేకుండా... జగన్ కు వకాల్తా పుచ్చుకొని కొన్నిజాతీయ మీడియా సంస్థలు జగన్ గెలుస్తాడు అని వార్తలు రాయడం పిచ్చికి పరాకాష్ట అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...వైకాపా అధికారంలోకి రాకపోయినా...టిడిపి దగ్గరకు చేరుతుందని...టైమ్స్‌ఆఫ్‌ఇండియా కథనంలో పేర్కొంది. టిడిపికి...వైకాపాకు కేవలం రెండుశాతం మాత్రమే ఓట్లు తేడా ఉందని..రాబోయే రోజుల్లో లోటును అధిగమించి..అధికారం వైపు వైకాపా దూసుకుపోతుందని..'జగన్‌' చేస్తోన్న పాదయాత్ర, రాష్ట్రానికి ప్రత్యేకహోదా..వంటి అంశాలు..ప్రజల్లోకి బాగా వెళ్లాయని...దీంతో...'జగన్‌' గెలుస్తారని రాసుకొచ్చారు. మొత్తానికి ఈ రకంగా బీజేపీ-వైసీపీ పొత్తు ఖాయమని తెలుస్తుంది. లేకపోతే.. ఇక్కడ తెలుగు రాష్ట్రాలే పట్టించుకోవడం లేదుకానీ.. దేశంలో వార్తలు ఏం లేనట్టు జాతీయ మీడియా జగన్ కు గురించి ఇలాంటి రాతలు రాయడం నిజంగా నవ్వుకోవాల్సిన విషయం. బీజేపీ హ్యాండ్ లేకపోతే ఇలాంటి వార్తలు రావడం.. అందులో జాతీయ మీడియా సంస్థల్లో రావడం అంటే కష్టం. మరి ఇప్పటికే 'బిజెపి'తో 'జగన్‌' కుమ్మక్కయ్యారని ప్రజలు భావిస్తున్నారు.. ఈ వార్తలు చూసి వైసీపీ-బీజేపీ పొత్తు పై క్లారిటీ వచ్చినట్టే అంటున్నారు. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిన బీజేపీతో వైసీపీ కలిస్తే ఏముంటుంది.. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్న సామెత లాగ ఉంటుంది..
   తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు శుక్రవారం మీడియా సమావేశంలో వ్యక్తం చేసిన ఆవేదన చూసిన వాళ్ళకి చాలా బాధ కలగడం ఖాయం. ఇంతకూ అయన ఆవేదనకి కారణం ఏమిటంటే, హరీష్ రావు తెరాస పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారని, ఒక ప్రముఖ పార్టీలో అయన జాయిన్ అవడానికి రంగం సిద్ధం అయిందని సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. అలాగే సీఎం కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించి తాను జాతీయ రాజకీయాలకి వెళ్తారని, అందువల్ల హరీష్ రావు హర్ట్ అయి తెరాస పార్టీని విడిచి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.   ఇలాంటి వార్తలు తనని ఎంతో బాధకి గురి చేస్తున్నాయని హరీష్ రావు వాపోయారు. తాను కెసిఆర్ ఆజ్ఞని పాటించే వ్యక్తిని అని అంటున్నారు. తనమీద జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరించలేక పోతున్నా అని అయన అన్నారు. తన మీద ఇలాంటి ప్రచారం చేస్తున్న వారి మీద పోలీస్ ఉన్నతాధికారులకు ఆల్రెడీ ఫిర్యాదు చేసానని అన్నారు. తాను తన కంఠంలో ప్రాణం వున్నంత వరకు తెరాసలోనే ఉంటానని, ప్రాణం పోయినా పార్టీ  మారను అని చెప్పారు.   అయినా హరీష్ ఇంతలా ఎందుకు హర్ట్ అవుతున్నారో అర్థం కాని విషయం. ప్రాణం పోయినా పార్టీ మారను అని పెద్ద పెద్ద మాటలు ఎందుకో. రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది మామూలు విషయం. అదేదో నేరం, ఘోరం కాదు. ఇప్పుడు తెరాసలో వున్న వాళ్లు పార్టీలు మారిన వాళ్లే కదా. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోనే తెరాస విజయవంతంగా నడుస్తోంది కదా. ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి రావడం మంచి విషయం... మీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం మాత్రం చెడ్డ విషయం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  సోషల్ మీడియాలో వచ్చే వాటి గురించి ఇంత ఫీల్ ఎందుకు అవుతున్నారు, దీని వెనుక వేరే కారణాలు ఏవైనా వున్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
  చెయ్యెత్తి జై కొట్టిన తెలుగుబిడ్డలు ఇప్పుడు తిరగబడ్డారు. ఇద్దరూ కూడబలుక్కుని కాకపోయినా, ఒకేసారి ఢిల్లీ ఆధిపత్యం మీద తిరబడటం యాదృచ్ఛికం. మొన్నటి వరకూ ఢిల్లీ ఆధిపత్యానికి సాహో అన్న ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇప్పుడు ఎవరి దారిలో వారు తెలుగు పౌరుషాన్ని చూపిస్తున్నారు. ఢిల్లీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఎవరి దారిలో వారు తిరుగుబాటలో నడుస్తున్నారు. మార్గాలు వేరైనా గమ్యం ఒకటే అన్నట్టు ఇద్దరూ తమ తమ రాష్ట్రాల హక్కుల సాధన కోసం  నిరసన గళం వినిపిస్తున్నారు.   నాలుగేళ్ళుగా ఢిల్లీ ప్రభువు నరేంద్ర మోడీ ఆధిపత్యం ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అణిగి మణిగి వుండక తప్పలేదు. చేతికి చిప్ప ఇచ్చి తరిమేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టె్క్కించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇంతకాలం అనేక అంశాల మీద మౌనం వహించారు. ఢిల్లీ బీజేపీ పెద్దల అవమానాలను భరించారు. లోకల్ బీజేపీ నాయకుల తోక ఊపుడును సహించారు. సహనం ఎక్కువైపోతే మిగిలేది దహనమే అన్నట్టుగా ఆయన సహనం పరిధులు దాటిపోయి ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇద్దరు టీడీపీ కేంద్రమంత్రుల రాజీనామాల రూపంలో నిరసన వ్యక్తమైంది. పూర్తిగా తెగేదాకా లాగడం ఎందుకన్నట్టుగా కేంద్ర మంత్రుల పదవులకు రాజీనామాలు చేసినప్పటికీ టీడీపీ ఎన్డీఏలో కొనసాగుతోంది.   ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన తొలినాళ్ళలో ప్రధాని మోడీ మీద బోలెడన్ని సెటైర్లు వేశారు. ఆ తర్వాత మోడీ హవాని అర్థం చేసుకున్న ఆయన మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఎంతగా పొగిడినా కేంద్రం దగ్గర తెలంగాణ పప్పులు ఉడకకపోవడంతో మళ్ళీ రివర్స్ గేరు వేశారు. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏంటంట అని ధిక్కరించారు. మోడీని ’గాడు‘ అనే సాహసం కూడా చేశారు. అయితే ఆ తర్వాత నేనలా అనలేదని చెప్పేశారు. రాష్ట్రాల గౌరవం నిలబడాలంటే మూడో ఫ్రంట్ మొదటెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన రిజర్వేషన్ల పెంపుదలను కేంద్రం ఒప్పుకోకపోవడంతో పోరాటం తీవ్రంచేశారు. త్వరలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంమీద ఇద్దరు తెలుగుబిడ్డలూ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.
  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒక్కసారిగా షాకయ్యారు. మనం ఎన్ని వేషాలేసినా కుక్కిన పేనుల్లా పడి వుంటార్లే... ఎదురు తిరిగే సాహసం కూడా చేయర్లే అని వీళ్ళిద్దరూ ఇంతకాలం అనుకున్నారు. ఇప్పుడు దేశంలో మన హవా నడుస్తోంది... వాళ్ళా మనమీద ఆధారపడి వున్న వాళ్ళు... అంచేత మనల్ని ఎదిరించే సాహసం వాళ్ళు చేయబోరు అని భావించారు. అయితే సీన్ రివర్స్ అయింది.. శాంతానికీ కోపం వచ్చింది... బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. అలా జరగదులే అని నిశ్చింతగా వున్న ఇద్దరు పెద్ద మనుషులూ ఇప్పుడు ఒక్కసారిగా షాకైనట్టు సమాచారం. మరో ఏడాదిపాటు ఇలాగే ఇష్యూని సాగదీసి, ఏపీకి నిధులు రాకపోవడానికి చంద్రబాబు అసమర్థతే కారణం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చి, ఆ తర్వాత వైసీపీతో పొత్తు పెట్టుకుందామని కలలు కన్నారు. 2019 ఎన్నికలలో ఏపీలో భారీగా సీట్లు సంపాదించేసి, కేసుల్లో కొట్టుమిట్టాడుతున్న వైసీపీని ఓ మూలన కూర్చోపెట్టి అధికారం చెలాయించాలని ఊహించారు. అయితే వాళ్ళ ఊహలన్నీ ఉప్ఫుమని ఎగిరిపోయాయి. కేంద్రం నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకోవడం వాళ్ళిద్దరి నెత్తిన తాటికాయలా మారింది.   కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకోవడం అనేది కేవలం ఏపీ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు... అది కేంద్ర ప్రభుత్వం మీద భారీగా ప్రభావం చూపించే అంశం. కేంద్రంలో బీజేపీని పూర్తి మెజార్టీ వున్నప్పటికీ,  చాలా మిత్రపక్షాలు ప్రభుత్వంలో భాగస్వాముల్లా వున్నాయి. ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తోంది కాబట్టి ఆ పార్టీలన్నీ అవమానాలు ఎదురవుతున్నా భరిస్తూ పడి వున్నాయి. మిస్టర్ క్లీన్‌గా పేరు వుండటంతోపాటు, జాతీయ స్థాయిలో గౌరవం వున్న చంద్రబాబు లాంటి నాయకుడు ఇప్పుడు బీజేపీకి ఎదురు తిరగడం ఒక పెద్ద మలుపు. ఇది మిగతా పార్టీల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే శివసేన బీజేపీ అంటేనే అగ్గిమీద గుగ్గిలమవుతూ వుంటుంది. మరికొన్ని మిత్రపక్ష పార్టీలకు బీజేపీ అంటే కోపం వున్నా ఇప్పటి వరకూ బయట పడలేని పరిస్థితిలో వున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో నుంచి బయటకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మరికొందరు భయాన్ని వదలి బయటపడే అవకాశాలున్నాయి. అది 2019 ఎన్నికల్లో బీజేపీ మీద తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం... ఇవన్నీ గ్రహించే నరేంద్ర మోడీ, అమిత్ షా కలవరపడుతున్నట్టు సమాచారం.
  దేశంలో మూడో ఫ్రంట్ రావాలని, దానికోసం తాను కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే టీఆర్ఎస్ వర్గాలు ఆనందంతో ఉరకలు వేయడం ప్రారంభించాయి. మూడో ఫ్రంట్‌కి కేసీఆర్ నాయకత్వం వహించేసినట్టు, ఆ తర్వాత ఆయన దేశానికి ప్రధానమంత్రి అయినట్టు, తెలంగాణకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయినట్టు, కేసీఆర్ ప్రధానమంత్రిగా దేశం, కేటీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వున్నట్టు కలలు కనడం ప్రారంభించేశారు. కేసీఆర్ ఇలా థర్డ్ ఫ్రంట్ గురించి ప్రకటించారో లేదో... అలా పలు ప్రాంతీయ పార్టీల నాయకులు కేసీఆర్‌కి ఫోన్ చేసి మరీ మద్దతు తెలిపారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ ఉత్తుత్తి వార్తలేనని, కేసీఆర్‌కి ఎవరూ ఫోన్ చేయలేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏమిటో ఆ పైవాడికే తెలియాలి.   తెలంగాణ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు.. ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు అందర్నీ ఒక్కతాటి మీదకు తీసుకురావడం... ఆ తర్వాత ఎవర్ని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచి, తాను ఎక్కడ వుండాలో అక్కడే వుండే నైపుణ్యం కేసీఆర్‌కి బాగా వుంది. థర్డ్ ఫ్రంట్ విషయంలో కూడా కేసీఆర్ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్ళినా, అనుకున్నది సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తన రాజకీయ చతురతతో సోనియాగాంధీనే మాయచేసిన టాలెంట్ ఆయన సొంతం. తన టాలెంట్‌ని సరైన విధంగా ఉపయోగించుకుని దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కేసీఆర్ భావించడం సమంజసమేనని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంత అకస్మాత్తుగా కేసీఆర్‌కి ప్రధానమంత్రి అవ్వాలన్న ఆలోచన రావడానికి కారణమేంటనే పాయింట్‌ మీద అందరి దృష్టీ నిలిచింది.   కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా, బీజేపీ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్రాలను చిన్న చూపు చూడటం మామూలైపోయిందని కేసీఆర్ చెబుతున్నది పైపైన కనిపించే కారణం. అయితే లోపల వున్న అసలు కారణం చంద్రబాబుకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఇమేజేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇటీవల అమరావతిని సందర్శించిన సందర్భంలో చంద్రబాబు లాంటి వ్యక్తికి ‘‘ఇంకా  పెద్ద బాధ్యతలు అందాలి’’ వ్యాఖ్యానించారు. అంబానీ అలా అనడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. చంద్రబాబు ప్రధాని అవ్వాలని ముకేష్ కోరుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అయితే తనకు జాతీయ రాజకీయాలకు వెళ్ళే ఉద్దేశం లేదని క్లారిటీగా చెప్పేశారు. ఈ సందర్భంలో తాను జాతీయ రాజకీయాలకు ఎందుకు వెళ్ళకూడదన్న ఫ్లాష్ కేసీఆర్‌ మదిలో వెలగడం వల్లే థర్డ్ ఫ్రంట్ ఆలోచన పుట్టుకొచ్చిందని విశ్లేషిస్తున్నారు. జాతీయ స్థాయిలో చంద్రబాబుకు వున్న ఇమేజ్ కంటే ఎక్కువ ఇమేజ్ సాధించే ఉద్దేశంతోనే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అస్త్రంతో ముందుకు వచ్చారని అంటున్నారు.
  బీజేపీ రాజకీయాలు, నరేంద్ర మోడీ వ్యూహాలు, అమిత్ షా ఆలోచనలు దేశ రాజకీయాల్లో బాగానే వర్కవుట్ అవుతున్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావడానికి, ఇప్పుడు పలు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి వీరి ప్లానులన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇదే తరహా ప్లాన్స్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రయోగించి విజయం సాధించాలని అనుకున్న కమల నాథుల పథకాలు బెడిసికొట్టినట్టే ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో మిత్రపక్షంగా వుంటూనే టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి అధికారంలోకి రావాలని బీజేపీ వేసిన ప్లాన్ అట్లర్ ఫ్లాప్ అయినట్టు కనిపిస్తోంది. అధికారంలోకి రావడం సంగతి అటుంచితే, ఏపీ ప్రజల్లో నమ్మకాన్ని బీజేపీ పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది... ఇప్పుడు ఏపీలో మారిపోయిన పరిస్థితులను చూస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఆంధ్రాతో అనవసరంగా పెట్టుకున్నాం అని పశ్చాత్తాప పడుతున్నట్టు తెలుస్తోంది.   ప్రత్యేక హోదా విషయంలో ఐదేళ్ళు కాదు.. పదేళ్ళు అని పార్లమెంటులో చాలా నమ్మకంగా చెప్పిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఐదేళ్ళ సంగతి దేవుడెరుగు... ప్రత్యేక హోదా అనే హామీనే గుర్తు లేనట్టు వ్యవహరించడాన్ని ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి అందాల్సిన నిధులను కూడా సక్రమంగా అందించకపోవడం కూడా ఏపీ ప్రజలకు రుచించడం లేదు. ఇవన్నీ ఇలా వుంటే, ఆంధ్రాకి సాయం చేయకపోగా స్థానిక బీజేపీ నాయకులచేత రాజకీయాలు చేయించడం కూడా ఏపీ ప్రజలకు నచ్చడం లేదు. టీడీపీ మీద రాజకీయంగా ఆధిపత్యం సాధించి, వచ్చే ఎన్నికలలో అధికారం పొందాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ నాటకాలు ఆడుతోందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎంతగా సర్దుకుపోవాలని ప్రయత్నించినా బీజేపీ రెచ్చగొట్టేట్టు వ్యవహరిస్తోందనే విషయాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇన్నిరకాలుగా ఏపీ ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకున్న బీజేపీ ఇప్పుడు పునరాలోచనలో పడింది.   ఆంధ్రాతో అనవసరంగా పెట్టుకున్నామన్న విషయాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్న బీజేపీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. జగన్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని బీజేపీ అర్థం చేసుకునే నాటికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బీజేపీ కేంద్ర నాయకత్వానికి అర్థమైంది. అందుకే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో స్నేహాన్ని పెంచుకోవడానికి, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసి చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు. స్థానిక బీజేపీ నాయకులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం బాగా తగ్గించారు. ఏపీ ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతను తొలగించాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎలా వుంటుంది... ఇప్పుడున్న పరిస్థితులో అందుకు చట్టపరంగా ఏ మార్గంలో వెళ్ళాలనేది కేంద్రం ఆలోచనలో వున్నట్టు సమాచారం. అందుకే అన్నారు... అడుసు తొక్కనేల... కాలు కడగనేల అని..!
  కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో కాస్త రాజకీయానుభవం ఉన్న ఎవరికైన అర్గమవుతుంది. సెంటిమెంట్ ను ఉపయోగించుకోవడంలో ఆయన దిట్ట. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న సెంటిమెంట్ ను ప్రజల్లో రగిల్చి... తెలంగాణ ఉద్యమం చేపట్టి.. ప్రజల మద్దతుతో ప్రత్యేక తెలంగాణను సాధించారు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. మరి ఇప్పుడు కేసీఆర్ కన్ను దేశ రాజకీయాలపై పడినట్టు ఉంది. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది.   ఇక ఇన్ని రోజులు మోడీపై ఎలాంటి విమర్శలు గుప్పించని కేసీఆర్ ఏమైందో ఏమో కానీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు రోజుల నుండి మోడీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏం లేదని.. కాంగ్రెస్ కు బీజేపీకి పెద్ద తేడా లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.  గ‌డ‌చిన 70 ఏళ్లుగా కాంగ్రెస్‌, లేదా భాజ‌పాలే ఎక్కువ కాలం దేశాన్ని పాలించాయ‌ని.. ఆ రెండు పార్టీల వల్ల దేశానికి ఒరిగింది ఏం లేదు.. ఏదో పధకాలకు పేరు మార్చడం తప్ప చేసింది ఏం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీ దొందూ దొందే... దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది..  దేశానికి ప్రత్యామ్నాయ అవ‌స‌రం క‌నిపిస్తోంద‌న్నారు. అంతేకాదు... దాన్ని థ‌ర్డ్ ఫ్రెంట్ అంటారో మ‌రేదైనా పేరు పెడ‌తారో అనేది త‌రువాత సంగతి.. అలాంటి ప్ర‌త్యామ్నాయ కూట‌మి కోసం తాను ప‌నిచేస్తున్నాను అని కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం విశేషం. దాని కోసం అవ‌స‌ర‌మైన వారితో మాట్లాడుతున్నాన‌నీ, దేశానికి త‌న సేవ‌లు అవ‌స‌రం ఉందంటే క‌చ్చితంగా సిద్ధంగా ఉన్నాన‌ని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టేశారు కేసీఆర్‌. మార్పున‌కు నాయ‌క‌త్వం వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నాన‌నీ, కొత్త‌గా రాబోయేది మూడో కూట‌మి కాద‌నీ.. అదే ప్ర‌థ‌మ ప్ర‌త్యామ్నాయం అన్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ ఆలోచన బాగుందని... తన మద్దతు కేసీఆర్ కు ఉంటుందని జనసేన అధినేత పవన్ చెప్పేశారు. ఇంకా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా తనకు ఫోన్ చేసిందని కూడా చెబుతున్నారు కేసీఆర్. ఇంకా పలు రాష్ట్రాల నుండి పలువురు ముఖ్యనేతలు ఫోన్లు చేశారని.. తమతో నడవడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారని కేసీఆర్ చెబుతున్నారు. మరి చూడబోతే కేసీఆర్ కన్నుదేశ రాజకీయాలపై పడినట్టే తెలస్తోంది.జాతీయ రాజ‌కీయాలపై కేసీఆర్ లో ఆశ‌ పెరుగుతున్న‌ట్టుంది. ముఖ్యంగా ప్రధాని పదవికే కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే అది మంచిదే కానీ... మూడో ప్ర‌త్యామ్నాయానికి నాయ‌క‌త్వం వ‌హించేస్తాన‌ని చెప్పడమే కాస్త అత్యాశగా ఉందని అంటున్నారు. నేరుగా చెప్ప‌క‌పోయినా ప్ర‌ధాని కావాల‌నే ఆశ‌ని కేసీఆర్ బ‌య‌ట‌పెట్టుకున్న‌ట్ట‌యింది. మరి చూద్దాం కేసీఆర్ కలలు నెరవేరుతాయో.. లేదో..?
  ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీల మధ్య వున్నది స్నేహమా, శత్రుత్వమా అనే ప్రశ్న బేతాళ ప్రశ్నకంటే చాలా క్లిష్టమైన ప్రశ్న. సాక్షాత్తూ విక్రమార్కుడే దిగివచ్చినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక గుడ్లు తేలేస్తాడు. విక్రమార్కుడి దాకా ఎందుకు... ఏపీ బీజేపీ, టీడీపీ నాయకులను అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరేమో... ఎందుకంటే వారు ప్రస్తుతం ఏ స్థితిలో వున్నారో వారికే స్పష్టంగా తెలియదు మరి!   ఒకపక్క ఏపీ బీజేపీ నాయకులు టీడీపీతో అర్జెంటుగా తెగదెంపులు చేసుకోవాలని, వైసీపీతో స్నేహం చేసి వచ్చే ఎన్నికలలో అద్భుతమైన విజయాలు సాధించాలని తహతహలాడుతున్నారు. ఏపీకి కేంద్రం నుంచి రావలసిన నిధులకు బ్రేక్ వేసేపనిని విజయవంతంగా పూర్తి చేశారు. మరోవైపు రాయలసీమలో ఏపీ రెండో రాజధానిని ఏర్పాటు చేయాలంటూ నిప్పుల కుంపటిని రగిల్చారు. ఇంకోవైపు ప్రభుత్వంలోనే వుంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు... ఒకపక్క ఇవన్నీ చేస్తూనే మరోపక్క అధికారంలో భాగస్వామ్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి మిత్రుడు శత్రువుకు కూడా వుండకూడదని అనిపించేలా వ్యవహరిస్తున్నారు. అన్నీ చేస్తున్నారుగానీ, టీడీపీ ప్రభుత్వం నుంచి బయటకి వచ్చే సాహసం మాత్రం చేయడం లేదు.   వీళ్ళ వ్యవహార శైలి ఇలా వుంటే టీడీపీ నాయకుల వ్యవహార శైలి మరోలా వుంది. కేంద్రంలో వున్న బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. రాష్ట్రంలో వున్న బీజేపీ నాయకుల నుంచి తిట్లు, శాపనార్థాలు తింటూనే వున్నారు. వైసీపీ, బీజేపీల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న స్నేహబంధాన్ని గమనిస్తూనే వున్నారు. అయినప్పటికీ కేంద్రంలో వున్న రెండు మంత్రిపదవులను వదలడానికి మాత్రం మీన మేషాలు లెక్కపెడుతున్నారు. ఏపీ ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీల ధోరణిని జాగ్రత్తగా గమనిస్తున్నారు.
బంధం నిలబడాలన్నా.. సమస్యల నుంచి బయటపడాలన్నా.. మీ సత్తా ఏంటో మీకు తెలియలన్నా చిన్న మెచ్చుకోలు చాలు అని చెప్పే ఓ టీచర్ కథ. ఎప్పుడు మీపై మీకు అపనమ్మకం కలిగినా ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=usBw5K-4DoQ    
  మిరపకాయలకి.. ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటీ..? పండు మిరపకాయల వల్ల ఆయుష్సు పెరుగుతుందట. వెర్మంట్ యూనివర్శిటీ పరిశోధనలో ఏం తేలింది..? https://www.youtube.com/watch?v=fShjOnYEoKs
    టైమ్ లేదనో బద్దకించో బ్రేక్ ఫాస్ట్‌ని మిస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్‌ని మిస్ చేసుకోకూడదట. నిపుణులు అలా ఎందుకు చెబుతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=VxL3LfFOUWM