LATEST NEWS
  తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే  కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఓ మండల అధ్యక్షుడిని టార్గెట్ చేసి వరుస వాట్సాప్ స్టేటస్‌లు పెట్టి విమర్శలు గుప్పించారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి?  పేకాట క్లబ్ కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్‌కా? పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే ...నువ్వు నిజంగా రాయల్...అంటూ రాసుకొచ్చారు కొలికపూడి.  విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును ఉద్దేశించి ఈ స్టేటస్‌లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాయల సుబ్బారావు చాలా కాలంగా పేకాట ఆడిస్తున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించినట్లు తెలుస్తోంది.  రాయల సుబ్బారావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గమని ప్రచారం జరుగుతోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ల పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు.  
  పందెం కోళ్ల కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బినామీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారు? ఇవన్నీ నాకు తెల్వదా? ఆడపిల్ల కదా అని లైట్ తీసుకుంటున్నారేమో ఒక్కొక్కడి తోలు తీస్తాని కవిత హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.  తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసులో తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తుందని నన్ను అంటున్నారు. అలా మాట్లాడే గుంటనక్కలకు చెప్తున్నా. నా మీద అనవసరమైన  దాడి చేస్తే మీ చిట్టా మోత్తం విప్పుతాని కవిత అన్నారు.  జనం బాటలో ప్రజల మధ్య తిరుగుతుంటే మీ అవినీతి,అక్రమాలు అన్నీ బయటికి వస్తున్నాయి. ఇది జస్ట్ టాస్ మాత్రమే. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఏదో ఒక రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అవినీతిపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. నాకు సమయం వస్తుంది. ఏదో ఒకరోజు సీఎం అవుతాను...2014 నుంచి ఇప్పుటి వరకు రాష్ట్రంలో జరిగిన స్కామ్‌లపై చర్యలు తీసుకుంటానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కరం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు
  తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి  ఘన విజయం సాధించారు. సూర్యపేట జిల్లా  తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామం పంచాయతీ నుంచి సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. హోరాహోరీ పోరులో ప్రత్యర్థి మీద విజయం సాధించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి, సర్పంచ్ గా గెలిచిన 95 ఏండ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డిని బీఆర్ఎస్  అధినేత కేసీఆర్ అభినందించారు.  100 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక పెద్ద మనిషి నేటి యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం, ఎన్నికల బరిలో నిలవడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలవడం, అనేది ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయం అని కేసీఆర్ అన్నారు.   సంతోషం వ్యక్తం చేస్తూ,ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్ర రెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను,  మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలను, నాయకులను అధినేత కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని అధినేత అభిలషించారు. మొదటి విడత ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచి స్థానాల్లో గెలుపు పోందారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో హస్తం పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 1,146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. బీజేపీ మద్దతుదారులు రెండువందల లోపు స్థానాలకు పరిమితమైంది.తొలివిడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 3,834 సర్పంచి, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 84.28 శాతం ఓటింగ్‌ నమోదైంది
  తాజాగా కోటి  సంత‌కాల సేక‌ర‌ణ  చేసింది వైసీపీ. జ‌గ‌న్ పాల‌నికిదో రెఫ‌రెండంగానూ చెప్పుకొస్తున్నారు భూమ‌న‌, రోజా వంటి వైసీపీ  జ‌గ‌జ్జంత్రీలు. ఇదంతా ఇలా ఉంటే  ఈ పైపై మెరుగుల‌కు మోస  పోని... జ‌గ‌న్ లోలోప‌ల ఒక భారీ స‌ర్వే చేయించార‌ట‌. ఈ స‌ర్వేలో 18 నెల‌ల కూట‌మిపాల‌న ఎలా ఉందో ఒక తుల‌నాత్మ‌క ప‌రిశీల‌న చేయించార‌ట‌. ఈ ప‌రిశీల‌న‌లో తేలిన వాస్త‌వాలేంటో చూస్తే..  గ‌తంలో క‌న్నా ఎంతో మెరుగ్గా  కూట‌మి  పాల‌న ఉన్న‌ట్టు చెప్పార‌ట ఈ స‌ర్వేలో పాల్గొన్న ప్ర‌జ‌లు. త‌మ‌కు అన్నీ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని.. ఫించ‌న్లు స్వ‌యంగా బాబే ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మ‌నీ.. గూగుల్ వంటి సంస్థ‌లు రావ‌డంతో పాటు.. ఇటీవ‌ల పార్ట‌న‌ర్ స‌మ్మిట్ ద్వారా 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఒప్పందాలు జ‌రిగాయ‌ని.. ఇక సంక్షేమ‌ప‌థ‌కాలు కూడా పెద్ద ఎత్తున జ‌నానికి చేరుతున్నాయ‌నీ చెప్పార‌ట‌. మ‌రి  ప‌వ‌న్ క‌ళ్యాణ్ 15 ఏళ్ల పాటు ఈ కూట‌మి క‌లిసి  ఉండాల‌ని కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయ‌మేంట‌ని అడ‌గ్గా.. అలా ఉంటేనే రాజ‌ధానిపూర్త‌వుతుంది. పోల‌వ‌రం కూడా  కంప్లీట్ అవుతుంది. ఆపై కేంద్ర‌ప్ర‌భుత్వంతో ఉన్న  స‌ఖ్య‌త కార‌ణంగా ఇంకా ఎన్నో మంచి ప‌నులు జ‌రుగుతాయి కాబ‌ట్టి.. మాకీ ప్ర‌భుత్వ‌మే బాగుంద‌ని అన్నారట ఆంధ్ర‌ప్ర‌జ‌లు. ఇక చంద్ర‌బాబు అపార‌ అనుభ‌వం, లోకేష్ యువ‌నాయ‌క‌త్వం, ప‌వ‌న్ పాపులారిటీ కూట‌మి ప్ర‌భుత్వానికి పెట్ట‌ని కోట‌లుగా మారి.. ఏపీని సంక్షేమాబివృద్ధి దిశ‌గా  ప‌రుగులు తీయిస్తున్న‌ట్టుగానూ చెప్పుకొచ్చార‌ట స‌ర్వేలో పాల్గొన్న ప్ర‌జ‌లు. దీంతో జ‌గ‌న్ కి దిమ్మ తిరిగి భ‌విష్య‌త్ బొమ్మ క‌నిపించింద‌ట‌. ఆయ‌న అధికార‌పు ఆశ‌ల‌పై ఫ్రిడ్జ్ లోంచి బ‌య‌టకు తీసిన చ‌ల్ల చ‌ల్ల‌ని నీళ్లు కుమ్మ‌రించిన‌ట్ట‌య్యింద‌ట‌. బేసిగ్గా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏం భావించాడో చూస్తే.. ఆయ‌న‌కు ఉన్న 40 శాతం ఓటు బ్యాంకుకు కూట‌మి  వ్య‌తిరేఖ‌త ద్వారా మ‌రో 8 శాతం ఓటు బ్యాంకు త‌న పార్టీకి క‌లిసి  వ‌స్తుంది. కాబ‌ట్టి, సుమారు 50 శాతం ఓట్ల‌తో తాను 2029లో గెల‌వ‌బోతున్న‌ట్టుగా ఫీల‌య్యేవార‌ట ఇన్నాళ్లూ. ఇప్పుడా ఫీలింగ్స్ మొత్తం బూడిద‌లో పోసిన‌ట్టే అయ్యింద‌ట‌. ఆ స‌ర్వే ఫ‌లితాలు అలా అఘోరించాయ‌ట‌. ఇలా ఎందుకు జ‌రిగిందో కూపీ లాగిన  జ‌గ‌న్ కి న‌మ్మ‌లేని నిజాలెన్నో బ‌య‌ట ప‌డ్డాయ‌ట‌. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ మైండ్ సెట్లో ఆల్రెడీ ఉన్న హింసాత్మ‌క ప్ర‌వృత్తికి ర‌ప్పా ర‌ప్పా ఫ్లెక్సీల మోత కూడా తోడ‌య్యింద‌ట‌. అంతే  కాదు కొంద‌రు ఫ్యాను పార్టీ  మ‌ద్ద‌తు దారులు కౌంటింగ్ మొద‌ల‌య్యి ఫ‌లితాలు త‌మ  వైపున‌కు తిరుగుతున్నాయ‌ని తెలిసిన వెంట‌నే న‌*కుడు మొద‌ల‌వుతుంద‌ని చేస్తోన్న హెచ్చ‌రిక‌లు సైతం ఆయ‌న‌కు చేటు తెస్తున్న‌ట్టు బ‌య‌ట ప‌డింద‌ట‌.
కడప కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో  పాక సురేష్ వినా మరెవరూ పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.   గత ఎన్నికల్లో మేయర్ గా గెలిచిన సురేష్ బాబు కుటుంబ సభ్యులు మున్సిపల్ చట్టాలను అతిక్రమించి పనులు చేపట్టారనే‌ కారణంగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు  నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు  కాంట్రాక్టులు పొందారని తేలింది. విజిలెన్స్ నివేదికను అనుసరించి సురేష్ బాబును ఈ ఏడాది సెప్టెంబర్ 23న మేయర్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. డిప్యూటీ మేయర్ గా ఉన్న ముంతాజ్ బేగంను ఇన్ చార్జి మేయర్ గా నియమించింది.  తాజాగా ఖాళీగా ఉన్న మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో వైసీపీ కార్పొరేటర్  పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  కడప కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్ లు ఉండగా గత ఎన్నికల్లో  టిడిపి నుంచి  ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలుపొందారు. ఒక ఇండిపెండెంట్ గిలిచారు. ఈ రెండూ మినహా మిగిలిన 48 డివిజన్ లలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు.  అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మార డం, కడప ఎమ్మెల్యేగా టిడిపి నుంచి మాధవీ రెడ్డి గెలవడం జరిగింది .ఆ తర్వాత ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశంలో  చేరారు. ఇద్దరు వైసీపీ కార్పొరేటర్ లు మరణించారు. దీంతో దీంతో వైసిపి కార్పొరేటర్ల సంఖ్య సంఖ్య 38గా ఉంది. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వైసిపి అనుకూలంగా ఉండటంతో వారి సంఖ్య 39 . ఆ కడప కార్పొరేషన్ లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ  ఉంది.  సంఖ్యా బలం లేకపోవడంతో  గురువారం (డిసెంబర్ 11) జరిగిన మేయర్ ఎన్నికలో తెలుగుదేశం పోటీ చేయలేదు.  వైసీపీ నుండి   47 వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేస్ ను మేయర్  అభ్యర్థి పోటీకి దిగి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా గెలుపొందారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది.  
ALSO ON TELUGUONE N E W S
  మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకరంటే ఒకరు ప్రేమగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ అన్నదమ్ముల అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.   చిరంజీవి అప్ కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పవన్ కళ్యాణ్ నుండి రానున్న నెక్స్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని 2026 వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.     Also Read: 'అఖండ 2' ఫస్ట్ డే కలెక్షన్స్.. అఖండకు రెట్టింపు..!   'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ 'దేఖ్ లేంగే సాలా' డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్ ని రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అదే టైంలో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ టీమ్ భారీ ప్రెస్ మీట్ ని ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.     డిసెంబర్ 13 సాయంత్రం 5:30 కి గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు తాజాగా ప్రకటించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మూవీ సాంగ్ లాంచ్ ఉండగా.. చిరంజీవి మూవీ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండటం ఏంటనేది అభిమానులకు అర్థం కావట్లేదు.    'ఉస్తాద్ భగత్ సింగ్' సాంగ్ లాంచ్ గురించి అవగాహన లేక 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారా? లేదా తెలిసే ఇలా చేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది.  
  'అఖండ 2: తాండవం'తో తాజాగా నందమూరి బాలకృష్ణ థియేటర్లలో అడుగుపెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ నిర్మించిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది. (Akhanda 2: Thaandavam)   2021లో విడుదలైన 'అఖండ' కరోనా పాండమిక్ టైంలో తక్కువ టికెట్ ధరలతో విడుదలైంది. అయినప్పటికీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ఫుల్ రన్ లో రూ.150 కోట్ల గ్రాస్ తో ఘన విజయం సాధించింది.   Also Read: 'అఖండ-2'లో శివుడిగా మెప్పించిన నటుడు ఎవరో తెలుసా?   'అఖండ'కి సీక్వెల్ గా 'అఖండ 2' రూపొందింది. అసలే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటంతో.. బుకింగ్స్ కి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. ఒక్క బుక్ మై షోలోనే గంటకు 20 వేల రేంజ్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.60-70 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవి అఖండ మొదటి భాగానికి రెట్టింపు ఓపెనింగ్స్ కావడం విశేషం.   ఫస్ట్ వీకెండ్ లోనే 'అఖండ 2' రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందనే అంచనాలున్నాయి. అంటే 'అఖండ' ఫుల్ రన్ కలెక్షన్స్ ని మొదటి వీకెండ్ లోనే సీక్వెల్ క్రాస్ చేయనుందన్నమాట.     
Akhanda 2 starring God of Masses Nandamuri Balakrishna, Samyuktha, Harshaali Malhotra, Aadhi Pinisetty released after an unforeseen delay last night, with special premieres. The producers Raam Achanta and Gopi Achanta have addressed press about the movie release and the box office collections.  They have apologised to NBK and his fans for the delay due to the uncontrollable circumstances. They announced that the movie has collected Rs.10 crores from special premieres on 11th December. They have remarked that this is huge for any senior hero film and they are thankful to Balayya, for giving such a golden opportunity.  They have stated that the film is gaining good positive word of mouth and they are happy with the response. Director Boyapati Sreenu did not come to press meet but makers stated that he is happy with the response and soon, the team will address press in a success meet, looking at the good response.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'అఖండ 2: తాండవం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లన్నీ శివాలయాలను తలపిస్తున్నాయి. అఖండగా బాలయ్య చేసిన తాండవానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. (Akhanda 2: Thaandavam)   'అఖండ 2' విడుదలకు కొద్దిరోజుల ముందు నుంచి.. ఇందులో శివుడి పాత్ర గురించి చర్చ జరిగింది. టెక్నాలజీని ఉపయోగించి సీనియర్ ఎన్టీఆర్ ని శివుడిగా చూపిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదని తేలిపోయింది. శివుని పాత్రలో ఒక ప్రముఖ నటుడు దర్శనమిచ్చాడు.   'అఖండ 2' చిత్రంలో శివుడిగా బాలీవుడ్ యాక్టర్ తరుణ్ ఖన్నా నటించాడు. వెండితెరపైనా, బుల్లితెరపైనా నటుడిగా తనదైన గుర్తింపు పొందిన తరుణ్ ఖన్నా.. పౌరాణిక పాత్రలతో ప్రత్యేక పేరుని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా టీవీ సిరీస్ లలో శివుడి పాత్రలకు పెట్టింది పేరు అన్నట్టుగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.   2015లో ప్రసారమైన 'సంతోషి మా'లో శివుడిగా మెప్పించిన తరుణ్ ఖన్నా.. ఆ తర్వాత దాదాపు పది టీవీ సిరీస్ లలో శివ పాత్రలో కనువిందు చేశాడు. శివుడిగా హిందీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తరుణ్ ఖన్నా.. ఇప్పుడు అఖండ-2లో మరోసారి శివ పాత్రలో నటించి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.  
  సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. సినీ సెలబ్రిటీల AI వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వాటిలో పాజిటివ్ గా ఉండే వీడియోలు కొన్నయితే.. సెలబ్రిటీల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉండే నెగెటివ్ వీడియోలు ఎన్నో. అందుకే వీటిపై పలువురు సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. (Pawan Kalyan)   ఇప్పటికే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా చేరారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.    పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొందరు AI వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయాన్ని పవన్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. AI వీడియోలను చూసిన న్యాయమూర్తి.. ఆ లింక్‌లను 48 గంటల్లోపు అందించాలని సూచించారు.    అలాగే, వాటిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర సోషల్ మీడియా  ప్లాట్ ఫామ్ లకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేశారు.  
      -కాంబో హిట్ అందుకుందా! -ఫ్యాన్స్ ఏమంటున్నారు -అఖండ 2 పరిస్థితి ఏంటి?     తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై బాలకృష్ణ(Balakrishna),బోయపాటి శ్రీను(Boyapati Srinu)కాంబోకి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆ ఇద్దరి నుంచి మూవీ వస్తుందంటే అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రమే కాదు అంచనాలు హై వోల్టేజ్ ట్రాన్స్ ఫార్మ్ రేంజ్ లో ఉంటాయి. అందుకే ఆ ఇద్దరి చిత్రం గత కాంబోలో వచ్చిన చిత్రాలని మించి ఉండటం కంపల్ సరి. అంచనాలని ఏ మాత్రం అందుకోలేకపోయినా ఫలితంలో తేడా వస్తుంది. అంతలా ఆ ఇద్దరే సెట్ చేసుకున్నారు. సింహ, లెజండ్, అఖండ వంటి చిత్రాలే  ఉదాహరణ. ఇప్పుడు ఆ క్రేజ్ ని పాన్ ఇండియా వ్యాప్తంగా పెంచుకునేలా తమ కొత్త చిత్రం  అఖండ 2 తో  థియేటర్స్ లో అడుగుపెట్టారు. నిన్న ప్రీమియర్స్  కూడా ప్రదర్శించడంతో ఇప్పటికే అఖండ 2 టాక్ బయటకి వచ్చేసింది.     ఇక మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు  బాలయ్య, బోయపాటి కాంబో పై ఎలాంటి అంచనాలు అయితే పెట్టుకొని థియేటర్ కి వెళ్ళామో అలాగే ఉంది.  అంతకు మించి అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెల్యులాయిడ్ పై ఆ కాంబో ఒక కొత్త వండర్ ని క్రియేట్ చెయ్యడంతో పాటు కొత్త జోనర్ ని కూడా ఇండియన్ సినిమాకి పరిచయం చేసింది. ఆ కాంబోలో వచ్చిన గత చిత్రాలని మించి ఎక్కడ తగ్గకుండా అఖండ 2 బాగుంది. పైగా గత చిత్రాల నుంచి  ఈ సారి పాన్ ఇండియా స్థాయిలో అత్యంత క్వాలిటీ తో తెరకెక్కించారు. అఖండ 2 తో మరో సారి బాలయ్య, బోయపాటి  తమ కాంబో రేంజ్ ని మరింతగా పెంచుకున్నారు. తదుపరి చిత్రం అఖండ 2 ని మించి తెరకెక్కించాలని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.        Also read:  అఖండ 2 లో ప్రధాన హైలెట్స్ ఇవే.. అందుకే ఇంకోసారి చూస్తామంటున్నారు   ఇక  ఎక్కువ శాతం రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తుండటంతో ఇప్పుడు అఖండ 2 సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.   
    -అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు!  -పాజిటివ్ టాక్  -ఆ హైలెట్ సీన్స్ లో పర్పస్ ఏంటి!       ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ మొత్తం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)'అఖండ 2'(Akhanda 2)తో చేస్తున్న రుద్రతాండవంతో ఊగిపోతున్నాయి. నైట్ ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ రావడంతో థియేటర్స్ అన్నిహెవీ క్రౌడ్ తో రన్ అవుతున్నాయి. మూవీ చేసిన అభిమానులు,ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మూవీలోని కొన్ని సీన్స్  చాల బాగున్నాయి. సదరు సన్నివేశాలు మూవీ మొత్తానికే హైలెట్ కావడంతో పాటు గూస్ బంప్స్ కూడా వచ్చాయి. ఆ అనుభూతి కోసం ఇంకోసారి మూవీకి వెళ్తామని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి  వాళ్ళు చెప్తున్న సీన్స్ ఏంటో చూద్దాం.     శివుడ్ని మరింతగా ప్రసన్నం చేసుకోవడానికి అఖండ కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండి ఆపదలో ఉన్న జనని దగ్గరకి వెళ్లి శత్రువులతో పోరాడే సన్నివేశం. పరమేశ్వరుడు అఖండ రూపంలో వెళ్ళి అఖండ తల్లి దహన సంస్కారాలు చేయడం. ఈ సందర్భంగా అఖండ తల్లి ఆత్మ, శివుడి మధ్య జరిగే మాటలు. కుంభమేళా సీన్స్, ఆది పినిశెట్టి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అఖండ, ఆది పినిశెట్టి పై వచ్చే యాక్షన్ సీక్వెన్స్, గుడి గురించి, హైందవ ధర్మం గురించి బాలకృష్ణ చెప్పే మాటలు, క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ,బాలయ్య, శివుడు తమ తమ ప్రదేశాల్లో ఒకే సారి తాండవం చేసే సన్నివేశం. విఎఫ్ఎక్స్ వర్క్, అఖండ యాక్షన్ ఎపిసోడ్స్ కి థమన్ ఇచ్చిన బిజిఎం. అఖండ గా బాలయ్య నటన ప్రధాన హైలెట్ గా నిలిచాయని అంటున్నారు.      also read:    అఖండ 2 మూవీ రివ్యూ        ఇక  ఎక్కువ శాతం రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తుండటంతో ఇప్పుడు అఖండ 2 సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. 
Cast: Nandamuri Balakrishna, Samyuktha Menon, Aadi Pinisetty, Harshaali Malhotra, Kabir Duhan Singh, Saswata Chatterjee, Poorna Crew:  Cinematography by C. Ramprasad, Santosh Detake Music by S Thaman Edited by Tammiraju Written & Directed by Boyapati Sreenu Produced by Ram Achanta, Gopi Achanta, Ishan Saksena Akhanda 2 is releasing after many hurdles and the makers are confident about delivering a huge blockbuster as it marks the fourth collaboration of NBK and Boyapati Sreenu. Akhanda has started the blockbuster streak of NBK and the sequel has become most anticipated films in recent times. With huge anticipation and after overcoming financial issues, the movie released on 12th December, with previous night previews. Let's discuss about the film in detail.  Plot:  After Galwan Attacks, a Chinese Army Official (Sangay Tsheltrim), who lost his son, decides to attack India in a bio-war and targets even belief in God. So, they decide to pollute River Ganga water with a deadly virus, during Maha Kumbha Mela. MLA Murali Krishna (Balakrishna)'s daughter Janani (Harshaali Malhotra), who became youngest scientist at DRDO, decides to use her knowledge of developing vaccine for armed forces to sustain against rough weather on borders to develop antidote for the virus. She is encouraged to do so by her higher official (Samyuktha Menon).  Chinese Army uses powerful politician Aditya Thakur (Kabir Duhan Singh) as their mole in India and after mixing virus in Ganga, he starts spreading hatred against Lord Shiva. Entire country starts to lose their belief on God and shut the temples. Akhanda Aghora (Nandamuri Balakrishna) has to enter into the scene to restore the belief on God among public. He has to save Janani from the anti-Indian forces and the army of devil Tantric (Aadhi Pinisetty), who has a personal vendetta against Akhanda. How will he achieve all this as a single-man army? Watch the movie to know more.  Analysis:  Nandamuri Balakrishna delivers yet again what fans hope to see from him. His performance as Akhanda is the major highlight of the film. You cannot imagine someone else in Akhanda character. He even carries Murali Krishna role well. There are many dialogues that relate to present AP drug spread and as an MLA, him talking about children welfare is appreciable. Also, his dialogues explaining Hindu Sanatana Dharma and Indian Vedas greatness, about Shiva are appreciable, too.  Thaman's Background Score had more work than his songs but Jajikaya song will be a huge hit with B and C centre audiences. The interval episode works well as Boyapati Sreenu is able to elevate and present NBK in his usual powerful style. It will give goosebumps to fans of their combination and NBK. Also, the movie pre-climax and climax episodes work well with parallels to Lord Shiva. A sentimental scene between Lord Shiva and Akhanda's mother is beautiful written.  Harshaali Malhotra's performance as Janani works well but Samyuktha's role feels a bit dragged in the first hour. Boyapati Sreenu is known for his action sequences and he does deliver on that front in a perfect manner. He knows the strengths of Balakrishna and how to elevate the character with him at the centre. He delivered what people expect from their combination in a big way. He uses Lord Shiva's trident and Lord Hanuman's mace in most creative manner.  Aadhi Pinisetty role as an antagonist works as an extended cameo and he performs really well. His role challenges Akhanda to the core and NBK roars in these portions really well. On the down side, the sequences work but the story is wafer thin. Still, Boyapati Sreenu packages it with devotional and mass elements throughout. 14 Reels Plus, the producers did not back out from spending appropriately. VFX work is also good and Boyapati used them very cleverly.   Cinematography at places could have been better with even sharper editing but action sequences give that high moments. It is hard to maintain keep things engaging with single costume to hero and single emotion, but NBK-Boya combination achieves it.  Overall, movie entertains audiences with exactly what we have grown to expect and anticipate from NBK and Boyapati Sreenu combination. The movie does ask you to believe in God and if you do not, it feels like a too much of a drag at places. In short, the film is not for people who do not believe in God and also, those who need strong LOGICS. The movie is a pure action entertainer and an NBK-Boya film that delivers on its promise.  Bottomline:  An NBK-Boyapati combination film that targets masses and delivers exactly that. Stay away if you cannot overlook Logics and don't believe in GOD.   Rating: 3/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
    సినిమా పేరు: అఖండ 2 తారాగణం: బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, కబీర్ సింగ్, హర్షాలీ మల్హోత్రా ఛటర్జీ   తదితరులు  ఎడిటర్: తమ్మిరాజు  మ్యూజిక్: థమన్  రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను  సినిమాటోగ్రాఫర్: రామ్ ప్రసాద్, సంతోష్ దేటకే బ్యానర్స్: 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్, ఐవివై ఎంటర్ టైన్ మెంట్   నిర్మాతలు:రామ్ ఆచంట, గోపి ఆచంట, ఇషాన్ సక్సేనా  సమర్పణ: తేజస్విని నందమూరి   విడుదల తేదీ: డిసెంబర్ 12, 2025      అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య వన్ మాన్ షో 'అఖండ 2 ' ఈ రోజు ప్రీమియర్స్ తో థియేటర్స్ లో అడుగుపెట్టింది.  బాలయ్య, బోయపాటి కాంబో కావడంతో పాటు బాలయ్య పాన్ ఇండియా రేంజ్ లో అడుగుపెట్టడంతో  అంచనాలు హై రేంజ్ లో ఏర్పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.     కథ అఖండ(అఘోర బాలకృష్ణ) శివుడికి మరింత దగ్గరగా ఉండటం కోసం హిమాలయాల్లో కఠిన తరమైన నిబంధనలో ఉంటాడు. రెండు పొరుగు దేశాల ఆర్మీ అధినేతలైన జనరల్స్  (శాశ్వత ఛటర్జీ, సంగై షెల్టరీమ్) భారత దేశ ప్రజల్లో ఉన్న ఒక నమ్మకాన్ని దెబ్బ కొట్టడానికి నిర్ణయించుకుంటారు. మరో వైపు భారత దేశ ప్రధాన మంత్రి ఆదిత్య రావు భగత్ ని పదవి నుంచి దింపడానికి అజిత్ ఠాకూర్(కబీర్ సింగ్) ప్రయత్నిస్తుంటాడు. క్షుద్రశక్తులు నింపుకొని ఉన్న అతీంద్రియ శక్తి  పిశాచి(ఆది పినిశెట్టి) అందుకు అండగా ఉంటాడు. మరో వైపు జనని ( హర్షాలీ మల్హోత్రా)  ప్రపంచాన్ని కాపాడానికి ఒక వ్యాక్సిన్ తయారుచేస్తుంది. దీంతో జనని ప్రాణాలని ప్రమాదం ఏర్పడుతుంది. వేరే దేశానికి చెందిన ఆర్మీ అధినేతలు భారత దేశ ప్రజల ఏ నమ్మకాన్ని దెబ్బకొట్టాలని అనుకున్నారు? అందుకు వాళ్ళు చేసిన కుట్ర ఏంటి?  జనని వ్యాక్సిన్ ఏ పర్పస్ కోసం తయారు చేసింది? ఆదిత్య రావు భగత్ ని ప్రధాన మంత్రి  పదవి నుంచి దించడానికి  అజిత్ ఠాకూర్ ప్రయత్నాలు ఫలించాయా? అందుకు పిశాచి అండగా ఉంటానికి కారణం ఏమైనా ఉందా?  ఈ సమస్యలన్ని హిమాలయాలయాల్లో ఉన్న అఖండ దృష్టికి వచ్చాయా? వస్తే వాటికి  అఖండ చూపించిన పరిష్కారం ఏంటి? మరి ఈ కథలో బాలకృష్ణ పోషించిన మురళి కృష్ణ క్యారక్టర్ ఏంటి? అసలు అఖండ మార్గం ఏంటనేదే అఖండ 2 చిత్ర కథ.    ఎనాలసిస్    మేకర్స్ చాలా తెలివిగా మూవీ ప్రారంభమే అఖండ మొదటి పార్ట్ లోని ప్రధానమైన కథని  ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపించారు. దీంతో పారవశ్యంతో  పార్ట్ 2లోకి లీనమైపోతాం. అందుకు తగ్గట్టే మూవీ మొదటి నుంచి చివరి వరకు మంచి టెంపోతోనే నడిచింది. ప్రతి సీన్ ఎంతో రిచ్ గా ఒక మంచి పర్పస్ తోనే వచ్చాయి. మురళి కృష్ణ క్యారక్టర్ తో ఏపీకి సంబంధించి చెప్పించిన డైలాగ్ బాగున్నాయి.     అసలు ఒకే కాస్ట్యూమ్ తో ప్రేక్షకులని సినిమా మొత్తం కూర్చోబెట్టడం అంటే అది బాలయ్య, బోయపాటి కే సాధ్యమైంది.వేరే వాళ్ళు కూడా  బాలయ్య ని పెట్టి ఈ లెవల్లో తెరకెక్కించలేరు. కాకపోతే సన్నివేశాల్లోని డైలాగ్స్ మరింతగా మెప్పించి ఉండాల్సింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం ప్రాణంగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అఖండ ఎంట్రీ సీన్స్ తో పాటు అందుకు పారలల్ గా వచ్చిన సన్నివేశాలతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ కలిగింది.     ఇండియాపై ద్వేషం ఉన్న జనరల్ కి మరో జనరల్ ఇండియా గొప్పతనం ఎక్కడ ఉందని చెప్పే సీన్స్ తో పాటు ఆ ఇద్దరు ఏం చెయ్యబోతున్నారనే ఉత్కంఠత బాగానే పేలింది. కుంభమేళాలో వచ్చిన సీన్స్ కూడా బాగున్నాయి. సంయుక్త మీనన్,బాలకృష్ణ పోషించిన రెండో క్యారక్టర్ మురళి కృష్ణ పై వచ్చిన మందు సీన్ హైలెట్. ఈ సీన్ ని ఇంకాస్త పెంచి ఎంటర్ టైన్ మెంట్ ని జోడించాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో మూవీ స్వరూపం మొత్తం మారిపోయింది.     పూర్తిగా అఖండ వన్ మాన్ షో అని చెప్పవచ్చు. ప్రతి సీన్ తో పాటు ప్రతి డైలాగ్ ఎంతో ఆసక్తిని కలిగించాయి. పిశాచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సూపర్ గా పేలడంతో పాటు సెల్యులాయిడ్ పై మరో ప్రపంచం ప్రత్యక్షమైంది. శివుడి రాక, ఆ సందర్భంగా శివుడు చెప్పే  చెప్పే డైలాగ్స్ మరో లెవెల్. అఖండ పోరాటాలు, అంతిమంగా మానవాళికి దేవుడి గురించి చెప్పే మాటలు కూడా ఎంతో మందిని ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ప్రధాన బలంగా నిలిచింది. బాలకృష్ణ చేసిన శివ తాండవం, కైలాసంలో శివుడు చేసే తాండవం  ప్రధాన హైలెట్. విఎఫ్ఎక్స్ వర్క్ ని కూడా ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంత వరకు వాడుకున్నారు.        నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు   అఘోర, మురళి కృష్ణ అనే రెండు డిఫరెంట్ క్యారక్టర్ లలో బాలయ్య నటన మరోసారి  నభూతో న భవిష్యత్తు అనే రీతిలో కొనసాగింది. ముఖ్యంగా శివస్తుతుడైన అఘోర గా బాలయ్య నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన క్యారక్టర్ యొక్క ఔచిత్యం మొత్తాన్ని తన కళ్ల ద్వారానే చెప్పాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు తనలో లీనమయ్యేలా బాలయ్య నటప్రస్థానం కొనసాగింది. ఎన్నో కష్టతరమైన సీన్స్ ని అవలీలగా చేసి మరోసారి తనకి తానే సాటి అనిపించాడు. మురళి కృష క్యారక్టర్ లో కూడా ఎంతో హుషారుగా చెయ్యడంతో పాటు డాన్స్ ల్లో కూడా తన స్టామినా తగ్గలేదని చాటి చెప్పాడు. బాలకృష్ణ కూతురుగా జనని క్యారక్టర్ లో చేసిన హర్షాలీ మల్హోత్రా  క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఆమెకి మరిన్ని తెలుగు సినిమాల్లో ఆఫర్స్ రావడం గ్యారంటీ. సంయుక్త మీనన్ మరో సారి తన నాచురల్ నటనతో కట్టిపడేసింది. పిశాచి గా చేసిన ఆది పినిశెట్టి అద్భుతమైన పెర్ ఫార్మెన్సు తో మెప్పించడమే కాదు భయబ్రాంతులకి కూడా గురి చేసాడు. అఖండ 2 తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలబడిపోతుందని చెప్పవచ్చు .కబీర్ దుహన్ సింగ్ , శాశ్వత  ఛటర్జీ, సంగై షెల్టరీమ్ లు కూడా తమదైన విలనిజంతో మెప్పించారు.ఇక థమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో  థియేటర్స్ లోని ప్రేక్షకుల చేత  శివతాండవం చేయించాడు. ముఖ్యంగా అఘోర క్యారక్టర్ కి ఇచ్చిన బిజీఎం గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. అఘోర క్యారక్టర్ కోసం బిజిఎం పుట్టిందా. బిజిఎం కోసం అఘోర క్యారక్టర్ పుట్టిందా అనే రీతిలో కొనసాగింది. దీన్ని బట్టి థమన్ అఖండ 2 కోసం ఎంత శివతత్వాన్ని నింపుకొని పని చేసాడో అర్ధం చేసుకోవచ్చు. 14 ప్లస్ నిర్మాణవిలువలు కూడా ఎంతో రిచ్ గా ఉన్నాయి. అఖండ 2 తో వాళ్ళ జన్మ ధన్యమైనట్టుగా కూడా భావించవచ్చు . ఫొటోగ్రఫీ కూడా మరో ప్రాణంగా నిలిచింది.   ఫైనల్ గా చెప్పాలంటే బాలయ్య, బోయపాటి కాంబో ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారో అదే విధంగా అఖండ 2 ఉంది. కాకపోతే లాజిక్ లు వెతకకూడదు. నాస్థికులు దూరంగా ఉంటే బెస్ట్. ఎందుకంటే అఖండ 2 దేవుడిని నమ్మే వాళ్ళది. అంతకంటే ముఖ్యంగా శివ భక్తులది. పెట్టిన డబ్బులకి పూర్తి సంతృప్తి మాత్రం ఖాయం.     Rating 3/5                                                                                                                                                                                           అరుణా చలం   
Ram Charan’s Peddi makers have confirmed that the film is strictly adhering to its planned pan-India theatrical schedule. This announcement follows the start of a new, crucial shooting schedule in Hyderabad, followed by another one in Delhi. With these schedules talkie part to be wrapped up entirely by the end of January. The film, directed by Buchi Babu Sana, is being mounted on a massive scale by producer Venkata Satish Kilaru. Despite the extensive scope of the rural action entertainer, which includes key sequences to be filmed in Delhi, the production timeline remains firm. They firmly state that it will release for locked date. The project boasts an exemplary technical and supporting cast, which further fuels the high expectations. With Oscar-winning AR Rahman, renowned cinematographer R Rathnavelu, and National Award winner Navin Nooli on board, the movie is set to deliver an unparalleled viewing experience.  The casting of Janhvi Kapoor as the lead, alongside veterans like Shiva Rajkumar, Jagapathi Babu, and Divyendu Sharma, ensures a strong pan-Indian appeal, solidifying the March 27 release as one of the year's most anticipated events. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే అనే ఫీలింగ్ కలిగిస్తుంది.  వారి ప్రవర్తన,  వారి స్వభావం ఇవన్నీ పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా వచ్చేవే అయినా పుట్టిన నెలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు, సంఖ్యా శాస్త్ర నిపుణులు,  జ్యోతిష్కులు. ఇంతకీ డిసెంబర్ నెలలో ఫుట్టిన వారి స్వభావం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటే.. సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి నెలలో జన్మించిన వ్యక్తులు  వేర్వేరు స్వభావాలు కలిగి ఉంటారు.  అలాగే డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు కూడా ఇతర నెలల్లో పుట్టిన వ్యక్తులకు భిన్నంగా ఉంటుంది.   సంఖ్యాశాస్త్రం ప్రకారం డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారట.  వీరిది సహజమైన ఆకర్షణ అని, డబ్బు, హోదా, పలుకుబడి ద్వారా వచ్చే ఆకర్షణ కాదని సంఖ్యాశాస్ర్త నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు వారి ప్రవర్తన,  హావభావాలు, వారి మాట తీరుతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారట.  ఇతరుల నుండి మెప్పు పొందడం, ఇతరులతో ఆకట్టుకునేలా మాట్లాడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారు. డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఎమోషన్ పరంగా చాలా పీక్స్ లో ఉంటారట.  వీరు చాలా భావోద్వేగాలకు లోనవుతారు.  దీని వల్ల వారు చాలా సార్లు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇతరులతో సంబంధాల విషయంలోనూ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. మోసపోవడంలో కూడా డిసెంబర్ లో పుట్టిన వారు ఫస్ట్ అని చెప్పవచ్చు.  వీరు ఇతరులను చాలా తొందరగా నమ్మేస్తారు. అంతకు మించి వీరిది చాలా స్వచ్చమైన హృదయమట.  ఈ కారణంగా వీరు ఇతరుల విషయంలో  సులువుగా బోల్తా పడతారు.   డిసెంబర్ లో పుట్టిన వారితో ఎలాంటి సంకోచం లేకుండాస్నేహం చేయవచ్చట. ఎందుకుంటే ఈ నెలలో పుట్టిన వారు స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారట.  అలాగే నమ్మకమైన స్నేహితులుగా ఉంటారట. స్నేహం పట్ల పూర్తీ విధేయతతో ఉంటారట. కొందరు వ్యక్తుల చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ చాలా మెరుగ్గా ఉంటుంది. అలాంటి వారిలో డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు కూడా ఉంటారట.  వీరి చుట్టూ సానుకూల శక్తి ఉంటుందట.  ఈ కారణంగా వీరి చుట్టూ ఉండే వ్యక్తులకు మంచి జరుగుతుందని,  ఎవరికైనా మంచి సలహాలు, పరిష్కారాలు లభించి సమస్యలు కూడా దూరం అవుతాయని అంటారు. సలహాలు ఇవ్వడంలో డిసెంబర్ లో పుట్టిన వారు ది బెస్ట్ అని చెప్పవచ్చు. వీరు మంచి సలహా దారులు,  సమస్యను పరిష్కరించడానికి మంచి సలహాలు,  సరైన ప్రణాళిక ఇవ్వగలరట.కాకపోతే వీరిది చంచలమైన మనసు.. అలాగే వీరి స్వభావం కూడా మొండిగా ఉంటుంది. ఈ కారణంగా వీరు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.   ఇది డిసెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం. అందరూ ఇలానే ఉంటారని కాదు.. సంఖ్యా శాస్ర్తం ప్రకారం నిపుణులు పేర్కొన్న వివరాలే ఇవి.                                *రూపశ్రీ.
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి.  ఒకరు చాలా సీరియస్ గా భావిస్తే.. మరొకరు చాలా సులువుగా బంధాన్ని వదిలేస్తారు. మరీ ముఖ్యంగా మోసం చేయడం అనేది కొందరికి అలవాటుగా కూడా మారింది.  డబ్బు, వస్తువులు కోల్పోతే పోతే పోయాయని సర్థి చెప్పుకోవచ్చు. కానీ మనసుకు గాయం చేసి, నమ్మకాన్ని దెబ్బతీసి,  జీవితంలో ఆశల మీద నీళ్లు చల్లే పనులు చేసే మోసగాళ్లు ఉంటారు.  ఒకప్పుడు అమ్మాయిలు ఎక్కువగా మోసపోయేవారు. కానీ ఇప్పట్లో చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిలను మోసం చేస్తున్నారు.  మోసం చేసేముందు అమ్మాయిలు కొన్ని పనులు చేస్తారట. అవేంటో తెలుసుకుంటే ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైనా అలాంటి సంఘటనలు ఎదురైతే జాగ్రత్త పడవచ్చు. మోసాన్ని గ్రహించి మనసు గాయపడకుండా కాపాడుకోవచ్చు. మాట్లాడే విధానం.. అమ్మాయిలు అబ్బాయిలకు దూరంగా జరిగేటప్పుడు కనిపంచే మొదటి మార్పు మాట్లాడే విధానం మారడం. ఒకప్పుడు ఆప్యాయంగా,  ఎక్కువగా కేర్ తీసుకుంటూ,  ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే అమ్మాయి,  ఒక్కసారిగా మాట్లాడటం తగ్గించడమే కాకుండా క్రమంగా కఠినంగా మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి తొందరలోనే బ్రేకప్ చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్థం. ఫోన్ కాల్స్.. అమ్మాయిలు పదే పదే బంధువులు లేదా కుటుంబ సభ్యులు కాల్ చేశారని చెబుతూ దూరంగా వెళ్లి మాట్లాడుతూ ఉంటే అది ఖచ్చితంగా ఆమె దూరం అయ్యే సూచనలు ఇస్తుందట.  మోసం చేసే అమ్మాయిలు తరచుగా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ఇతరులతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారని అంటారు.   మాటల్లో మార్పు.. ప్రేమించిన అమ్మాయి మొదట్లో ఎంతో ఆప్యాయంగా,  కేరింగ్ గా మాట్లాడుతుంది. కానీ ఆ తరువాత ఆమె ఆ రిలేషన్ నుండి తప్పించుకోవాలని,  వేరే రిలేషన్ లోకి వెళ్లాలని అనుకున్నప్పుడు ఆమె మాటతీరు మారుతుందట.  ప్రేమ, ఆప్యాయత, కేరింగ్ స్థానంలో చిరాకు, అసహనం,  వ్యంగ్యం వచ్చి చేరతాయట. కొన్ని సార్లు చాలా ఘాటుగా కూడా మాట్లాడతారట. సమయం తగ్గించడం.. బయట కలవడం అయినా,  ఫోన్ లో మాట్లాడటం అయినా ప్రేమించిన అమ్మాయి గతంలో లాగా ఎక్కువసేపు మాట్లాడటం, కబుర్లు చెప్పడం కాకుండా  కేవలం రెండు మూడు నిమిషాలలో మాట్లాడటం,  రెండు మూడు ముక్కలలో సమాధానం చెప్పి పోన్ పెట్టేయడం,  తర్వాత మాట్లాడతాను అని చెప్పడం.. వంటివి చేస్తుంటే ఆమె తొందరలోనే బ్రేకప్ చెప్పేస్తుందని అర్థమట. కారణాలు.. సమయం లేకపోవడం, పనిలో బిజీగా ఉండటం లేదా మూడ్ సరిగ్గా లేకపోవడం వంటి సాకులు చెబుతూ ఉంటే వాస్తవానికి ఆమెకు మాట్లాడే ఆసక్తి లేదని అర్థం. నేరుగా ఆ విషయాన్ని చెప్పలేక అలా కారణాలు చెబుతూ ఉంటారు. మార్పులు.. లైఫ్ స్టైల్ మార్చుకోవడం,  కొత్త అలవాట్లు,  సీక్రెట్స్ మెయింటైన్ చేయడం వంటివి చేస్తుంటే ఆ అమ్మాయి మరొకరితో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టిందని అర్థం.  ఇవన్నీ కనివిస్తే ఆ అమ్మాయి మోసం చేస్తోందని అర్థం.  ఇలాంటి మార్పులు కనిపించినప్పుడు అబ్బాయిలు జాగ్రత్త పడితే మనసుకు గాయం కాకుండా జాగ్రత్త పడవచ్చు.                                       *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదోకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ వారు  చేసే కొన్ని తప్పులు విజయానికి అడ్డుపడతాయి. చాణక్యుడు తెలిపిన  ఆ తప్పులు ఏంటి..? మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చేయకూడని ఆ రెండు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం అన్నాక సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా ఒకలక్ష్యంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత పెద్దది అయితే...అన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి..తన జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని సాధిస్తాడు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. వీటితోపాటు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద పెట్టాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పునకు కారణం అవుతుంది. ఆచార్య చాణక్యుడు చెబుతూ..మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని తెలిపారు. అవి ఏంటో చూద్దాం. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పవద్దు. మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. ఇవే కాదు విజయం సాధించడానికి చాణక్య ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం బయటకు చెప్పినప్పుడు.. వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే,మీకు సమస్యలను లేదా అడ్డంకులు కలిగించవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీసుకున్న ప్రణాళికలు,నిర్ణయాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు: లక్ష్య సాధన కోసం శ్రమించే వ్యక్తిని చాణక్యుడు సింహంతో పోల్చాడు. సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లేదు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి ఆ దిశగానే అడుగులు వేయాలి తప్ప..వెనక్కు తగ్గకూడదు.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదన్నది చాణక్యుడి మాట. చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన పాలసీలో ఈ రెండు అంశాలకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు.   
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది.   అయితే ఈ మధ్య కాలంలో గుండె సంబంధ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో గుండె  బలహీనంగా మారడం వల్ల తొందరగా గుండె జబ్బులు రావడం జరుగుతోంది.  అందుకే గుండెకు బలాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతారు.  గుండెకు బలాన్ని పెంచే ఆహారాలు ఏవి? ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే.. గుండెను బలంగా ఉంచే ఆహారాలు.. సాల్మన్.. సాల్మన్ వంటి కొవ్వు చేపలలో గుండెకు బలాన్ని చేకూర్చే  ఒమేగా-3 కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ చేపలు EPA,  DHA లను అందిస్తాయి.  ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో, గుండె లయను స్థిరంగా ఉంచడంలో, రక్త నాళాల లైనింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  క్రమం తప్పకుండా తింటే హృదయ సంబంధ సమస్యలను చాలా వరకు   తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఒమేగా-3 లు గుండె కణ త్వచాలలో కలిసిపోయి ఆరోగ్యకరమైన విద్యుత్ కమ్యునికేషన్ కు సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్.. ఎక్స్టా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన ఆరోగ్యకరమైన  కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.  రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  ఆలివ్ నూనె తీసుకోవడం  వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అవకాడో.. అవకాడోలు సహజంగా ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పొటాషియం, ఫోలేట్,  విటమిన్ E లతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్,  రక్తపోటు స్థాయిలకు మద్దతు ఇస్తాయి. వాల్నట్స్. క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాల్‌నట్‌లలో మొక్కల ఆధారిత ఒమేగా-3లు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్‌లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.  రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. బ్లూబెర్రీస్.. బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్లు,  పాలీఫెనాల్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతారు. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందట. ముదురు ఆకుకూరలు.. ముదురు ఆకుకూరలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.  సహజ నైట్రేట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ K, ఫోలేట్, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండెను బలంగా మారుస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి,  అన్నింటికి మించి తలనొప్పి వచ్చినా,  ఫుడ్ లేటయినా కనీసం టీ  అయినా తాగాలి.  ఇలా టీ అనేది పానీయంలా కాకుండా ఒక ఎమోషన్ లా మారిపోయింది. అయితే టీ తాగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఆరోగ్య నిపుణులు.  మరీ ముఖ్యంగా నెలరోజుల పాటు టీ తాగడం మానేయండి,  ఫలితాలు చూసి మీరే షాకవుతారు అని అంటున్నారు. ఇంతకూ నెలరోజుల పాటు టీ తాగడం మానేయడం వల్ల కలిగే మార్పులేంటో తెలుసుకుంటే.. నెలరోజులు టీ తాగడం మానేస్తే.. ఒక నెల పాటు టీ తాగడం మానేయడం వల్ల శరీరం నుండి  హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందట. ఇది కడుపులో యాసిడ్ ఎఫెక్ట్,  ఉబ్బరాన్ని తొలగించడమే కాకుండా,శరీర శక్తి స్థిరంగా ఉండేలా చేస్తుందట. ఇలా శరీరంలోపల శుద్ది కావడం శరీరానికి  రీసెట్ బటన్ గా పనిచేస్తుంది. నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే  నాలుగు ముఖ్యమైన మార్పులు ప్రధానంగా చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ.. టీ మానేయడం వల్ల కలిగే మొట్టమొదటి,  అత్యంత ప్రయోజనకరమైన విషయం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగవ్వడం. టీలోని కెఫిన్,  టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు నార్మల్ అవుతాయి. ఆమ్లత్వం, గుండెల్లో మంట,  అజీర్ణం దాదాపుగా తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఐరన్ శోషణ.. టీలోని టానిన్లు ఆహారం నుండి ఐరన్ ను గ్రహించడంలో  ఆటంకం కలిగిస్తాయి. టీ మానేసిన తర్వాత శరీరం ఆహారం నుండి ఐరన్ ను పూర్తి స్థాయిలో గ్రహిస్తుంది. రక్తహీనత లేదా అలసటతో బాధపడేవారికి ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. టీ మానేయడం వల్ల ఐరన్ గ్రహించే సామర్ఱ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం.. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల  నిద్ర చక్రం తిరిగి రికవర్ అవుతుంది. గాఢంగా,   నాణ్యమైన నిద్రను పొందడంలో  సహాయపడుతుంది. మంచి నిద్ర నేరుగా  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక కల్లోలం,  ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం, దంతాల ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాల మీద మరకలుగా మారి  దంతాల  రంగు మారుస్తాయి. టీ తాగడం మానేయడం వల్ల సహజంగా  దంతాలు శుభ్రంగా,  ప్రకాశవంతంగా కనిపిస్తాయి.  శరీరం హైడ్రేషన్ గా ఉండటం,  వాపు తగ్గడం మొదలైన వాటి వల్ల  పొడిబారడం తగ్గుతుంది.  చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...