LATEST NEWS
హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడడంతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్ గా స్పందించింది. భారీ జనసమీకరణ జరుగుతోందని సమాచారం అందించలేదనే కారణంతో ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించింది. ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజులను ఉన్నతాధికారులు వీఆర్ కు పంపించారు. ఈమేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ పైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల 11న తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు. హీరో వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా భారీ ఎత్తున జనం గుమికూడడంపై ఈసీ సీరియస్ గా స్పందించింది.విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంలో, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడంలో విఫలమైన పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు ఈసీ నుంచి నోటీసులు అందుకున్న ఎస్పీ, డీఎస్పీ.. ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. దీనిపై స్థానిక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయడంతో హీరో అల్లు అర్జున్ తో పాటు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు అధికారంలోకి వస్తారు. ఏ పార్టీ పరాజయాన్ని మూటకట్టుకుంటుంది అన్న చర్చలతో పాటు మరో వ్యక్తి గురించి కూడా రాజకీయ, సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఆ వ్యక్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీకి దగ్గర బంధువు.. అలా చెప్పే కంటే.. మెగాస్టార్ చిరంజీవికి స్వయానా మేనల్లుడు. అటువంటి అల్లు అర్జున్   ఎన్నికల సందర్భంగా తన మిత్రుడు అంటూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి కి మద్దతుగా నంద్యాల వెళ్లి మరీ ర్యాలీలో పాల్గొన్నారు.  మరో వైపు జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినప్పటికీ ఆయనకు ఒక ట్వీట్ ద్వారా మద్దతు ప్రకటించి ఊరుకున్న అల్లు అర్జున్ పనిమాలా నంద్యాల వరకూ వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థి శిల్పాకు మద్దతు ప్రకటించి రావడం సంచలనం సృష్టించింది. దీంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు పొసగడం లేదా అన్న అనుమానాలు సైతం సర్వత్రా వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో మాటల యుద్ధం కూడా జరిగింది. అది పక్కన పెడితే ఓట్ల లెక్కింపు జరిగి, ఫలితాలు ప్రకటించే జూన్ 4వ తేదీ సమీపిస్తున్న కొద్దీ అల్లు అర్జున్ పై రాజకీయ సినీ రంగాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.     ఒక వేళ శిల్పా ఓడిపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఏమిటి అన్నదే ఈ చర్చ. ఎందుకంటే పోలింగ్ సరళిని చూసిన తరువాత రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం కూటమే అన్న భావన సర్వత్రా బలపడింది. అందుకు తగ్గట్టుగా వైసీపీ శ్రేణులు, నేతల ప్రకటనలు కూడా ఓటమిని అంగీకరించేసినట్లుగానే ఉన్నాయి.  దీంతో  వైసీపీ అధికారం కోల్పోయినా, గెలిచే  కొన్ని సీట్లలో నంద్యాల లేకపోతే అల్లు అర్జున్ ఇమేజ్  బాగా డ్యామేజ్ అవుతుందని అంటున్నారు.  అదే సమ యంలో  జూనియర్ ఎన్టీఆర్  కున్న   సంయమనం కూడా అల్లు అర్జున్   పాటించలేదని అంటు న్నారు.  ఎందుకంటే వైసీపీ తరఫున గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లు ఎన్టీఆర్ కు చాలా సన్నిహిత స్నేహితులు. వారిరువురూ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు కూడా చేశారు.  అయితే ఆ ఇద్దరి తరఫునా ప్రచారం చేయడానికి కానీ, మద్దతు పలకడానికి కానీ ఎన్టీఆర్ ముందుకు రాలేదు. అసలు తన స్నేహితులు ఇద్దరూ వైసీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ వారికి అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు అటువైపు చూడనే లేదు. అయితే అందుకు భిన్నంగా బన్ని అనవసర ఆర్భాటం చేసి మరీ శిల్పాకు మద్దతుగా నంద్యాల వెళ్లారని సినీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. బన్నీ తీరు కచ్చితంగా ఆయన కెరీర్ పై ప్రభావం తప్పకుండా పడుతుందని చర్చించుకుంటున్నారు.  
కర్నూలు జిల్లాలో ఓ రైతు పంటపడింది. పొలంలో అతడికి విలువైన వజ్రం దొరికింది.  ఇటీవల కురిసిన వర్షాలకు వజ్రం బయటపడింది. పొలం పనులు చేస్తుండగా కంటపడిన వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. విషయం తెలిసి వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాపారులు పోటీ పడడంతో వేలం నిర్వహించారు. ఇందులో పెరవల్లికి చెందిన ఓ వ్యాపారస్థుడు రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, బహిరంగ మార్కెట్ లో ఆ వజ్రం విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఏటా వర్షాకాలం తొలకరి సమయంలో కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు, కూలీలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు వెతుకుతుంటారు. దీనికోసం ప్రత్యేకంగా భూమిని లీజుకు తీసుకుని, కూలీలను పెట్టి వెతికించే వాళ్లు కూడా ఉన్నారు. ఒక్క విలువైన వజ్రం దొరికితే దశ మారిపోయే అవకాశం కావడంతో రైతులు కూడా తమ పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఈ సంవత్సరం కురుస్తున్న తొలకరి వర్షాలతోనూ వజ్రాలు లభిస్తున్న కొందరు రైతుల పంట పండుతోంది.  రాయలసీమ జిల్లాలలో ఈ సీజన్ అదృష్టాన్ని పరీక్షించుకునే సీజన్. ప్రతి ఒక్కరూ పొలాలలో వజ్రాల వేట కొనసాగిస్తారు. ఇక నక్క తోక తొక్కిన అదృష్టవంతులకు వజ్రాలు దొరుకుతాయి. ఎంతోమందిని ఇక్కడ దొరికే వజ్రాలు బికారుల నుండి అమీర్ లుగా మారుస్తున్నాయి. తొలకరి వర్షాల సమయంలో రాయలసీమ జిల్లాలలో ఎంతోమంది వ్యవసాయ కూలీలు, కొందరు గొర్రెల కాపరులు, వ్యవసాయం చేసుకునే రైతులకు వజ్రాలు దొరికిన అనేక ఉదంతాలు ప్రతీ సంవత్సరం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భూమిలో దొరికే విలువైన వజ్రాలు, గుప్త నిధులు వంటివి చట్టప్రకారం ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూముల్లో దొరికినా సరే అది ప్రభుత్వ ఆస్తేనని చట్టాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రైతుకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అధికారులు.. తమకు పట్టనట్టు ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. - ఎం.కె.ఫ‌జ‌ల్‌  
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది... నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు... ఇదీ ఇప్పటి వరకు చాలామంది చూస్తున్న దృక్కోణం! కానీ,  ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్న కోణం మరొకటి వుంది.. అదే ‘‘చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్?’’ ఈసారి ఎన్నికలలో నాలుగు వందల స్థానాలు సాధించాలని బీజేపీ ఊహల పల్లకీలో విహరిస్తోందిగానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని విడతల పోలింగ్ సందర్భంగా బీజేపీ సొంతగా దుమ్ముదులిపేసింది అని చెప్పుకునే స్థాయిలో ఓట్లు పడలేదు. ఎన్డీయేలో భాగస్వాములుగా వున్న పార్టీలు కొన్ని తమ సత్తాను చాటగలిగాయిగానీ, బీజేపీకి తాను ఊహిస్తున్న స్థాయిలో సీట్లు వస్తాయన్న ఆశ కనిపించడం లేదు.. ఒక వేళ బీజేపీకి రావలసిన మెజారిటీ కంటే చాలా తక్కువ స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈసారి ప్రధానమంత్రి పదవి మోడీకి, బీజేపీ నాయకుడికి కాకుండా ఎన్డీయేలో భాగస్వాములుగా వున్న మిగతా పక్షాల్లో వున్న సమర్థుడైన నాయకుడికి ప్రధానమంత్రిగా అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించే అవకాశం వుంది. ఆ నాయకుడు చంద్రబాబు ఎందుకు కాకూడదు? దేశ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు, ఇండియా భాగస్వామ్య పక్షాలతోపాటు, ఈ రెండు కూటములలోనూ లేని పార్టీల నుంచి కూడా మద్దతు కూడగట్టగల శక్తి వున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆమాటకొస్తే బీజేపీలో కూడా మోడీ, అమిత్ షా మినహా చాలామంది చంద్రబాబు అభిమానులు వున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడిన చంద్రబాబు చరిత్రను గుజరాత్ బ్యాచ్ మరచిపోయి వుండొచ్చేమోగానీ, బీజేపీ మరచిపోదు. ఒకవేళ ప్రధానమంత్రి అభ్యర్థి మారాల్సి వచ్చిన పక్షంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు లేరు. ఈ మాట అంటే కొంతమందికి కోపాలు వస్తే వచ్చాయిగానీ, అందర్నీ కలుపుకుని వెళ్ళే విషయంలోగానీ, నీతివంతమైన రాజకీయాలు నడపడంలోగానీ, ప్రజాస్వామిక విలువలను, లౌకిక విలువలను పాటించడంలోగానీ, సుదీర్ఘ అనుభవం విషయంలోగానీ, దేశాన్ని ముందుకు నడిపే విజన్‌లోగానీ, ట్రబుల్ షూటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌లోగానీ నరేంద్ర మోడీ కంటే చంద్రబాబు ఒక మెట్టు పైనే వుంటారు. అందుకే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అవ్వాల్సిన ఒక కీలక అంశం.. ‘చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్’!
కాంబోడియా, భారత్ మధ్య  అక్రమ మాన‌వ‌ రవాణా రాకెట్ నడుస్తోంది. ఉద్యోగాల పేరిట ఎర వేసి 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఇక్క‌డి నుంచి తీసుకెళ్ళి, ఆన్ లైన్ స్కాం ఎలా చేయాలో వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారు. బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  మన యువతను మోసం చేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్ల ఆటకట్టించాలని, ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు. వీలైనంత త్వరగా బాధితులను కాంబోడియా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు సాయపడాలని జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట కాంబోడియాకు మానవ అక్రమ రవాణా పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ్యభిచారం కోసం మహిళల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మహిళలు, బాలలు, వృద్ధులపై నేరాలు విపరీతంగా పెరిగాయి. ఆర్థిక, సైబర్‌ నేరాలు ఎక్కువయ్యాయి. హత్యాయత్నాలు, అపహరణలు పెరిగాయి. జాతీయ నేర గణాంక సంస్థ గణాంకాలు విశ్లేషిస్తే మన రాష్ట్రంలోని దారుణ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయ‌ని చంద్ర‌బాబునాయుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుతోంది. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత ఆ ముఠా చేతిలో బందిగా వుంది. ఫెడెక్స్ , టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారు. ఐటీ ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షన్నర వరకు వసూలు చేసి  కంబోడియాకు త‌ర‌లిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే యువ‌త ట్రాప్‌లో ప‌డిపోతోంది.  కంబోడియాలో రక్షించిన దాదాపు 60 మంది భారతీయులతో కూడిన మొదటి బ్యాచ్‌ స్వదేశానికి చేరుకుంది.  అందులో పలువురు ఏపీ వాసులు ఉన్నారు. కంబోడియా సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి బయటపడి స్వరాష్ట్రానికి చేరుకున్న పలువురికి విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విశాఖపట్నం పోలీసులు స్వాగతం పలికారు. త‌మ‌ను చైనీస్ ఆపరేటర్లకు విక్రయించి,  హింసించారు.సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడేలా ఒత్తిడి చేశారు, చీకటి గదులలో ఉంచి పనిచేయాలని హింసించిన‌ట్లు బాధితులు చెప్పారు.    అక్రమ రవాణాకు గురైన యువకుల విడుదల కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిందని, హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసిందని, దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు కొనసాగించడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించింది.   - ఎం.కె. ఫ‌జ‌ల్‌
ALSO ON TELUGUONE N E W S
జబర్దస్త్ తో తెలుగు ప్రజల అభిమాన నటుడుగా మారిన హీరో  గెటప్ శ్రీను(getup srinu)హీరో అని ఎందుకు అంటున్నానంటే రీసెంట్ గా  రాజు యాదవ్ తో  సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న  రెండు తెలుగు రాష్ట్రాల్లో  అత్యధిక థియేటర్స్ లో విడుదలయ్యింది.మరి  కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రాజు యాదవ్ (raju yadav) తొలి ఆట నుంచే  బాగుందనే టాక్ సంపాదించుకుంది. రాజు యాదవ్ క్యారక్టర్ లో  గెటప్ శ్రీను సూపర్ గా నటించాడని కొన్ని సీన్స్ లో కన్నీళ్లు కూడా తెప్పించాడనే మాటలు ప్రేక్షకుల దగ్గరనుంచి వినిపిస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజు ఎనభై ఐదు లక్షలు సాధించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర సీడెడ్ లో కలుపుకొని నలబై ఏడు లక్షలు, నైజాం లో నలభై లక్షలు రాబట్టింది. మౌత్ టాక్ తో ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే మూవీ చూసిన వారందరు థియేటర్స్ లోనే రాజు యాదవ్ ని చూడండంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు  గెటప్ శ్రీను సరసన నూతన కధానాయిక అంకిత కారత్ చెయ్యగా వకీల్ సాబ్ ఫేమ్ ఆనంద్ చక్రపాణి ,నమని ప్రశాంత్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రశాంత్ రెడ్డి, రాజేష్, స్వాతి లు కలిసి సంయుక్తంగా నిర్మించగా కృష్ణమా చారి రచనా దర్శకత్వాన్ని అందించాడు.సురేష్ బొబ్బిలి, సంగీతాన్ని అందించగా చంద్రబోస్, కాకర్ల శ్యాం సాహిత్య రచన చేసారు  
అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ సినిమా ఎంతో ప్రత్యేకం. అంతేకాదు, అక్కినేని అభిమానులు కూడా ఆ సినిమాని ఎవర్‌గ్రీన్‌ మూవీగా భావిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, అక్కినేని నాగేశ్వరరావు, అఖిల్‌.. ఇలా ఫ్యామిలీలోని వారంతా కలిసి నటించిన ఈ సినిమాని అపురూపంగా భావిస్తారు అభిమానులు. ఈ సినిమా రిలీజ్‌ అయి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల రిరిలీజ్‌ చేశారు. హైదరాబాద్‌ క్రాస్‌ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను మరోసారి వీక్షించేందుకు అక్కినేని ఫ్యామిలీతోపాటు అభిమానులు కూడా వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, నాగచైతన్య, సుప్రియ హాజరయ్యారు.  ఆల్రెడీ చూసిన సినిమానే అయినా మూవీని మళ్లీ చూస్తూ అందరూ ఎమోషనల్‌ అయ్యారు. ముఖ్యంగా సుప్రియ తాతని స్క్రీన్‌పై చూసి  పెట్టుకుంది. దీనికి సంబంధంచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే నాగచైతన్య, సమంత రొమాంటిక్‌ సీన్స్‌కి థియేటర్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. అభిమానులు ఆ సీన్స్‌ వచ్చినపుడు రెచ్చిపోయారు. విజిల్స్‌ వేస్తూ, పేపర్స్‌ జల్లుతూ హడావిడి చేశారు. ఇది చూసిన నాగచైతన్య అసహనం వ్యక్తం చేస్తూ సీరియస్‌ అయ్యారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 
ఎని లాంగ్వేజ్ హీరోయిన్ ని తీసుకోండి. అందరకి లక్ష్యం ఒక్కటే.. బాలీవుడ్ లో కూడా తమ సత్తా చాటాలని. తద్వారా నేషనల్ హీరోయిన్ అనిపించుకోవాలనే ఆశతో ఉంటారు. అది అత్యాశ కిందకి కూడా రాదు. నటిగా వాళ్ళకి ఉన్న హక్కు. రీసెంట్ గా సంయుక్త మీనన్ (Samyuktha Menon)కి కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలో  ఆమె పోషిస్తున్న క్యారక్టర్ చర్చినీయాంశ మయ్యింది ప్రభుదేవా, ఒకప్పటి మాజీ హీరోయిన్  కాజోల్ ల కాంబోలో ఒక నూతన చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో  సంయుక్త మీనన్ కూడా నటించబోతుంది.దీంతో ఆమె తన అందచందాలని ఒక రేంజ్ లో ప్రదర్శించడం ఖాయమని అందరు అనుకున్నారు. ఎందుకంటే బాలీవుడ్ అంటేనే గ్లామర్ షో కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు సంయుక్త ఎటువంటి గ్లామర్ రోల్ లో కనిపించడం లేదు.ప్యూర్ పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారక్టర్ లో కనిపించబోతుంది.దీంతో మొదటి సినిమాకే బాలీవుడ్ కి తన నటనలో ఉన్న సత్తా చూపించే అవకాశం వచ్చింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష లో ఆమె ప్రదర్శించిన నటనని ఎవరు అంత త్వరగా మర్చిపోరు.     2016 లో పాప్ కార్న్ అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత  పవన్ కళ్యాణ్ (pawan kalyan)హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ లో రానా కి జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయింది.అక్కడనుంచి ఆమె సినీ ప్రస్థానం చాలా ఫాస్ట్ గా సాగింది.  టాప్ హీరోయిలకే సినిమాలు సరిగా లేకపోతుంటే తనకి  మాత్రం చేతి నిండా సినిమాలు. . తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలో కలిసి ఇప్పటి  వరకు ఇరవై సినిమాలకు పైనే చేసింది.  సార్,  విరూపాక్ష, బింబి సార,డెవిల్ లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నిఖిల్ న్యూ మూవీ స్వయంభూ లోను చేస్తుంది    
Talented hero Varun Sandesh will next be seen in a unique thriller ‘Nindha’ directed and produced by Rajesh Jagannadham under the banner of The Fervent Indie Productions. The movie that unfolds Kandrakota Mystery is gearing up for release. The makers who earlier released an engaging teaser have started the musical promotions by unveiling the first single Sankellu. Kids from Ganamas Special School released the song. Santhu Omkar scored a perfect song with hard-hitting lines penned by Kittu Vissapragada. Sreeram Chandra crooned the song dynamically. As the teaser and now the song defines Nindha is not a regular commercial movie. it has a strong message and unexpected thrills in the narrative. ShreyaRani ,Annie and Q madhu are female leads, while Tanikella Bharani, Bhadram, Surya Kumar, Chatrapati Shekar, Mime Madhu and Siddharth Gollapudi will be seen in crucial roles in the movie. Sreeramsiddharth Krishna is playing an important role in the movie  Ramiz Naveeth is the cinematographer, while Anil Kumar is the editor. The makers will announce the film’s release date soon.
రామ్‌గోపాల్‌వర్మ హీరోయిన్ల విషయంలో ఎంత కేర్‌ తీసుకుంటాడో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లను పరిచయం చేసిన ఆర్జీవీ ఎప్పటికప్పుడు కొత్త అందాలను అన్వేషిస్తుంటాడు. ఆమధ్య సోషల్‌ మీడియాలో శ్రీలక్ష్మీ సతీష్‌ అనే ఓ భామ వీడియో చూసి ఆమె గురించి ఆరా తీసి మొత్తానికి ఆమెను కాంటాక్ట్‌ చేశాడు. తన నెక్స్‌ట్‌ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా బుక్‌ చేసేశాడు. అంతేకాదు, ఆమె పేరును ఆరాధ్యదేవిగా మార్చేశాడు. ఆ సినిమా పేరు ‘శారీ’. అంతకుముందు అంతంత మాత్రంగా ఉన్న ఆమె ఫాలోవర్స్‌ వర్మ ట్వీట్‌ తర్వాత లక్షల్లోకి చేరిపోయారు.  ఈ ‘శారీ’ హీరోయిన్‌ ఆరాధ్యదేవి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫాలోవర్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఆమె వారితో చాట్‌ చేస్తూ ఉంటుంది. తన ఫాలోవర్స్‌ అందరూ తన అందాల గురించే అడుగుతుంటారని, తన అందాలను అప్రిషియేట్‌ చేస్తుంటారని చెబుతుంది. ఎక్కువగా ఆమె కళ్లు, నడుము, వయసు, షేపులు, ఆ ఒంపుసొంపుల గురించే కామెంట్‌ చేస్తుంటారట. తనకు ఆ ఒంపుసొపులు ఎలా వచ్చాయనే ప్రశ్నలే ఆమెకు ఎక్కువగా ఎదురవుతున్నాయని చెబుతోంది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా జవాబులిస్తూ.. తన వయసు 22 అనీ, హైట్‌ 5 అడుగుల 8 అంగుళాలని చెప్పింది. అయితే మీరు పొగుడుతున్న ఈ అందాలు అంత ఈజీగా నాకు రాలేదని, వాటి కోసం ఎన్నో త్యాగాలు చేశానని, మరెంతో వర్కవుట్‌ చేసానని చెబుతూ.. వాటి వెనుక ఎంతో కష్టం ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న ఆరాధ్య.. వర్మ ‘శారీ’ షూటింగ్‌తో బిజీగా ఉంది. ఆమధ్య కూర్గ్‌లోని ఓ జలపాతం దగ్గర ఆరాధ్య అందాలను ఎక్స్‌పోజ్‌ చేస్తూ ఓ పాటను కూడా చిత్రీకరించారు. 
కొన్ని సినిమాల తీరు ఎలా ఉంటుందంటే..ఇండియన్ సినిమా గర్వించదగ్గ  టెక్నీషియన్స్ పని చేస్తున్నా కూడా ఎలాంటి హడావిడి  లేకుండా షూటింగ్ ని జరుపుకుంటు ఉంటాయి. అలాంటి వాటిల్లో చరణ్ తేజ్ ఉప్పలపాటి  మూవీ  కూడా ఒకటి. ఈయన  రెబల్ స్టార్ ప్రభాస్ కి  కజిన్ అవుతారు.  నిఖిల్ హీరోగా వచ్చిన స్పై అండ్ సుమంత్ హీరోగా వచ్చిన మళ్ళీ మొదలయ్యింది సినిమాలకి వన్ ఆఫ్ ది  నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు  ఏకంగా బాలీవుడ్ కే దర్శకుడుగా   పరిచయం అవుతున్నాడు    ఒకప్పటి  బాలీవుడ్ అగ్ర హీరోయిన్  కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్  ప్రభుదేవా కాంబో లో  ఒక చిత్రం తెరకెక్కుతుంది. యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారానే  చరణ్ తేజ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.  తెలుగులో డైరెక్టర్ గా ప్రూఫ్ అయిన తర్వాతే బాలీవుడ్ ఆఫర్ వస్తుంది ,కానీ  ఒక్క సినిమా కూడా చెయ్యకుండా  చరణ్ కి ఈ ఆఫర్ రావడం లక్ అనే చెప్పాలి. పైగా కాజోల్, ప్రభుదేవా లాంటి సీనియర్స్ ని మొదటి సినిమాకే   డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. ఇది చాలా మంచి అవకాశం కూడా.ఇక  ప్రభుదేవా,కాజోల్ కాంబో లో  ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మెరుపుకలలు అనే మూవీ వచ్చింది.దీంతో ప్రేక్షకుల్లో ఆ జంట మీద క్యూరియాసిటీ ఏర్పడింది.మూవీ మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే  టీజర్ రాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.  నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ లాంటి స్టార్ కాస్టింగ్   స్క్రీన్ షేర్ చేసుకోనుంది అలాగే  ఇండియన్ సినిమా గర్వించదగ్గ టాప్  టెక్నీషియన్స్ తమ తమ శాఖల్లో పని చేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ లేటెస్ట్ హిట్  జవాన్ కి  సినిమాటోగ్రాఫర్‌గా చేసిన జికె విష్ణు,  అదే విధంగా  లేటెస్ట్  సంచలనం  యానిమల్ మూవీకి మ్యూజిక్ ని ఇచ్చిన  హర్షవర్ధన్ రామేశ్వర్, అల్లు అర్జున్ పుష్ప  2  ఎడిటర్‌  నవీన్ నూలి,  మై నేమ్ ఈజ్ ఖాన్, వేక్ అప్ సిద్  లాంటి భారీ హిట్స్ మూవీస్ కి  స్క్రీన్ ప్లే ని అందించిన నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా లు ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు  
ఎన్నాళ్ళ కెన్నాళ్ళ  కెన్నాళ్లకు  వెన్నెల్లు  తిరిగొచ్చే మా కళ్ళకు అనే పాటలా  ఎట్టకేలకు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda sai Sreenivas)న్యూ  మూవీ అప్ డేట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)తో భీమ్లా నాయక్ ని తెరకెక్కించిన  సాగర్ చంద్ర దర్శకుడు అయితే విక్టరీ వెంకటేష్ తో  నమోవెంకటేశ, బాలకృష్ణ లెజండ్,  రామ్ రెడీ,  వరుణ్ తేజ్ వాల్మీకి లాంటి సినిమాలని నిర్మించిన ఫోర్ టీన్ రీల్స్ సంస్థ. కొన్ని రోజులుగా మూవీ గురించి  ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు రావడంతో తెలుగు సినిమాకి పండుగ వాతావరణం వచ్చినట్టయ్యింది. టైసన్ నాయుడు(tyson naidu)టైటిల్ చూస్తుంటేనే థియేటర్స్ కి పరుగులు పెట్టేలా  అనిపిస్తుంది కదు. బెల్లంకొండ హీరోగా వస్తున్న ఈ మూవీ చాలా రోజుల కిందటే షూటింగ్ ని ప్రారంభించుకుంది. జనవరి 3  బెల్లంకొండ  పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్‌ రాగా అభిమానులు,ప్రేక్షకుల నుంచి  మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం  రాజస్థాన్‌ కోట లో ఒక కీలక షెడ్యూల్ ని జరుపుకుంటుంది.  ఫైట్ మాస్టర్ స్టన్ శివ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. రేపు థియేటర్స్ లో ఈ ఫైట్స్ పూనకాలు తెప్పించే విధంగా ఉంటాయని యూనిట్ విశ్వసిస్తుంది. రెండు వారాల పాటు కంటిన్యూగా  జరిగే ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలే కాకుండా టాకీ పార్ట్ కూడా చిత్రీకరించనున్నారు. మూవీకి సంబంధించిన మిగతా తారాగణం ఇందులో పాల్గొననుంది  బెల్లంకొండ  సరసన ఇస్మార్ట్ భామ నబానటేష్ (naba natesh)జతకడుతుంది. ప్రొడ్యూసర్ రామ్ ఆచంట(Ram Achanta) బెల్లంకొండ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నాడు. బాక్సింగ్ లో కింగ్ అయిన టైసన్ పేరు మూవీకి ఎందుకు పెట్టారనేది అందరిలో ఆసక్తిగా మారింది. ప్రెజంట్ మంచి ఫామ్ లో ఉన్న  భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా  భారీ తారా గణమే మూవీలో మెరవనుంది  
కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో శశికిరణ్‌ తిక్క సమర్పణలో ఆరమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబి తిక్క నిర్మించిన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘సత్యభామ’. ఈ సినిమాలో నవీన్‌ చంద్ర కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం మే 24న హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ‘సత్యభామ’ ట్రైలర్‌ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్‌లో కాజల్‌ని చూసి చాలా ఆశ్చర్యపోయాను. మా భగవంత్‌ కేసరి సినిమాలో చేసింది. ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఒకరేనా అనిపించేంత వేరియేషన్‌ చూపించింది. సినిమాలో ఆమె చేసిన ఫైట్స్‌, యాటిట్యూడ్‌ అద్భుతం. ఆర్టిస్ట్‌ అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చేయాలి. ఈరోజు నారద జయంతి. నాన్నగారు అన్ని రకాల పాత్రలు పోషించారు ఒక్క నారదుడు తప్ప. ఆ పాత్ర శ్రీనివాసకళ్యాణం చిత్రంలో చేసే అవకాశం నాకు వచ్చింది. అది నా అదృష్టం. నాన్నగారు చేయని పాత్ర నేను చేసాననే తృప్తి ఉంది. ‘సత్యభామ’ చిత్రాన్ని నిర్మించిన వారికి చాలా అనుభవం ఉంది. శశికిరణ్‌ సినిమాలకు డైరెక్షన్‌ చేశారు. అలాగే నిర్మాతలకు పంపిణీ రంగంలో కూడా అనుభవం ఉంది. వీరందరి అనుభవంతో సినిమాని అద్భుతంగానే తీసి ఉంటారు. తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ భారతదేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఉంది. మనం అందించే సినిమాలకు, మనం ఇచ్చే సందేశాలకు యావద్‌ భారతదేశమే తలవంచింది. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. ‘సత్యభామ’ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.  
ప్రస్తుతం టాలీవుడ్‌ని కుదిపేస్తున్న అంశం బెంగళూరు రేవ్‌ పార్టీ. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. శుక్రవారం ఒక వెబ్‌సిరీస్‌కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న మంచు లక్ష్మీని రేవ్‌ పార్టీ వ్యవహారంపై స్పందించాల్సిందిగా పాత్రికేయులు కోరగా దానికి తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పారు.  ‘అసలు అక్కడ ఏం జరిగిందో తెలీదు.. ఇది సందర్భం కూడా కాదు. చాలా రోజుల తర్వాత ఒక వెబ్‌ సిరీస్‌ వచ్చింది. దాని గురించి మాట్లాడుతున్నాను. ఎవరో ఎక్కడికో వెళ్లింది.. అంటే నాకేమిటి సంబంధం అండీ.. అది వారి సమస్య. నాది కాదు’ అంటూ స్పష్టం చేశారు మంచు లక్ష్మీ. 
Promising young hero Bellamkonda Sai Srinivas’s unique action entertainer being helmed by Saagar K Chandra is produced by 14 Reels Plus. The movie titled Tyson Naidu had its title and glimpse unveiled on Bellamkonda Srinivas’ birthday and received a stupendous response. Today, the makers have begun a new crucial 2 week long schedule of the movie in Rajasthan. The team will be canning breathtaking action block which is very significant for the movie for 10 nights in Rajasthan forts under the super vision of Stun Shiva which will be one of the major highlight in the movie.In this 2-week long schedule, the makers will also shoot some talkie part. The movie is being made in an un-compromised way as the team is super confident on the subject. Bellamkonda sports a massy and bulky look in the movie, as shown in the glimpse. Saagar K Chandra is presenting him in a never-before-seen action-packed character as a cop. Some prominent technicians are taking care of different crafts of the movie. Mukessh Gnanesh/Anith are the lensman, while the in form sensational composer Bheems Ceciroleo provides the music. Kotagiri Venkateswara Rao is the editor of the movie, while Avinash Kolla are the art directors. Stun Shiva, Vijay, Venkat, and Real Satish oversee the action part of the movie.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  నేటి కాలంలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. కొందరి ప్రేమకథ పెళ్లికి దారితీయదు. ఏదైనా ప్రేమ బంధం దృఢంగా ఉండాలంటే సద్గురువు చెప్పిన ఈ మాటలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  కొన్నిసార్లు ఇది బంధాన్ని విజయవంతం చేయడానికి సరిపోదు. బంధంలో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య అలాంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వారు తమ కోసం వేర్వేరు మార్గాలను ఎంచుకోవాలి.  వివాహాన్ని ప్రేమకు గమ్యస్థానంగా పరిగణించనప్పటికీ, జీవితాంతం కలిసి ఉండటమే అత్యంత అందమైన, పవిత్రమైన బంధం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు తమ ప్రేమికుడితో కలిసి కుటుంబాన్ని గడపాలని కలలు కంటారు. కానీ మీ ప్రేమను పెళ్లి దశకు ఎలా తీసుకురావాలో మీకు తెలియదు. అలాంటి వారికి సద్గురు సలహా ఉపయోగపడుతుంది. సంబంధాన్ని కాపాడుకోవడానికి సద్గురు సలహా: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సద్గురు, యువ తరం సమస్యలను బాగా అర్థం చేసుకుని, వారికి బాధ కలిగించకుండా వాటిని ఎలా పరిష్కరించాలో తెలిసిన మత గురువులలో ఒకరిగా పరిగణిస్తున్నారు. ప్రేమ సంబంధాన్ని మెరుగుపరచడానికి.. అతను ఇచ్చిన చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ సంబంధాన్ని ప్రతి సమస్య నుండి కాపాడుకోవచ్చు. దానిని విజయవంతం చేయవచ్చు. ఈ విషయం మాత్రమే ప్రేమ సంబంధాన్ని విజయవంతం చేస్తుంది: సద్గురు చెప్పినట్లుగా, మీలో ఉన్న ప్రేమ సఫలీకృతం కావాలంటే, మీరు ముందుగా ఓడిపోవడం నేర్చుకోవాలి, ఎక్కువ కాలం ఉండకూడదు లేదా అంతం కాదు. మీ సంబంధాన్ని గెలవాలంటే మీరు ప్రేమలో ఓడిపోయిన వ్యక్తి అయి ఉండాలి. సంబంధంలో జీవిస్తున్న ఇద్దరూ దీనిని అర్థం చేసుకున్నప్పుడు, వారి జీవితమంతా ఏదీ వారిని వేరు చేయదు. వారి ప్రేమ అజరామరం. ప్రేమలో ఓడిపోవడం అంటే ఏమిటి? జీవితంలో ఎప్పుడూ ఓడిపోకండి, కానీ మీ ప్రేమికుడితో మీ సంబంధాన్ని చిరస్థాయిగా మార్చుకోవడానికి మీరు ఓడిపోవడం మంచిది. యుద్ధాల్లో గెలవాలంటే ఓడిపోయినట్లే, ప్రేమ కూడా వీటిలో ఒకటి మాత్రమే. అయితే అంతకు ముందు రిలేషన్ షిప్ లో లూజర్ అంటే అర్థం తెలుసుకోండి. మీ భాగస్వామి కోసం ఏదైనా చేయండి: ప్రతి ఒక్కరూ ప్రేమలో లావాదేవీల గురించి మాట్లాడుతారని సద్గురు చెప్పారు. అయితే అందులో ఓడిపోయిన వారిని ఎంచుకుంటేనే మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని విజయవంతం చేయగలరు. దీని కోసం మీరు కోల్పోయేది ఏమీ లేదు. మీ భాగస్వామి నుండి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ చేయడం అంటే. ఇలా చేయడం వల్ల మాత్రమే ప్రేమ పెరుగుతుంది. సంబంధాలు చిరస్థాయిగా ఉంటాయి. అటువంటి వ్యక్తుల సంబంధం విజయవంతం కాదు: ఇతరులు మీ నుండి తీసుకోవాలని మీరు ఎల్లప్పుడూ ఆశించినట్లయితే, ఎవరూ మీతో సంబంధాన్ని కలిగి ఉండకూడదని సద్గురు వివరిస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచించకూడదు: రిలేషన్‌షిప్‌లో ప్రతి ఒక్కరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. భాగస్వామి మీతో నిజాయితీగా ఉండాలి, మిమ్మల్ని గౌరవించాలి, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. అంతే కాకుండా అనవసరమైన అంచనాల భారాన్ని వారి భుజాలపై వేసుకోవడం సరికాదు. ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. విజయవంతమైన ప్రేమ సంబంధం అంటే ఏమిటి? ప్రేమ సంబంధం  విజయం ప్రతి జంటకు భిన్నంగా ఉంటుంది. కొందరు వివాహ దశకు చేరుకోవడం ద్వారా తమ సంబంధాన్ని విజయవంతంగా భావిస్తారు, కొందరు దీనిని ఎల్లప్పుడూ ఒకరికొకరు సుఖంగా ఉన్నట్లు భావిస్తారు, తద్వారా మూడవ వ్యక్తి రాక వారి సంబంధాన్ని మార్చదు.
ఈ ప్రపంచంలో వ్యక్తులకు న్యాయం జరిగేలా చూసేది న్యాయవ్యవస్థ. స్వాతంత్య్రం పొందిన ప్రతి దేశంలో న్యాయవ్యవస్థ ఉంది. ఈ న్యాయ వ్యవస్థ అనేది ఈనాటిది కాదు. ఒకప్పుడు రాజ్యాల పేరుతో ఈ భూమండలాన్ని పాలించిన రాజులు, రాణులు కూడా న్యాయవ్యవస్థను పాటించారు. ఎక్కడో కొందరు నియంతలు మాత్రం తాము చెప్పిందే వేదమనే ధోరణిలో రాజ్యపాలన చేశారు. అయితే ఇదంతా అధికారం చేతిలో ఉన్నవాళ్లకే తప్ప సాధారణ పౌరులు తలవంచుకుని పోయే పరిస్థితులే ఉండేవి.  దేశాలు నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టినా, ఎంత అభివృద్ధి సాధించినా మహిళలకు న్యాయం అనేది విభిన్నంగానే ఉండేది, బడుగు బలహీన వర్గాలకు బానిసత్వం తప్ప న్యాయం అనే పదానికి తావుండేది కాదు. ఈక్రమంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో నిరసనలు, ప్రపంచం మీద కాలుతున్న కత్తిపై సమ్మెట దెబ్బల్లా మారాయి. ఫలితంగా న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో మహిళలకు సమాన మరియు సంపూర్ణ భాగస్వామ్యం వైపు అడుగులు పడ్డాయి.   ప్రతి సంవత్సరం మార్చి 10న అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. న్యాయస్థానాలు మహిళా న్యాయమూర్తులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. మగవారితో సమానంగా ఆడవారు ఉండాలని భావించారు. జనాభాకు ప్రాతినిధ్యం వహించడానికి, వారి ఆందోళనలకు ప్రతిస్పందించడానికి, సమర్థ నిర్ణయాలను జారీ చేయడానికి న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర చాలా కీలకం. మహిళా న్యాయమూర్తులు తమ విధులకు హాజరు కావడం ద్వారా న్యాయస్థానాల విశ్వసనీయతను పెంచుతారు, వారు బహిరంగంగా న్యాయం కోరుకునే ఎవరికైనా అందుబాటులో ఉంటామనే బలమైన సందేశాన్ని, భరోసాను ఇస్తారు.  సహజంగా ఓ కుటుంబంలో మహిళల నిర్ణయాల కంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యత, వారి నిర్ణయాలే పైచేయిగా ఉంటాయి. సమాజంలో ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. స్త్రీలు ఎప్పుడూ పురుషుల కంటే తక్కువ అని భావించబడుతున్నారు, అందువల్ల జీవితంలోని వివిధ రంగాలలో సమాన ప్రాతినిధ్యం ఇవ్వబడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కానీ అవి అలానే కొనసాగుతున్నాయి. గత సంవత్సరం, దోహాలో జరిగిన UNODC గ్లోబల్ జ్యుడీషియల్ ఇంటెగ్రిటీ నెట్‌వర్క్ యొక్క రెండవ ఉన్నత-స్థాయి సమావేశంలో, ప్రెసిడెంట్ వెనెస్సా రూయిజ్, ఖతార్ ప్రధాన న్యాయమూర్తి సంయుక్తంగా మహిళా న్యాయమూర్తుల విజయాలను గౌరవించే అంతర్జాతీయ దినోత్సవ ఆలోచనను ప్రతిపాదించారు.  కోర్టు బెంచ్‌లో సమాన సంఖ్యలో పురుషులు మరియు మహిళలు ఉండటం న్యాయవ్యవస్థ  నిష్పాక్షిక తీర్పుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మహిళా న్యాయమూర్తులు ధర్మాసనానికి విభిన్న దృక్కోణాలను అనుభవాలను అందిస్తారు, వారు సేవ చేసే సమాజాన్ని చిత్రీకరిస్తూ మానవ హక్కులు, చట్ట నియమాలను రక్షించే న్యాయవ్యవస్థ సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తారు. నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళలు అవినీతిని ఎదుర్కోవడానికి, కుట్రలను నాశనం చేయడానికి కూడా సహాయపడతారు. మహిళా న్యాయమూర్తులను గతంలో నిషేధించారు కానీ తరువాత వీటిని తిరిగి చేర్చడం ద్వారా న్యాయ వ్యవస్థలను మరింత పారదర్శకంగా వారు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. న్యాయ వ్యవస్థలు, నిర్వాహక నాయకత్వ సంస్థలు, ఇతర స్థాయిలలో మహిళల అభివృద్ధి కోసం సంబంధిత విజయవంతమైన జాతీయ విధానాలు, ప్రణాళికలను స్థాపించడానికి మరియు అమలు చేయడానికి నిబద్ధత ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ చేయాల్సిన కొన్ని పనులను చూస్తే.. •ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం ఒక స్టాండ్ తీసుకోండి మీరు ప్రస్తుతం మహిళల కోసం మాట్లాడటానికి మీ వాయిస్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజున, సోషల్ మీడియాలో లింగసమానత్వం మీకు ఎందుకు ముఖ్యమైనదో షేర్ చేయవచ్చు.   •మహిళా శక్తిని ప్రోత్సహించండి మహిళలు తమ హక్కుల కోసం తమ మద్దతును చూపించడానికి మరిన్ని అవకాశాలను ప్రోత్సహించండి. మహిళా సాధికారతను పెంపొందించడానికి కొన్ని ఆలోచనలు మహిళల కోసం మాత్రమే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించవచ్చు. •అణగారిన మహిళలకు న్యాయవాది ప్రాథమిక అవసరాలు లేదా హక్కుల విషయానికి వస్తే అందరికీ సమాన హక్కు లేదు. సమాజం ద్వారా వారి ప్రాథమిక అవసరాలు ఏర్పాటయ్యేలా చేయడం, మానవ హక్కులను కోల్పోతున్న మహిళల కోసం మీరు ఎక్కడెక్కడికో వెళ్లి సహాయం చేయలేకపోయినా మీ చుట్టూ  ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. న్యాయం విస్తృతమవ్వాలంటే.. న్యాయవ్యవస్థలో మహిళల సంఖ్య పెరగాలి. ◆నిశ్శబ్ద.
ఈరోజుల్లో యువతలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పెరగడం బాధాకర విషయం. ఇంచుమించు వార్తా పత్రికలలో ప్రతిరోజూ ఆత్మహత్య సంఘటల్ని చూస్తున్నాము. ఆత్మహత్య గురించి ఆలోచించడం చాలా తెలివి తక్కువ పని. మానవ శరీరం దేవుడిచ్చిన విలువైన బహుమతి. చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలను విడవటం మంచిదికాదు. పిరికిపందలు,బలహీన మనష్కులే జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడతారు. అటువంటివారే ఇటువంటి తెలివితక్కువ పనులకు ఒడిగడతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా సవాళ్లను ఎదుర్కునేవాడు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయడు. ఆ సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తాడు. చాలామంది తమ కోరికలు నెరవేరలేదు అని నిస్పృహ చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మనకు ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది అనే సత్యాన్ని గ్రహించుకోలేరు. చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేసి మనకు ఆ అర్హత కలిగించే శక్తిని ఎందుకు పెంచుకోకూడదు. ఓ క్షణం ఆలోచిస్తే ప్రాణం తీసుకోవడానికి మించిన ధైర్యం ఈ లోకంలో ఇంకోటి ఉందని నేను భావించను. అలాంటి నీ ధైర్యాన్ని కొంచెం నీ జ్ఞానికి జత చేసి సమస్యపై పోరాటం చేస్తే అసాధ్యమైనా సుసాధ్యం కాగలదు. కష్టాల్లో మన మనసు ఆలోచనా విధానం రాకెట్ వేగంతో ఉండాలి. మన నిర్ణయాలు,కార్యాచరణ మిస్సైల్ లా సాగాలి. మనో నిబ్బరాన్ని మించిన ఆయుధం ఇంకోటి లేదు. అది ఎప్పుడూ కోల్పోకూడదు. కనుక చిన్న చిన్న విషయాలకు ప్రాణాలను త్యజించి ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయి దేవుడు ఇచ్చిన దేహాన్ని హత్య చేసి వెళ్లిపోతే దేవుడు కూడా క్షమించడు. ◆ వెంకటేష్ పువ్వాడ  
సీజన్ల వారిగా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ప్రముఖమైనవి.  వేసవి కాలం ఇక ముగుస్తుందనగా మార్కెట్లలోకి చొచ్చుకువచ్చి సందడి చేసే నేరేడు పండ్లు రుచిగా ఉండటమే కాదు, బోలెడు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వైలెట్ కలర్ లో ఉంటూ ఉప్పగా, వగరుగా ఉండే ఈ నేరేడు కాయలు  క్రమంగా నల్లగా మారి నిగనిగలాడుతూ చెప్పలేనంత తియ్యదనంగా మారుతాయి.  జామూన్ ఫ్రూట్ గా పిలిచే ఈ నేరేడు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం దీనికున్న ప్రత్యేక లక్షణం. అయితే నేరేడు పండ్లు అందరూ తింటారు. కానీ గింజలు ఉపయోగించే వారు తక్కువ. నేరేడు పండ్లలానే వాటి గింజలు కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మధుమేహం నియంత్రించడంలో అద్భుతాలు చేయడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. నేరేడు గింజల పొడి ప్రయోజనాలను తెలుసుకుంటే నేరేడు పండ్లు తినగానే ఆ విత్తనాలను ఇకమీదట పడెయ్యరు. నేరేడు గింజలు పొడి తీసుకోవడం ద్వారా కలిగే అయిదు అద్భుత ప్రయోజనాలు ఏమిటంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, గ్లైకోసూరియాను తగ్గించడానికి నేరేడు విత్తనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పండు గింజలు జంబోలిన్ మరియు జాంబోసిన్ అనే క్రియాశీల పదార్ధాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలోకి విడుదలయ్యే చక్కెర రేటును నెమ్మదిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. శాస్త్రీయంగా, ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఫలితంగా  మూత్రవిసర్జన, చెమటలను సహజంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.  నేరేడు విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణం కారణంగా, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి, కాలేయ కణాలను రక్షిస్తాయి. ఇంకా ఈ గింజలు పొడిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది కాలేయంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.  నేరేడు గింజల పొడిలో ఎల్లాజిక్ యాసిడ్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి రక్తపోటు వేగవంతమైన హెచ్చుతగ్గులను నియంత్రించడంలో  సహాయపడతాయి. నేరేడు గింజలు ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ అయిదు ప్రయోజనాలు పొందడానికి నేరేడు గింజల పొడిని తీసుకోవడం మంచిది. ◆నిశ్శబ్ద
ద్రాక్ష ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనది. దీని రుచి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి.  ఎరుపు, నలుపు,  ఆకుపచ్చ రంగులలో లభిస్తుంది. వీటిలో ఎర్ర ద్రాక్ష కాస్త ప్రత్యేకం. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఎర్ర ద్రాక్షలో విటమిన్ ఎ,  సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ  శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. ఎర్ర ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే...  రోగనిరోధక వ్యవస్థ.. ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలతో పాటు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. కంటి ఆరోగ్యం.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎర్ర ద్రాక్ష మంచి ఎంపిక. ఎర్ర ద్రాక్ష ఆక్సీకరణ ఒత్తిడిని,  కళ్ల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్ర ద్రాక్షను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటిశుక్లం రాకుండా చేస్తుంది. బీపీ పై నియంత్రణ.. ఎర్ర ద్రాక్ష తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్,  ఫినోలిక్ యాసిడ్లు గుండెను వ్యాధుల నుండి రక్షించడానికి పని చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం.. ఎర్ర ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.  కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియ.. ఎర్ర ద్రాక్షలో ఉండే పొటాషియం,  ఫైబర్  జీర్ణక్రియకు సహాయపడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఎర్ర ద్రాక్షను ఆహారంలో చేర్చుకోవాలి. కొలెస్ట్రాల్‌.. ఎర్ర ద్రాక్ష కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.  ఆహారంలో ఎర్ర ద్రాక్షను చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది జ్ఞాపకశక్తిని,  మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.                                                    *నిశ్శబ్ద.
ఆ స్ప్రిరిన్ ,వార్ ఫారిన్ మందులతో రక్త శ్రావం నిపుణుల పరిశోదనలో వెల్లడి.. ఒకవేళ మీరు రక్తం పల్చబడేందుకు వాడే మందులు అవసరం లేదని.వాస్తవానికి సహజంగా రోగులకు ఇచ్చే బ్లడ్ తిన్నర్స్ అస్టిలిన్ ను తీసుకోవడం మానాలని దీనివల్ల అధిక రక్తశ్రావం  జరగడం వల్ల వచ్చే పరిణామాలు నియంత్రించ కుంటే ముప్పే.7౦౦ మందిపై జరిపిన పరిశోదనలో మిచిగన్ లోని క్లినిక్ లో వీనస్ త్రాంబో  ఎంబాలిజం లేదా గడ్డ కట్టడం లేదా ఆర్టియాల్ ఫైబ్రి లేషన్ లో గుండె సరిగా కొట్టు కోక పోవడం వల్ల గుండె పోటు వస్తుంది. రోగులకు సాధారణంగా లభించ్గే బ్లడ్ తిన్నేర్స్ వార్న్ ఫారిన్ గుండె సమస్య లేకపోయినా ఆస్ప్రిన్ తీసుకునే వారు అని పరిశోదనలో వెల్లడించారు.మనకు తెలిసిన విషయం  ఏమిటి అంటే ఆస్ప్రిరిన్  పెనేషియా డ్రగ్ కాదని కొంతమందిలో ఎక్కువశాతం రక్త్గ శ్రావం జరిగింది.అయితే క్లినిక్స్ లో అస్ప్రిరిన్ వినియోగం  తగ్గించే ప్రయాత్నం చేశామని పేర్కొన్నారు.  ఎవరికి అయితే అవసరం లేదో వారికి అస్ప్రిరిన్ ఇవ్వలేదని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్దియలజిస్ట్ హెల్త్ ఫ్రాంకల్ కార్డియో వాస్క్యులార్ సెంటర్ కర్దియలజిస్ట్ డాక్టర్ జాఫ్రీ బార్నేస్ అన్నారు.పరిశోదనలో ఎస్ప్రిరిన్ వినియోగం తగ్గించామని 46.6 % తగ్గించడం వల్ల రక్త శ్రావం తగ్గించగలిగామని రక్తశ్రావం ౩2.౩% వినియోగం తగ్గిందని వివరించారు. ప్రతి వెయ్యి మందిలో ఆస్పిరిన్ మానివేయడం వల్ల రక్త స్రావం తగ్గిందని పేర్కొన్నారు.అస్పిరిన్ ఆపడం వల్ల వచ్చిన ఫలితాలను జామా నెట్వర్క్ లో ప్రచురించారు.మేము పరిశోదన ప్రారంభించగానే అప్పటికే వైద్యులు అస్ప్రిరిన్ వినియోగం తగ్గించారని మాపరిశోదనలో రక్త శ్రావం వంటి సంఘటనలు పరిణామాలు తీవ్ర రక్త శ్రావం ఆపడం ద్వారారోగులను కాపాడగలిగా మని ఇంటర్నల్ మెడిసిన్ స్కూల్ జనరల్ ఫిజీషియన్లకు ఆరోగ్య శాఖ సిబ్బందికి  రోగుల కు బ్లడ్ తిన్నర్ గా అస్టిలిన్ ను వినియోగించరాదనిపరిశోధకులు సూచించారు. ఆస్టిలిన్ వాడే వారి కొంతమేర తక్కువ స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెల్లడించారు.ఇందులో  రక్తం పల్చబడితే ఇతర మందులతో పాటు ఎస్ప్రిరిన్ ను పరిసీలించినట్లు తెలుస్తోంది.మరో పరిశోదనలో వార్ ఫారిన్ తీసుకుంటున్న రోగులలో అస్పిరిన్ అర్తియాల్ ఫైబిలేషణ్,వి టి ఇ వీనస్ త్రాంబో ఎంబాలిజం లో రక్త శ్రావం ఎక్కువగా ఉందని వార్ ఫారిన్ తీసుకున్న వారిలోనూ రక్తశ్రావం జరగడం గమనించారు.అస్పిరిన్ తీసుకునే వారిలో ఇలాంటి సమస్యలు గమనించమని అయితే రక్తం గడ్డకట్టడం కన్నా రక్త శ్రావం ఎక్కువజరిగిందని పరిశోధకులు వెల్లడించారు.కొంత మందికి అస్టిలిన్ ప్రాణాలు రక్షిస్తే కొంతమందికి ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన చరిత్ర ఉందని గుండెపోటు అవసరమైన సమయంలో గుండెకు స్టంట్ పెట్టాల్సిన  పరిస్థితి వచ్చిందని రక్త ప్రవాహం పెరగడం గుండె సంబంధిత రక్త్గానాళా లలో సమస్యలు ఉన్నవారికి అందించడం అత్యవరం లాభం. మనం ఎదుర్కున్న సవాలు ఏమిటి అంటే గుండె సంబందిత సమస్యలు లేనివారు సైతం అస్పిరిన్ తీసుకుంటే యాంటి కాగులెంట్ గా సూచించవచ్చని ప్రముఖ హేపటాలజిస్ట్ ప్రొఫెసర్ జోడాన్ స్చేఫెర్ జనరల్ మెడిసిన్ వివరించారు.ప్రాధమిక స్థాయిలో నివారణకు అస్పిరిన్ వాడతారని గుండెపోటుకు చాలా తక్కువ ప్రభావం ఉంటుందని వార్ ఫారిన్ వాడినట్లైతే గుండె పోటును ఎదుర్కునేందుకు వాడరాదని అస్పిరిన్ పై సమీక్షించాలని మీసంరక్షణ చూసేవారు లేదా మీ ఫ్యామిలీ డాక్టర్ వీటి ప్రభావం నుండి బయట పడితే కొంతమేరా ప్రాణ హాని తీవ్ర రక్త్గశ్రావాని నివారించవచ్చు.