LATEST NEWS
తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. అయితే, పారిపాలనా సౌలభ్యం కోసం ఉన్న వారికే ఇంచార్జీలుగా బాధ్యతలు ఆప్పగిస్తారా ? లేదా ఐఎఎస్‌లను ఇంచార్జీలుగా నియమిస్తారా ? అనే విషయం ఆసక్తికరంగా మారింది.  వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కొత్త వీసీల నియామకానికై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే , ఒక్క కాకతీయ విశ్వవిద్యాలయం తప్ప మిగతా 9 విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామకాల కోసం సెర్చ్ కమిటీని ప్రభుత్వం నియమించింది.  కొత్త వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచే కసరత్తు చేపట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.  బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 208 దరఖాస్తులు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మా గాంధీకి 157, కాకతీయకు 149, తెలంగాణ వర్సిటీకి 135, జేఎన్‌టీయూహెచ్‌కు 106, తెలుగు విశ్వవిద్యాలయానికి 66, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయానికి 51 దరఖాస్తులు వచ్చాయి.  ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్జీయూ హెచ్‌ విశ్వవిద్యాలయాల వీసీలుగా పని చేసేందుకు ఎక్కువ మంది అసక్తి చూపుతున్నారు. వీసీల నియామకానికి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు సిట్టింగ్‌ వీసీలతో పాటు కొత్త వారు కూడా మొత్తం 312 మంది ప్రొఫెసర్లు తమ దరఖాస్తులను ప్రభుత్వానికి సమర్పించారు. అంతేగాక, తమ పేర్లను సిఫార్సు చేయాలని అభ్యర్థిస్తూ మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలపై ఒత్తిడి తెస్తున్నారు.  తమ జిల్లాల పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాల పరిధిలో తమ వారినే నియమించుకోవాలనే ఆసక్తితో పలువురు కాంగ్రెస్‌ ముఖ్యులు, మంత్రులు సీఎం దృషికి తెచ్చారు. కొత్త వీసీల నియామకం కోసం ప్రభుత్వం నియమించిన సెర్చ్‌ కమిటీలు కసరత్తు మొదలుబెట్టాయి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం అభ్యర్థుల గురించి ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించింది. మార్చిలో కోడ్‌ అమల్లోకి రావడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. వీసీల పదవీకాలం మే 21తో ముగుస్తున్నందువల్ల.. కొత్త వారి నియామకాలకు అనుమతించాలని కోరుతూ ఈనెల ఆరంభంలో ఈసీకి ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా అనుమతి ఇచ్చింది. వీసీ పదవికి 70 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి ఉంటుందని, ఇప్పటికే ఈ పదవిని రెండు దఫాలు నిర్వహించినవారు మూడోసారి ఎంపికకు అనర్హులవుతారు.  వీసీలుగా నియమితులు కావాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి. లేదా పరిశోధన, అకడమిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పదేళ్ల అనుభవం ఉండాలి. వీసీలను మూడేళ్ల కాలపరిమితికి నియమిస్తారు. ఈ వారంలోనే సెర్చ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి, వీసీల ఎంపికకు సిఫారసులు అందించనున్నాయి.  గత ప్రభుత్వం సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇచ్చిందనీ, తమ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయం నేపథ్యంగా నియామకాలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించినందున ఆ దిశలోనే కొత్త వీసీల నియామకం కోసం చర్యలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది.  ఈ నెలాఖరులోగా కొత్త వీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి.. నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌
ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంక‌ట కృష్ణారావు (కృష్ణ‌బాబు) అనారోగ్యంతో మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ‌బాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.  కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం నాడు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, కృష్ణారావు టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, టీడీపీకి కంచుకోట అయిన కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ మేనల్లుడు అయిన పెండ్యాల కృష్ణబాబు ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో కృష్ణబాబు తెరపై నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత టీడీపీ నుంచి టీవీ రామారావు ఎమ్మెల్యే అయ్యారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన జవహార్ మంత్రి కూడా అయ్యారు. అయితే, నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైనా.. పెండ్యాల కుటుంబానిదే ఈ నియోజకవర్గంలో పైచేయి. ముఖ్యంగా కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబు చెప్పినట్లే అక్కడ వినాల్సిన పరిస్థితి ఉంటుంది.  
ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీటీ తిరిగి ప్రారంభించింది. సోమవారం నుంచి సిఫార్సు లేఖల మీద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి ద‌ర్శ‌నం కోసం క్యూక‌డుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇలా భ‌క్తుల తాకిడి పెర‌గడంతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నాస‌రే.. శ్రీవారిని దర్శించుకునే సమయం తగ్గనుంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో మార్చిలో వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని ఈసీకి టీటీడీ అభ్య‌ర్థించింది. దీంతో టీటీడీ అభ్యర్థ‌న‌పై సానుకూలంగా స్పందించింది.  దీంతో మంగళవారం నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యులకు గతంలో తరహాలోనే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ. 300 ఎస్‌ఈడీ టికెట్లు జారీ చేస్తున్నారు. అలాగే ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్‌ టికెట్లను సిఫార్సు లేఖలను జారీ చేస్తున్నారు. ఈ సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి తక్కువ సమయం పట్టనుంది. అలిపిరి మెట్ల మార్గంలో చిరుతల కలకలం అలిపిరి మెట్ల మార్గంలో సోమవారం రెండు చిరుతలు భక్తులు చూసి కేకలు వేశారు. దీంతో చిరుతలు అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం 85,825 మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనానికి సోమవారం దాదాపు 16 గంటలు పట్టింది. 36,146 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల హుండీ ఆదాయం రూ.4.40 కోట్లు. భక్తులు వెయిటింగ్ కంపార్ట్‌మెంట్‌లు నిడిపోయి ఏటీసీ వద్ద వరకూ క్యూలైన్ లో వేచిఉన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక, విద్య, ప్రణాళిక, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సేవలు, స్థానిక సంస్థలు, భూమి & భవనాలు, ఉన్నత విద్య, శిక్షణ & సాంకేతిక విద్య, విజిలెన్స్, సహకార సంఘాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ & పబ్లిసిటీ వంటి అనేక ముఖ్యమైన విభాగాలకు సిసోడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ముఖ్యముగా, ఏ ఇతర మంత్రికి కేటాయించబడని అన్ని శాఖలను ఆయన పర్యవేక్షించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తే సిసోడియాకు ఇంతవరకు బెయిల్ లభించడం లేదు. ఈ కేసులో అందరికంటే ముందే అరెస్ట్ అయిన సిసోడియాకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు లేవు.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ దాఖలు చేసిన మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ఆప్ నేత‌ జ్యుడీషియల్ కస్టడీని మే 31 వరకు పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారం తీర్పును వెల్ల‌డించింది. మ‌నీశ్ సిసోడియా, సీబీఐ, ఈడీ తరఫున వాదనలు విన్న హైకోర్టు మే 14న పిటిషన్లపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విష‌యం తెలిసిందే. రెండు బెయిల్‌ పిటిషన్లపైనా న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈడీ, సీబీఐ మనీశ్ సిసోడియాను బెయిల్ పై విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాగా, సిసోడియా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి నుంచి జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న విష‌యం తెలిసిందే.
మంగళగిరిలో నారా లోకేష్ విక్టరీ పక్కా.. ఈ విషయంలో వైసీపీ వాళ్ళకి కూడా ఎలాంటి డౌట్ లేదు. ఈ ఎలక్షన్స్లో లోకేష్ మీద లావణ్య సంగతి అలా వుంచితే, మంగళగిరి స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా సాక్షాత్తూ జగన్ పోటీ చేసినా ఓడిపోవడం పక్కా. ఇక్కడ లోకేష్ విక్టరీ ఆ రేంజ్‌లో కన్ఫమ్ అయిందిమరి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కావచ్చు.. బెట్టింగ్ రాయుళ్ళకి కావచ్చు.. వీళ్ళందరూ లోకేష్ గెలుస్తాడా.. లేదా అనే విషయాన్ని ఆలోచించడం లేదు.. లోకేష్ మెజారిటీ ఎంత వుండవచ్చు అనే దగ్గరే డిస్కషన్ మొదలవుతోంది. ఈసారి లోకేష్‌కి 60 వేల ఓట్ల మెజారిటీ పక్కా అని తెలుగు తమ్ముళ్ళు ఢంకా బజాయించి చెబుతుంటే, వైసీపీ సానుభూతిపరులు మాత్రం తమ అభ్యర్థి లావణ్య మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ గెలుస్తాడుగానీ, పాతికవేలకంటే ఎక్కువ మెజారిటీ రాదు అని ఉక్రోషంగా అంటున్నారు. ఇప్పుడు మంగళగిరిలో వైసీపీ వర్గాలందరూ లోకేష్‌కి ఎక్కువ మెజారిటీ రాదు అనే పాయింట్ దగ్గరే ఫిక్సయిపోయారు తప్ప.. లోకేష్ గెలవడు అనే మాట జోలికి మాత్రం వాళ్ళు వెళ్ళడం లేదు. గతంలో లావణ్య గెలుస్తుందని బెట్టింగ్‌లోకి దిగిన వాళ్ళు ప్రస్తుతం బెట్టింగ్ డబ్బు వెనక్కి తీసుకునే తంటాలు పడుతున్నారు. ఇప్పటి వరకు బెట్టింగ్ కట్టనివాళ్ళు బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. గత ఎలక్షన్లలో ఇదే మంగళగిరి నుంచి ఓడిపోయిన లోకేష్, పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని బాగా నమ్మారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యారు. వాళ్ళ అభిమానానికి పాత్రుడు అయ్యారు. అందుకే మంగళగిరి నియోజకవర్గం ఓటర్ల మీద నమ్మకంతోనే లోకేష్ మూడు నెలల క్రితమే తాను మంగళగిరి నుంచి 53 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని  ప్రకటించారు. అయితే, పోలింగ్ రోజు పోటెత్తిన ఓటర్లను చూసిన తర్వాత రాజకీయ పరిశీలకులు లోకేష్ మెజారిటీని 60 వేల ఓట్లకు పెంచేశారు. వైసీపీ వర్గాల మైండ్‌సెట్‌ని లోకేష్ మెజారిటీ గురించి మాత్రమే ఆలోచించేలా ఫిక్స్ చేశారు.
ALSO ON TELUGUONE N E W S
From the promotional teaser for "Pushpa 2: The Rule," to the first song Pushpa Raj ruled social media like a king. Pushpa Pushpa, has stormed its way to the zenith of YouTube trends. The song creating sensation on YouTube shorts and instagram reels. Devi Sri Prasad composed the first single, “Pushpa Pushpa Pushpa Raj,” which features the lead hero, Allu Arjun, dancing flawlessly. The dance step of shoe dropping in it went viral. Fans are eagerly awaiting the second single. According to our sources, the next song is scheduled to be released in the last week of May or early June. The song will be a romantic duet. Now, we hear that makers planning to announce the second single this week. Most probably the song will be announced on 25th May. Mark your calendars as "Pushpa 2: The Rule" gears up for a grand worldwide release on August 15th, 2024. Prepare to embark on an exhilarating journey that will redefine the action genre and leave an indelible mark on the annals of cinematic history. Sukumar is directing the film while Rashmika Mandanna is playing the female lead. Fahadh Faasil playing key role. Devi Sri Prasad is scoring the music.
అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం ని ఉద్దేశించి ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు. పగోడికి కూడా మీ కష్టం రాకూడదు గురువుగారు అని. ఇప్పుడు ఈ డైలాగ్ ప్రముఖ సినీ నటి హేమ (hema) పరిస్థితికి పర్ఫెక్ట్ గా సూటవుతుంది.తన మానాన తాను  హైదరాబాద్ లో బిర్యానీ చేసి అభిమానులు కూడా అలా తయారు చేసుకొని సుష్టిగా తినాలని  మేకింగ్  వీడియోని  ఇనిస్టాగ్రమ్ లో అప్ లోడ్ చేస్తే పాడు లోకం నువ్వు హైదరాబాద్ లో చెయ్యలేదని  అంటుంది. పైగా ప్రూఫ్స్ తో సహా బయటపెడుతుంది.   బెంగళూర్ లో ఇటీవల ఒక  వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో  రేవ్ పార్టీ జరిగింది. అందులో  డ్రగ్స్ వాడుతున్నారన్న  పక్కా సమాచారంతో  పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేసారు.వారిలో  తెలుగు రాష్టాలకి చెందిన  సెలబ్రెటీలు ఉన్నారంటూ  కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. పైగా సినీ సెలబ్రెటీలు కూడా ఉండటంతో అందరు ఈ కేసు వైపే చూస్తున్నారు.వాళ్ళల్లో  హేమ కూడా ఉందనే వార్తలు వచ్చాయి.  కానీ రేవ్ పార్టీకి నాకు  ఎలాంటి సంబంధం లేదు. రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ హేమ ఒక  వీడియో రిలీజ్ చేసింది.ఆ వీడియో చూసిన వాళ్లంతా  నిజమే అని అనుకున్నారు. కానీ ఆ  వీడియో కూడా వైరల్ అయ్యి కూర్చుంది.ఎందుకంటే  ఆ పార్టీలో నటి హేమ ఉంది. పైగా హేమ మాట్లాడిన  వీడియో  బెంగళూరు ఫామ్‌హౌస్‌లోనే  షూట్ చేసింది. ఈ విషయాన్నీ కర్ణాటక పోలీసులు చెప్పడంతో అందరు ఒక్కసారిగా  షాక్ అయ్యారు. దీంతో తెలుగు ప్రజలు ఫుల్ కన్ఫ్యూజ్ లో ఉంటే  హేమ తాజాగా  ఇంకో వీడియో రిలీజ్ చేసింది. చికెన్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తు  ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసింది.దాంతో  నెటిజన్లు చాలా  దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో ఉండి హైదరాబాద్‌లో ఉన్నట్లుగా వీడియో రిలీజ్ చేస్తావా.. ఏం ఐడియా మేడమ్, భలే కవర్ చేశారు అంటూ  ఏకిపారేస్తున్నారు.పైగా ఆ వీడియో ఇప్పటిది కాదు అని పక్కాగా చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాలో హేమ వీడియోలు ఏమీ పోస్ట్ చేయలేదు. చివరి అప్‌డేట్ ఏప్రిల్ 26న ఉంది. దీంతో ఇప్పుడు సడెన్‌గా ఇలా బిర్యానీ చేసే వీడియో పోస్ట్ చేయడంతో నెటిజన్లు  లా పాయింట్లు లాగుతున్నారు.బెంగుళూర్ క్రైమ్ విభాగం అడిషనల్ కమిషనర్ చంద్రగుప్త  ఆధ్వర్యంలో కేసు నడుస్తుంది. ముందు ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో  ఎవరి పేర్లు బయటకి వస్తాయో చూడాలి  
Thalapathy Vijay is set to showcase his versatility by playing a dual role in The Greatest of All Time, directed by Venkat Prabhu. Meenakshi Chaudhary, the captivating beauty from Guntur Kaaram, is the leading lady in this highly anticipated film, backed by AGS Entertainment on a grand scale. The film shoot is going on at breakneck pace. The film's much-anticipated single "Whistle Podu" has unfortunately not lived up to the high expectations set by his previous blockbuster hit songs in films like "Mersal," "Master," and "Leo." The team is currently busy with the post production works. We've already reported that most happening heroine Sree Leela has approached for a special peppy song in the film and she rejected it as she wants to debut in Tamil with a proper film. Now, makers got confirmation from south queen Trisha. She will be doing the special peppy song and will be grooving with Thalapathy Vijay once again. Fans expecting a banger number that will be a viral chartbuster from the evergreen combo. The film will be releasing in theatres on September 5th. Fans are expecting that this is his last film and planning to celebrate in a grand way. The film will also be released in Telugu on same date.
Ram Charan's much-anticipated project, titled "Game Changer," has solid buzz among the audience and fans alike. This political action drama directed by Shankar. The film shoot is going at snail pace. This much delayed social drama may not make it to this october. The schedules aren't going according to the plan and the film may have to be delayed again. Ram Charan initially planned to complete his portions for the film "Game Changer" in June. However, director Shankar, who is also helming "Indian 2," will be occupied with promoting the Kamal Haasan, Kajal Aggarwal, and Siddharth starrer throughout June, as it is scheduled for a July release. Shankar provided this clarification to producer Dil Raju, explaining the scheduling conflict. With the "Game Changer" shoot delayed, Ram Charan has taken the opportunity to go on a family vacation. It leaves fans eagerly waiting for updates on the film's progress. The shoot for "Game Changer" is now postponed to July, but there is still no clear timeline on when the production will conclude.  This uncertainty leaves both the cast and crew in a state of limbo, as they await further instructions from Shankar. Fans and industry insiders are keenly watching for any new developments, hoping for a smooth and timely completion of the highly anticipated film. Game Changer eyeing for December release. Kiara Advani is playing the female lead. SJ Suryah, Anjali, Srikanth, Naveen Chandra, Sunil, Jayaram, and Samuthirakani are playing pivotal roles. Dil Raju is bankrolling this film and Thaman is the tunesmith. Karthik Subbaraj penned the film’s story.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా సినిమాకి తనను తాను మలచుకునే తీరు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. పాత్రకి తగ్గట్టుగా ఆయన తన దేహాన్ని, ఆహార్యాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ బొద్దుగా ఉండేవాడు. ముఖ్యంగా 'రాఖీ' సినిమాలో ఆయన లుక్స్ పై విమర్శలు వచ్చాయి. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ.. ఫిజిక్ మీద దృష్టి పెట్టకపోవడం ఎన్టీఆర్ కి మైనస్ అని సన్నిహితులు సైతం అభిప్రాయపడ్డారు. దాంతో 'యమదొంగ'కు బాగా సన్నగా అయ్యి.. అందరినీ సర్ ప్రైజ్ ఎన్టీఆర్. ఆ తర్వాత నుంచి సినిమాలోని పాత్రకి తగ్గట్టుగా తన ఫిజిక్ ని.. ఎలా అంటే అలా మలుస్తున్నాడు. ముఖ్యంగా 'టెంపర్'లో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ తో కనిపించి వావ్ అనిపించాడు. ఆ తర్వాత 'అరవింద సమేత'లో కూడా షర్ట్ లేకుండా మొండి కత్తి చేతపట్టి.. ఊచకోత కోసి.. థియేటర్స్ లో కేకలు వేయించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి షర్ట్ లెస్ యాక్షన్ ఎపిసోడ్ కి సిద్ధమవుతున్నాడు. 'వార్ 2' (War 2) సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హృతిక్ పాత్రకి ధీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. ఎన్టీఆర్ పై తెరకెక్కించే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ లో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ తో దర్శనమిస్తాడట. ఈ సీక్వెన్స్.. 'అరవింద సమేత' ఫైట్ ని మించేలా ఉండి, గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని చెబుతున్నారు. 'వార్ 2' షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ భారీ యాక్షన్ సన్నివేశం కూడా ముంబైలోనే షూట్ జరుపుకోనుందట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) సినీ జర్నీ, సృష్టించిన రికార్డులు, ఫ్యాన్స్ బేస్  వీటి గురించి  తెలియని తెలుగు సినిమా  ప్రేక్షకుడు లేడు. పుష్ప తో భారతీయ సినీ ప్రేక్షకులు కూడా తన గురించి తెలుసుకునేలా చేసాడు. అభిమానులందరు ముద్దుగా  బన్నీ అని పిలుచుకుంటారు. కొన్ని లక్షలాది మంది అభిమానులు ఆయన సొంతం . లేటెస్ట్ గా బన్నీకి   సంబంధించిన  పిక్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అల్లు అర్జున్ కి నంద్యాలలో ఉన్న ఫ్రెండ్ ఎవరు అని అడిగితే అందరు శిల్పా రవి చంద్రా రెడ్డి అని చెప్తారు.అంతలా ఇటీవల బన్నీ చేసిన నంద్యాల టూర్ ప్రజల్లో నాటుకు పోయింది. కానీ బన్నీ తో పాటు ఆయన శ్రీమతి స్నేహ రెడ్డి కూడా వెళ్లిందనే విషయం గురించి పెద్గగా బయటకి రాలేదు.కానీ స్నేహ రెడ్డి కూడా బన్నీ తో వెళ్ళింది.వాళ్లిద్దరు ఒక మాములు ధాబాలో కూర్చొని భోజనం చేస్తున్న పిక్ ఒకటి బయటకి వచ్చింది. అందులోని బన్నీ వేసుకున్న  డ్రెస్ గెటప్ చూస్తే నంద్యాల వెళ్లినప్పటి  ఫోటో అని ఈజీగా  అర్ధం అవుతుంది.పైగా  దీన్ని బట్టి అర్ధం అవుతుంది ఏంటంటే నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్తు ఇద్దరు కలిసి  ధాబా లో భోజనం చేశారనే విషయం అర్ధం అవుతుంది. ఇన్ని రోజులు బన్నీ ఒక్కడే నంద్యాల  వెళ్లాడని అందరు అనుకున్నారు. ఇప్పుడు స్నేహ రెడ్డి కూడా వెళ్లిందనే విషయం అర్ధమయ్యింది. అంటే తన భార్య సపోర్ట్ ఉందన్నమాట. మరి ఈ విషయంలో కూడా పవన్ ఫ్యాన్స్ స్పందిస్తారో లేదో  చూడాలి.    ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ ఫోటోని చుసిన చాలా మంది బన్నీ సింప్లిసిటీ ని మెచ్చుకుంటున్నారు. అదే టైంలో  దాబా న్యూస్  ఫ్యాన్స్ కి ముందుగానే తెలిసి ఉంటే  లక్షలాదిగా మందిగా  అక్కడకి చేరుకునే వారని అంటున్నారు. ఆ తర్వాత హైదరాబాద్  వెళ్ళడానికి బన్నీ  చాలా ఇబ్బంది పడేవాడని అంటున్నారు.  బన్నీ ప్రస్తుతం పుష్ప 2 (pushpa 2) చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతున్న ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక హీరోయిన్ కాగా సుకుమార్ దర్శకుడు. ఆగస్టు 15 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇటీవల వచ్చిన ఒక పాట యు ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది   
ఒక హీరోకి అనుకున్న కథని మరో హీరో చేయడం సహజం. అలా చేసి హిట్ కొట్టిన హీరోలు ఉన్నారు.. ఫ్లాప్ అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాగే ఎప్పుడో మహేష్ కోసం ఓ స్టార్ డైరెక్టర్ అనుకున్న కథ.. తిరిగి తిరిగి ఇప్పుడు ఓ కుర్ర పాన్ ఇండియా హీరో దగ్గరకు చేరిందని తెలుస్తోంది. చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ కి తెలుగులో ఎంతో క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా 'పోకిరి' ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, రెండో సినిమా 'బిజినెస్ మేన్' ఘన విజయం సాధించింది. వీరి కాంబోలో మూడో సినిమా కూడా ఎప్పుడో రావాల్సి ఉండగా.. ఏవో కారణాల వల్ల పట్టాలెక్కలేదు. పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన'ను మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. మహేష్ కూడా మొదట ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ ఎందుకనో ఆ తర్వాత 'జనగణమన'కు జై కొట్టలేదు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' చేయడానికి మహేష్ ముందుకు రాకపోవడంతో.. కొనేళ్లు దానిని పక్కన పెట్టి, ఇతర సినిమాలతో బిజీ అయ్యాడు పూరి. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో 'లైగర్' చేస్తున్న సమయంలో.. మళ్ళీ 'జనగణమన' తెరపైకి వచ్చింది. 'లైగర్' విడుదల కాకముందే.. విజయ్ తో 'జనగణమన'ను అనౌన్స్ చేశాడు పూరి. అయితే 'లైగర్' డిజాస్టర్ కావడంతో.. విజయ్ కూడా 'జనగణమన' చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కి.. మరో కొత్త హీరో దొరికినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ తో 'డబుల్ ఇస్మార్ట్' చేస్తున్న పూరి.. తన తదుపరి సినిమాని తేజ సజ్జా (Teja Sajja)తో చేయనున్నట్లు సమాచారం. 'హనుమాన్'తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తేజకి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. పలువురు దర్శకనిర్మాతలు తేజతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పూరి దృష్టి తేజపై పడినట్లు తెలుస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్  'జనగణమన'ని తేజతో చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని.. తేజ సైతం పూరితో సినిమా చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వినికిడి.  జయాపజయాలతో సంబంధం లేకుండా డైరెక్టర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు పూరి. పైగా హీరోలను ఆయన ప్రజెంట్ తీరుకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది.
స్టార్ హీరో సినిమా  చిన్న హీరో సినిమా అనే తేడా లేకుండా ఒక్కోసారి మధ్యలోనే  ఆగిపోయిన సినిమాలు చాలానే  ఉన్నాయి. కానీ  సినిమా పూర్తి అయితే మాత్రం  పెద్ద హీరో సినిమా థియేటర్స్ లోకి రావడం ఈజీ. కానీ  చిన్న సినిమాలు మాత్రం చాలా ఇబ్బందిని ఎదుర్కుంటాయి. సరైన రిలీజ్ డేట్, థియేటర్స్ దొరక్క లాబ్ లోనే ఉండిపోతున్నాయి. కానీ వాటన్నింటిని దాటుకుని ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు నేరుగా మీ ఇంట్లోకి రాబోతుంది    ఆరంభం..ఈ నెల 10 న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యింది.సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కగా తొలుత  పర్వాలేదనే టాక్ ని సంపాదించుకుంది. రివ్యూస్ కూడా బాగానే వచ్చాయి. కానీ రన్నింగ్ లో మాత్రం ప్రేక్షకాదరణని పొందలేకపోయింది.బహుశా ప్రేక్షకులకి తెలిసిన నటులు లేకపోవడం కావచ్చు. ఇపుడు ఈ మూవీ థియేటర్స్ ని విడిచి ఓటిటి లోకి  అడుగుపెట్టనుంది. మే 23 నుంచి తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.కేవలం రెండు వారాల వ్యవధిలోనే  ఓటిటి లోకి రావడం విశేషం. సుప్రీత సత్యనారాయణ్,  మోహన్ భగత్, భూషన్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, భూషణ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి ముఖ్య పాత్రల్లో కనిపించారు. అజయ్ నాగ్ దర్శకత్వం వహించగా అభిషేక్ వి తిరుమలేష్ నిర్మించారు. సింజిత్ యర్రమిల్లి సంగీతాన్ని దేవదేవ్ గాంధీ కెమెరామన్ గా వ్యవహరించాడు     
స్టార్ హీరో  విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసి విభీమన్నమైన నటనతో ప్రేక్షకాదరణని పొందిన హీరో ఆనంద్ దేవరకొండ. బేబీ తో మంచి విజయాన్ని అందుకొని  ప్రస్తుతం గం గం గణేశా అంటున్నాడు. రీసెంట్ గా  ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని  అతిధులు చెప్పిన విషయాలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి  ప్రముఖ అగ్ర  రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి  గం గం గణేశా  ట్రైలర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  మొదట విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతు చిత్ర దర్శకుడు ఉదయ్  తన దగ్గర పని చేసాడని. అంకిత భావం కష్టపడేతత్వం ఉన్నవాడు. మూవీ తప్పకుండా విజయం సాదిస్తుందని చెప్పాడు. అనంతరం వంశీ మాట్లాడుతు బేబీ  ట్రైలర్ జులై లో విడుదల చేసాం.అప్పుడు వర్షం పడింది.  మూవీ పెద్ద  హిట్ అయ్యింది. ఇప్పుడు గం గం గణేశా  ట్రైలర్ మే లో విడుదల చేసాం.ఇప్పుడు వర్షం పడుతుంది.  కాబట్టి బేబీ లాగే   సూపర్ హిట్ అవుతుందని చెప్పాడు.   అత్యాశ,భయం,కుట్ర అనే అంశాల చుట్టూ అల్లుకున్న క్రైమ్ కామెడి కథ  అని ఆనంద్ దేవరకొండ  చెప్పాడు. ఇండస్ట్రీ లో ఎవరైనా ఏదైనా సాధిస్తే కొంత మంది మాత్రమే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో మార్పు రావాలి.అందరం కలిసి సెలెబ్రేట్ చేసుకొవాలి అని కూడా  చెప్పాడు తెలుగు వారి అభిమాన పండుగ  వినాయక చవితి బ్యాక్ డ్రాప్ లో మూవీ తెరకెక్కింది. ప్రగతి శ్రీ వాత్సవ, నయన్ సారిక లు హీరోయిన్లుగా  చేస్తుండగా కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మి శెట్టి దర్శకుడు. మే 31 న విడుదల అవుతుంది, చైత్యన్య భరద్వాజ్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ట్రైలర్ కూడా సూపర్ గా ఉంది  
కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda). త్వరలో ఆనంద్ "గం..గం..గణేశా" (Gam Gam Ganesha) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా కోసం తన లుక్ కూడా మార్చేశాడు. ఆయన ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. తాజాగా తన సిక్స్ ప్యాక్ ఫొటోను ఆనంద్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆనంద్ సిక్స్ ప్యాక్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతని చేంజోవర్ చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. డెడికేషన్ అదిరిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా 'లైగర్' కోసం తన అన్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా సిక్స్ ప్యాక్ చేశాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆనంద్ "గం..గం..గణేశా"తో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడేమో చూడాలి. తాజాగా విడుదలైన ట్రైలర్ కి అయితే మంచి స్పందనే వచ్చింది. "గం..గం..గణేశా" యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా ఈ నెల 31న థియేటర్స్ లోకి రాబోతోంది. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. తల్లిదండ్రులు, స్నేహితులు, చుట్టాలు, తెలిసిన వారు ఇలా చాలామంది జీవితంలో  ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. తల్లిదండ్రులు కన్నవారు కాబట్టి వారు జీవితాంతం పిల్లల విషియంలో పాజిటివ్ గానే ఉంటారు. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఈ బంధాలన్నీ బయటినుండి వచ్చేవే.. అయితే అన్నింటి కంటే భాగస్వామి పాత్ర మాత్రం చాలా పెద్దది. జీవితంలో ఓ దశలో బంధంలోకి వచ్చి చివరి వరకు కలసి ఉండేవారు జీవిత భాగస్వాములు.  జీవిత భాగస్వాములతో బంధం  ఎంత బలంగా ఉంటే ఇద్దరి జీవితం, ఇద్దరి భవిష్యత్తు  అంతే గొప్పగా ఉంటుంది. ఈ బంధం ఎంత బలంగా ఉందో నిర్ణయించే   5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే బంధం బలాన్ని స్పష్టం చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేస్తున్నారా.. ఒక బంధం బలంగా ఉండాలంటే దానికి ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ అవసరం. మీరు,  మీ భాగస్వామి,  మీ ఆలోచనలు, భావాలు,  అవసరాలను బహిరంగంగా వ్యక్తపరచగలరో లేదో అంచనా వేయాలి.  ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వింటున్నారా? ఇద్దరి మధ్య చర్చలు వివాదాలు  వాదనలుగా మారుతున్నాయా? ఇలాంటివి  వివాదాలుగా మారకుండా   పరిష్కరించగలుగుతున్నారా? ఇవన్నీ కమ్యూనికేషన్  సమర్థవంతంగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.  కమ్యూనికేషన్ బాగుంటే ఇద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం, నమ్మకం పెరుగుతాయి. ఏకభావం.. బలమైన బంధానికి  భాగస్వాముల విలువలు, ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఎలా ఉంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది . మీరు అయినా,  మీ భాగస్వామి అయినా, ఇద్దరి  ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారా? ఇద్దరి నిర్ణయాలు  కెరీర్, కుటుంబం, జీవనశైలి లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించినవా అని ఆలోచించాలి. ఇద్దరూ జీవితంలో ఎలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు?  వంటివి ఇద్దరూ భవిష్యత్తు కోసం ఎంత మాత్రం ఏకభావంతో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.  సంఘర్షణలు.. ఏ సంబంధంలోనైనా సంఘర్షణలు  తప్పనిసరిగా ఉంటాయి. అయితే వాటిని ఎలా డీల్ చేస్తారనే దానిపైనే బంధం ఆధారపడి ఉంటుంది.   భాగస్వామితో కలిగే  విభేదాలు,  సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో, ఎలా ఎదుర్కోవాలో పరిశీలించాలి. గొడవలు జరిగినప్పుడు రాజీ పడటం,  పరిష్కారం కోసం ప్రయత్నించడం వంటివి ఏ మేరకు జరుగుతున్నాయో తరచి చూసుకోవాలి.    వివాదాలు పెరుగుతున్నాయా?  వాటిని పరిష్కరించుకోవడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు?  ఆరోగ్యకరమైన  రీతిలో గౌరవం మరియు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను కనుగొనే సుముఖత ఉంటాయి. భావోద్వేగాలు.. భావోద్వేగ సాన్నిహిత్యం భౌతిక సాన్నిహిత్యానికి మించినది.  భాగస్వామితో భావోద్వేగ పరంగా లోతుగా కనెక్ట్  అయితే  ఇద్దరి మధ్య బంధం కూడా బలంగా ఉంటుంది. ఇద్దరి ఆలోచనలు, భయాలు , ఇబ్బందులను ఒకరితో మరొకరు సరిగా ఓపెన్ అయ్యి చెప్పుకుంటున్నారా?  అవసరమైన సందర్భాలలో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా?  ఇవన్నీ ఇద్దరి మధ్య బంధం ఎంత గాఢంగా ఉందో తెలియజేస్తుంది.  పెట్టుబడి.. ఏ వ్యాపారానికి అయినా ఎలాగైతే డబ్బు, కష్టం పెట్టుబడిగా పెడతారో.. అదే విధంగా  బంధం బలంగా ఉండటానికి సమయం పెట్టుబడి పెట్టాలి. ఇద్దరూ ఒకరికోసం ఒకరు సమయం ఎలా కేటాయించుకుంటున్నారనే దానిపై బంధం ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో చురుకుగా ఉంటున్నారా?. ఇద్దరూ  కలిసి  క్వాలిటీ టైమ్ మెయింటైన్ చేస్తున్నారా?  ఒకరి అవసరాలకు మరొకరు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఒకరిని మరొకరు మెచ్చుకోవడం, ప్రోత్సహించడం, సపోర్ట్ ఇవ్వడం  వంటివి చేస్తున్నారా? ఇవన్నీ ఒక బంధం బలపడటానికి పెట్టుబడులే.                                                       *రూపశ్రీ.
పొగిడి చెడినవాడు లేడు. సమయోచితంగా పొగడలేని వారు అన్ని చోట్లా చెడిపోతారు. జీవితంలో కొందరికి జ్ఞానం ఒక దశలో వస్తుంది. అంతకు క్రితం నష్టమైపోయిన కాలాన్ని కూడదీసుకోవడానికి అన్నట్లుగా జ్ఞానోదయమైన మరుక్షణం నుండి అవతలివారిని అమితంగా, భరించలేనంతగా పొగడడం నేర్చుకుంటారు. ఇలాంటి వ్యక్తి తాను పొగిడేవాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తాడు. 'ది స్కై ఈజ్ ది లిమిట్” అని రుజువు చేస్తాడు. అవతలి వ్యక్తి అలిసిపోయేంత వరకూ, లేక తాను అలిసేంత వరకూ పొగుడుతాడు.  ఒక్కొక్కసారి అక్కడ పొగడడానికి తగినంత విషయం లేనప్పుడు అతడి ఇంట్లో తనకు ఆతిథ్యమిచ్చిన ఆయన సతీమణి అమృతహస్తాన్ని, ఆవిడ వండి వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా వుంటాయో ఇలాంటి విషయాలను ఇరికించి మరీ చెప్తాడు. ఇలాంటి సబ్జక్టును గురించి ఎంతైనా చెప్పే వీలుంది. ఆ వంకాయ కూర, ఆ పాయసం, వారింటి నెయ్యి ఘుమఘుమలు, ఇట్లా చెప్పుకుపోతూ వుంటే దీనికి అంతుందా అనిపిస్తుంది. అక్కడ సన్మానంలో సన్మానితుడూ, ఉపన్యాసకుడూ అలసి పోయేలోగా శ్రోతలమైన మనం అలసిపోవడం ఖాయం. ఇలా ప్రసంగించేవాడికి సన్మానితుడు అసలెవరో తెలీని సందర్భాలు కూడా ఎదురావుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ ప్రాసంగికుడు ఏ మాత్రం జంకడు. ఎవర్ని సన్మానిస్తున్నారో వారిని గురించి చీటిమీద మూడు ముక్కలు వ్రాసి ఇలా ఇవ్వండి. మూడునిమిషాల్లో ప్రసంగ పాఠంతో రెడీ అయిపోతాను. మీరు వేదికమీద ఆహ్వానితులు నలుగురికీ పూలమాలలు వేసేలోగా నా చెవిలో నాలుగుముక్కలు ఊదితే దంచి పారేస్తాను. ఎవరిని గురించి చెప్పే వాక్యాలైనా నాకు కంఠస్థమే, తడుము కోవలసిన అవసరముండదు. రాజకీయ, పారిశ్రామిక, విద్యావేత్తలెవరైనా సరే, కళాకారులు, సినిమా స్టారులైనా సరే. ఎవరికి తగిన సన్మాన వాక్యాలు వారికి వప్పజెప్పడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగానే వుంటాను. గుటికెడు కాఫీ సేవించి గొంతు సవరించానంటే ఇక ఆ తర్వాత ఉపన్యాసం అనర్గళంగా సాగిపోతుంది" అని హామీ ఇస్తాడు. అన్ని రంగాల్లోనూ స్పెషలైజేషన్ చోటు చేసుకున్న నేటి కాలంలో పొగిడే కళలో కొందర్ని తర్ఫీదు చేసి, వారికి లైసెన్స్ మంజూరు చేయడంలో తప్పేమీ కనిపించదు అనిపిస్తుంది. ఈ లలితకళను శాస్త్రీయంగా ఎక్కడా అభ్యసించకపోయినా, అనేక సంవత్సరాల అలవాటు కొద్దీ దీనిని క్షుణ్ణంగా నేర్చినవారు మన రాష్ట్రంలో ఎందరో వున్నారు. ఇలాంటివి నేర్పటానికి  నెలకొల్పే సంస్థల్లో ప్రస్తుతానికి వీరిని అధ్యాపకులు గానూ, శిక్షకులుగానూ నియమించవచ్చు. ఒక బాచ్ విద్యార్థులు శిక్షణ పొందితే ఇక ఆ తర్వాత కావలసినంత మంది అధ్యాపకులు. సమోవా అనే చిన్న రాజ్యానికి ఒక రాజుండేవాడు. అతడి రాజ్యంలో డాక్టర్ విన్సెంట్ హైనర్ అనే పెద్దమనిషి కొన్నాళ్ళుండి కొంత ప్రజాసేవ చేశాడు. డాక్టరు మహాశయుడు ఆ రాజ్యాన్ని వదలి వెళ్ళే తరుణంలో ఆ రాజుగారు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా రాజు డాక్టర్ను గురించి నాలుగు వాక్యాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాని రాజు కుర్చీలో కదలకుండా కూచున్నాడు. రాజు లేచి నుంచోని ప్రసంగించకుండా అలానే కూచోనుండటం డాక్టర్ హైనర్కు ఆశ్చర్యం కలిగించింది. ఈలోగా పొగడ్తనే వృత్తిగా చేసుకున్న ఒక వక్త వచ్చి రాజు తరపున డాక్టర్ హైనర్ గురించి బ్రహ్మాండమైన వాక్యాలతో దంచి పారేశాడు. సుదీర్ఘమైన ఆ ప్రశంసా వాక్యాల తర్వాత హైనర్ కొంత కింధా మీదై. ఉచిత రీతిని సమాధానం చెప్పడానికి లేచి నుంచోబోయాడు. రాజుగారు హైనర్ను వారిస్తూ కూచోమంటూ సౌంజ్ఞ చేశాడు. "మీ తరపున ప్రసంగించటానికి కూడా ఒక వక్తను నియమించాను. ఇక్కడ మా రాజ్యంలో ఇలాంటి ప్రసంగాలు ఆ వృత్తి స్వీకరించిన వారే చేస్తారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం మా పద్ధతి కాదు" అని వివరించాడు. ఇది పొగడటానికి కూడా ఎంత ప్రతిభ ఉండాలో తెలియజేస్తుంది. వాక్చాతుర్యం మనిషికి ఎంత ముఖ్యమో స్పష్టపరుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.
ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తున్నా, ఏదైనా పని చేసుకుంటున్నా  పక్కనే ఒక ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు పెట్టుకుని ఉంటారు. ఇక భోజనం చేసేటప్పుడు అయితే ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్ళు పక్కన పెట్టుకుంటారు. రాత్రి నిద్రపోయే ముందు పక్కనే ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు పెట్టుకుంటారు.  ఇక బయటకు వెళ్లినా  వెంట ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు తీసుకెళ్లాల్సిందే. లేకపోతే బయట 20 నుండి 30 రుపాయలు పెట్టి నీళ్ళ బాటిల్ కొనాల్సి వస్తుంది. ఎక్కడైనా తాగుదామా అంటే పరిశుభ్రత గురించి, నీటి క్వాలిటీ గురించి ఆలోచిస్తాం. కొందరు అయితే ఆరోగ్యం మీద స్పృహతో ప్రయాణాలలోనూ, హోటళ్లలోనూ వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసి నీరు తాగుతారు. కానీ ఇలా బాటిళ్లలో నీరు తాగడం అంత మంచిది కాదని ఎప్పటినుండో చెబుతున్నా ఇప్పుడు ఓ దారుణమైన నిజం బయటపడింది. ప్లాస్టిక్ బాటిళ్ళలో నీరు తాగడం గురించి శాస్త్రవేత్తలు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. అందరూ వాటర్ బాటిళ్లలో నీరు తాగుతారు. ఇంట్లో అయినా, బయట నేరుగా బాటిళ్లతో కొనే నీరు అయినా పరిశుభ్రంగా ఉన్నాయని అనుకుంటారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు  డబుల్ లేజర్ సూక్ష్మదర్శిని ఉపయోగించి ఈ బాటిళ్లలో నీటిని పరిశీలించగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. సగటు లీటర్ వాటర్ బాటిల్ లో రెండు మిలియన్ల కంటే ప్లాస్టిక్ ముక్కలు సూక్ష్మరూపంలో ఉంటాయట. ఇవి అదృశ్యరూపంలో ఉండే నానోప్లాస్టిక్ ముక్కలుగా తేలింది. కొలంబియా,  రట్జర్స్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు మూడు సాధారణ బాటిల్ వాటర్ బ్రాండ్‌ల నుంచి  ఐదు బాటిళ్ల నీటిని  పరిశీలిస్తే, ఒక లీటరు నీటిలో 1,10,000, మరొక దాంట్లో  4,00,000 ఇలా ఉన్నాయి. మొత్తం మీద  ప్లాస్టిక్ ముక్కల సంఖ్య ప్రతి బాటిల్ కు  సగటున 2,40,000 ఉన్నాయి.  ఇవి ఒక మైక్రాన్ కంటే తక్కువ పరిమాణంలో ఉండే కణాలు. ఒక అంగుళంలో 25,400 మైక్రాన్లు ఉంటాయి.  ఇది మీటర్‌లో మిలియన్ వంతు. కాబట్టి మైక్రోమీటర్ అని కూడా పిలుస్తారు. మనిషి  జుట్టు దాదాపు 83 మైక్రాన్ల వెడల్పు ఉంటుంది. ఇంతకు ముందు ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి గురించి జరిపిన అధ్యయనంలో 5 మిల్లీమీటర్ల నుండి పావు అంగుళం కంటే తక్కువగానూ, ఒక మైక్రాన్ వరకు ఉండే కొంచెం పెద్ద మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నాయి. మైక్రోప్లాస్టిక్‌ల కంటే బాటిల్ వాటర్‌లో దాదాపు 10 నుండి 100 రెట్లు ఎక్కువ నానోప్లాస్టిక్‌లు ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి.  ప్లాస్టిక్ బాటిళ్లలో ఇలాంటి నీరు తాగడం వల్ల కలిగే ఇబ్బందులు  ఏమిటంటే..  ఈ చిన్న కణాలు మెదడుకు రక్త సరఫరాకు అంతరాయం కలిగించడం,   వివిధ అవయవాలు,  క్రాస్ మెమ్బ్రేన్‌లను ప్రభావితం చేయడం చేస్తాయి. అదే విధంగా  ఈ  నానోప్లాస్టిక్‌లు పేగుల్లో పేరుకుపోయి వాటిని నిరోధించే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు ఈ కణాలు మెల్లిగా రక్త నాళాల వైపు కదులుతాయి. మనిషి  శరీరంలో ఆల్వియోలస్ అనేది ఊపిరితిత్తుల భాగం. ఇది రక్తంలోకి ఆక్సిజన్‌ను విడుదల చేయడానికి,  రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్‌ను స్వీకరించడానికి పెద్ద రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ కణాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశించి రక్తం-గాలి ప్రసరణకు అవరోధాన్ని కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా చిన్న ప్లాస్టిక్ కణాలు గర్భవతులలో మావిని ప్రభావితం చేస్తాయి. తల్లీబిడ్డలను కలిపే  అవయవం మావి. ఇది ప్రభావితం కావడం వల్ల  ఆక్సిజన్,  పోషకాలను తల్లి నుండి పిండానికి రవాణా చేయడం కష్టతరమవుతుంది.                                               *నిశ్శబ్ద.  
నేడు దేశంలో ని సగానికి పైగా యువత తక్కువ వయసులోనే జుట్టు ఊడిపోవడం, బట్టతల సమస్య ఎదుర్కుంటున్నారు.ఈ సమస్యవల్లె చాలామందికి పెళ్ళికూడా కాక పోవడం సంభవిస్తోంది అందరిముందు బట్టతల తో తిరగాలంటే సిగ్గుపడడం గమనించవచ్చు. ఇందుకోసం అందంగా కనపడడానికి బాగా జుట్టుపెరగాదానికి చేయని ప్రయాత్నం అంటూ లేదు అందుకోసం పడుతున్న పడరాని పాట్లు వర్ణనాతీతం చివరగా ఎదిక్కులేక హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అంటే జుట్టు మార్పిడి చేయించుకోడానికి సిద్ధమౌతున్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు ఇబ్బిడి ముబ్బిడిగా పుట్టుకొస్తున్న నేపధ్యంలో మే నెలలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల ౩5 సంవత్సరాల వ్యక్తి మృతి చెందం తీవ్ర కలకలం రేపింది. డిల్లి నార్త్ వెస్ట్ ప్రాంతం లోనిరోహిణి లో  హెయిర్ టాన్స్ ప్లాంట్ చేస్తున్న సమయంలో రోగి మరణిం చడం పై డిల్లి హైకోర్ట్ తీవ్రంగా పరిగణిస్తూ కేంద్రం ప్రభుత్వాలు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేవారిపట్ల వైద్య నియమ నిబందనలు అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలని డిల్లి హైకోర్ట్ ఆదేశించింది. ఇందుకోసం జాతీయ స్థాయి ప్రమాణాలు నియమ నిబందనలకు అనుగుణంగా పరిశీలించాలని నష్నల్ మెడికల్ కమీషన్ కు ఆదేశాలు జారీచేసింది. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు అత్యవసర సమయంలో అందించాల్సిన చికిత్చలు కు సత్వరం అందించేందుకు సమీపంలో పెద్ద ఆసుపత్రులలో నిర్వహించాలని క్లినిక్ నిర్వాహకులకు సూచించింది.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల జీవితం అంతమై పోదు, మరనిస్తారాని కాదు నష్నల్ మెడికల్ కమీషన్ తీసుకున్న నిర్ణయం పట్ల హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రముఖ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని ప్రైవేట్ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ బృందం ఉంటుందని క్లినిక్లకు పెద్దసవాలు కాగలదని హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ చండి జైన్ గుప్తాఅన్నారు ప్రైవేట్ క్లినిక్లను కార్పోరేట్ పెద్ద ఆసుపత్రులు అనుమతించ బోవని ఆయా ఆసుపత్రుల నుండి సవాళ్లు తప్పవని డాక్టర్ మయాంక్ సింగ్ అన్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయం లో అనుసరించే పద్ధతి అలసటతో కూడుకున్నది పెద్ద పెద్ద వసతులు ఉన్నప్పుడు ఎంపిక సులభమని అన్ని సదుపాయాలు ఉన్న చోట అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు అందుతాయని పి ఎస్ ఆర్ ఐ ఆసుపత్రి ఎల్లప్పుడూ స్వగాతిస్తుందని వైద్యులు అన్నారు.అయితే దీనికోసం నూతన విధి విధానాలు అమలు చేయాలని సరైన సదుపాయాలూ శిక్షణ లేని వారుహెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ నిర్వహించడం వల్ల ప్రజల ప్రాణాలకు హానికలిగే అవకాసం ఉంది. డిల్లి లో సరైన సదుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లు చాలానే ఉన్నాయాని పద్దతి ప్రకారం నిర్వహించే ట్రాన్స్ ప్లాంట్ కు 1.5 నుండి 2 లక్షలు అవుతుందని అంటున్నారు నిపుణులు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ పరిశ్రమను నూతన జవసత్వాలు కల్పించడం నాణ్యత ప్రమాణాలు సాడుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లపై ఉక్కు పాదం మోపడం అంటే నియంత్రించడం. జాతీయ ఆరోగ్య మిషాన్ ఎన్ ఎం సి నియమ నిబంధనల అనుగుణంగా పనిచేయాలని పేర్కొంది.ఈ విషయాన్ని మోడ్రన్ ఈస్థటిక్స్ స్వాగతించింది.ఇది కేవలం డే కేర్ సర్జరీ మాత్రమే అనిస్పష్టం చేసారు. ఎన్ ఎం సి నిబందనల ప్రకారం ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ కు సమీపం లో నర్సింగ్ హోం ఉండాలన్న నిబంధన విధించిందన్న విషయం గుర్తుచేశారు. అత్యవసర మైన పక్షం లో అవసరమైన సమయం లో చేర్చేందుకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉండడం అత్యవసరమని పేర్కొంది తద్వారా రోగిని ప్రమాదం నుండి తపాయించావచ్చని పేర్కొంది. అయితే ట్రాన్స్ ప్లాంట్ లో సమయంలో ప్రమాదం జరగడం అరుదని డాక్టర్ గుప్తా అన్నారు.ఈ మధ్యకాలం లో దేశవ్యాప్తంగా చోటు చేసుకోవడం పై గుప్తా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. సర్జరీ సమయం లో ప్రత్యేక పద్దతి అనుసరించాలాని బలమైన అనస్తీషియా బృందం ఉండాలాని ఎందుకంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయాని చాలా క్లినిక్స్ లో డర్మటాలాజిస్ట్ లు లేదా ప్లాస్టిక్ సర్జన్స్ ఎనేస్తీషియా ఎక్స్ పర్ట్ గా వ్యవహరిస్తున్నారని వారి వద్ద సురక్షిత మైన వారు లేరని రోగులు తీవ్రమైన విచిత్ర మైన పరిస్థితులు ఎదుర్కోవడం సంభవిస్తుందని అందుకే అప్రమత్తం గా ఉండాలని ఎన్ ఎం సి హేచారించింది.ఎన్ ఎం సి నియనిబంధనలకు లోబడే ప్లాస్టిక్ సర్జన్లు ఉండాలి. అర్హత లేని వ్యక్తుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయాని ఎన్ ఎం సి హెచ్చరించింది.                                          
ఒక లీటరు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయట.  నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంద‌ని,  ప్రాణాంతక వ్యాధులపై.... బెర్లిన్ - జర్మనీలో జ‌రిగిన‌ మెడికల్ కాన్ఫరెన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే బెథాలేట్ అనే రసాయనం నీటిలో కలుస్తుంది. ఆ నీరు త్రాగినప్పుడు, అది రక్తంలో కలిసిపోతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు పురుషులలో స్పెర్మ్ కౌంట్‌తో పాటు, నాణ్యత  తగ్గుతుందని మెడికల్ కాన్ఫరెన్స్ హెచ్చ‌రిస్తూ,  కొన్ని సూచ‌న‌లు విడుద‌ల చేసింది.   1. చమురును తిరిగి ఉపయోగించ వద్దు   2. పొడి పాలు వద్దు   3. మ్యాగీ క్యూబ్స్ వద్దు   4. కార్బోనేటేడ్ జ్యూసులు వద్దు (లీటరుకు 32 చక్కెర ఘనాలు ఉంటాయి)   5. ప్రాసెస్ చేసిన చక్కెర వద్దు   6. మైక్రోవేవ్ చేసిన తినుబండారాలు    7. ప్రినేటల్ మామోగ్రామ్ వద్దు, కానీ ఎకోమామర్ ఉపయోగించవచ్చు   8. చాలా బిగుతుగా ఉండే బ్రాలను ధరించవద్దు   9. మద్యం వద్దు   10. చ‌ల్ల‌గా వున్న‌ భోజనాన్ని మళ్లీ వేడి చేయకూడదు   11. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవద్దు.   12. అన్ని గర్భనిరోధక మాత్రలు మంచివి కావు ఎందుకంటే అవి మహిళ యొక్క హార్మోన్ల వ్యవస్థను మార్చి క్యాన్సర్‌కు కారణమవుతాయి.   13. డియోడరెంట్స్ ప్రమాదకరమైనవి, ముఖ్యంగా షేవింగ్ తర్వాత ఉపయోగించినప్పుడు.   14. డబ్బా పాల కంటే తల్లి పాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ.   15. క్యాన్సర్ కణాలు ఎక్కువగా చక్కెర మరియు అన్ని కృత్రిమ చక్కెర, బ్రౌన్ చక్కెరను కూడా తింటాయి.   16. తన ఆహారంలో చక్కెరను మానుకున్న క్యాన్సర్ రోగి తన వ్యాధి తగ్గుముఖం పట్టి దీర్ఘాయుష్షును పొందగలడు.  షుగర్ = ప్రాణ శత్రువు.   17. ఒక గ్లాస్ బీర్ శరీరంలో 5 గంటలు ఉంటుంది మరియు ఈ సమయంలో ఈ గ్లాస్ కారణంగా వ్యవస్థ యొక్క అవయవాలు స్లో మోషన్‌లో పనిచేస్తాయి.   18. చక్కెరకు బదులుగా సహేతుకమైన పరిమాణంలో తేనె   19. మాంసానికి బదులుగా బీన్స్ వంటి కూరగాయల ప్రోటీన్లు   20. పళ్ళు తోముకునే ముందు ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల నీరు మరియు నిద్ర లేవగానే అదే గది ఉష్ణోగ్రత వద్ద గదిలో ఉంచిన నీరు త్రాగాలి   21. క్యాన్సర్ నిరోధక రసం:    కలబంద + అల్లం + పార్స్ లీ + సెలెరీ + బ్రోమెలైన్ (పైనాపిల్ మిడిల్).. మిక్స్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి.   22. ప్రతి రోజూ పచ్చి లేదా వండిన క్యారెట్లు లేదా వాటి రసాన్ని తినండి/త్రాగండి.   23. ప్లాస్టిక్ కప్పులో టీ తాగవద్దు   24. కాగితం లేదా ప్లాస్టిక్ సంచిలో వేడి తినుబండారాలు ఏమీ తినవద్దు.  ఉదాహరణ: బంగాళదుంపలు (ఫ్రైస్).   25. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్‌ని ఉపయోగించవద్దు - ఎం.కె. ఫ‌జ‌ల్‌