LATEST NEWS
  తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఢిల్లీ హైకోర్టు ఈ నెల 7న ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమగ్ర వివరణ పంపినట్లు వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆదివారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఎన్నికల కమిషనర్లకు లేఖ రాశారు. ఆ లేఖలో ఈ ఏడాది ఏప్రిల్ 28న కేంద్ర ఎన్నికల కమిషన్ "తెలంగాణ రక్షణ సేన" పేరును తమకు కేటాయిస్తూ లేఖ పంపిందని గుర్తు చేశారు. ఆ నిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించడం, సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. అయితే జూన్ 23న ఎన్నికల కమిషన్ పంపిన లేఖలో పార్టీ రిజిస్ట్రేషన్‌పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని తెలిపిందని, కానీ ఆ అభ్యంతరాల కాపీలను ఇప్పటి వరకు తమకు అందించలేదని విమర్శించారు. ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేశారో, వాటి వివరాలేమిటో తెలియకుండా తాము ఎలా సమాధానం చెప్పగలమని ప్రశ్నించారు. తెలంగాణ జనాభా మూడున్నర కోట్లకు పైగా ఉండగా కేవలం వెయ్యి అభ్యంతరాలను చూపిస్తూ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు. అభ్యంతరాల వెనుక చట్టపరమైన బలం ఏమిటో పరిశీలించాలని, అవి సమన్వయంతో దాఖలు చేశారా అనే అంశం కూడా తెలుసుకోవాల్సి ఉంద న్నారు." తెలంగాణ రక్షణ సేన" అనే పేరును స్వతంత్రంగా, పూర్తి సదుద్దేశంతో ఎంపిక చేసుకున్నామని తెలిపారు. దేశంలో ఈ పేరుతో మరే రాజకీయ పార్టీ నమోదు కాలేదని, గుర్తింపు పొందిన లేదా నమోదైన ఏ రాజకీయ పార్టీ పేరుతోనూ ఇది పోలిక కలిగి లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ పేర్లను పోల్చేటప్పుడు మొత్తం పేరునే ఒక యూనిట్‌గా పరిగణించాలే తప్ప విడివిడిగా పదాలను పరిశీలించకూడదన్నారు. "తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్)" మరియు "తెలంగాణ రాజ్య సమితి" పేర్లు నిర్మాణం, ఉచ్చారణ, నాయకత్వం, ప్రజల్లో గుర్తింపు వంటి అన్ని అంశాల్లో పూర్తిగా భిన్నమని వివరించారు. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ, అఖండ్ భారత్, ప్రజా సేవ, జన్ అధికార్, రాష్ట్రీయ జనతా, డెమోక్రాటిక్, సోషల్, రిపబ్లిక్ ఇండియా, శిరోమణి వంటి సాధారణ పదాలతో వందలాది రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయని, అలాంటి పేర్ల జాబితాను కూడా ఎన్నికల కమిషన్‌కు జత చేశామని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం వ్యక్తిగత విచారణకు హాజరయ్యే ముందు తమ పార్టీపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలు, తమకు వ్యతిరేకంగా వినియోగించనున్న ఆధారాలను అందించాలని కోరారు. వాటిని పరిశీలించి సమాధానం ఇచ్చేందుకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే విచారణ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.కేవలం సాధారణ భౌగోళిక లేదా వర్ణనాత్మక పదాల ఆధారంగా, ఊహాజనిత సంక్షిప్త రూపాలను చూపిస్తూ వచ్చిన అభ్యంతరాలను తిరస్కరించాలని కోరిన పార్టీ, ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 29A ప్రకారం "తెలంగాణ రక్షణ సేన" పార్టీ నమోదు దరఖాస్తును ఆమోదించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను విజ్ఞప్తి చేసింది.  
తెలంగాణలో  అధికార, ప్రతిపక్షాల మధ్య సాగే  విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.  విమర్శల జోరు పెరిగుతోంది. తీవ్రత ఎక్కువ అవుతోంది. అనకూడని మాటే అంటూ.. అనుచిత వ్యాఖ్యలు కూడా దొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో విమర్శల వర్షం కురిపించారు. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.  ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేయించుకున్న సొంత సర్వేలోనే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు స్పష్టంగా తేలాయని కేటీఆర్ సంచలన అంచనాను ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 78 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ నివేదికల ఆధారంగా ధీమా వ్యక్తం చేశారు. కేవలం సీఎం సొంత సర్వే మాత్రమే కాకుండా, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, స్వతంత్ర మీడియా సంస్థలు క్షేత్ర స్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణలలో కూడా ఇదే సత్యం వెల్లడైందని ఆయన నొక్కి చెప్పారు. ఈ గణాంకాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయని అన్నారు. అనకూడని మాటే అయినా అనక తప్పడం లేదని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి అనే దరిద్రుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ దుయ్యబట్టిన కేటీఆర్..   అధికారులు ఇంజనీర్లు చెబుతున్న మాటలను కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఎం  రేవంత్ రెడ్డిని బుర్ర తక్కువోడు అనాలా,దరిద్రుడు అనాలా,సన్నాసి అనాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితులు కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని కేటీఆర్ విమర్శించారు.   KTR Sensational Comments, CM Revanth Reddy Survey, BRS 78 Seats, Telangana Politics, Hydra Demolitions 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబునాయుడు వైసీపీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస లక్షణాలు లేవని విమర్శించారు. గొడ్డలి, ఫేక్ ప్రచారాలే వైసీపీ అస్త్రాలన్న చంద్రబాబు.. వైసీపీ చరిత్ర మొత్తం రక్త చరిత్రేనన్నారు.  తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో  ఒక వ్యక్తి తనపై పోక్సో   కేసు పెట్టిందన్న కక్షతో బాధితురాలితో పాటు ఆమె కుటుంబాన్ని, అలాగే తనకు సహకరించలేదనే కోపంతో సొంత కుటుంబాన్ని కలిపి మొత్తం ఆరుగురిని అత్యంత క్రూరంగా హతమార్చిన వ్యక్తికీ, సరిగ్గా అలాగే..  సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపడం, కన్నతల్లి మరియు చెల్లిని దూరం పెట్టే విషయంలో జగన్ ప్రవర్తించిన తీరుకూ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు.  నేర ప్రవృత్తిని, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.   కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆంధ్రప్రదేశ్ సహజ సంపద పూర్తిగా ఆవిరైపోయిందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ నెపంతో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని దుయ్యబట్టారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు గతంలో కేటాయించిన భూములను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా వెనక్కి తీసుకుందని,  ఓబులాపురం మైనింగ్ అంశంపై విచారణ ఇంకా ముగియలేదని చెప్పిన చంద్రబాబు. జగన్   స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ఐఏఎస్  అధికారులు జైలుపాలయ్యారనీ, ఎంతోమంది వ్యాపారవేత్తలు సర్వనాశనమయ్యారని వివరించారు.  వైసీపీ నైజాన్ని చంద్రబాబు  హిట్, రన్ అండ్ ఎస్కేప్ (కొట్టడం, పారిపోవడం, దాక్కోవడం) గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక విధ్వంసం సృష్టించడం, ఆ వెంటనే పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లి తలదాచుకోవడం   అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను బెదిరించి, పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టు, వెలిగొండ ప్రాజెక్టులు వేగంగా పూర్తికావస్తుండటంతో ఈ గొడ్డలి పార్టీలో తీవ్రమైన టెన్షన్ మరియు భయం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను వాడుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం, తప్పుడు పోస్టులతో సమాజంలో అలజడి సృష్టించడం అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలను, అసత్య పోస్టులను పూర్తిగా కట్టడి చేసేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్  ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.   Chandrababu makes sensational comments, Chandrababu Naidu, YS Jagan Mohan Reddy, YSRCP Axe Party, Andhra Pradesh Politics, Social Media Task Force AP, Kadapa Steel Plant Corruption
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్.! కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో కేటాయించిన వేల ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని  చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.  దాదాపు 19 ఏళ్లు గడుస్తున్నా అక్కడ ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించారు.  ఎకరం భూమి  18 వేల రూపాయల చొప్పున దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూములను అప్పట్లో గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పేరిట ఉన్నబ్రాహ్మిణి స్టీల్స్  సంస్థకు కేటాయించింది. దీనికోసం కేవలం 19 కోట్ల రూపాయలను గాలి జనార్ధన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. ఆ తర్వాత 2008లో విమానాశ్రయం ఏర్పాటు నెపంతో మరో 3,115 ఎకరాల భూములను 25 కోట్ల రూపాయలకే రాసిచ్చారు. పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గతంలో ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, రుణాలు ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంకులు కోర్టులను ఆశ్రయించాయి. భూములు తమ అధీనంలో ఉన్నాయని వాదించాయి. అయితే, పూర్తి హక్కులు లేని భూములపై బ్యాంకులు ఏ విధంగా రుణాలు ఇస్తాయని కోర్టులు సైతం తీవ్రంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ప్రస్తుత జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ 10,000 ఎకరాల భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఉదంతంపై  విశ్లేషకుడు  మధుసూదన్ రెడ్డి తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  నాటి వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉండి, నేడు కూటమి ప్రభుత్వంలోనూ మంత్రులుగా కొనసాగుతున్న కొందరు నేతల సమష్టి బాధ్యతను ప్రశ్నించారు. పరిశ్రమలు పెట్టకుండా కాలయాపన చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా, స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.  భవిష్యత్తులోనైనా ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలకు భూములను శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయకుండా, కేవలం లీజు ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలనన్నారు. అప్పుడే పారిశ్రామికవేత్తలు భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టకుండా, నిజాయితీతో పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యానికి, బ్రాహ్మణి స్టీల్స్ భూముల ఉదంతం ఒక పెద్ద ఎదురుదెబ్బేనని మధుసూదన్ రెడ్డి  అన్నారు.  పూర్తి ఇంటర్వ్యూ తెలుగువన్ న్యూస్ చానల్ లో వీక్షించండి.  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2028 ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాఇలా కాదు.. ఏకంగా భద్రాద్రి రాములోరి మీద ఒట్టేసి మరీ  ఈ విషయం చెప్పారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా  జగన్నాథపురంలో నిర్వహించిన రైతు భరోసా చివరి విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నరేవంత్ రెడ్డి  రాబోయే ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని  చెబుతూ.. భద్రాచలం రాముడి మీద ఆన... వచ్చే ఎన్నికల్లో   117 స్థానాల్లో గెలిచి తీరుతాంమని ప్రకటించారు.   రాష్ట్రంలో ప్రస్తుతం 119 శాసనసభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లేదా స్థానాల పెంపు బిల్లు   ఆమోదం పొందితే, తెలంగాణలో సీట్లు దాదాపు 50 శాతం మేర పెరగనున్నాయన్న రేవంత్.. ఈ పెంపుదల ప్రకారంగా ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు భవిష్యత్తులో 182 స్థానాలకు చేరనున్నాయన్నారు.    అలాగే.. ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం  స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని   స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.    తమకు ఏ రాజకీయ పార్టీతోనూ పంచాయితీ లేదని, ప్రజలే తమ బలమని, ప్రజలతోనే కలిసి నడుస్తూ విజయం అందుకుంటామని  పేర్కొన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులమయం చేయడం వల్లే  కొంత ఇబ్బంది ఎదురౌతోందన్న రేవంత్.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా  తాము 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. Revanth Reddy vow on Lord Ram, Telangana assembly seats increase 182, Revanth Reddy 117 seats Congress, Telangana early elections clarity
ALSO ON TELUGUONE N E W S
Producer Naga Vamsi has shared an emotional note after the blockbuster success of Lenin, expressing happiness that the film has achieved the goal with which it was conceived. The producer revealed that when Sithara Entertainments and Manam Entertainments joined hands for the Akhil Akkineni starrer nearly one and a half years ago, they had only one objective—to deliver a resounding blockbuster that would make everyone associated with the project proud. Vamsi also opened up about a key business decision taken before the film's release. He revealed that he and Nagarjuna consciously decided to keep the theatrical pricing reasonable across all territories while closing the distribution deals. According to him, the intention was to ensure distributors and exhibitors could recover their investments quickly and celebrate the film's success instead of struggling with unrealistic valuations. That strategy appears to have paid off. Vamsi stated that distributors recovered their investments by the end of the very first weekend, while exhibitors are witnessing packed theatres and Housefull boards across multiple centres. He described this as the biggest source of satisfaction, saying a film's success should be measured not just by box office numbers but by the happiness shared among everyone involved in its journey. Calling the purpose behind making Lenin fulfilled, Naga Vamsi thanked audiences for embracing the film with overwhelming love. He also expressed gratitude to distributors, exhibitors and every partner who believed in the project, adding that he hopes to celebrate many more successful journeys together. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  -హీరోలకి ధీటుగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు   - దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ  -మరి టాప్ లో ఆ ఉన్న ఆ చిత్రాలేంటో చూద్దాం ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలకి  వసూళ్ల సునామీ వచ్చేది. కానీ కాలంతో పాటు ప్రేక్షకుడి ఆలోచనా విధానం కూడా మారింది. కథలో బలం ఉండి, నాయిక ప్రాధాన్యమున్న పాత్రల చుట్టూ కథ తిరిగితే థియేటర్లకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. హీరోలతో సమానంగా స్టార్ హీరోయిన్లు తమ భుజాలపై సినిమాలను మోస్తూ వందల కోట్ల వసూళ్లని  సాధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన మొదటి 7 సౌత్ ఇండియన్ ఉమెన్-లెడ్ చిత్రాల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ అరుదైన జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన మూవీ 'లోకా'. మలయాళంలో తెరకెక్కి పాన్ ఇండియా వ్యాప్తంగా 302 కోట్ల గ్రాస్ వసూళ్లతో సౌత్ ఇండియన్ ఉమెన్ లెడ్ చిత్రాల్లో ఆల్‌టైమ్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. కైవసం చేసుకోవడమే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్ పరిధిని హీరోలకి ధీటుగా నిలబెట్టింది. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన  క్లాసిక్ బయోపిక్ 'మహానటి'. సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో 'నాగ్‌ అశ్విన్‌' తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల  గ్రాస్ కలెక్షన్లను సాధించి ఎప్పటికీ నిలిచిపోయే మైలురాయిగా మారింది. Also read: తాళి కట్టు, హిట్ పట్టు.. లెనిన్ తో మరోసారి నిజమైన సెంటిమెంట్    రీసెంట్ గా  సమంత తన వన్ వుమెన్  యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' తో  బాక్సాఫీస్ వద్ద సరికొత్త ఫిగర్స్ నమోదు చేస్తుంది.   100  కోట్ల  గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్  సౌత్ ఇండియన్ ఉమెన్ లెడ్  జాబితాలో మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది. నాలుగో స్థానంలో 81 కోట్ల గ్రాస్ తో అనుష్క నుంచి వచ్చిన  చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి',  ఐదు, ఆరు స్థానాలలో కూడా  అనుష్క నుంచే వచ్చిన 'అరుంధతి' 68 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఐదో స్థానం,  'భాగమతి'  65 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన టాప్ 7 జాబితాలో చివరిగా నిలిచిన మూవీ  'సూక్ష్మదర్శిని'. మలయాళంలో తెరకెక్కిన ఈ మూవీ  ప్రపంచవ్యాప్తంగా. 54 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఏడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ కలెక్షన్ల గణాంకాలను బట్టి చూస్తే, సౌత్ ఇండస్ట్రీలో మహిళా ప్రధాన చిత్రాల హవా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.     
    -లెనిన్ విజయంతో మరోసారి నిజమైన పెళ్లి సెంటిమెంట్ -హిట్ కావాలంటే పెళ్లి చేసుకోవాల్సిందేనా! -ఫిలిం సర్కిల్స్ లో, అభిమానుల్లో వైరల్ గా మారిన న్యూస్  సెంటిమెంట్..  తెలుగు చిత్ర పరిశ్రమ సెంటిమెంట్ ని  నమ్మినంత ఇదిగా మరో రంగం ఉండదంటే అతిశయోక్తి కాదు. పైగా సెంటి మెంట్ కూడా నన్ను నమ్మాల్సిందే అంటూ ఎన్నో ఉదాహరణలని మన ముందు ఉంచుతుంది. ముఖ్యంగా హీరోల విషయంలో.  రీసెంట్ బ్లాక్ బస్టర్ లెనిన్(Lenin)నే ఒక ఉదాహరణ. పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలకి  వివాహ బంధం గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తోంది. ఈ సరికొత్త సెంటిమెంట్  ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారి, అభిమానులని  విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పెళ్లి సెంటిమెంట్‌కు సరిగ్గా సరిపోయే మొదటి ఉదాహరణ యువ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). వరుస పరాజయాలతో  ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ ని వివాహం చేసుకున్నాడు. అంతే పెళ్లి పీటలు ఎక్కిన కొద్ది రోజులకే వచ్చిన 'క' మూవీ  బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో భారీ వసూళ్లను సాధించి, అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ భారీ సక్సెస్ కిరణ్ అబ్బవరం కెరీర్‌కి మంచి బూస్టప్ అని చెప్పవచ్చు. దాంతో శ్రీమతి  అడుగుపెట్టిన వేళా విశేషం వల్లే కిరణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్య(Naga Chaintanya)కూడా తన వైవాహిక జీవితంలో కొత్త అడుగు వేస్తూ శోభిత ధూళిపాళ్లని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వివాహం తర్వాత నాగ చైతన్య తన కెరీర్‌పై మరింత పట్టుదలగా వర్క్ చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన రగ్గడ్ ఫిషర్‌మెన్ డ్రామా 'తండేల్' ఎన్నో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కంబ్యాక్‌గా నిలవడమే కాకుండా, నాగ చైతన్య కెరీర్‌లోనే ఒక మైలురాయి చిత్రంగా నిలిచింది. చైతు పెర్ఫార్మ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వెంటనే చైతన్య కెరీర్‌లో ఇంతటి అద్భుతమైన సక్సెస్ రావడం ఈ పెళ్లి సెంటిమెంట్‌కి మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని మరో సారి నిజం చేసే వంతు అఖిల్ కి వచ్చింది. మొన్న శుక్రవారం గ్రాండ్ గా రిలీజైన లెనిన్ అఖిల్ వరుస పరాజయాలకి ఫుల్ స్టాప్ పెట్టి సరికొత్త రికార్డుల దిశగా దూసుకుకెళ్తుంది. లెనిన్ కూడా అఖిల్ కి వివాహం జరిగిన తర్వాత వచ్చిన మూవీ కావడంతో శ్రీమతి ఇచ్చిన బహుమతి అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్తున్నారు. ఈ సెంటిమెంట్  కేవలం హీరోలకే కాదు, హీరోయిన్ల వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పులు కూడా కెరీర్‌కి సరికొత్త జోష్ నిస్తాయని సమంత నిరూపించింది. వివాహం తర్వాత  తన సొంత బ్యానర్‌లోనే  చేసిన యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం 'మా ఇంటి బంగారం'.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ ఏకంగా 100 కోట్ల భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో . 100 కోట్ల క్లబ్‌ను చేరి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన సమంత, తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త లక్‌తో దూసుకుపోతున్నారు. ఈ విధంగా టాలీవుడ్‌లో పెళ్లి, వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగులు అనేవి నటీనటుల సినీ జీవితాలకు సరికొత్త అదృష్టాన్ని, బ్లాక్‌బస్టర్ విజయాలను తెచ్చిపెడుతున్నాయని టాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది.    
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ ప్రస్తుతం ఒకే ఒక వార్త తీవ్ర సంచలనంగా మారింది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరడం, ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స జరగడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ముంబయి పర్యటనకు వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆయన స్వయంగా కలిసి పరామర్శించారు. శనివారం పవన్ కల్యాణ్ కుడి భుజానికి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయగా, చంద్రబాబు ఆదివారం ఆసుపత్రికి చేరుకుని పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యాన్ని నూరిపోశారు. కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామి అయిన పవన్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి వాకబు చేయడం ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు మెగా అభిమానుల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా భుజం నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నట్లు వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని నిపుణులైన వైద్యుల బృందం పవన్ కుడి భుజానికి శనివారం శస్త్రచికిత్స నిర్వహించింది. పవన్‌కు రొటేటర్ కఫ్ గాయంతో పాటు కుడి భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తీవ్రమైన సమస్యల కారణంగానే శస్త్రచికిత్స అనివార్యమైందని వైద్య బృందం వెల్లడించింది. కుడి భుజానికి సర్జరీ పూర్తయినప్పటికీ, పవన్ కల్యాణ్ సమస్యలు ఇక్కడితో తీరిపోలేదు. మరికొన్ని రోజుల వ్యవధి తర్వాత ఆయన ఎడమ భుజానికి కూడా ఇదే విధమైన శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ వరుస సర్జరీల వార్త జనసైనికులను, సినీ ప్రేక్షకులను ఒకింత కలవరపాటుకు గురిచేస్తోంది. నిజానికి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్యలు ఈనాటివి కావు. గత కొన్ని నెలలుగా ఆయన వివిధ రకాల చికిత్సలు చేయించుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే పవన్ కల్యాణ్ తన ముక్కుకు సంబంధించిన ఒక శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలోనే వైద్యులు ఆయనకు మరికొన్ని అధునాతన వైద్య పరీక్షలను కూడా నిర్వహించారు. ఆ పరీక్షల రిపోర్టులలోనే పవన్ కల్యాణ్ రెండు భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్ గాయాలు, తీవ్రమైన మజిల్ టేర్స్ (కండరాల గాయాలు) ఉన్నట్లు వైద్యులు చాలా స్పష్టంగా గుర్తించారు. ఈ గాయాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నందున, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలని నిపుణులు గట్టిగా సూచించారు. అయితే ఎన్నికలు, ప్రభుత్వం ఏర్పాటు వంటి బిజీ షెడ్యూల్స్ వల్ల కొద్దిగా ఆలస్యమైనప్పటికీ, ఎట్టకేలకు పవన్ ముంబయి వెళ్లి ఈ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు పరామర్శతో పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందనే సమాచారం అందరికీ పెద్ద ఊరటనిస్తోంది.     Pawan Kalyan, Chandrababu naidu, Deputy CM Pawan Kalyan 
తమిళ సినీ చరిత్రలో ఒక అద్భుతమైన, మరపురాని క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన చిత్రం '96'. విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హృదయాలను హత్తుకునే చిత్రానికి సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కేవలం ప్రేమకథ మాత్రమే కాదు, ఎన్నో మధురమైన అనుభూతులు కూడా దాగి ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన అనుభూతి, భారతదేశం గర్వించదగ్గ లెజెండరీ గాయని ఎస్. జానకి ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించడం. థియేటర్లలో విడుదలయ్యే ముందు నిడివి సమస్యల కారణంగా, అంటే సినిమా రన్ టైమ్ పెరిగిపోవడం వల్ల, జానకమ్మ నటించిన ఆ అద్భుతమైన సన్నివేశాన్ని దురదృష్టవశాత్తూ ఎడిటింగ్‌లో తొలగించాల్సి వచ్చింది. అయితే, సినిమా విడుదలైన తర్వాత ఆ మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకోవాలని భావించిన చిత్రబృందం, ఈ డిలీటెడ్ సీన్‌ను యూట్యూబ్‌లో అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ భావోద్వేగభరితమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతూ, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. https://www.youtube.com/watch?v=_sbkAFROsKc&t=272s   సరిగ్గా ఇదే సమయంలో, మైసూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి జానకమ్మ తన 88వ ఏట తుదిశ్వాస విడిచారనే చేదు వార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణవార్త విన్న సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా '96' చిత్రంలో జానకమ్మతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అరుదైన అవకాశం దక్కించుకున్న స్టార్ హీరోయిన్ త్రిష, సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. తన సినీ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ఒక ప్రత్యేకమైన సినిమాలో జానకమ్మ పేరును (జాను పాత్ర పేరును) పెట్టుకోవడం తనకు దక్కిన అత్యున్నత గౌరవంగా భావిస్తున్నానని త్రిష పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో జానకమ్మను వ్యక్తిగతంగా కలవడం, ఆమె నుంచి అమూల్యమైన ప్రేమను, ఆశీస్సులను పొందడం తన జీవితంలో మరువలేని అదృష్టమని ఆమె ఎమోషనల్ అయ్యారు. జానకమ్మ నిష్కల్మషమైన ఆప్యాయత, ముఖంపై ఎల్లప్పుడూ ఉండే ఆ మధురమైన చిరునవ్వు తన గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని త్రిష గుర్తుచేసుకున్నారు. ఎంతటి గొప్ప కళాకారులైనా జీవితంలో ఎంత సరళంగా, సాధారణంగా ఉంటారో నిరూపించిన మహోన్నత వ్యక్తి జానకమ్మ అని కొనియాడారు. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా, దశాబ్దాల పాటు అలరించిన ఆమె అమృత గాత్రం ఈ భూమి ఉన్నంత వరకు నిలిచే ఉంటుందని, శ్రోతల హృదయాలలో ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని పేర్కొన్నారు. "ఐ మిస్ యు జానకమ్మ.. మీ ఆత్మకు పరిపూర్ణ శాంతి చేకూరాలి" అంటూ త్రిష కన్నీటి పర్యంతమయ్యారు. జానకమ్మ మరణంతో ఈ '96' డిలీటెడ్ సీన్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. జానకమ్మ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ లక్షలాది మంది అభిమానులు ఈ వీడియోను వీక్షిస్తూ, సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఎస్. జానకి గారి మధుర గాత్రం, ఆమె సినీ ప్రయాణం భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది.
సంగీత ప్రపంచంలో కొన్ని దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను ఓలలాడించిన స్వరసామ్రాజ్ఞి, గానకోకిల ఎస్‌.జానకి ఇకలేరు అనే చేదు నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. భాష ఏదైనా, బాణీ ఎలాంటిదైనా సరే, ఆ పాటకు తన మధుర గాత్రంతో ప్రాణం పోయడం జానకమ్మకు మాత్రమే సాధ్యమైన అద్భుత కళ. స్వరాలకు అనుగుణంగా, భావాలకు తగ్గట్టుగా తన గాత్రాన్ని మార్చుకోగల అద్భుతమైన ప్రయోగశాల ఆమె గొంతు. అలాంటి గొప్ప గాయని భౌతికంగా మనల్ని విడిచి వెళ్లిపోవడంతో భారతీయ చలనచిత్ర సంగీతంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లయింది. ఈ నేపథ్యంలో, స్వరకోకిల ఎస్‌.జానకి అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం అత్యంత అధికారిక లాంఛనాలతో ముగిశాయి. జానకమ్మకు కర్ణాటక అంతటా ఉన్న ఆదరణను గౌరవిస్తూ, కర్ణాటక ప్రభుత్వం మైసూరు నగరంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ అంతిమ సంస్కారాలను అత్యంత గౌరవప్రదంగా నిర్వహించింది. ఎస్‌.జానకి మనవరాలు అప్సర విద్యుల శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాల క్రతువును పూర్తి చేశారు. జానకమ్మ పార్థివదేహానికి చితి అంటించి, ఆమె ఆత్మకు సద్గతి కలగాలని ప్రార్థిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. అంత్యక్రియల నిర్వహణకు ముందు, అభిమానులు, సాధారణ ప్రజల సందర్శనార్థం ఎస్‌.జానకి పార్థివదేహాన్ని మైసూరులోని చారిత్రాత్మక మహారాజా కళాశాల మైదానానికి తరలించారు. వేల సంఖ్యలో ఆబాలగోపాలాన్ని అలరించిన ఆ గొంతు మూగబోవడాన్ని చూసి అభిమానులు తట్టుకోలేకపోయారు. కడసారి తమ ప్రియతమ గాయనిని చూసేందుకు మైదానానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. తమ జీవితాల్లోని సంతోషాలు, బాధలు, ప్రేమలలో భాగమైన వేలాది పాటలను అందించిన జానకమ్మను కడసారి చూస్తూ కన్నీరు మున్నీరయ్యారు. కేవలం సాధారణ అభిమానులే కాకుండా, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు, మరియు వివిధ రంగాల విశిష్ట వ్యక్తులు తరలివచ్చి జానకమ్మ పార్థివదేహంపై పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతి ఒక్కరూ బాధాతప్త హృదయాలతో, నిండిన కళ్లతో ఆ స్వర సామ్రాజ్ఞికి అంతిమ వీడ్కోలు పలికారు. జానకమ్మ పాట ఎప్పటికీ అమరమే అని, ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేలాది మధుర గీతాల రూపంలో మన గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారని ప్రముఖులు కొనియాడారు. రాజమహేంద్రవరంతో విడదీయరాని అనుబంధం ఉన్న జానకమ్మ, తెలుగు నాట ప్రతి ఇంటా ఒక కుటుంబ సభ్యురాలిగా మారిపోయారు. పగలే వెన్నెల కురిపించినా, అమ్మగా లాలిపాట పాడినా అది కేవలం జానకమ్మకే సాధ్యం. దాదాపు పదిహేడు భాషల్లో వేలాది పాటలు పాడి, ఎన్నో జాతీయ, ప్రాంతీయ అవార్డులను అందుకున్న ఈ గాన కోకిల నిష్క్రమణ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ప్రభుత్వ గౌరవ వందనంతో, పోలీసుల మేళతాళాల నడుమ సాగిన ఈ అంతిమ యాత్రతో ఒక సుదీర్ఘ, అద్భుతమైన గాన ప్రయాణం ముగిసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'రాకా'. పాన్-ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమా పరిశ్రమ మొత్తాన్ని షేక్ చేస్తోంది. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఐకాన్ స్టార్ ఒకే స్క్రీన్‌పై తాత, తండ్రి, మరియు ఇద్దరు కుమారులుగా ఇలా నాలుగు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నట్లు గట్టి ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, అల్లు అర్జున్ తన సుదీర్ఘ సినీ కెరీర్‌లోనే మొదటిసారిగా ఒకే సినిమాలో నాలుగు పాత్రలు పోషించిన అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. ఒకే కథలో ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లను చేయడం అంటే సాధారణ విషయం కాదు. నటనకు, బాడీ లాంగ్వేజ్‌కు ఎంతో స్కోప్ ఉన్న ఈ ప్రయోగం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. అసలైతే ఈ కథను సిద్ధం చేసుకున్నప్పుడు దర్శకుడు అట్లీ.. తాత మరియు తండ్రి పాత్రల కోసం చిత్ర పరిశ్రమలోని ఇతర సీనియర్ నటులను ఎంపిక చేయాలని భావించారట. కానీ, అట్లీ వినిపించిన పూర్తి కథను విన్న తర్వాత అల్లు అర్జున్ ఆ పాత్రల వైవిధ్యానికి ఎంతగానో ముగ్ధులయ్యారు. ఆ నాలుగు విభిన్న పాత్రలను తానే స్వయంగా చేస్తానని, తన నటనతో వాటికి పూర్తి న్యాయం చేస్తానని దర్శకుడికి ఆసక్తి వ్యక్తపరిచారట. ఆ తర్వాత చిత్రబృందం అల్లు అర్జున్‌పై ప్రత్యేకంగా లుక్ టెస్ట్‌లను కూడా నిర్వహించింది. ఈ టెస్టుల్లో నాలుగు పాత్రల్లోనూ ఆయన చూపించిన వేరియేషన్స్, వైవిధ్యం అద్భుతంగా రావడంతో చిత్రయూనిట్ అంతా షాక్ అయ్యిందని సమాచారం. ఇదే ఈ సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్‌గా మారుతుందని నమ్మి, బన్నీ నిర్ణయానికే అట్లీ ఓకే చెప్పారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండటం ప్రాజెక్ట్‌కు మరింత గ్లామర్, క్రేజ్ తీసుకొచ్చింది. భారీ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్, గుండెలను పిండేసే బలమైన భావోద్వేగాలు మరియు అత్యాధునిక హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో (VFX) ఈ చిత్రాన్ని అట్లీ విజువల్ వండర్‌గా ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఇప్పటివరకు వెండితెరపై చూడని ఒక అద్భుతమైన సరికొత్త విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ సినిమాను మలుస్తున్నట్లు అట్లీ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం ముంబై నగరంలో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన మరియు భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్-వరల్డ్ చిత్రం 'రాకా'ను 2027 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు.     Allu Arjun, Raaka Movie Updates, Deepika Padukone, Atlee 
సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ భావప్రకటనా స్వేచ్ఛను ఇచ్చే ఒక అద్భుతమైన వేదికగా మారింది. అయితే, దురదృష్టవశాత్తూ కొందరు దీనిని ఇతరులను మానసికంగా వేధించడానికి, కించపరచడానికి ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలను, వారి వ్యక్తిగత జీవితాలను, ఆఖరికి వారి పిల్లలను కూడా టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ పేరిట వికృత ఆనందాన్ని పొందుతున్నారు. తాజాగా నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుమార్తెలు అవంతిక, ఆనందితలపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు దారుణమైన బాడీ షేమింగ్, వ్యక్తిగత విమర్శలతో హద్దులు దాటారు. తమ రూపంపై, లుక్స్‌పై వస్తున్న ఈ అసభ్యకరమైన కామెంట్స్, ట్రోల్స్‌పై ఖుష్బూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక తల్లిగా తన పిల్లలను రక్షించుకోవడానికి తాను గాయపడిన పులిలా మారతానని, తన మౌనాన్ని చేతకానితనంగా భావించవద్దని ఆమె హెచ్చరించారు. కేవలం రెండు నిమిషాల చీప్ పబ్లిసిటీ కోసం, వ్యూస్ కోసం కొందరు కంటెంట్ క్రియేటర్లు, నెటిజన్లు ఇంత నీచానికి ఒడిగట్టడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి, చెమటోడ్చి ఈ స్థాయికి వచ్చామని, తమ పిల్లలు ఎప్పుడూ సెలబ్రిటీ హోదాను తప్పుగా వాడుకోలేదని ఖుష్బూ స్పష్టం చేశారు. ఖుష్బూ చేసిన ఈ భావోద్వేగపూరితమైన పోస్ట్‌కు టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ఈ వ్యవహారంపై అత్యంత ఘాటుగా స్పందించారు. ఖుష్బూ కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. "భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఇతరులను వేధించడం కాదు. విమర్శించడం అంటే క్రూరత్వాన్ని ప్రదర్శించడం కాదు. హాస్యం పేరిట ఒకరిని అవమానించే హక్కు ఎవరికీ లేదు" అంటూ రాధిక నిప్పులు చెరిగారు. ఒక పబ్లిక్ ఫిగర్ లేదా ఒక మహిళను విమర్శించే హక్కు మీకు ఉండవచ్చు, కానీ ఆమె అమాయక పిల్లలను మధ్యలోకి లాగి, వారిని కేలి చేయడం ఏమాత్రం నాగరికత అనిపించుకోదని మండిపడ్డారు. ఇది కేవలం సదరు ట్రోలర్ల తప్పు మాత్రమే కాదు, సమాజం యొక్క నైతిక ఓటమిని సూచిస్తోందని ఆమె విశ్లేషించారు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్న సెలబ్రిటీల పిల్లలను టార్గెట్ చేయడం అనేది కేవలం పిరికితనం మాత్రమేనని రాధిక అభివర్ణించారు. ఒక వ్యక్తి యొక్క బాహ్య రూపం లేదా లుక్స్ అనేవి వారి జీవిత విజయానికి లేదా వైఫల్యానికి కొలమానం కాదని, కేవలం వారి క్యారెక్టర్ మాత్రమే వారి విలువను నిర్ణయిస్తుందని ఆమె హితవు పలికారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఖుష్బూ చిన్న కుమార్తె ఆనందిత మాట్లాడుతూ, తాను చిన్నప్పటి నుండి ఈ సైబర్ వేధింపులను ఎదుర్కొంటున్నానని, కొందరు తనను ఒక ట్రాన్స్‌జెండర్‌తో పోలుస్తూ హేళన చేశారని, అలాంటి వ్యాఖ్యలు తనను ఎంతగానో గాయపరిచాయని పేర్కొంది. అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయకుండా 'పొన్నియిన్ సెల్వన్ 2', 'థగ్ లైఫ్' వంటి భారీ చిత్రాలకు తెరవెనుక పనిచేసి, ప్రస్తుతం క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తోంది. సమాజంలో సెలబ్రిటీల కుటుంబాలపై పెరుగుతున్న ఈ డిజిటల్ క్రూరత్వానికి, సైబర్ బుల్యింగ్‌కు వ్యతిరేకంగా ఖుష్బూ, రాధికలు కలిసికట్టుగా గళమెత్తడం నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలనే చర్చను ఇది మరోసారి తెరపైకి తెచ్చింది.     Radhika Sarathkumar, Khushbu Sundar 
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'జైలర్ 2' ఒకటి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సీక్వెల్ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ క్యామియో పాత్రలో నటిస్తుండటం, దానికి సంబంధించిన షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకోవడం ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జైలర్ 2 చిత్రంలో తన ప్రత్యేక పాత్రకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం హృతిక్ రోషన్, చెన్నైలోని సూపర్‌స్టార్ రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. అక్కడ తలైవాని మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ ఇద్దరు దిగ్గజ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. రెండు వేర్వేరు సినీ రంగాళ్లకు చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ ఐకాన్లు ఇలా ఒకే చోట కనిపించడంతో సినీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "రెండు శక్తులు.. ఒకే ఫ్రేమ్‌లో!" అంటూ నెటిజన్లు ఈ ఫోటోను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన 'జైలర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించి, వందల కోట్ల వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఆ బ్లాక్‌బస్టర్ విజయానికి కొనసాగింపుగా వస్తున్న 'జైలర్ 2'లో ఈసారి స్టార్ కాస్టింగ్ మరింత పెరిగింది. హృతిక్ రోషన్‌తో పాటు ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, అలాగే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వంటి టాప్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతమంది హేమాహేమీలు నటిస్తుండటంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని రాబోయే అక్టోబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ క్యామియో రోల్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, రజనీకాంత్ మరియు హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ వైరల్ పిక్ మూవీపై ఉన్న హైప్‌ను వంద రెట్లు పెంచేసింది.     Rajinikanth, Hrithik Roshan, Jailer 2 Movie, Jailer 2 Cameo 
‘పుష్ప, యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో పాన్‌ ఇండియా వైడ్‌గా నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం సరికొత్త నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తోంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అద్భుతమైన నటనతో లక్షలాది మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ భామ, ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఒక పెద్ద నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా గ్లామర్ రంగంలో ఉన్న హీరోయిన్లు తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వివాహానికి దూరంగా ఉంటారు. కానీ రష్మిక మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన ప్రియుడు, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని ఒక్కసారిగా ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా అటు పర్సనల్ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎంతో అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో పెళ్లి ఎదుగుదలకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపిస్తోంది. గతేడాది వరుసగా ఐదు భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్న రష్మిక, ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టెయిల్-2’తో అలరించిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రణబాలి’ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను రాబోయే సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు రష్మిక నటిస్తున్న మరో విభిన్నమైన యాక్షన్ చిత్రం ‘మైసా’. పూర్తిగా ట్రైబల్ బేస్డ్ యాక్షన్ ఓరియంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సైతం ఈ ఏడాది ఆఖరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కోసం చిత్రీకరించిన అత్యంత క్లిష్టమైన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌లో రష్మిక కనబరిచిన నటనకు చిత్ర యూనిట్ మొత్తం ఫిదా అయిపోయిందట. సినిమా సినిమాకూ నటనలో వైవిధ్యం చూపిస్తూ దూసుకుపోతున్న రష్మికకు ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కోట్లాది రూపాయల బడ్జెట్ చిత్రాలతో క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడే ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రష్మిక ప్రస్తుతం కొత్త సినిమాలను అంగీకరించడంలో కాస్త వెనకడుగు వేస్తోందని, సినిమా కమిట్‌మెంట్ల విషయంలో దాదాపు ఫుల్ స్టాప్ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు తాత్కాలికంగా లాంగ్ బ్రేక్ ఇవ్వబోతోందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ నేషనల్ క్రష్ కొత్త ప్రాజెక్ట్‌లకు కావాలనే విరామం ఇస్తోందా లేక పెళ్లి తర్వాత తన వ్యక్తిగత జీవితానికి మరికొంత సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందా అనే విషయాలపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కారణం ఏదైనప్పటికీ రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్‌ను మిస్ అవ్వకూడదని, ఆమె మరిన్ని చిత్రాలతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.     Rashmika Mandanna, Vijay Deverakonda, Ranabali
  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం.  భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది.  భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది.  అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. కానీ కోడలిగా వచ్చిన ఆడపిల్లను బాధపెట్టే అత్తమామలు ఉంటే.. ఆ ఆడపిల్లల జీవితం నరకప్రాయంగా ఉంటుంది.  అయితే.. బాధపెట్టే అత్తమామలు ఉన్నారని, వివాహ బంధాన్ని తెంచుకుని వెళ్లలేరు చాలామంది అమ్మాయిలు,  బాధపెట్టే అత్తమామలతో  ఎలా ఉండాలో,  వాళ్లతో కలిసి ఎలా జీవించాలో లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు..  వీటి గురించి తెలుసుకుంటే.. మార్చాలని అనుకోకూడదు.. కొన్నిసార్లు  అత్తమామలు కోడళ్ల మీద ఒత్తిడిని, ఇబ్బందులను కలిగిస్తారు. బాధపెట్టే అత్తమామల గురించి చాలా మంది జోక్ గా చెప్తూ ఉంటారు. కానీ బాధపెట్టే అత్తమామలు ఉండటం జోక్ కాదు.. అది ఆడపిల్లలను చాలా బాధపెడుతుంది, చాలా ఒత్తిడిలోకి నెడుతుంది.  అలాంటి అత్తమామలు  మానసిక ప్రశాంతతను, వివాహ బంధాన్ని కూడా ప్రభావితం చేస్తారు. చాలా మంది కోడళ్లు తమ అత్తమామలు మారితే బాగుండు అని అనుకుంటారు. కానీ అత్తమామలు మారాలని,  వాళ్లను  మార్చాలని అనుకోవడం వ్యర్థం. అత్తమామలు ఏ విషయాల పట్ల బాధపెడతారో తెలిసినప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఉండటమే  మంచిది. పరిమితులు..  బాధపెట్టే అత్తమామలు ఉన్నప్పుడు, ప్రతి కోడలు తన భర్త సహాయంతో  కొన్ని సొంత పరిమితులను నిర్దేశించుకుని, వాటికి కట్టుబడి ఉండడం  మంచిది. పరిమితులు ఏర్పాటు చేసుకున్నప్పుడు పెద్దవాళ్లు, అత్తమామలు మాట్లాడే ఏ మాటలు లేదా ప్రవర్తన పరిమితులను దాటి జీవితంలోకి తీసుకుని బాధపడే పరిస్థితి రాదు.   సమస్య, పరిష్కారం.. ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు, దాని మూల కారణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అత్తమామల చెడు  ప్రవర్తన అకస్మాత్తుగా జరగదు. వారు ప్రతీదీ తమకు నచ్చినట్టుగా జరగాలని కోరుకోవడం, తమ భావాలను అదుపు చేసుకోలేకపోవడం, లేదా గతంలోని మానసిక గాయాలను మోయడం వంటి కారణాల వల్ల ఇది తరచుగా జరుగుతుంది. కొన్నిసార్లు, అత్తమామలు కోడలు పెరిగిన విధానాన్ని, కోడలి పుట్టింటి వారి పద్దతులను,  నియమాలను అగౌరవపరుస్తారు, మరికొన్ని సార్లు  స్వార్థపరురాలు అనే ట్యాగ్ వేసి  వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తారు, లేదా కుటుంబంలో కలహాలు సృష్టించి కోడలిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతులను గుర్తించడమే కోడళ్లు అత్తారింట్లో బాధపెట్టే అత్తమామలతో కలిసి ఎలా జీవించాలనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాయి.                                      *రూపశ్రీ.
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితులు ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తాయి. చాలా మంది పిల్లలు మొదట్లో పాఠశాలలో తమకు ఎదురయ్యే విషయాలను, తమ మనసులోని విషయాలను  మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత కేవలం పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా..  కొత్తగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ప్రతిరోజూ పిల్లలను అడాగాల్సిన ప్రశ్నలు.. నచ్చిన విషయం.. ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి.  ఈ ప్రశ్న పిల్లలో సానుకూల విషయాలను వెలికితీయడానికి సహాయపడుతుంది.  కొందరు పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన విషయాన్ని గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది.  అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు  స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు,  ఏ విషయాన్ని అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి.. పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, మాట్లాడారు అనే విషయాలు కొత్త స్నేహితుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా,  ఎవరితో అయినా కలవడంలో  ఇబ్బంది ఫీలవుతున్నారా?  అనే విషయాలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది. ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి.. కొందరు పిల్లలు స్కూల్ లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిలల్లు బడికి  వెళ్లాలంటే భయపడటారు.  ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి.. పిల్లలను  ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. తద్వారా పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అన్ని చెబుతూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి,  వారిలో బావ వ్యక్తీకరణ వంటివి మెరుగు పడతాయి.                          *రూపశ్రీ.
మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. జీవనశైలి మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల రక్తంలో క్లాట్స్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అలాగే అధిక బరువు కూడా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.  ఈ వీడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు Dr. Chittibotla Madhusudana Sharma గారు వంటింట్లో సులభంగా లభించే కొన్ని సహజ పదార్థాలతో సంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగించే చిట్కాలను వివరించారు. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, బరువు నియంత్రణకు తోడ్పడే ఆహారపు అలవాట్లు మరియు సహజ పద్ధతుల గురించి ఆయన విలువైన సూచనలు అందించారు. అలాగే ఏయే ఆహార పదార్థాలను తీసుకోవాలి, ఎలాంటి జీవనశైలి పాటించాలి, ఆరోగ్యాన్ని సహజంగా ఎలా మెరుగుపరుచుకోవాలి వంటి విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.  ఆయుర్వేదం చెప్పే ఈ సంప్రదాయ చిట్కాలను తెలుసుకుని, మీ రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోండి.  గమనిక: ఈ వీడియోలో తెలిపిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇప్పటికే రక్తం గడ్డకట్టే సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడి సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవాలి. వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులను ఆపడం లేదా ప్రారంభించడం చేయవద్దు.  
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు..  ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం  బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి తినడం వరకు,  తక్కువ తినడానికి, త్వరగా బరువు తగ్గడానికి , ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం  ఒక సులభమైన మార్గంగా అందరికీ కనిపిస్తుంది. ఇలాంటి వాటిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఉంది. దీన్నే మధ్యంతర ఉపవాసం అని కూడా పిలుస్తారు.  అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేయడం కంటే.. హాని చేయడమే ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఇది పరిశోధనలలో తేలిందని కూడా అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. పరిశోధనలు తేల్చిన నిజం.. ఇటీవల 20,000 మందికి పైగా ప్రజలపై జరిపిన ఒక విశ్లేషణలో, రోజుకు ఎనిమిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ  సమయం వరకు  ఆహారం తీసుకోకుండా ఉండే వారికి గుండె జబ్బులతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదం 91 శాతం వరకు ఎక్కువగా ఉంటుందట. దీని అర్థం ఉపవాసం అందరికీ హానికరం అని కాదు, కానీ తక్కువ తినడం, ఎక్కువ సమయం ఆహారం లేకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. వైద్యులు ఏం చెప్తున్నారంటే.. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండటం  అనేది  శరీరంలో అనేక ఆకస్మిక మార్పులకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతాయి, ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి, , కొవ్వు స్థాయిలు కూడా ప్రభావితమవుతాయి. ఈ మార్పులన్నీ గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయట. మరోవైపు ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల  చక్కెర, ఖనిజాలు , హార్మోన్లలో హెచ్చుతగ్గులకు కారణమవుతుందని, ఇది  హృదయ స్పందనలు గాడి తప్పే పరిస్థితి తీసుకొస్తుందని అంటున్నారు. నీటి కొరత.. ఆహారం ఎక్కువ సేపు తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.  శరీరం డీహైడ్రేషన్ అవుతుంది.  ప్రజలు ఎక్కువ సేపు ఆహారం తీసుకోనప్పుడు, తక్కువ నీరు తాగుతారు. దీనివల్ల సాధారణ గుండె కొట్టుకోవడానికి అవసరమైన పొటాషియం , మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు శరీరంలో తగ్గిపోతాయి. ఈ ఖనిజ లోపాలు డీహైడ్రేషన్  కారణంగా హృదయ స్పందన సజావుగా సాగడం కోసం గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఉపవాసం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా.. ఇది అందరికీ ఒకే ఫలితాన్ని ఇవ్వదు. కొందరికి ఇది సమస్య కలిగిస్తుంది, మరికొందరికి మంచి ఫలితాలు కూడా ఇవ్వవచ్చు.  ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు,  ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా, కొన్ని రకాల మందులు తీసుకునే వారికి  ఉపవాసం మంచిది కాదు,, ఆహారం తినకుండా మందులు వేసుకోలేం, ఆహారం తినకుండా మందులు వేసుకున్నా అది  ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉంటే..  తరచుగా అలసట, తలతిరగడం, ఛాతిలో ఇబ్బందిగా ఉండటం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరం మీద ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పే లక్షణాలు. కాబట్టి ఉపవాసం పేరుతో ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండటం,  శరీరాన్ని ఇబ్బందికి గురిచేసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది.  అందుకే.. బరువు తగ్గాలన్నా, ఫిట్ గా ఉండాలన్నా మంచి పద్దతులలో ఆహారం తీసుకుంటూనే గోల్ రీచ్ అవ్వాలి.                                    *రూపశ్రీ.
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో గర్భసంచి క్యాన్సర్ (Endometrial Cancer / Uterine Cancer) కు తొలి హెచ్చరిక కావచ్చు.  ఈ వీడియోలో ప్రముఖ గైనకాలజిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహా సాగర్ గారు గర్భసంచి క్యాన్సర్ గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభంగా వివరించారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు:  ✅ మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ రావడానికి కారణాలు ఏమిటి? ✅ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ✅ గర్భసంచి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి? ✅ ఎవరికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ? ✅ ఎప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ బయాప్సీ ఎందుకు అవసరం? ✅ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో ఎలా గుర్తిస్తారు? ✅ శస్త్రచికిత్స (Surgery), కీమోథెరపీ (Chemotherapy), రేడియేషన్ థెరపీ (Radiation Therapy) వంటి చికిత్సల గురించి పూర్తి వివరాలు.  ప్రారంభ దశలో గర్భసంచి క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స విజయవంతంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మెనోపాజ్ తర్వాత ఎలాంటి బ్లీడింగ్ వచ్చినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఎంతో ముఖ్యం.