LATEST NEWS
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి అష్ఠకష్టాలు పడిన వైసీపీ.. కోటి సంతకాలంటూ చేసిన హడావుడి ముగిసింది. గవర్నర్ కు వినతిపత్రంలో ఆ ప్రహసనం దాదాపు ముగిసిపోయినట్లే. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పట్ల ప్రజల వ్యతిరేకత పెద్దగా కనిపించలేదని స్పష్టమైంది. దీంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఈ విషయంలో కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడానికి సన్నాహాలు చేస్తున్నది. అయితే ఇక్కడే ఆ పార్టీకి పెద్ద ఇబ్బంది వచ్చి పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీపీపీ విధానం వద్దు అంటూ కోర్టును ఆశ్రయిస్టే ఆ పిటిషన్ అడ్మిషన్ స్థాయిలోనే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. ఎందుకంటే పీపీపీ విధానం అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడిన అంశం. కేంద్రం నుంచి పలు రాష్ట్రాలలో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ అన్నది ఈ పీపీపీ విధానంలోనే జరుగుతోంది. సరే అది కాదని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది.  దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు. అది పక్కన పెడితే తాము సేకరించిన కోటి సంతకాలనూ కోర్టు ముందు ఉంచుతామన్న వాదనను వైసీపీ తెరపైకి తీసుకువస్తున్నది. అయితే అదీ అంత తేలిక కాదు. నిజంగా వైసీపీ కోటి సంతకాలు సేకరించి, వాటిని కోర్టుకు సమర్పించాలంటే, ఆ కోటి సంతకాలు చేసిన వారి గుర్తింపును కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలా జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతకాలు చేసిన కోటి మంది ఐడెంటిటీని కోర్టు ముందు ఉంచడం అంటే అయ్యే పని కాదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు కాలేజీలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి ఎలా ముందుకు వెడుతుందన్నది ఆసక్తిగా మారింది. 
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.   సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న కుట్రలు జరిగాయి. పప్పు అంటూ బాడీ షేమింగ్,  హేళనలు ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నాలు జరిగాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ , మీమ్స్ తో లోకేష్ రాజకీయ ఎదుగుదనలను ఆరంభంలోనే అణచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయాలన్నిటినీ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్ర వరంలో శుక్రవారం (డిసెంబర్ 19) విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు. వాటన్నిటినీ అధిగమించడానికి తాను ఏం చేశారో పంచుకున్నారు.   తన శక్తిని అటువంటి ట్రోలింగ్స్, మీమ్లను ఖండించడానికీ, బుదలు ఇవ్వడానికీ వృధా చేయ కూడదని అందుకు బదులుగా  రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగడంపైనే దృష్టి సారించాననీ వివరించారు. తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో  పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.  తనకు ఎదురైన ప్రతి సవాలును సానుకూల దృక్ఫ థంతో ఎదుర్కొన్నానని చెప్పారు.  ఒక అడుగు వెనక్కి వేస్తే సరిదిద్దుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు చెప్పారు.   
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభివృద్ధి విషయంలో తనతోనే పోటీ పడతానంటూ సవాల్ చేసిన పార్టీ ఎమ్మెల్యేను అభినందించారు. మనస్ఫూర్తిగా ఆ సవాల్ ను స్వీకరిస్తున్నానని సభా ముఖంగా ప్రకటించారు. ఇంతకీ విషయమేంటంటే.. రాజమహేంద్రవరంలో శుక్రవారం (డిసెంబర్ 19) పర్యటించిన నారా లోకేష్ అక్కడ  నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాను నారా లోకేష్ తో పోటీ పడతానని అన్నారు. దీనికి నారా లోకేష్ చాలా చాలా సానుకూలంగా స్పందించారు. సిటీ  ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలతో మమేకమౌతూ ముందుకు సాగాలన్న లోకేష్.. ఆదిరెడ్డి వాసు కుటుంబం కష్ట సమయంలో తమకు అండగా ఉందని చెప్పారు.  జగన్ హయాంలో చంద్రబాబును అక్రమంగా రాజమహేంద్రవరం జైల్లో నిర్బంధించిన సమయంలో ఆదిరెడ్డి కుటుంబం తమకు అండగా నిలిచిందని చెప్పారు. ఆయనను తాను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. జగన్ ను సైకోగా అభివర్ణించారు. సైకో ఇంకా అరెస్టులు చేస్తానంటూ చేస్తున్న బెదరింపులను ఖండించారు.  అధికారంలో ఉండగా వైనాట్ 175 అంటూ గప్పాలు కొట్టిన వారు, గత ఎన్నికలలో టీమ్ 11 కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు జరుగుతున్నాయన్న ఆయన ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. 
క‌మ్యూనిస్టుల‌కు  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనే ప‌ద‌వి ఎంత  ప‌వ‌ర్ ఫుల్లో.. బీఆర్ఎస్ వంటి పార్టీల‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అంటే అంత వేల్యుబుల్.  అయితే బీఆర్ఎస్ లో సమస్య ఏమిటంటే.. పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు. నల్లేరు మీద బండినడక అనదగ్గ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పరాజయాలను ఎదుర్కొంటూనే ఉంటుందన్నారు.  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎంపికైన నాటి  నుంచి ఇప్ప‌టి  వ‌ర‌కూ   గ్రేట‌ర్, కార్పొరేషన్, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఇవి రెండూ పూర్తయిన తరువాత  రెండు ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ అన్ని ఎన్నికలలోనూ ఆయన ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని పని చేశారు. అయితే వేటిలోనూ పార్టీని విజయం దిశగా నడిపించలేకపోయారు.  దుబ్బాక నుంచి మొద‌లు పెడితే నిన్న మొన్న‌టి  జూబ్లీహిల్స్ బై పోల్ వ‌ర‌కూ ప్ర‌తి ఎన్నికలోనూ పార్టీని పరాజయమే వరించింది.  ఇటీవ‌లి స్థానిక ఎన్నిక‌ల‌లోనూ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఓటమినే మూటగట్టుకుంది.   రేవంత్  విమర్శలను పక్కన పెడితే..  కేటీఆర్ కి కానీ,  బీఆర్ఎస్ కి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అచ్చిరాలేదన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేటీఆర్ సమర్ధ నాయకుడిగా గుర్తింపు పొందడం వెనుక తండ్రి ఇమేజ్ ఉంది. సీఎం కుమారుడిగా, మంత్రిగా ఆయన మాటే వేదంగా అప్పట్లో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు సాగాయి. అయితే ఆ ఘనత అంతా కేసీఆర్ దేనని అంటారు విమర్శకులు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత.. ముందుండి పార్టీని నడిపించడంలో కేటీఆర్ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో సొంత పార్టీలోనే కేటీఆర్ నాయకత్వంపై సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.  ఎన్నికలలో వరుస పరాజయాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగింపుపైనా బీఆర్ఎస్ లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి.  అయినా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలలో కూడా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. కానీ వారి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఈ స్థాయి చర్చ జరగడం లేదు. ఒక్క కేటీఆర్ విషయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సామర్థ్యం, అర్హతపై రాజకీయ ప్రత్యర్థలు నుంచే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతల నుంచి కూడా ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  కేటీఆర్  పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  గా  ఉన్నన్ని రోజులూ బీఆర్ఎస్ గెలుపు అన్న మాటను మరచిపోవడం మంచిదన్న సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావే సోషల్ మీడియాలో పదె్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ముందు ముందు ఎలా నెట్టుకుని, నెగ్గుకుని వస్తారో?
లోకేష్ ని 2027 ఉగాది నాటిక‌ల్లా  ముఖ్య‌మంత్రిని చేసే దిశ‌గా  కొన్ని  పావులు క‌దులుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. లోకేష్ ఢిల్లీ వెళ్లి మోడీ క‌లిసిన‌పుడు జ‌రిగే  ప్ర‌ధాన  చ‌ర్చ ఇదేనంటారు చాలా మంది. ఇటు ఢిల్లీ, అటు నాగ్ పూర్ వ‌ర్గాల స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే ఇదే జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం పరిశీలకుల్లో సైతం వ్యక్తం అవుతోంది.  ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  నంబర్ 1, 2,  3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది.  అయితే ఈ హైరాక్కీని దాటి   త్వ‌ర‌లో  లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. లోకేష్ కు సీఎం పదవి విషయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి అగ్రనాయకత్వం సుముఖంగా ఉందంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కావడం లేదంటున్నారు పరిశీలకులు. సీఎం పదవి కోసం పవన్ తొందరపడటం లేదనీ, ఆయన తన పాతికేళ్ల పొలిటికల్ కేరీర్ లు ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.   అన్నిటికీ మించి లోకేష్ కు సీఎం పట్టాభిషేకం చేయడానికి నంబర్స్ కూడా బలంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు మించిన సంఖ్యా బలం ఉంది. ఇక కూటమి ఐక్యత విషయానికి వస్తే.. పవన్ కు కూటమి అవసరమా? కూటమికి పవన్ అవసరమా? అన్న ప్రశ్నే తలెత్తే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ కూటమి పటిష్ఠత గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రగతిలో లోకేష్ క్రెడిట్ ను గుర్తించడానికే మొగ్గు చూపుతున్నారు.  ఈ నేపథ్యంలోనే   సీఎం చైర్ కు లోకేష్ లైన్ క్లియ‌ర్ అయ్యిందనే అంటున్నారు పరిశీలకులు. 
ALSO ON TELUGUONE N E W S
కొరియోగ్రాఫర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్న జానీ మాస్టర్‌పై 2024 సెప్టెంబర్‌ 11న లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. అతని దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మైనర్‌ బాలిక.. తనను లైంగికంగా వేధించాడంటూ కేసు నమోదు చేయడంతో టాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. అయితే 2019లో ఇది జరిగింది. చాలా ఆలస్యంగా ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది బాధితురాలు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీమాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేశారు. 36 రోజులు జైలులో ఉన్న జానీ.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇప్పుడు కేసు విచారణలో ఉంది. తాజాగా ఈ కేసులో బాధితురాలు టీఎఫ్‌టీడీడీఏ(TFTDDA) ప్రెసిడెంట్‌ వి.వి. సుమలతాదేవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను వేధింపులకు గురిచేసిన జానీ మాస్టర్‌ను కాపాడేందుకు సుమలత ప్రయత్నిస్తున్నారని సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. పోక్సో(POCSO) చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్న నిందితుడ్ని కేసు నుంచి తప్పించేందుకు ఒక బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్‌ అని బాధితురాలు ప్రశ్నిస్తోంది.  ‘ప్రస్తుతం నేను పనిచేస్తున్న ప్రదేశంలో సురక్షితంగా ఉన్నానా, ఒక నేరస్తుడ్ని కాపాడేందుకు నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం అవసరమా?’ అని సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులో బాధితురాలు ప్రశ్నించింది. ఈ పోస్టుకు సంబంధించిన వీడియోలు, స్క్రీన్‌ షాట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్‌ అయి, కొన్నాళ్లు జైలులో ఉండి వచ్చిన జానీ మాస్టర్‌ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. తాజాగా బాధితురాలు చేసిన ఆరోపణలు మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. 
నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన "సోగ్గాడు" చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో "సోగ్గాడు" సినిమా స్వర్ణోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్, రచయితలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - రచయితగా నన్ను నేను నమ్ముకుని 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఆ ఏడాది "సోగ్గాడు" సినిమా రిలీజైంది. ఆ సినిమా తర్వాత శోభన్ బాబు గారు హీరోగా ఒక్కో మెట్టు పైకి అధిరోహిస్తూ వెళ్లారు. శోభన్ బాబు గారికి మహిళా అభిమానులు ఎక్కువ. నా భార్య కూడా ఆయనకు అభిమాని. శోభన్ బాబు గారు ఎన్నో చిత్రాల్లో తన విశిష్ట నటనతో ఆకట్టుకున్నారు. మానవుడు దానవుడు సినిమాలో ఆయన నటన చూస్తే ఆ రెండు పాత్రల్లో నటిస్తున్నది ఒక్కరేనా అనిపిస్తుంది. 2008లో శోభన్ బాబు గారు మనల్ని వదిలి వెళ్లారు. కానీ ఆయన ఇంకా మన మధ్యే ఉన్నారని అనిపించేలా అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉంది. అన్నారు. నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ - శోభన్ బాబు గారు క్రమశిక్షణ కలిగిన హీరో. నిర్మాత ఎవరైనా బడ్జెట్ లోనే సినిమా పూర్తయ్యేలా చేసేవారు. అలాంటి హీరో ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఈ రోజు శోభన్ బాబు గారి సోగ్గాడు సినిమా స్వర్ణోత్సవం కార్యక్రమం నిర్వహించడం మంచి నిర్ణయం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలామంది ఆయనతో కలిసి నటించిన హీరోయిన్స్ వచ్చారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. అన్నారు. గాయని సుశీల మాట్లాడుతూ - సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సోగ్గాడు స్వర్ణోత్సవ కార్యక్రమం జరపడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంకా ఇలాంటి గొప్ప కార్యక్రమాలన్నీ చూసి ఆ జ్ఞాపకాలు పోగేసుకోవాలని కోరుకుంటున్నాను. రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ అనే గొప్ప సంస్థను తీర్చిదిద్దారు. శోభన్ బాబు గారి సినిమాల్లో పాడిన ప్రతి పాటా నా మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అన్నారు. రచయిత, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ - శోభన్ బాబు గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన విశాఖ వచ్చినప్పుడల్లా కలుస్తుండేవాడిని. నా స్నేహితుడు కాట్రగడ్డ మురారిని నిర్మాతను చేసిన గొప్ప హీరో శోభన్ బాబు గారు. నేను సోగ్గాడు సినిమాను శోభన్ బాబు గారి కోసం ఒకసారి ఇద్దరు హీరోయిన్స్ కోసం మరోసారి చూశాను. ప్రేక్షకులకు షడ్రోసోపేతమైన భోజనం లాంటి వినోదాన్ని అందించింది సినిమా. అన్నారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ - సోగ్గాడు సినిమా మా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు ఎంతో కీలకమైన మూవీ. 1964లో మా సంస్థ స్థాపించిన తర్వాత కొన్ని మూవీస్ చేస్తూ వచ్చాం. 75లో మా సంస్థకు మళ్లీ మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా సోగ్గాడు. ఈ సినిమా శోభన్ బాబు గారి కోసమే రాశారా అనిపిస్తుంది. ఆయన తన క్యారెక్టర్ లో ఎంతో సహజంగా నటించారు. అందుకే సోగ్గాడు సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. ఆ సినిమాకు పనిచేసిన హీరోయిన్స్ జయసుధ గారు జయచిత్ర గారు ఇంకా అనేక మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఇంకా చాలా మంది రాలేకపోయారు. సుశీల గారు మళ్లీ ఆ రోజులు గుర్తుచేసేలా పాటలు పాడారు. నేను ఈ కార్యక్రమానికి వచ్చేముందు సోగ్గాడు సినిమా మళ్లీ ఒకసారి చూశాను. ఎంతో బాగుంది అనిపించింది. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి వాళ్లు పట్టుదలగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. అన్నారు. శోభన్ బాబు మనవడు డా.సురక్షిత్ మాట్లాడుతూ - మా తాతగారిని గౌరవించుకునేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. 50 ఏళ్ల తర్వాత కూడా సోగ్గాడు మూవీని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఇది ఎంత గొప్ప సినిమానే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని తరతరాలు గుర్తుండేలా నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు కృతజ్ఞతలు. సోగ్గాడు సినిమా స్వర్ణోత్సవం కార్యక్రమంతో మనకు తెలిసేది ఏంటంటే లెజెండ్స్ ఎప్పుడూ మన హృదయాల్లో ఉంటారు. తాత గారు సినిమాల్లో ఎంత కష్టపడినా కుటుంబానికి, ఆయన అభిమానులకు తగినంత సమయం కేటాయించేవారు. ప్రతి అభిమానినీ పలకరించేవారు. మాకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చారు. అందుకే నేను డాక్టర్ అయ్యాను. అన్నారు. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ - సోగ్గాడు టైటిల్ ను దసరా బుల్లోడు సినిమాకు పెట్టమని జగపతి రాజేంద్రప్రసాద్ గారికి సూచించాను. ఆయన దసరా బుల్లోడు బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత రామానాయుడు గారు ఈ సినిమాకు సోగ్గాడు అని పెట్టారు. ఆయనను వాహిణీ స్టూడియోలో కలిసినప్పుడు మంచి టైటిల్ పెట్టారు, ఈ టైటిల్ 20 లక్షల ఖరీదు చేస్తుందని రామానాయుడు గారిని అభినందించాను. సోగ్గాడు సినిమా సురేష్ సంస్థకు గొప్ప పేరు, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. శోభన్ బాబు గారు మన ఇండస్ట్రీలో ఆర్థికమంత్రిలా ఉండేవారు. ప్రతి సినిమాకు లెక్క వేసుకుని చేసేవారు. అన్నారు. నటి జయచిత్ర మాట్లాడుతూ - నాకు తెలిసి ఇండస్ట్రీలో 50 ఏళ్ల ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న చిత్రం సోగ్గాడు. ఈ సినిమాలో నటించిన జ్ఞాపకాలు ఇంకా మనసులో అలాగే ఉన్నాయి. ఈ చిత్రంలో శోభన్ బాబు గారి లాంటి పెద్ద హీరోతో నటించే అవకాశం రామానాయుడు గారు కల్పించారు. ఈ సినిమా షూటింగ్ ఎంతో హ్యాపీగా చేశాం. శోభన్ బాబు గారికి కోపం రావడం నేనెప్పుడూ చూడలేదు. నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు. సోగ్గాడు సినిమా రిలీజై ఘన విజయం సాధించింది, తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్ కు సెలెక్ట్ అయ్యింది. ఆ ఫిలిం ఫెస్టివల్ కోసం నేను మా చిత్ర బృందంతో కలిసి రష్యా వెళ్లాను. తాష్కెంట్ లో స్క్రీన్ మీద సోగ్గాడు అని టైటిల్స్ పడగానే మాకు గర్వంగా అనిపించింది. ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు నాకు వచ్చాయి. ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమై, ఇన్నేళ్ల తర్వాత స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. అన్నారు. నటి జయసుధ మాట్లాడుతూ - శోభన్ బాబు గారితో చాలా మూవీస్ చేశాను. ఆయనను చూసి డిసిప్లిన్ తో పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే పనిచేయాలనే పద్ధతి నేర్చుకున్నాను. శోభన్ బాబు గారు అంటే మా హీరోయిన్స్ అందరికీ చాలా ఇష్టం. మా అందరితో ఎంతో బాగుండేవారు. ఇలాంటి గొప్ప అభిమానులు ఉండటం శోభన్ బాబు గారి అదృష్టం. ఆయన ఇవాళ మన మధ్య భౌతికంగా లేకపోయినా సోగ్గాడు స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా అభిమానులు నిర్వహిస్తుండటం సంతోషకరం. ఈ ఈవెంట్ గురించి తెలిసి ఉంటే ఇంకా చాలా మంది శోభన్ బాబు గారి హీరోయిన్స్ వచ్చేవారు. ఈ వేదిక నిండిపోయేది. నాకు శోభన్ బాబు గారితో ఉన్న అనుబంధం గురించి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. అవన్నీ మీకు తెలుసు. మేమిద్దరం 38 సినిమాల్లో నటించాం. నిన్ను చూస్తుంటే బోర్ కొడుతుంది అని సరదాగా అనేవారు. రోజంతా మేము వివిధ సినిమాల్లో కలిసే నటించేవాళ్లం. నా జర్నీ శోభన్ బాబు గారితో, రామానాయుడు గారితో ఎలా ఉండేదో ఒక పుస్తకం రాయొచ్చు. రామానాయుడు గారి గొప్ప ప్రొడ్యూసర్ ను నేను చూడలేదు. ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అన్నారు. నటి సుమలత మాట్లాడుతూ - శోభన్ బాబు గారు హీరోయిన్స్ ను గౌరవించేవారు. సినిమా ఇండస్ట్రీలో, జీవితంలో ఎలా ఉండాలో సూచించేవారు. పర్సనల్ లైఫ్, కెరీర్ ను ఎలా విభజించుకోవాలో చెప్పేవారు. నేను చాలా జూనియర్ ను. కానీ సుమలత గారు అనే పిలిచేవారు. సీనియర్ హీరో అని భయపడతానని కంఫర్ట్ గా ఉంచేవారు. ఆయన సోగ్గాడు సినిమా స్వర్ణోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన అభిమానులకు, సురేష్ సంస్థకు నా అభినందనలు చెబుతున్నా. అన్నారు. నటి రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ - శోభన్ బాబు గారి అందంగా ఉండటమే కాదు అందమైన వ్యక్తిత్వం కలవారు. ఆయన తన సినిమా సెట్ లో ఉండగా మరో సినిమా గురించి, మరొకరి గురించి మాట్లాడగా నేను వినలేదు. ఆ సినిమా, ఆ క్యారెక్టర్ గురించి మాత్రమే ఆలోచించేవారు. టైమ్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ గురించి చెప్పేవారు. ఆయన డిసిప్లిన్ మా అందరికీ వచ్చింది. నేను పిన్ని సీరియల్ చేస్తున్నప్పుడు ఆ సీరియల్ చాలా బాగుందనే ఫోన్ చేసి చెప్పేవారు. గత వారం రిలీజైన సినిమా గురించే ఎవరికీ గుర్తుండని రోజులు ఇవి. అలాంటిది 50 ఏళ్ల సోగ్గాడు సినీ స్వర్ణోత్సవం నిర్వహించడం నిజంగా గొప్ప విషయం. అన్నారు. నటి ప్రభ మాట్లాడుతూ - మీ అందరిలాగే నేనూ శోభన్ బాబు గారి అభిమానినే. నేను ఆయనతో చేసిన సినిమాల కన్నా, చేయలేక మిస్ అయిన సినిమాలే చాలా ఉన్నాయి. అవి కావాలని కాదు, అనివార్య కారణాలతో ఆ సినిమాలు మిస్ అయ్యాను. నేను నా జీవితంలో  శోభన్ బాబు గారిని, రామానాయుడు గారిని ఎప్పుడూ మర్చిపోలేను. అన్నారు. నటి రోజా రమణి మాట్లాడుతూ - నేను శోభన్ బాబు గారికి చెల్లిగా 9 సినిమాల్లో నటించాను. ఆయన నన్ను సిస్టరీ అని పిలిచేవారు. శోభన్ బాబు గారి చెల్లి చిన్నప్పుడే చనిపోయిందట. ఆయన నన్ను చెల్లి అని ప్రేమగా చూసుకునేవారు. ఆయన సోగ్గాడు సినిమా స్వర్ణోత్సవం జరుపుకోవడం ఒకవైపు సంతోషం అయితే, ఆయన మన మధ్య లేకపోవడం బాధగా ఉంది. అన్నారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు మరో మనవడు సౌరభ్ కూడా పాల్గొన్నారు. 'సోగ్గాడు' స్వర్ణోత్సవంలో మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేష్ బాబు, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి గౌరవ చైర్మన్ రాశీ మూవీస్ నరసింహారావు, చైర్మన్ సుధాకర్ బాబు, కన్వీనర్ సాయి కామరాజు, పూడి శ్రీనివాస్, బి. బాలసుబ్రహ్మణ్యం, భట్టిప్రోలు శ్రీనివాస్ రావు, వీరప్రసాద్, విజయ్ కుర్రా రాంబాబు, తెలంగాణ శోభన్ బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అతిథులు అందరినీ కార్యక్రమ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు.
The anticipation surrounding Natural Star Nani’s upcoming period action epic, The Paradise, has reached a fever pitch. Directed by Srikanth Odela, this high-budget entertainer promises a visceral blend of raw emotion and high-octane action.  Following the viral success of Nani’s initial posters, the production team has now unveiled a striking new look featuring Sampoornesh Babu. In a departure from his usual screen persona, Sampoornesh Babu appears completely unrecognizable in the role of Biryani. Tasked with portraying the epitome of loyalty, Biryani is the most trusted confidant of Nani’s character, Jadal.  To meet Odela’s specific creative vision, the actor underwent a significant physical transformation, losing considerable weight to inhabit this "massy" and rugged avatar. Produced by Sudhakar Cherukuri, this Pan-India spectacle is set for a grand multi-language release on March 26, 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  'దసరా' తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ది ప్యారడైజ్'(The Paradise). శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్, 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంపూర్ణేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరి మట్ట వంటి సినిమాలతో కామెడీ హీరోగా మంచి గుర్తింపు పొందాడు సంపూర్ణేష్ బాబు. ఇతర హీరోల సినిమాల్లోనూ అప్పుడప్పుడు మెరుస్తాడు. అయితే సంపూర్ణేష్ పేరు వింటే.. మొదట గుర్తుకొచ్చేది కామెడీనే. అలాంటి సంపూర్ణేష్.. ఇప్పుడు 'ప్యారడైజ్' కోసం మాస్ అవతారమెత్తాడు. (Sampoornesh Babu as Biryani)   'ది ప్యారడైజ్'లో నాని జడల్ అనే పాత్ర పోషిస్తుండగా, అతని స్నేహితుడు బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ నటిస్తున్నాడు. తాజాగా బిర్యానీ రోల్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. ఒంటి నిండా నెత్తుటి మరకలతో.. భుజాన గొడ్డలి వేసుకొని.. బీడీ తాగుతూ నిల్చొని ఉన్న సంపూర్ణేష్ లుక్ అదిరిపోయింది. ఈసారి తనలోని మాస్ యాంగిల్ ని చూపించబోతున్నాడని పోస్టర్ తో అర్థమవుతోంది.   Also Read: BMW టీజర్.. భార్యకు తెలియకుండా స్పెయిన్ లో భర్త రాసలీలలు!   'ది ప్యారడైజ్'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా నెవర్ బిఫోర్ లుక్ లో నాని కనిపించిన తీరు సర్ ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు సంపూర్ణేష్ బాబు లుక్ చూసిన తర్వాత.. ఇందులో మరిన్ని సర్ ప్రైజ్ లు చూడబోతున్నామని అనిపిస్తోంది.    
Ravi Teja is trading heavy-duty action for high-octane humor in his latest outing, Bharta Mahasayulaku Wignapthy. Following a string of mass entertainers, the "Mass Maharaja" is back in a full-fledged comic avatar, and the newly released teaser suggests he hasn’t missed a beat. Directed by Kishore Tirumala, the film features Ravi Teja as a husband navigating the chaotic complications of an extra-marital affair. The teaser showcases the actor’s vintage comedic timing, reminiscent of his iconic performances in Venky and Dubai Seenu. His effortless wit, trademark expressions, and energetic body language signal a triumphant return to the "goated" sense of humor fans have long craved.   The teaser also highlights a nostalgic and hilarious chemistry between Ravi Teja and Sunil, a duo that has historically delivered box-office magic. Kishore Tirumala appears to have crafted a fresh, relatable characterization that leans into the actor’s natural charisma. Produced on a lavish scale by Sudhakar Cherukuri, the film stars Ashika Ranganath and Dimple Hayathi as the leading ladies. With its vibrant visuals and sharp writing, this teaser firmly establishes the movie as a must-watch family entertainer for the Sankranti season, for 13th January 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    ఎందుకు చేసాడు  ఏం మాట్లాడాడు ఆదిత్య దర్ ఏమన్నాడు     'ధురంధర్'(Dhurandhar)విజయపరంపర ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రేక్షకుల మౌత్ టాక్ కి తోడు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ధురంధర్ ని చూసి బాగుందని చెప్తుండటంతో ఇండియా వైడ్ గా ప్రేక్షకులు భారీ ఎత్తున థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. ఇండియన్ క్రికెట్ టీం సైతం బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా ధురంధర్ ని వీక్షించడంతో సక్సెస్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)ధురంధర్ పై స్పందించడం జరిగింది.     ఎక్స్ వేదికగా వర్మ స్పందిస్తు 'ధురంధర్ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదు. చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఏ భాషలో తెరకెక్కిందనేది ముఖ్యం కాదు. ధురంధర్ భారతీయ సినిమా. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం మన మనసులకి హత్తుకుంటుంది.  వినోదాన్ని పంచడంతో పాటు ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం చిత్ర బృందం సాధించిన అతి పెద్ద విజయం. ప్రతి సీన్ ఎప్పటికి గుర్తుండిపోతుంది. హాలీవుడ్ చిత్రాల్లా కాకుండా మన నేటి వీటికి తగిన విధంగా అంతర్జాతీయ స్థాయిలో కథలు తెరకెక్కించవచ్చని కూడా ఆదిత్య దర్ నిరూపించాడని వర్మ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు.     Also read:  అవతార్ ఫైర్ అండ్ యాష్  మూవీ రివ్యూ    వర్మ ట్వీట్ కి ఆదిత్య దర్(Aditya Dhar)స్పందిస్తు 'వర్మ సార్ నా మూవీ గురించి పోస్ట్ చేయడం నమ్మలేకపోతున్నాను. ఒక అభిమానిగా ఎంతో ఉప్పొంగిపోతున్నాను. దీంతో  నా బాధ్యత మరింత పెరిగిందని అనుకుంటున్నాను. ఇక పై ఏ మూవీని తెరకెక్కించిన ఆ పోస్ట్ చూసే తెరకెక్కిస్తాను. ఎన్నో ఏళ్ళ క్రితం ఒక చిన్న సూట్ కేసుతో ముంబై వచ్చాను. వర్మ సార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తే చాలని అనుకున్నానని బదులిచ్చాడు.        
  మాస్ మహారాజా రవితేజ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. దీంతో కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. (Bhartha Mahasayulaku Wignyapthi)   భార్య-ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తి కథగా, వినోదభరిత చిత్రంగా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' తెరకెక్కింది. నిమిషంన్నర నిడివితో రూపొందిన ఈ టీజర్ సరదాగా సాగింది. వెన్నెల కిషోర్ తో కలిసి సైకాలజిస్ట్ దగ్గరకు రవితేజ వెళ్ళే సన్నివేశంతో టీజర్ ప్రారంభమైంది. ఇందులో రవితేజ భార్యగా డింపుల్ హయాతి, లవర్ గా ఆషికా రంగనాథ్ కనిపిస్తున్నారు. తన భర్త రాముడు లాంటివాడు అని డింపుల్ హయాతి నమ్మకం. కానీ, రవితేజ మాత్రం స్పెయిన్ వెళ్ళినప్పుడు.. అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఆషికా రంగనాథ్ తో శారీరికంగా కలిసి, ఆమెకు దగ్గరవుతాడు. ఈ విషయం భార్యకు తెలియకుండా ఉండటం కోసం రవితేజ ఏం చేశాడు? రవితేజకు ఆల్రెడీ పెళ్లి అయిందని తెలిసి ఆషిక ఎలా రియాక్ట్ అయింది? వంటి అంశాలతో టీజర్ ను సరదాగా రూపొందించారు. (BMW Teaser)   Also Read: సౌండ్ లేని 'రాజా సాబ్'.. ఇది నిజంగా ప్రభాస్ సినిమాయేనా..?   'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ చూస్తుంటే.. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి బోలెడంత స్కోప్ ఉందని అర్థమవుతోంది. రవితేజ అంటేనే ఎంటర్టైన్మెంట్. పైగా, సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి మంచి ఆదరణ ఉంటుంది. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. చూస్తుంటే.. ఈ సినిమాతో రవితేజ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు.   కాగా, టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేశారు మేకర్స్. జనవరి 13న థియేటర్లలో అడుగు పెట్టనుంది.    
      సినిమా పేరు: అవతార్ ఫైర్ అండ్ యాష్ తారాగణం: సామ్ వర్తింగ్టన్, జియో సాల్డానా, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లేట్ తదితరులు     తదితరులు  ఎడిటర్: డేవిడ్ బ్రేన్నర్, జాన్  మ్యూజిక్:సైమన్ ఫ్రాంగ్లన్ రచన, దర్శకత్వం: జేమ్స్ కామెరూన్   సినిమాటోగ్రాఫర్: రసల్ కార్పెంటర్ బ్యానర్: లైట్ స్తోమ్ ఎంటర్ టైన్ మెంట్  నిర్మాతలు:జేమ్స్ కామెరూన్, జోన్ లండు విడుదల తేదీ: డిసెంబర్ 19, 2025        ప్రపంచ సినీ ప్రేమికులతో పోటీపడుతు తెలుగు సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'అవతార్ ఫైర్ అండ్ యాష్'(Avatar fire and ash). దీంతో పండోర గ్రహంలో మరోసారి ప్రపంచ సినీ పితామహుడుగా పిలవబడే  జేమ్స్ కామెరూన్(James Cameron)సృషించిన అద్భుతమైన విశ్వాన్ని చూడటానికి ఉదయం నుంచే థియేటర్స్ కి క్యూ కట్టారు.మరి మూవీ మెప్పించిందా లేదా చూద్దాం.     కథ   పోరాటయోధుడైన జేక్ (సామ్ వర్తింగ్టన్) తన కుటుంబం, తన మనుషులతో పండోర గ్రహంలో నివసిస్తూ ఉంటాడు. వాళ్ళందరంటే జేక్ కి  ప్రాణం. జేక్ బార్య నైత్రీ కూడా పోరాటయోధురాలు. ఏలియన్స్ అయిన వీళ్ళతో పాటు స్పైడర్ అనే మాములు మనిషి జీవిస్తుంటాడు. జేక్ ఫ్యామిలీకి స్పైడర్ అంటే ఎంతో ఇష్టం. వీళ్ళకి దూరంగా ఒక రహస్య ప్రాంతంలో కల్నల్ క్వారీచ్‌(స్టీఫెన్ లాంగ్) నేతృత్వంలోని ఆర్ డి ఏ టీం, బ్రిడ్జి హెడ్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తుంది. మాములు మనుషులైన వాళ్ళ లక్ష్యం జేక్ ని తమ అదుపులో ఉంచుకోవడం. మరో వైపు యాష్ పీపుల్' నాయకురాలు, ఏలియన్ అయిన వరాంగ్(ఊనా చప్లీన్) లక్ష్యం జేక్ ని అంతం చేయడం. ఈ క్రమంలో స్పైడర్ ని అతని శరీరంలో ఉన్న 'అల్గే' కోసం కల్నల్ మనుషులు తీసుకెళ్తారు. అసలు అల్గే అంటే ఏంటి? జేక్ పై  కల్నల్ క్వారీచ్‌, వరాంగ్ కి పగ ఎందుకు?  జేక్ అతని తెగపై ఏం ఆశించి పోరాటం చేస్తున్నారు? ఆ పోరాటంలో క్వారీచ్‌, వరాంగ్ ఒక్కటయ్యారా! ఒక్కటయ్యితే  ఆ పోరాటాన్ని జేక్ వర్గం ఎలా ఎదుర్కొంది. ఆ పోరాటంలో ఎవరు విజేతలుగా నిలిచారు ? అసలు టోటల్ గా అవతార్ ఫైర్ అండ్ యాష్ ఏ ఉద్దేశంతో తెరకెక్కిందనేదే  చిత్ర కథ.      ఎనాలసిస్    అవతార్ రెండు పార్టులు చూసిన వాళ్లకి పార్ట్ 3 ఈజీగా అర్ధమవుతుంది. కొత్త వాళ్ళు అయితే అంత త్వరగా అర్ధం చేసుకోలేరు. ఈ విషయాన్నీ మేకర్స్ గుర్తించి రెండు భాగాల కథని మొదట ఐదు నిమిషాల్లో చెప్పాల్సింది. ఫైర్ అండ్ యాష్ ని చూసుకుంటే స్టార్టింగ్ నుంచే స్లో గా కథనం నడవడంతో పాటు క్యారక్టర్ ల బాడీ లాంగ్వేజ్ కూడా చివరి దాకా అదే విధంగా నడిచాయి. విజువల్స్ పరంగా బాగున్నా ఒకే పాయింట్ పై కథ నడవడంతో చూసిన సీన్స్ మళ్ళీ చూసినట్టుగా అనిపించడం మైనస్. ప్రేక్షకులని మెప్పించాలనే రీతిలో మేకర్స్ తెరకెక్కించలేదని స్టార్టింగ్ నుంచే అనిపిస్తుంది. అసలు తమకి ముప్పు ఉంటుందని జేక్ అండ్ వర్గానికి తెలుసు కాబట్టి వాళ్ళ పోరాటాన్ని ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే ఎదుర్కొని ఉంటే బాగుండేదేమో.     ఫస్ట్ హాఫ్  చూసుకుంటే మొదటి ఇరవై నిమిషాల దాకా ఆకట్టుకునే సీన్స్ రాలేదు. ఆ తర్వాత వచ్చిన సీన్స్ లో భావోద్వేగాలు మాత్రం బాగున్నాయి. సినిమా చివరి దాకా అదే విధంగా భావోద్వేగాలు కంటిన్యూ అవుతూ వస్తుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ లో కూడా పెద్దగా మెరుపులు ఏమి లేవు. ఇక సెకండ్  హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ చూసినట్టుగానే ఉంది. ఒక సెంటిమెంట్ సీన్, ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్ రాయడంతో మైమరిచిపోయిందేమి లేదు. విలన్స్ ఎంతో కష్టపడి పట్టుకున్న వ్యక్తి  చాలా నాచురల్ గా తప్పించుకోవడం, మళ్ళీ అతనితో పోరాటం చేయడం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది. దీంతో గూస్ బంప్స్ రావు.  కాకపోతే చివర్లో సముద్రంలో వచ్చిన పోరాట సన్నివేశాలతో పాటు   సదరు సన్నివేశాల్లో విజువల్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి.   నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు   అందరూ తమ క్యారక్టర్ ల పరిధి మేరకు సూపర్ గా చేసారు.టెక్నీకల్ గా చూసుకుంటే విజువల్స్, ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ ఆర్ స్కోర్ మాత్రం మెస్మరైజ్ చేసేంత స్థాయిలో లేదు. కథకి తగ్గట్టుగానే జేమ్స్ కామెరూన్ దర్శకత్వం సాగినా, కథనాన్ని చెప్పే విషయంలో మెప్పించలేకపోయాడు. ఎడిటింగ్ కూడా అంత క్యాచీగా లేదు.    ఫైనల్ గా చెప్పాలంటే క్యారక్టర్ డిజైన్స్ బాగున్నా వాటిని ఉపయోగించుకోవడంలో  మేకర్స్ మెతక వైఖరి అవలంభించారు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా కాన్సెప్ట్ కి తగ్గ స్పీడ్  కూడా  మూవీలో లేదు. విజువల్ గా మాత్రం బాగుంది. రేటింగ్ 2 .5 /5                                                                                                                                         అరుణాచలం     
  మూడు వారాల్లో రాజా సాబ్ రాక కనిపించని ప్రభాస్ రేంజ్ హైప్! ఓవర్సీస్ బుకింగ్స్ కి షాకింగ్ రెస్పాన్స్! ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి?   'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఆయన సినిమా వస్తుందంటే ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్ లో కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాంటిది ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్ 'ది రాజా సాబ్' విషయంలో ఆ రేంజ్ హైప్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. (The Raja Saab)   ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మూవీ 'ది రాజా సాబ్'. ఈ హారర్ కామెడీ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నాయి. రెండు సాంగ్స్ కూడా విడుదల కాగా.. సెకండ్ సింగిల్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారంటూ మూవీ టీమ్ మొదటి నుంచి ప్రచారం చేసింది. విడుదలకు ఇంకా మూడు వారాలే సమయముంది. అయినప్పటికీ ఎందుకనో రాజా సాబ్ పై రావాల్సిన హైప్ రాలేదు.   మామూలుగా ప్రభాస్ సినిమా బుకింగ్స్ ఓపెనింగ్స్ అయితే.. సరికొత్త రికార్డులు నమోదవుతుంటాయి. అలాంటిది 'రాజా సాబ్' ఓవర్సీస్ బుకింగ్స్ కి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. తెలుగునాట కూడా రెగ్యులర్ ప్రభాస్ సినిమాల స్థాయిలో దీని గురించి చర్చ జరగట్లేదు.   Also Read: హాట్ టాపిక్ గా ఛాంపియన్ ట్రైలర్.. బైరాన్‌పల్లి రక్త చరిత్ర!   రాజా సాబ్ నుంచి ఇంకా కొన్ని సాంగ్స్, రిలీజ్ ట్రైలర్ రావాల్సి ఉంది. ఆ అప్ కమింగ్ కంటెంట్ తో మెస్మరైజ్ చేసి, అందరి దృష్టిని తమ వైపు తిప్పుకునేలా మూవీ టీమ్ చేయాల్సి ఉంది. మరి అలాంటి మైండ్ బ్లోయింగ్ కంటెంట్ రాజా సాబ్ నుంచి వస్తుందేమో చూడాలి.   అయితే 'రాజా సాబ్'పై భారీ హైప్ లేదనే చర్చల నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ వేరేలా ఉంది. ప్రభాస్ గత చిత్రం 'కల్కి 2898AD' విషయంలోనూ ఇలాగే అంతగా బజ్ లేదన్నారు. కట్ చేస్తే ఆ సినిమా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు 'రాజా సాబ్' కూడా అలాంటి సర్ ప్రైజ్ ఇవ్వడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.  
  ట్రైలర్ తో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన మూవీ 'ఛాంపియన్'. రోషన్ మేకా హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్నటిదాకా సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. (Champion Trailer)   'ఛాంపియన్' సినిమా పీరియడ్ డ్రామాగా తెరకెక్కింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న బైరాన్‌పల్లి గ్రామానికి పోరాటాల పురిటిగడ్డగా పేరుంది. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలను వ్యతిరేకంగా పోరాడి, వంద మందికి పైగా గ్రామస్థులు వీరమరణం పొందారు. ఆ వీరగాథ ఆధారణంగానే 'ఛాంపియన్' రూపుదిద్దుకోనుంది.   బ్రిటిష్ పాలన కాలంలో ఫుట్ బాల్ ఛాంపియన్ కావాలని కలలు కనే యువకుడి పాత్రలో రోషన్ కనిపిస్తున్నాడు. బైరాన్‌పల్లి వీరగాథలో అతను ఎలా భాగమయ్యాడు? అతని ప్రేమ కథ ఏంటి? అతని ఫుట్ బాల్ ఛాంపియన్ కల నెరవేరిందా? అనే కోణంలో ట్రైలర్ కట్ చేశారు.    Also Read: ఈ వారం ఓటీటీలో వినోదాల విందు.. ఒకేసారి ఇన్ని సినిమాలు, సిరీస్ లా!   'ఛాంపియన్' ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథా నేపథ్యం, విజువల్స్, నటీనటుల పర్ఫామెన్స్, నిర్మాణ విలువలు, సంగీతం ప్రతిదీ ఆకట్టుకున్నాయి. ఒక్క ట్రైలర్ తో ఇప్పుడు ఈ సినిమా గురించి అంతటా చర్చ జరుగుతోంది. డిసెంబర్ 25న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసేలా కనిపిస్తోంది.    
మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల వల్ల మనం డబ్బు పోగొట్టుకుంటాం. చాణక్యుడి ప్రకారం, కొన్ని తప్పులు ధనవంతులను కూడా పేదలుగా మారుస్తాయి. ఆ తప్పులేంటో చూద్దాం. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో అతని పాత్ర గొప్పది. చాణక్యుడి ఈ తత్వశాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.ఆచార్య చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో జీవితం, డబ్బు, సమాజం, సంబంధాలు, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆలోచనలు ఇచ్చారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవనం సాగిస్తే విజయం వరిస్తుంది.అలాగే, చాణక్యుడు ప్రకారం, జీవితంలో మనం చేసే తప్పులు డబ్బు నష్టానికి,  బాధకు దారితీస్తాయి. అదేవిధంగా మన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ప్రధానంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును కుటుంబ పోషణ,  ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.  మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టాలి.మీరు సంపాదించిన డబ్బును జూదం, బెట్టింగ్ మొదలైన వాటిపై ఎప్పుడూ వృధా చేయకండి. ఆనందం కోసం డబ్బును దుర్వినియోగం చేయడం సమీప భవిష్యత్తులో మిమ్మల్ని మరింత సమస్యగా మార్చే అవకాశం ఉంది.డబ్బు ఎప్పుడూ ఇతరుల మంచికే ఉపయోగించాలి. ఇతరులకు హాని కలిగించడానికి ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది. తద్వారా మనం డబ్బును కోల్పోవచ్చు.మరీ ముఖ్యంగా డబ్బు ఆదా చేసే అలవాటు ఉండాలి. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెట్టకూడదు. మనం వీలైనంత తక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
  పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట మధ్య కొన్ని గొడవలు కామన్ గా జరుగుతాయని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.పెళ్లయ్యాక ప్రతి జంట మధ్య జరిగే కామన్ గొడవలు ఏంటో తెలుసుకుంటే.. ఇవి అందరి మధ్యన జరుగుతాయి కాబట్టి వీటిని సీరియస్ గా తీసుకుని బంధాన్ని విచ్చిన్నం చేసుకోకూడదు అని ప్రతి జంట అర్థం చేసుకోగలుగుతుంది.  ఇంతకీ అందరు భార్యాభర్తల మధ్య కామన్ గా జరిగే గొడవలు ఏంటో తెలుసుకుంటే.. తల్లిదండ్రుల శైలి.. భార్యాభర్తల ఇద్దరి తల్లిదండ్రులు ఒకరి కుటుంబ విధానాన్ని మరొకరు విమర్శించుకోవడం చాలా కుటుంబాలలో కనిపిస్తుంది. ఒకరేమో చాలా నిర్లక్ష్యంగా పెంచారు అనే నిందలు వేస్తుంటారు, మరొకరు ఏమో ఏమీ చేత కాకుండా పెంచారని అంటారు, కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గా పెంచి పిరికివాళ్లుగా మార్చారని అంటారు.  ఇలా రెండు కుటుంబాలలో విబిన్న విధాలుగా పెంపకం ఉంటుంది.  పెళ్లైన తర్వాత వారికి చిన్నతనం నుండి అలవాటైన విధానం ఇప్పుడు కూడా కొనసాగాలని కోరుకుంటారు.   అంతేకాదు.. తమ చిన్నతనం ఎలా గడిచిందో అదే విధంగా తమ పిల్లలను కూడా పెంచాలని చూస్తారు. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో సాగే గొడవ.  దీన్ని వీలైనంత చాకచక్యంగా పరిష్కరించుకోవాలి. డబ్బు.. డబ్బు చాలా ముఖ్యమైన అంశం.  కొన్ని కుటుంబాలు డబ్బుల విషయంలో చాలా ఆంక్షలు విధిస్తూ పెంచుతారు. మరికొన్ని కుటుంబాలు డబ్బు అనేది పిల్లల కోసమే కదా అనే ఆలోచనతో పిల్లలకు డబ్బు అలవాటు చేస్తారు, డబ్బు వల్ల వచ్చే సమస్యలు కొన్నిసార్లు చాలా తీవ్రమైన గొడవలకు కారణం అవుతాయి. భార్యాభర్తల అభిరుచులు డబ్బు విషయంలో ఒకటిగా ఉంటే పర్లేదు. కానీ ఒకరు పొదుపరి,  మరొకరు బాగా ఖర్చు పెట్టేవారు అయితే చాలా గొడవలు వస్తుంటాయి.  ముఖ్యంగా ఎప్పడైనా డబ్బు కారణంగా ఇంట్లో  ఆర్థిక సమస్యలు వస్తే జరిగే గొడవలు చాలా పెద్దగా ఉంటాయి. సాన్నిహిత్యం.. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే వారి మధ్య సాన్నిహిత్యం కూడా చాలా బాగుండాలి. ఒకరు తమ ప్రేమను ఎక్స్పెస్ చేయగలిగితే మరొకరు అలా ప్రేమను ఎక్ప్రెస్ చేయకుండా తమలోనే దాచుకుంటారు.  దీని వల్ల ఒకరి మీద ఒకరికి విబిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి.  ప్రేమించడం తెలియదు, ప్రేమ లేదు,  ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నారు వంటి అపార్థాలు వస్తాయి.  ఎప్పుడు ప్రేమ గురించి తప్ప బాధ్యతగా ఉంటున్నానని ఆలోచించట్లేదు అని మరొకరు అనుకుంటారు. ఇలా చాలా విధాలుగా అపార్థాలు వస్తుంటాయి. భవిష్యత్తు.. పెళ్లైన ప్రతి జంటకు భవిష్యత్తు గురించి కొన్ని కలలు ఉంటాయి. పిల్లల కోసం ఒకరు కష్టపడతారు, మరొకరు కెరీర్ ను కూడా వదిలేసుకుంటారు.  జీవితంలో లక్ష్యాల కోసం ఒకరు ఆరాటపడతారు,  నేను ఎన్ని త్యాగాలు చేసినా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒకరు అనుకుంటారు.  ఇలా చాలా విధాలుగా ఇద్దరూ తమలో తాము సంఘర్షణ పడుతుంటారు.  వీటి వల్ల కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. పైన పేర్కొన్న  ప్రతి గొడవ పెళ్లైన ప్రతి జంట మధ్య తప్పనిసరిగా జరుగుతుంది.  కేవలం తమ మద్య మాత్రమే గొడవ జరుగుతుందనే ఆలోచన చేస్తూ గొడవ జరిగినప్పుడు దానికి గల కారణాన్ని సమస్యగా చూసి దాన్ని పరిష్కరించుకోవాలి. అంతే కానీ భాగస్వామినే సమస్యగా చూస్తే ఆ బందం పెళుసుగా మారుతుంది.  అంతేకాదు.. భార్యాభర్తల మద్య గొడవలు జరిగినప్పుడు,  సమస్య వచ్చినప్పుడు రాజీ పడటం ప్రధానం.  ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప బందం నిలవదు.  రాజీ పడటం అంటే తాము ఓడిపోవడం,  చిన్నతనం కావడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడం.                           *రూపశ్రీ. 
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది.  కొన్ని ప్రశ్నలు అమ్మాయిలను చాలా అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. అమ్మాయిలను ఎప్పుడు అడగకూడని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వీటిని అడగకుండా ఉండటం వల్ల అమ్మాయిల గౌరవాన్ని కాపాడటమే కాకుండా వారి మానసిక స్థితిని కూడా కాపాడిన వాళ్లమవుతాము.  ఇంతకీ అమ్మాయిలను ఎప్పుడూ అడగకూడదని ప్రశ్నలేంటి? ఆ ప్రశ్నలను ఎందుకు అడగకూడదు? తెలుసుకుంటే.. శరీరం గురించి.. అమ్మాయిలు లావుగా  ఉండటం లేదా చాలా సన్నగా ఉండటం చాలామందిలో ఉంటుంది.  ఇది పైకి కనిపించే విషయమే.  ఎప్పుడైనా సరే అమ్మాయిలను కామెడీ కోసం లేదా సీరియస్ గా అయినా శరీర ఆకృతి గురించి,  బరువు గురించి అస్సలు అడగకూడదు.  ఇంత లావుగా ఉన్నావేంటి.. లేదా ఇంత సన్నగా ఉన్నావేంటి? వంటి ప్రశ్నలు ఎప్పుడూ వేయకూడదు. ఇది బాడీ  షేమింగ్ చేయడం కిందకు వస్తుంది.  ఇలా చేయడం వల్ల అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. శరీరం లావుగా లేదా సన్నగా ఉండటానికి చాలామంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల అలా ఉంటారు. దీనికి కామెంట్ చేస్తూ ప్రశ్నించడం తప్పు. పిల్లలు.. పెళ్లైన ప్రతి స్త్రీ కి ఎదురయ్యే ప్రశ్న పిల్లల గురించి.  కొత్తగా పెళ్లైన దగ్గర నుండి  పిల్లలు కలగడం ఆలస్యమయ్యే వారి వరకు ఎప్పుడూ పిల్లలను ఎప్పుడు కంటావ్ అని అడుగుతారు.  పిల్లలను కనాలనే నిర్ణయం కేవలం అమ్మాయిలది మాత్రమే కాదు.. వారి కుంటుంబానిది, మరీ ముఖ్యంగా భర్త కూడా దీనికి కీలకం.  అందుకే పిల్లల గురించి మహిళలను పదే పదే ప్రశ్నలు వేయకూడదు. ఇది వారిని మానసిక  ఒత్తిడికి గురి చేస్తుంది. వివాహం.. వయసు పెరుగుతున్నా వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు కూడా ఉంటారు. లేదంటే భర్త చనిపోయిన తరువాత వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయిన మహిళలు కూడా ఉంటారు. ఇలాంటి వారితో ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నలు వేయకూడదు. వివాహం  అనేది  మహిళల వ్యక్తిగతం. అలాగే అది కుటుంబ సమస్య కూడా.  దీని గురించి ప్రశ్నించడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వృత్తి.. మగవారికి వారి జీవితకాలం వృత్తి పరమైన కెరీర్ ఉంటుంది. కానీ చాలామందికి  మహిళలు తమ కెరీర్ మధ్యలో వదిలేస్తారు అనే ఆలోచన ఉంటుంది.  పెళ్లి అయిన తరువాత  పిల్లలు పుడితే ఇక మహిళలు తమ కెరీర్ ను కొనసాగించలేరేమో అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. మహిళల కెరీర్ వారి ఇష్టం.  వారు తమ కుటుంబాన్ని చూసుకుంటూ వారి కెరీర్ కొనసాగించుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు.  అనవసరంగా వారి కెరీర్ ఇంకెన్నాళ్లు ఉంటుంది అని ప్రశ్నించకూడదు. సమయం.. చాలామంది మహిళలు బయటకు ఎక్కడికి వెళ్లినా ఎప్పుడైనా ఆలస్యం అయితే అందరూ అడిగే ప్రశ్న ఇంత ఆలస్యం ఎందుకైంది అని. అదే తొందరగా వారు ఎక్కడికైనా హాజరైతే ఇంత త్వరగా ఇంటి నుండి వచ్చావేంటని.  ఇవి మహిళలను అసౌకర్యానికి గురిచేస్తాయి.  మహిళలు కుటుంబాన్ని,  తమ పనులను చేసుకోవడంలో ప్రాధాన్యతలు, టైం మేనేజ్మెంట్ దగ్గర చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి ఆలస్యం గురించి కానీ,  వారి తొందర గురించి కానీ అలా  అడగకూడదు. ఇది విమర్శ చేసినట్టు అనిపిస్తుంది. సోషల్ మీడియా.. సోషల్ మీడియా ఇప్పట్లోచాలా సహజం. అయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న మహిళలు  అనేకం.  చాలామంది అలాంటి మహిళల పట్ల ఎందుకు సోషల్ మీడియాలో  అంత యాక్టీవ్ ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గడపడం మహిళల వ్యక్తిగతం,  అది వారి అభిరుచి, ఆసక్తి ఆధారంగా ఉంటుంది.  దాని గురించి అందరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. డ్రస్సింగ్.. ప్రతి మహిళ తమ సౌకర్యం గురించి ఆలోచిస్తుంది.  కొందరు ప్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు.  ఏది ఏమైనా మహిళల డ్రెస్సింగ్ గురించి వారు ధరించే దుస్తుల గురించి ప్రశ్నించడం,  కామెంట్ చేయడం అస్సలు మంచిది కాదు. పైన పేర్కొన్న 7 విషయాలు మహిళల వ్యక్తిగతం,  కుటుంబానికి సంబంధించినవి.   వాటిని ప్రశ్నించడం వల్ల మహిళల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్టే. అంతేకాదు.. పై ప్రశ్నలు అడగడం వల్ల మహిళలు చాలా అసౌకర్యానికి ఫీలవుతారు. అలాగే వారి ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు.                                     *రూపశ్రీ.
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని అంటారంటే వీటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  అయితే అతి సర్వత్ర వర్జయేత్ అనే మాటకు తగ్గట్టు పల్లీలు అయినా సరే.. ఎక్కువగా తినడం చాలా చెడ్డదని ఆహార నిపుణులు అంటున్నారు. రుచిగా ఉంటాయి కదా అని పల్లీలను అతిగా తింటే.. ఆరోగ్యానికి మేలు చేయకపోగా చేటు చేస్తాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పల్లీలు అంటే తెగ ఇష్టపడేవారు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.  పల్లీలను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. బరువు.. పల్లీలు అతిగా తింటే బరువు కూడా అతిగా పెరుగుతారట.  పల్లీలలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి.  100గ్రాముల పల్లీలలో దాదాపు 567కేలరీలు ఉంటాయట.  ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటే కేలరీలు కూడా పెరిగి బరువు పెరగడం కూడా వేగంగా జరుగుతుందట. జీర్ణ సమస్యలు.. పల్లీలు వేడి కలిగించే గుణం కలిగి ఉంటాయి. వీటిలో ఫైటేట్ లు ఉంటాయి.  పల్లీలు ఎక్కువగా తింటే ఉబ్బరం,  గ్యాస్,  కడుపులో యాసిడ్ ఫీలింగ్,  గుండెల్లో మంట వంటివి పెరుగుతాయి. పోషకాలు.. వేరుశనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పోషకాల శోషణకు ఆటంకం కూడా కలుగుతుంది. ముఖ్యంగా వీటిలో పైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  దీన వల్ల శరీరంలో ఐరన్,  జింక్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎన్ని తినాలి.. ఆరోగ్య నిపుణులు,  ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తినడం మంచిది.  అంతకంటే ఎక్కువ తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు.  మానసికంగా బలంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆఫీసు ఒత్తిడులు,  జీవిత సమస్యలు, లక్ష్యాలు చేరుకోవడంలో పడే సంఘర్షణ.. ఇలా ఒకటేమిటి.. చాలా విషయాలు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.  కానీ కొన్ని సాధారణ అలవాట్లు మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా పనిచేస్తాయి.  ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. కృతజ్ఞత.. కృతజ్ఞత భావం మనిషిని చాలా స్వచ్చంగా ఉంచుతుంది.  ప్రతి వ్యక్తి మొదటగా గడిచే ప్రతి రోజు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి.  రోజు తన జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోవాలి.  ఇలా చేస్తే చాలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఇది మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాయామం.. శరీరంలో ఒత్తిడి హార్మోన్ తగ్గడానికి వ్యాయామం మంచి మార్గం.  ప్రతి రోజూ 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. శ్వాస వ్యాయామం.. శారీరక వ్యాయామమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండటానికి శ్వాస వ్యాయామాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.  ఒత్తిడి కూడా తగ్గుతుంది. శ్రద్ద.. ఏ పని మీద అయినా దృష్టి పెట్టడాన్నే మైండ్ ఫుల్ నెస్ అని అంటున్నారు.  ఇంటి పని చేసినా,  వ్యాయామం చేసినా, ఆహారం తీసుకున్నా, ఆఫీసు పని చేసినా.. ఇలా ప్రతి పని చేసినప్పుడు ఆ పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయాలి. ఇందుకోసం ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మెయింటైన్ స్కిల్స్ మెరుగవుతాయి. ప్రకృతి.. మనిషిలో ఒత్తిడిని తగ్గించే సూపర్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ప్రకృతి.  తాజా గాలిలో,  సూర్యరశ్మిలో సమయం గడపడం,  మొక్కలు,  చెట్లు,  పక్షులు,  జంతువుల సమక్షంలో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా దృఢంగా మారతారు. మనసు విప్పడం.. ఎలాంటి విషయాలు అయినా కొందరితోనే మనసు విప్పి మాట్లాడగలుగుతారు.  వారిలో స్నేహితులు,  బంధువులు,  ఆత్మీయులు ఇట్లా చాలా ఉంటారు. అయితే ఎవరి దగ్గర ఏదైనా చెప్పుకోగల చనువు ఉంటుందో వారితో ఓపెన్ గా మాట్లాడాలి. దీనివల్ల చాలా విషయాలలో మంచి సలహాలు దొరకడమే కాకుండా క్లిష్ట పరిస్థితులలో మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. బంధాలు.. స్నేహం అయినా, ప్రేమ అయినా,  వైవాహిక బంధం అయినా, కొలీగ్స్ తో పరిచయం అయినా.. వారితో ఉండే రిలేషన్ పదే పదే తెగిపోతూ ఉంటే అది మానసిక సమస్యలకు దారి తీస్తుంది.  అందుకే బంధాలను కాపాడుకోవాలి.  ఎక్కువకాలం బంధాలు నిలిచి ఉండేలా చూసుకోవాలి. ఎమోషనల్ గా బంధాలతో కనెక్ట్ అయి ఉండాలి. నచ్చిన పని.. మానసికంగా బాగుండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైనది నచ్చిన పని చేయడం. చాలా వరకు ఇతరుల సలహాలు,  ఇతరుల కమాండింగ్ మీద చాలా మంది పని చేస్తూ ఉంటారు. కానీ నచ్చిన పని చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఇది మానసికంగా బలంగా ఉంచుతుంది. ఆత్మ విమర్శ.. ప్రతి రోజూ పడుకునే ముందు ఉదయం నుండి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.  ముఖ్యంగా మంచి విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ మైండ్ అలవాటు అవుతుంది. పాజిటివ్ మైండ్ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని కూడా బలంగా ఉంచుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.   కేవలం తీపి పదార్థాలు,  స్వీట్లు, పంచదార వంటివి తినడమే డయాబెటిస్ కు కారణం అనుకుంటే పొరపడినట్టే.. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద డయాబెటిస్ ముడిపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు. రోజు వారి తీసుకునే కొన్ని ఆహారాలు.. ఇవి ఏం చేస్తాయి లే అనుకునే పదార్థాలు టైప్-2 డయాబెటిస్ కు కారణం అవుతాయని అంటున్నారు వైద్యులు.  ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ ఈజీగా వస్తుందట. డయాబెటిస్ కు కారణమయ్యే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. డీప్ ఫ్రైడ్ స్నాక్స్.. సమోసాలు, పకోడాలు,  చిప్స్  ఇవన్నీ చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చాలా ఇష్టమైన స్నాక్స్.  కానీ ఈ ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు క్రమంగా శరీరంలో పేరుకుపోతుంది.  బరువు పెరగడానికి దారి తీస్తుంది. బరువు పెరగడం  ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగించే నూనెను  పదే పదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత పెంచుతుంది. మార్కెట్ ఫుడ్స్.. మార్కెట్లో అమ్మే గ్రానోలాతో పాటు  అనేక బ్రేకఫాస్ట్  తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవని అనుకుంటారు.   కానీ వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.  గ్రానోలా బార్‌లు, ఓట్ బార్‌లు,  రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరలు ఉంటాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి. ప్రాసెస్డ్ మీట్.. సాసేజ్, బేకన్,  సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం,  నైట్రేట్లు అధికంగా ఉంటాయి.  ఇవి గుండెకు హాని చేయడమే కాకుండా   డయాబెటిస్‌కు నేరుగా కారణం అవుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు వాపును పెంచుతాయి,  జీవక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తాయి. డ్రింక్స్.. శీతల పానీయాలు,  ప్యాక్ చేసిన సోడాలలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సోడా డ్రింక్ లో  ఉండే చక్కెర పరిమాణం కొన్ని  రోజులు తీసుకునే నేచురల్  చక్కెర కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పానీయాలు వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి.  క్లోమంపై  ఒత్తిడిని ఎక్కువగా  కలిగిస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తీసుకున్న ప్రతి  సారి  శరీరం అదనపు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రిపైండ్ ఫ్లోర్,  బ్రెడ్.. తెల్ల బ్రెడ్, బన్స్, కుకీలు,  నాన్ వంటి ఆహారాలు మైదాతో తయారు చేస్తారు. ఈ ఆహారాలలో గ్లూకోజ్ చాలా త్వరగా విచ్చిన్నమవుతుంది. ఈ రిఫైండ్ ఫ్లోర్ లో  ఫైబర్ ఉండదు.  దీని వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల శరీరం రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఈ అలవాటు క్రమంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ రైస్.. తెల్ల బియ్యం భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే.  ఇది తిన్న తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది నేరుగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. రోజూ పెద్ద మొత్తంలో తెల్ల బియ్యం తినడం వల్ల బరువు పెరగడం,  రక్తంలో చక్కెర నియంత్రణ బలహీనపడటం జరిగి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చాలా పాలిష్ పట్టిన బియ్యంతో వండే అన్నం ఎక్కువ తినడం మానేయాలి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...