LATEST NEWS
దక్షిణ భారత రాజకీయాల్లో కీలకమైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో  వివిధ జాతీయ,  ప్రాంతీయ  సంస్థలు బుధవారం (ఏప్రిల్ 29) వెల్లడించిన  ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి.  సుదీర్ఘ విరామం తర్వాత కేరళలో అధికార మార్పిడి జరగబోతోందనీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్  సర్కార్ గద్దె దిగడం ఖాయమని  దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్సూ కూడా అంచనా వేశాయి. కేరళలో  కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాయి.  మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో  ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71.  బుధవారం (ఏప్రిల్ 29)   వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే  అధికారమని అంచనా వేశాయి. పినరయి విజయన్ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు లేవని పేర్కొన్నాయి.  ఇందుకు  యాంటీ ఇంకంబెన్సీ,  కారణమని పేర్కొన్నాయి. దానికి తోడు..  కాంగ్రెస్ దూకుడు కూడా పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ వెనుకబాటుకు కారణమని విశ్లేషించాయి.  కాగా.. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణకు చెందిన మంత్రుల బృందంతో కలిసి ఆయన కేరళలో  ఇంచుమించు  పది రోజుల పాటు విస్తృతంగా పర్యటించి..  యూడీఎఫ్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు.   ఈ ప్రచార సమయంలో కేరళ సీఎం విజయన్‌కు, రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన మాటల యుద్ధం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి వ్యూహాలు,  కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమైనట్లు సర్వేల ఫలితాలు సూచిస్తున్నాయి.  యాక్సిస్ మై ఇండియా సర్వే కేరళలో యూడీఎఫ్‌కు 78 నుంచి 90 స్థానాలు దక్కుతాయని పేర్కొనగా,  పోల్ ల్యాబ్ సర్వే  ఏకంగా 90 నుంచి 92 సీట్లు వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్  అయితే కాంగ్రెస్ కూటమి 72 నుంచి 80 , పీపుల్స్ పల్స్ 75నుంచి 85 స్థానాలను యూడీఎఫ్ సాధిస్తుందని అంచనా వేశాయి.  ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే కూడా కాంగ్రెస్ కూటమికి 76 నుంచి 81 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.  ఇక సర్వే సంస్థల అంచనాల మేరకు అధికార ఎల్‌డీఎఫ్ కూటమి  45 - 66 స్థానాలకే  మధ్యే పరిమితమయ్యే అవకాశం ఉంది  బీజేపీ  కేరళలో తన ఉనికిని చాటుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితాల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని సర్వేలు పేర్కొన్నాయి. చాలా వరకూ సర్వే సంస్థలు రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరిచే అవకాశం లేదని అంచనా వేశాయి.   ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, కేరళలో ఐదేళ్లకోసారి అధికారం మారే సాంప్రదాయం మళ్లీ పునరావృతమైనట్లు అవుతుంది. గత ఎన్నికల్లో విజయన్ ఈ సంప్రదాయాన్ని చెరిపివేస్తూ వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకున్నారు. కానీ ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.  పెరిగిన ధరలు, నిరుద్యోగం మరియు పాలనపై వ్యతిరేకత వంటి అంశాలు విజయన్ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయని తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ శ్రేణులు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పండుగ చేసుకుంటున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తర్వాత కేరళలో కూడా పట్టు సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో పార్టీకి పునర్వైభవం వస్తుందని హస్తం నేతలు అంటున్నారు.  
ఏప్రిల్ 29న‌ విడుదలైన తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ప్రదీప్ గుప్తాకి చెందిన‌ యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు అందరినీ విశ్మయ పరిచాయి.  తమిళనాట  విజయ్  టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.  అంటే తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధిస్తుందన్నది ఆయన అంచనా అన్నమాట.   ఇక డీఎంకే కూటమికి 92 నుంచి110 సీట్లు, అన్నాడీఎంకేకి 22 - 32 సీట్లు వ‌స్తాయ‌ని యాక్సిస్ మై ఇండియా సర్వే పేర్కొంది.  ప్ర‌దీప్ గుప్తా  విశ్లేషణ ప్రకారం.. ముఖ్యంగా 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న యువత తమిళనాట సుమారు 42శాతంగా ఉన్నారు. వీరంతా గంప‌గుత్త‌గా విజయ్ వైపు మొగ్గు చూపారు. అందుకే ఆయన టీవీకే విజయం సాధిస్తుందనీ, ఆ విజయం 1983లో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనంతో  పోల్చదగినదిగా ఉంటుందనీ పేర్కొన్నారు.  అదలా ఉంటే.. మిగిలిన ప్రముఖ సర్వేలన్నీ..  డీఎంకే  మళ్లీ అధికారం చేపడుతుందని చెబుతున్నాయి. పీపుల్స్ ప‌ల్స్ సర్వే అయితే డీఎంకే కూటమికి 125 నుంచి 145 సీట్లు వస్తాయనీ, విజయ్ టీవీకే   18 నుంచి 24 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందనీ పేర్కొంది. అదే విధంగా  మాట్రిజ్ సర్వే టీవీకే పార్టీకి  పది నుంచి పన్నెండ్లు సీట్లు రావడమే గగనమని పేర్కొంది.ఇక పోతే..  పీమార్క్ సర్వీ విజయ్ పార్టీ 16 నుంచి 26 సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.   అంటే..  ఒకవైపు దాదాపు అన్ని సర్వేలూ..  స్టాలిన్ హవా కొనసాగుతుందని చెబుతుంటే, ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా మాత్రం  విజయ్  విజయం ఖాయమని పేర్కొంది.  అయితే.. ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. యాక్సిస్ మై ఇండియా  గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని అంచనా వేసింది.  అది తప్పవడంతో ప్రదీప్ గుప్తా టీవీ లైవ్ డిబేట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన అంచనాలు తప్పినా.. అంతకు ముందు.. అంటే  గతంలో  దాదాపు 90శాతం పైగా.. ఆయన అంచనాలు నిజమయ్యాయి. అందుకే ఈసారి ఆయన  విజయ్ పై వేసిన విజిల్ నిజమవుతుందా లేదా? అన్న ఉత్కంఠ వ్యక్తమౌతోంది.  
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్  మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు  సెలెక్టివ్ గా ఉంటున్నాయని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్  కొన్ని అంశాలపై మాత్రమే  గళం ఎత్తుతున్నారన్న  ప్రకాష్ రాజ్ . ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. కేవలం మతపరమైన భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపైనే స్పందిస్తూ, ఇతర దేశవ్యాప్త సమస్యలను పవన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.  ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్   స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.  ముఖ్యంగా మణిపూర్‌  హింసాకాండ, అక్కడ మహిళలపై జరిగిన దాడుల వంటి సున్నితమైన అంశాల గురించి మౌనానికి కారణమేంటన్నారు.  కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారనేది ప్రకాష్ రాజ్ ప్రధాన వాదన. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్..  అదే ధర్మంలో భాగంగా ఇతర అన్యాయాలు జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇలా సెలెక్టివ్ అంశాలనే ఎంచుకుని విమర్శలు చేయడం వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదం కేవలం లడ్డూ ప్రసాదానికి మాత్రమే పరిమితం కాకుండా, రాజకీయ నాయకుల నైతిక బాధ్యతపై చర్చకు దారితీసింది. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అని, ఆయన తన విమర్శల్లో నిష్పక్షపాతంగా ఉండాలని ప్రకాష్ రాజ్ సూచించారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమి నాయకులు ప్రకాష్ రాజ్ విమర్శలను తిప్పి కొడుతున్నారు. మతపరమైన సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశం కాబట్టే పవన్ గట్టిగా స్పందిస్తున్నారంటున్నారు. అయితే..  ప్రకాష్ రాజ్ మాత్రం తన పంథా మార్చుకోకుండా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సెలెక్టివ్ పాలిటిక్స్ కు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.ఇక ప్రకాశ్ రాజ్ విమర్శలపై  పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ ఏపీ రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.  
ALSO ON TELUGUONE N E W S
తమిళ స్టార్ ధనుష్ (Dhanush) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కర' (Kara) నేడు (ఏప్రిల్ 30) థియేటర్లలోకి వచ్చింది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ధనుష్ నటన నెక్స్ట్ లెవెల్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. (Kara Twitter Review) ట్విట్టర్ రివ్యూ: ధనుష్ విశ్వరూపం! సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం, 'కర' ధనుష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోనుంది. 1991 గల్ఫ్ వార్ నేపథ్యంలో సాగే ఈ కథలో ధనుష్ నటన అత్యద్భుతంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి.  సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే బ్యాంక్ రాబరీ సీక్వెన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయని టాక్. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సినిమాలో సెంటిమెంట్ సీన్లు కూడా బాగా పండాయట. సాంకేతిక నిపుణుల మ్యాజిక్ దర్శకుడు విఘ్నేష్ రాజా స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్‌గా మలిచారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను హ్యాండిల్ చేసిన తీరు అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇక జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన ఇచ్చిన స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోందని టాక్.  విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. కొన్ని గ్రామీణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు నెమ్మదిగా సాగినప్పటికీ, ధనుష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ లోటును భర్తీ చేసిందని అంటున్నారు. మొత్తానికి 'కర' సినిమాతో ధనుష్ బాక్సాఫీస్ వద్ద మరో హిట్ కొట్టినట్లే కనిపిస్తోంది.   
  'బేబీ' మూవీతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న అచ్చ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya).మొదటి సినిమాతోనే అద్భుతమైన పెర్ఫార్మ్  కనబరిచి, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత చేసిన చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులు బేబీ ఇమేజ్ తోనే  వైష్ణవిని చూస్తున్నారా అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో అప్ కమింగ్ మూవీ 'ఎపిక్' పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఆనంద్ దేవరకొండ(Anandh deverakonda)హీరో కాగా 90 's ఫేమ్ ఆదిత్య హాసన్(Aditya haasan)దర్శకుడు. రీసెంట్ గా ఎపిక్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైష్ణవి ఒక ప్రశ్న ఎదురు కావడంతో తడబాటుకి గురైంది. ఆ డీటెయిల్స్ చూద్దాం.  ఒక విలేకరి వైష్ణవితో బేబీ తర్వాత ఇమేజ్ చేంజ్ ఓవర్ అవసరమైంది కదా.. అది ఎపిక్ అనుకోవచ్చా అని అడిగాడు. దీంతో ఏం చెప్పాలో తెలియక వైష్ణవి ఇబ్బంది పడటంతో పాటు సమాధానం చెప్పలేకపోయింది. వెంటనే ఆదిత్య హాసన్ స్పందిస్తు ఎవరి కోణంలో మార్పని అడిగాడు. ఆనంద్ కూడా మాట్లాడుతూ కెరీర్ అంతా ఒకే ఇమేజ్ ని కొనసాగించలేం. మూవీలోని క్యారక్టర్ ని బట్టి కూడా ఉంటుంది. ఎపిక్ లో చాలా బలమైన ఫిమేల్ రోల్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.    Also read: Pooja hegde: పెళ్లి పీటలు ఎక్కబోతున్న పూజాహెగ్డే!..పెళ్లి కొడుకు ఈ హీరోనే!    
- రూట్ మార్చిన బాలయ్య - ఊహించని డైరెక్టర్ తో సినిమా - క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో డిఫరెంట్ మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని ఊహించని కాంబినేషన్లు తెరపైకి వస్తుంటాయి. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. క్లాస్ సినిమాల స్పెషలిస్ట్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) & మాస్ సినిమాల పవర్ హౌస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, ఈ కాంబో సెట్ అయితే టాలీవుడ్‌లో ఇది ఒక మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ వండర్ అవుతుందనడంలో సందేహం లేదు. క్లాస్ వర్సెస్ మాస్: ఒక కొత్త ప్రయోగం శేఖర్ కమ్ముల అనగానే మనకు 'ఆనంద్', 'గోదావరి', 'ఫిదా' వంటి సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సినిమాలు గుర్తొస్తాయి. ఆయన కథల్లో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. మరోవైపు బాలయ్య సినిమా అంటే హై-వోల్టేజ్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, మాస్ జాతర ఉండాల్సిందే.  అయితే శేఖర్ కమ్ముల ఇప్పుడు బాలయ్య కోసం ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. బాలకృష్ణకు కూడా కొత్త తరహా కథలు వినడం, యువ దర్శకులకు అవకాశాలివ్వడం అంటే ఇష్టం. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా, తన మార్క్ నేటివిటీతో కూడిన ఒక బరువైన పాత్రలో బాలయ్యను చూపించే ప్లాన్ లో శేఖర్ కమ్ముల ఉన్నారట. ఇది ఒక పొలిటికల్ డ్రామా అయ్యే అవకాశముంది అంటున్నారు. శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే బలమైన ఎమోషన్స్ కు బాలయ్య నటన తోడైతే, అది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో డౌట్ లేదు. అభిమానుల్లో ఆసక్తి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గోపీచంద్  మలినేని దర్శకత్వంలో 'NBK111' చేస్తున్నారు. అలాగే కొరటాల శివతో ఓ సినిమా చేసే అవకాశముంది. ఇక ఇప్పుడు అనూహ్యంగా శేఖర్ కమ్ముల పేరు తెరపైకి వచ్చింది.  శేఖర్ కమ్ముల వంటి దర్శకుడితో ఆయన జతకడితే, బాలయ్యలోని మరో యాక్టింగ్ డైమెన్షన్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇద్దరి ఆలోచనా ధోరణులు వేరైనా, సినిమా పట్ల ఇద్దరికీ ఉన్న ప్యాషన్ ఈ క్రేజీ కాంబోను సాకారం చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. శేఖర్ కమ్ముల విజన్ లో బాలయ్య ఎలా ఉంటారు? ఆ గంభీరమైన గొంతుతో కమ్ముల రాసే సహజమైన డైలాగ్స్ ఎలా పండుతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తే మాత్రం అది బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం. క్లాస్ డైరెక్టర్ చేతిలో మాస్ హీరో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాల్సిందే.  
  పూజాహెగ్డే పెళ్లి పీటలు ఎక్కబోతుందా! ఆ హీరోనే వరుడా! వైరల్ గా మారిన పిక్   సెల్యులాయిడ్ పై బుట్టబొమ్మ 'పూజాహెగ్డే'(Pooja Hegde)జోరు ఇప్పుడు తగ్గిందనే చెప్పాలి. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి టచ్ లోనే ఉంటుంది. రీసెంట్ గా అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజా పర్సనల్ పిక్ ఇప్పుడు నయా జోష్ ని తెప్పిస్తుంది. జోష్ ని తెప్పించడమే కాదు బుట్టబొమ్మ బాయ్ ఫ్రెండ్ కన్ఫార్మ్ గా  అతనే అని త్వరలోనే ఆ ఇద్దరు పెళ్ళి పీటలు ఎక్కడం ఖాయమని కూడా అంటున్నారు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రీసెంట్ గా ముంబై(Mumbai)లోని ఒక రెస్టారంట్ నుంచి బయటకి వచ్చిన పూజా ఒక కారులో వెళ్ళింది. కారులో తనతో పాటు రోహన్ మెహ్రా(Rohan Mehra)కూడా ఉన్నాడు. రోహన్  మెహ్రా ఎవరో కాదు బాలీవుడ్ లెజెండరీ నటుడు దివంగత వినోద్ మెహ్రా కుమారుడు. తను కూడా నటుడే. నిజానికి ఈ ఇద్దరు సీరియస్ గానే  రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే రూమర్స్ ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో కూడా ఆ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, ఒకరి గురించి ఒకరు చేసుకొనే సోషల్ మీడియా పోస్టులు ఆ రూమర్లకి మరింత బలాన్ని ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఒకే కారులో వెళ్లడంతో రూమర్స్ కాస్తా వీక్ అయ్యే పరిస్థితి.  సోషల్ మీడియాలో సదరు పిక్ వైరల్ గా మారడంతో నెటిజన్స్ బుట్టబొమ్మ త్వరలోనే రోహన్ మెహ్రా తో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని అంటున్నారు. ఫ్రెండ్స్ ఒకే కారులో వెళ్లకుందనే రూల్ ఏమైనా ఉందా అనే కామెంట్స్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఏది నిజమో కాలమే ఆన్సర్ ఇస్తుంది.   Also read: VIjay: ఓటిటిలోకి విజయ్ పొలిటికల్ సెటైర్ మూవీ వచ్చేసింది భయ్యా.. ఫ్యాన్స్ షాక్  పూజా హెగ్డే అప్ కమింగ్ సినీ కెరీర్ కి వస్తే వరుణ్ ధావన్‌తో చేసిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'రిలీజ్ కి సిద్ధంగా ఉంది. జూన్ 5న రిలీజ్ డేట్. విజయ్ 'జన నాయగన్' లో కూడా చేసిన విషయం తెలిసిందే.  దుల్కర్‌ సల్మాన్ తో కూడా ఒక భారీ ప్రాజెక్ట్ లో కన్ఫర్మ్ అయ్యే  ఛాన్సు ఉంది.   
ఇటీవల ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మూవీ 'గాయపడ్డ సింహం' (Gaayapadda Simham). మే 1న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravarthy) పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా జేడీ చక్రవర్తి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో సీరియస్ విలన్‌గా ఉండి, సెకండ్ హాఫ్‌లో ఫుల్ లెంగ్త్ కామెడీతో అలరిస్తుందని సమాచారం. అమెరికా వీసా కోసం ప్రయత్నించే యువకుల కథాంశంతో, సెటైరికల్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించారు. శ్రీవిష్ణు ‘సర్‌ప్రైజ్‌ ప్యాకేజీ’ ఈ చిత్రంలో అసలైన ఆకర్షణ శ్రీవిష్ణు (Sree Vishnu). ఆయన ఇందులో ఒక కీలకమైన ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అయితే కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, సినిమా క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ఎంట్రీ అద్భుతంగా ఉంటుందని టాక్.  క్లైమాక్స్ ట్విస్ట్: 'గాయపడ్డ సింహం' సినిమా క్లైమాక్స్ లోనే సీక్వెల్ కి సంబంధించిన లీడ్ ఇస్తారట. క్లైమాక్స్ లో టైటిల్ కార్డు వేసి, సీక్వెల్ గా 'పోరాట సింహం' చిత్రాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో ప్రత్యేక పాత్రలో కనిపించే శ్రీవిష్ణు, సెకండ్ పార్ట్ అయిన 'పోరాట సింహం'లో పూర్తి స్థాయి హీరోగా నటించబోతున్నారని సమాచారం. 'గాయపడ్డ సింహం'లో స్పూఫ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తాయని అంటున్నారు. పలు భారీ సినిమాల రిఫరెన్స్ లతో సినీ ప్రియులకు పండగలా ఈ సినిమా ఉంటుందట. ఇక ఆ స్పూఫ్ ఎపిసోడ్స్ లో శ్రీవిష్ణు పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్, జేడీ చక్రవర్తి ఇంటెన్సిటీ, శ్రీవిష్ణు సర్ప్రైజ్ ఎంట్రీ.. ఇవన్నీ కలిపి 'గాయపడ్డ సింహం' సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. క్లైమాక్స్ లో వచ్చే 'పోరాట సింహం' అనౌన్స్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ వేసవిలో మే 1న థియేటర్లలో ఈ 'సింహం' ఏ రేంజ్ లో గర్జిస్తుందో చూడాలి.    
తెలుగు సినీ పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao). తొంభై ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు రాబోతున్నారు. నేటి తరం విజువల్ వండర్ 'కల్కి 2898 AD' దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. సంగీత ప్రధానమైన కథాంశం సింగీతం శ్రీనివాసరావు కెరీర్ లో 61వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ కు ‘సింగ్-గీతం’ (Sing-Geetham) అనే వెరైటీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్‌లో ఉన్నట్లే, ఇది పూర్తిగా సంగీత నేపథ్యంతో సాగే కథ అని తెలుస్తోంది. పైగా 'సింగీతం' పేరు కలిసొచ్చేలా ఈ టైటిల్ ను మూవీ టీమ్ ఆలోచించినట్లు సమాచారం. ఒకప్పుడు 'శంకరాభరణం', 'సాగర సంగమం' వంటి క్లాసిక్ సినిమాలు ప్రేక్షకులను ఎలా అలరించాయో, అదే స్థాయిలో ఈ చిత్రం ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్.  రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో  దాదాపు 12 పాటలు ఉంటాయని సమాచారం. ప్రస్తుత కాలంలో ఒక సినిమాలో ఇన్ని పాటలు ఉండటం అంటే అది నిజంగా సాహసమే. మెలోడీలు అందించడంలోనూ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలోనూ దేవిశ్రీకి ప్రత్యేక శైలి ఉంది. సింగీతం విజన్ కు దేవిశ్రీ సంగీతం తోడైతే, అది వెండితెరపై ఒక దృశ్య కావ్యంలా మారుతుందనడంలో సందేహం లేదు. నాగ్ అశ్విన్ స్వయంగా సింగీతంకి పెద్ద అభిమాని కావడంతో, ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు గారు గతంలో 'ఆదిత్య 369', 'పుష్పక విమానం' వంటి ఎన్నో అద్భుతాలను సృష్టించారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ వంటి యంగ్ అండ్ టాలెంటెడ్ మేకర్ తో కలిసి ఆయన చేస్తున్న ఈ 'సింగ్-గీతం' మ్యూజికల్ జర్నీ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందేమో చూడాలి.  
      అందరు అందరికి నచ్చాల్సిన అవసరం లేదు. ఈ వాస్తవం సృష్టి ఆరంభం నుంచే ఉంది. ఆ విషయంలో ఇళయ దళపతి విజయ్(VIjay)కి మినహాయింపు ఏమి ఉండదు. తన పొలిటికల్ పార్టీ  'టివికే' తో అధికారం కోసం విజయ్ ప్రచారాన్ని చేస్తున్న సమయంలో ఏకంగా విజయ్ ని టార్గెట్ చేస్తూ ఒక సినిమాని నిర్మించారు. ఆ సినిమానే 'TN 2026’. థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ మీ ఇంట్లోకి రావడానికి సిద్దమయ్యింది. ఆతిధ్యం ఇస్తారో లేక పట్టించుకోరో మీ ఇష్టం. ఆ డీటెయిల్స్ చూద్దాం.   TN 2026 ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా లాంటి పాపులర్ ఓటిటి లలో అందుబాటులో ఉంది.  ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే తమిళనాట పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం, ఆయన పార్టీ (TVK) లక్ష్యంగా ఈ సినిమా రూపొందిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టైటిల్ ‘TN 2026’ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సంవత్సరం కావడం, హీరో గడ్డం లుక్ విజయ్‌ని పోలి ఉండటంతో ఆయన అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అసలు విడుదలకి  ముందే టీజర్‌తో వివాదాలను, ఆసక్తిని సమపాళ్లల్లో ఉంచింది.      అయితే, చిత్ర యూనిట్ మాత్రం ఇది ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించినది కాదని, రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతి నటుడి ప్రయాణాన్ని సెటైరికల్‌గా చూపిస్తుందని స్పష్టం చేసింది. విజయ్ ని పోలి ఉండే క్యారక్టర్ లో నటరాజ్ సుబ్రహ్మణ్యం కనిపించగా తంబి రామయ్య, ఎం.ఎస్. భాస్కర్, ఇళవరసు వంటి సీనియర్ నటులు కీలక మైన క్యారెక్టర్స్ ని పోషించారు. తంబి రామయ్యనే కథని అందించగా ఆయన కుమారుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాకుండా, నేటి రాజకీయ పరిస్థితులపై పదునైన విమర్శలు చేసింది. డార్బుక శివ అందించిన సంగీతం, నట్టి నటన సినిమాకు బలంగా నిలిచాయి. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి, సెటైరికల్ సినిమాలను ఇష్టపడేవారికి  ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. Also read: Pawan kalyan: రంగంలోకి దిగిన ప్రకాష్ రాజ్.. పవన్ పై ఘాటైన విమర్శలు  ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో, ‘TN 2026’ ఓటీటీ రిలీజ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ఉత్తరాది యువకుడు చెన్నైకి వచ్చి, స్టార్ హీరోగా ఎదిగి, చివరకు రాజకీయ నాయకుడిగా మారే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, వ్యవస్థలోని లోపాలను హాస్యంతో కలిపి ఈ సినిమాలో చూపించారు.      
  సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్(Prakash raj)మధ్య వచ్చే సీన్స్ చూస్తే వచ్చే మజానే వేరు. రీసెంట్ గా ఆ ఇద్దరు ఓజిలో తండ్రి కొడుకులుగా చేసి సినిమా విజయాన్ని పెంచారు. కానీ రాజకీయ పరంగా ఆ ఇద్దరు భిన్న ధ్రువాలు. ఢీ  అంటే ఢీ అనే రీతిలో వెళ్తుండటం ఎప్పటికప్పుడు పాలిటిక్స్ కే స్పెషల్. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పై రీసెంట్ గా ప్రకాష్ రాజ్  మరోసారి  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవేంటో చూద్దాం. ప్రకాష్ రాజ్ మాట్లాడుతు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు  సెలెక్టివ్ గా ఉంటున్నాయి. కేవలం కొన్ని అంశాలపై మాత్రమే  గళం ఎత్తుతున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కేవలం మతపరమైన భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపైనే స్పందిస్తూ, ఇతర దేశవ్యాప్త సమస్యలను  పట్టించుకోవడం లేదు.  తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు.  ముఖ్యంగా మణిపూర్‌  హింసాకాండ, అక్కడ మహిళలపై జరిగిన దాడుల వంటి సున్నితమైన అంశాల గురించి మౌనానికి కారణమేంటి. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం మాత్రమే  విమర్శలు చేస్తున్నారు.  సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ అదే ధర్మంలో భాగంగా ఇతర అన్యాయాలు జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదు. ఇలా సెలెక్టివ్ అంశాలనే ఎంచుకుని విమర్శలు చేయడం వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పుకొచ్చాడు. Also read: Bellamkonda Sai Sreenivas: పెళ్లి పీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఉప ముఖ్యమంత్రి హాజరు ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో వైపు పవన్  అభిమానులు, కూటమి నాయకులు ప్రకాష్ రాజ్ విమర్శలపై స్పందిస్తూ మతపరమైన సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశం కాబట్టే పవన్ గట్టిగా స్పందిస్తున్నారు.ప్రకాష్ రాజ్ నే తన  పంథా మార్చుకొని సెలెక్టివ్ పాలిటిక్స్ కు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రకాశ్ రాజ్ విమర్శలపై  పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది.  
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో 'ఫ్రోజెన్ షోల్డర్' (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో 'అడెసివ్ క్యాప్సులైటిస్' అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి, కనీసం చేయి పైకి ఎత్తడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడి దైనందిన జీవితం స్తంభించిపోతుంది. దీనిని కేవలం సాధారణ నొప్పి అని సరిపెట్టుకొని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు కదలికలు మరింత కష్టతరంగా మారుతాయి. ఆధునిక వైద్యంలోని పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుండగా, ఆయుర్వేదం ఈ వ్యాధిని మూలాల నుండి నయం చేసే అద్భుతమైన మార్గాలను చూపుతోంది. ఈ క్రమంలో ఫ్రోజెన్ షోల్డర్ లక్షణాలు, కారణాలు మరియు దీనిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏమిటి? మన భుజంలోని కీలు చుట్టూ ఉండే కణజాలం (Capsule) వాపునకు గురై, మందంగా మారడం వల్ల భుజం కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ప్రధాన కారణాలు: మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  గాయాలు: భుజానికి తగిలిన పాత గాయాలు లేదా శస్త్రచికిత్సల వల్ల.  థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా భుజం కండరాలు దెబ్బతినవచ్చు.  కదలిక లేకపోవడం: ఎక్కువ కాలం చేతికి పని చెప్పకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఆయుర్వేద చికిత్స - సహజ సిద్ధమైన పరిష్కారం: ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'వాత దోషం' పెరగడం వల్ల కీళ్లలో ద్రవాలు తగ్గి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో ఫ్రోజెన్ షోల్డర్‌ను 'అవబాహుక' అని అంటారు. దీనికి అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన చికిత్సలు: అభ్యంగనం (Abhyangam): వేడి చేసిన ఆయుర్వేద తైలాలతో (మహానారాయణ తైలం వంటివి) మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.   స్వేదనం (Swedanam): మూలికల ఆవిరి పట్టడం ద్వారా బిగుసుకుపోయిన కండరాలు వదులవుతాయి.   గ్రీవ వస్తి / పీచు: నొప్పి ఉన్న భాగంలో ప్రత్యేకమైన నూనెను నిల్వ ఉంచే ప్రక్రియ.   పౌష్టిక ఆహారం: వాతాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరియు శొంఠి, గుగ్గులు వంటి మూలికలను వాడటం. ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేద చికిత్సలతో సులభంగా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చేతి కదలికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఆయుర్వేద జీవనశైలితో మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!