LATEST NEWS
  బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియమించబోయే కమిటీలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు… తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం పాటించారని విమర్శించారు. “వాళ్లు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా?” అని ప్రశ్నించారు.“ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా… క్షమాపణ చెప్పించేవాళ్లం” అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం పౌరుషం లేని వ్యవహారమని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణను వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టామని… ఇప్పుడు మాత్రం భూముల కబ్జాలు, కూల్చివేతల్లో నెంబర్ వన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని… రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తే జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేశారు కేసీఆర్.  
తెలంగాణ రాజకీయ యవనికపై  భారత రాష్ట్ర సమితి  అధినేత కే. చంద్రశేఖరరావు తనయ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  ఎంట్రీ సంచలనాలకు వేదికైంది. పార్టీ ప్రకటన సందర్భంగా తన కన్నతండ్రిపై ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలో ఎదిగిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు  తండ్రి బాటను వీడి సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం  చర్చనీయాంశమైంది.  తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో సరికొత్త పార్టీని ప్రకటించిన ఆమె, గతంలో తండ్రి స్థాపించిన పార్టీ పేరులోని అక్షరాలనే మళ్ళీ తెరపైకి తీసుకురావడం ఆసక్తిరేకెత్తిస్తోంది. అన్నిటికీ మించి తన తండ్రిని మరమనిషి, గుంటనక్కల చేతిలో బంది అంటూ ఓ రేంజ్ లో విమర్శించడంతో అంతా దీనిపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందా అని ఇసక్తిగా ఎదురు చూశారు. బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.   ముఖ్యంగా కేసీఆర్ మౌనం వ్యూహమా? భయమా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ హాట్ గా సాగుతోంది. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కవిత వ్యాఖ్యల వెనుక పటిష్టమైన, పకడ్బందీ వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.  అయితే కేసీఆర్ మౌనమే ఇప్పుడు అందరికి అర్ధం కాకుండా పోయింది.  తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలపైనే కాదు.. ఆమెను  నుండి కవితను బహిష్కరించిన నాటి నుండి ఇప్పటి  వరకూ కేసీఆర్   ఏ సందర్భంలోనూ తన కుమార్తె గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు.  కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కవిత చేసిన అవినీతి ఆరోపణల నుంచి తనను మరమనిషిగా అభివర్ణించడం వరకూ కవిత ఎంత పరుషంగా మాట్లాడినా కేసీఆర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు.  దీంతో కేసీఆర్ మౌనం వ్యూహాత్మక, కన్నబిడ్డ అన్న మమకారమా? అన్న చర్చ జరుగుతోంది.   కేసీఆర్ మౌనం ఇలాగే కొనసాగితే.. రానున్న రోజులలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కవిత భారీగా చీల్చడం ఖాయమన్న భావన పార్టీ వర్గాలలోనే వ్యక్తమౌతోంది.  
  తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి. ఇక, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.  విజయ్‌ పాపులారిటీ, అనూహ్యంగా పెరిగిన పోలింగ్‌, ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం వంటి కారణాలతో.. టీవీకే ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇక, విజయ్ తన పార్టీ గెలుపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారని.. ఆయన ఏకంగా మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే జాబితాను సైతం ఆల్రెడీ సిద్ధం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.  ఇంత‌కీ ఈ జాబితాలో ఎవ‌రి పేర్లు ఉన్నాయి? అని చూస్తే.. బుస్సీ ఆనంద్. ఈయ‌న‌ టీవీకే జనరల్ సెక్రటరీ. ఈయన విజయ్‌కు అత్యంత సన్నిహితుడు, అంతేనా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి. ఈయనకు అత్యంత కీలకమైన శాఖ- బహుశా హోం లేదా మున్సిపల్ శాఖ.. దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఆదవ్ అర్జున. ఈయన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందారు. ఈయనకు ఆర్థిక లేదా ఐటీ శాఖల బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది.కె.ఎ. సెంగోట్టయన్. గతంలో ఏఐఏడీఎంకే లో సీనియర్ మంత్రిగా పనిచేసిన ఈయన, విజయ్ పార్టీలో చేరడంతో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక శాఖ ఇచ్చే అవకాశం ఉంది. వేణుగోపాల్, మాజీ ఎంపీ. ఈయనకు కూడా సీనియారిటీ కోటాలో చోటు దక్కవచ్చని సమాచారం. కె.జి. అరుణ్‌రాజ్. పార్టీ సిద్ధాంతకర్త, ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది.మహిళా కోటా విష‌యానికి వ‌స్తే.. విజయ్ తన మంత్రివర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు, ఇందులో భాగంగా విజయలక్ష్మి వంటి మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కేవలం అనుభవం ఉన్నవారినే కాకుండా, చదువుకున్న యువతను కూడా తన కేబినెట్‌లోకి తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పేర్లు కేవలం రాజకీయ విశ్లేషకులు, పార్టీ వర్గాల నుంచి అందుతున్న లీకుల ఆధారంగానే ప్రచారంలో ఉన్నాయి. మే 4వ తేదీన వెలువడే ఫలితాల తర్వాతే ఈ జాబితాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తొంద‌ర ప‌డి ముందే కూసిన కోయిల‌లు త‌ర్వాత బొక్క బోర్లా ప‌డ్డం  కూడా ఉంది. గ‌త ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ త‌న పార్టీ వ‌ర్గాల వారిని ఒక హైప్ లో ఉంచ‌డానికిగానూ.. ప్ర‌మాణ స్వీకార వేదిక‌, హోట‌ళ్ల బుకింగ్ వంటి ఎన్నో ముంద‌స్తు ఏర్పాట్లు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అది కాస్తా తుస్సు మ‌న‌డంతో వైసీపీ కార్య వ‌ర్గ‌మంతా  డీలా ప‌డిపోయింది.  అన్న‌ట్టు ఎన్డీయే కూట‌మి చంద్ర‌బాబును త‌మ తెలుగు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చూపితే, విజ‌య్ తాను జ‌గ‌న్ తో క‌ల‌సి దిగిన ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇప్పుడు చూస్తే ఆయ‌న‌లా ముంద‌స్తు జాబితాలు సిద్ధం చేయ‌డం వంటి హంగామా చూస్తుంటే ఇదేదో తేడాగా ఉందే అన్న అనుమానాలు కూడా వ‌స్తున్నాయ్. ఎందుకంటే ఏ స‌ర్వే కూడా విజ‌య్ కి 10- ప‌దిహేను సీట్ల కంటే ఎక్కువ వ‌చ్చేలా చెప్ప‌లేదు. అందుకే ఈ హంగామా చూస్తుంటే డౌట్ గా ఉందంటున్నారు కొంద‌రు.
తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. సాధారణంగా   ఆవిర్భావ దినోత్సవం రోజున   రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ప్లీనరీ నిర్వహించడం, కేడర్‌లో ఉత్సాహం నింపాలని ఏ పార్టీ అయినా భావిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తమ సత్తా చాటడానికి ఘనంగా, అట్టహాసంగా జరుపుకుంటాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయితే.. ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించి క్యాడర్ ను వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయడానికి అందివచ్చిన అవకాశంగా ఆవిర్భావ దినోత్సవాన్ని చూస్తుంది. అయితే తెలంగాణలో మాత్రం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అందుకు భిన్నంగా..  వేసవి తీవ్రతను సాకుగా చూపుతూ ప్లీనరీని రద్దు చేసింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీని రద్దు చేయడంపై పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.   రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ  నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.  పైకి సామాజిక బాధ్యతతోనే ప్రజలు, కార్యకర్తల క్షేమాన్ని కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నా..  సాధారణంగా వేసవిలో కూడా సాయంత్రం వేళల్లో బహిరంగ సభలు నిర్వహించే సంప్రదాయం ఉందని, ఇటీవల జగిత్యాలలో జరిగిన సభే ఇందుకు నిదర్శనమనీ గుర్తు చేస్తున్నారు. ఆ సభకు పార్టీ అధినేత కేసీఆర్ కూడా హాజరైన విషయాన్ని  ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం రోజున బహిరంగ సభ జరపకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతున్నది.  ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  బీఆర్ఎస్ తన సత్తా చాటుకోవడానికి ప్లీనరీ కీలకమని అంటున్నారు.  ముఖ్యంగా  కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో అధినేత కేసీఆర్  క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అంటున్నారు.  ఇలాంటి కీలక తరుణంలో కేసీఆర్ ప్రజల ముందుకు రాకపోవడం..   తన వాణిని వినిపించకపోవడం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    తన సొంత కుమార్తె కవిత తనపై చేసిన  విమర్శలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే  కేసీఆర్ బహిరంగ సభ విషయంలో వెనక్కు తగ్గారన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.   భారీ బహిరంగ సభకు బదులుగా తెలంగాణ భవన్‌లో కేవలం కీలక నేతలతో మాత్రమే ఇండోర్ సమావేశాన్ని నిర్వహించారు.   పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక వేదికగా మారుతుందని ఆశించిన కార్యకర్తలకు ఈ నిర్ణయం   నిరాశను మిగిల్చింది. 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు. కాగా.. తెలంగాణ భవన్‌లో పార్టీ  ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ  నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు  పోరాటం చేసి  కేసీఆర్  తెలంగాణ సాధించారన్నారు.  ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అన్న ఆయన.. గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో   దుర్మార్గ, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. భారతదేశ చరిత్రలోనే పాతిక వసంతాల ప్రస్థానం పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమే ఉన్నాయనీ, వాటిలో ఒకటి బీఆర్ఎస్ అన్నారు.  పోరాడి సాధించుకున్న తెలంగాణను  కాపాడుకునేందుకు బీఆర్ఎస్  పునరంకితం అవుతుందనీ, అరాచక కాంగ్రెస్ , బీజేపీ పాలన నుండి తెలంగాణను మళ్లీ పట్టాలు ఎక్కించడం కోసం పోరాడుదామనీ పిలుపునిచ్చారు.  కేసీఆర్ సైనికులుగా బలగంగా కలిసికట్టుగా కదం తొక్కుతాదామన్నారు.  తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తారని, నేతలకు దిశనిర్దేశం చేస్తారని కేటీఆర్ తెలిపారు. కవిత పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాత్రం కేటీఆర్ ఇష్టపడలేదు. 
ALSO ON TELUGUONE N E W S
గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఈసారి పక్కా ప్లానింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని హీరో నితిన్ (Nithin) భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపి ఒక సరికొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. తాజా సమాచారం ప్రకారం, నితిన్ తన తదుపరి చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ల ద్వయం నర్రి-సోము దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కొత్త దర్శకులు చెప్పిన లైన్ నితిన్‌కు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ (Rithika Nayak) హీరోయిన్‌గా నటించనుంది. నితిన్, రితికా జోడి వెండితెరపై ఫ్రెష్‌గా ఉంటుంది అనడంలో డౌట్ లేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క రెగ్యులర్ షూటింగ్ మే 6 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండటం విశేషం. ఆయన అందించే మెలోడీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. నితిన్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'భీష్మ' వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు అదే బ్యానర్‌లో వస్తున్న ఈ కొత్త సినిమా కూడా నితిన్ కెరీర్‌కు మంచి బూస్టింగ్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కొత్త దర్శకుల ప్రతిభ, రితికా నాయక్ గ్లామర్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ వెరసి ఈ సినిమాపై ఇప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి.  
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో ఒక భారీ సినిమా రూపుదిద్దుకోనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ బాలయ్యకు కథను వివరించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొరటాల మార్క్ సామాజిక సందేశంతో పాటు, బాలకృష్ణ అభిమానులు కోరుకునే పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోంది.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర యూనిట్ ఈ ప్రాజెక్ట్‌ను మే నెల తొలివారంలో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాటు, ఈ కొరటాల ప్రాజెక్ట్‌ను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రారంభోత్సవం రోజే అధికారికంగా వెల్లడించనున్నారు.  
    ప్రేమ (LOve).. ప్రేమికుల మధ్య ఏర్పడే కల్లా కపటం, పొల్యులేషన్ లేని పవిత్రమైన ప్రేమ.. ఒకరు పుట్టిస్తేనో, ప్రభావితం చేస్తేనో, సినిమాల వల్లనో, పక్కింటోళ్లు ప్రేమించుకుంటున్నారనో, పైత్యం వలనో, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ వలనో ఒక అమ్మాయి,అబ్బాయి మధ్య ఏర్పడే ప్రేమ, ప్రేమ కిందకి రాదు. సదరు యువతీ యువకుడు తొలి సారి చూసుకున్నప్పుడు ఒకరి కోసం ఒకరం జీవించడానికి, అవసరమైతే మరణించడానికి పుట్టామని అనిపిస్తుంది. అదే నిజమైన ప్రేమ. సింపుల్ గా చెప్పాలంటే ప్రేమ అనేది స్వయంభూగా మన హృదయంలో కొలువు తీరాలి. అప్పుడు ఆ ప్రేమని  చూసి  దేవతలు సైతం ఇన్ స్ప్రెషన్ పొందటంతో పాటు ఆ ప్రేమికుల గురించి కథలుగా కూడా చెప్పుకుంటారు. అటువంటి ప్రేమతో కూడిన  చిత్రమే మరో చరిత్ర(Maro Charitra). ఈ చిత్రం తర్వాత జరిగిన బాధాకరమైన  సంఘటనని దేవతలు కథలుగానే చెప్పుకునే ఉంటారు. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. లెజండ్రీ దర్శకుడు బాలచందర్(K. Balachander)తెరకెక్కించిన 'మరో చరిత్ర'  1978 లో రిలీజయ్యింది. కమల్ హాసన్(Kamal Haasan),సరిత(Saritha)జంటగా చేయగా అపురూపమైన ప్రేమ కావ్యాల్లో ఒకటిగా నిలిచి  . భాషా భేదం లేని ప్రేమని చాటిచెప్పి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, యువతను విపరీతంగా ప్రభావితం చేసింది. అయితే, ఒక చీకటి కోణాన్ని కూడా తనలో ఇముడ్చుకుంది. సినిమా ముగింపు చూసి ప్రేమికులు చేసిన సాహసాలు దర్శకుడిని సైతం కలచివేశాయి. హీరో హీరోయిన్లుగా ఒకరినొకరు కలుసుకోలేక, పర్వతంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం మూవీ క్లైమాక్స్ .ఈ విషాదకర ముగింపు చూసి భావోద్వేగానికి లోనైన సుమారు 40 మందికి పైగా ప్రేమికులు నిజ జీవితంలో కూడా అదే విధంగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తమ ప్రేమ విఫలమైందన్న బాధతో లేదా తమను విడదీస్తారన్న భయంతో సినిమాని అనుకరిస్తూ ప్రాణాలు తీసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. also read:  Puri Jagannadh: పూరి జగన్నాధ్  పర్సు ఖాళీనా! సినిమా ప్రభావంతో ఇంతమంది చనిపోవడం దర్శకుడు కె. బాలచందర్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక కళాఖండాన్ని సృష్టించాలనుకున్న తన ప్రయత్నం ఇంతటి విషాదానికి దారితీయడంతో ఆయన ఎంతగానోకలత చెందారు. ఈ క్రమంలోనే ఆయన ఒక బహిరంగ ప్రకటన విడుదల చేస్తూ క్షమాపణలు కోరారు. "సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే, దానిని నిజ జీవితంలోకి తీసుకోవద్దు. ప్రేమ అంటే ప్రాణాలు తీసుకోవడం కాదు, కలిసి బతకడం" అని యువతకి  విజ్ఞప్తి చేయడంతో పాటు కళాకారుడిగా ఎంతో గర్వపడే సినిమా, వ్యక్తిగా తనను ఎంతో బాధించిందని  ఆవేదన వ్యక్తం చేశారు.   తెలుగులో వచ్చిన ఈ ప్రభావాన్ని చూసిన బాలచందర్, హిందీలో 'ఏక్ దూజే కేలియే'గా రీమేక్ చేసేటప్పుడు క్లైమాక్స్‌ విషయంలో చాలా ఆలోచించారు. కానీ, కథా పరంగా ముగింపు మారితే సినిమా ఆత్మ దెబ్బతింటుందని భావించి అక్కడ కూడా విషాద ముగింపునే ఉంచారు. కాకపోతే సినిమా ప్రారంభంలోనే ఇది కేవలం కల్పితమని, ఎవరూ అనుకరించవద్దని హెచ్చరికలు జారీ చేశారు.  ఒక సినిమా సమాజంపై ఎంతటి ముద్ర వేయగలదో చెప్పడానికి 'మరో చరిత్ర' ఒక నిలువెత్తు సాక్ష్యం. కానీ సినిమా ప్రేమికులతో పారు అందరు గమనించాల్సింది ఏంటంటే సిల్వర్ స్క్రీన్ పై కనిపించేవి కేవలం క్యారక్టర్ లేనని నిజ జీవితం అంతకంటే విలువైనదని మనం గుర్తించాలి.      
గోదావరి తీరంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథలు ఎప్పుడూ ప్రేక్షకులకు ఒక తెలియని అనుభూతిని కలిగిస్తాయి. 'మేమ్ ఫేమస్' సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా, నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'గోదారి గట్టుపైన' (Godari Gattupaina). సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు చాలా రిఫ్రెషింగ్‌గా సాగింది. సుమంత్ ప్రభాస్ తనదైన శైలిలో గోదావరి యాసతో చెప్పే డైలాగ్స్, టైమింగ్ బాగున్నాయి. తన 'సత్యభామ' (హీరోయిన్) కోసం అతను పడే తపన, చేసే ప్రయత్నాలు సరదాగా ఉన్నాయి. హీరోయిన్ నిధి ప్రదీప్ సాంప్రదాయబద్ధమైన లుక్‌లో పక్కింటి అమ్మాయిలా చాలా బాగుంది. ట్రైలర్‌లో మణిరత్నం, గౌతమ్ మీనన్ సినిమాల్లోని హీరోయిన్లతో పోల్చుతూ చెప్పే డైలాగ్స్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కథ విషయానికి వస్తే, ఇది కేవలం సరదా ప్రేమకథ మాత్రమే కాదు, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం మరియు బాధ్యత చుట్టూ కూడా తిరుగుతుందని ట్రైలర్ చివరలో వచ్చే ఎమోషనల్ సీన్స్ సూచిస్తున్నాయి. తన కూతురిని జీవితాంతం ప్రేమగా చూసుకోవాలనుకునే తండ్రి పాత్ర (జగపతి బాబు), ప్రేమ-భయం మధ్య నలిగే యువతి పాత్రలు కథలో లోతును పెంచుతున్నాయి. ఈ చిత్రానికి నాగవంశీ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ట్రైలర్‌లో వినిపించిన నేపథ్య సంగీతం గోదావరి అందాలను, భావోద్వేగాలను చక్కగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ ద్వారా గోదావరి తీరప్రాంతం చాలా అందంగా, సహజంగా చిత్రీకరించబడింది. సుభాష్ చంద్ర తన మేకింగ్‌తో ఒక హానెస్ట్ లవ్ స్టోరీని అందించబోతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి 'గోదారి గట్టుపైన' ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది. సుమంత్ ప్రభాస్ ఎనర్జీ, నిధి ప్రదీప్ క్యూట్‌నెస్, గోదావరి నేపథ్యం ఈ సినిమాకు ప్రధాన బలాలు. మాస్ సినిమాల మధ్య ఇలాంటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథలు ప్రేక్షకులకు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మే 8న విడుదల కానున్న ఈ సినిమా సుమంత్ ప్రభాస్ కెరీర్‌లో మరో మంచి విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.  
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, మరోవైపు నటీనటుల పారితోషికాలు ఆకాశాన్ని తాకడంతో నిర్మాతలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తమిళ నిర్మాతల మండలి సరికొత్త 'రెవెన్యూ షేరింగ్' మోడల్‌ను తెరపైకి తెచ్చింది. ఇటీవల జరిగిన సమావేశంలో నిర్మాతల మండలి పలు ఆసక్తికర ప్రతిపాదనలు చేసింది. ఇకపై స్టార్ హీరోలు, దర్శకులకు సినిమా ప్రారంభంలోనే భారీ పారితోషికాలు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. దానికి బదులుగా, సినిమా సాధించే లాభాల్లో వాటా ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. దీనివల్ల సినిమా విజయం సాధిస్తేనే అందరికీ భారీ ఆదాయం దక్కుతుంది, ఒకవేళ పరాజయం పాలైతే నిర్మాతలు పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి ఉండదు. ఈ కొత్త నిబంధన వల్ల సినిమా నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని, ఆ మిగిలిన బడ్జెట్‌ను సాంకేతిక విలువలపై ఖర్చు చేయవచ్చని మండలి భావిస్తోంది. అంతేకాకుండా, మే 2న ఒకరోజు టోకెన్ స్ట్రైక్ నిర్వహించాలని, నటీనటుల సంఘం దీనికి సహకరించకపోతే భవిష్యత్తులో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే చిన్న, మధ్య తరహా నిర్మాతలకు పెద్ద ఊరట లభిస్తుంది. అయితే, అగ్ర హీరోలు ఈ ప్రతిపాదనకు ఏ మేరకు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే మలయాళ పరిశ్రమలో ఇటువంటి కొన్ని పద్ధతులు అమలులో ఉన్నాయి, ఇప్పుడు కోలీవుడ్ కూడా అదే బాట పట్టడం విశేషం. సినీ పరిశ్రమ నిలబడాలంటే నిర్మాత బాగుండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా రెమ్యునరేషన్ పద్ధతుల్లో మార్పులు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ 'రెవెన్యూ షేర్' మోడల్ కోలీవుడ్‌లో సక్సెస్ అయితే, భవిష్యత్తులో టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా ఇటువంటి మార్పులు చూసే అవకాశం ఉంది.   
టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా కొనసాగిస్తున్నారు. సీనియర్ నటి లయతో కలిసి ఆయన నటించిన చిత్రం 'వదలా' (Vadhala). చరిత చిత్ర పతాకంపై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసింది. టీజర్ ప్రారంభం నుంచే దర్శకుడు అకెళ్ల వి కృష్ణ ఒక రకమైన నిశ్శబ్దాన్ని, ఆపై గంభీరమైన వాతావరణాన్ని సృష్టించారు. "యు ఆర్ మై వరల్డ్.. నువ్వు నేను ఈ ప్రపంచం అంతే" అంటూ సాగే డైలాగ్స్ ఒక గాఢమైన ప్రేమను సూచిస్తుండగా, ఆ వెంటనే వచ్చే సన్నివేశాలు కథలో ఏదో గూఢమైన మిస్టరీ ఉందని స్పష్టం చేస్తున్నాయి. జగపతి బాబు తనదైన శైలిలో గంభీరమైన లుక్‌లో కనిపించగా, లయ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరితో పాటు యువ నటి హృతిక శ్రీనివాస్ ఈ చిత్రంలో ఒక కీలకమైన, పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. "యోగిని శాశ్వతంగా నా సొంతం చేసుకుంటా" అనే డైలాగ్ ఈ కథలో ఉన్న పొసెసివ్‌నెస్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేస్తోంది.  కార్తీక్ బి. కొడకండ్ల అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రధాన బలమని చెప్పాలి. ప్రతి సన్నివేశాన్ని మరింత ఇంటెన్స్‌గా మార్చడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను చాలా రిచ్‌గా, మూడ్‌కు తగినట్లుగా ఆవిష్కరించింది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్‌గా ఉంది. కథపై ఆసక్తిని పెంచేలా కట్స్ ఉన్నాయి. మొత్తానికి 'వదలా' టీజర్ ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. జగపతి బాబు, లయల కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కాగా, హృతిక శ్రీనివాస్ పాత్ర కథలో మలుపులు తిప్పేలా కనిపిస్తోంది. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, మనుషుల మధ్య ఉండే వింతైన సంబంధాలు, పొసెసివ్ మనస్తత్వాల చుట్టూ ఈ చిత్రం తిరుగుతున్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.  
Recent rumors in the film industry suggest that Kollywood star Silambarasan, popularly known as Simbu, might be making a special entry in the highly anticipated sequel to Kalki 2898 AD. Following the massive box office success of the first part starring Prabhas, director Nag Ashwin is currently busy working on the massive schedules for Kalki 2.   According to the ongoing buzz, the makers are planning to bring Simbu on board for a very powerful role that might appear towards the film's climax. This strategic casting move is reportedly aimed at further expanding the sci-fi epic's footprint and generating a massive response in the Tamil theatrical market.  Given the grand scale of the Kalki Cinematic Universe, bringing in top stars from various regional industries seems to be a continuation of the successful strategy used in the first part, which prominently featured legends like Kamal Haasan and Amitabh Bachchan. However, neither the production house, Vyjayanthi Movies, nor the actor has officially confirmed these speculations yet. Fans of the blockbuster franchise and the actor are currently waiting for an official announcement to see if this exciting crossover will actually materialize on the big screen.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
  దర్శకులకి కూడా అభిమానులు ఉంటారని నిరూపించిన వారిలో పూరి జగన్నాథ్(Puri Jagannadh)ఒకరు. హిట్, సూపర్ హిట్లకి కొలమానాలు వెతుక్కుంటున్న రోజుల్లో భారీ హిట్ లని పొందాడు. డిఫరెంట్ సబ్జెట్స్, ఎంటర్ టైన్ మెంట్ కి కూడా పెట్టింది పేరు. కానీ గతమెంతో ఘనమనే అర్దానికి పర్యాయ పదానికి నిలువెత్తు ఉదాహరణలాగా డిజాస్టర్స్ తో చాలా డీప్ గానే ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు. గత కొంత కాలంగా జీవిత సత్యాలని కూడా చెప్తూ వస్తున్న పూరి రీసెంట్ గా అలాంటివే కొన్ని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు చూద్దాం. తాజాగా పూరి 'సమయం వర్సెస్ డబ్బు' అనే అంశంపై మాట్లాడుతు ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైనది మరొకటి ఉంది. అదే  మన దగ్గర ఉన్న 'సమయం'. మనుషులు జీవితాంతం డబ్బు కోసం పరుగెడుతూ, అత్యంత విలువైన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పోగొట్టుకున్న డబ్బుని మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ, గడిచిపోయిన ఒక్క నిమిషాన్ని కూడా తిరిగి తీసుకురాలేం. ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా లభించేది రోజుకు 24 గంటలు మాత్రమే. ఆ సమయాన్ని మనం ఎవరికి ఇస్తున్నాం, దేని కోసం ఖర్చు చేస్తున్నాం అనేదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి ఉదయం మన పర్సు టైంతో నిండిపోయి ఉంటుంది. ఏం చెయ్యకపోయినా సాయంత్రానికి ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఉదయం చూసుకుంటే పర్సు ఇరవై నాలుగు గంటలతో నిండి ఉంటుంది.  Also read: Suriya: సూర్య హీరో కాదంట.. 20 ఏళ్ళ క్రితమే పాన్ ఇండియా హీరో అని మర్చిపోకండి డబ్బున్న వారు ఖరీదైన గడియారాలను కొనుగోలు చేయగలరు కానీ, సెకను ముల్లును ఆపలేరు. వంద కోట్లు ఉన్నవాడికైనా, చిల్లిగవ్వ లేని వాడికైనా కాలం ఒకేలా గడుస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బుతో ఇతరుల సమయాన్ని కొనుగోలు చేయవచ్చు.  కానీ మన ఆయుష్షును పెంచుకోలేం. కాబట్టి, మన సమయాన్ని పనికిరాని విషయాల కోసం, ద్వేషం కోసం లేదా ఇతరులను విమర్శించడం కోసం వృథా చేయకూడదు. డబ్బుని  బ్యాంకులో దాచుకున్నట్లు, సమయాన్ని దాచుకోలేం. గడుస్తున్న ప్రతి సెకను మన ఖాతా నుంచి ఖర్చైపోతుంటుంది. అందుకే సమయాన్ని సరైన విషయాలపై పెట్టుబడిగా పెట్టాలి. "జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మనకు నచ్చిన పనిని చేయడానికి సమయాన్ని కేటాయించాలి. ఎప్పుడైతే మనం సమయం విలువను గుర్తిస్తామో, అప్పుడే మనం జీవితంలో నిజమైన విజేతలుగా నిలుస్తాం అని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మక్కల్ సెల్వం విజయ్ సేతుపతితో  స్లమ్ డాగ్ అనే మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. అలాంటి టైంలో కూడా టైం చూసుకోకుండా పది మందికి ఉపయోగపడే మాటలు చెప్పడం నిజంగా గ్రేట్.  
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'కల్కి 2898 AD' సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న 'కల్కి 2' పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈసారి మరింత భారీ తారాగణంతో.. పురాణ గాథలు, సైన్స్ ఫిక్షన్ మేళవింపుతో ఈ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వినిపిస్తున్న ఒక వార్త సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. శింబు స్పెషల్ కామియో: తమిళ స్టార్ హీరో శింబు (Silambarasan TR) ఈ సీక్వెల్‌లో ఒక అత్యంత పవర్‌ఫుల్ అండ్ సర్ప్రైజింగ్ రోల్‌లో కనిపించబోతున్నారట. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్ర కథను ఊహించని మలుపు తిప్పుతుందని తెలుస్తోంది. మొదటి భాగంలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ మెరిసినట్లే, ఈసారి శింబు రాకతో కోలీవుడ్ మార్కెట్‌లో కూడా సినిమా రేంజ్ మారిపోనుంది. ఆయన ఏదైనా పురాణ యోధుడి పాత్రలో కనిపిస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. హైదరాబాద్‌లో భారీ సెట్: ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఒక భారీ సెట్‌ను నిర్మించిన చిత్ర యూనిట్, అందులో సినిమాకే హైలైట్‌గా నిలిచే ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు సిద్ధమైంది. ఈ షెడ్యూల్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌(Prabhas)తో పాటు లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.  కర్ణ-అశ్వత్థామ vs సుప్రీమ్ యాస్కిన్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. 'కర్ణ 3102 BC' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం.. భైరవ (కర్ణుడు) గతాన్ని, అలాగే భవిష్యత్తు పోరాటాన్ని ఆవిష్కరించనుంది. శింబు వంటి స్టార్స్ తోడవ్వడంతో ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  
Kollywood star Karthi is navigating a challenging phase at the box office. His recent vigilante film Vaa Vaathiyaar ended up as a disaster, and the slice-of-life drama Meiyazhagan failed to make a strong commercial impact. While he has completed shooting for Sardar 2, its theatrical release is currently delayed. Rumours say it is linked with Suriya Karuppu release date and could come out in August.  With his immediate hopes resting on the period drama Marshal and his much-talked-about lead role in HIT 4, rumors of a new project with Boyapati Srinu have left trade circles questioning if this is the right move. On paper, a high-voltage mass entertainer sounds like a safe bet to recover lost ground.  However, Boyapati Srinu seems to have completely lost his form. While he has delivered massive hits with Nandamuri Balakrishna in the past, their recent collaboration Akhanda 2 was a colossal disaster. Furthermore, his track record with other heroes is highly inconsistent.  Except for Bhadra and Sarrainodu, his other projects have failed commercially despite having popular action blocks. His film Skanda, which released before Akhanda 2, did not even manage to deliver those signature thrilling moments. At this crucial juncture, Karthi needs a reliable commercial hit. Trusting an out-of-form director whose template has grown highly predictable might be a massive risk and could end up being the wrong decision for his career.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో 'ఫ్రోజెన్ షోల్డర్' (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో 'అడెసివ్ క్యాప్సులైటిస్' అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి, కనీసం చేయి పైకి ఎత్తడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడి దైనందిన జీవితం స్తంభించిపోతుంది. దీనిని కేవలం సాధారణ నొప్పి అని సరిపెట్టుకొని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు కదలికలు మరింత కష్టతరంగా మారుతాయి. ఆధునిక వైద్యంలోని పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుండగా, ఆయుర్వేదం ఈ వ్యాధిని మూలాల నుండి నయం చేసే అద్భుతమైన మార్గాలను చూపుతోంది. ఈ క్రమంలో ఫ్రోజెన్ షోల్డర్ లక్షణాలు, కారణాలు మరియు దీనిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏమిటి? మన భుజంలోని కీలు చుట్టూ ఉండే కణజాలం (Capsule) వాపునకు గురై, మందంగా మారడం వల్ల భుజం కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ప్రధాన కారణాలు: మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  గాయాలు: భుజానికి తగిలిన పాత గాయాలు లేదా శస్త్రచికిత్సల వల్ల.  థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా భుజం కండరాలు దెబ్బతినవచ్చు.  కదలిక లేకపోవడం: ఎక్కువ కాలం చేతికి పని చెప్పకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఆయుర్వేద చికిత్స - సహజ సిద్ధమైన పరిష్కారం: ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'వాత దోషం' పెరగడం వల్ల కీళ్లలో ద్రవాలు తగ్గి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో ఫ్రోజెన్ షోల్డర్‌ను 'అవబాహుక' అని అంటారు. దీనికి అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన చికిత్సలు: అభ్యంగనం (Abhyangam): వేడి చేసిన ఆయుర్వేద తైలాలతో (మహానారాయణ తైలం వంటివి) మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.   స్వేదనం (Swedanam): మూలికల ఆవిరి పట్టడం ద్వారా బిగుసుకుపోయిన కండరాలు వదులవుతాయి.   గ్రీవ వస్తి / పీచు: నొప్పి ఉన్న భాగంలో ప్రత్యేకమైన నూనెను నిల్వ ఉంచే ప్రక్రియ.   పౌష్టిక ఆహారం: వాతాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరియు శొంఠి, గుగ్గులు వంటి మూలికలను వాడటం. ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేద చికిత్సలతో సులభంగా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చేతి కదలికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఆయుర్వేద జీవనశైలితో మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది,  ఇష్టంగా అనిపిస్తుంది,  తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది.  ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది.  ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి.  పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు.  ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి.  అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే.. బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం.. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు,  పెరిగిన వాతావరణం,  గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం.. చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్  చేసే ఒక ప్రయోగం.  గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే  మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే  ఆకర్షితులు అవుతుంటారు. తమను తాము తక్కువగా  అంచనా వేసుకోవడం.. ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా  పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు. మార్పు పట్ల భయం.. చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు,  ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు.  అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు. గత గాయాల ప్రబావం.. గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి.  ఇలాంటి వారు  భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళం.. చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు.   ప్రేమలో లేదా రిలేషన్ లో  అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి  అలవాట్లు,  ఆలోచనా విధానం ఇచ్చే  ఫలితం. ప్రతి వ్యక్తి తన  పద్ధతులను గుర్తించి, తమను తాము  సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు,  పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం,  పాత ఆలోచనలు, సిద్దాంతాలలో  చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి.                                    *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కూలర్లు వాడేవారు దాని శుభ్రత గురించి మాత్రం అంత శ్రద్ద తీసుకోరు. దీని వల్ల నీరు మురికిగా మారి దోమలు పెరగడానికి ఆవాసంగా మారడమే కాకుండా.. . కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే కూలింగ్ కూడా పెద్దగా రాదు.   అయితే కూలర్ లో నీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం అంత ఈజీ ఏమీ కాదు.. కొన్ని కంపెనీల కూలర్లలో నీటిని నింపడం సులువే.. కానీ వాటిలో నీటిని తొలగించడం, శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.. అయితే.. కూలర్లలో నీరు ప్రతిరోజూ శుభ్రం చేయకపోయినా కొన్నిరోజుల పాటు నీరు శుభ్రంగా ఉండాలన్నా, తాజాగా అనిపించాలన్నా కేవలం ఒకే ఒక్క చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుంటే.. పటిక.. కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన,  ఇంటి చిట్కా. దీనిని నీటిలో వేయడం  వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో నీరు తరచుగా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, ఇది తొందరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ నీటిలో దోమలు  ఆవాసం ఏర్పాటు చేసుకుని  గుడ్లు పెడతాయి. అయితే కూలర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే   దానిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. నీటిలో ఒక చిన్న పటిక ముక్కను వేయడం వల్ల నీటిని శుభ్రపరచవచ్చు.  పైగా దోమల సమస్య కూడా తగ్గుతుంది. కూలర్ ట్యాంక్ లో పటిక వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నీటి స్వచ్చత.. పటిక నీటిలోని దుమ్ము, ధూళి , చిన్న కణాలను బంధిస్తుంది. ఈ కణాలు బరువెక్కి అడుగుకు చేరుకుంటాయి, దీనివల్ల పైన ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది. దోమలకు చెక్.. పటిక నీటిని శుద్ధి చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు సులభంగా వృద్ధి చెందలేవు. దీనివల్ల దోమల సమస్య గణనీయంగా తగ్గుతుంది. దుర్వాసన.. కూలర్ నీటి నుండి ఏదైనా వింత లేదా దుర్వాసన వస్తుంటే, దానిని చాలా వరకు తగ్గించడంలో పటిక సహాయపడుతుంది. బ్యాక్టీరియా..  పటికకు తేలికపాటి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇవి నీటిలో ఉండే  హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. నీటి నాణ్యత.. పటిక నీటిని ఎక్కువ సేపు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది, దీనివల్ల కూలర్ ప్యాడ్‌లు త్వరగా పాడవకుండా ఉంటాయి , గాలి చల్లగా ఉంటుంది. పటికను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. పటికను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఎక్కువ పటిక కలపడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలర్‌లోని నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.                                 *రూపశ్రీ.
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో తీసుకునే ఆహారాలు కేవలం కడుపు నిండినట్టు లేదా రుచి కోసం తీసుకుంటూ ఉంటారు. కానీ శరీరంలో ఎంతో ముఖ్యమైన భాగమైన పేగు ఆరోగ్యం బాగుండటం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఉదయాన్నే తీసుకునే ఆహారమే పేగు ఆరోగ్యాన్ని, రోజు మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  పేగు ఆరోగ్యాన్ని ఎంతో సేఫ్ గా ఉంచే కొన్ని బ్రేక్ ఫాస్ట్ లు ఉన్నాయి.  ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలు తీసుకుంటే రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది. అవేంటో తెలుసుకుంటే.. ఓట్స్, చియా సీడ్స్ స్మూతీ.. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది,  మెరుగుపరుస్తుంది. ఓట్స్ ను  చియా విత్తనాలతో కలిపితే, ఫైబర్ కంటెంట్ రెట్టింపు అవుతుంది. చియా విత్తనాలు నీటిని గ్రహిస్తాయి,  జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ రాగి ఇడ్లీ లేదా దోశ.. రాగులు ఫైబర్,  కాల్షియం పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే, రాగులలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. తురిమిన క్యారెట్లు, బీన్స్,  పాలకూరను రాగి పిండిలో కలపాలి. ఆవిరి మీద ఉడికించి ఇడ్లీగా తినవచ్చు.  లేదంటే దీంతో దోశ కూడా ట్రై చేయవచ్చు. . ఇది తేలికగా ఉంటూనే  జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది. మొలకెత్తిన ధాన్యాలు.. పెసలు, శనగలు లేదా బొబ్బర్లు వంటివి  మొలకెత్తడం వల్ల వాటి ఫైబర్,  ఎంజైమ్ కంటెంట్ పెరుగుతుంది. మొలకెత్తిన ధాన్యాలు ప్రీబయోటిక్స్‌గా పనిచేస్తాయి. మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మొలకెత్తిన పెసలను దోసకాయ, టమోటా, నిమ్మరసం,  కొద్దిగా ఉప్పుతో కలపాలి. ఇది ఫైబర్‌ను అందించడమే కాకుండా ప్రోటీన్ కూడా పుష్కలంగా అందిస్తుంది. మల్టీగ్రెయిన్ వెజిటబుల్ ఉప్మా.. సెమోలినాకు బదులుగా మల్టీగ్రెయిన్ గంజి లేదా ఓట్ ఉప్మా తయారు చేయడం వల్ల ఫైబర్  మరింత మెరుగవుతుంది. బఠానీలు, కాలీఫ్లవర్,  బీన్స్ వంటి కూరగాయలను జోడించడం వల్ల ఫైబర్ కంటెంట్ మరింత పెరుగుతుంది. తక్కువ నూనె,  ఆకుపచ్చ కూరగాయలను పుష్కలంగా జోడిండం వల్ల దీనిలో హెల్తీ బెనిఫిట్స్ మెరుగవుతాయి. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా భావించే కరివేపాకును జోడిస్తే మరీ మంచిది. జొన్న రోటీ, పెరుగు.. చిరు ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చిరు ధాన్యాలు,  జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పెరుగు అనేది పేగులో మంచి బ్యాక్టీరియాను పెంచే ప్రోబయోటిక్. చిరు ధాన్యాల రోటీతో ఒక గిన్నెడు తాజా పెరుగు కలిపి తింటే చాలా మంచిది. ఈ కాంబో ఫైబర్,  ప్రోబయోటిక్స్ రెండూ కలిగి ఉంటుంది.                            *రూపశ్రీ.  
  కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి.  చాలా పరిశుభ్రతలో బాగంగా మౌత్ వాష్ లు వాడుతుంటారు.  కొందరు పళ్లు తోమే పని లేకుండా మౌత్ వాష్ వాడితే.. మరికొందరు పళ్లు తోమిన తర్వాత కూడా ఇంకా పళ్లు ఎక్కువగా శుభ్రం అవుతాయని అతి శుభ్రతతో మౌత్ వాష్ కూడా వాడతారు. అయితే.. మౌత్ వాష్ వాడే వారికి డాక్టర్లు ఓ చల్లని చావు కబురు చెబుతున్నారు.  మౌత్ వాష్ వాడితే రక్తపోటు సమస్య వస్తుందని అంటున్నారు.  దీని గురించి వైద్యులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. మౌత్ వాష్.. నోటి ఆరోగ్యం.. నోటిలోని మంచి బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా అవసరం. ఈ బ్యాక్టీరియా ఆహారంలోని నైట్రేట్‌లను నైట్రైట్‌లుగా మార్చడానికి సహాయపడతాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి , రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన అంశం. మౌత్ వాష్ వల్ల కలిగే నష్టం.. బలమైన యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌లు నోటిలోని  మంచి బ్యాక్టీరియాను కూడా చంపగలవని నిపుణులు అంటున్నారు. ఇది నైట్రేట్, నైట్రైట్‌గా మారే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది , శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను తగ్గించగలదు. ఇది నేరుగా రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపుతుంది, తద్వారా రక్తపోటును ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ వాడకం వల్ల నోటిలోని అవసరమైన బ్యాక్టీరియా 90 శాతం వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలిందని వైద్యులు కూడా చెబుతున్నారు. కేవలం కొన్ని రోజుల వాడకం కూడా లాలాజలంలో నైట్రేట్ స్థాయిలను తగ్గించగలదని, దీనివల్ల సిస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదల ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మౌత్ వాష్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే.. రోజు ఎక్కువగా మౌత్‌వాష్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియాను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్‌ను తగ్గించడం, , రక్తనాళాల సరైన పనితీరును దెబ్బతీసే ప్రక్రియ వలనే ఇది జరుగుతుందని అంటున్నారు. దీని ప్రభావాలు అందరిపై తీవ్రంగా ఉండనప్పటికీ, రెగ్యులర్ గా అందులోనూ ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధి, దంత చికిత్స తర్వాత, లేదా దంతాలపై అధికంగా పాచి పేరుకుపోయిన వంటి కొన్ని పరిస్థితులలో మౌత్‌వాష్ వాడకం  అవసరం అవుతుంది. అందువల్ల, మౌత్‌వాష్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, దానిని రోజువారీ అలవాటుగా చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రతకు బ్రష్ చేయడమే మంచిదని, దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. కాబట్టి మౌత్ వాష్ ఎక్కువగా వాడకూడదు.                                      *రూపశ్రీ.
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం,  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో జింక్ కూడా ఒకటి. అయితే చాలామందికి జింక్ లోపం గురించి పెద్దగా అవగాహన ఉండదు.  జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజమేనా? జింక్ లోపం గురించి.  జింక్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. శరీరానికి జింక్ ఎందుకు అవసరం..  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి , చర్మానికి జింక్ చాలా అవసరం. జింక్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి , కణజాలాలను బాగు చేయడానికి సహాయపడుతుంది. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని, చర్మ, కడుపు సమస్యలను కూడా కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు.. జింక్ లోపం శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం పిల్లలలో పెరుగుదలను నిరోధించగలదు , మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు.. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జింక్ లోపం ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ఫంగస్ , చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. విరేచనాలు.. వైద్యుల ప్రకారం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ లోపం జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జింక్ లోపించినప్పుడు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. గాయాలు.. జింక్ లోపం చర్మం, కడుపునే కాకుండా గాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయమవుతాయి. జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు.. జింక్ లోపం వేగంగా బరువు తగ్గడం, నీరసం , జుట్టు రాలడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారాలు.. ఆహారంలో జింక్‌ను చేర్చుకోవడానికి,  గుమ్మడి గింజలు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలు , రాగులను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో జింక్ ఉంటుంది. అదనంగా,  ఆవాల ఆకుకూర, మాంసం, పప్పుధాన్యాలు, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెరుగు, వేరుశెనగలు , గుడ్లను కూడా తినవచ్చు. ఈ ఆహారాలలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది.                                 *రూపశ్రీ.