LATEST NEWS
  ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ఉండవల్లిలో ఆయన విద్యార్థులతో ముఖముఖి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌‌లో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని లోకేశ్‌ అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్‌ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కష్టపడి పనిచేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో ఉత్తమ విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు.  రానున్న రోజుల్లో ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం కసి, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల ఆసక్తి తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా ఏర్పాటు చేసిన బ్లాక్స్ ఆకట్టుకున్నాయిని మంత్రి తెలిపారు . జీవితం పట్ల వారికున్న క్లారిటీ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. వారు కంటున్న కలలు అన్ని సాకారం కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై నమ్మకం పెరిగేందుకు విద్యార్థులు సాధించిన ఈ ర్యాంకులు ఒక మైలురాయిగా నిలిచిపోతాయిని లోకేశ్ పేర్కొన్నారు
  ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్‌ సరఫరా చేస్తామని  మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు మాత్రం డోర్‌ డెలివరీ చేస్తాని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. 29వేల చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరకుల సరఫరా జరిగేది. గత వైసీపీ సర్కార్ ఎండీయూల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసింది. 9,260 మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ల కోసం  రూ.1860 కోట్లు వృథా చేశారు. లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక పోయారు. 30శాతం మందికి రేషన్‌ అందడం లేదని ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో తేలింది.  రేషన్‌ సరఫరాకు వాహనాలు వచ్చాక జవాబుదారీ తనం లేదు, సరకులు ఎటు వెళ్తున్నాయో తెలియదు.  వందల సంఖ్యలో క్రిమినల్‌ కేసులు ఈ వాహనాల ఆపరేటర్‌లపై నమోదయ్యాయి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కోసం ఓ గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేసుకున్నారు. చౌకదుకాణాలు ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతాం అని మంత్రి నాదెండ్ల తేల్చి చెప్పారు. రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాకా సరుకులు ఎటు వెళుతున్నాయో తెలియలేదు. ఒక్కో వాహనానికి నెలకు రూ.27వేల చొప్పున పౌర సరఫరా శాఖ చెల్లిస్తోందని పేర్కొన్నారు. చాలా అంశాలపై నిర్ణయించి రేషన్ వ్యాన్లను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దీపం-2 పథకం పై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని.. దీపం-2 కింద బుకింగ్ కు ముందే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు.     
  రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలపడం తద్వారా కళలకు కాణాచి, సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరానికి పునఃవైభవం వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి దుర్గేష్  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం చట్టం - 1985లోని సెక్షన్ 3(2) ప్రకారం ఏపీలోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపడం ఆనందంగా ఉందన్నారు.    తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం పనిచేస్తుందని తెలిపారు. అన్ని భాషలను గౌరవిస్తూనే మాతృభాషకు అగ్రతాంబూలం ఇవ్వాలన్న  లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్ర లేఖనం తదితర వాటిలో  అధునాతన అధ్యయానికి, పరిశోధనలు సులభతరం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. భవిష్యత్ లో జరిగే శాస్త్రీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రంగంలోనూ ప్రాచీన తెలుగు పరిశోధనలకు అవకాశం కల్పించబడుతుందన్నారు. అంతేగాక తెలుగు భాషా సాహిత్యాలు, కళలు, సంస్కృతి, శాస్త్రాలు సంపూర్ణంగా, సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరపున  సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ లకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, వారసత్వానికి వారధిగా నిలుస్తూ పవిత్ర గోదావరి చెంతన ఉన్న  రాజమహేంద్రవరంలో తెలుగు వైభవంగా వెలుగొందుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషా సంస్కృతులు, కళలు మరింతగా విరాజిల్లుతాయన్న అభిప్రాయాన్ని మంత్రి దుర్గేష్ వ్యక్తం చేశారు.
  తిరుమల తిరుపతి దేవస్థాన మండలి  పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్ని అట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యించారు. ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు రూ.4 కోట్ల కేటాయించింది.  స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఒంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానం చేయాలని నిర్ణయించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు.  తిరుమల ఉప ఆలయాలు సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆకాశగంగ, పాపవినాశం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు. టీటీడీ ఉప ఆలయాలు సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆకాశగంగ, పాపవినాశం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు.⁠  తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, అమ‌రావ‌తి వేంక‌టేశ్వ‌ర‌ స్వామి ఆల‌యం, నారాయ‌ణ‌వ‌నం క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, క‌పిల‌తీర్థం క‌పిలేశ్వ‌ర‌ స్వామి ఆల‌యం, నాగాలాపురం వేద‌నారాయ‌ణ‌స్వామి ఆల‌యం, ఒంటిమిట్ట కోదండ‌రామ స్వామి ఆల‌యాల అభివృద్ధి కోసం స‌మ‌గ్ర బృహ‌త్ ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక‌, ఆర్థిక ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించారు.  ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామని ఈవో వెల్ల డించారు. ⁠తిరుమ‌ల‌లోని బిగ్ క్యాంటీన్లు, జ‌న‌తా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణ‌యించే అంశంపై ఆమోదం. భ‌క్తులకు నాణ్య‌మైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ⁠టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్థుల బదిలీలు.. వీర్ఎస్ దిశగా కసరత్తు చేయాలని డిసైడ్ అయ్యారు.   
  ఏపీ సీఎం చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకుంటారు.  అనంతరం సాయంత్రం అమరావతి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ ఏర్పాట్లను  ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ మణికంఠ పరిశీలించారు. అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైనింగ్‌లో భాగంగా గుడుపల్లె మండల పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు.  ఇక్కడ భద్రతా ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అనంతరం కుప్పం పట్టణంలోని గంగమాంబ ఆలయంవద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి.. సిబ్బందికి సూచనలిచ్చారు. సెక్యూరిటీకి సంబంధించి వర్సిటీ గ్రౌండ్‌ హెలిప్యాడ్‌లో బ్యారికేడ్లు, శానిటేషన్‌ నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. బుధవారం ఉదయం సీఎం అమరావతి నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ద్రవిడ వర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కుప్పం తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం 2.30 గంటలకు అమరావతికి తిరుగుప్రయాణం అవుతారని అధికారులు చెప్పారు.   
ALSO ON TELUGUONE N E W S
  యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న 'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడని అందరూ భావించారు. కానీ తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే.. ఇందులో విలన్ హృతిక్ అనిపిస్తోంది. (War 2 Teaser)   ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'వార్-2' టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంది. అటు హృతిక్ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు మెచ్చేలా టీజర్ ను కట్ చేశారు. ఇద్దరు ఎంతో స్టైలిష్ గా ఉన్నారు. ఇద్దరి మధ్య యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయేలా ఉన్నాయి. అయితే టీజర్ ని సరిగ్గా గమనిస్తే.. ఇందులో నెగటివ్ రోల్ లో హృతిక్ కనిపిస్తున్నాడనే అభిప్రాయం కలగకమానదు.    "నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, 'రా' బెస్ట్ ఏజెంట్ నువ్వే.. కానీ, ఇప్పుడు కాదు." అంటూ ఎన్టీఆర్ చెప్పే వాయిస్ తో వార్-2 టీజర్ ప్రారంభమైంది. ఆ డైలాగ్ ని బట్టి చూస్తే.. ఒకప్పుడు బెస్ట్  సోల్జర్, బెస్ట్ ఏజెంట్ అయిన కబీర్, ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు అని అర్థమవుతోంది. కబీర్ ని పట్టుకోవడానికి వచ్చిన పవర్ ఫుల్ ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. దీంతో కబీర్ నెగటివ్ గా ఎందుకు మారిపోయాడు? అనేది ఆసక్తికరంగా మారింది.  
విక్టరీ వెంకటేష్(Venkatesh)రానా(Rana)ప్రధాన పాత్రల్లో 2023 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'(Rana Naidu). యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ 'రెడోనోవన్' అనే అమెరికన్ టీవీ సిరీస్ కి రీమేక్ గా తెరకెక్కింది. వెంకటేష్,రానా విజృంభించి నటించిన ఈ సిరీస్ లో సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, సుచిత్ర పిళ్ళై, సర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు ఈ సిరీస్ కి కొనసాగింపుగా రూపొందిన 'రానా నాయుడు సీజన్ 2 (Rana Naidu Season 2)జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా  స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ తో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా అధికారకంగా ప్రకటించింది. దీంతో రానా నాయుడు సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్న వెంకటేష్, రానా అభిమానుల్లో సరికొత్త జోష్ వచ్చిందని చెప్పవచ్చు. సీజన్ 2 లో మొదటి సీజన్ లో నటించిన వాళ్ళతో పాటు అర్జున్ రాంపాల్,కృతి ఖర్బందా వంటి యాక్ట్రెస్ కూడా జత కలిశారు. మొదటి సీజన్ లో కొన్ని డైలాగులు, సన్నివేశాలు ద్వందార్ధలతో కూడుకొని అసభ్యకరంగా ఉన్నాయనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో సీజన్ 2 ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రాలు సంయుక్తంగా దర్శకత్వం వహించగా,లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ నిర్మించాడు.      
'హనుమాన్'(Hanumaan)మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ని సంపాదించిన 'తేజ సజ్జ'(Teja Sajja)ప్రస్తుతం 'మిరాయ్'(Mirai)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో 'మంచు మనోజ్'(Manchu Manoj)ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల  రిలీజ్ చేసిన  గ్లింప్స్ లో సాలిడ్ యాక్షన్ లుక్ లో కత్తి పట్టుకొని 'ది బ్లాక్ స్వార్డ్'  గా మనోజ్  కనిపిస్తుండటంతో మూవీపై అందరిలో ఆసక్తి మరింత పెరిగింది.   చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ  షూటింగ్ ప్రస్తుతం ముంబై(Mumbai)లోని చారిత్రాత్మక గుహలలో జరుగుతుంది. ఈ  కొత్త షెడ్యూల్ లో తేజ సజ్జ తో పాటు, కొంతమంది ప్రధాన క్యారక్టర్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారు. హనుమాన్ తర్వాత వస్తున్న ఈ మూవీపై తేజ సజ్జ, మనోజ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.  'ఈగల్' మూవీ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని(karthik Gattamaneni)దర్శకత్వంలో తెరకెక్కుతున్న'మిరాయ్' లో రితికా నాయక్ (Ritika Nayak)హీరోయిన్ గా చేస్తుంది. పాన్ ఇండియా నటులు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతాన్ని అందిస్తున్నాడు. టెక్నీకల్ గా కూడా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జె విశ్వప్రసాద్(TJ Viswaprasad) నిర్మిస్తున్నాడు. ఆగస్టు 1  న రిలీజ్ అవుతుందని అధికారకంగా ప్రకటించారు.      
  The fixer is back — and so is the storm he leaves in his wake. Rana Naidu returns for a second season on June 13, diving deeper into the chaos of family, power, and personal demons. After becoming one of Netflix India’s breakout hits of 2023, the series is set to raise the stakes with more betrayal, reckoning, and high-octane drama. Produced by Sunder Aaron and Locomotive Global, the series is created by Karan Anshuman and directed by Karan Anshuman, Suparn S. Varma, and Abhay Chopra.   Featuring a powerhouse ensemble — Rana Daggubati, Venkatesh Daggubati, Arjun Rampal, Surveen Chawla, Kriti Kharbanda, Sushant Singh, Abhishek Banerjee, and Dino Morea — Rana Naidu Season 2 is ready to deliver a storm. With the family equations getting even more complicated and loyalties tested, the Naidus are just getting started.   Make way for the Naidus on June 13, only on Netflix.    
  తెలుగు సినిమా రంగంలో నాటికీ నేటికీ ఏనాటికి క్లాసిక్ "మాయాబజార్". ఈ సినిమా విడుదలై నేటికి 68 సంవత్సరాలు. "మాయాబజార్" చిత్రాన్ని ఈనెల 28న మహానటుడు ఎన్. టి. రామారావు 102వ జయంతి సందర్భంగా బలుసు రామారావు విడుదల చేస్తున్నారు .   ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రం. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి 'మాయాబజార్' చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు. దర్శకుడు కె.వి.రెడ్డి "మాయాబజార్" చిత్రాన్ని అపూర్వంగా, అనూహ్యంగా, అనితర సాధ్యంగా తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా మలిచారు.   "మాయాబజార్"  సినిమాకు పింగళి నాగేంద్ర రావు  అద్భుతమైన మాటలను అందించారు. ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్ లే ఈ సినిమాను నవరస భరితంగా తెరమీద చూపించారు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో ఈ చిత్రాల్లోని పాట్లను ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.   శ్రీకృష్ణుడు గా ఎన్. టి. రామారావు, ఘటోత్కచుడు గా ఎస్. వి. రంగారావు, శశి రేఖగా సావిత్రి, అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వర రావు ఆయా పాత్రలను సజీవంగా మన ముందు నిలబెట్టారు. 27 మార్చి 1957లో ఆంధ్ర దేశంలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను కలర్ లో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల కోసం రామారావు బలుసు ఈనెల 28న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.   ఈ సందర్భంగా మాయాబజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా TD జనార్దన్, రమేష్ ప్రసాద్, S.V కృష్ణారెడ్డి అచ్చి రెడ్డి, దర్శకుడు వీర శంకర్, భగీరథ, YJ రాంబాబు, త్రిపురనేని చిట్టి తదితరులు పాల్గొన్నారు.   ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌  శ్రీ టి.డి.జనార్ధన్‌ మాట్లాడుతూ.. "మాయాబజార్ సినిమా అప్పటి ఇప్పటి తరానికి ఒక మైలు రాయి లాంటిది. ఇప్పుటితరంలో ఎన్నో గ్రాఫిక్స్ వచ్చినా ఆనాడే గ్రాఫిక్స్ లేని సమయంలో ఎంతో అద్భుతంగా మాయాబజార్ ను మలిచి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు మాయాబజార్ ని బలుసు రామారావు విడుదల చెయ్యడం అభినందించదగ్గ విషయం. సినీరంగంలో రారాజుగా నిలిచిన ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓ ధృవతారగా అభివర్ణించారు. ఎన్టీఆర్‌ ముందు, తర్వాతగా తెలుగునాట రాజకీయాల్ని చెప్పుకోవాలని, రాజకీయాల్లో నైతిక విలువల్ని, ప్రజాస్వామ్య విధానాల్ని, సంక్షేమ శకాన్ని ప్రారంభించిన మహాపురుషుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. 2023లో ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీని ఏర్పాటు చేశాము, ఎన్టీఆర్‌ నమ్మి ఆచరించిన మహోన్నత ఆశయాలు, సిద్ధాంతాలు, విధానాల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తాము ఎన్టీఆర్‌కు సంబంధించిన అపురూప గ్రంధాలను వెలువరిచాము. మాయాబజార్ విడుదలై గొప్ప విజయం సాధిస్తుంది అని నమ్మకం నాకుంది. మే 28 న మహానాడులో పాల్గొంటున్న కారణంగా ఆ రోజు నేను మాయాబజార్ ను వీక్షించలేకపోయినా, కుటుంబ సమేతంగా మర్నాడు చూస్తాను. అందరూ దీనిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అన్నారు.   రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ కుటుంబానికి మా కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మా ఫాదర్, రామారావు గారు కలిసి తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. వాళ్ళ సేవలు చిరస్మరణీయం. మాయాబజార్ చిత్రాన్ని ఐమ్యాక్స్ థియేటర్ లో పెద్ద స్క్రీన్ లో విడుదల చెయ్యడానికి బలుసు రామారావు అనుమతి కోరారు. వెంటనే ఆమోదించాము." అన్నారు.   SV కృష్ణారెడ్డి మట్లాడుతూ.. "NT రామారావు గారు ఒక చరిత్ర, ఒక అధ్యాయం, ఆయననుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మాయాబజార్ చిత్రం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నేను ఐమ్యాక్స్ థియేటర్ లో రిలీజ్ రోజున రెండు టికెట్స్ బుక్ చేసుకున్నాను. మే 28 న అందరూ మాయాబజార్ ను థియేటర్స్ లో చూడండి." అన్నారు.   అచ్చిరెడ్డి మట్లాడుతూ.. "క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదల చెయ్యడం మన బాధ్యత. అదే మనం మహనీయులకు ఇచ్చే గౌరవం. బలుసు రామారావు మే 28 న మాయాబజార్ ను విడుదల చేసి గొప్ప పని చేస్తున్నారు. ఈతరం వారు కూడా చూడవలసిన సినిమా మాయాబజార్ అన్నారు." అన్నారు.   భగీరథ మాట్లాడుతూ.. "రామారావు గారిని కలిసి ఇంటర్వ్యూలు చేసే అదృష్టం నాకు దక్కింది. ఆయన డిసిప్లిన్, డెడికేషన్ ఎంతో ఉన్నతమైనవి. మే 28 న మాయాబజార్ ను రామారావు విడుదల చేయడం చాలా సంతోషం కలిగించింది." అన్నారు.   వీర శంకర్ మాట్లాడుతూ.. "బలుసు రామారావు నేను చాలా మంచి స్నేహితులం. మే 28 న మాయాబజార్ ను విడుదల చేస్తున్నారని చెప్పడంతో నేను సలహాలు, సూచనలు ఇచ్చాను. NT రామారావు గారితో ఉన్న అభిమానంతో బలుసు రామారావు తన స్వామి భక్తిని చాటుకుంటున్నాడు. ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని, మే 28 న అందరూ థియేటర్ కి వచ్చి మాయాబజార్ చిత్రాన్ని వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అన్నారు.   బలుసు రామారావు మాట్లాడుతూ.. "నేను రామారావు గారికి వీరాభిమానిని, రామారావు గారి దగ్గర పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన మీదున్న అభిమానంతో నేను మాయాబజార్ ను రిలీజ్ చేస్తున్నాను. నా కోసం వచ్చిన TD జనార్దన్ గారికి, రమేష్ ప్రసాద్ గారికి తదితరులకు రుణపడి ఉంటాను. మే 28 న అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను." అన్నారు.  
ఊహలు గుసగుసలాడే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన రాశిఖన్నా(Raashii Khanna)తొలిప్రేమ, సుప్రీం, జై లవకుశ, బెంగాల్ టైగర్, హైపర్, వెంకిమామ, శ్రీనివాస కళ్యాణం, ప్రతిరోజు పండగే, థాంక్యూ, పక్కా కమర్షియల్ ఇలా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. గత ఏడాది నవంబర్ లో హిందీలో'సబర్మతి రిపోర్ట్' తో తన  నటనలో ఉన్న కొత్త కోణాన్ని తెలియచేసింది. రీసెంట్ గా రాశిఖన్నా ఇనిస్టాగ్రమ్(Inistagram)వేదికగా తన చేతి వేళ్ళకి రక్తపు మరకలు అంటుకున్న పిక్ తో పాటు చెంపలపై  గాయాలైన పిక్స్ ని  షేర్ చేస్తు చేస్తు 'కథ డిమాండ్ చేస్తే గాయాలని కూడా లెక్క చెయ్యకూడదు. మనమే ఒక తుఫాన్ అయినప్పుడు ఏ పిడుగు ఆపలేదు అనే క్యాప్షన్ ని ఉంచింది. దీంతో నెటిజన్స్ రాశి ఖన్నా కి యాక్టింగ్ పట్ల ఉన్న కమిట్ మెంట్ ని మెచ్చుకుంటు కామెంట్స్ చేస్తున్నారు. రాశిఖన్నా ప్రస్తుతం హిందీలో'ఫర్జి 2'(farzi 2)అనే వెబ్ సిరీస్ లో చేస్తుంది. అందులోనే ఆమె గాయాల బారిన పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. 2022 లో నాగ చైతన్య తో కలిసి'థాంక్యూ'అనే మూవీలో మెరిసిన రాశిఖన్నా ఆ తర్వాత ఎలాంటి సినిమాలోను కనిపించలేదు. గత ఏడాది సిద్దు జొన్నల గడ్డ తో కలిసి 'తెలుసు కదా' అనే మూవీ అనౌన్స్ చేసింది. కొంతకాలం నుంచి ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్  లేదు.    
  భారతదేశంలో ఉన్న గొప్ప దర్శకులలో ఒకరిగా మణిరత్నంకి పేరుంది. ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించారు. మణిరత్నం దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని అప్పట్లో ఎందరో స్టార్స్ భావించేవారు. ఇప్పటికీ ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ అవకాశం టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని వరించినట్లు తెలుస్తోంది.   'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలతో టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరోగా నవీన్ పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ఏకంగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఇది తెరకెక్కనుందట. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించనుందని వినికిడి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది.   మణిరత్నం త్వరలో 'థగ్ లైఫ్' మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. కమల్ హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 6న విడుదల కానుంది.  
'విశాల్(Vishal)కి 2019 వ సంవత్సరంలో తెలుగు యాక్ట్రస్ అనీషా రెడ్డి(Anisha Reddy)తో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అనంతరం కొన్ని కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. దీంతో అప్పట్నుంచి విశాల్ పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో చాలా మంది హీరోయిన్ల పేర్లు బయటకి వచ్చాయి. కానీ ఆ తర్వాత అవి ఒట్టి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతు విశాల్ తన పెళ్లి గురించి వెల్లడించాడు. రీసెంట్ గా చెన్నైలో 'యోగి దా'(Yogi Da)సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి  విశాల్ ముఖ్యఅతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఈ సినిమా హీరోయిన్ ధన్సిక(Dhanshika)నేను పెళ్లి చేసుకోబోతున్నాం. నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటాం. నా బర్త్ డే డేట్ ఆగస్టు 29 న మా పెళ్లి జరుగుతుందని  చెప్పుకొచ్చాడు. అనంతరం ధన్సిక కూడా మాట్లాడుతు  విశాల్ తో తన పెళ్లి విషయం కన్ఫార్మ్ చేసింది. ఈ సందర్భంగా పలువురు సినీ, మీడియా ప్రముఖులు విశాల్, ధన్సిక కి కంగ్రాట్స్ చెప్పారు. తమిళనాడు(Thamilanadu)లోని తంజావూరు(Thanjavuru)కి చెందిన ధన్సిక 2006 లో విడుదలైన 'మనతోడు మజైకాలం' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2009 లో 'కెంప' అనే కన్నడ చిత్రంతో సోలో హీరోయిన్ గా మారి, ఆ తర్వాత తమిళంలో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు ఇరవై చిత్రాల దాకా చేసింది. 'కబాలి' లో రజనీకాంత్ కూతురిగా చేసి  తెలుగు ప్రేక్షకులని పరిచయమయ్యి, షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. యాక్షన్ సినిమాలకి ధన్సిక పెట్టింది పేరు. ప్రస్తుతం చేస్తున్న 'యోగి దా' మూవీలో ఎంతో రిస్క్ తో కూడిన ఫైట్స్ చేసింది. ఇక  కొన్ని రోజుల నుంచి విశాల్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రీసెంట్ గా  విల్లుపురం లోని ఒక ఫంక్షన్ లో కూడా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో విశాల్ పెళ్లి వార్త అభిమానుల్లో సరికొత్త ఆనందాన్ని తెచ్చింది. సినిమాల విషయానికి వస్తే విశాల్  ఈ ఏడాది జనవరిలో  'మదగజరాజ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.     
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో చదువుకున్న సాత్విక్ అనూహ్యంగా తెలుగు సినిమా దర్శకుడిగా మారాడు. తన కార్పొరేట్ ఆశయాలను సైతం పక్కనపెట్టి మెగాఫోన్ పట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సాత్విక్ ఐఐఎం విశాఖపట్నం నుండి పట్టభద్రుడయ్యాడు. చిన్నప్పటినుండి సినిమాల మీద ఉన్న ప్యాషన్ తో తాను చాలా మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులకి అందించాలని కలలు కన్నాడు. మేనేజ్మెంట్ లో తనకి ఉన్న నైపుణ్యాన్ని సినిమాల్లో ఉపయోగిస్తే చక్కటి ఫలితాలని అందుకోవచ్చని సాత్విక్ విశ్వసించాడు. ఈ క్రమంలో దర్శకుడిగా తన తొలి చిత్రం "వైభవం" ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రంతో రుత్విక్, ఇక్రా ఇద్రిసితో పాటు పలువురు కొత్త నటీనటులు పరిచయం కానున్నారు. మరి తెలుగు సినిమాల్లో సాత్విక్ తనదైన మార్క్ ను ఏర్పర్చుకోగలడా అన్నది వేచి చూడాలి.  
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడుగా కొనసాగుతున్న అజిత్(Ajith Kumar)రెండున్నర దశాబ్దాల క్రితమే 'ప్రేమలేఖ' సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. రీసెంట్ గా గత నెలలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి తమిళంతో పాటు తెలుగులోను మంచి విజయాన్ని అందుకున్నాడు. కారు రేసింగ్ లోను విశేష ప్రతిభ కనపర్చే  అజిత్ ఈ ఏడాది జనవరిలో దుబాయ్ లో జరిగిన  24 హెచ్ కారు రేసింగ్ పోటీల్లో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.         రీసెంట్ గా అజిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నాకు ఎంతో ఇష్టమైన రేసింగ్ అయ్యే ఖర్చుని నా చిన్నతనంలో అమ్మ, నాన్న భరించలేకపోయారు. కానీ నా ఇష్టానికి ఎదురుచెప్పలేదు. రేసింగ్ వైపు వెళ్తానని చెప్పగానే మా నాన్న నాతో మాట్లాడుతు రేసింగ్ చాలా ఖరీదైన ఆట. నేను నీకు సాయం చేయలేకపోవచ్చు. కానీ నువ్వే స్పాన్సర్స్ ని వెతుక్కొని కొనసాగించు,పూర్తిగా సహకరిస్తాం. సమయాన్ని వృధా చెయ్యకుండా, డిగ్రీ పూర్తి చెయ్యడమో లేక ఏదైనా పని చేసుకుంటూ రేసింగ్ లో పాల్గొనడమా చెయ్యాలని చెప్పాడు. దాంతో పని చేస్తూ రేసింగ్ లో పాల్గొన్నాను. అలాంటి అమ్మ నాన్న ఉన్నందుకు నేనెంతో అదృష్టవంతుడినని చెప్పుకొచ్చాడు. అజిత్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 1990 లో 'ఎన్ వీడు ఎన్ కనవార్' అనే చిత్రంలో ఒక చిన్న రోల్ తో అజిత్ కెరీర్ ని ప్రారంభించాడు. ఆ తర్వాత  1995 లో వచ్చిన 'ఆశై' మూవీతో సోలోహీరోగా హిట్ ని అందుకొని  ఇప్పటి వరకు 63 చిత్రాల దాకా చేసాడు. తన కొత్త చిత్రం నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.        
పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరిని, వారు చెప్పే కట్టు కథలను తెలివిగా ఎదుర్కోవలసి ఉంటుంది. మరికొన్నిసార్లు పిల్లలు చేసే తప్పులను, మోసాన్ని తట్టుకోవలసి వస్తుంది,  కొన్నిసార్లు  పిల్లల డిమాండ్లను నెరవేర్చవలసి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న ప్రతిదీ వారి మంచికోసమేనని, అది మంచి పనేనని భావిస్తుంటారు. దానికి అనుగుణంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే మంచి అనే భ్రమలో పిల్లల జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. దీనికి సంబంధించి విషయాలను పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు కూడా వెల్లడిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న తప్పులేంటో తెలుసుకుంటే.. నిర్ణయాలు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది కావాలంటే అది చేయనివ్వమని నిర్ణయాలు పూర్తీగా పిల్లల చేతుల్లో పెట్టడం  తరచుగా కనిపిస్తుంది. పిల్లలు  తమ కెరీర్‌లో ఏమి కోరుకుంటున్నారు, వారికి ఏమి కావాలి, పిల్లలు కోరుకుంటున్నది ఏంటి?  ఈ విషయాలన్నింటికి సంబంధించి  తల్లిదండ్రులు చాలావరకు పిల్లల ఇష్టానికి వదిలేశాం అని చెబుతూ ఉంటారు.  పిల్లల ఇష్టమే మా ఇష్టం, మేము మా అభిప్రాయాలు పిల్లల మీద రుద్దడం లేదు. అని చెప్పుకుంటూంటారు కూడా.   ఈ కారణంగానే పిల్లల కెరీర్, వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు వారి చేతుల్లోనే పెడుతుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదని పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు అంటున్నారు. తల్లిదండ్రుల తప్పేంటి? చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగినా దానికి నో చెప్పరు. దీనికి కారణం పిల్లలు ఇష్టమైన రంగంలో చాలా ఆసక్తి చూపిస్తారని దీని వల్ల వారు సులువుగా కెరీర్ లో విజయం సాధించి సెటిల్ అవుతారని నమ్మడం. కొందరు తల్లిదండ్రలు అయితే తమ పిల్లలు ఆసక్తి చూపించిన రంగంలో వారిని చేర్చి ప్రోత్సహించడానికి లక్షలాది రూపాయలు పోయడానికి అయినా సిద్దంగా ఉంటారు. కానీ పిల్లలు కెరీర్ లో విజయం సాదించలేకపోతారు. దీనికి కారణాన్ని పేరెంటింగ్ నిపుణులు కింది విధంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికాలం తల్లిదండ్రులు  చాలా బిజీ జీవితాలు గడుపుతున్నారు. పిల్లలకు ఏ లోటూ రాకూడదని లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టడానికి అయినా సిద్దమవుతారు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదు. ఆ లోటు భర్తీ చేయడానికి, అది బయటకు కనిపించకుండా ఉండటానికి వారు డబ్బును అడ్డు పెట్టుకుంటున్నారు. డబ్బుతో పిల్లలు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్జ తప్పు. చిన్న తనం నుండే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మార్గనిర్దేశకత్వం చేస్తూంటే అది వారి జీవితాన్నిసరైన దిశలో తీసుకెళ్తుంది. కేవలం డబ్బు వెచ్చింది పిల్లల బాగోగులను చూడటం అంటే అది కృత్రిమంగా పిల్లలను పెంచడం లాంటిది. అదే పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పటి నుండి వారి జీవితాన్ని  తోడ్పాటు ఇస్తూ వారి ఆలోచనలు సరైనవా కాదా అని వారితోనే చర్చింది ఆ తరువాత నిర్ణయం తీసుకునే అదికారం పిల్లలకు ఇస్తే అప్పుడు పిల్లలకు తమ జీవితంలో సాధించాల్సింది ఏంటి అనే విషయం మీద స్పష్టత వస్తుంది. అలా కాకుండా పిల్లల జీవితం ఎదగడానికి కేవలం డబ్బు సరిపోతుందని తల్లిదండ్రులు బావిస్తే అది చాలా పొరపాటు అవుతుంది.                                              *నిశ్శబ్ద.  
  ఈ కాలంలో అమ్మాయిలు బాగా అప్డేట్ అయ్యారు. వాళ్ళు ప్రతి విషయంలో ప్లానింగ్ గా ఉంటారు. ముఖ్యంగా చదువు, ఉద్యోగం, భాగస్వామి, ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా వ్యక్తిగత విషయాలలో ఏ మాత్రం తగ్గకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. భారతీయ జనాభాలో అమ్మాయిలు, అబ్బాయిలా సగటు నిష్పత్తి చూస్తే అమ్మాయిల శాతం తక్కువగా, అబ్బాయిల శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా పెళ్లి కావాల్సిన అబ్బాయిలకు అమ్మాయిలను వెతకడం కాస్త కష్టమవుతోంది. మొదటే అమ్మాయిల కొరత అంటూ ఉంటే, ఇంకా అమ్మాయిల గట్టి నిర్ణయాల వల్ల అబ్బాయిలు, అబ్బాయిలు తల్లిదండ్రులు కిందామీదా అయిపోతున్నారు పెళ్లి విషయంలో. వాటికి తగ్గట్టు ఈకాలంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని బాగా చేసుకుంటున్నారని బుద్ధి సగటు తల్లిదండ్రులకు కలిగినప్పటి నుండి అడపిల్లల్ని కూడా ఏమాత్రం తక్కువలేకుండా చదివించడం చేస్తున్నారు. అందుకే అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు వేటలో ఉన్నారు అమ్మాయిల కోసం. వధువు కావలెను అనే బోర్డ్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. వధువులు ఓకే చెప్పడానికి అబ్బాయిలలో కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవేంటి మరి?? చదువు! సాధారణంగా ఈ కాలంలో విద్యావంతురాళ్లు అయిన అమ్మాయిలే ఎక్కువ. కనీసం గ్రాడ్యుయేట్ అయినా పూర్తి చేసినవాళ్ళు ఉంటారు. ప్రభుత్వ పథకాలు, రీయింబర్స్మెంట్స్ పుణ్యమా అని అమ్మాయిలు కూడా ఇంజనీరింగ్, పీ.జీ, పీ.హెచ్.డి పట్టాలు చక్కగా అందుకుంటున్నారు. ప్రతి అమ్మాయి తనకంటే విద్యాధికుడిని భర్తగా కోరుకుంటుంది. అంటే అమ్మాయి కంటే అబ్బాయి మరింత విద్యాధికుడు అయి ఉండాలి.  ఉద్యోగం! ప్రభుత్వ ఉద్యోగస్తుడిని చేసుకుంటాను అని గిరి గీసుకుని కూర్చునే అమ్మాయిలు ప్రస్తుతమైతే లేరు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు అయితే అటువైపు ఆలోచన చేస్తారు. ఈ కాలంలో మంచి విద్యార్హతకు ప్రయివేటు సంస్థలలో చాలా మంచి అవకాశాలే ఉంటున్నాయి. కాబట్టి సంపాదన బాగా ఉంటే ఉద్యోగానికి వంక పెట్టడం అమ్మాయిలు చెయ్యరు.  ఆర్థిక విషయాలు! చాలామంది అంటూ ఉంటారు మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి అని. నిజం చెప్పాలంటే ఈ కాలంలో డబ్బు లేకుండా బతికే మహానుభావుడు ఎవరూ ఉండరు. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండేవాడికే జీవితంలో కాసింత ఆర్థిక లోటు లేకుండా సమస్యలను డీల్ చేయగలిగే సత్తా ఉంటుంది. ఎందుకంటే 99% సమస్యలు అన్నీ ఆర్థికంగా ఎదురవుతున్నవే ఉంటున్నాయి ఈ కాలంలో. అందుకే ఆర్థిక విషయాలలో సరైన ప్లానింగ్ ఉన్నవాళ్లకు అమ్మాయిలు  పెద్ద పీట వేస్తుంటారు. ప్రైవేట్ అండ్ పర్సనల్ స్పేస్! ప్రతి వ్యక్తికి కాసింత స్పేస్ అవసరం. భార్యాభర్తల మధ్య దాచాల్సిన పర్సనల్స్ ఏమి ఉంటాయి. భర్తకు తెలియకుండా బయట పనులు ఏమి ఉంటాయి అనేది కొందరి వాదన. అయితే గూడాఛారిలాగా ప్రతి విషయం మీద నిఘా పెడుతూ ఉంటే మాత్రం ఏ అమ్మాయి కూడా భరించలేదు. ప్రతి విషయాన్ని ఇంట్లో అత్తకు, మామకు, భర్తకు చెప్పి తీరాలి అనే డిమాండ్స్ కు అమ్మాయిలు చాలా వ్యతిరేకం. కాసింత స్వేచ్ఛను గనుక అమ్మాయిలకు ఇవ్వగలిగితే వాళ్ళు చేసే ప్రతి పనిని తమకు తామే ఇంట్లో వాళ్లకు చెబుతారు. ఇక్కడ ఒక చిన్న ఇగో అండ్ డామినేషన్ లైన్ ఉంటుంది దాన్ని చెరుపుకోవడం లేదా ఆ చిన్న గీతను పెంచి పెంచి పెద్ద గోడలాగా మార్చడం ఆ కుటుంబంలో అందరి ప్రవర్తన మీదా ఆధారపడి ఉంటుంది. ప్రాధాన్యతలు! అమ్మాయిల ప్రాధాన్యతలు ఎప్పుడూ ఫ్యూచర్ ప్లాన్స్ మీదనే ఉంటాయి. అలాగని ప్రస్థుతాన్ని అసలు విస్మరించేవాళ్లేమి కాదు. భర్త తన తల్లిదండ్రులకు ఎంత ఇంపార్టెన్స్ అయినా ఇవ్వచ్చు, కానీ భార్యకు అంతకంటే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇంకా సమస్యలను నలుగురి ముందు చెప్పి, చుట్టాలు పక్కాల మధ్య పంచాయితీలు పెట్టించి బాపతు అబ్బాయిలకు, భార్యాభర్తల వ్యక్తిగత విషయాలలో వేరే ఎవరో జోక్యం చేసుకోవడం వంటి వాటికి అమ్మాయిలు విరుద్ధం మరి. వీటన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అబ్బాయిలు ఏ పనిని అయినా సొంతంగా చేయడం, సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ప్రతి విషయానికి ఇతరుల నిర్ణయాల మీద డిపెండ్ అయ్యేవాడు అయితే అసలు భరించలేరు.  అమ్మాయిలు ఒకే చెప్పాలంటే కొంచం చూసుకోండి మరి!!                                 ◆వెంకటేష్ పువ్వాడ.    
   ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. చాలా మంది కొన్ని రోజుల రిలేషన్ లో ఉన్న  తర్వాత విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మధ్య  సంబంధం బలహీనపడుతుంది. ఈ తప్పుల వల్ల  రిలేషన్  లోతును,  దాని బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమ అయినా, పెళ్లి అయినా, స్నేహం అయినా.. ఇలా ఏ రిలేషన్ అయినా సరే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.  ఆ నియమాలను తెలుసుకోకపోతే ఎంత మందితో కొత్తగా రిలేషన్ మొదలుపెట్టినా సరే.. అది తొందరగా బ్రేకప్ అవుతుంది.  ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తలు వారి రిలేషన్ లో ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించాలి. నమ్మకం.. సంబంధంలో నమ్మకం లేకపోతే దాని పునాది బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో  భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకూడదు. ఇద్దరి  మధ్య ఏదైనా అపార్థం ఉంటే ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడి, అపార్థాన్ని తొలగించుకోవాలి. ఏ సంబంధంలోనైనా ఓపెన్ గా మాట్లాడటం,  సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఇద్దరి మధ్య  సమన్వయం కూడా పెరుగుతుంది. స్వేచ్ఛ.. ప్రతి సంబంధంలో ఎదుటి వ్యక్తికి స్పేస్  ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తమ హక్కులను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు, ఎదుటి వారి స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే భార్యాభర్తలు తమ భాగస్వాములకు  స్పేస్ ఇవ్వాలి. వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే భాగస్వామి సంబంధంలో ఊపిరాడకుండా పోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు  సంభాషించకపోతే, సంభాషణలో పారదర్శకత ఉండదు. మాట్లాడకపోవడం వల్ల ఇద్దరి మధ్య  అపార్థాలు ఏర్పడతాయి. దీని కారణంగా సంబంధం  పునాది బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. శ్రద్ద.. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఏం తింటావని అడగడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, నచ్చిన చోటకు వెళ్లడం, గొడవను పెద్దవి చేసుకోకుండా ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వంటివి చేస్తుంటే భాగస్వామికి  ఖచ్చితంగా నచ్చుతుంది. వారు ఎల్లప్పుడూ బంధంలో ఉండాలని అనుకుంటారు.  ఏవైనా గొడవలు జరిగినా వాటిని పరిష్కరించుకుని బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటారు. పోలిక.. భార్యాభర్తలు ఇద్దరూ ఎవరూ ఎవరిని ఇతరులతో పోల్చకూడదు.  బయట సంబంధంలో ఉన్నవారిని,  ఇతరులను చూసి వాళ్లు బాగున్నారు, వాళ్లు మంచివారు,  నువ్వు చెడ్డ.. ఇలాంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలా పోలిస్తే అది వారి మనసును బాధపెడుతుంది.  తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని భావిస్తారు.  దీనివల్ల బంధంలో అప్యాయత తగ్గుతుంది.                                                   *రూపశ్రీ.  
ఉదయం లేవగానే రోజు మొదలుపెట్టాలంటే టీ కావాలి. డ్యూటీ మధ్యలో కాస్త బయటకు వెళ్ళాలంటే టీ బెస్ట్ సాకు, సాయంత్రం స్నేహితులతో కలసి టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ చాయ్ తాగితే ఆ ఫీల్ వేరు.  టైమ్ పాడు లేకుండా టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీ కొట్టు ఓపెన్ చేశాక కట్టేసేవరకు స్టౌ మీద టీ ఉడుకుతూనే ఉంటుందంటే టీ కి ఉన్న గిరాకీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీ కహానీ ఎందుకంటారా? టీ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వేడి వేడి టీలో బిస్కెట్లు ముంచుకుని తింటే మరీ ఇష్టం. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, అప్పటికప్పుడు హాట్ హాట్ గా బేక్ చేసిన బిస్కెట్లు.. ఓయబ్బో టీ పక్కనే వయ్యారాలు పోతాయి బిస్కెట్లు. కానీ టీతో బిస్కెట్లు తినడం మహా ఇష్టమైన వారికి బ్యాడ్ న్యూస్.. దీని వల్ల బోలెడు నష్టాలున్నాయి. టీతో బిస్కెట్ తింటే కలిగే నష్టాలేంటి? టీ తో ఏం తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువ. ఇక టీ బిస్కెట్ కాంబినేషన్ కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టీ బిస్కెట్ వల్ల ఆరోగ్య నష్టాలున్నాయి. యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి  టీ తో బిస్కెట్ తినడం ఒక కారణంగా తెలుస్తోంది. టీ బిస్కెట్ కాంబినేషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెజబ్బులకు ప్రధానకారణం అవుతుంది. బిస్కెట్ల తయారీకి శుద్ది చేసిన పిండి, శుద్ది చేసిన పంచదార ఉపయోగిస్తారు. ఇది శరీరంలో ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. మరొకవైపు ఇది జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది. బిస్కెట్లు ఎక్కువగా ప్రాసెస్ చేయబడే ఆహారం. ఇందులో  BHA (butylated hydroxyanisole),  BHT (butylated hydroxytoluene) ఉంటాయి. ఇవి మానవ శరీరంలో ఉండే DNA ను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్  ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. టీతో వేయించిన శనగలు తింటే.. వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచిదం. టీ టైమ్ లో స్నాక్ గా వేయించిన శనగలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన శనగలు ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది కాబట్టి బి-విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, మెగ్నీషియం శనగలలో పుష్కలంగా ఉంటుంది. శనగలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అయిన కోలిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లకు బదులు వేయించిన శనగలు తింటే మంచిది.                                          *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. అయితే ఈ పోషకాల విషయానికి వస్తే, చాలా మందికి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లేదా ఫైబర్ గురించి మాత్రమే తెలుసు. ఇవన్నీ శరీరానికి చాలా అవసరం. కానీ వీటికంటే ప్రభావవంతమైనది, శరీరానికి తప్పనిసరిగా కావాల్సినది మరొకటి  ఉంది, ఇది శరీరం  మెరుగైన పనితీరుకు అవసరం. ఇది లోపిస్తే శరీరం అంతా నీరసంగానూ, ఏ చిన్న పనిచేసినా అలసటగానూ అనిపిస్తుంది. ఎన్ని పోషకాలు తీసుకున్నా, ఎంత బలవర్థకమైన ఆహారం తీసుకున్నా ఈ ఒక్కటి తక్కువై శరీరం నిలదొక్కుకోలేదు. అంతటి శక్తివంతమైన   పదార్థం  మెగ్నీషియం. మెగ్నీషియం కేవలం శారీరక బలానికే కాదు అనేక మానసిక భావోద్వేగాలకు కూడా  ఇది ఎంతో  అవసరం. ఇది  శరీరంలో కండరాలను నిర్మించడానికి  నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపం  ఏర్పడితే  కండరాల తిమ్మిరి, నరాల  బలహీనత, కండరాలు మెలితిప్పినట్లు, శరీరంలోని వివిధ ప్రాంతాల్లో  తిమ్మిరి లేదా జలదరింపు వంటి అనేక లక్షణాలను కనిపిస్తాయి. శరీరంలో మెగ్నీషియం లోపం ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంది.  విటమిన్ డి లోపం  వల్ల మెగ్నీషియం లోపిస్తుంది, యాంటాసిడ్‌ల మితిమీరిన వినియోగం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, తీవ్రమైన విరేచనాలు, ఆహారంలో తక్కువ మెగ్నీషియం గల ఆహారాలను చేర్చకపోవడం వంటి అనేక కారణాల వల్ల శరీరంలో ఈ ముఖ్యమైన మూలకం లోపం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా, గర్భధారణ సమయంలో మెగ్నీషియం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం లోపాన్ని నివారించడానికి  ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఈ కింది ఆహారాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  బాదంపప్పులో మెగ్నీషియం ఉంటుంది.  10గ్రాముల బాదం పప్పులో  రోజువారీ శరీరానికి కావలసిన  మెగ్నీషియంలో 20% (76 mg) లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి,  మెగ్నీషియం శరీరానికి అందడానికి  ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం మంచి మార్గం. గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది  తమ ఆహారం ద్వారా మెగ్నీషియం  తగినంతగా పొందలేరు. ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటూ ఉంటే ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు. అరటిపండ్లు  ఎముకలను బలపరిచే పొటాషియం అధికంగా ఉండే పండు. ఒక మధ్యస్థ అరటిపండు 10.3 mg విటమిన్ సి,  32 mg మెగ్నీషియంను  అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. పాలకూర అందరికీ అందుబాటులో ఉంటే ఆకుకూర. పాలకూరలో మెగ్నీషియం మాత్రమే కాదు ఐరన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కాబట్టి ఐరన్, మెగ్నీషియం లోపంతో ఇబ్బంది పడేవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి.   జీడిపప్పులో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జీడిపప్పులో ఉంటాయి. ప్రతిరోజూ కాసింత జీడిపప్పు తీసుకోవడం వల్ల ఇది మెగ్నీషియంతో పాటు, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా పొందవచ్చు.  ఇవి కాకుండా, వోట్మీల్, బ్రౌన్ రైస్, వేరుశెనగ నూనె, చియా గింజలు,  బీన్స్‌లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  పేరుకు ఇది కూరగాయ కానీ ఇది  అన్ని రకాలుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. కూరల్లో అయినా, బజ్జీలలో అయినా, వేపుళ్లలో అయినా,  చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నోరూరించే తినుబండారాలలో అయినా బంగాళదుంప చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఏ కూర చేస్తున్నా సరే..అందులో బంగాళదుంప ముక్కలు జోడిస్తే కూరలకు రుచి రెట్టింపు అవుతుంది. ఎంతో రుచిగా ఉండే బంగాళదుంపను తినడానికి చాలా మంది చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే బంగాళదుంపలను ఎడా పెడా తింటే మాత్రం కొంపలు ముంచుతుందట.  ఇంతకీ బంగాళదుంపలు ఆరోగ్యానికి చేసే చేటు ఏంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారట.  బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి అదనపు కేలరీలుగా పొట్టలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. దీని కారణంగా బరువు ఈజీగా పెరుగుతారు. రక్తపోటు.. రక్తపోటు లేదా బీపీ ఇప్పట్లో చాలామందికి వస్తున్న సమస్య.  చిన్న వయసులోనే బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉంటున్నారు.  ఇలాంటి వారు బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోకూడదట.  బంగాళదుంపలు  బీపీ సమస్యను మరింత పెంచుతాయట. ఆర్థరైటిస్.. ఆర్థరైటిస్ సమస్య చలికాలంలో చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజులలో కూడా ఆర్థరైటిస్ సమస్య కారణంగా  ఎముకలు, కీళ్ల సమస్యలు పెరుగుతాయి.  బంగాళదుంపలు తింటే ఆర్థరైటిస్ సమస్య మరింత తీవ్రం అవుతుంది.  ఇందులో కార్బోహైడ్రేట్లు ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయి. జీర్ణసమస్యలు.. బంగాళదుంపలలో పిండి పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది గ్యాస్, ఉబ్బరం,  మలబద్దకం వంటి సమస్యలు సృష్టిస్తుంది.  బంగాళదుంపను అతిగా తింటే పై సమస్యలు అధికం అవుతాయి. మధుమేహం.. మధుమేహం ఉన్నవారికి నిషేధించిన ఆహారాలలో బంగాళదుంప కూడా ఒకటి.  బంగాళదుంపలు తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య మరింత పెరుగుతుంది.  బంగాళదుంపలలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. కంటి సమస్యలు.. బంగాళదుంపలలో సోలనిన్ అనే రసాయనం ఉంటుంది.  ఇది కంటి సమస్యలను కలిగిస్తుంది.  బంగాళదుంపలను ఎక్కువగా తీసుకునేవారు తొందరగా కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...