LATEST NEWS
  భువనగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి నరసింహారెడ్డి మంగళవారం (జులై 7)  ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన  విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు.   సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.   నరసింహారెడ్డి  తన 19 ఏళ్ల వయసులోనే..  1962లో బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భువనగిరి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్ తరపున భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని రెండోసారి కూడా కాంగ్రెస్  ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.   Bhuvanagiri, Former, Mla, Values
వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు ఆర్కే రోజా దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. వైసీపీ సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆర్కే రోజా.. మావిగన్ అంటే అమరావతేనని కుండబద్దలు కొట్టేశారు. ఓ వైపు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి.. వచ్చే ఎన్నికలలో తమ నినాదం మావిగన్ అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయనీ, మావిగన్ కు మద్దతు ఇచ్చే వారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓటు వేస్తారనీ, ఎవరు గెలుస్తారో చూద్దామనీ సవాళ్లు విసురుతుంటే.. ఆర్కే రోజా మాత్రం మావిగన్, అమరావతీ ఒక్కటేననీ, ఏమీ తేడాలేదనీ చెబుతూ జగన్ గాలి తీసేశారు.  జగన్ మావిగన్ ప్రతిపాదన తరువాత.. వైసీపీ ఆ పేరును తెగ ప్రచారం చేస్తున్నది. అయితే..  జగన్, వైసీపీ నేతల ప్రచారం జనాలు పెద్దగా పట్టించుకోలేదనుకోండి అది వేరు సంగతి.  జనం దాకా ఎందుకు వైసీపీలో పలువురు నేతలు కూడా మావిగన్ ప్రతిపాదనపై పెదవి విరిచారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెంది ధర్మాన వంటి నేతలైతే.. అంతర్గత సంభాషణల్లో జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  ఇక ఇప్పుడు తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత మావిగన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రోజా తన అయోమయాన్ని బయటపెట్టుకున్నారు. అదే సమయంలో మావిగన్ పట్ల తన వైఖరినీ బయటపెట్టారు. మావిగన్, అమరావతి రెండూ ఒకటే కదా అని రోజా ఆ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో మావిగన్ ను ప్రమోట్ చేస్తున్న వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిపోయింది. తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రం రోజా వ్యాఖ్యలను తెగ వైరల్ చేస్తున్నారు. మావిగన్, అమరావతి ఒకటే అయినప్పుడు జగన్ మావిగన్ పాట పాడటం ఎందుకు, అమరావతిపై విషం చిమ్మడం ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. జగన్ మావిగన్ జపం మాని రోజాను ఫాలో అవుతూ రెండూ ఒకటే అని ప్రకటించేయవచ్చుగా అంటూ వైసీపీలో మావిగన్ వ్యతిరేకులు కూడా అంటున్నారు.   జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన, ఆయన పార్టీ నేతలూ    అమరావతిని  శ్మశానంతో పోలుస్తూతీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న అమరావతిపై విషం చిమ్ముతున్నారు. తాను అధకారంలోకి వస్తే.. మావిగన్ ను ఏపీ రాజధానిగా చేస్తామంటూ జగన్ ప్రకటనను గుప్పిస్తున్నారు. అయితే..  అనూహ్యంగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. అమరావతికి అనుకూలంగా గళం ఎత్తడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    అభివృద్ధి, వైభవం పరంగా అమరావతి  అంతటి  స్థాయి కలిగిన ప్రాంతమని రోజా అనడంతో వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా జగన్ ఏం మాట్లాడాలో అర్ధం కాని అయోమయంలో పడిపోయారు.   రోజాయే అమరావతి మావిగన్ ఒకటే అని చెప్పడంతో జగన్ మావిగన్ ప్రతిపాదనపై నెటిజనులు తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ అయోమయానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. అమరావతిపై అకారణ ద్వేషం వినా.. వైసీపీకి రాజధాని విషయంలో ఒక క్లారిటీ అంటూ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  Roja Comments on Amaravati, YCP Capital Row, Roja Mavigan Controversy, AP Politics, Telugunews
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిపై తాడికొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగువన్ ఇంటర్వ్యూ లో ఆమె అమరావతిపై జగన్ కుట్రలను బయటపెట్టారు. అందరూ జగన్ ను సైకో సైకో అంటారు కానీ  తాను జగన్ సైకో తో పాటు శాడిస్ట్ కూడా అంటానన్నారు.  ఇటీవల విజయవాడలో ఒక పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జగన్, అమరావతి రాజధాని కాదంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ  హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన పరిణామాలను, దళిత ప్రతినిధులుగా తాము అనుభవించిన మానసిక క్షోభను   వివరించారు. 2019 ఎన్నికల సమయంలో తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవి..  అప్పట్లో సర్వేల ఆధారంగా అత్యంత క్లిష్టమైన రాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు. అయితే..  గెలిచిన తర్వాత జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పుడు, ఆయన కనీస గుర్తింపు ఇవ్వకుండా కేవలం తన బొమ్మ చూసి మాత్రమే గెలిచారంటూ చులకనగా మాట్లాడారని  ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో జగన్ వైఖరి అత్యంత దారుణంగా ఉండేదన్న ఆమె..   పరిపాలన సాగించే క్రమంలో దళిత ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను ఆయన ఏనాడూ గౌరవించలేదని, కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకున్నారన్నారు.  అధికారంలో ఉన్న పార్టీని, పదవులను వదులుకుని తాము బయటకు రావడానికి జగన్ పెట్టిన టార్చరే కారణమని శ్రీదేవి కుండబద్దలు కొట్టారు. 2023లోనే తాను వైసీపీని వీడి అప్పటి ప్రతిపక్షంలోకి రావడం వెనుక ఎంతో మానసిక సంఘర్షణ ఉందన్నారు. ఒక దళిత మహిళా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితిని కల్పించారని, రాజధాని ప్రాంత రైతులపై దాడులు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేక తీవ్ర వేదన అనుభవించానని పేర్కొన్నారు. అమరావతి, మూడు రాజధానులు, వైజాగ్ కాపురం, ఇప్పుడు కొత్తగా  మావిగన్ అంటూ జగన్ మోహన్ రెడ్డి పదేపదే మాటలు మార్చడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఉండవల్లి శ్రీదేవి విశ్లేషించారు. నాడు కోర్టు ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులు అమరావతిలో పనులు చేస్తున్నట్లు కేవలం ఒక గంట పాటు డ్రామాలు ఆడారని, అదంతా కేవలం ప్రదర్శన  కోసమేనని  బయటపెట్టారు. రాజధాని కోసం ఒక్క పైసా ఆశించకుండా 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వానికి ఎన్నడూ   ప్రేమ లేదన్న శ్రీదేవి ఐదేళ్ల పాటు రైతులను నానా ఇబ్బందులు పెట్టిన జగన్..  ఇప్పుడు మళ్లీ వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య పరస్పర విభేదాలు సృష్టించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే జగన్ అసలు వ్యూహమని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రాయల్‌గా సచివాలయానికి వస్తూ, రాజధాని అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని శ్రీదేవి కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకులు చేసే తాత్కాలిక రాజకీయాలు ఇకపై సాగవని, ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని శ్రీదేవి అన్నారు.    Undavalli Sridevi Exclusive Interview, YS Jagan Mohan Reddy Strategy, Amaravati Capital Issue, Tadikonda Ex MLA Sridevi, Chandrababu Naidu Secretariat  
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల కోసం ప్రాణాలర్పించే కార్యకర్తల వాస్తవ పరిస్థితిపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యక ఇంటర్య్వూలో  తెలుగుదేశం సీనియర్ కార్యకర్త సిరిపురం శ్రీధర్  మాట్లాడారు. ఎన్నికల సమయంలో, పార్టీ ఉద్యమాల్లో జెండాలు మోసి, ప్రత్యర్థులతో పోరాడే సాధారణ కార్యకర్తలు చివరకు కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా వారిని పట్టించుకోవడం లేదనే చేదు నిజాన్నిఆయన ఇసుమంతైనా సంకోచం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు కార్యకర్తలను కేవలం వాడుకుని వదిలేస్తున్నాయా  అంటే ఔననే అనాలని సిరిపురం శ్రీధర్ అన్నారు.  తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా రాజకీయ కక్ష సాధింపులు, కేసుల పరంపర విపరీతంగా పెరిగిపోయింది. పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని, ఆవేశంతో ముందుకెళ్లే యువత, కార్యకర్తలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ   సీనియర్ కార్యకర్త, బ్రాహ్మణ చైతన్య వేదిక నిర్వాహకుడు సిరిపురం శ్రీధర్  పార్టీ కోసం చేసిన ఉద్యమాల్లో భాగంగా తనపై గతంలో దాదాపు 20 కి పైగా రాజకీయ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఒకసారి కేసుల్లో ఇరుక్కున్న తర్వాత సమాజంలో, కుటుంబంలో ఎదురయ్యే అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల విచారణ కోసం కోర్టులకు ఫీజులు చెల్లించలేక, చివరకు తల్లిదండ్రుల దగ్గర అడుక్కుని లేదా అప్పులు చేయాల్సిన దుస్థితి కార్యకర్తలకు వస్తోందని పేర్కొన్నారు. నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ  అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప,   లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.  ప్రతి రాజకీయ పార్టీలోనూ నిజమైన ఉద్యమ స్ఫూర్తితో పనిచేసేవాళ్లు వేళ్ల మీద లెక్కపెట్టేంత మందే ఉంటారన్న ఆయన మిగిలిన వారంతా కేవలం టీవీల్లో, ఫొటోల్లో కనిపించాలనే  బ్యాచ్ మాత్రమే అని శ్రీధర్ చెప్పారు.  వ్యక్తిగత ఆస్తుల గొడవలు లేదా సంఘవిద్రోహ చర్యల వల్ల వచ్చే కేసుల గురించి తాను మాట్లాడటం లేదని..  కేవలం పార్టీ పిలుపు మేరకు ఉద్యమాల్లో పాల్గొని అన్యాయంగా జీవితాలను నాశనం చేసుకుంటున్న జెన్యూన్ కార్యకర్తల కోణంలోనే ఈ వాదన  వినిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏదో ఒక రాజకీయ పార్టీని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలలోనూ ఇదే పంథా నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తలను వాడుకోవడం, ఆపై కేసులు కాగానే వదిలేయడం అనే సంస్కృతి మారాలని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. యువత రాజకీయ ఆవేశంలో ఊగిపోయి వివాదాల్లో చిక్కుకోకుండా, కేసులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హితవు పలికారు.   Siripuram Sridhar Interview, Political Party Workers Cases, TDP Leader Sensational Comments, Political Cases On Youth, Tone News Telugu, AP Politics Reality
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్  యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్  ప్రశ్న రావణ్  అరెస్టు,  ఆయనపై నమోదైన సెక్షన్ల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గన్నవరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే..  ఈ కేసులో సాధారణ  సెక్షన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ప్రయోగించే అత్యంత కఠినమైన చట్టం  ఉపా  అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 39ను కూడా చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది.  ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు,  ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు. సాధారణంగా దేశద్రోహ శక్తులు, ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నవారిపై ప్రయోగించే ఈ చట్టాన్ని ఒక యూట్యూబర్‌పై ప్రయోగించడం వెనుక ఉన్న న్యాయపరమైన సాధ్యాసాధ్యాలను ఆయన  వివరించారు.  మాజీ జడ్జి రామకృష్ణ విశ్లేషణ ప్రకారం.. ఉపా  చట్టం కింద కేసు నమోదైతే నిందితుడికి సాధారణ కోర్టుల్లో అంత సులభంగా ఉపశమనం లభించదు. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కేసులను ఎన్ఐఏ  ప్రత్యేక  కోర్టులు లేదా హైకోర్టులు మాత్రమే విచారిస్తాయి. అంతే కాకుండా, ఈ చట్టం కింద నమోదైన సెక్షన్ల ప్రకారం నిందితుడికి త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు.  విచారణ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రావణ్ కేసులో కేవలం దూషణలు, రాజకీయ విమర్శలే కాకుండా ఉపా చట్టం పరిధిలోకి వచ్చే వ్యూహాత్మక అంశాలు లేదా ఆడియో క్లిప్పింగుల ఆధారంగా పోలీసులు బలమైన సాక్ష్యాలను సిద్ధం చేసి ఉంటారని   అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ సెక్షన్లను ఉన్నతాధికారులు,  న్యాయస్థానాలు ప్రాథమికంగా అంగీకరిస్తే.. రావణ్‌ను ఈ కేసుల నుండి రక్షించడం చట్టపరంగా చాలా కష్టమైన విషయమని మాజీ న్యాయమూర్తి   చెప్పారు.  రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నప్పటికీ..  మాట్లాడే భాష చట్టపరిధిని దాటినప్పుడు ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రామకృష్ణ అన్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో ఈ కేసు చుట్టూ తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు ఈ చట్టం ప్రయోగాన్ని కక్షసాధింపుగా అభివర్ణిస్తుండగా..  చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా శిక్షార్హులేనని అధికార పక్షం వాదిస్తోంది.   పూర్తి ఇంటర్వ్యూ తెలుగువన్ చానల్ లో వీక్షించండి Former Judge Ramakrishna Legal Analysis, Andhra Pradesh Police Ravan Arrest, Chandrababu Pawan Kalyan YouTuber Case, AP Politics Social Media Arrests    
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రతిభావంతుడైన నటుడు, రచయిత అడివి శేష్ ఇప్పుడు కీలకమైన అడుగు వేయబోతున్నారు. కమర్షియల్ ఫార్ములాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, కేవలం కంటెంట్‌కు మాత్రమే అత్యంత ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో వరుస విజయాలను అందుకున్న అడివి శేష్, ఇప్పుడు బాలీవుడ్‌లో నేరుగా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో దేశవ్యాప్త ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు నేరుగా హిందీ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండటం ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, అడివి శేష్ ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సరికొత్త హిందీ యాక్షన్ డ్రామా చిత్రం ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. రాబోయే సెప్టెంబర్ నెలలో చిత్రానికి సంబంధించిన పూర్తి స్థాయి కాస్టింగ్ ప్రక్రియను ముగించి, ఆ వెంటనే అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్రబృందం ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే, ఈ సినిమా టైటిల్, దీనిని తెరకెక్కించబోయే దర్శకుడి పేరు, అలాగే నిర్మాణ సంస్థ వంటి అత్యంత కీలకమైన వివరాలను చిత్ర యూనిట్ ప్రస్తుతానికి చాలా గోప్యంగా ఉంచింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో కేవలం నటుడిగానే కాకుండా 'క్షణం', 'గూఢచారి' వంటి విభిన్నమైన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించి రచయితగా కూడా తన అద్భుతమైన ప్రతిభను నిరూపించుకున్నారు అడివి శేష్. ఆయన కథల ఎంపికలో ఎప్పుడూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' చిత్రాలతో పాటు, 26/11 ముంబై ఉగ్రదాడుల్లో దేశం కోసం వీరమరణం పొందిన అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'మేజర్' చిత్రం దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా అడివి శేష్‌కు హిందీ బెల్ట్‌లో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడు అదే పవర్‌ఫుల్ ఇమేజ్‌తో ఆయన నేరుగా బాలీవుడ్ హిందీ చిత్రసీమలో అడుగుపెడుతుండటం బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు, ఇటీవల విడుదలైన 'డెకాయిట్' చిత్రంలో కూడా అడివి శేష్ సరికొత్త రొమాంటిక్ యాక్షన్ అవతారంలో కనిపించి అందరినీ మెప్పించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ప్రేమ, ప్రతీకారం, హై-వోల్టేజ్ యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం ద్వారా కూడా అడివి శేష్ హిందీ ప్రేక్షకులను మెప్పించాడు.  కథ బలాన్ని నమ్ముకునే నటుడిగా ఆయనకున్న నమ్మకమైన పేరు, సాధించిన వరుస విజయాలు, ముంబై ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ఈ కొత్త బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు విడుదలకు ముందే విపరీతమైన హైప్‌ను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ హిందీ యాక్షన్ డ్రామా గురించి అధికారిక అప్‌డేట్ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.     Adivi Sesh, Hindi Movie, Bollywood, TeluguOne  
  సుదీర్ఘ కాలం నుంచి తనదైన పెర్ఫార్మ్ తో అలరిస్తూ వస్తుంది కాజల్ అగర్వాల్. వివాహం తర్వాత  సెకాంగ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో చేస్తుంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో కాజల్ నే హీరోయిన్. అంతకంటే ముందు  ఈ నెల 24న  'ది ఇండియా స్టోరీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా కాజల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఇకపై నేను ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాలన్నా మొదట తన కొడుకు నీల్ దృష్టి కోణం నుంచే ఆలోచిస్తాను. వాడు కాస్త పెద్దయ్యాక థియేటర్లలో తన సినిమాలు చూసి.. “మా మమ్మీ చేసిన చాలా గొప్ప సినిమా ఇది” అని సమాజంలో ఎంతో గర్వంగా చెప్పుకునేలా తన క్యారెక్టర్స్ ఉండాలి. అందుకే ఇప్పుడు వస్తున్న కథల విషయంలో స్క్రిప్ట్ సెలెక్షన్‌ను చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలిస్తున్నాను. కేవలం కమర్షియల్ హంగుల కోసమే కాకుండా, కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తానని కాజల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. Also read: వైరల్ గా మారిన బండ్ల గణేష్ కూతురి పెళ్లి కార్డు.. ఎవరి ఆశీస్సులతో అని ఉందో తెలుసా! 'ది ఇండియా స్టోరీ’లో  పవర్‌ఫుల్ లాయర్ గా కనిపించనున్నాను. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న కల్తీ ఆహార సమస్యలు, వ్యవసాయంలో పురుగుమందుల మితిమీరిన వాడకం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు ఎలా బలి అవుతున్నాయనే వాస్తవాలు ఈ కథలో ఉన్నాయి.  స్క్రిప్ట్ విన్నప్పుడు ఒక తల్లిగా  తీవ్రంగా కలత చెందాను. ఈ మూవీ ఇచ్చిన అవగాహనతో షూటింగ్ పూర్తయిన వెంటనే వంటగదిలో ఏ వస్తువులు ఉంచాలి,నీల్‌కి  ఎలాంటి ఆహారం ఇవ్వకూడదో అప్పటికప్పుడే నిర్ణయించుకుని ఇంట్లో లైఫ్ స్టైల్ మార్చేసాను అని చెప్పుకొచ్చింది. ది ఇండియా స్టోరీకి చేతన్ డీకే దర్శకుడు కాగా  శ్రేయస్ తల్పడే హీరో. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, రాకింగ్ స్టార్ యశ్ ల 'రామాయణ' లో ‘మండోదరి’ క్యారక్టర్ లో కాజల్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. kajal aggarwal, balakrishna, ranbirkapoor, yash, sai pallavi
  'బ్లాక్‌బస్టర్' చిత్రాల నిర్మాతగా, నటుడుగా తనదైన స్పీచ్‌లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించే బండ్ల గణేష్(Bandla Ganesh)ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె జనని వివాహ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లాకి  చెందిన చిలుకూరి సూర్యతేజతో జనని ఏడడుగులు వేయబోతోంది. ఈ ఏడాది మే నెలలోనే వీరి నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఆ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి దంపతులు స్వయంగా హాజరై కొత్త జంటను దీవించారు. ఇప్పుడు పెళ్లి ఘడియలు దగ్గర పడటంతో బండ్ల గణేష్ తన కుమార్తె లగ్న పత్రికను సినీ, రాజకీయ రంగాలలోని ప్రముఖులకు స్వయంగా అందజేస్తూ ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా పెళ్లి శుభలేఖల పైభాగంలో ఇష్టదైవాల పేర్లు లేదా ఇంట్లోని పెద్దల పేర్లు ముద్రించడం మనం చూస్తుంటాం. కానీ, బండ్ల గణేష్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికపై అత్యంత ఆసక్తికరమైన లైన్ వేయించారు. ఆ పత్రికపై "శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో..." అని ప్రత్యేకంగా ముద్రించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నారా కుటుంబంతో బండ్ల గణేష్‌కు ఉన్న విడదీయరాని వ్యక్తిగత, రాజకీయ అనుబంధానికి ఈ శుభలేఖే నిలువెత్తు నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బండ్ల గణేష్ మొదటి నుంచి నారా చంద్రబాబు నాయుడికి వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబు గారిపై ఉన్న అభిమానంతో ఆయన కోసం షాద్ నగర్ నుంచి తిరుమల కొండకు 100 కిలోమీటర్లకు పైగా కాలినడకన పాదయాత్ర చేసి తన మొక్కును కూడా చెల్లించుకున్నారు. సంప్రదాయాల ప్రకారం బండ్ల గణేష్ కుటుంబం ఈ వివాహ పనులను ఏరువాక పౌర్ణమి అనే అత్యంత పుణ్యదినాన ప్రారంభించారు. ఇందులో భాగంగానే మొదటి పెళ్లి పత్రికను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత ఉంచి స్వామివారి కృపాకటాక్షాలు పొందారు. ఆ తర్వాత వెంటనే రెండవ ఆహ్వాన పత్రికను తీసుకుని నేరుగా నారా భువనేశ్వరి గారికి స్వయంగా అందించి తన కృతజ్ఞతను చాటుకున్నారు. అంతేకాకుండా, అతిథులను కూడా తమ కుటుంబ వేడుకలో భాగం చేసేలా, ఆహ్వాన పత్రికతో పాటు పట్టువస్త్రాలు బహూకరిస్తూ బండ్ల గణేష్ ఆహ్వానిస్తుండటం విశేషం. నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా హనుమకొండకు చెందిన ఒక పేద బాలుడి వైద్యం కోసం బండ్ల గణేష్ రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించి గతంలోనే తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వివాహ వేడుకకి సంబంధించి ముహూర్తాన్ని కూడా ఎంతో ప్రత్యేకంగా నిర్ణయించారు. ఆగస్టు 16వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల 58 నిమిషాల శుభ ముహూర్తాన జనని, సూర్యతేజల వివాహం జరగనుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకను కనులపండువగా నిర్వహించనున్నారు. అయితే ఈ వెడ్డింగ్ కార్డ్‌పై పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా కొలుస్తారని, మరి ఈ పత్రికలో కేవలం చంద్రబాబు దంపతుల పేర్లు మాత్రమే ఎందుకు వేశారని కొందరు ప్రశ్నిస్తుండగా, నారా కుటుంబంతో ఆయనకున్న వ్యక్తిగత రిలేషన్ వేరని మరికొందరు సమర్థిస్తున్నారు. ఏదేమైనా బండ్ల గణేష్ కూతురి పెళ్లి పత్రిక ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.   pawan kalyan, bandla ganesh
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' చేయనున్నాడు. అయితే ఈ రెండు భారీ సినిమాల నడుమ.. ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు వెంకీ అట్లూరితో ఎన్టీఆర్ ఒక సినిమా చేసే అవకాశం ఉందన్న వార్త ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరి కల్లా పూర్తయ్యే అవకాశముంది. మరోవైపు త్రివిక్రమ్ కూడా ప్రస్తుతం తాను చేసున్న 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ లో పూర్తి కానుండగా, ఆ తర్వాత తన పూర్తి ఫోకస్ ను 'గాడ్ ఆఫ్ వార్' పైకి షిఫ్ట్ చేయనున్నాడు. అయితే ఇది వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కేటాయించనున్నారు. త్రివిక్రమ్ కి ఇది మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్, పైగా ఆయనకు ఇంతవరకు వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన సినిమాలు చేసిన అనుభవం లేదు. అందుకే ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం కేటాయించి, పక్కా ప్లానింగ్ తో షూట్ కి వెళ్లాలని చూస్తున్నారట. అందుకే ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. నిజానికి ఈ పాన్ ఇండియా సినిమాల నడుమ.. తక్కువ టైంలో పూర్తయ్యే ఒక సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాత నాగవంశీ.. ఎన్టీఆర్-వెంకీ అట్లూరి కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడట.  వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చేస్తున్నాడు. ఆ తర్వాత నానితో సినిమా చేసే అవకాశముంది. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తెరపైకి రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్ కి వెంకీ అట్లూరి చెప్పిన స్టోరీ ఐడియా నచ్చిందని, త్వరలోనే పూర్తి స్క్రిప్ట్ వింటాడని టాక్. అన్ని అనుకున్నట్టు కుదిరితే 'గాడ్ ఆఫ్ వార్'కి ముందు వెంకీ అట్లూరితో ఎన్టీఆర్ సినిమా ఉండొచ్చు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.!     Jr NTR, Dragon, God of War, Venky Atluri, Naga Vamsi  
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మ్యూజికల్ లవ్ స్టోరీ 'రోమాంచకం'. 'మేమ్ ఫేమస్', 'గోదారి గట్టుపైన' సినిమాలతో యూత్‌కు దగ్గరైన యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, '8 వసంతాలు' ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఒక విభిన్నమైన సినిమాను ప్రేక్షకులు చూడబోతున్నారని స్పష్టమవుతోంది. గ్లింప్స్ ఆరంభంలో పవన్ పప్పుల అందించిన విజువల్స్ ఎంతో ఆహ్లాదకరంగా, అందంగా సాగాయి. ముఖ్యంగా బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్, వారి కెమిస్ట్రీ యువతను కట్టిపడేసేలా ఉంది. వాసుకి వైభవ్ అందించిన సంగీతం ఈ దృశ్యాలకు ప్రాణం పోసింది. 'అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే-రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే రోమాంచకం' అంటూ సాగిన లైన్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఒక అందమైన పెయింటింగ్ లాంటి ప్రేమకథగా గ్లింప్స్ సాగుతున్న తరుణంలో, దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి చివర్లో ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. సరిగ్గా 1 నిమిషం 17 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ ముగింపులో, హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా చెంపదెబ్బలు కొట్టుకుంటూ ‘ఐ హేట్ యూ’ అని చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతవరకు ఎంతో రొమాంటిక్‌గా సాగిన వాతావరణం, ఒక్కసారిగా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ గా మారిపోయింది. ఈ సీన్ చూస్తుంటే సినిమాలో సందీప్ రెడ్డి వంగా మార్క్ కాస్త గట్టిగానే ఉండబోతోందని సినిమా లవర్స్ భావిస్తున్నారు.  దర్శకుడిగా పరిచయమవుతున్న వేణుగోపాల్ రెడ్డి కథను ఎంతో వైవిధ్యంగా రాసుకున్నట్లు తెలుస్తోంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ప్రేమకథల్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేయడానికి వస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.     Sandeep Reddy Vanga, Romanchakam, Sumanth Prabhas, Ananthika Sanilkumar, TeluguOne  
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్' రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ టాలీవుడ్‌లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఈ సినిమా విశేషాలతో పాటు ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న థియేటర్ల వివాదం, పర్సంటేజ్ సిస్టమ్ వెనుక ఉన్న అసలు నిజాలను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తాజాగా బయటపెట్టారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'లెనిన్' ట్రైలర్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ పట్ల ఆయన చాలా పాజిటివ్‌గా స్పందించారు. ఈ సినిమాను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ హిట్ 'రంగస్థలం' మూవీ టోన్‌తో పోల్చడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, అయితే 'లెనిన్' అనేది పూర్తిగా భిన్నమైన పల్లెటూరి నేపథ్య గ్రిప్పింగ్ ఎమోషనల్ డ్రామా అని స్పష్టం చేశారు. అఖిల్ అక్కినేని నటన గురించి చెబుతూ నాగవంశీ ఫ్యాన్స్‌లో అంచనాలను భారీగా పెంచేశారు. కేవలం ట్రైలర్ మాత్రమే అఖిల్ యాక్టింగ్‌కి పారామీటర్ కాదని, అసలు సిసలైన విశ్వరూపం వెండితెరపైనే కనిపిస్తుందని హామీ ఇచ్చారు. థియేటర్లలో అఖిల్ పెర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ ఖచ్చితంగా షాక్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా చివరి 40 నిమిషాల పాటు సాగే అద్భుతమైన ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, అఖిల్ క్యారెక్టర్ చూసి థియేటర్లలో ఆడియన్స్‌కు కన్నీళ్లు రావడం ఖాయమని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో డ్రామా మరియు పాత్రల సంఘర్షణ మహాభారత శైలిలో పీక్స్‌లో ఉంటుందని, సినిమా ప్రారంభమైన మొదటి 20 నిమిషాల తర్వాత క్లైమాక్స్ వరకు ఎక్కడా బ్రేక్స్ లేకుండా కథనం చాలా వేగంగా దూసుకుపోతుందని వివరించారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఈ సినిమా సెకండ్ హాఫ్ కోసం ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ఇచ్చారని, కానీ సినిమా ఫ్లో ఎక్కడా దెబ్బతినకూడదనే ఉద్దేశంతో కింగ్ నాగార్జున గారి అమూల్యమైన సలహా మేరకు ఆ పాటను పక్కన పెట్టినట్లు నాగవంశీ వెల్లడించారు. కథలోని ఇంటెన్సిటీని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక సినిమా విషయాలను పక్కన పెడితే, ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న 'పర్సంటేజ్ సిస్టమ్ వర్సెస్ రెంటల్ విధానం'పై నాగవంశీ చేసిన షాకింగ్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పర్సంటేజ్ సిస్టమ్ తీసుకురావడం వెనుక డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థను పూర్తిగా చంపేసే ఒక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తమ బ్యానర్‌లో వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమా సమయంలో నైజాంలోని 4 నుండి 5 థియేటర్లలో జరిగిన కలెక్షన్ల ఫ్రాడ్‌ను తాము రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని నాగవంశీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇలాంటి లూప్‌హోల్స్, పారదర్శకత లేని వ్యవస్థ ఉన్నప్పుడు నిర్మాతలు పర్సంటేజ్ సిస్టమ్‌ను ఎలా నమ్ముతారని ఆయన నిలదీశారు. అంతేకాదు, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్షకులు కట్టే కన్వీనియన్స్ ఫీజులో సగం నేరుగా థియేటర్ ఓనర్ల జేబుల్లోకి వెళ్తోందని, అందులో డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాతకు కూడా కచ్చితంగా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పర్సంటేజ్ సిస్టమ్ అమలులోకి వస్తే, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకు అడ్వాన్స్‌లు ఇవ్వలేరని, దీనివల్ల డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా నిర్మాతలు కొద్దిమంది పెద్దల కాళ్ల దగ్గర మోకరిల్లి సినిమాలు రిలీజ్ చేసుకోవాల్సిన దుస్థితి వస్తుందని, అందుకే ఇలాంటి వన్‌సైడ్ అల్టిమేటమ్‌లను నిర్మాతలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోరని నాగవంశీ గట్టిగా తేల్చి చెప్పారు.     Lenin Movie, Naga Vamsi, Tollywood Cinema
టాలీవుడ్‌లో సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. కల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఆయన, ఈసారి ఒక అందమైన యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం 'రోమాంచకం'. 'మేమ్ ఫేమస్' సినిమాతో తనదైన నటనతో మరియు యూట్యూబ్ కంటెంట్‌తో తెలుగు యువతకు ఎంతగానో దగ్గరైన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుమంత్ ప్రభాస్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. అలాగే టాలెంటెడ్ బ్యూటీ అనంతిక శాసిల్‌కుమార్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 'ప్రేమ, హాస్యం, ఉత్కంఠ' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ గ్లింప్స్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ లవ్, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తాజాగా విడుదలైన ఈ రోమాంచకం గ్లింప్స్ స్టార్టింగ్‌లో వచ్చే ఒక అందమైన కవిత ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తోంది. "జానకి చెంతనే రాముడి హృదయం.. ఈ ప్రేమ కావ్యం మృదుమధురం" అంటూ సాగిన ఈ వాయిస్ ఓవర్ విజువల్స్ కి ఒక అద్భుతమైన ఫీల్ తీసుకొచ్చింది. ఈ గ్లింప్స్‌లో సుమంత్ ప్రభాస్, అనంతిక మధ్య కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్‌లో వర్కవుట్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వారి మధ్య వచ్చే కొన్ని క్యూట్ అండ్ రొమాంటిక్ సీన్స్‌తో పాటు, యూత్‌ను ఆకట్టుకునే మార్కు కామెడీ డైలాగ్స్, సరదా నవ్వులు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేస్తున్నాయి. ఒక అందమైన ప్రేమకథగా మొదలై, వారిద్దరి మధ్య ఏర్పడిన దూరాన్ని ఎంతో ఎమోషనల్‌గా చూపిస్తూ ఈ గ్లింప్స్ సాగింది. అంతేకాకుండా, "అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే రోమాంచకం.." అంటూ గ్లింప్స్ చివర్లో వినిపించే లిరిక్స్ ఈ మూవీ ఎంత వైబ్రేటింగ్‌గా, ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో ముందే హింట్ ఇస్తున్నాయి. యువతను మెప్పించే అంశాలన్నింటినీ జోడించి ఒక పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని మలిచారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సిద్ధమవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ అధికారికంగా లాక్ చేసింది. రాబోయే సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ చిత్రంపై భారీ బిజినెస్ అంచనాలు నెలకొన్నాయి.     Romanchakam, Sumanth Prabhas, Sandeep Reddy Vanga, Ananthika Sanilkumar, 
క్రికెట్ మైదానంలో క్లాస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన భారత మాజీ ఓపెనర్ మురళీ విజయ్ ఇప్పుడు సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. 22 గజాల పిచ్‌పై ప్రశాంతంగా కనిపిస్తూనే భారీ సిక్సర్లు బాదిన ఈ తమిళనాడు క్రికెటర్, ఇప్పుడు వెండితెరపై ఎవరూ ఊహించని రీతిలో రగ్గడ్, వైల్డ్ అవతారంలో మెరవనున్నారు. ఒక పవర్‌ఫుల్ విలన్‌గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లోనే కాకుండా యావత్ సినీ, క్రికెట్ ప్రియుల్లో హాట్ టాపిక్‌గా మారింది. డాక్టర్లు, బిజినెస్ మేగ్నెట్లు నటులుగా మారడం మనం తరచూ చూస్తుంటాం కానీ, ఒక స్టార్ క్రికెటర్ వెండితెరపై విలన్‌గా మారడం చాలా అరుదైన విషయం. బాలీవుడ్ ప్రముఖ క్రేజీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ హీరోగా నటిస్తున్న ఒక ఇంటెన్స్ తమిళ థ్రిల్లర్ మూవీ ద్వారా మురళీ విజయ్ ఈ వైల్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి 'అన్‌కిల్ 123' (Unkil 123) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ కోలీవుడ్ నిర్మాత ఇషారి కె. గణేశ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో మురళీ విజయ్‌ను చూసిన దర్శకుడు సామ్ ఆంటోన్, నిర్మాత ఇషారి గణేశ్ ఆయన లుక్స్‌కు పూర్తిగా ఫిదా అయిపోయారు. తాము స్క్రిప్ట్‌లో అనుకుంటున్న పవర్‌ఫుల్ మెయిన్ విలన్ క్యారెక్టర్‌కు మురళీ విజయ్ శారీరక ఆకృతి, బాడీ లాంగ్వేజ్ 100 శాతం పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయని వారు బలంగా భావించారు. దర్శకనిర్మాతలు వెంటనే మురళీ విజయ్‌ను కలిసి ఈ కథను వినిపించారు. మొదట్లో వెండితెరపై నటించడం గురించి ఆయన కాస్త ఆలోచించినప్పటికీ, కథలోని ఇంటెన్సిటీ, విలన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఆయనకు విపరీతంగా నచ్చేశాయి. తనలోని సరికొత్త నటుడిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇదే సరైన వేదిక అని నమ్మి ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రికెట్ అభిమానులకు గ్రౌండ్‌లో ఎంతో కూల్‌గా కనిపించే మురళీ విజయ్, ఈ 'అన్‌కిల్ 123' సినిమాలో టోటల్ రగ్గడ్, మాస్, వైల్డ్ లుక్‌లో భయపెట్టబోతున్నారట. విలనిజంలో ఒక సరికొత్త డైమెన్షన్‌ను ఆయన ప్రెజెంట్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ అంతా ఇప్పటికే సైలెంట్‌గా పూర్తయిపోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. టీమిండియా తరఫున ఎన్నో అంతర్జాతీయ మ్యాచులు ఆడి, ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రత్యర్థులపై సెంచరీలు బాదిన మురళీ విజయ్, ఇప్పుడు వెండితెరపై మెయిన్ విలన్‌గా ఎలాంటి 'సిక్సర్లు' కొడతారో చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనురాగ్ కశ్యప్ నటన, సామ్ ఆంటోన్ టేకింగ్, మురళీ విజయ్ విలనిజం కలగలిసిన ఈ పవర్‌ఫుల్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.     Murali Vijay, Unkil 123 , Anurag Kashyap Ishari K Ganesh, Sam Anton 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కట్ అవుట్ కి ఉన్న క్రేజ్ ని మరోసారి చాటి చెప్పిన చిత్రం 'పెద్ది'(Peddi). జూన్ 4 న భారీ ఎత్తున విడుదలైన పెద్ది మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద తన జులుం ప్రదర్శించి వరల్డ్ వైడ్ గా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కి పైగా సాధించింది. థియేటర్లలో చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఫిదా అయిన ఓటిటి సినీ ప్రియులు, పెద్ది  డిజిటల్ స్క్రీన్‌లపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.   అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతూ పెద్ది ఓటీటీ హక్కులని కైవసం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్  స్ట్రీమింగ్ వివరాలని అధికారికంగా వెల్లడించింది.  జూలై 9,  నుండి స్ట్రీమింగ్ కానున్నట్టుగా  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ఆట మారొచ్చు కానీ, మొనగాడు మాత్రం మారడు.. చూసేయండి పెద్ది, జూలై 9 నుండి" అంటూ పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో పోస్టర్‌ రిలీజ్ చేసింది. సౌత్ ఇండియాలోని నాలుగు ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఉత్తరాది సినీ ప్రియుల కోసం హిందీ వెర్షన్‌ని  మాత్రం కాస్త ఆలస్యంగా జూలై నెలాఖరున విడుదల చేయాలని  ప్లాన్ చేస్తున్నారు. ఈ నిర్ణయం నార్త్ అభిమానులకి షాక్ అని చెప్పవచ్చు. Also read: Nagabandham: నాగబంధం కలెక్షన్ల సునామీ.. మూడు రోజులకి ఎంతంటే! మరి థియేటర్లలో సంచలన రికార్డులు సృష్టించిన పెద్ది  ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో  చూడాలి.  peddi, ramcharan, buchibabu, janhvikapoor    
After the massive response to Raga of Revenge, which became the talking point of the trailer, composer Anirudh Ravichander has dropped another track from DC titled DC Hangova, and it brings an entirely different vibe to the album. Unlike the intense trailer theme, DC Hangova leans into a soothing blend of slow electric rock and jazz-infused club music. The fusion works effortlessly, creating a track that feels both stylish and addictive. Anirudh's composition stands out for its restrained energy, allowing the melody to take centre stage. Adding to the song's appeal are Anirudh's vocals. His voice carries a magical quality that complements the mellow arrangement, making the track instantly easy on the ears. The song gradually grows on the listener, leaving behind a lingering, feel-good effect. The accompanying video enhances the experience further. The visuals are in perfect sync with the mood of the composition while subtly teasing key moments from the film's narrative. Lokesh Kanagaraj appears relaxed and confident on screen, while Wamiqa Gabbi leaves a pleasant impression with her screen presence. With Raga of Revenge already emerging as a fan favourite, DC Hangova showcases another dimension of Anirudh's soundtrack. If the two released tracks are any indication, the composer seems to have crafted an album that balances intensity with melody, further raising expectations for the film.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా, ఒకరినొకరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలాముఖ్యం. నిజానికి చాలామంది రిలేషన్ లో ఉన్నప్పుడు  తమ మనసులో ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్పడానికి ధైర్యం చేయరు. చాలా సందేహపడుతూ ఉంటారు. దీని వల్ల అపార్థాలు పెరిగి  రిలేషన్స్ లో దూరం ఏర్పడుతుంది. అందుకే రిలేషన్ లో ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నమ్మకాన్ని పెంచుతుంది.. చక్కగా, ఎలాంటి విమర్శలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఏ  సంబంధానికైనా బలమైన పునాది ఏర్పరుస్తుంది. రిలేషన్ లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా మాట్లాడినప్పుడు, వారి మధ్య నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్  వల్ల అవతలి వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నారని మనకు అనిపిస్తుంది. ఇది అపార్థాల అవకాశాన్ని తగ్గిస్తుంది , సంబంధాలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే.. అనుమానం,  అపార్థాలు, దూరం పెరుగుతాయి. అపార్థాలు తొలగిస్తుంది.. రిలేషన్స్ లోని సమస్యలు చాలా వరకు పెద్ద కారణం వల్ల కాకుండా, చిన్న చిన్న అపార్థాల వల్ల తలెత్తుతాయి. సరైన సంభాషణ ద్వారా ఈ అపార్థాలను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రజలు తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు, వారికి ఉండే  సందేహాలు తొలగిపోతాయి. ఇది సంబంధాలలో స్పష్టతను తీసుకువచ్చి, అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. కమ్యూనికేషన్ చేయడం అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాదు..  అది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గం కూడా.   మనసులోని మాటలను పంచుకున్నప్పుడు ఇద్దరి మధ్య మరింత గాఢమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇది ఒకరిలో ఒకరికి చెందిన ఫీలింగ్ ను పెంపొందించి, సంబంధాలను మరింత సన్నిహితంగా చేస్తుంది. ఈ అనుబంధమే ఏ సంబంధాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. సమస్యల పరిష్కారం.. ప్రతి సంబంధంలో లేదా పరిస్థితిలో సమస్యలు సర్వసాధారణం, కానీ సరైన కమ్యూనికేషన్  ద్వారా వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు, పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వల్ల  తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.  ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడానికి మార్గం కల్పిస్తుంది.  అందుకే ఓపెన్ గా మాట్లాడుకోవడం  అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి.. మనసులో భావాలను, ఆందోళనలను ఇతరులతో పంచుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఏ విషయాన్ని అయినా మనసులోనే దాచుకోవడం ఒత్తిడిని పెంచుతుంది, కానీ మాట్లాడటం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ ఒక వ్యక్తి మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా , సంతోషంగా ఉండేలా చేస్తుంది.                                      *రూపశ్రీ.
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.                                    *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకుండా కాపాడే బంగారు సూత్రం! నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం చాలామంది  ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది.  బంధాలను కాపాడుకోవడం,  మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేసుకోవాలనేదే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే.. బంధాలకు బంగారు సూత్రం.. నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను  ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే.  బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు  కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ విషయాన్ని  స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు.  ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.   ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు.  ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వబావం, కొన్ని లోపాలు ఉంటాయి.   భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం ఉంటుందని పేర్కొన్నాడు. వివాహం విషయానికి వస్తే..  సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది  సమతుల్యత. అక్కడ వివాహానికి ముందు రాముడి  యోగ్యతను పరీక్షించినప్పటికీ, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తవ్యానికి మాత్రమే ఎక్కువ  ప్రాధాన్యతనిచ్చారు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమ భాగస్వాములను మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు త్వరగా నాశనం అవుతున్నాయనేది చాలా మంది అర్థం చేసుకోరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి. ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శ చేసుకోలేక పోవడం, అలాగే..  తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవడానికి,  మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది.  బందం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.                                           *రూపశ్రీ.  
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం, సాయంత్రం స్నేహితులతో కలిసి టీని ఎంజాయ్ చేయడం.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో టీ  ఒక భాగం. కొందరు టీ తాగనిది ఏ పని చేయలేరు.. టీ తాగడం అనేది ఒక పెద్ద బలహీనతగా మారినవాళ్లు ఉంటారు. కానీ  ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే  శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా మందికి తెలియదు.  కనీసం ఒక నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే అద్భుతాలు జరుగుతాయని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  నిద్ర నాణ్యత.. టీలోని కెఫీన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, మెదడును చురుకుగా ఉంచుతూ, నిద్ర పట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. టీ తాగడం మానేసినప్పుడు, శరీరంలో కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా, నిద్ర గాఢతను కూడా మెరుగుపరుస్తుంది.  టీ మానేసిన తర్వాత రాత్రిపూట తరచుగా వచ్చే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని చాలా మంది చెబుతారు. ఎసిడిటి, గ్యాస్.. ఎక్కువగా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.   టీ మానేయడం వల్ల, కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ మెరుగుపడి, జీర్ణక్రియ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల కడుపు తేలికగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దంత ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాలు మరకలు పడటానికి . పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం పాటు అధికంగా టీ తాగడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. టీ మానేయడం వల్ల దంతాలపై కొత్తగా మరకలు ఏర్పడటం తగ్గి, నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన.. అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, ఆందోళన, చంచలత్వం , భయం వంటి సమస్యలు ఏర్పడతాయి. టీ మానేసిన తర్వాత మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. చర్మం..  టీకి బదులుగా నీరు , ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం  వల్ల, టీ మానేయడం వల్ల  శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.  తేమ పెరగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తగ్గించడం వల్ల పొడిబారడం, కాంతిహీనత వంటి చర్మ సమస్యలను కూడా నయం అయ్యి,  చర్మం మెరుపు పెరుగుతుంది. గుండె ఆరోగ్యం.. అధికంగా కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తపోటు , హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. టీ తాగడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు.                                     *రూపశ్రీ.