LATEST NEWS
  దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థుల హక్కుల కోసం సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టించిన  కాక్రోచ్ జంతాపార్టీ ఆరంభం అద్భుతం అయినా ప్రభావం మాత్రం శూన్యంగా మారింది. ఆ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం ప్రజా క్షేత్రంలో ఎటువంటి ప్రభావం చూపలేదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు.   దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు.   పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.   సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ లలో దాదాపు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, ఒకేసారి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కాక్రోచ్ జనతాపార్టీ..  వ్యూహ వైభల్యాలతో ఎంత వేగంగా జనాదరణ పొందిందో, అంతే వేగంగా ప్రజల నిరాసక్తతను చవి చూస్తోంది.   కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన అభిజీత్ దీప్కే  వర్చువల్ ప్రపంచంలో  చూపిన ఉధృతి..  ఆయన ప్రసంగాలలో ఇసుమంతైనా కనిపించడం లేదు.  ఆరంభంలో పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ వంటి ప్రముఖుల మద్దతు లభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా జన సమూహాలను నిలిపి ఉంచడంలో..  ఉద్యమ తీవ్రతను కాపాడటంలో నాయకత్వం విఫలమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమౌతోంది. 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం జనసేన, బీజేపీ కూటమి.. ఇప్పుడు రానున్న స్థానక ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటాలన్న కృత నిశ్చయంతో ఉంది.   రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నగారా మోగేందుకు ముహూర్తం దగ్గరపడిన  నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయవేడి రగులుతోంది.   ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో   స్థానిక ఎన్నికల జరిగే అవకాశం   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు   సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం (జులై 15) జరగనుంది.  సాధారణంగా సార్వత్రిక ఎన్నికల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నేతలు  ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇవి క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును నిరూపించే ఎన్నికలు. అయితే..  ఈ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్ల కంటే, కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది పరిశీలకులు విశ్లేషణ.  ఒకే గ్రామంలో లేదా మండలంలో కూటమికి చెందిన వేర్వేరు పార్టీల నేతలు పట్టు కోసం ప్రయ త్నించడం వల్ల అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.  అందుకే అలాంటి పొరపచ్చాలు, టికెట్ల కేటాయింపు ఇబ్బందులు రాకుండా తీసుకోవలసిన  చర్యలు ఏమిటన్నదే బుధవారం (జులై 15) భేటీలో ప్రధాన అజెండా అని అంటున్నారు.  గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ కమిటీలను  ఏర్పాటు చేసి, ఎలాంటి అసంతృప్తులు లేకుండా సీట్ల సర్దుబాటు చేయాలని కూటమి పార్టీల అగ్రనేతలు భావిస్తున్నారు. ఎ  స్థానిక ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ నాయకులను అలెర్ట్ చేశారు.ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ లతో పాటు కూటమికి చెందిన అగ్ర నాయకులందరూ హాజరు కానున్నారు.   అయితే..  సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   ప్రత్యక్షంగా హాజరు కావడం లేదు. ఇటీవల ఆయన  ముంబైలోని కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ లో  భుజానికి సర్జరీ చేయించుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి విదితమే.   పవన్ ఈ సమావేశానికి ప్రత్యక్షంగా అటెండ్ కాకపోయినప్పటికీ, ఆయన సూచనల మేరకు జనసేన ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొని వ్యూహాలను ఖరారు చేయనున్నారు.   Kutami Targets Clean Sweep Local Bodies Elections, AP Sarpanch Elections, Chandrababu Naidu, Pawan Kalyan Health Update, AP Local Body Polls, TDP Janasena BJP Coalition, AP Panchayat Elections 2026
బీఆర్ఎస్ కీలక నేత,  పార్టీలో  ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇప్పుడు తానే ఒక ట్రబుల్ లో చిక్కుకున్నారు.  సాధారణంగా రాజకీయ వ్యూహాలు, ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటాలతో నిత్యం ప్రజలతో మమేకమై వార్తల్లో ఉండే హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.  మిల్చి మిల్క్ బ్రాండ్, ఆర్ఎన్ఎస్ నేచర్స్ ప్రొడక్ట్స్ సంస్థకు సంబంధించిన లావాదేవీలపై రాజకీయ వర్గాల్లో  ఇప్పుడు హాట్ హాట్ చర్చ జోరందుకుంది.  2020 ఆగస్టులో.. అంటే కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో   ప్రజలకు రోగనిరోధక శక్తిని పెంచే నాణ్యమైన పాల ఉత్పత్తులను అందిస్తామంటూ హరీశ్ రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఈ  మిల్చి మిల్క్ బ్రాండ్‌ను  మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రారంభంలో పూర్తిగా హైజెనిక్ పద్ధతుల్లో, ఆధునిక సాంకేతికతతో వినియోగదారుల ఇంటికే స్వచ్ఛమైన పాలను సరఫరా చేస్తామని ప్రకటించిన ఈ సంస్థ, ఆ తర్వాత కాలంలో   విస్తరించింది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రైవేట్ డెయిరీ సంస్థకు అనుకూలంగా కొన్ని అధికారిక నిర్ణయాలు జరిగాయనే ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు,  ప్రభుత్వ ఆసుపత్రులకు పాలు, పాల ఉత్పత్తులను సరఫరా చేసే క్రమంల.. , ప్రభుత్వ రంగసంస్థ అయిన విజయా డెయిరీని కాదని, హరీశ్ రావుకు  చెందిన ఈ ప్రైవేట్ డెయిరీల నుండి  టెండర్లు లేకుండానే సరఫరా చేయడానికి మార్గం సుగమం చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనివల్ల విజయా డెయిరీ కోట్లాది రూపాయల మేర నష్టపోయిందని, ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనీ పేర్కొంటూ..  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశించింది. మరోవైపు సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు కూడా ఈ వ్యవహారాన్ని  వివాదాస్పదం చేశాయి. ఇటీవలే బీఆర్ఎస్ కు దూరమై టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పెట్టిన   ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  హరీశ్ రావుకు చెందిన దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలోని భారీ ఫామ్‌హౌస్‌, డెయిరీ ఫామ్ పై బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు.   ఈ 400 ఎకరాల ఫామ్‌హౌస్ వెనుక ఉన్న పెట్టుబడులు, నిధుల మూలాలు ఏమిటనే దానిపై కాంగ్రెస్ సైతం విమర్శలు గుప్పిస్తోంది.  ప్రభుత్వ విభాగాల నుండి నివేదికలు కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విజయా డెయిరీ నష్టాలు, గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన కాంట్రాక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ అండదండలతోనే మిల్చి మిల్క్ మార్కెట్లో స్వల్ప కాలంలోనే బలపడిందనే వాదనలకు, కల్వకుంట్ల కవిత విమర్శలు, రేవంత్ రెడ్డి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా  అధికారులకు ఇచ్చిన ఆదేశాలు బలం చేకూర్చాయి.  రాజకీయంగా   క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరీశ్ రావుకు ఇప్పుడు ఈ డెయిరీ వివాదం మచ్చ తెచ్చి పెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అన్నిటికీ మించి.. తెలంగాణ అవసరాలు తీరిన తరువాతే ఆంధ్రప్రదేశ్ కు జలాల విడుదల అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న హరీష్ రావు.. మిల్చీ మిల్క్ ఏపీలోని పలు బడా సంస్థలకు ముఖ్యంగా చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు ఎలా సరఫరా చేస్తున్నారంటూ కాంగ్రెస్ నిలదీయడంతో డిఫెన్స్ లో పడ్డారు. ఏపీకి జలాల విషయంలో తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హరీష్.. తన డైరీ ప్రోడక్ట్స్ ను మాత్రం ఏపీలోని ‘చైనా ’ చైతన్య, నారాయణ)సంస్థలు సహా బడా సంస్థలకు ఎలా సరఫరా చేస్తున్నారని కాంగ్రెస్ గట్టిగా ప్రశ్నిస్తున్నది. దీంతో పొలిటికల్ గా హరీష్ రావు డిఫెన్స్ లో పడ్డారని పరిశీలకులు చెబుతున్నారు.  Harish Rao, Milchy Milk, RNS Natures Products, Kavitha on Harish Rao, Vijaya Dairy Probe, Telangana Politics
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే  అధినేత విజయ్.. వేద నిలయంను తన నివాసంగా చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. చెన్నై నడిబొడ్డున ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన నివాసంలోకి మారేందుకు విజయ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నివాసం గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత  జె. జయలలిత అధికారిక నివాసం అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వేదనిలయాన్ని కొనుగోలు చేసే ఉద్దేశంలో విజయ్ ఉన్నట్లు చెబుతున్నారు.  . పోయెస్ గార్డెన్ (Poes Garden) లో ఉన్న ఈ చారిత్రాత్మక బంగ్లాను  350 కోట్ల కొనుగోలు చేసి, ఆ భవనానని తన నివాసంగా మార్చుకు ఉద్దేశంలో జగన్ ఉన్నట్లు తమిళ మీడియాలో విస్తృతంగా ప్రచారమౌతోంది.  దాదాపు మూడు దశాబ్దాల పాటు తమిళనాడు రాష్ట్ర అధికార కేంద్రంగా, కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచిన వేద నిలయం ఇప్పుడు  కొత్త రాజకీయ శకానికి సాక్ష్యంగా నిలవబోతుందా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది.  a ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక క్రమశిక్షణ గల పాలకుడిలా సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న విజయ్.. నీలాంకరి నుంచి ప్రతిరోజూ దాదాపు 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణం కారణంగా చెన్నై నగరంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలికి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికే సచివాలయానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉండే పోయెస్ గార్డెన్‌లోకి మారాలని విజయ్   నిర్ణయించుకున్నట్లు సమాచారం. వేద నిలయం  24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో  ఉంది. దీనిని జయలలిత ఆమె తల్లి సంధ్యతో కలిసి 1967 జూలైలో కేవలం రూ. 1.32 లక్షలకు కొనుగోలు చేశారు. 1968 మే 15న గృహప్రవేశం చేసిన నాటి నుంచి 2016 డిసెంబర్‌లో ఆమె కన్నుమూసేంత వరకు ఈ నివాసమే తమిళ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేది. అయితే జయలలిత మరణానంతరం ఈ ఇల్లు  న్యాయవివాదాల్లో చిక్కుకుంది. ప్రభుత్వ స్మారక కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదనలు వచ్చినా..  సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత మద్రాసు హైకోర్టు దీనిని ఆమె వారసులైన జె. దీప, జె. దీపక్‌లకు అప్పగించింది. ఇప్పుడు విజయ్ ఈ ఇల్లు కొనుగోలు చేయడానికి సిద్ధమై  ఆ వారసులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.   poes garden house, jayalalithaa veda nilayam buying, vijay buy jaya home 350 crore, thalapathy vijay new residence chennai
రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు అయినా... ఉభయ తెలుగురాష్ట్రాల మధ్యా  ఎన్ని విభేదాలు ఉన్నా.. తెలుగు ప్రజలు ఎప్పుడూ ఐక్యంగానే ఉండాలని  టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన)  అధినేత్రి  కల్వకుంట్ల కవిత అన్నారు. భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి  పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు.   తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.  ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ భాషా యాసలు, సంస్కృతిపై జరుగుతున్న కొన్ని వివాదాల నేపథ్యంలో  కవిత వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఇరు రాష్ట్రాల పరంగా విభేదాలు ఉండొచ్చు..  రాజకీయంగా భిన్నమార్గాలలో పయనిస్తుండొచ్చు.. కానీ..  ప్రజలుగా తెలుగువారు ఐక్యంగా ఉండాలన్నారు కల్వకుంట్ల కవిత.  రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే   శక్తిమంతమైన మాధ్యమం సినిమా అన్న ఆమె.. సాంస్కృతిక బంధాలు రాజకీయాల కంటే మిన్నవన్నారు.  గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఆంధ్ర, తెలంగాణ యాసలపై, సంస్కృతిపై కొన్ని చిత్రాల విషయంలో   వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒకరి భాషను మరొకరు తక్కువ చేసి చూపిస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల నెటిజన్ల మధ్య సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో మాటల యుద్ధం జురుగుతోంది.. ఈ నేపథ్యంలో  టీఆర్ఎస్ అధినేత్రి  కతిత సాంస్కృతిక ఐక్యతకు పిలుపునివ్వడం విశేషం.  రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగు వారంతా ఒకే కుటుంబంగా ముందుకు సాగాలని, సినిమా వంటి కళా రూపాలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కవిత ఆకాంక్షించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై అటు సినీ వర్గాల నుంచి, ఇటు ఇరు రాష్ట్రాల ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది.  Kavitha calls for unity og telugu people, Cinema, Cultural, Bridge, Telangana, Andhra Pradesh, Teluguone
ALSO ON TELUGUONE N E W S
Disney's strategy of revisiting its animated classics has hit another roadblock. The live-action adaptation of Moana may have debuted at the top of the North American box office, but its opening numbers have fallen well below industry expectations, making it one of the studio's weakest live-action remake launches in recent years. Starring Catherine Laga'aia as Moana alongside Dwayne Johnson, who reprises his role as Maui, the film collected around $43 million in North America and $95 million worldwide during its opening weekend. While those figures were enough to secure the No. 1 spot, they are modest for a film carrying a reported $250 million production budget, raising concerns about its long-term box office prospects. The performance is particularly surprising considering the popularity of the franchise. The original animated Moana (2016) went on to gross more than $640 million worldwide, while Moana 2 crossed the $1 billion mark globally. Industry analysts believe the remake suffered because audiences saw little reason to revisit a story that remains one of Disney+'s most-streamed films, especially so soon after the success of its sequel. Tough competition from family titles such as Toy Story 5 and Minions & Monsters also impacted its opening weekend. The film has also reignited the debate surrounding Disney's live-action remake strategy. Unlike earlier adaptations such as The Lion King, Beauty and the Beast and Aladdin, which transformed decades-old classics into event films, Moana arrived less than a decade after the original animation and less than two years after Moana 2. Many industry observers believe that familiarity, rather than nostalgia, worked against the remake. Although audience reactions have been considerably more positive than critics' reviews, Moana now faces the difficult task of sustaining its theatrical run through strong word-of-mouth. With its expensive production cost, the film will need exceptional legs at the global box office to avoid joining the list of Disney's recent live-action disappointments. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Christopher Nolan has revealed that shooting The Odyssey entirely with IMAX cameras wasn't just a technical decision—it fundamentally changed the way he directed the film. The Oscar-winning filmmaker explained that the unique nature of IMAX forced him to abandon conventional filmmaking techniques and rethink every scene from the ground up. Speaking about the experience, Nolan said cinema is ultimately a subjective experience, which is why he wanted audiences to immerse themselves in The Odyssey through the IMAX format. Unlike traditional cameras, IMAX cameras do not use zoom lenses, meaning he couldn't rely on standard framing to bring viewers closer to the action. Instead, every scene had to be carefully composed through camera movement, blocking and actor positioning, making movement itself an essential storytelling tool rather than just a stylistic choice. The Odyssey is the first feature film in history to be shot entirely on IMAX film cameras, a feat made possible after IMAX developed new, quieter camera technology specifically for Nolan's vision. The technological breakthrough allowed the filmmaker to capture even intimate dialogue scenes in the premium format, something that had previously been impossible because of the cameras' size and noise levels. The film boasts a stellar ensemble led by Matt Damon as Odysseus, alongside Tom Holland, Anne Hathaway, Zendaya, Robert Pattinson, Charlize Theron and Lupita Nyong'o. Adapted from Homer's timeless epic, The Odyssey follows the legendary king's perilous journey home after the Trojan War and is being billed as Nolan's most ambitious cinematic undertaking to date. Adding to the excitement, The Odyssey recently held its first-ever public screening in Mumbai, where Christopher Nolan, producer Emma Thomas, Matt Damon and Tom Holland were present to introduce the film. The IMAX premiere ended with a thunderous standing ovation, as Nolan thanked Indian audiences—whom he described as among the world's most passionate movie lovers—for their overwhelming response. The event marked the first time one of Nolan's films premiered in India before its global release, making it a landmark moment for both the filmmaker and Indian cinema fans. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)రాజకీయ రంగప్రవేశంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని ప్రధాన మీడియా సంస్థలలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలు నందమూరి అభిమానుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ 100 కోట్ల భారీ బడ్జెట్‌తో పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఒక భారీ సేవా కార్యక్రమాన్ని ప్లాన్ చేశారనే వార్త విపరీతంగా వైరల్ అయింది. దీనికి తోడు, ఈ విషయమై స్పష్టత ఇచ్చేందుకు జూలై 18వ తేదీన తిరుపతిలోని ప్రముఖ తాజ్ హోటల్‌లో ఎన్టీఆర్ స్వయంగా ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారంటూ కొన్ని సంస్థలు ప్రకటనలు జారీ చేశాయి. ఈ వార్తలు నెట్టింట హల్‌చల్ చేయడంతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై ఆయన అధికారిక పీఆర్ టీమ్  స్పందించింది. ఇదంతా కేవలం ఒక పుకారు మాత్రమే.రాజకీయ రంగ ప్రవేశంపై   ఎలాంటి నిజం లేదు. తిరుపతిలో జరగబోయే ప్రెస్ మీట్‌తో కానీ, ‘ఊరు వాడ’ చారిటీ కార్యక్రమాలతో కానీ ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రకటనల వెనుక ‘RAW NTR’ (రా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్) అనే ఒక అభిమాన సంస్థ ఉన్నట్లు గుర్తించారు. ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ, ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడంపై ఎన్టీఆర్ అధికారిక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తారక్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ఈ వ్యవహారంపై స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ మాట్లాడుతు 'తిరుపతి వేదికగా ఈ వివాదాన్ని సృష్టించిన ‘RAW ఎన్టీఆర్’ అనే సంస్థపై తిరుపతి జిల్లా ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నాం. ఎన్టీఆర్ ఇమేజ్‌ డ్యామేజ్ చేయడానికి దీని వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని  అనుమానంగా ఉంది.  గత నాలుగు రోజులుగా ఇంత పెద్ద వివాదం నడుస్తున్నా, సదరు సంస్థ ప్రతినిధులు ఎందుకు నోరు విప్పడం లేదు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. జరుగుతున్న రచ్చను చూసి వాళ్ళు శునకానందం పొందుతున్నారా! Also read: రిషబ్ శెట్టి vs రానా.. నిజమైతే మాత్రం వాళ్లకి పండగే తిరుపతి లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఫేక్ వివాదాలు సృష్టించడం వెనుక ఉన్న అసలు సూత్రధారుల రంగు బయటపడాలి. భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ ప్రచారాలు, అనవసర రాజకీయ వివాదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే పోలీసులని ఆశ్రయిస్తున్నాం. అసలు ఎన్టీఆర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు నిజమైన అభిమానులు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు.    
  రిషబ్ శెట్టి(Rishab Shetty).. రానా(Rana daggubati)..నటనకి సంబంధించి తమ క్యారెక్టర్స్ లో పూర్తిగా లీనమయ్యి, అభిమానులు, ప్రేక్షకులని సమ్మోహనపరచగల ధీరులు. ఆ ఇద్దరి ప్రీవియస్ చిత్రాలే అందుకు ఉదాహరణ.  2024 సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్   సృష్టించిన 'హనుమాన్’ కి సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్‌లో రిషబ్ శెట్టి హనుమంతుడి క్యారక్టర్ లో  చేస్తుండటం  ఇప్పటికే సినిమాపై హైప్ పెంచగా, రానా దగ్గుబాటి ఒక పవర్‌ఫుల్ రోల్ లో చేస్తున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వస్తున్నాయి. గతంలో బాహుబలి చిత్రంలో విలనిజానికి సరికొత్త నిర్వచనం చెప్పిన రానా, ఇందులో రిషబ్ శెట్టితో తలపడే ప్రధాన విలన్ లేదా కథను ఊహించని మలుపు తిప్పే అత్యంత శక్తివంతమైన నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో  కనిపిస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది.  also read: హద్దు దాటొద్దు.. రెచ్చిపోయిన హీరోయిన్ విభిన్నమైన గెటప్పులలో కనిపిస్తాడని, కేవలం ఒకే రూపంలో కాకుండా కథా గమనంలో పలు వేరియేషన్స్ చూపిస్తుందని టాక్. కలియుగ నేపథ్యంలో హనుమంతుడు తన శ్రీరామునికి ఇచ్చిన మాటకు కట్టుబడి అజ్ఞాతవాసంలో ఉండే కథాంశంతో ఈ సినిమాను ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. భక్తి, శౌర్యం, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ కలయికతో రూపొందుతున్న ఈ సినిమాలో రిషబ్ శెట్టి మరియు రానా దగ్గుబాటి మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పవర్‌ఫుల్ కాస్టింగ్ రూమర్స్ సోషల్ మీడియాను ఊపేస్తుండటంతో, దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తారా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.  rishab shetty, rana daggubati, jaihanuman  
న్యాచురల్ స్టార్ నాని ఎప్పుడూ కొత్త దర్శకులను, వినూత్నమైన కథలను ప్రోత్సహించడంలో ముందుంటారు. స్క్రిప్ట్ విషయంలో నానికి ఉన్న మంచి అవగాహన, మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్న దర్శకులను వెతకడంలో అతనికి ఎంతో సహాయపడుతుంది. తాజాగా, ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే, 'లెనిన్' సినిమా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరును హీరో నాని సంప్రదించినట్లు సమాచారం. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు గురించి చెప్పాలంటే, ఆయన మొదటి సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఆ సినిమాతో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్న మురళీ కిషోర్ కు.. ఏకంగా అన్నపూర్ణ స్టూడియోస్ అఖిల్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అలా వచ్చిన ప్రాజెక్టే 'లెనిన్'. ఒక భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి.. ఈ సినిమా ఎంతో ఊరటనిచ్చింది. అలాగే, దర్శకుడిగా మురళీ కిషోర్ ప్రతిభపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతో పలువురు హీరోలు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.  నాని కూడా మంచి కథ ఉంటే చెప్పమని దర్శకుడు మురళీ కిషోర్ ను కోరినట్లు తెలుస్తోంది. నాని ప్రస్తుతం 'ది ప్యారడైజ్' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత 'బ్లడీ రోమియో' లైన్ లో ఉంది. మురళీ కిషోర్ మంచి కథతో మెప్పిస్తే.. నాని తదుపరి ప్రాజెక్ట్ ఇదే అయ్యే అవకాశముంది. ఏదేమైనా, ఈ ఇద్దరి కలయిక గురించి వినిపిస్తున్న ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.     Lenin Movie, Murali Kishore Abburu, Nani, TeluguOne  
Yash's upcoming action drama Toxic continues to build massive momentum ahead of its theatrical release on August 26. The Geetu Mohandas directorial has now emerged as the most anticipated upcoming Indian film on IMDb, topping the platform's latest rankings with an impressive 52.3% popularity score. The latest recognition comes at a time when the film is already generating significant buzz across the country. The recently released song Tabaahi has further amplified the excitement, adding to the anticipation surrounding Yash's return to the big screen after KGF: Chapter 2. The film's dominant lead in IMDb's rankings reflects the growing curiosity among audiences for the pan-India project. Mounted as a period gangster action drama, Toxic boasts a star-studded ensemble featuring Kiara Advani, Nayanthara, Huma Qureshi, Tara Sutaria and Rukmini Vasanth alongside Yash. The film is directed by National Award-winning filmmaker Geetu Mohandas, whose collaboration with the Kannada superstar has been one of the most talked-about pairings in recent years. Produced by KVN Productions in association with Monster Mind Creations, Toxic is being mounted on a lavish scale with high production values and an extensive technical crew. With the film leading IMDb's anticipation chart and promotional content receiving a strong response, expectations are steadily rising for what is expected to be one of the biggest theatrical releases of the year. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Prashant Varma's ambitious mythological socio-fantasy Mahakali has achieved a major production milestone. The film, conceived as part of the Prashant Varma Cinematic Universe (PVCU), has completed 125 days of extensive shooting and has now entered its final schedule. Mounted on a grand scale by RKD Studios, the project is progressing rapidly towards completion before moving into post-production. The biggest update from the makers is that Mahakali is being filmed specifically for IMAX, underlining the team's vision of delivering a larger-than-life theatrical experience. With its mythological backdrop, fantasy elements and massive production design, the film is being positioned as one of the most visually ambitious Indian projects currently in production, promising an immersive experience for audiences on the big screen. The production has also wrapped up the portions of actor Rohit Saraf, with the team thanking him for his contribution while hinting that his character will play a significant role in the narrative. Earlier, Akshaye Khanna had completed filming his portions as Shukracharya, one of the film's key characters. Directed by Puja Aparnaa Kolluru, Mahakali stars Bhoomi Shetty in the lead role. As filming enters its final phase, the makers are expected to shift their focus towards post-production and begin unveiling promotional material in the coming months. With the IMAX announcement and steady production progress, anticipation surrounding the latest chapter in the PVCU continues to grow. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
"SPIRIT IS NOT ONE" చిత్ర టైటిల్‌కు సంబంధించి ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ T-Series పంపిన నోటీసులపై, వారు విధించిన షరతులపై చిత్ర నిర్మాతలు చిన్నబోయిన నరసమ్మ, వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ ద్వారా తీవ్రంగా స్పందించారు. ​ T-Series పంపిన నోటీసులోని షరతులు ఏమిటి? ​హిందీ రైట్స్ ఇవ్వబోం: 'SPIRIT' అనే పదంపై మాకే హక్కులు ఉన్నాయి కాబట్టి, మీ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేసుకోవాలి. హిందీ వెర్షన్ రిలీజ్ చేయడానికి లేదా హిందీ రైట్స్ అమ్ముకోవడానికి వీల్లేదు. ​ కేవలం తెలుగులోనే ప్రమోషన్స్: "SPIRIT IS NOT ONE" అనే పేరుతో కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే థియేటర్లలో, ఓటీటీ లేదా యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటేనే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకుంటాము. T-Series షరతులపై ప్రెస్ మీట్‌లో చిత్ర నిర్మాతల ఘాటైన కౌంటర్: ​మా సినిమా.. మా ఇష్టం! చెప్పడానికి మీరెవరు?: "మా సినిమాను మేము ఎవరికి అమ్ముకోవాలి? ఎక్కడ, ఏ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసుకోవాలి అనేది మా వ్యక్తిగత విషయం. దానిని శాసించడానికి, మాపై నిబంధనలు పెట్టడానికి T-Series సంస్థ ఎవరు?" అని నిర్మాతలు ప్రశ్నించారు. ​ మేము తెలుగులోనే రిలీజ్ చేస్తాం.. ప్రభాస్ సినిమా హిందీలో చేసుకోమనండి:  "మేము మా సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేసుకుంటాము. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో T-Series తీస్తున్న 'SPIRIT' సినిమాను వారు హిందీలో హ్యాపీగా రిలీజ్ చేసుకోమనండి. దానికి మాకేం అభ్యంతరం లేదు" అని స్పష్టం చేశారు. ​ఒప్పందానికి అంగీకరించేది లేదు: ఒక సినిమాను ఏ భాషలో రిలీజ్ చేయాలి, ఎలా అమ్ముకోవాలి అనే హక్కుల విషయంలో కార్పొరేట్ సంస్థల బెదిరింపులకు భయపడేది లేదని, ఈ ఏకపక్ష షరతులకు తాము అంగీకరించడం లేదని చిత్ర బృందం తెగేసి చెప్పింది. ​మా సినిమా హక్కులను, స్వేచ్ఛను కాపాడుకుంటూనే, తెలుగు ప్రేక్షకులకు త్వరలోనే "SPIRIT IS NOT ONE" సినిమాను థియేటర్లలో అందిస్తామని నిర్మాతలు ప్రకటించారు.     SPIRIT IS NOT ONE, Prabhas, Spirit, Sandeep Reddy Vanga  
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)లో ఉన్న తుఫాన్ లాంటి యాక్టింగ్ కి సంబంధించిన మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్న మూవీ డ్రాగన్. ఈ విషయం టీజర్ ద్వారా చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. అభిమానులైతే రిలీజ్ డేట్ 2027 జూన్ 11 త్వరగా వస్తే ఎంత బాగుండు అని తమ ఊహల్లో సదరు డేట్ ని తలుచుకుంటూనే ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్  నీల్ తన ప్రీవియస్ చిత్రాలైన 'కేజీఎఫ్' సిరీస్  'సలార్' ని మించి డ్రాగన్ ని హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న డ్రాగన్ కి   సంబంధించిన సరికొత్త అప్‌డేట్ నెట్టింట  వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో ఒక భారీ నైట్ షెడ్యూల్  చిత్రీకరణ) జరుగుతోంది. అత్యంత చలి వాతావరణంలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా, భారీ సెట్స్ మధ్య రాత్రి వేళల్లో ఈ షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, హీరోయిన్ రుక్మిణి వసంత్ పాల్గొంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, సినిమాకు వెన్నెముక లాంటి కొన్ని కీలకమైన సీన్లను ప్రశాంత్ నీల్ అర్ధరాత్రి వేళల్లో చిత్రీకరిస్తున్నారట. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ డోస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ మరింత నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేలా, ఏకంగా 2,000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో కూడిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ని  ప్లాన్ చేశారు. అంతేకాకుండా, ఇప్పటివరకు తన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ జోలికి పెద్దగా వెళ్ళని ప్రశాంత్ నీల్.. ఈ సినిమాలో ఒక అదిరిపోయే మాస్ చార్ట్‌బస్టర్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఒక ప్రత్యేకమైన సెట్ వేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ అల్టిమేట్ డ్యాన్స్ పవర్‌కు సరిపోయేలా, ఒక టాప్ బాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి ఈ స్పెషల్ నంబర్‌ను ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. Also read: shah rukh khan: షారుఖ్ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే.. ఎందుకు ఇలా చేసారు!   ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన 'ఇన్విన్సిబుల్' అవతార్ కోసం ఎన్టీఆర్ గుబురు గడ్డంతో, చాలా లీన్‌గా మరియు రగ్గడ్ బాడీతో కనిపించబోతున్నారు. రవి బస్రూర్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ ముగిసిన వెంటనే, తదుపరి భారీ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సినిమాటిక్ విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా అభిమానులకి,ప్రేక్షకులకి  థియేటర్లలో ఒక మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.  ntr, dragon, prashanth neel  
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'మహాకాళి' చివరి దశ చిత్రీకరణలోకి అడుగుపెట్టింది. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మైథాలజికల్ ఎపిక్‌కు ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విజయవంతంగా 125 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక షూటింగ్‌లో మరో కీలక మైలురాయిని కూడా ఈ చిత్రం చేరుకుంది. ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్న రోహిత్ సరాఫ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. అలాగే శుక్రాచార్య పాత్రలో నటిస్తున్న అక్షయ్ ఖన్నా ఇప్పటికే తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ చిత్రంలో మహాకాళి పాత్రలో భూమి శెట్టి నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మహాకాళి రూపంలో కనిపించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే శుక్రాచార్యగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ కూడా భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక వైభవాన్ని అత్యాధునిక సినీ సాంకేతికతతో  భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథాలజికల్ చిత్రాల్లో ఒకటిగా 'మహాకాళి' రూపుదిద్దుకుంటోంది.  ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా సురేష్ రగుతు, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. విడుదల తేదీతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.     HanuMan Universe, Mahakali Movie, Prasanth Varma, Tollywood  
తండ్రిలో ఉండే ఈ అలవాట్లు  పిల్లలను బలహీనులను చేస్తాయ్ పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు కేవలం వినడం ద్వారానే కాకుండా, తమ చుట్టూ ఉన్నవారి ప్రవర్తనను గమనించడం ద్వారా కూడా నేర్చుకుంటారు.  తండ్రి  రోజువారీ అలవాట్లే  అతని పిల్లల భవిష్యత్తును పాజిటివ్ గా ఉండాలా లేదా నెగిటివ్ గా ఉండాలా అనే విషయం డిసైడ్ చేస్తాయి.  ఇది ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.. తండ్రి అలవాట్లు పిల్లలను బలహీనంగా కూడా మారుస్తాయి.  తండ్రిలో ఉండే ఏ అలవాట్లు పిల్లలను బలహీనులను చేస్తాయో  తెలుసుకుంటే.. ప్రతి చిన్న విషయానికి తిట్టడం లేదా కోపగించుకోవడం... ఎప్పుడూ తిట్టడం లేదా గట్టిగా మాట్లాడటం వల్ల పిల్లలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సంకోచించవచ్చు. తండ్రి ఇలా ఉండే పిల్లలు తండ్రికి భయపడతారు,  చాలామంది తండ్రి అంటే పిల్లలకు భయం ఉండాలని అనుకుంటారు, కానీ పిల్లలు మనసు విప్పి ఏదైనా మాట్లాడగలిగినప్పుడు, చెప్పగలిగినప్పుడు వారి మనసులో ఉండే ఎన్నో సందేహాలు,  దిగులు భయాలు తొలగిపోతాయి. ఏం చేయాలి? పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు ముందు మొత్తం వినాలి, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాని గురించి చెప్పేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి,  పిల్లల వ్యక్తిత్వం గురించి కాకుండా, వారి ప్రవర్తన గురించి మాట్లాడాలి.  పోలిక.. "చూడు, నీ స్నేహితుడు నీకంటే గొప్పవాడు"  చుట్టాలబ్బాయికి నీ కంటే మంచి మార్కులు వచ్చాయి,  ఆ పిల్లాడు నీ కంటే చాలా బెటర్.. ఇలాంటి మాటలు చెప్పడం పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఏం చేయాలి? పిల్లలను పోల్చకూడదు,  ప్రతి పిల్లవాడిలో విబిన్న ప్రతిభ ఉంటుంది,  పిల్లలలో ఉన్న ప్రతిభ ఏంటో గుర్తించి ప్రోత్సహించాలి. చిన్న ప్రయత్నాలను సైతం అభినందించాలి,  పోల్చకుండా స్ఫూర్తినివ్వాలి. సమయం కేటాయించకపోవడం.. తీరికలేని  కారణంగా, కొన్నిసార్లు పిల్లలతో గడిపే నాణ్యమైన సమయం  చాలామంది తండ్రులకు  తగ్గిపోతుంది. ఇది ఎంత మాత్రం పిల్లలు భరించలేని విషయం. ఏం చేయాలి? ప్రతిరోజూ మొబైల్ కాకుండా  పిల్లలతో కొంత సమయం గడపాలి,  కలిసి ఆడుకోవడం, చదవడం లేదా కబుర్లు చెప్పుకోవడం చేయాలి. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉంటుందో వాటిలో పార్టిసిపేట్ చేయాలి. మాట తప్పడం.. తండ్రి పదేపదే తన పిల్లలకు ఇచ్చిన మాటను  నెరవేర్చడంలో విఫలమైతే, పిల్లల నమ్మకం బలహీనపడుతుంది. ఏం చేయాలి? తండ్రి  నెరవేర్చగల ప్రామిస్ లను మాత్రమే పిల్లలకు చేయాలి. . ప్రణాళికలు మారితే, కారణం వివరించాలి. నిజాయితీకి, నమ్మకానికి ఆదర్శంగా ఉండాలి. పిల్లల ఎమోషన్స్ పట్టించుకోకపోవడం.. పిల్లలు ఏడుస్తున్నప్పుడు, బాధపడినప్పుడు,  అలిగినప్పుడు వారిని పట్టించుకోవాలి. . లేకపోతే వారు మానసికంగా చాలా దెబ్బతింటారు. తమకు ప్రాముఖ్యత లేదని అనుకుంటారు. ఏం చేయాలి? పిల్లల ఎమోషన్స్ ను గుర్తించాలి, వారి బాధను, వారు చెప్పే విషయాలను  ఓపికగా వినాలి. సమస్యకు కలిసి పరిష్కారం కనుగొందామని వారిని ఊరడించాలి.   చెడు ప్రవర్తన.. పిల్లలు తరచుగా ఇంట్లో చూసే వాటి నుండే నేర్చుకుంటారు. ఏ విషయాలను గుర్తుంచుకోవాలి? ఏవి మరచిపోవాలి, ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు.. అందరితో మర్యాదగా ఎలా ఉండాలి?  ఇలాంటి విషయాలు పిల్లలకు వివరించాలి.  సామాజికంగా ఎలా ఉండాలో తెలియజెప్పాలి. నిర్ణయాలు.. పిల్లలకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం ఎప్పుడూ లభించకపోతే, వారి ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందడానికి ఆటంకం కలగుతుంది. ఏం చేయాలి? వయసుకు తగిన చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి,  నిర్ణయాలు తీసుకునే ముందు ఏం ఆలోచించాలో పిల్లలకు వివరించాలి. చదువు మాత్రమే కాదు.. మంచి మార్కులు ముఖ్యమే కావచ్చు, కానీ పిల్లల పూర్తిగా అభివృద్ధి  చెందడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. ఏం చేయాలి? క్రీడలు, కళలు , సృజనాత్మక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.  ఫలితాన్ని మాత్రమే కాకుండా, చేసిన ప్రయత్నాన్ని కూడా అభినందించాలి.  నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని పిల్లలకు తెలిజెప్పాలి.                                        *రూపశ్రీ.  
కుటుంబ వాతావరణం ఆరోగ్యంగా ఉందా లేదా?  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.  
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం.  భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది.  భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది.  అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. కానీ కోడలిగా వచ్చిన ఆడపిల్లను బాధపెట్టే అత్తమామలు ఉంటే.. ఆ ఆడపిల్లల జీవితం నరకప్రాయంగా ఉంటుంది.  అయితే.. బాధపెట్టే అత్తమామలు ఉన్నారని, వివాహ బంధాన్ని తెంచుకుని వెళ్లలేరు చాలామంది అమ్మాయిలు,  బాధపెట్టే అత్తమామలతో  ఎలా ఉండాలో,  వాళ్లతో కలిసి ఎలా జీవించాలో లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు..  వీటి గురించి తెలుసుకుంటే.. మార్చాలని అనుకోకూడదు.. కొన్నిసార్లు  అత్తమామలు కోడళ్ల మీద ఒత్తిడిని, ఇబ్బందులను కలిగిస్తారు. బాధపెట్టే అత్తమామల గురించి చాలా మంది జోక్ గా చెప్తూ ఉంటారు. కానీ బాధపెట్టే అత్తమామలు ఉండటం జోక్ కాదు.. అది ఆడపిల్లలను చాలా బాధపెడుతుంది, చాలా ఒత్తిడిలోకి నెడుతుంది.  అలాంటి అత్తమామలు  మానసిక ప్రశాంతతను, వివాహ బంధాన్ని కూడా ప్రభావితం చేస్తారు. చాలా మంది కోడళ్లు తమ అత్తమామలు మారితే బాగుండు అని అనుకుంటారు. కానీ అత్తమామలు మారాలని,  వాళ్లను  మార్చాలని అనుకోవడం వ్యర్థం. అత్తమామలు ఏ విషయాల పట్ల బాధపెడతారో తెలిసినప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఉండటమే  మంచిది. పరిమితులు..  బాధపెట్టే అత్తమామలు ఉన్నప్పుడు, ప్రతి కోడలు తన భర్త సహాయంతో  కొన్ని సొంత పరిమితులను నిర్దేశించుకుని, వాటికి కట్టుబడి ఉండడం  మంచిది. పరిమితులు ఏర్పాటు చేసుకున్నప్పుడు పెద్దవాళ్లు, అత్తమామలు మాట్లాడే ఏ మాటలు లేదా ప్రవర్తన పరిమితులను దాటి జీవితంలోకి తీసుకుని బాధపడే పరిస్థితి రాదు.   సమస్య, పరిష్కారం.. ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు, దాని మూల కారణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అత్తమామల చెడు  ప్రవర్తన అకస్మాత్తుగా జరగదు. వారు ప్రతీదీ తమకు నచ్చినట్టుగా జరగాలని కోరుకోవడం, తమ భావాలను అదుపు చేసుకోలేకపోవడం, లేదా గతంలోని మానసిక గాయాలను మోయడం వంటి కారణాల వల్ల ఇది తరచుగా జరుగుతుంది. కొన్నిసార్లు, అత్తమామలు కోడలు పెరిగిన విధానాన్ని, కోడలి పుట్టింటి వారి పద్దతులను,  నియమాలను అగౌరవపరుస్తారు, మరికొన్ని సార్లు  స్వార్థపరురాలు అనే ట్యాగ్ వేసి  వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తారు, లేదా కుటుంబంలో కలహాలు సృష్టించి కోడలిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతులను గుర్తించడమే కోడళ్లు అత్తారింట్లో బాధపెట్టే అత్తమామలతో కలిసి ఎలా జీవించాలనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాయి.                                      *రూపశ్రీ.
అజినమోటో  ఆరోగ్యానికి మంచిదేనా?  చౌ మెయిన్, మోమోస్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్, పిజ్జా.. ఇవి మాత్రమే కాకుండా  అనేక ఇతర చైనీస్ స్ట్రీట్ ఫుడ్స్ లో  ఆహారాల రుచిని మెరుగుపరచడానికి అజినోమోటోను తరచుగా ఉపయోగిస్తారు. దీని అసలు పేరు మోనోసోడియం గ్లుటామేట్ (MSG), ఇది కూడా ఒక రుచిని పెంచే పదార్థమే. అయితే దీని గురించి  చాలా కాలంగా చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. పరిశోధన ప్రకారం, చాలా మంది ఆరోగ్యవంతులకు అజినమోటో మితమైన మోతాదులో తీసుకోవడం మంచిదే, కానీ కొంతమందిలో, దీన్ని తీసుకోవడం వల్ల  తలనొప్పి, దాహం, వేడి ఆవిర్లు, వికారం లేదా అసౌకర్యం వంటి లక్షణాలను కలుగుతాయి. అసలు అజినోమోటో అంటే ఏమిటి, దాని వినియోగం ఎప్పుడు హానికరంగా మారుతుంది?  ఎవరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి  వైద్యులు చెప్పిన నిజాలేంటో తెలుసుకుంటే.. అజినమోటో.. అజినోమోటో  రసాయన నామం మోనోసోడియం గ్లుటామేట్ (MSG). ఇది ఆహార రుచిని మెరుగుపరచడానికి ఉపయోగించే ఒక ఫ్లేవర్ ఎన్‌హాన్సర్. ఇది గ్లుటామేట్ యొక్క ఒక రూపం, ఇది టమోటాలు, చీజ్ , పుట్టగొడుగులు వంటి కొన్ని ఆహారాలలో సహజంగా కూడా లభిస్తుంది. అజినమోటో ఎక్కువ వాడితే కలిగే సమస్యలు.. తలనొప్పి , అసౌకర్యం.. అజినమోటో అధికంగా ఉండే ఆహారాలు తిన్న తర్వాత కొంతమందికి తలనొప్పి, ముఖం ఎర్రబడటం, చెమట పట్టడం లేదా అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఇది అందరిలోనూ జరగదు. సోడియం.. అజినోమోటోలో సోడియం ఉంటుంది. దీనిని అధిక ఉప్పు ఉన్న ఆహారాలతో తరచుగా తీసుకుంటే, మొత్తం సోడియం తీసుకోవడం పెరుగుతుంది, ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిది కాదు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం.. ప్రాసెస్ చేసిన , ఫాస్ట్ ఫుడ్స్‌లో తరచుగా అజినమోటో ను  ఉపయోగిస్తారు. అలాంటి ఆహారాలలో ఉప్పు, నూనె , కేలరీలు కూడా అధికంగా ఉంటాయి, దీనివల్ల బరువు పెరగడం , ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగవచ్చు. సెన్సిటివిటీ ఉన్నవారికి అసౌకర్యం.. కొంతమందికి అజినమోటో తీసుకుంటే సెన్సిటివిటీ రియాక్షన్ ఉంటుంది అలాంటి వ్యక్తులు అధిక మొత్తంలో తీసుకున్న తర్వాత వికారం, నీరసం, దాహం లేదా తేలికపాటి అసౌకర్యం కలుగుతుంది. ఇలా పదేపదే జరిగితే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. అజినమోటో విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అధిక రక్తపోటు ఉన్న రోగులు,  మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారు,  రక్తపోటు  అధికంగా ఉండే   వ్యక్తులు, చిన్న పిల్లలు మొదలైనవారు అజినమోటో విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                     *రూపశ్రీ.  
ఈ రోజుల్లో క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణురాలు డా. శ్రీలత రోజూ ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన 7 ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి సులభంగా వివరించారు. ఈ ఆహారాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎలా ఉపయోగపడతాయో వివరించారు. అలాగే ఏ ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, వాటిని రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవాటు చేయాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. గమనిక: ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
  వర్షాకాలంలో చాలా మంది పకోరాలు, సమోసాల వంటి వేయించిన ఆహారాల కంటే మొక్కజొన్నను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మొక్కజొన్నలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్య పరంగా చూసినా మొక్కజొన్న చాలా మంచిది.   అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది, కాబట్టి మొక్కజొన్నను సరైన పద్ధతిలో , సరైన పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం.  వర్షాకాలంలో మొక్కజొన్న తినడం కొందరికి ఆరోగ్యపరంగా మేలు చేస్తే.. మరికొందరికి హాని కూడా కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో మొక్కజొన్న తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, మొక్కజొన్న తినడంలో  పాటించాల్సిన జాగ్రత్తలు ,  మొక్కజొన్న తినడానికి సేఫ్ మార్గం.. ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటే.. వర్షాకాలంలో మొక్కజొన్న.. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం  మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మొక్కజొన్నలోని రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం , బి విటమిన్లు కూడా శక్తిని అందించడానికి , శరీరంలో జరిగే క్రియలను నిర్వహించడానికి తగిన శక్తి అందిస్తుంది. అందుకే వాతావరణ పరంగానే కాకుండా  ఆరోగ్య పరంగా కూడా మొక్కజొన్న ఆరోగ్యానికి చాలామంచిది. అసిడిటి, గ్యాస్, ఉబ్బరం సమస్యలుంటే.. గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరంతో బాధపడేవారికి, ఉడికించిన మొక్కజొన్న  మంచిది. ఉడికించిన మొక్కజొన్న మృదువుగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. అయితే, దీనిని ఎక్కువ సేపు ఉడికించడం వల్ల దానిలోని కొన్ని పోషకాలు , రెసిస్టెంట్ స్టార్చ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఐబియస్ ఉన్న వ్యక్తులకు..  ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉంటే, మొదట్లో దీనిని అర కంకికి, అంటే సుమారు 35–40 గ్రాములకు పరిమితం చేసుకుని తినడం మంచిది. ఎక్కువ మొత్తంలో స్వీట్ కార్న్ లేదా నార్మల్ కార్న్  తినడం వల్ల కొంతమందిలో గ్యాస్ , ఉబ్బరం పెరగవచ్చు. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత.. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారికి ఉడకబెట్టిన లేదా ఆవిరి మీద ఉడికించిన మొక్కజొన్న మంచిదిగా. దీని గ్లైసెమిక్ ఇండెక్స్, వేయించిన మొక్కజొన్న కంటే తక్కువగా ఉంటుంది. ఒకసారికి అర కప్పు ఉడికించిన మొక్కజొన్న లేదా ఒక చిన్న మొక్కజొన్న కంకి సరిపోతుంది. మొక్కజొన్నలో ల్యూటిన్ , జీక్సాంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. మొక్కజొన్నను కొద్దిగా ఆవిరి మీద ఉడికించడం వల్ల ఈ పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుతాయి. మొక్కజొన్న తినేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. మొక్కజొన్నపై అధికంగా వెన్న, చీజ్ లేదా ఉప్పు వేసుకుని తినకూడదు.  అసిడిటీ సమస్యలు ఉంటే, మసాలాలు , నిమ్మరసం వాడకాన్ని తగ్గించాలి. మాడిపోయిన లేదా బాగా వేయించిన మొక్కజొన్నను తినడం మానుకోవాలి.  ఎల్లప్పుడూ తాజాగా, బాగా ఉడికించిన మొక్కజొన్నను తినడం మంచిది. మొక్కజొన్నను బాలెన్స్డ్ గా తీసుకోవడం మంచిది.  అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.                                    *రూపశ్రీ.