LATEST NEWS
  కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడ పాలిటిక్స్ హీటెక్కింది.  కుప్పంలో చంద్రబాబు గెలవరని గతంలో మాజీ మంత్రి కొడాలి నాని  చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ తెలుగు దేశం పార్టీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు  బూట్‌ను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లు‌గా నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర ఉంటానంటూ కొడాలి నాని చేసిన చాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ గుడివాడ టీడీపీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటైంది.  మరోవైపు బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అంటూ వైసీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. దీంతో పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడ రాజకీయం గరం గరంగా మారింది. మరోవైపు ఇవాళ గుడివాడలో వైసీపీ నాయకుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి పేర్నినాని ముఖ్యఅతిథిగా హాజరవడంతో ఉద్రిక్తత నెలకొంది. చీకట్లో కన్నుకొడితే.. తలలు నరికేయండి అంటూ పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా రెండు రోజుల నుంచి పేర్నినాని చేస్తున్న కామెంట్స్‌కు నిరసనగా... నాగవరప్పాడు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేశారు. అయితే ఫ్లెక్సీని చించకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.  
  ఏపీలో నిరుద్యోగ అర్చకులకు రాష్ట్ర  దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి  శుభవార్త చెప్పారు. 590 మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని.. వారికి నెలకు రూ.3 వేల భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.  దేవాదాయశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్నిర్మాణంలో ఉన్న ఆలయాలకు రూ. 147 కోట్లు విడుదల కాకుండా నిలిచిపోయాయన్నారు. వీటన్నింటిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.  సంయుక్త సమావేశంలో టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో సమీక్షించి తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆనం తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబుతో నిర్వహించిన సమీక్షలో ఆలయాలకు సంబంధించిన పలు సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఆయా సమస్యలపై చర్చించి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రీవాణి ట్రస్టు నిధులపై నిర్ణయం తీసుకుంటామని బోర్డు చెప్పింది. విజయవాడ దుర్గ గుడికి మరో రోడ్డు వేసేందుకు టీటీడీ సహకారం కావాలి. తిరుమల దేవస్ధానం బోర్డులో అన్యమతస్థులు ఉన్న విషయం వాస్తవం. టీటీడీ బోర్డులో దాదాపు 1000 మంది అన్యమతస్థులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ కొనసాగుతోందన్నారు. 
అధికార కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట. అటువంటి ఆ జిల్లాలోని మునుగోడు నియోజక వర్గంలో మాత్రం జిల్లా మంత్రులకు ఎంట్రీ లేదంట. తన ఇలాకాలో జిల్లా మంత్రులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఎంట్రీ పాస్ ఇవ్వడం లేదంట. ఒక విధంగా చెప్పాలంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారంట. ఆ నియోజకవర్గంలో పర్యటనకు జిల్లా మంత్రులే కాదు.. ఇతర మంత్రులు కూడా వెనకంజ వేస్తున్నారంట. తమ నేతకు మంత్రి పదవి దక్కే వరకు ఇతర మంత్రులు ఎవరూ సెగ్మెంట్లో అడుగుపెట్టకూడదని చిన్న కోమటిరెడ్డి అనుచరులు అల్టిమేటం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హేమాహేమీలైన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి లాంటి దిగ్గజ నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో తమ ప్రాబల్యం చాటుకుంటున్నారు. ప్రస్తుతం జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగినా, తన వారసుల్ని, వర్గీయుల్నీ పార్టీలో ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి రేవంత్ సర్కార్ లో కీలక మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కొనసాగుతున్నారు. అయితే మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరడం లేదు.  బీఆర్ఎస్‌ను ఓడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. అదే ఏడాదిలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి వెనక్కి వచ్చి తిరిగి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చిందంట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంగా మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండో విడత క్యాబినెట్ విస్తరణలో కూడా బెర్త్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు.  జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో పర్యటించారు. కానీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గమైన మునుగోడులో మాత్రం ఇద్దరు మంత్రులూ ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. నియోజకవర్గ సమస్యలపై నేరుగా హైదరాబాదులోని ఉన్నతాధికారులతో  సమీక్షలు నిర్వహిస్తూ.. నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించేవరకు మంత్రులెవ్వరూ మునుగోడులో పర్యటించాల్సిన అవసరం లేదని రాజగోపాల్ రెడ్డి అనుచరులు అల్టిమేటం ఇచ్చారంట.  ఆ క్రమంలో మంత్రి హోదాలో రాజగోపాల్ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గంలో పర్యటించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ పాస్ ఎందుకు ఇవ్వడంలేదో ఎవరికి అంత చిక్కడం లేదట.తనకు మంత్రి పదవి రాకుండా పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డిలు అడ్డుపడి ఉంటారని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని మునుగోడు నియోజకవర్గ పర్యటనకు ఆహ్వానించడం లేదట. సహజంగా వివాదాలకు దూరంగా ఉండే మంత్రి ఉత్తమ్ కూడా మునుగోడులో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదట. పట్టుదలకు మారుపేరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. తనకు మంత్రి పదవి వచ్చేవరకు నియోజకవర్గంలో ఏ మంత్రికి కూడా నో ఎంట్రీ అంటున్నారట. అందుకే రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేస్తున్న ఇతర మంత్రులు సైతం మునుగోడు వైపు చూడటం లేదంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు అంటేనే రాష్ట్ర మంత్రులు దూరంగా ఉంటున్నారట. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ పాస్ లేకుండా మునుగోడు పర్యటనకు వెళ్ళి  కొత్త పంచాయతీ మొదలు పెట్టడం ఎందుకని మంత్రులు భావిస్తున్నారట.
  శ్రీకాళహస్తి జన సేన ఇంచార్జ్ వినుతకోట మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్‌ రాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి. రాయుడిని చిత్రహింసలకు గురి చేసి చంపి.. ఆపై మృతదేహాన్ని తమ కారులోనే వినూత కోటా దంపతులు నదిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. తన మాజీ డ్రైవర్‌ శ్రీనివాసులు అలియాస్‌ రాయుడిని హత్య చేసిన కేసులో జనసేన పార్టీ ఇంచార్జి వినూత కోటా అరెస్ట్‌ అయ్యారు. వినూత, ఆమె భర్త చంద్రబాబు  తోపాటు మరో ముగ్గురినీ చెన్నై పోలీసులు ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో ఇప్పటిదాకా సాధించిన పురోగతి వివరాలను చెన్నై కమిషనర్‌ అరుణ్‌ మీడియాకు వెల్లడించారు.  రాయుడు ఆంధ్రాలో మర్డర్ చేసి చెన్నై లో పడేశాడు. హత్యకు ఉపయోగించిన కారు ఆధారంగా కీలక సమాచారం సేకరించాం. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. ప్రస్తుతం వాళ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చెన్నై మింట్ పీఎస్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినుత పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.  ఈ క్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబు పోలీసులు విచారించారు. మూడు నెలలుగా రాయుడుకు వినుత కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నాయని తెలిపింది. రాయుడు మృతికి వినుత కుటుంబ సభ్యులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. రాయుడు నానమ్మ ఫిర్యాదు మేరకు వినుత, ఆమె భర్త కోట చంద్రబాబు, వినుత తండ్రి భాస్కర్‌లని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసుని ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఆపై అది ఆమె మాజీ డ్రైవర్‌ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు.  కోట వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉందని, గత కొంతకాలంగా ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదు అయిన విషయం పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే, తక్షణమే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన అధిష్ఠానం ప్రకటించింది. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెంపరితనం వెర్రితలలు వేస్తోంది.  ఉక్రెయిన్ తో నాన్ స్టాప్ వార్ చేస్తోన్న ర‌ష్యాను క‌ట్ట‌డి చేయ‌డానికి ఆయనొక కొత్త మార్గం క‌నిపెట్టారు. దానిపేరే భారీ ఎత్తున సుంకాల విధింపు. గ‌త కొంత కాలంగా భార‌త్ ర‌ష్యా నుంచి పెద్ద ఎత్తున చ‌మురు కొంటోంది. ఒక్క భారత్ మాత్ర‌మే కాదు ర‌ష్యా నుంచి చైనా, ట‌ర్కీ, ఇత‌ర ఆఫ్రిక‌న్ దేశాలెన్నో చ‌మురు దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే ఇక్క‌డ విడ్డూర‌మేంటంటే.. ర‌ష్యాపై తాము అధిక సుంకాలు విధించి శిక్ష విధించ‌ద‌లుచుకున్నాం కాబ‌ట్టి.. ర‌ష్యా నుంచి చ‌మురు కొనే దేశాల నుంచి మా దేశంలో దిగుమ‌తి చేసే వ‌స్తువుల‌పై 500 శాతం మేర ప‌న్ను విధిస్తామంటున్నారు.  ఈ బిల్ల‌ును రిప‌బ్లిక‌న్ సెనెట‌ర్ గ్రాహం ఏప్రిల్ నెలలో ప్ర‌తిపాదించ‌గా.. దాన్ని ట్రంప్ కూడా    బాగానే ఉంద‌ని అన్నారు. కేబినెట్ మీటింగ్ త‌ర్వాత ఆయ‌న్ను అడిగిన మీడియా వారికి అవును ఇది నా ఎంపిక అంటూ బాహ‌టంగా కుండ బ‌ద్ధ‌లు కొట్టారాయ‌న‌. ఒక్క గ్రాహంతో పాటు 84 మంది సెనెట‌ర్లు.. ఈ ర‌ష్య‌న్ ఈ శాంక్ష‌న్ బిల్- 2025కి మ‌ద్ధ‌తుగా ఉన్నార‌ట‌. ఈ బిల్లు వ‌చ్చే ఛాన్సు లేదు కానీ.. ఒక వేళ వ‌స్తే ప‌రిస్థితి ఏమిట‌న్న చ‌ర్చ కూడా మొద‌లైంది. ఒక వేళ ఇదే జ‌రిగితే.. ప్ర‌పంచం రెండుగా చీలినా ఆశ్చ‌ర్యం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరికాతో ఉన్న దౌత్య, వాణిజ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తింటాయి. అంతే కాదు ఇక‌పై వాషింగ్ట‌న్ పై ఆధార‌ప‌డే దేశాలు కాస్తా.. ఢిల్లీ, మాస్కో, బీజింగ్ వైపు చూస్తాయి. దీంతో పెద్ద ఎత్తున అమెరికా వ్యాపారులు, వినియోగ‌దారులు న‌ష్ట‌పోతారు. అంతేకాదు ఎల‌క్ట్రానిక్, ఆటోమొబైల్ వంటి యూఎస్ సెక్టార్స్ లో ద్ర‌వ్యోల్బ‌ణం వ‌స్తుంది. దీంతో అమెరికా తీవ్ర న‌ష్టాల పాలు అవుతుంది. అయితే ఇక్క‌డే భార‌త‌ పెట్రోలియం మంత్రి హ‌ర్ దీప్ సింగ్ పురీ.. ఇదంతా  ప్ర‌పంచానికే మేలు చేసేద‌ని అన్నారు. తాము ర‌ష్యా నుంచి చీపుగా పెట్రోలు కొన‌డం వ‌ల్ల‌.. ప్ర‌పంచ‌ పెట్రోలు ధ‌ర‌లు నియంత్రణలో,  అందుబాటులో ఉన్నాయ‌ని.. అదే ర‌ష్యా రోజుకు ఉత్ప‌త్తి చేసే 9 మిలియ‌న్ బ్యార‌ళ్ల చ‌మురు అలాగే నిలిచి పోతే.. ఆ మేర‌కు ఈ చ‌మురు ఇత‌రుల నుంచి కొనాల్సి వ‌స్తుంది. త‌ద్వారా.. చ‌మురు ధ‌ర‌లు బ్యార‌ల్ కి 120 నుంచి 130 డాల‌ర్లకు పెరుగుతుంది, కాబ‌ట్టి తాము చేసింది స‌రైన పనే అన్నారు కేంద్ర మంత్రి హ‌ర్ దీప్ సింగ్ పురి. ఇక్క‌డ గుర్తించాల్సిన మ‌రో  విష‌య‌మేంటంటే.. చ‌మురు ధ‌ర‌ల‌పై ఆంక్ష‌లున్నాయి కానీ చ‌మురు కొనాలా  వ‌ద్దా అన్న కోణంలో ఆంక్ష‌లు విధించ‌లేద‌ని అంటారు మ‌న  కేంద్ర‌మంత్రి. అయితే ఈ విష‌యంపై ర‌ష్యా స్పందిస్తూ.. ఇలాంటి బిల్లులు అమెరిక‌న్ కాంగ్రెస్ పాస్ చేస్తే.. ఇక ఆ దేశాన్ని ఎవ్వ‌రూ కాపాడ‌లేర‌ని అంటోంది. అంతే కాదు.. ఉక్రెయిన్ కి తాము సైనిక‌ సాయం చేస్తామ‌ని అమెరికా ప్ర‌క‌టించినంత‌నే ర‌ష్యా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు చేసి ఉక్రెయిన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అంటే యూఎస్ ఎంత ర‌ష్యాను క‌ట్ట‌డి చేయాల‌ని చూస్తే ఆ దేశం మ‌రింత  రెచ్చిపోతుంది. ఈ విషయం ఇప్పటికే రుజువైంది.   అయినా రష్యాతో గొడ‌వ ఉంటే ఆ దేశంతో చూసుకోవాలి. కానీ ఇలా ఇత‌ర దేశాల మీద ప్ర‌తాపం  చూపిస్తామ‌న‌డ‌మేంటి? భార‌త్ -పాక్  మద్య సత్సంబంధాలు లేవు. అయినా  అలాంటి పాక్ అమెరికా అక్కున చేర్చుకుని సహకారం అందించడం లేదా?  అలాగే పాక్ కి డ్రోన్ సాయం చేసిన ట‌ర్కీకి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌లేదా? అమెరికా చేస్తే నీతి ప‌క్క‌నోళ్లు చేస్తే ద్రోహ‌మా? అంటూ అమెరిక‌న్ విధానాల‌ను దుమ్మెత్తి పోస్తున్నారు   అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల నిపుణులు.
ALSO ON TELUGUONE N E W S
Director Shankar fell from being the most sought-after filmmaker to a career low with his Indian 2 and Game Changer. Now, he is unable to convince his producers to finish Indian 3 as there is no hype or buzz around it to really take it forward.  Shankar for the first time in his career, decided to make two films at the same time and even can call as 3, and this backfired big time. His I, 2.0 did not satisfy everyone but still recovered investment to some extent. But Indian 2 and Game Changer have ended up being such debacles that his career will end up in doldrums.  The director recently announced at an event that he would be using Avatar kind of techncial advancement in his next film, Velpari. The movie is based on a novel written by S. Venkatesan based on a true Tamil King from Sangam period and a close friend of poet Kabilar.  Superstar Rajinikanth also stated that he would be waiting to watch it, who was present at the same event. Shankar went on to state that Velpari is his second dream project after Enthiran. But the problem lies in his present form compared to form he was in while making Enthiran/ Robo.  The twin disasters and unreleased Indian 3 have left such a mark on his career that even if he tries to find a big financier for Velpari, he might have to convince three to four stars to star in it, as it would be demanding Rs.500-800 crores budget at least for one part. He did plan it as two to three part film.  We have to wait and see, if Shankar can find a way to navigate through these failures and bring a star cast that would mesmerise audiences to watch this Magnum Opus on big screens in theatres again.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
DC has suspended their contract with filmmaker Zack Snyder, after extreme negative reviews to Batman vs Superman: Dawn of Justice League. They even asked him to re-work on Justice League and when he had to leave due to family emergency, they brought in Joss Whedon and Snyder fans did not like the cut.  They have put pressure on the studio to finish and release Zack Snyder Justice League extended cut. The petitions on Internet have shaken WB Studios to such a level that they have caved to fan pressure and finished the VFX of ZSJL and released it on their OTT platform.  The cut has broken records in viewership and many praised few scenes as the extended cut did seem to be cohesive than the original while not all liked it. Now, James Gunn has been given DC Universe responsibilities and he released his first film, Superman, as the new head and producer for DC Films and TV series.  But the Superman did not gain rousing positive reception and Zack Snyder fans have started another Internet war with Restore Snyder Verse (#RestoreSnyderVerse) tweets, post s on social media. They are stating that the fan power will once again bring DC to their feet and make them accept their request.  DC bet heavily on Justice League, Batman vs Superman that their box office returns ended up securing losses. Even the direction that studio adapted with rest of the films trying to balance fun and dark stories, did not work for the studio. So, they went with James Gunn's take on their popular stories.  While Superman did not really appeal to many, the movie could still pull in good returns as it is not outrightly rejected at least from initial reactions. DC might give James Gunn few more years and films, before trying to again reboot or find a new direction.  Meanwhile, if MCU again succeed to find their prime, we cannot say if they would be pressured to stay relevant in competition. For now though, it is too early to decide upon new DCU future as few more films have been lined up and Studio can't change decisions with every film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)త్రిపాత్రాభినయం చేసిన మూవీ 'జై లవకుశ'(jai lava kusa). 2017 వ సంవత్సరంలో విడుదలై   మంచి విజయాన్ని అందుకుంది. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లలో ఎన్టీఆర్ తన నటవిశ్వరూపం చూపించడంతో పాటు, అభిమానులకి కూడా ఒక మెమొరీబిల్ మూవీగా నిలిచింది. ఈ మూవీ ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ నటుడు 'రోనీత్ రాయ్'(Ronit Roy). 'సర్కార్ సాహై' అనే ప్రతి నాయకుడి క్యారక్టర్ లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)హీరోగా వచ్చిన 'లైగర్' లో కూడా క్రిస్టోఫర్ అనే కోచ్ పాత్ర రోనీత్ కి మంచి గుర్తింపుని తెచ్చింది. రీసెంట్ గా రోనీత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు సినిమాల్లోకి రాకముందు కడుపునిండా తినడానికి సరిపడా డబ్బులు  ఉండేవి కావు. దీంతో కొన్ని సార్లు ఒక్కపూట మాత్రమే భోజనం చేసేవాడిని. బాంద్రా స్టేషన్ రోడ్ లో ఉండే  ధాబాలో రోజు రెండు రోటీలు, కూర తినేవాడ్ని.ఒకసారి నా వద్ద డబ్బుల్లేక రోటీలు మాత్రమే తీసుకుంటే, ఓనర్ గమనించి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. రోజు తినే లాగానే తినండని కూర కూడా ఇచ్చాడు. అతని ముఖం ఇంకా గుర్తు ఉందంటు రోనీత్ కన్నీళ్లతో చెప్పుకొచ్చాడు.  1992 లో విడుదలైన 'జానే తేరే నామ్'(Jaane tere Naam)అనే చిత్రం ద్వారా హీరోగా  పరిచయమైన రోనీత్ రాయ్ ఆ తర్వాత హీరో, క్యారక్టర్ ఆర్టిస్ట్ విలన్ గా పలు భాషల్లో సుమారు అరవై చిత్రాల వరకు చేసాడు. రీసెంట్ గా గత నెల 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మైథలాజికల్ హర్రర్ ఫిలిం 'మా' లో జోయ్ దేవ్ పాత్రలో మరోసారి మెప్పించాడు.  కాజోల్  (Kajol)ప్రధాన పాత్రలో 'మా'(Maa)మూవీ తెరకెక్కింది.  
Youtuber Ashish Chanchalani has grown highly popular with his versatile vines and comedy sketches. He grew so popular to be recognised as one of the biggest social media influencers from India. Recently, his relationship with actress Elli Avram has been hitting tabloids, regularly.  Both of them remained silent for a long time without revealing any sort of details. Now, they both have released pic showcasing Ashish lifting Elli in his arms at a pictersque location, which appears to be in Venice. The couple have posted the picture together, in their respective social media accounts stating - "Finally".    If he proposed marriage to her or if they got their parents' blessings or if they are just promoting some sort of a video, netizens are completely confused about it. But the flower bouquet and the blush on their faces suggest it is a serious and real relationship. If it is real, we wish the couple, a happy and successful life ahead.  Elli Avram, the Swedish-Greek Actress, appeared in Mickey Virus, Butterfly, Kis Kisko Pyaar Karoon, Naane Varuvean, Conjuring Kannappan films in Hindi, Tamil, Kannada and English languages. She appeared on TV in Bigg Boss 7, Jhalak Dikhhla Jaa 7 and hosted The Great Indian Laughter Challenge. She also acted in Inside Edge season 2 web series.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  ఒకప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ అంటే ఓ బ్రాండ్. అప్పట్లోనే భారీ సినిమాలు తీసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. 'జెంటిల్ మేన్', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు', 'రోబో' వంటి సినిమాలతో సంచలనం సృష్టించాడు. అలాంటి శంకర్ కొన్నేళ్లుగా వెనకబడిపోయాడు. ముఖ్యంగా గత రెండు చిత్రాలు 'భారతీయుడు 2', 'గేమ్ ఛేంజర్' దారుణంగా నిరాశపరిచాయి. దాంతో ఇక శంకర్ పని అయిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో తాను గ్లోబల్ స్థాయిలో సత్తా చాటే సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తానని ప్రకటించి షాకిచ్చాడు శంకర్.    వేల్పారి అనే ఓ భారీ సినిమాని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్ లో పంచుకున్నాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం వేల్పారి పైనే ఉందని, అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నానని చెప్పాడు. ఒకప్పుడు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ రోబో అయితే, ఇప్పుడు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ వేల్పారి అని అన్నాడు. గ్లోబల్ అప్పీల్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నానని, ఈ చిత్రం తన కెరీర్‌ కి గేమ్ ఛేంజర్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలోని ప్రతి అంశం గ్రాండ్‌ గా ఉంటుందని.. గ్లోబల్ స్టాండర్డ్స్‌లో 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌', 'అవతార్‌' రేంజ్‌లో భారీ వీఎఫ్‌ఎక్స్‌తో విజువల్‌ వండర్‌గా వేల్పారి చిత్రాన్ని రూపొందించాలని ఆశ పడుతున్నట్లు శంకర్‌ చెప్పుకొచ్చాడు.    ప్రస్తుతం శంకర్ తో సినిమా అంటేనే నిర్మాతలు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అలాంటిది శంకర్ ఏకంగా 'అవతార్‌' రేంజ్‌ సినిమా కోసం కలలు కంటున్నాడు. మరి ఆయన కల నెరవేరి.. వేల్పారితో కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.  
Cast: Vincy Aloshious, Shine Tom Chacko, Deepak Parambol, Srikanth Kandragula, Naseef, Anagha Annet   Crew:  Written by Rejin S. Babu, Eugien Jos Chirammel Cinematography by Sreeram Chandrasekharan Edited by Nithish K.T.R. Music by Jean P Johnson Directed by Eugien Jos Chirammel Produced by Srikanth Kandragula Vincy Aloshious gave a sexual harassment complaint against Shine Tom Chacko stating that he danced in front of her showing his genitalia. The controversial actor booked under narcotic drug abuse had to apologise to her which gave more attention to their film, Soothravakyam. Majorly, many got interested to see if the controversy is the only highlight of the film or there is good content. The movie released now, and let's discuss about the movie in detail.  Plot: SHO Christo Xavier (Shine Tom Chacko) runs free tution classes to 11th class students helping them to understand tough mathematical concepts. Students start to like his classes so much, they bunk school to attend his classes. Teacher Nimisha (Vincy Aloshious) gets irritated by this and complaints to him. He asks students to not bunk classes ever. His ability to connect with them despite a tough exterior makes him  a local favorite. Even Nimisha starts to connect with him.  Arya (Anagha Annet), one of the students, is hit and abused by her elder brother, Vivek (Deepak Parambol), who is 12 years elder to her. She complaints about it to Nimisha and she takes it to Christo. Arya's boyfriend Akhil (Naseef) doesn't like her being bullied by her elder brother. Christo hits Vivek and asks him to not abuse Arya. But he tracks her and Akhil, when he is celebrating her birthday and hits them both, black and blue. What happens next? Why he hates her so much? What did Christo do in this situation?  Analysis:  Malayalam Industry has been able to master the class of writing engaging screenplays. They are able to make people sit through even simple films and even while executing, most of them, look to keep it real. Soothravakyam doesn't try to present things in an over-dramatic way and succeeds in sustaining interest for long time. But it drags the conclusion in the second hour and the writing feels a shady bit convenient too.  While the set-up keeps everyone engaged, the conclusion drags it out when people are able to predict the outcome. Soothrakaryam should have been able to add even more interesting elements to the investigation as it looked very simple. While the realistic nature of the film is appreciable, these scenes needed some strong set up so the pay-off would have been better.  Eugien Jos Chirammel's vision in not going overboard in presenting any emotion and characters makes this an appreciable attempt. With better writing and strong investigation portions, the movie would have benefitted heavily. Shine Tom Chacko proves himself to be a versatile actor without resorting to any sort of eccentricities, he got renowned for. His ability to carry this do-gooder role without an ounce of hesitation, makes it one of his best performances, after being typecast.  Naseef, Anagha Annet, Deepak Parambol characters had lot of layers but writing did not explore them as much as the story needed. It provides us details about them but not let us understand them. Still, their performances make it believable that such characters exist. Vincy Aloshious got first credit but she did not have such strong role in the film. Looks like the controversy did help her. Overall, the movie is a decent thriller with themes about male chauvinism, hatred, harassment and redemption, inclusivity.    Bottomline:  Soothravakyam is decent and watchable with dragged out portions remaining as sore thumb.  Rating: 2.75/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. So, we would encourage viewers' discretion before reacting to them. 
అక్కినేని 'నాగచైతన్య'(Nagachaitanya)ఫస్ట్ మూవీ 'జోష్' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి 'శ్రీయ ధన్వంతరి'(Shreya Dhanwanthary). చైతన్య క్లాస్ మేట్ గా భావన అనే క్యారక్టర్ ద్వారా మంచి గుర్తింపుని పొందిన శ్రీయ, ఆ తర్వాత హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసి 'వై చీట్ ఇండియా, చుప్, అద్భుత్ వంటి పలు చిత్రాలతో పాటు వెబ్  సిరీస్ లు కూడా చేస్తు తన సత్తా చాటుతుంది. నిన్న వరల్డ్ వైడ్ గా 'సూపర్ మాన్'(Superman)మూవీ రిలీజైన విషయం తెలిసిందే. ఇండియా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో విడుదల కాగా, ఇండియా వెర్షన్ కి సంబంధించి హీరో హీరోయిన్ పై తెరకెక్కిన ముప్పై మూడు సెకన్ల నిడివి ఉన్న ముద్దు సన్నివేశాన్ని సెన్సార్ వాళ్ళు  తొలగించడం జరిగింది. ఈ విషయం పై శ్రీయ ఇనిస్టా వేదికగా స్పందిస్తు  ముద్దు సన్నివేశాన్ని సెన్సార్ వాళ్ళు కట్ చెయ్యడం చాలా విచిత్రంగా ఉంది. ప్రజలు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలని వాళ్లే కోరుకుంటారు. కానీ ఇలా ముద్దు సన్నివేశాలు తీసేస్తే ప్రేక్షకులకి  థియేటర్ అనుభూతి ఏమి ఉంటుంది. మా డబ్బు ,మా సమయంతో మేము ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. ప్రేక్షకుల్ని చిన్నపిల్లలాగా సెన్సార్ వాళ్ళు భావిస్తున్నారని శ్రీయ ఇనిస్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. సూపర్ మాన్ తొలిరోజు ఇండియాలో 6 .9 కోట్ల  రూపాయిల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. డేవిడ్ కోరెన్సవెట్(DavidCorenswet), రాచెల్ బ్రోస్ నహన్(Rachel Brosnahan), నికోలస్ హాల్ట్ కీలక పాత్రలు పోషించగా  జేమ్స్ గన్(James Gunn)స్వీయ దర్శకత్వంలో  తెరకెక్కింది.    
ఒకప్పుడు పూర్తి స్థాయి కామెడీ సినిమాలు వచ్చేవి. అలాగే పూర్తి స్థాయి హారర్‌ మూవీస్‌ వచ్చేవి. హారర్‌తో కామెడీని మిక్స్‌ చేసి సినిమా చెయ్యడం అనేది ఎంతో రిస్క్‌తో కూడుకున్నది. ఆ ఫీట్‌ని సమర్థవంతంగా పూర్తి చేసిన ఘనత రాఘవ లారెన్స్‌కి దక్కుతుంది. 2007లో అతని డైరెక్షన్‌లోనే వచ్చిన ‘ముని’ చిత్రం పూర్తి స్థాయి హారర్‌ మూవీగా ఉంటుంది. ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కాంచన’ చిత్రానికి కామెడీని కూడా మిక్స్‌ చేశారు. ఈ సినిమా తమిళ్‌, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించింది. హారర్‌ కామెడీ చిత్రాలకు శ్రీకారం చుట్టి ఆ తర్వాత ఈ తరహా సినిమాలు మరిన్ని రావడానికి దోహదపడ్డారు లారెన్స్‌. ఈ సిరీస్‌లో భాగంగానే 2019లో ‘కాంచన3’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ‘కాంచన4’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లారెన్స్‌.  ముని సిరీస్‌లో వస్తున్న ఈ సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. లారెన్స్‌ నుంచి ఈ సిరీస్‌లో ఏ సినిమా వచ్చినా విపరీతంగా ఆదరిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి మూడు భాగాల కంటే హారర్‌, కామెడీ పాళ్లు పెంచి ‘కాంచన4’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లారెన్స్‌. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం మహాబలిపురంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను లారెన్స్‌, పూజా హెగ్డే, ఇతర ముఖ్య తారాగణంపై చిత్రీకరిస్తున్నారు. కామెడీ హారర్‌ చిత్రాలుగా వచ్చిన కాంచన, కాంచన3 చిత్రాలను మించిన స్థాయి కామెడీ కాంచన4లో ఉంటుందని, అలాగే ప్రేక్షకుల్ని మరింత భయపెట్టేందుకు ఈ సినిమాలో కొన్ని కొత్త ఎలిమెంట్స్‌ని చూపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ను త్వరలోనే పూర్తి చేసి ఆగస్ట్‌లో చివరి షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేస్తారు.  ఆగస్ట్‌లో ప్రారంభమయ్యే చివరి షెడ్యూల్‌తో ‘కాంచన4’కి సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివరలో సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కాంచన 4కి బాలీవుడ్‌ మార్కెట్‌లో కూడా మంచి హైప్‌ ఉండడంతో ఈ సినిమాను పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో వచ్చిన కాంచన సిరీస్‌లో లేని నటీనటులు ఈ సినిమాలో ఉంటారని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలకు మించిన స్థాయిలో కాంచన 4కి ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాకి 100 కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆ స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘కాంచన4’కి ఉన్న బజ్‌ చూస్తుంటే తప్పకుండా ఇది కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. 
  కొన్ని కాంబినేషన్స్ కేవలం ప్రకటనతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ మధ్య కాలంలో అలా అందరి దృష్టిని ఆకర్షించిన కాంబినేషన్స్ లో ఒకటిగా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోను చెప్పుకోవచ్చు. వీరి కలయికలో మొదటి సినిమా రూపొందుతోంది. మెగాస్టార్ కెరీర్ లో 157 గా సినిమాగా రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.   'మెగా 157' మూవీ 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు తగ్గట్టే ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. అదేంటంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.   చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్. అదే పేరుని ఈ సినిమాలో చిరు పాత్రకు పెట్టారు. టైటిల్ కూడా అదే పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో.. 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ను లాక్ చేసినట్లు వినికిడి. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది.    అయితే శంకర్ అనే పేరు మెగా ఫ్యాన్స్ లో కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే చిరంజీవి గత చిత్రం 'భోళా శంకర్' పరాజయం పాలైంది. దాంతో కొందరు ఫ్యాన్స్ దానిని నెగటివ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అయితే ఎటువంటి ఆందోళన అక్కర్లేదని చెబుతూ.. గతంలో చిరంజీవి 'శంకర్ దాదా ఎంబీబీఎస్'తో బ్లాక్ బస్టర్ కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.   అనిల్ రావిపూడికి అపజయమెరుగని దర్శకుడిగా పేరుంది. వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా గత చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. అలాంటి రావిపూడి మొదటిసారి మెగాస్టార్ తో చేతులు కలిపాడు. అనిల్ రావిపూడికి కామెడీ డైరెక్టర్ గా అదిరిపోయే క్రేజ్ ఉంది. ఇక చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు కలిసి వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే అవకాశముంది.  
తమిళ సూపర్ స్టార్ 'రజినీకాంత్'(Rajinikanth)తన అప్ కమింగ్ మూవీ 'కూలీ'(Coolie)తో ఆగష్టు 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna)ముఖ్య పాత్రలో చేస్తుండంతో పాటు, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)దర్శకుడు కావడంతో 'కూలీ'పై అభిమానులతో పాటు సౌత్ సినీ పరిశ్రమ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా రజనీ చెన్నై వేదికగా జరిగిన 'వేల్పారి' పుస్తక విజయోత్సవ సభకి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రామకృష్ణ ఆశ్రమం(Ramakrishna Ashramam)వల్ల పుస్తక పఠనం అలవాటు అవ్వడంతో,ఇప్పటి వరకు ఎన్నో గొప్ప పుస్తకాలు చదివాను. 'వేల్పారి'(vel pari) పుస్తకం చదవడం ఇరవై ఐదు శాతం పూర్తి చేశాను. సినిమాల నుంచి రిటైర్ అయ్యాక మొత్తం కంప్లీట్ చేస్తాను. నిజానికి ఇలాంటి ఫంక్షన్స్ కి మేధావులైన కమల్ హాసన్ , శివకుమార్ లాంటి వాళ్ళని పిలవాలి. డెబ్భై ఐదేళ్ల వయసులో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని స్లో మోషన్ లో నడిచే నన్ను ఎందుకు పిలిచారో అర్ధం కావడం లేదు. ఈ ఈవెంట్ లో ఆచితూచి మాట్లాడుకుంటున్నాను. గతంలో ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు 'మనం ఏం మాట్లాడాలనేది విజ్ఞానం. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ. ఎంత మాట్లాడాలనేది స్టేజ్. ఏం చెప్పాలి. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అని  చెప్పాను. దాంతో నా మాటలు వివాదానికి దారి తీశాయని చెప్పుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలకి ముందు తెలుగుదేశం(TDP)పార్టీ  వ్యవస్థాపకుడు ఎన్టీఆర్(Ntr)శత జయంతి ఉత్సవాలకి రజనీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన పైన చెప్పిన వ్యాఖ్యలు చేసాడు. దాంతో అప్పటి ప్రభుత్వానికి చెందిన కొంత మంది రజనీ ని విమర్శించారు.  ఇప్పుడు ఆ వ్యాఖ్యలని వేల్పారి పుస్తక సభలో రజనీ గుర్తు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రచయిత 'సు వెంకటేశన్'(su Vekatesan)రాసిన ఉత్తమ రచనలలో 'వేల్పారి' కూడా ఒకటి. ప్రాచీన కాలంలో 'వేల్పారి' అనే రాజు తమిళ సాహిత్యానికి చేసిన కృషితో పాటు పలువురుతో  చేసిన యుద్దాలు గురించి పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది.      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా.. ప్రతి ఒక్కరూ పరిపూర్ణ భాగస్వామి కావాలని కోరుకుంటారు. అలా కోరుకున్నప్పటికీ కొంతమందికి వారి హృదయాలను ముక్కలు చేసే భాగస్వాములు  జీవితంలోకి వస్తుంటారు.  ఇలాంటి పరిస్థితిలో హృదయంతో పాటు, మనస్సును కూడా  చురుగ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు, భాగస్వామి సరిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి, వారి విషయంలో తీసుకునే నిర్ణయాలు తప్పా, ఒప్పా అనే విషయం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది.  చాలా సార్లు ప్రేమ గా ఉన్నప్పుడు ఎదుటివారు ఏదైనా తప్పు చేసినా సరే.. ఆ తప్పులను  విస్మరిస్తుంటారు. అలా తప్పులను పట్టించుకోకపోవడం అనేది సరైనదే.. కానీ అన్నిసార్లు అది సరైనది కాదు.  మగవాళ్లలో ఉండే మూడు లక్షణాలు పైకి చెప్పుకొన్నంత సాధారణమైని కావు. ఇవి అమ్మాయిల జీవితాలను నరకప్రాయంగా మారుస్తాయి.  అబ్బాయిలలో ఉండే అలాంటి లక్షణాలు ఏంటి తెలుసుకుంటే.. నియంత్రణ.. కొంతమంది అబ్బాయిలు నియంత్రణ స్వభావం కలిగి ఉంటారు. వారు ప్రతి విషయంలోనూ భార్యలను  నియంత్రించాలని కోరుకుంటారు. ఇది అబ్బాయిలలో పెద్ద చెడు లక్షణం.  భర్త భార్యను   ప్రతిదానిలోనూ నియంత్రిస్తుంటే..  ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏమి తినాలి? ఇలాంటివి అనిపిస్తుంటే అప్పుడు  అమ్మాయిల ఆలోచన  ఎలా అనిపిస్తుంది? ప్రారంభంలో, అలాంటి స్వభావం మంచిగా అనిపించవచ్చు. కానీ క్రమంగా  అలాంటి సంబంధంలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇలా  నియంత్రించడం ప్రేమ లేదా శ్రద్ధ కాదు, అది  బలవంతం. అలాంటి భాగస్వాములు భార్యల నమ్మకాన్ని నాశనం చేస్తారు.  దీని కారణంగా  క్రమంగా తమను తాము కోల్పోయామని అమ్మాయిలు బాధపడతారు. టే, ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏమి తినాలి? అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రారంభంలో, అలాంటి స్వభావం మంచిగా అనిపించవచ్చు. కానీ క్రమంగా మీరు అలాంటి సంబంధంలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ప్రకృతిని నియంత్రించడం ప్రేమ లేదా శ్రద్ధ కాదు, బలవంతం. అలాంటి భాగస్వాములు మీ విశ్వాసాన్ని నాశనం చేయవచ్చు, దీని కారణంగా మీరు క్రమంగా కోల్పోయినట్లు అనిపించడం ప్రారంభిస్తారు. ప్రతి విషయంలోనూ తాము సరైనవారని నిరూపించుకునే అలవాటు.. అబ్బాయిలు ఏ విషయంలో అయినా, ఎలాంటి పరిస్థితిలో అయినా, వారివైపు ఎలాంటి తప్పిదం ఉన్నా సరే.. వారు ఏ పోరాటంలోనైనా, చర్చలోనైనా లేదా సంభాషణలోనైనా తమ తప్పులను చూడరు. వారు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు. అలాంటి వ్యక్తులు తమ సొంత మాటలను మాత్రమే సరైనవిగా భావిస్తారు.  వాటిపై చర్య తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి వ్యక్తులతో జీవితం నరకం.  అలాంటి వ్యక్తులు మానసికంగా పరిణతి చెందరు. అలాంటి వ్యక్తితో జీవించడం చాలా నిరాశకు గురి చేస్తుంది. అమ్మాయిలు కోరుకునే అందమైన జీవితం ఇవ్వడంలో ఇలాంటి అబ్బాయిలు కంప్లీట్ గా ఫెయిల్ అవుతారు. అలాంటి వ్యక్తి  మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడు చేసే అవకాశం ఉంది. అతిగా అనుమానించే అబ్బాయిలు.. భార్యలను అనుమానించే భర్తలు చాలానే ఉంటారు.  ఇలా అతిగా అనుమానించే భర్తలు భార్యలకు నరకం పరిచయం చేస్తారు. భాగస్వామి గురించి కొంచెం ఆందోళన చెందడం సరే, కానీ ప్రతిదానిపైనా సందేహం లేదా అసూయ కలిగి ఉండటం చాలా తప్పు. అలాంటి అబ్బాయిలకు తమ భాగస్వామి స్నేహంతో సమస్యలు మొదలవుతాయి.  చేసే ప్రతి పనికి  అనుమానంగా చూస్తారు. అలాంటి సంబంధం నెమ్మదిగా పాయిజన్ గా  మారుతుంది.                                *రూపశ్రీ.  
  ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం  ఉద్దేశ్యం ప్రపంచంలోని జనాభాకు సంబంధించిన సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించడం. 2025 నాటికి ప్రపంచ జనాభా 806.19 కోట్లు దాటిందని అంచనా. ఐక్యరాజ్యసమితి 1989లో ఈ దినోత్సవాన్ని  ప్రకటించింది. కానీ దీనిని మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా జూలై 11, 1990న జరుపుకున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం  అంటే   జనాభా లెక్కలను ప్రజలకు తెలియజేయడమే కాదు, పెరుగుతున్న జనాభా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం,  వాటికి పరిష్కారాలను కనుగొనడం.  ప్రపంచ వ్యాప్తంగా జనాభా విషయంలో వివిధ దేశాలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కుంటున్నాయి.  భారతదేశ జనాభా గురించి, పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుంటే.. ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవ వేడుకలు 1990 జూలై 11న ప్రారంభమయ్యాయి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం పాలక మండలి ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను ప్రారంభించింది. 1989లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను ప్రకటించింది. ఈ రోజు అంటే జూలై 11, 1987న ప్రపంచ జనాభా సంఖ్య 5 బిలియన్లు దాటినప్పుడు ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే సూచనను మొదట డాక్టర్ కె.సి. జకారియా ఇచ్చారు.   2025 ప్రపంచ జనాభా దినోత్సవం  థీమ్.. ఈసారి 2025 ప్రపంచ జనాభా దినోత్సవం  ఇతివృత్తం, యువతకు న్యాయమైన,  ఆశాజనకమైన ప్రపంచంలో తమకు నచ్చిన కుటుంబాన్ని సృష్టించడానికి సాధికారత కల్పించడం. భారతదేశ జనాభా..    ఐక్యరాజ్యసమితి ప్రకారం, 2025 నాటికి భారతదేశ జనాభా 1,463.9 మిలియన్లుగా ఉండే అవకాశం ఉంది.  భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. నివేదికల ప్రకారం, రాబోయే 40 సంవత్సరాలలో ఈ జనాభా 1.7 బిలియన్లకు చేరుకుంటుంది. అత్యధిక జనాభా కలిగిన 10 దేశాలు.. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 8.2 బిలియన్లు. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారతదేశం  అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా,  ఇథియోపియా ఉన్నాయి. టాప్ 10 దేశాలు ఇవే..   1. భారతదేశ జనాభా (అంచనా) - 1.46 బిలియన్ 2. చైనా జనాభా - 1.42 బిలియన్ 3. అమెరికా జనాభా - 347 మిలియన్లు   4. ఇండోనేషియా జనాభా - 286 మిలియన్లు 5. పాకిస్తాన్ జనాభా - 255 మిలియన్లు 6. నైజీరియా జనాభా - 238 మిలియన్లు 7. బ్రెజిల్ జనాభా - 213 మిలియన్లు 8. బంగ్లాదేశ్ జనాభా - 176 మిలియన్లు 9. రష్యా జనాభా - 144 మిలియన్లు 10. ఇథియోపియా జనాభా - 135 మిలియన్లు                                      *రూపశ్రీ.
విజయం సాధించాలంటే ఎలాంటి మనస్తత్వం వుండాలి? వ్యక్తి ఏరకంగా ఆలోచిస్తే గెలుపు పొందగలడు? అతనిలో ఎలాంటి భావనవుండాలి? ఈ విషయాల గురించి ఒక్కొక్కరు ఒకో విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలుగుతారు. అయితే జీవితంలో ఎన్నో అనుభవాలు చూసి, ఎంతో పరిణితి కలిగిన వ్యక్తి అయితే దానికి చెబుతున్న వివరణ సరైనదేనా కాదా అని చెప్పగలుగుతారు.  ఒకానొకప్పుడు ఒక ఆంగ్ల దినపత్రిక గెలుపుకూ ఓటమికీ తేడా ఎంత??  అనే విషయం గురించి జరిగిన సంఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ వ్రాసినవారికి బహుమతులు ఇస్తామని ప్రకటించింది. దానికోసం ఎంతోమంది ఎన్నో విషయాలను కథలుగా రాసి పంపారు. వాటిలో ఇద్దరు వ్యక్తులు రాసిన కథలు బహుమతులకు ఎంపికయ్యాయి. ఆ రెండు కథలలో ఒక కథను మనం చదివితే మనకు గెలుపు, ఓటమి గురించి ఓ నిర్ధిష్టమైన అవగాహన, నమ్మకం ఏర్పడుతాయి.  ఒక నట్టనడి సముద్రంలో ఒక ఓడ మునిగిపోయింది. అక్కడ అందరూ తమని తాము కాపాడుకోవడానికి అందులో ఏర్పాటు చేసిన లైఫ్ బోట్ లను, చిన్న పడవలను ఉపయోగించుకుంటున్నారు. అవి కొద్దిమొత్తమే ఉండటంతో ఆ ఓడలో ఉన్న అందరికీ అవి సరిపోలేదు. దాంతో ఎంతోమంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సముద్రపు నీళ్లలో ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. సముద్రపు ఒడ్డు ఎంత దూరంలో ఉందొ తెలియకపోయినా ఆశతో ఈదుకుంటూ పోతున్నారు.   ఐదుగురుమాత్రం ఎలాంటి రక్షణ లేకుండా సముద్రంలో  ఈదుతూ వున్నారు. వారికి జీవితం మీద ఆశ వారిని అలా ఈదేలా చేస్తోంది. ఒడ్డు అనేది వారికి వందల మైళ్ళ దూరంలో ఉంది. వారిలో నలుగురికి నిరాశ ఏర్పడింది. ఆఖరుకు మొసళ్ళకు ఆహారం కావలసివస్తుందే అని ఒకడు, ఈనీటిలో చావాలని భగవంతుడు రాసిపెట్టాడని మరొకడు, భార్యాపిల్లలు ఆఖరు క్షణంలో దగ్గరలేక పోయారే అని ఇంకొకడు, తన బ్యాంకులో డబ్బు ఖర్చు చేయకపోతినే అని మరొకడు, ఇలా వాళ్ళకళ్ళముందు తాము అనుభవించని సంతోషాలు, సుఖాల గురించి గుర్తు తెచ్చుకుని బాధపడసాగారు. నలుగురూ తామిక జీవించే ఆశలేదని మనస్సులో నమ్మకానికి వచ్చారు. ఆఖరుకు తమకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం భగవంతుడే అని ఆ భగవంతుని నిందించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారి మనస్సులో బలహీనత వచ్చిందో అప్పటినుంచీ వాళ్లు సరిగా ఈదలేక మరణించారు. అయితే ఆ ఐదో వ్యక్తిమాత్రం “నేను చావను. భగవంతుడు నన్ను అనవసరంగా సృష్టించాడంటే నమ్మను. నేను బ్రతికి తీరాలి" అంటూ శక్తినంతా కూడగట్టుకొని ఈదడం ప్రారంభించాడు. అతడలా ఈడుతూ ఉన్నప్పుడు దృఢనిశ్చయం లేని ఆ నలుగురూ మరణించిన ఐదు నిముషాలకే ఒక విమానం అటు రావడం, దానిలోనివారు ఈదుతున్న వ్యక్తిని చూసి రక్షించడం జరిగింది! ఓడ మునుగుతున్నపుడు కెప్టెన్ వైర్ లెస్ ద్వారా చేసిన విజ్ఞప్తి వలన ఆ విమానం అక్కడికి వచ్చిందని అతడు తర్వాత తెలుసుకున్నాడు. మరణించిన నలుగురిని గుర్తు చేసుకొని విజయానికీ ఓటమికీ తేడా ఐదు నిముషాలని అతడు చెబుతాడు. ఇదీ ఓ కథ. మనిషి జీవితంలో విజయం కోసం పోరాడుతూ మధ్యలో ఏదో నిరాశను తెచ్చుకుని దానికారణంగా పోరాటాన్ని అపకూడదని చెప్పే కథ.                                ◆నిశ్శబ్ద.
డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని సహాయంతో మందులను సక్రమంగా తీసుకుంటూ ఉండటమే కాకుండా ,  ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి,    తీవ్రమైన సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో గ్లూకోమీటర్‌తో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకుంటూ ఉంటారు.  ఇది ఆరోగ్యానికి మంచిదే.  కానీ చాలాసార్లు ఈ పరీక్ష తప్పుగా జరుగుతోందని డయాబెటిస్ నిపుణులు అంటున్నారు.  దీని కారణంగా రీడింగ్ కూడా తప్పుగా వస్తుంది. ఇంట్లో రక్తంలో చక్కెరను తనిఖీ చేసేటప్పుడు  చాలామంది చేస్తున్న తప్పులేంటి? వాటిని ఎలా నివారించాలి?తెలుసుకుంటే.. చేతులు కడుక్కోకపోవడం.. చాలా మంది చేతులు కడుక్కోకుండానే పరీక్షలు చేసుకుంటారు. చెమట, నూనె లేదా చేతులపై చిన్న ఆహారం ముక్క కూడా తప్పుడు రీడింగ్ ఇస్తుంది. అందువల్ల, రక్తంలో చక్కెరను తనిఖీ చేసే ముందు ఎల్లప్పుడూ  చేతులను సబ్బుతో కడుక్కోవాలి.  చేతులు పూర్తీగా ఆరిన తరువాత పరీక్ష చేసుకోవాలి.   వేలు గుచ్చడానికి ప్రతిసారీ ఒకే వేలును ఉపయోగించడం.. ప్రతిసారీ ఒకే ప్రదేశం నుండి రక్తాన్ని తీయడం వల్ల అక్కడి చర్మం కఠినంగా మారుతుంది. దీని వల్ల  రక్తాన్ని తీయడం కష్టమవుతుంది. వేళ్లను మారుస్తూ ఉండాలి.  ఒకే వేలును పదే పదే ఉపయోగించకూడదు. పాత స్ట్రిప్స్ వాడకం.. టెస్ట్ స్ట్రిప్స్ కు గడువు తేదీ ఉంటుంది. చాలా సార్లు  పాత లేదా తేమతో కూడిన స్ట్రిప్స్ వాడతారు. ఇది తప్పు రీడింగ్ లను ఇస్తుంది. స్ట్రిప్స్ ను ఎల్లప్పుడూ పొడి,  చల్లని ప్రదేశంలో ఉంచాలి.  అలాగే  గడువు తేదీని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. రక్త నమూనా తీసుకోవడానికి ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం.. కొన్నిసార్లు రక్తం బయటకు రానప్పుడు,  వేలిని చాలా గట్టిగా నొక్కుతారు, ఇది కణజాల ద్రవాన్ని రక్తంతో కలిపి రీడింగ్‌ను ప్రభావితం చేస్తుంది. మృదువుగా  గుచ్చాలి.  అవసరమైతే చేతిని కొద్దిగా రబ్ చేయాలి,  లేదా క్రిందికి వంచాలి. తప్పు సమయంలో తనిఖీ చేయడం.. ఖాళీ కడుపుతో, భోజనం చేసిన 2 గంటల తర్వాత లేదా నిద్రపోయే ముందు రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి సరైన సమయం. తప్పు సమయంలో తనిఖీ చేయడం వల్ల నివేదిక గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. ఇది తీసుకునే ఆహారం గురించి, వాడాల్సి మందుల గురించి కూడా గందరగోళం క్రియేట్ చేస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  లాంగ్ జర్నీ చాలామందికి ఇష్టం. అయితే అనుకున్న సులువుగా వీటిని ప్లాన్ చేయడానికి ధైర్యం సరిపోదు.  దీనికి కారణం మోషన్ సిక్నెస్. దీన్నే వాంతుల సమస్య, తల తిరగడం అంటారు. ప్రయాణంలో  వాంతులు లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే ప్రయాణంలోని సరదా అంతా పాడైపోతుంది. మోషన్ సిక్‌నెస్ అనేది ఒక సాధారణ సమస్య, ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు,  స్త్రీలలో సర్వసాధారణం. బస్సు, కారు, రైలు లేదా విమానం..ఇలా ప్రయాణం ఎందులో అయినా సరే..  ప్రయాణించేటప్పుడు మన చెవులు, కళ్ళు,  శరీర సమతుల్యత అసౌకర్యానికి లోనైనప్పుడు , వికారం, చెమట, తల తిరగడం,  వాంతులు వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ఒక రోజు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మోషన్ సిక్నెస్ కు చెక్ పెట్టవచ్చు. ప్రయాణాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. ఆహారం.. ప్రయాణానికి ఒక రోజు ముందు భారీ, వేయించిన,  కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండాలి. ఇది కడుపులో భారంగా మారుతుంది,  గ్యాస్ లేదా ఆమ్లత్వం కారణంగా  అనారోగ్యం పెరుగుతుంది. తేలికైన, సులభంగా జీర్ణమయ్యే,  ఫైబర్ ఆధారిత ఆహారాన్ని తినాలి. నిద్ర.. అలసట,  నిద్ర లేకపోవడం శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రయాణ సమయంలో తలనొప్పి లేదా వాంతులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రయాణానికి ఒక రోజు ముందు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. మందులు.. గతంలో మోషన్ సిక్‌నెస్ చాలాసార్లు జరిగి ఉంటే వైద్యుల సలహా మందులు వాడవచ్చు. ప్రయాణానికి 30-60 నిమిషాల ముందు వైద్యులు సిఫార్సు చేసిన మందులు  తీసుకోవాలి.  తద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. అల్లం లేదా నిమ్మకాయ నీరు.. అల్లం,  నిమ్మకాయ రెండూ కడుపుని శాంతపరచడానికి సహజ నివారణలు. అల్లం టీ లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు ఒక రోజు ముందుగానే తీసుకోవడం మంచిది. ఇది వికారం అవకాశాలను తగ్గిస్తుంది. ముఖ్యమైన వస్తువులు.. ప్రయాణానికి ఒక చిన్న బ్యాగును సిద్ధంగా ఉంచుకోవాలి.   అందులో వాంతి బ్యాగ్, టిష్యూ పేపర్, పుదీనా క్యాప్సూల్స్, మౌత్ ఫ్రెషనర్,  వాటర్ బాటిల్ ఉండాలి.  మార్గంలో ఏదైనా అసౌకర్యాన్ని ఎదుర్కొంటే ఈ వస్తువులు సహాయపడతాయి.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  మోకాళ్ల నొప్పులు ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తాయి. దీని కారణంగా, లేవడం, కూర్చోవడం,  నడవడం నుండి రోజువారీ పనులు చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్లలో నిరంతరం నొప్పితో బాధపడే వారు ఈ సమస్యకు సర్జరీ లేదా చాలా తీవ్రమైన చికిత్సలతో తప్ప నయం కాదని అనుకుంటూ ఉంటారు.  అయితే ఇంటి చిట్కాతో మోకాళ్ల నొప్పిని ఈజీగా తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.  ఈ చిట్కా వల్ల మోకాళ్ల నొప్పి తగ్గడమే కాదు.. హాయిగా చకచకా తిరిగేసేంత శక్తి మోకాళ్లకు వస్తుంది అంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుంటే.. మోకాళ్లలో వాపు, మోకాళ్లు బిగుసుకుపోయినట్టు ఉండటం,   నొప్పి ఎక్కువగా ఉండటం  వంటి సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక పురాతన  పేస్ట్ ఉంది.    దానిని మోకాలి నొప్పి ఉన్న  ప్రాంతంపై పూసి రాత్రంతా అలాగే ఉంచాలి.  ఉదయం నిద్రలేచిన తర్వాత  చాలా ఉపశమనం కలుగుతుందట. ఈ ఆయుర్వేద పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..   పేస్ట్ తయారీ విధానం.. మోకాలి నొప్పి నుండి సహజ ఉపశమనం పొందడానికి,  ఆయుర్వేద పేస్ట్‌ను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం  కావలసిన పదార్థాలు.. 1 టీస్పూన్ ఆముదం 1 టీస్పూన్ తేనె 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి 1  నిమ్మకాయ. తయారు విధానం.. ఒక గిన్నెలో అన్ని పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా గట్టిగా  లేదా చాలా పలుచగా ఉండకూడదు.  మధ్యస్థంగా మోకాలి మీద రాసినప్పుడు కారిపోకుండా లేదా తొందరగా ఆరిపోయి రాలిపోకుండా ఉండాలి. ఈ పేస్ట్ ను చాలా సులభంగా అప్లై చేయవచ్చు. తయారు చేసుకున్న ఆయుర్వేద పేస్ట్ ను పలుచని పొరలాగా మోకాలిపై నొప్పి ఉన్న ప్రాతంలో లేదా మోకాలు అంతటగా  పూయాలి.  దానిపై మెత్తని  కాటన్ వస్త్రాన్ని చుట్టాలి.  8-10 గంటలు అలాగే ఉంచాలి. దీన్ని రాత్రి సమయంలో అప్లై చేసుకుంటే చాలా మంచిది.  ఉదయం గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ప్రయోజనాలు.. ఈ పేస్ట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీన్ని పూయడం వల్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది మోకాలు బిగుసుకుపోవడాన్ని  తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..