LATEST NEWS
  వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కేంద్రంలో పార్లమెంటరీ బిల్లుల ఆమోదం కోసం, ముఖ్యంగా రాజ్యసభలో సంఖ్యాబలం ప్రాధాన్యత దృష్ట్యా వైసీపీ ఎంపీల మద్దతు అవసరమై కేంద్ర ప్రభుత్వమే జగన్‌ను ఢిల్లీకి ఆహ్వానించిందనే ప్రచారం ఒకవైపు నడుస్తోంది. అయితే, మరోవైపు తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు  కేసుల విచారణల భయాల నుంచి ఊరట పొందడానికి జగనే స్వయంగా ఢిల్లీ తలుపులు తడుతున్నారనే వాదన గట్టిగా వినబడుతోంది. ఈ అంశంపై  టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర విశ్లేషణ జరిగింది.  క్షేత్రస్థాయి రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రత్యేక ఆహ్వానమూ లేదని, ఇది కేవలం వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం సాగిస్తున్న వ్యూహాత్మక ప్రయత్నమేనని స్పష్టమవుతోంది. వ్యూహాత్మక కోణం  రాజకీయ పరిణామాలుఈ పరిణామాల వెనుక వైసీపీకి చెందిన స్పష్టమైన వ్యూహం దాగి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దారుణ పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ శ్రేణులలో నైతిక బలం, విశ్వాసం గణనీయంగా సన్నగిల్లాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో "తమకు కేంద్రంలో బీజేపీ పెద్దల అండదండలు ఉన్నాయని" చూపించడం ద్వారా పార్టీ నాయకులకు, కేడర్‌కు మానసిక భరోసా కల్పించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.  అలాగే, రాష్ట్రంలో మారిన అధికార సమీకరణలు, చట్టపరమైన దర్యాప్తులు వేగవంతమయ్యే సూచనలు కనిపించడంతో, కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయనే సంకేతం ఇవ్వడం వైఎస్సార్సీపీకి ఒక రక్షణ కవచంగా అవసరమైంది.మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ  జనసేనలు అత్యంత కీలకమైన, బలమైన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ మరియు పరిపాలనా స్థిరత్వంపై ముఖ్యమంత్రి  నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇటువంటి సమర్థవంతమైన కూటమి బంధం ఉన్న వేళ, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి వైఎస్సార్సీపీ మద్దతుపై ఆధారపడాల్సిన రాజకీయ అవసరం ఎంతమాత్రం లేదు.  తమ నమ్మకమైన మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనల విశ్వాసానికి భంగం కలిగించేలా జగన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేదా దగ్గరయ్యే ఆలోచన బీజేపీ అధిష్ఠానానికి లేదని రాజకీయ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ ప్రభావంరాబోయే రోజుల్లో ఈ రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయంపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి రాజకీయ ఊరట లేదా హామీ లభించకపోతే, వైసీపీ తన ప్రాధాన్యతను  ఉనికిని నిలబెట్టుకోవడం మరింత సంక్లిష్టంగా మారుతుంది.  కేవలం ప్రచారాల ద్వారా కేడర్‌ను ఎంతో కాలం నిలబెట్టుకోవడం సాధ్యపడదు. అంతేకాకుండా, రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకోవడం వల్ల ప్రజల్లో ఎన్డీయే ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుంది. ఢిల్లీ స్థాయిలో వ్యూహాత్మక ప్రయోజనం దక్కకపోతే, వైసీపీలో అంతర్గత అసంతృప్తి పెరిగి, నాయకుల వలసలు వేగవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీర్ఘకాలంలో రాజకీయంగా పుంజుకోవడం వైసీపీకి అత్యంత కష్టతరమైన సవాలుగా మారనుంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.   YS Jagan Delhi Tour,  Jagan Meets PM Modi,  AP Political Analysis,  YCP BJP Alliance Rumors,  YS Jagan PM Modi Appointment, AP NDA Government, CM Chandrababu 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీది నిస్సందేహంగా విలక్షణ శైలి. ఆ పార్టీ రాజకీయం అంతా దూషణలు, ప్రతీకారాలతో నిండి ఉంటుంది.  వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం.. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన నేతలంతా బేడ్ మౌతింగ్ చేసిన వాళ్లే కావడం గమనార్హం, గతంలో అసభ్య భాషలో దూషణలు, అనుచిత వ్యాఖ్యలూ చేసిన వాళ్లనే ఆ పార్టీ అధినేత జగన్ ప్రోత్సహించేవారు.  అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.  అయితే వైసీపీలోని పలువురు సీనియర్లు మాత్రం ఈ తరహా ధోరణి పట్ల, ఆ ధోరణిని ప్రోత్సహిస్తున్న జగన్ పట్ల ఒకింత అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారుర. గత కొంత కాలంగా,  పార్టీ అంతర్గత సమావేశాల్లోనే కాకుండా మీడియాతో మాట్లాడే సందర్భంగా కూడా వైసీపీలోని కొందరు సీనియర్ నాయకులు పరోక్షంగానే అయినా చాలా స్పష్టంగా నోటి దురుసు కూడదని చెబుతున్నారు.  ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగడం, సభ్యత మరచి మాట్లాడటం పార్టీకి నష్టమని అన్యాపదేశంగా చెబుతున్నారు.  ఈ పరిస్థితి ఇలా ఉండగా, వైసీపీ కీలక నేత, జగన్ కు సన్నిహితుడు అయిన పెద్ది రెడ్డి అయితే.. దుర్భాషలు, అనుచిత వ్యాఖ్యలు తన నోటి నుంచి రావనీ, హుందాతనంతో కూడిన రాజకీయం మాత్రమే చేస్తానని కుండబద్దలు కొట్టేశారు. అక్కడితో ఆకకుండా తమ పార్టీలోని కొందరు నేతల్లా బాధ్యతారహితంగా, మర్యాద తప్పి మాట్లాడటం తనకు చేతకాదని పరోక్షంగా అంబటి రాంబాబు వంటి నాయకుల తీరును తప్పుపపట్టారు.  చూడాలి మరి పెద్దరెడ్డి వ్యాఖ్యలపై పార్టీ అధినేత జగన్ ఎలా రియాక్టౌతారో?   YCP, YS Jagan Mohan Reddy, YSRCP Firebrand, Badmouth Leaders, AP Politics, Telugu One
ఏపీలో  వైసీపీ రాజకీయం వింత పోకడలు పోతోంది.  ఆ పార్టీకి చెందిన నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం,  మాజీ మంత్రి జోగి రమేష్ లపై ఇటీవల నమోదైన కేసులన్నీ వారి వారి సొంత విషయాలకు సంబంధించినవి. అయితే ఈ మూడు అంశాలనూ కూడా రాజకీయ వేధింపులంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.  ఈ కేసులకు కారణం   ఆయా  నేతల వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వివాదాలే  కారణమని విస్పష్టంగా తెలుస్తున్నా..  అవన్నీ రాజకీయ వేధింపుల కారణంగా నమోదైన కేసులే అని కలరింగ్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ముందుగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కేసు విషయానికి వస్తే..  ఆయన కుమారుడు నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనం నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు.  ప్రమాదం జరిగిన వెంటనే చట్టపరమైన నిబంధనల ప్రకారం పారదర్శకంగా వ్యవహరించడానికి బదులు.. సిదిరి అప్పలరాజు..  ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన అరెస్టయ్యారు. అంతకు ముందు జగన్ సిదిరి అప్పలరాజుకు మద్దతుగా చిన్న కుర్రోడు యాక్సిడెంట్ చేస్తే అరెస్టు చేస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రతిష్ఠను సైతం మసకబార్చాయి.   ఆ తరువాత వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విషయం తీసుకుంటే.. ఆయన వైసీపీ హయాంలో తన పలుకుబడిని, అధికారాన్ని ఉపయోగించి నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేటు భూమిని బోగస్ డెత్ సర్టిఫికెట్, బోగస్ వారసులను సృష్టించి కబ్జా చేశారు. దీనిపై ఆ భూమి యజమాని తను బతికి ఉండగానే.. తన డెత్ సర్టిఫికేట్ సృష్టించి తన భూమిని అన్యాయంగా తమ్మినేని కుమారుడి పేరుపై రిజిస్టర్ చేయించారని ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన కుటుంబంతో సహా పరారయ్యారు.  అజ్జాతం నుంచే హైకోర్టును ఆశ్రయించి రాజకీయ వేధింపులతోనే కేసు పెట్టారంటూ ముందస్తు బెయిలు కోరారు. కోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. కాగా తమ్మినేని సీతారాం కుటుంబం భూ కబ్జా విషయంలో జగన్ మౌనం ఆయనకు మద్దతుగా నిలిచారన్న సంకేతాన్ని ఇస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇప్పుడు తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యుల 11 మందిపై స్వయానా ఆయన కోడలే వరకట్నం కోసంశారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేధింపుల కేసు పెట్టారు. వీరి విషయంలో కూడా జగన్ ఇంత వరకూ స్పందించడం కానీ, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం కానీ చేయకుండా పరోక్షంగా అండగా నిలుస్తున్నారు.   ఈ తరహా   సంఘటనలు జరిగిన ప్రతిసారీ  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆరోపించడం వైసీపీకి రివాజుగా మారింది.  సొంత సమస్యలు, తప్పుల కారణంగా క్రిమినల్ కేసుల్లో బుక్కై వాటికి రాజకీయ రంగు పులమడానికి వైసీపీ చేసే ప్రయత్నాలు ప్రజలలో ఆ పార్టీ, ఆ పార్టీ నయకత్వంపై వ్యతిరేకత పెరగడానికే దోహదపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వ్యక్తిగత తప్పులు, కుటుంబ కలహాలతో కేసుల్లో ఇరుక్కుని, వాటిని  రాజకీయ వేధింపులుగా చిత్రీకరించే ప్రయత్నాలను ప్రజలు ఏ మాత్రం హర్షించరని చెబుతున్నారు.  YSRCP leaders cases, AP political news, Jogi Ramesh family dispute, Appalaraju case, Tammineni family issue
దేశ రాజధాని హస్తిన వేదికగా  కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న జెన్ జెడ్  ఉద్యమ కవరేజ్ సందర్భంగా పలు ప్రధాన స్రవంతి మీడియా ప్రతినిధుల తీరు ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంటోంది. ఇప్పటికే ఆ ప్రజాగ్రహ జ్వాలల సెగ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతినిధులకు సోకింది కూడా.  అందుకు కారణమేంటంటే.. మెయిన్ స్ట్రీమ్ మీడియా..  కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఏకపక్ష వార్తలు ప్రసారం చేస్తున్నాయని జనం భావించడమే. ఆ ఆగ్రహంతోనే ఉద్యమకారులు జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక సందర్భంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల ప్రతినిధులపై అంటే ఆయా సంస్థలలో పని చేసే జర్నలిస్టులపై దాడులకు కూడా పాల్పడ్డారు. అటువంటి సంఘటనల్లో కొందరు విలేకరులు గాయపడ్డారు. ఇక సోషల్ మీడియాలో అయితే అటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలపైనా, ఆయా సంస్థల విలేకరులపైనే ఓ రేంజ్ లో ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. నెటిజనులు ఆయా మీడియా సంస్థల ప్రతినిధులను బదరిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు.   జులై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనను కవర్ చేసేందుకు వెళ్లిన  టైమ్స్ నౌ విలేకరి పై కొందరు   దౌర్జన్యానికి దిగారు. గుంపుగా వచ్చిన నిరసనకారులు ఆయనపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. నీళ్ల సీసాలు విసిరారు. కాలితో తన్నారు.  ప్రదర్శనకారుల ఆగ్రహానికి ఆయన అక్కడ నుంచి వెళ్లిపోక తప్పలేదు.  అలాగే.. పార్లమెంట్ దిశగా సాగిన విద్యార్థుల ప్రదర్శనపై పోలీసులు తీవ్రంగా వ్యవహరించారని, అయితే.. టైమ్స్ నౌ కవరేజీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందనీ, పోలీసుల దౌర్జన్యాలను హైలైట్ చేయలేదన్నది నిరసన కారుల ఆరోపణ. అందుకే ఆ మీడియా సంస్థ ప్రతినిథిపై దాడి జరిగిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు.  అలాగే రిపబ్లిక్ టీవీ  ప్రిన్సిపల్ కరస్పాండెంట్ కూడా నిరసనకారుల ఆగ్రహాగ్నిని చవిచూశారు.  మీడియా సంస్థలు అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై నిరసనకారుల ఆగ్రహానికి ఇవి నిదర్శనలుగా పరిశీలకులు చెబుతున్నారు.  ఆ రెండు మీడియా సంస్థలే కాదు, ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా  జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుస రిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే   మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.   మోడీ అనుకూల వైఖరితో ప్రసారాలు, ప్రచురణలు చేస్తున్న మెయిన్ స్ట్రీమ్  మీడియా సంస్థలను నెటిజనులు గోడీ మీడియాగా సంబోధిస్తూ నెటిజనులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న సంగతి విదితమే.   ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా సంస్థలు తమ వార్తా ప్రసారాలు, ప్రచురణల్లో నిష్పాక్షికతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే.. ప్రజాగ్రహానికి గురి కావలసివస్తుందన్న విషయం తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రజాస్వామ్య వ్యవస్థలో  కీలక పాత్ర పోషించాల్సిన ఫోర్త్ ఎస్టేట్  మీడియా ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితులు కొని తెచ్చుకోకుండా, ఇక నుంచైనా నిష్పాక్షితకు, వాస్తవాల ప్రసార, ప్రచురణలకు ప్రాధాన్యత ఇవ్వాలని, లేకుంటే గోడీ మీడియాపై ప్రజా వ్యతిరేకత మరింత పెచ్చరిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.   Jantar Mantar protests, Attacks on Journalists, Partiality, News Coverage
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన మోడీలో భయాన్ని పెంచుతోందా?  పరీక్షల ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేస్తామంటూ గురువారం (జులై 24) అర్ధరాత్రి మోడీ విడుదల చేసిన వీడియోలో.. ఆయన ముఖంలో భయం స్పష్టంగా కనిపించిందా? అంటే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఔననే అంటున్నారు.   ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు,   సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన  వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి. ప్రధాని వీడియో సందేశాన్ని రీపోస్టు చేస్తూ.. ప్రకాశ్ రాజ్. తాను ప్రధాని ముఖంలో భయాన్ని స్పష్టంగా చూశానని పేర్కొన్నారు. ప్రధాని భయపడ్డారు.. యువత, విద్యార్థుల ఉద్యమంతో ప్రధాని దిగిరాక తప్పలేదనీ,   దేశ భవిష్యత్ కోసం కాక్రోచ్ జనతా పార్టీ  పోరాటాన్ని ఆయన అభినందిస్తూ.. ఆ పోరాటం వల్లనే దేశ ప్రజలలో చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు.  విద్యార్థుల  మహోద్యమం ముందు మోడీ  మోకరిల్లక తప్పలేదనడానికి ఆయన విడుదల చేసిన వీడియోయే తిరుగులేని సాక్ష్యమని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.   Prakash Raj, PM Narendra Modi, NEET Paper Leak, Jantar Mantar Protests, Exam Reforms India
ALSO ON TELUGUONE N E W S
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఎస్ జె సూర్య కాంబోలో వచ్చిన పంజా మూవీలో పవన్ కి తల్లిగా చేసి మెప్పించిన నటి శరణ్య(Saranya)ఇప్పుడు చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కే ఇంపార్టెన్స్ లేదు, తల్లి క్యారెక్టర్స్ చేసే నటి కదా అని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గాను తన సత్తా చాటి బ్లాక్ బస్టర్ సినిమాల్లోనూ చేసింది. సంగీత ప్రియులు నిత్యం వినే నీరాజనం మూవీలోని 'నిను చూడక నేను ఉండలేను' సాంగ్ శరణ్య దే.     ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శరణ్య మాట్లాడుతు 'సూపర్ స్టార్ రజినీకాంత్, మలయాళ వర్సటైల్ యాక్టర్ మోహన్ లాల్ వంటి లెజండ్రీ నటులకి  తల్లిగా అస్సలు నటించను. ఎంత పెద్ద డైరెక్టర్ భారీ ఆఫర్ ఇచ్చినా, ఎంతటి రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఆ ఇద్దరి హీరోలకి మాత్రం మాతృమూర్తిగా నటించే ప్రసక్తే లేదు. ఒకవేళ అవకాశం వస్తే వారి సరసన హీరోయిన్‌గా చేస్తాను. స్కూల్ రోజుల నుంచే చదువుకుంటున్న సమయంలోనే రజినీకాంత్, మోహన్ లాల్ అంటే అపారమైన అభిమానం. వారిద్దరూ నా డ్రీమ్ హీరోలు . స్కూల్ రోజుల్లో రజినీకాంత్ ఫోటోలను సేకరించి క్లాస్‌రూమ్‌ డెస్క్‌పై అంటించుకునేదాన్ని. మనసులో ఎంతో కాలంగా హీరోలుగా, ఆరాధ్య దైవాలుగా కొలిచే నటులకు తెరపై అమ్మగా నటించడం నా వల్ల కాదు. వారి పట్ల ఉన్న గౌరవం, క్రష్‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది. శరణ్య 1987లో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన "నాయగన్" (తెలుగులో నాయకుడు) మూవీతో  కథానాయికగా వెండితెర అరంగేట్రం చేశారు.  ఆ తర్వాత 90వ దశకంలో సౌత్ ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకులందరి సరసన వరుస హిట్ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే 1995లో నటుడు పొన్వన్నన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న శరణ్య, ఆ తర్వాత కుటుంబ బాధ్యతల కోసం దాదాపు 8 సంవత్సరాల పాటు వెండితెరకి  దూరంగా ఉన్నారు. Also read: మంచు విష్ణు నెక్స్ట్ మూవీ ఇదేనా.. ఈ సారి సూపర్ హిట్ పక్కా! తిరిగి  2003లో "అలై" చిత్రంతో శరణ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు,తల్లి క్యారక్టర్ లో    కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు స్టార్ హీరోలందరికీ ఓ రకమైన "సినీ అమ్మ"గా మారిపోయారు. 2011లో వచ్చిన "తెన్మేర్కు పరువకాట్రు" చిత్రంలో ఆమె కనబరిచిన జీవకళాత్మక అభినయానికి ఉత్తమ నటిగా ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డు (National Film Award) దక్కింది. రజీనీ కాంత్, మోహన్ లాల్ సరసన మాత్రం హీరోయిన్ గా చేయలేకపోయింది.  Saranya, RajiniKanth, Mohan Lal  
Jaya Krishna Ghattamaneni, grandson of legendary Superstar Krishna, is all set to make his acting debut with Srinivasa Mangapuram, directed by Ajay Bhupathi. Co-starring Rasha Thadani and Dr. Mohan Babu, the raw and rustic emotional drama is slated for a worldwide release on July 30. Produced by P. Kiran and presented by Ashwini Dutt, the film has generated strong buzz through its teaser, trailer, and songs. Speaking to the media, Jaya Krishna revealed that Mahesh Babu has been his biggest guiding force throughout the journey. "Mahesh uncle guides me in every aspect. He watched the film and felt very happy. He messaged me saying he loved the action sequences and songs. He also said I looked very different on screen and had completely immersed myself in the character," the young actor shared. Expressing gratitude for being launched under the prestigious Vyjayanthi Movies banner, Jaya Krishna said he shares a close bond with Ashwini Dutt. He also revealed that he underwent an intensive three-month workshop under director Ajay Bhupathi to prepare for the role, working on his performance, body language, and dialogue delivery. Talking about his character, Jaya Krishna described Srinu as a mischievous and fun-loving youngster who knows exactly what he wants. "He loves Manga, and the way their story unfolds is going to surprise audiences. This is not a template love story. It is very realistic, filled with raw emotions, unexpected twists, and rooted characters," he said. He also praised GV Prakash Kumar's music and the film's visuals for bringing a fresh appeal to the narrative. The debutant admitted that carrying the Ghattamaneni legacy comes with responsibility but sees it as positive pressure. "Fans supported me even before they knew I was making my debut. I want to live up to their expectations by choosing good stories that entertain audiences," he said. A trained martial artist, Jaya Krishna is particularly excited for viewers to watch the action episodes, which were filmed extensively during a 70-day outdoor schedule. Backed by Mahesh Babu's appreciation and the team's confidence, he believes Srinivasa Mangapuram will offer audiences an unforgettable cinematic experience when it hits theatres. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Prabhas' Spirit has been making headlines ever since Deepika Padukone reportedly exited the project. While Triptii Dimri is now the female lead, fresh industry gossip suggests that Katrina Kaif could be the latest star to join Sandeep Reddy Vanga's ambitious action entertainer. According to the latest buzz, Katrina is being considered for a crucial extended cameo that could have a significant impact on the film's narrative. Though the makers have maintained complete silence, reports claim discussions are underway and that the role has been designed to leave a lasting impression despite limited screen time. If the casting materializes, it would mark Katrina Kaif's return to Telugu cinema after a long gap and her first-ever on-screen collaboration with Prabhas. The combination has long been on fans' wish lists, making the speculation even more exciting. Spirit, directed by Sandeep Reddy Vanga, stars Prabhas in the lead, with Triptii Dimri playing the female lead. The film has already generated massive hype following its first-look poster and promises to showcase Prabhas in one of his most intense avatars yet.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
హీరో నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ లభించింది. కథల ఎంపికలో ఎప్పుడూ వైవిధ్యం చూపే నారా రోహిత్ తన కొత్త సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.  చినిమిల్లి మణికుమార్ దర్శకత్వంలో కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ నయా క్రేజీ ప్రాజెక్ట్‌కి 'సౌండ్ ఇంజనీర్' అనే వినూత్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎంటర్టైనింగ్‌గా ఉంది. మైక్ పట్టుకుని అనౌన్స్‌మెంట్ చేసే క్రమంలో "స్కూల్‌కి వెళ్తున్న చిన్న పిల్లలకి, రీల్స్ చూస్తున్న యూత్‌కి, సీరియల్స్ చూస్తున్న ఆంటీలకు, సిట్టింగ్ వేస్తున్న అంకుల్స్‌కి, హనీమూన్ నుంచి సేఫ్‌గా వచ్చిన కపుల్స్‌కి స్వాగతం సుస్వాగతం" అంటూ సాగే డైలాగులు నవ్వులు పూయిస్తాయి. ఆ తర్వాత ప్రశాంతంగా కళ్లు మూసుకుని వినమని చెప్పగా, "ఏమీ వినపడటం లేదండి" అని వెనక నుంచి ఒక గొంతు అనడం, దానికి బదులుగా "వినపడదు.. ఎందుకంటే మావాడు ఒక పెద్ద సౌండ్ ఇంజనీర్" అంటూ టైటిల్ కార్డ్ రివీల్ చేయడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించి ధ్యానం చేస్తున్నట్లుగా నారా రోహిత్ కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.     Nara Rohith, Sound Engineer, Title Announcement  
నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu)తనయుడు మంచు విష్ణు(Vishnu)హీరోగా పలు సక్సెస్ లు చేసాడు. ప్రీవియస్ మూవీ కన్నప్ప తో నటుడుగా మరో మెట్టు పైకి ఎక్కాడని చెప్పవచ్చు దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు విష్ణు అప్ కమింగ్ డీటెయిల్స్ గురించి వెయిట్ చేస్తున్నారు.   విష్ణు(Vishnu)కెరీర్ లో మైలురాయిగా నిలిచిన క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఢీ' చిత్రానికి సీక్వెల్ తీసుకొచ్చేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నాడానే టాక్ వినిపిస్తుంది. సీక్వెల్ కథ సిద్ధమవ్వడమే ఆలస్యం, మరుసటి రోజే షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని  స్వయంగా వెల్లడించడంతో పాటు  జెనీలియాతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు  స్పష్టం చేశారు. దీనితో పాటు ఇండియన్ డ్యాన్స్ ఐకాన్ ప్రభుదేవాతో కలిసి మంచు విష్ణు ఒక భారీ వినోదాత్మక ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నారు. ప్రభుదేవా మేకింగ్ మరియు కొరియోగ్రఫీ తోడుగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం పూర్తి స్థాయి డ్యాన్స్, యాక్షన్ మరియు మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుంది.  Also read: ఓటీటీ ఆఫర్లు కూడా దక్కించుకోలేకపోతున్న టాలీవుడ్ హీరో... ఫ్యాన్స్ షాక్  అంతేకాకుండా, 1947 నాటి స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంతో కూడిన ఒక పీరియాడిక్ కథాంశంపై కూడా విష్ణు వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చారిత్రక కథను కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌గా విజువల్ గ్రాండియర్‌తో భారీ ఎత్తున తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.  కన్నప్ప సాధించిన విజయం తర్వాత మంచు విష్ణు తన హోమ్ బ్యానర్ '24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ' ద్వారా కేవలం నటుడిగానే కాకుండా నిర్మాణం, కథా రచన రంగాల్లోనూ బిజీగా మారనున్నారు. ఒక్క కన్నప్పతోనే ఆగిపోకుండా, కామెడీ, మాస్ యాక్షన్ మరియు పీరియడ్ డ్రామా వంటి వైవిధ్యమైన జోనర్లలో వరుస సినిమాలు లైన్‌అప్‌లో పెడుతూ తన సినీ ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నాడు. Manchu Vishnu, Manchu Mohan Babu, Tollywood  
కోలీవుడ్ స్టార్ సూర్య, యంగ్ బ్యూటీ మమితా బైజు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలను సమకూరుస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన 'ది వెడ్డింగ్ సాంగ్' లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. పెళ్లి వేడుకల్లోని ఆనందం, కుటుంబ సభ్యుల సందడి, ఆత్మీయ అనుబంధాలను ప్రతిబింబించేలా ఈ పాటను ఎంతో మనోహరంగా తీర్చిదిద్దారు. పాట ప్రారంభం నుంచే పెళ్లి పండగ వాతావరణం, రంగుల కోలాహలం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వెడ్డింగ్ సాంగ్‌లో మంగళవాయిద్యాలు, సన్నాయి మేళాలు, సాంప్రదాయ సంగీత స్వరాలు కలగలిపి పెళ్లి కళను ఉట్టిపడేలా చేశాయి. తాళి కట్టే మధుర ఘట్టాన్ని, ఇరు కుటుంబాల మధ్య వ్యక్తమయ్యే ఆనందోత్సాహాలను ప్రతిబింబించేలా సాహిత్యం సాగింది. సూర్య మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్, మమితా బైజు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాటలోని విజువల్స్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ఉత్సాహభరితమైన మెలోడీ ట్యూన్ ఈ పాటకు ప్రాణంగా నిలిచింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. సూర్య స్వయంగా ఈ పాటను పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.     The Wedding Song, Vishwanath and Sons, Suriya, Mamitha Baiju  
After the massive success of the chartbusting first single Neno Butterfly, the Vishwanth & Sons team is back with another treat for fans "The Wedding Song" is out now and it's already being hailed as the perfect celebration anthem of the season. A high-energy, festive number, the song sees Suriya and Mamitha Baiju light up the screen with their infectious dance moves, capturing the joy and warmth of a big fat family wedding. Adding a special touch, Suriya himself has lent his voice to the track, making it an even more personal and heartfelt musical moment. The music is composed by G. V. Prakash Kumar, with lyrics penned by Ramajogayya Sastry giving the song its distinct festive and celebratory flavour. With two back-to-back chartbusters Neno Butterfly and now The Wedding Song, expectations for Vishwanth & Sons continue to soar.  Directed by Venky Atluri and produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments & Fortune Four Cinemas. Presented by Srikara Studios, the family entertainer is all set for a grand worldwide theatrical release this Independence Day weekend on August 14th.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
దళపతి విజయ్ తన సినీ ప్రయాణానికి ముగింపు పలుకుతూ నటించిన 'జన నాయగన్' సినిమా ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ హడావుడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే తాజాగా విజయ్ భార్య సంగీత గురించి నెట్టింట ఒక వార్త చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. చాలా కాలంగా విజయ్‌కు దూరంగా ఉంటున్న ఆయన భార్య సంగీత, 'జన నాయగన్' చూసేందుకు ఒక థియేటర్‌కు వచ్చిందనే ప్రచారం ఊపందుకుంది. ఒక వీడియో ఆధారంగా సోషల్ మీడియాలో ఈ ప్రచారం వ్యాపించింది. సంగీత సడన్‌గా థియేటర్‌లో ప్రత్యక్షమై సినిమా చూశారని, విజయ్ ఆఖరి సినిమాకు ఆమె గుట్టుచప్పుడు కాకుండా తన మద్దతు తెలిపారని, వారిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయి మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు, నెటిజన్లు రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు. దళపతి అభిమానులు కూడా ఈ వార్త చూసి నిజమేనేమో అని నమ్మి సోషల్ మీడియాలో ఆ వీడియోను భారీగా షేర్ చేయడం ప్రారంభించారు.  అయితే, సంగీత 'జన నాయగన్' థియేటర్‌కు వచ్చిందనే వార్త పూర్తిగా అబద్ధం అని తేలింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో 'జన నాయగన్' సినిమా స్క్రీనింగ్‌కు సంబంధించినది కానే కాదు. అది 2023లో శివకార్తికేయన్ నటించిన 'మావీరన్' సినిమా ప్రీమియర్ కు సంగీత హాజరైనప్పటి పాత వీడియో క్లిప్.  విజయ్ చివరి సినిమా కావడంతో, అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి కొందరు నెటిజన్లు ఆ పాత వీడియోను రీ-అప్‌లోడ్ చేసి, రీసెంట్ వీడియోగా ప్రచారం చేశారు.      Thalapathy Vijay, Jana Nayagan, Vijay wife Sangeetha, Viral Video  
  హీరో(Hero).. ఆ  ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, హీరో అనే వర్డ్ వినగానే అభిమానులు, ప్రేక్షకుల్లో ఒక ఉద్వేగం ఉంటుంది. సెల్యులాయిడ్ పై తను చేసేది నటనే అయినా తను నవ్వితే నవ్వుతారు, భావోద్వేగంతో ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. పోరాటాలు చేస్తుంటే హీరో అంటే ఇది అంటూ వాళ్ళు కూడా పోరాటాలు చెయ్యడానికి ట్రై చేస్తుంటారు.హీరో పోస్ట్ కి అంత కెపాసిటీ ఉంది. కానీ ఇప్పుడు ఆ హీరోకి సబంధించిన న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్, సోషల్ మీడియాలో అందరికి హాయ్ చెప్తుంది. ఆ హీరోకి వెండితెరపై ప్రధాన కథానాయకుడిగా అవకాశాలు తగ్గి చాన్నాళ్లయింది. దీంతో ఆయన కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా క్యారెక్టర్ రోల్స్, విలన్ వేషాల వైపు అడుగులు వేశారు. పరిశ్రమలో ఆయనకు "మంచి నటుడు" అనే బలమైన  ఇమేజ్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తగినన్ని హిట్ సినిమాలు లేకపోవడమే అతిపెద్ద ప్రతిబంధకంగా మారింది. వరుస ప్లాప్‌ల ప్రభావంతో వెండితెరపై గ్రాఫ్ పడిపోవడంతో, ఎలాగైనా ఒక భారీ ఓటీటీ ప్రాజెక్ట్ లేదా ఒరిజినల్ వెబ్ సిరీస్ ద్వారా తన డిజిటల్ ఎంట్రీని ఘనంగా ప్లాన్ చేయాలని భావించాడు. గతంలో సదరు హీరోతో ఒరిజినల్ సిరీస్‌లు చేయడానికి అనేక ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రతినిధులు స్వయంగా సంప్రదింపులు జరిపేవారు. దాంతో వారి వద్దకే వెళ్తే పని సులువుగా పూర్తవుతుందనే నమ్మకంతో, ఆ హీరో తనే స్వయంగా వెళ్లి పాత సంబంధాలను కదిలించాడు. కానీ, అక్కడ ఆ హీరోకి ఊహించని షాక్ ఎదురైంది. ఒకప్పుడు ఆయనతో ప్రాజెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపించిన ఆ ప్లాట్‌ఫామ్‌ల నిర్వాహకులు, ఇప్పుడు నేరుగా "నో" అని చెప్పడం మొదలుపెట్టారు. దీనికి కారణం  ఓటీటీ మార్కెట్‌లో పెరిగిన విపరీతమైన పోటీనే కారణమని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. Also read: OG 2: ఓజి 2 క్రేజీ న్యూస్.. ఫ్యాన్స్ లో జోష్   ప్రస్తుతం ఓటీటీ ప్రపంచం మునుపటి కంటే చాలా వేగంగా రూపాంతరం చెందింది. రానా దగ్గుబాటి, వెంకటేష్, నాగచైతన్య వంటి అగ్ర నటులు ఇప్పటికే డిజిటల్ కంటెంట్, భారీ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతూ ఎంట్రీ ఇచ్చేశారు. మరోవైపు, ఇటీవల థియేటర్లలో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తేజ సజ్జాతో పాటు సందీప్ కిషన్ వంటి యువ కథానాయకులు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై తమ ముద్ర వేస్తున్నారు. ఓటీటీ మేకర్ల వద్ద ఒక శక్తివంతమైన కథ లేదా మంచి సబ్జెక్ట్ సిద్ధంగా ఉన్నప్పుడు, వారు నాగార్జున లాంటి పెద్ద స్టార్లను గానీ లేదా నాగచైతన్య, సాయిదుర్గ తేజ్ వంటి యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోలను గానీ ఒప్పించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో, ఇటీవల సరైన విజయం లేని ఫ్లాప్ హీరోతో సిరీస్ తీస్తే వ్యాపారాత్మకంగా ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే ఆలోచనతో డిజిటల్ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. ఈ ఒక్క సమీకరణం వల్లే ఆయన పెట్టుకున్న ఓటీటీ భారీ ప్రాజెక్ట్ ఆశలన్నీ గల్లంతయ్యాయి. అయితే సదరు హీరోకి ఒక రీజనల్ లేదా లోకల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుండి ఓపెన్ ఆఫర్ ఉన్నప్పటికీ, దాని స్థాయి చిన్నది కావడం వల్ల ఆయన దానిపై అసలు  ఆసక్తి చూపించడం లేదట. సినిమా చాన్స్ పోయినా ఓటీటీ ఆదుకుంటుందనుకుంటే, అక్కడ కూడా లభించిన ఈ షాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. #Ott #Hero #Tollywood  
    పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)పవర్ ప్యాక్డ్ అప్ కమింగ్ మూవీ ఓజి 2 . పవన్ స్వయంగా ఓ జి 2 పనులకి శ్రీకారం చుట్టడంతో నెక్స్ట్ సమ్మర్ కి వస్తుందేమో అని ఆశపడుతూ ఉన్నారు. కానీ పవన్ ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స చేసుకోవడం, షూటింగ్ అప్ డేట్ కూడా లేకపోవడంతో వాళ్లంతా అప్ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.  తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు సుజీత్  స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులని  వేగవంతం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ అండ్ అసెంబ్లీ షెడ్యూల్స్ ముగించుకున్న తర్వాత, నవంబర్ 2026 నాటికి OG 2 సెట్స్‌పైకి అడుగుపెట్టే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం తగినంత  డేట్స్ కేటాయించడానికి అంగీకరించారు. మొదటి భాగం కంటే రెట్టింపు యాక్షన్, జపాన్ మంచు ప్రాంతాల్లో భారీ ఫైట్ సీన్స్, సరికొత్త ఐకానిక్ విజువల్స్‌తో OG 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త గ్యాంగ్‌స్టర్ శకాన్ని సృష్టించబోతోంది. దిపవన్ కళ్యాణ్, ఈ సీక్వెల్ నిర్మాణం కోసం తన సొంత బ్యానర్‌పై భాగస్వామ్యం వహిస్తుండటం విశేషం. ఓజస్ గంభీరా జపనీస్ కనెక్షన్, యాకూజా గ్యాంగ్స్ తో ఉన్న పగ, ఇంకా బయటపడని గతం, అండర్ వరల్డ్ పాలిటిక్స్ ఆధారంగా 'OG 2' కాన్సెప్ట్ రూపొందుతోంది.  Also read: Jana Nayagan: జననాయగన్ సెకండ్ డే షాకింగ్ కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా! ఓజి  300 కోట్ల మార్కుని  అందుకుని పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిందే. దీంతో ఓజి 2 ని అంతకు మించిన హిట్ చెయ్యాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. Pawan Kalyan, OG2, OG, Sujeeth
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని, అది పెద్దదైనా లేదా చిన్నదైనా, పంచుకోవడం ఎల్లప్పుడూ సరైనది కాదు. కొన్నిసార్లు, తెలివిగా ఉండటం,  కొన్ని విషయాలు షేర్ చేసుకోకుండా ఉండటం కూడా మంచిదని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  కేవలం ఇవి మాత్రమే కాదు.. బంధాల మధ్య ఆరోగ్యకరమైన వాతావారణం ఉండాలన్నా,  బంధం ఏ చీకు చింతలు లేకుండా సంతోషంగా ఉండాలన్నా కొన్ని విషయాలు దాచిపెట్టడమే మంచిది అంటున్నారు.  బంధాలు బాగుండాలంటే ఎలాంటి విషయాలను చెప్పకుండా ఉండటం మంచిది? తెలుసుకుంటే.. మాజీ ప్రేమికుల గురించి..  భాగస్వామికి  గతం గురించి చెప్పడంలో తప్పు లేదు, కానీ ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా  మాజీ భాగస్వామి గురించి చర్చించడం, వారిని గొప్పగా పొగడటం లేదా వారితో  గడిపిన సన్నిహిత క్షణాలను చెప్పడం వల్ల  ప్రస్తుత భాగస్వామిలో అనవసరమైన అసూయ మరియు పోలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది బంధంలో అభద్రతాభావం, అసౌకర్యం, అపార్ఠాలు ఏర్పడేలా చేస్తుంది.  అందుకే  ఒక కొత్త బంధం మొదలుపెట్టాక   గతాన్ని గురించి వదిలిపెట్టడం చాలా మంచిది.  దాని గురించి గుర్తుచేసుకోకపోవడం మంచిది. సొంత వ్యక్తుల చెడుగుణం..  భాగస్వామి స్నేహితుల్లో  లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా  మీకు నచ్చకపోవచ్చు. వారు మీతో సరిగా ఉండకపోవచ్చు. కానీ  బిగ్గరగా అరవాల్సిన అవసరం లేదు. "మీ అమ్మ చాలా చెడ్డగా  ఉంటుంది" లేదా "మీ స్నేహితుడు  పద్దతిగా ఉండటం లేదు" అని మీరు చెబితే భాగస్వామి బాధపడే అవకాశం ఉంది.  సమస్య పెద్దది కాకపోతే ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల రహస్యాలు..  ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు ఇలా ఎవరైనా సరే..   మీతో రహస్యంగా మాట్లాడి ఏదైనా రహస్యం చెప్పినట్లయితే, దానిని భాగస్వామితో పంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది "మేము భార్యాభర్తలం, లేదా జంట, మా మధ్య ఎటువంటి రహస్యాలు లేవు, లేదా ఉండకూడదు" అని అనుకుంటారు, కానీ ఇది ఆ మూడవ పక్షం నమ్మకాన్ని దెబ్బతీసినట్లే. భాగస్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, స్నేహం లేదా ఇతర కుటుంబ సభ్యులు, పుట్టింటి వారికి అంతే ప్రాధాన్యత  ఉంటుంది. కాబట్టి  స్నేహితుల గోప్యతను గౌరవించాలి.   వారి రహస్యాలను భాగస్వామి ముందు గాసిప్ లాగా చర్చించకూడదు. ఇష్టాలు, అయిష్టాలు.. భాగస్వామి ప్రేమతో మీకు బహుమతి కొన్నప్పుడు, అది మీకు అస్సలు నచ్చకపోతే  నిజాయితీతో అది నచ్చలేదు అని చెప్పడం మంచిది కాదు. నాకు ఈ రంగు అస్సలు నచ్చలేదు లేదా ఇది క్వాలిటీగా లేదు  అని చెప్పడం వారి మనసును బాధపెట్టినట్టే..   ఇక్కడ అబద్ధం చెప్పడం మంచిది. వారి భావాలను గౌరవించాలి,  చిరునవ్వుతో బహుమతిని తీసుకోవాలి. కొన్నిసార్లు, నిజం చెప్పడం కంటే అబద్దం చెప్పడం వల్ల భాగస్వామిని సంతోషపెట్టవచ్చు. సోషల్ మీడియా పాస్వర్డ్ లు.. నేటి డిజిటల్ యుగంలో ఇది ఒక పెద్ద సమస్య. చాలా మంది భార్యాభర్తలు ఒకరి పాస్‌వర్డ్‌లు ఒకరు తెలుసుకోవడం ప్రేమకు సంకేతం అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరం.  ఫోన్ లేదా సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను చెప్పకపోవడం నేరం కాదు. ఏ తప్పు చేయనంత వరకు, తనకంటూ కొంత పర్సనల్ ఉంచుకోవడం తప్పే కాదు. సంబంధాలు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడం ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుతుంది. కొన్ని విషయాలను దాచడం మోసం కాదు, అనవసరమైన గొడవలు, అపార్థాలు కలగకుండా బంధాన్ని రక్షించుకునే మార్గమది.                                *రూపశ్రీ
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..  కొన్నిసార్లు తరాల మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆలోచనా విధానాలలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు విభేదాలకు దారితీయవచ్చు. దీని వల్ల ప్రతి కోడలికి తన మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది. అత్తగారు చెప్పే ప్రతి విషయాన్ని కోడలు వినాలా? అత్త చెప్పిన ప్రతి విషయాన్ని కోడలు అంగీకరించాల్సిందేనా?  అని.  అయితే దీనికి సమాధానం అంత సులభమైనది కూడా కాదు.  దీని గురించి లైఫ్ స్టైల్ నిపుణులు వివరణ ఇస్తున్నారు.  ప్రతి కోడలు తెలుసుకోవలసిన ఈ విషయం గురించి తెలుసుకుంటే.. సెల్ఫ్ రెస్పెక్ట్.. ప్రవర్తన.. కొందరు అత్తలు చాలా దురుసుగా ఉంటారు.   దుర్భాషలాడటం, ఎగతాళి చేసి మాట్లాడటం, అందరి ముందు కోడలిని  అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎప్పుడూ  ఎదుర్కొంటున్నట్లయితే కోడలు  మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మొదట  ప్రశాంతంగా మాట్లాడి, సరిగ్గా మాట్లాడమని, సరిగ్గా ప్రవర్తించమని అడగడం మంచిది. అత్తాకోడళ్ల బంధం బాగుండాలంటే.. రెండు వైపులా గౌరవం చాలా ముఖ్యం. ఆరోగ్య సంబంధ విషయాలు..  అత్తల తరానికి,  ఇప్పటి కోడళ్ల తరానికి చాలా తేడాలు ఉన్నాయి.  వారి జీవనశైలి,  ఆహారం వంటి విషయాలు ఇప్పట్లో లేవు.  ఈ కారణంగా ఇప్పటి అమ్మాయిలలో అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది.  ఏదైనా అనారోగ్యానికి చికిత్స, మందులు, విశ్రాంతి తీసుకోవడం, గర్భం దాల్చడం, మానసిక ఆరోగ్యం లేదా మరే ఇతర వైద్య సలహాలలో అయినా అత్తలు ఎప్పుడూ కోడళ్లను నిర్ల7్యంగా మాట్లాడకూడదు.  మేము ఇంత పని చేసుకునేవాళ్లం, మాకేమీ సమస్య ఉండేది కాదు అనడం,  పని తప్పించుకోవడానికి అనారోగ్యం అని చెబుతున్నావని నిందించడం చాలా మంది అత్తగార్లు చేస్తారు. కోడళ్లు  అత్తగారి మాటల కంటే డాక్టర్ సలహాకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్య నిర్ణయాలు కేవలం కుటుంబ ఒత్తిడి మీద కాకుండా, వాస్తవాలు , నిపుణుల సలహా ఆధారంగా తీసుకోవాలి. విద్య, ఉద్యోగం.. నేటికాలంలో అమ్మాయిలు అబ్బాయిలకేమీ తీసిపోకుండా బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు.  ఉద్యోగం , ఆర్థిక స్వాతంత్య్రానికి  సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతి కోడలికి ఉంటుంది.  కుటుంబ అంచనాలకు,  వృత్తిపరమైన లక్ష్యాలకు మధ్య పొంతన కుదరకపోతే ఓపెన్ గా ఇంట్లో డిస్కస్ చేసి  అందరికి నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేకానీ అత్తగారు చేప్పారు అని ఉద్యోగాలు వదిలేయడం, ఇంటికే పరిమితం కావడం వంటివి చేయాల్సిన అవసరం లేదు.  ఏకపక్ష ఒత్తిడితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మనస్పర్థలకు దారితీయవచ్చు.అంతేకాదు.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. వ్యక్తిగత హద్దులు.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమయం, వ్యక్తిగత స్వేచ్ఛ , వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది.  వ్యక్తిగత హద్దులను పదేపదే ఉల్లంఘించినా లేదా ప్రతి నిర్ణయంలో అనవసరమైన జోక్యం ఉన్నా,  హద్దులను మర్యాదగా తెలియజేయడం మంచిది. ఇది అపార్థాలు, గొడవలు ఎక్కువ దూరం వెళ్లకుండా చేస్తుంది.  కొందరు అత్తలు కోడళ్లకు ఎలాంటి పర్సనల్ స్పేస్ ఉండకూడదని, వారికి పర్సనల్ అంటూ ఏమీ అవసరం లేదని వాదిస్తారు.  కానీ కోడళ్లకు పర్సనల్ స్పేట్ ఉండటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతుంది.   ప్రొటెక్షన్,  లీగల్ రైట్స్.. ఆడపిల్ల  భద్రతకు, చట్టపరమైన హక్కులకు, లేదా నైతిక విలువలకు భంగం కలిగించే పని చేయమని అత్తగారు కోడలిని అడిగితే, దానికి తలొగ్గడం మంచిది కాదు. అలాంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని, నమ్మకమైన కుటుంబ సభ్యుడిని, లేదా అవసరమైతే చట్టపరమైన సహాయాన్ని తీసుకోవడం మంచిది.                                       *రూపశ్రీ.  
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
మూత్రంలో మంటా? UTIని నిర్లక్ష్యం చేయొద్దు..! మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) లక్షణాలు కావచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్‌ఫెక్షన్ మూత్రాశయం నుంచి కిడ్నీల వరకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ నవులూరు ఉపేంద్ర కుమార్ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభమైన భాషలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: ✅ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) అంటే ఏమిటి? ✅ UTI రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ✅ మహిళల్లో UTI ఎక్కువగా ఎందుకు వస్తుంది? ✅ పురుషుల్లో UTI వచ్చే కారణాలు ఏమిటి? ✅ UTI లక్షణాలు ఎలా గుర్తించాలి? ✅ ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ ఏ పరీక్షల ద్వారా UTIని నిర్ధారిస్తారు? ✅ UTIకి అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? ✅ యాంటీబయాటిక్స్‌ను ఎలా వాడాలి? ✅ UTI మళ్లీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ✅ రోజువారీ అలవాట్లలో చేయాల్సిన మార్పులు మూత్ర సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గర్భిణీలు మరియు మధుమేహం ఉన్నవారు UTI లక్షణాలపై మరింత అప్రమత్తంగా ఉండాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ గురించి పూర్తి అవగాహన పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తి వీడియోను వీక్షించి, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోండి. మరిన్ని ఆరోగ్య సంబంధిత ఉపయోగకరమైన వీడియోలు, నిపుణుల సూచనల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి.  
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపి నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది.  భారతదేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హై బీపి తో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు  ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. ఉప్పు డేంజర్ ఇందుకే.. ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది.  దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి.  గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం,  మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.  అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది.  దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు. బ్రెడ్, బన్.. బేకరీ.. రోజూ బ్రెడ్ లేదా బన్   వంటివి తినేవారు చాలామంది ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు.  మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు.  కానీ ఈ బ్రెడ్ లేదా బన్ లు  శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థంలో చాలా సోడియం,  సుగర్ ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్స్ లో లభించే స్నాక్స్, బిస్కెట్స్,  చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా,  బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. వీటిలో చాలా ఎక్కువ.. టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్‌విచ్ స్ప్రెడ్‌లు,  ప్యాక్ చేసిన చట్నీలు,  ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు..   వీటి షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడి్స్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా  ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్‌లు, క్రాకర్లు,  బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్‌లో కూడా ఎక్కువ  మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు. చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్‌లు,  ఫ్లేవర్డ్ బటర్ లో  కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది.   అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం,  టెక్చర్ కోసం  కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాలలో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పు తో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి.   కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపి తగ్గుముఖం పడుతుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
శరీరంలో కొవ్వు కరిగించే ఆయుర్వేదం సూప్.. రోజులో ఒక్కసారి తాగినా చాలు..! శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు.  కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి.  కొందరికి పొట్ట భాగం, మరికొందరికి పిరుదుల భాగం,  ఇంకొదరికి తొడలు, మరికొందరికి తొడలకు ఇరుప్రక్కలా.. ఇలా చాలా ప్రదేశాలలో కొవ్వు పెరుగుతూ ఉంటుంది.  నేటికాలంలో దీన్ని ఫ్యాట్ అని కూడా అంటారు.  అయితే కారణాలు ఏవైనా.. శరీరంలో పెరిగిన కొవ్వును కరిగించడం అంత సులభమేమీ కాదు.. చాలామంది జిమ్ కు వెళ్తారు,  వాకింగ్ చేస్తారు,  కడుపు కూడా కాల్చుకుంటారు. కానీ ఫలితం పెద్దగా ఉండదు.  అయితే శరీరంలో కొవ్వు కరిగించడానికి ఆయుర్వేదం చాలా చక్కని మార్గాన్ని సూచించింది.  అదే  ఆయుర్వేదం సూప్ .  ఈ సూప్ ను రోజులో కనీసం ఒక్క పూట అయినా తీసుకుంటే శరీరంలో కొవ్వు మెల్లిగా తగ్గుతుందట.  ఆ సూప్ ఏంటో.. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా తాగాలో తెలుసుకుంటే.. శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికి,  బరువు తగ్గడానికి చాలామంది సలాడ్ ను తింటారు. క్యారెట్, కీర దోస,  బీట్రూట్,  టమోటా, ఉల్లిపాయ వంటివి సలాడ్ లో భాగంగా పచ్చివి తింటుంటారు. అయితే..  ఆయుర్వేదం సూప్ ఇంకా చక్కని ఫలితాలు ఇస్తుంది. ఆయుర్వేదం సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, దోసకాయ, టమోటా, గుమ్మడికాయ, క్యారెట్, బీట్రూట్, పై చెప్పుకున్న కూరగాయలు అన్నీ ఒక కప్పు వచ్చేలా తీసుకోవాలి. తయారు చేసే విధానం.. కూరగాయలను ముక్కలుగా తీసుకున్నాక.. ఆ ముక్కలను పాత్రలోవేసి తగినన్ని నీరుకలిపి చిన్నమంట పైన మరిగించాలి. ముక్కలు మరుగుతూవుండగా అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మిరియాలపొడి, సైంధవలవణం, తగినంత కలుపుకోవాలి. ముక్కలు బాగా ఉడికినతరువాత దించి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన ఉంచాలి. ఎలా తీసుకోవాలి?  ఉడికించిన ముక్కలు గోరు వెచ్చగా అయిన తరువాత మొదట కూర ముక్కలను తినాలి,  ఆ తర్వాత కూర ముక్కలు ఉడికించిన నీటిని సూపులా తాగాలి. ఈ సూప్ తాగడం వల్ల శరీరంలో అదనంగా ఒకగ్రాము కూడా కొవ్వు పెరగదు.. పైగా ఇందులో వాడిన కూరగాయలలో నీటి శాతం,  ఫైబర్ శాతం మెరుగ్గా ఉన్నవే.. ఈ కారణంగా ఈ సూప్ తీసుకోవడం వల్ల  పొట్ట కూడా కరుగుతుంది.   శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు,  రక్తం శుద్దిగా లేకుండా పదే పదే మొటిమలు,  గుల్లలు, పొక్కులు కడుతున్నవారు.. ఈ సూపును తీసుకుంటే  మంచిరక్తం  ఏర్పడుతుంది,  రక్తం శుద్ది అవుతుంది,  చర్మం కూడా చాలా మెరుగ్గా మారుతుంది.                                          *రూపశ్రీ.