LATEST NEWS
లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తన వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా దేశ అంతర్గత విషయాలపై విమర్శలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందన్న విమర్శలు మళ్లీ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో  చర్చకు దారితీశాయి.   కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో  అనేక లోపాలు ఉన్నాయని విదేశీ వేదికపై విమర్శించడం ఇప్పుడు అధికార పక్షంతో పాటు రాజకీయ పరిశీలకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు తమ మాతృభూమి గొప్పతనాన్ని చాటిచెప్పడం భారత సంప్రదాయం. మన ఇతిహాసమైన మహాభారతంలో సైతం, అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా బయటి వ్యక్తుల ముందు మన లోపాలను ఎత్తిచూపకూడదని ధర్మరాజు తన తమ్ముళ్లకు సూచించిన సందర్భాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అయితే.. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ.. విదేశీ సదస్సుల్లో, విదేశీ మీడియా ముందు దేశ ప్రతిష్ఠను మసకబార్చులా  మాట్లాడటం   సమంజసం కాదన్న అభిప్రాయం గట్టిగా వ్యక్తమౌతోంది.    దేశంలో ఏవైనా సమస్యలు ఉంటే, ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే  హక్కు రాహుల్ గాంధీకి ఉంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్యవంతం చేయాలి. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి నిర్దిష్ట సూచనలు ఇవ్వాలి.. కానీ, స్వదేశంలో చేయాల్సిన రాజకీయ పోరాటాన్ని పక్కనపెట్టి, విదేశీ గడ్డపై దేశ ఆర్థిక వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఇండియా ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.  ప్రస్తుతం ఇండియా చుట్టూ ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు   సున్నితంగా ఉన్నాయి. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు భారత్‌లో అస్థిరతను సృష్టించేందుకు నిరంతరం ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో   దేశ బలహీనతలను విదేశీ వేదికలపై ఎత్తిచూపడం ద్వారా  శత్రుదేశాలకు   ఆయుధాలు అందించినట్లు అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి నేతలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని   అభిప్రాయపడుతున్నారు.   కొలంబియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ  విరుచుకుపడింది. రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ, గత పన్నెండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు  సుఖసంతోషాలతో జీవిస్తున్నారని పేర్కొంది.. ఇప్పటికే ప్రధాని మోదీ పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ రాజకీయ వైఖరిని ఎద్దేవా చేస్తూ మాట్లాడిన విషయాన్ని వారు గుర్తుచేశారు.  ఇది కూడా చదవండి:  రాహుల్ విదేశీ పర్యటన: శశిథరూర్ వ్యాఖ్యలు వైరల్.!​ అదలా ఉంటే.. ఇటీవల సోనియా గాంధీ ఆత్మకథ విడుదల సందర్భంగా తన తల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులతో పోలుస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి, మరో వివాదానికి తెరలేపాయి.   నిజానికి ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు సామాన్య ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఒక బలమైన ప్రతిపక్ష నేతగా ఆయన ఎదుగుతున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ, ఆ సానుకూల వాతావరణాన్ని నిలబెట్టుకోవాల్సింది పోయి, ఆయన ఇలాంటి అనవసర వివాదాల్లో చిక్కుకుంటూ తన వ్యక్తిత్వాన్ని, రాజకీయ ప్రతిష్ఠను ఆయనే స్వయంగా తగ్గించుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.    రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ తన ప్రసంగాల శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందర్భోచితంగా, దేశ ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో వ్యవహరించకపోతే, అది వ్యక్తిగతంగా ఆయనకే కాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమయోచిత వ్యాఖ్యలు చేయనంత కాలం హస్తం పార్టీకి రాజకీయ కష్టాలు తప్పవని, ప్రజల విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో గెలుచుకోవడం కష్టతరమవుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.   మీకు నచ్చవచ్చు: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై దుమారం​ 8 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు.. అదానీ ఆస్తులు ఎలా పెరిగాయి: రాహుల్ గాంధీ   [Rahul Gandhi, ColumbiaUniversitySpeech, IndianEconomy, BJPReaction, TeluguOne]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వివాదం మరోసారి బహిర్గతమైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత  జగన్‌ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ జగన్ మీడియా ప్రచురించిన కథనంపై షర్మిల నిప్పులు చెరిగారు. తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.  సాధారణ కుటుంబ సంబంధాలను కూడా వక్రీకరించి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.   మహిళలను గౌరవిస్తామని చెప్పే జగన్..  ఇలాంటి నిరాధారమైన,  దిగజారిన వార్తలను తన సొంత మీడియా ప్రచురించడాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఈ  ప్రచురణ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో జగన్ స్వయంగా సమాధానం చెప్పాలని   డిమాండ్ చేశారు. గతంలో తమ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం రాజకీయ విభేదాలను పక్కనబెట్టి తన పిల్లల పెళ్లిళ్లకు అందరినీ ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా  గుర్తుచేశారు. రాజకీయంగా ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, కుటుంబ వేడుకల్లో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం జగన్ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా షర్మిల అభివర్ణించారు. అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న   వివాదాల నేపథ్యంలో ఈ తాజా పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్  కుటుంబ వ్యవహారాలను బహిరంగ వేదికలపైకి లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని షర్మిల పదేపదే ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఇది కూడా చదవండి: వెల్తారా, వెళ్లరా: షర్మిల కుమార్తె వివాహానికి జగన్ హాజరుపై చర్చ.! అయినా..  తమ ప్రత్యర్థి అయితే చాలు…  వ్యక్తిత్వహననానికి పాల్పడడం, మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటేనంటూ.. నాడు నిండు సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు సైతం షర్మిలపై అనుచిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.    అంతెందుకు గతంలో షర్మిల కూడా పలు సందర్భాలలో జగన్ ది సైతాన్ సైన్యం   విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుకు తన కుమారుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు పసుపు రంగు చీర కట్టుకొని వెళ్లిన షర్మిలను దూషించిన ఘనత వైసీపీ సైకో సైన్యానిది. ఇప్పుడు కూడా తన కూతురు అంజిలి పెళ్లి పత్రిక అందించేందుకు చంద్రబాబును కలిసిన షర్మిలపై వైసీపీయులు దుర్భాషలాడుతున్నతీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మీకు నచ్చవచ్చు:   ఉంటే ఉండు, లేకుంటే దేశం విడిచిపో: వైఎస్ కంటే గొప్పోడివా.. జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల కుటుంబం.! ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.? [YSSharmila, YSJagan, SharmiladaughterMarriage, Invitation, CBN, CharacterAssassination, TeluguOne]
తెలంగాణలోని కోట్లాది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత ఆర్థిక భద్రతను కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అత్యంత చారిత్రాత్మక మరియు మానవతా దృక్పథంతో కూడిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి నైతిక స్థైర్యాన్ని, భరోసానిచ్చేందుకు ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ (ఇందిరమ్మ జీవిత భీమా) పథకానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాన్ని నవంబర్ 19వ తేదీన సిద్దిపేట వేదికగా జరగబోయే భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. కుటుంబంలో అందరికీ అండగా ఉండి, ఏకైక ఆధారంగా నిలిచే సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ సార్వత్రిక జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ అద్భుతమైన సంక్షేమ పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1 కోటి నుంచి 1.15 కోట్ల పేద కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. సమాజంలో పేద, ధనిక అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో ఈ పథకం రూపకల్పన జరిగింది. ఈ పథకం యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, కుటుంబంలో సంపాదించే ప్రధాన వ్యక్తికి ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవిస్తే వారి నామినీకి లేదా కుటుంబ సభ్యులకు నేరుగా రూ. 5 లక్షల భారీ ఆర్థిక సహాయం అందుతుంది. ఈ బీమా సౌకర్యం పొందడానికి లబ్ధిదారుల కుటుంబాలు ఒక్క రూపాయి కూడా ప్రీమియం కింద చెల్లించాల్సిన అవసరం లేదు; బీమా ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి అర్హ కుటుంబానికి ఈ భద్రత వర్తిస్తుందని, కుటుంబంలో ఒకరికి మించి సంపాదించే వ్యక్తులు ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం ఒకరికి మాత్రమే ఈ బీమా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకానికి అర్హత సాధించడానికి కుటుంబంలో సంపాదించే వ్యక్తి వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలని ప్రభుత్వం కచ్చితమైన నిబంధన నిర్దేశించింది. అనగా 1967 నవంబరు 19 నుండి 2008 నవంబరు 18 మధ్య జన్మించిన వారు ఎవరైనా దీనికి అర్హులుగా పరిగణించబడతారు. వయస్సు మరియు అర్హత నిర్ధారణ కోసం ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. సాధారణంగా రేషన్ కార్డు సంఖ్యే దరఖాస్తుకు ప్రాతిపదిక అయినప్పటికీ, ఒకవేళ రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ప్రత్యేక కోడ్ కేటాయించి ఈ నమోదు ప్రక్రియలో భాగం కల్పిస్తున్నారు. ఇది కూడా చదవండి : ICICI Bank New Rules: డిసెంబర్ నుంచి మారనున్న క్రెడిట్ కార్డ్ నిబంధనలు ఇవే! నమోదు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మరియు కింది స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ మరియు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడంతో పాటు, అధికారులే నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు సేకరించేలా సరికొత్త ప్రణాళిక రూపొందించారు. రేషన్ షాపుల వారీగా, గ్రామ పంచాయతీల ద్వారా ఈ దరఖాస్తులను స్వీకరించి, జిల్లా కలెక్టర్లు మరియు స్థానిక యంత్రాంగం ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్రియాశీలకంలో ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు మరియు నామినీ వివరాలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంటి పెద్దను కోల్పోయి అనాథగా మారే కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మీకు నచ్చవచ్చు: రూ. 1.57 కోట్లతో భారత్‌లో బైడీ డెన్జా జెడ్9 జిటి విడుదల! హ్యాకర్ల చేతిలో చిక్కిన AntiFox AI ఏజెంట్లు: AWS డేటాకు తీవ్ర ముప్పు!   [Indiramma Family Life Insurance, Telangana Government, Revanth Reddy, Telangana Welfare Schemes, ₹5 Lakh Life Insurance, Free Life Insurance Scheme, Ration Card Holders, Siddipet Public Meeting, Telangana Family Security, Indiramma Life Bima]
ALSO ON TELUGUONE N E W S
పూజిత పొన్నాడ..అచ్చ తెలుగు హీరోయిన్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంతో పూజిత అనే ట్ అవుట్ ఒకటుందని నిరూపించుకుంది. సోలో హీరోయిన్ గాను కొన్ని సినిమాలు కూడా చేసిన ఈ ముద్దుగుమ్మ  త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేశ్ ఆదర్శ కుటుంబం పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి అసలు నిజం ఇదా అని ఊహించని షాక్ కి గురి చేసింది. పూజిత పొన్నాడ తాను యూకేలో ఉన్న సమయంలో ఆదర్శ కుటుంబంకి సంబంధించిన  అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి ఆదర్శ కుటుంబం ప్రాజెక్ట్ గురించి చెప్పగానే, త్రివిక్రమ్ సినిమాలో నటించే అవకాశం వస్తోందన్న ఆనందంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్‌కి వచ్చేసింది. ఆడిషన్ ప్రక్రియ ద్వారా ఆమెను ఎంపిక చేశారని, త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పారని పూజిత తెలిపారు. అంతేకాదు, తొలి షెడ్యూల్‌లో ఆమెతో షూటింగ్ కూడా నిర్వహించారు. అయితే అసలు సమస్య రెండో షెడ్యూల్ దగ్గర మొదలైంది. మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక సుమారు 3 నెలల పాటు రెండో షెడ్యూల్ గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదని పూజిత చెప్పారు. మధ్యలో విదేశాలకు వెళ్లే ప్లాన్ ఉన్నందున, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన కరువైందని వాపోయారు. ఆ తర్వాత మరో అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి, ఆమెకు షూటింగ్ షెడ్యూల్ ఏదీ లేదని చెప్పారట. ఇది కూడా చదవండి:ఈ నగరానికి ఏమైంది రిపీట్ హైలైట్స్ ఇవేనంట: హిట్టుని అందుకుందా!   దీనిపై పూజిత కారణం అడిగి స్పష్టత కోరగా, తన క్యారక్టర్ లోకి  మరో నటిని తీసుకున్నారని తెలిసి ఒక్కసారిగా షాక్ తిన్నట్లు వెల్లడించారు. పద్ధతిగా ఆడిషన్ చేసి ఎంపిక చేసిన తర్వాత, కనీసం చెప్పకుండా తనను క్యారక్టర్ నుంచి తొలగించడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని ఆమె అన్నారు. ఇక సినిమా విడుదలైన తర్వాత ఆమెకు మరో పెద్ద షాక్ తగిలిందట. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ సన్నివేశంలో కేవలం ఒక  చిన్న సీన్‌లో, అది కూడా దాదాపు 40 సెకన్ల పాటు మాత్రమే కనిపించడం చూసి ఆశ్చర్యపోపోయింది. ఆమె చెప్పినట్టుగా ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. పూజిత ఇలాంటి క్యారక్టర్ లో కనిపించటం ఏంటా అని!    మీకు నచ్చవచ్చు :అలీ వ్యాఖ్యలు వైరల్: ఆమె నర్సు అంట! మీకు నచ్చవచ్చు :విశ్వక్ సేన్ కొత్త మూవీ ఓటిటి డేట్ ఇదే: త్వరగానే కానిచ్చేశారు!    [Pujita Ponnada,  Adarsha Kutumbam, Venkatesh, Trivikram, Tollywood]
Ramayana: Part 1 is creating box-office history, grossing Rs.1,519.05 crore worldwide in just 14 days. Headlined by Ranbir Kapoor, Yash and Sai Pallavi, the mythological epic has emerged as the biggest blockbuster in the careers of both Ranbir and Yash. Its phenomenal run has also put it in contention to challenge the lifetime collections of some of Indian cinema's biggest blockbusters, including Dhurandhar 2. The achievement becomes particularly significant when compared with the first instalments of successful Indian franchises. SS Rajamouli's Baahubali: The Beginning collected approximately Rs.650 crore worldwide, while Prashanth Neel's KGF: Chapter 1 earned around Rs.238 crore. Rishab Shetty's Kantara grossed approximately Rs.400 crore, while Aditya Dhar's Dhurandhar, the first instalment of the spy franchise, collected around Rs.1,300 crore. Nag Ashwin's Kalki 2898 AD, which launched another ambitious franchise, also finished below the current collections of Ramayana. In fact, Ramayana has gone beyond the lifetime collections of several successful second instalments as well. Its current total is higher than the worldwide gross of KGF: Chapter 2 and even SS Rajamouli's standalone blockbuster RRR. However, Baahubali 2: The Conclusion and Pushpa 2: The Rule remain ahead. With Rs.1,519.05 crore worldwide, Ramayana: Part 1 currently occupies the fifth position among the highest-grossing Indian films of all time. Only Dangal, Dhurandhar 2, Baahubali 2 and Pushpa 2 are ahead of it. The film has collected Rs.1,009.05 crore gross in India and Rs.510 crore from overseas markets. Also Read: ENE Repeat Movie Review  Interestingly, Ramayana is now within striking distance of Dhurandhar 2's reported lifetime worldwide gross of approximately Rs.1,813 crore. With a difference of around Rs.294 crore, the film has a realistic target to chase as its theatrical run continues. Surpassing that figure would take it past one of the biggest box-office records in Indian cinema. Produced by Namit Malhotra and directed by Nitesh Tiwari, Ramayana features Ranbir Kapoor as Lord Rama, Sai Pallavi as Sita, Yash as Ravana, Ravi Dubey as Lakshman and Sunny Deol as Hanuman. The two-part adaptation will conclude with its second instalment, scheduled for Diwali 2028. What would be second part collections as it will have Sunny Deol in full fledged role as Hanuman, is giving thills even to imagine.  Check Out: Salman Khan’s Maatrubhumi finally clears censor                      RAPO23 Pre-look: Ram as Lone Wolf  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎట్టకేలకు సినిమా అభిమానులు, ప్రేక్షకులు 'ఈఎన్‌ఈ రిపీట్ ఉరఫ్ 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్ 2 (నిన్న ప్రీమియర్స్) బాగుందనే మాటని సూర్యోదయం ముందుగానే  వింటూ తమ దిన చర్యని స్టార్ట్ చేసారు. దీంతో ప్రెజెంట్ 50 దాటిన వాళ్ళు కూడా   ఈఎన్‌ఈ రిపీట్ కోసం థియేటర్స్ కి తరలి వెళ్తున్నారు. మరి యూత్ క్రౌడ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  ఈ మూవీ హైలైట్స్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.   మొదటి సినిమా ముగిసిన చోటు నుంచే ఈ కథ మొదలవుతుంది. వివేక్, కార్తీక్, కౌశిక్, ఉపేంద్ర కలిసి కన్యారాశి టీమ్ పేరుతో తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవుతుంది. ఆ నష్టాలతో నిర్మాత తీవ్ర ఇబ్బందుల్లో పడటం, స్నేహితుల మధ్య దూరం పెరగడం వంటి ఆసక్తికర మలుపులతో కథ ముందుకు సాగుతుంది. తమను తాము నిరూపించుకోవడానికి మరియు ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ఈ గ్యాంగ్ మరోసారి సినిమా తీసేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో కథ థాయ్‌లాండ్‌కు మారడం, అక్కడి అడవిలో జరిగే షూటింగ్ ఎపిసోడ్లు, బీచ్ మరియు బార్ సన్నివేశాలు ప్రేక్షకులకి  కొత్త అనుభూతిని ఇస్తాయి.  అతిపెద్ద హైలైట్‌గా కౌశిక్ గా చేసిన అభినవ్ గోమటం నిలిచారు. తన సహజమైన కామెడీ టైమింగ్, హావభావాలు, రియాక్షన్లతో థియేటర్లలో నవ్వులు పూయించారని పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ ఆర్థిక ఒత్తిళ్లు, సీరియస్ యాటిట్యూడ్‌తో కనిపిస్తూ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. మొదటి భాగంలో కార్తీక్ పాత్ర పోషించిన సాయి సుశాంత్ రెడ్డి స్థానంలో ఈసారి శ్రీనాథ్ మాగంటి కనిపించడం గమనార్హం. వెంకటేష్ కాకుమాను ఉప్పు పాత్రలో అలరించగా, శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్, ప్రియదర్శిని రామ్ కీలక పాత్రల్లో మెరిశారు.   సాంకేతిక విభాగంలో వివేక్ సాగర్ నేపథ్య సంగీతం, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇది కూడా చదవండి:అలీ వ్యాఖ్యలు వైరల్: ఆమె నర్సు అంట.. ఎవర్ని ఉద్దేశించి అన్నాడో ఆ హీరో ఫ్యాన్స్ కి బాగా అర్థమైంది! సుమారు 2 గంటల 35 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో సెకండాఫ్‌లోని చివరి సుమారు 40 నిమిషాలు, గెస్ట్ అప్పియరెన్స్‌లుగా కనిపించే దర్శకుల సన్నివేశాలు థియేటర్లలో సందడి చేస్తాయి. S Originals మరియు Rootnode Cinema బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. 2018 నాటి ఒరిజినల్ మ్యాజిక్‌తో పోల్చకుండా, స్నేహితులతో కలిసి సరదాగా నవ్వుకోవాలనుకునే వారికి ఈ సీక్వెల్ ఒక ఫ్రెండ్లీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది.   మీకు నచ్చవచ్చు: సల్మాన్ ఖాన్ మాతృభూమికి  సెన్సార్ ఇచ్చిన గిఫ్ట్! మీకు నచ్చవచ్చు :పవన్ కళ్యాణ్ పై కోట రుక్మిణి కీలక వ్యాఖ్యలు     [ENE Repeat , Viswak sen, Tharun Bhascker, Abhinav Gomatam Tollywood]  
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్తీ మేరీకి భారతీయ సంప్రదాయాలను పరిచయం చేస్తూ ఉంటారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మన సంస్కృతి, పండుగలు, ఆచారాలకు ఆమె ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. తన ఫ్యామిలీ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రియాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఓ వీడియోలో చిన్నారి మాల్తీ తన తల్లి ఒడిలో కూర్చొని గాయత్రీ మంత్రాన్ని ఎంతో ముద్దుగా చెబుతోంది. ఇంట్లోని పూజా మందిరం ముందు కూర్చున్న మాల్తీ.. ‘ఓం భూర్భువః స్వః’ అంటూ మంత్రాన్ని చదువుతుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. చివర్లో ప్రియాంక ‘సో బ్యూటిఫుల్’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోతో పాటు ప్రియాంక మరికొన్ని వెకేషన్ ఫొటోలను కూడా పంచుకున్నారు. కుమార్తె మాల్తీతో కలిసి బీచ్‌లో సరదాగా గడుపుతున్న ఫొటోలు, ఇసుకతో బొమ్మలు చేస్తూ ఆడుకుంటున్న మాల్తీ పిక్స్ అందులో ఉన్నాయి. ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా ఈ వెకేషన్‌లో పాల్గొన్నారు. ప్రియాంక, నిక్ జోనాస్ దంపతులు తమ కుమార్తెకు భారతీయ, అమెరికన్ సంస్కృతుల పరిచయం కల్పించాలని భావిస్తున్నట్లు గతంలోనూ వెల్లడించారు. దీపావళి వంటి భారతీయ పండుగలను జరుపుకోవడంతో పాటు సంప్రదాయ ప్రార్థనలను కూడా మాల్తీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని మాల్తీ చదువుతున్న వీడియో చూసిన అభిమానులు ఆమెను అభినందిస్తున్నారు. ఇది కూడా చదవండి: వారణాసి వాయిదా.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.? ఇక సినిమాల విషయానికొస్తే.. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. మీకు నచ్చవచ్చు: రెండేళ్లుగా మంచానికే పరిమితమైన స్టార్.. కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ స్టోరీ.! రెండు వారాల్లోనే 1500 కోట్లు.. ధురంధర్‌ 2, పుష్ప 2 రికార్డులు బ్రేక్‌.! https://www.instagram.com/p/Df6T96xo7LX/       [Priyanka Chopra Daughter, Malti Marie, Gayatri Mantra, Nick Jonas, Varanasi Movie]  
అలీ.. తెలుగు సినిమాకి దొరికిన అరుదైన యాక్టర్. కమెడియన్ గా అయితే చెప్పక్కర్లేదు. తన ఆరా కనిపిస్తూనే, వినిపిస్తూనే ఉంటుంది.  హీరోగాను రాణించి అభిమానులని సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలు బాగా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉన్నాడు.        ఈ కోవలోనే 'మన డాక్టర్ బాబే' అనే మూవీతో వస్తున్నాడు. తాజాగా 'మన డాక్టర్ బాబే' సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ మోహన సిద్ధి, హీరో శ్రీ స్కంద, శృతి శంకర్‌లతో కలిసి అలీ చేసిన సరదా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో మంచి ఆసక్తిని రేపుతోంది. ఇది కూడా చదవండి: సల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ షాకింగ్ డేసిషన్: ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చెయ్యాలి!    ఈ నెల  20 న   విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి.ఈ ఇంటర్వ్యూలో అలీ అడిగిన ప్రశ్నలకు మోహన సిద్ధి ఇచ్చిన సమాధానాలు, వారి మధ్య సాగిన సరదా సంభాషణలు చూసేవారిని బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మోహన సిద్ధి తన తదుపరి ప్రాజెక్టులు, నెక్స్ట్ మూవీ గురించి పంచుకున్న విషయాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.  అలీ మాట్లాడుతు మూవీలో మోహన సిద్ధితో ఎలాంటి సీన్స్ లేవు. కానీ పార్ట్ 2 లో  మోహన నర్సు అయితే నేను డాక్టర్ అని సరదగా చెప్పాడు.    మీకు నచ్చవచ్చు:స్టార్ యాక్టర్ పై దియామీర్జా కీలక వ్యాఖ్యలు: మీకు నచ్చవచ్చు :సంజయ్ దత్ గత జన్మలో ఏ పని చేసే వాడో తెలుసా!     [Ali, Mana Doctor Babe, Mohana Siddhi, Tollywood, Bollywood]
సల్మాన్ ఖాన్.. ఈ కట్ అవుట్ కి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఉన్న చరిష్మా గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. మూడు దశాబ్దాల నుంచి బాలీవుడ్ లో తన జెండా, అజెండాని చాటి చెప్తూ వస్తున్నాడు. డిసెంబర్ 4 న నయా మూవీ 'మాతృభూమి' తో వస్తున్నాడు. ఈ చిత్రం సెన్సార్ న్యూస్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకి సెన్సార్ నుంచి ప్రతికూలంగా వస్తున్న విషయాన్నీ చూస్తూనే ఉన్నాం.  ఈ నేపదాయంలో ఎట్టకేలకు మాతృభూమి  సెన్సార్ అడ్డంకులను అధిగమించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ముంబై ప్రాంతీయ కార్యాలయం ఈ చిత్రానికి 'యూ/ఏ 16+' సర్టిఫికెట్ మంజూరు చేసింది. నెలల తరబడి సాగిన చర్చలు, వాయిదాలు, పేరు మార్పుల తర్వాత ఈ క్లియరెన్స్ రావడం సినిమా బృందానికి మరియు అభిమానులకు పెద్ద ఊరటనిచ్చే విషయం. సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం ఈ సినిమా నిడివి 154.12 నిమిషాలుగా ఉంది, అంటే సుమారు 2 గంటల 34 నిమిషాల 12 సెకన్ల పాటు ప్రేక్షకులను ఈ వార్ డ్రామా అలరించనుంది. ఈ చిత్రం తొలుత 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' అనే టైటిల్‌తో ప్రకటించబడింది, ఆ తర్వాత 'మాతృభూమి'గా పేరు మార్చారు. 2020 జూన్ 15-16 తేదీలలో గాల్వాన్ లోయలో భారత్ మరియు చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మాతృభూమి రూపొందింది. ఆ ఘటనలో మన దేశానికి చెందిన 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 19 మంది సైనికులు వీరమరణం పొందారు. ఆ వీర సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలను ఆవిష్కరిస్తూనే, మరోవైపు కుటుంబానికి అండగా నిలిచే భావోద్వేగ కోణాన్ని కూడా దర్శకుడు అపూర్వ లఖియా ఈ చిత్రంలో చూపించారని సమాచారం.   సినిమా విడుదల ప్రయాణం అంత సులభంగా సాగలేదు. వాస్తవానికి ఈ చిత్రాన్ని నవంబర్ 20న థియేటర్లలో విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) పనులు పెద్ద స్థాయిలో ఉండటం, నటి చిత్రాంగదా సింగ్‌కు గాయం కావడం వంటి కారణాలతో షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ షెడ్యూల్‌పై ప్రభావం పడింది. ఇది కూడా చదవండి: అతనితో పనిచెయ్యడం పీడకల: స్టార్ యాక్టర్ పై దియామీర్జా కీలక వ్యాఖ్యలు: ఇంకా ఏం చెప్పిందంటే!   అంతేకాకుండా భారత రక్షణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు దర్శకుడు అపూర్వ లఖియా దాదాపు 40 శాతం సినిమాను రీషూట్ చేసి, కొన్ని కల్పిత అంశాలు, రొమాంటిక్ సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ స్టోరీని జోడించి కొత్త వెర్షన్‌ను సిద్ధం చేశారు. విజువల్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ సమయం తీసుకున్నారని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. సెన్సార్ బోర్డు మరియు సంబంధిత ఏజెన్సీలు సినిమాలో ఎలాంటి అభ్యంతరకర అంశాలను గుర్తించలేదని, ఎలాంటి కట్స్ లేకుండానే సర్టిఫికెట్ ఇచ్చాయని సల్మాన్ గతంలోనే వెల్లడించారు. భారత్-చైనా దౌత్య సంబంధాల నేపథ్యంలో సినిమాలోని అంశాలపై కొన్ని సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.  సల్మాన్ ఖాన్‌కు జోడీగా చిత్రాంగదా సింగ్ నటించగా, ముఖేష్ రిషి, అంకుర్ భాటియా, జైన్ షా, అభిలాష్ చౌదరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిమేష్ రేష్మియా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జియో స్టూడియోస్ విడుదల చేస్తోంది. అన్ని అడ్డంకులను దాటుకుని 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.   మీకు నచ్చవచ్చు:వైరల్ గా మారిన సంజయ్ దత్ గత జన్మ! మీకు నచ్చవచ్చు :రామాయణ మూవీపై హిందూ జాగృతి సమితి ఫైర్!   [Salman Khan,  Maatrubhumi, Apoorva Lakhia, Tollywood, Bollywood]
జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాల టైటిల్స్‌లో తాతగారి సినిమాల పేర్లు కలిసొచ్చేలా చూసుకుంటున్నారా? గతంలో తాత ఎన్టీఆర్‌ నటించిన ఆల్‌టైమ్‌ క్లాసిక్‌ ‘లవకుశ’ టైటిల్‌ను గుర్తుచేసేలా ‘జై లవకుశ’తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న తారక్‌.. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘జై లవకుశ’లో మూడు విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి తన తాత నటించిన క్లాసిక్‌ సినిమా టైటిల్‌లోని పదాలను కలుపుతూ కొత్త సినిమా చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఈసారి ‘దానవీరశూరకర్ణ’ నుంచి ‘దానవీరశూర’ అనే పేరును తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకే ‘దానవీరశూర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నందమూరి తారక రామారావు నటించిన ‘దానవీరశూరకర్ణ’ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రం. అలాంటి క్లాసిక్‌ పేరులోని మూడు పదాలను తీసుకొని ‘దానవీరశూర’గా టైటిల్‌ పెడితే నందమూరి అభిమానులకు అదొక ప్రత్యేకమైన కనెక్షన్‌ అవుతుంది. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ను చూసి మిగతా స్టార్స్‌ మారతారా.? ఎన్టీఆర్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్‌ కామెడీ టైమింగ్‌కు తారక్‌ ఎనర్జీ తోడైతే ఎలాంటి ఎంటర్‌టైనర్‌ వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. అలాంటి సినిమాకు ‘దానవీరశూర’ అనే టైటిల్‌ నిజంగానే ఖరారైతే నందమూరి అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ అవుతుంది. అయితే ఈ టైటిల్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే ‘దానవీరశూర’ పేరుతోనే ఎన్టీఆర్‌–అనిల్‌ రావిపూడి సినిమా రాబోతోందా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మీకు నచ్చవచ్చు: వారణాసి వాయిదా.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.? ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!       [Daana Veera Soora, Jr NTR, Anil Ravipudi, Dragon]
సంజయ్ దత్... మూడున్నర దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానుల చేత కట్ అవుట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. గుంటూరు, విజయవాడ లాంటి ఏరియాస్ లో కూడా.. హెయిర్ స్టైల్ ఫాలో అయిన వాళ్ల కరెక్ట్ నెంబర్ ఇప్పటికి ఎవరు కనిపెట్టలేకపోయారు. ప్రెజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో పలు క్యారెక్టర్స్ తో తన సత్తా చాటుతు వస్తున్నాడు.       సంజయ్ దత్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన గత జన్మకి  సంబంధించిన షాకింగ్ విషయాలని  పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయన మాట్లాడుతు 'బొటనవేలు ముద్రలు, చేతితో రాసిన పత్రాల ద్వారా గతజన్మల వివరాలను చెప్పే ఒక గ్రామం ఉందని, అక్కడ ఒక పూజరిని కలవమని నా స్నేహితుడు చెప్పాడు. అతను చెప్పినట్టు నేను వెళ్లి కలిస్తే నా గత జన్మ గురించి చెప్పాడు. నేను గత జన్మలో అశోక రాజ్యంలో ఒక రాజు. నా భార్య, మంత్రి నన్ను మోసం చేసారు. నా భార్య మంత్రితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నేను చనిపోవాలని నా భార్య నన్ను యుద్దానికి పంపింది. కానీ నేను యుద్ధంలో గెలిచి వచ్చాక వాళ్ళిద్దరి గురించి తెలిసి వాళ్ళని చంపేసాను. చివరి దశలో శివ భక్తుడిగా అడవిలో ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించానని ఆ పూజారి తెలిపాడు. ఇది కూడా చదవండి:రామాయణ ప్రదర్శనని నిలిపేయాలి.. హిందూ జాగృతి సమితి డిమాండ్!   అలాగే.. ప్రస్తుతం నా లైఫ్ లో జరిగిన సంఘటనలకు గత జన్మని ముడి పెట్టి నేను మంచి కుటుంబంలో పుట్టి పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్నా గత జన్మలో చేసిన ఆ రెండు హత్యల వల్లే కర్మ అనుభవిస్తున్నాను అని ఆ పూజారి చెప్పినట్టు తెలిపాడు. దీంతో సంజయ్ దత్ తన గత జన్మ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఆ గ్రామం ఎక్కడ ఉంది, పూజారి ఎవరు అనే విషయాలు మాత్రం ఆయన చెప్పలేదు.   మీకు నచ్చవచ్చు:పవన్ పై కోట రుక్మిణి కీలక వ్యాఖ్యలు! మీకు నచ్చవచ్చు :నయనతార ఏమైనా మదర్ థెరిస్సానా!    [Sanjay Dutt, Sanjay Dutt karma, Bollywood, Tollywood]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తూ, శరీరంలోని వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అయితే, జీవనశైలిలో మార్పులు , వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా కిడ్నీలు బలహీనపడే ప్రమాదం ఉంది. కిడ్నీలు దెబ్బతినడం మొదలైనప్పుడు మన శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా, మూత్ర విసర్జనలో వచ్చే మార్పులు కిడ్నీ సమస్యలకు తొలి సంకేతాలుగా భావించవచ్చు. వీటిని ముందుగానే గుర్తించడం ద్వారా పెద్ద ముప్పు నుంచి బయటపడవచ్చు. మూత్రంలో నురుగు.. సాధారణంగా కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మూత్రం రంగు, పరిమాణం , దాని స్వభావంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. కొందరిలో మూత్రం చేసే సమయంలో విపరీతంగా , ఎక్కువసేపు నిలిచి ఉండే తెల్లటి నురగ వస్తుంటుంది. ఇలా తరచూ జరగడం మూత్రంలో ప్రొటీన్ బయటకు పోతున్నదనేదానికి ముఖ్య సంకేతం. ఆరోగ్యవంతమైన కిడ్నీలు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను ఉంచుకుని వ్యర్థాలను మాత్రమే బయటకు పంపిస్తాయి. కానీ కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు ప్రొటీన్ మూత్రం ద్వారా కారిపోతుంది. మూత్రం రంగు.. మూత్రం రంగులో వచ్చే మార్పులను కూడా తేలికగా తీసుకోకూడదు. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ ఎటువంటి కారణం లేకుండా మూత్రం ముదురు పసుపు రంగులో, గోధుమ రంగులో లేదా తేయాకు రంగులో పడుతుంటే అప్రమత్తం కావాలి. కొన్ని సందర్భాల్లో మూత్రం గులాబీ రంగులో లేదా ఎరుపు రంగులో రావడం కూడా జరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో హెమటూరియా అంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, ఇన్ఫెక్షన్లు తలెత్తడం లేదా వాపు కారణంగా ఇలా జరగవచ్చు. నొప్పులు లేకపోయినా మూత్రంలో రంగు మారడం లేదా రక్తం పడటం జరిగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. మూత్రవిసర్జన వేళలు.. మూత్ర విసర్జన చేసే వేళల్లో వచ్చే తేడాలు కూడా కిడ్నీ సమస్యలను సూచిస్తాయి. పగటిపూట లేదా రాత్రి సమయంలో సాధారణం కంటే చాలా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం కిడ్నీల సామర్థ్యం తగ్గడానికి ఒక కారణం కావచ్చు. కిడ్నీలు మూత్రాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోవడం  వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి తోడు డయాబెటిస్ లేదా ప్రోస్టేట్ సమస్యలు కూడా కారణం కావొచ్చు. మరోవైపు, అకస్మాత్తుగా మూత్రం వచ్చే పరిమాణం చాలా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరిగితే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి సంకేతం. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే! వాసన.. మూత్రం నుండి తీవ్రమైన లేదా సాధారణం కాని ఘాటైన వాసన రావడం కూడా కొన్నిసార్లు శరీరంలో నీటిశాతం తగ్గడం వల్ల లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఈ లక్షణాలతో పాటు పొత్తి కడుపులో  నొప్పి, జ్వరం లేదా మంట వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మరికొన్ని సిగ్నల్స్.. మూత్రంలో కనిపించే ఈ మార్పులతో పాటు శరీరం ఇతర సంకేతాలను కూడా ఇస్తుంది. ముఖం మరియు పాదాలు ఉబ్బడం, ఒంట్లో తీవ్రమైన నీరసం నిరంతరం వేధించడం, ఆకలి మందగించడం, వికారంగా అనిపించడం, చర్మంపై విపరీతమైన దురద పుట్టడం , కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్లే ఇవన్నీ జరుగుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం దీర్ఘకాలికంగా నియంత్రణలో లేకపోవడం, కిడ్నీలో రాళ్లు, పదే పదే వచ్చే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు , వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా పెయిన్‌కిల్లర్స్ వంటి మందులను వాడటం వల్ల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, తగినంత నీరు తాగుతూ ఉండటం , ఏ చిన్న అనారోగ్య లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..​                                  మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​  
మన శరీరంలోని కిడ్నీలు, లివర్ వంటి ముఖ్యమైన అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తున్నాయా? వాటిలో ఏవైనా సమస్యలు మొదలైతే శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను ఇస్తుందా? అసలు ఈ సంకేతాలను ఎలా గుర్తించాలి? మన శరీర ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడంలో చెవులు, కళ్లు, పెదవుల ఆకృతి వంటి బాహ్య లక్షణాలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలోని ప్రతి అవయవం తనదైన ప్రత్యేక విధులను నిర్వహిస్తుంది. కిడ్నీలు రక్తంలోని వ్యర్థ పదార్థాలను వడపోసి బయటకు పంపడంలో, శరీరంలో నీరు, లవణాల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే లివర్ ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు శరీరంలోని అనేక ముఖ్యమైన జీవక్రియల్లో పాల్గొంటుంది. ఈ అవయవాల పనితీరులో మార్పులు వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఈ వీడియోలో డాక్టర్ ఉమా వెంకటేష్ (Dr. Uma Venkatesh) పంచభూతాల సిద్ధాంతం, శరీరంలోని అవయవాల పనితీరు, నాడి ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు చెవులు, కళ్లు, పెదవుల ఆకృతిని పరిశీలించడం ద్వారా శరీరంలోని అంతర్గత ఆరోగ్య పరిస్థితుల గురించి ఎలా అర్థం చేసుకోవచ్చనే అంశాలను పల్స్ బ్యాలెన్సింగ్ (Pulse Balancing) విధానం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోగలిగే ముఖ్యమైన అంశాలు: కిడ్నీలు, లివర్ మన శరీరంలో నిర్వహించే ముఖ్యమైన విధులు ఏమిటి?   ఈ అవయవాల ఆరోగ్యంలో మార్పులు వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి?   కిడ్నీ సమస్యలకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను ఎలా  గుర్తించాలి?   లివర్ ఆరోగ్యాన్ని సూచించే లక్షణాలు ఏమిటి?    చెవులు, కళ్లు, పెదవుల ఆకృతికి శరీర ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటి?   పంచభూతాల సిద్ధాంతం ప్రకారం శరీర అవయవాల పనితీరును ఎలా వివరిస్తారు?   నాడి పరిశీలన, పల్స్ బ్యాలెన్సింగ్ విధానంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?   మన అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శరీరం ఇచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయకుండా గమనించడం, అవసరమైనప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం. కేవలం బాహ్య లక్షణాలు లేదా అవయవాల ఆకృతిని బట్టి కిడ్నీ, లివర్ వ్యాధులను నిర్ధారించలేము. సరైన వైద్య పరీక్షలు, నిపుణుల సలహాతోనే ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవాలి. కిడ్నీ, లివర్ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడానికి డాక్టర్ ఉమా వెంకటేష్ అందిస్తున్న ఈ విలువైన సమాచారాన్ని పూర్తిగా చూడండి. TeluguOne Health – ఆరోగ్యంపై అవగాహన, ఆరోగ్యకరమైన జీవితానికి మార్గదర్శకం.