LATEST NEWS
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు. ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక  ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారు. గతంలో చేసిన విమర్శలే చేస్తూ.. అదే తప్పును పునరావృతం చేస్తున్నారు. పార్టీ పరాజయానికి కారణాలు, క్యాడర్ లో భరోసా నింపడంలో తన వైఫల్యాలపై ఆత్మ విమర్శ చేసుకోవడం, పార్టీ తీరుపై సమీక్షలు నిర్వహించడం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.   రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి హవా స్పష్టంగా కనిపించింది. ప్రతిచోటా అధికార పక్షం వైపే ఓటర్లు మొగ్గు చూపడంతో వైకాపాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ భారీ పరాభవంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్ జగన్... సోషల్ మీడియా వేదికగా తన అక్కసును వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసులు,  ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.  ప్రతిపక్షం పోటీ చేసే అవకాశమే ఇవ్వకుండా ఎన్నికల్లో అద్భుతంగా గెలవడం ఎలాగో మీరు నిరూపించారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.  రాష్ట్రంలో జరిగినవి  ఎన్నికలు కాదని  సెలెక్షన్స్ అనీ జగన్ ఆరోపించారు.  అధికార పార్టీ మరియు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా విమర్శలు చేయడం ద్వారా, ప్రజల తీర్పును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాతీర్పును  గౌరవించకుండా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదన్న విషయాన్ని చాటుతున్నాయంటున్నారు.  క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని తప్పులను సరిదిద్దుకునే దిశగా వైకాపా అధినాయకత్వం అడుగులు వేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇదే వైఖరిని కనుక కొనసాగిస్తే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.  ప్రజల నుంచి వచ్చిన స్పష్టమైన తీర్పును అంగీకరించి ఆత్మసమీక్ష చేసుకోవడానికి బదులుగా,  నిందలు మోపి, పరాజయానికి నెపం తెలుగుదేశం పార్టీపైనా, ఎన్నికల సంఘంపైనా నెట్టేయడం సరి కాదంటున్నారు.   ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించి, ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాడితేనే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని లేకపోతే పార్టీ భవిష్యత్  ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.  [Jagan Reaction On Defeat, Municipal polls, AP Local Body Election Results,   Team CBN Tweet, AP politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపోల్ ఫలితాలు ఫలితాలు వైసీపీకి కోలుకోలేని పరాభవాన్ని మిగిల్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన  మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) రాజధాని ప్రతిపాదనను స్థానిక ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్లు ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేస్తోంది. అంటే జగన్ 2029 ఎన్నికలకు మావిగన్ నినాదంతో వెడతామని ప్రకటించారు. అయితే అంత వరకూ ఆగక్కర్లేదు, ఆ నినాదంతో ఎన్నికలకు వెడితే ఫలితం ఇలాగే ఉంటుందని మునిసిపోల్స్ లో తమ విస్పష్ట తీర్పు ద్వారా ప్రజలు నిర్ద్వంద్వంగా చాటారు.  గతంలో మూడు రాజధానుల ముసుగులో విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చూపేందుకు ప్రయత్నించినప్పటికీ, 2024 ఎన్నికల్లో వైజాగ్ నియోజకవర్గాల ప్రజలు వైసీపీని పూర్తిగా పక్కనబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ  మావిగన్ పేరుతో కొత్త పల్లవి ఎత్తుకుంది. అయితే, 2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.   మున్సిపల్ ఫలితాల్లో  అధికార తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిక్యతను సాధించింది. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో  తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేనలు ఏకంగా 48 స్థానాలను కైవసం చేసుకోగా, ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. వైసీపీ 9 స్థానాలకే పరిమితమైంది.  ఇక్కడ టీడీపీకి చెందిన షేక్ అబ్దుల్లా అభిదా మేయర్‌గా విజయం సాధించారు. అలాగే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలోనూ ఇదే ఫలితం వచ్చింది.  విజయవాడ కార్పొరేషన్‌ను జనసేన అభ్యర్థి వంగవీటి రాధా దక్కించుకోగా, 86 డివిజన్లలో అత్యధిక భాగం తెలుగుదేశం కూటమి ఖాతాలోనే పడ్డాయి. అ  గుంటూరు కార్పొరేషన్‌లో మొత్తం 76 డివిజన్లలో  కూటమి మెజారిటీ స్థానాలను గెలుచుకుంది.  టీడీపీకి చెందిన కోవలమూడి లక్ష్మీ అపర్ణ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ మూడు నగరాల్లోనూ వైసీపీ కనీస పోటీ కూడా   కూడా ఇవ్వలేకపోయింది. దీంతో  2029 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే  మావిగున్ రాజధాని ప్రతిపాదనకు అసలైన రెఫరెండమ్ జగన్ గతంలో పలు సందర్భాలలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఈమూడు నగరాల  కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఘోర పరాజయం చూస్తుంటే... ఆ రెఫరెండమ్ ఫలితం కోసం ప్రజలు మరో రెండున్నరేళ్లు ఆగాల్సిన అవసరం లేదని స్పష్టమౌతోంది. జగన్ మావిగన్ ప్రతిపాదనను జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికి ఈ ఫలితాలే నిలువెత్తు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [People Reject MAVIGUN, AP Municipal Corporation Election Results, YSRCP Capital Narrative, TDP Janasena Alliance victory, AP politics, Telugu One]
భారత రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సవాళ్లు, ప్రతిసవాళ్లు ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరాయి. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓపెన్ డిబేట్ కోసం సవాళ్లు విసురుతున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా బదులిచ్చారు. సోషల్ మీడియాలో డైలాగులు చెప్పడం కాదని, దమ్ముంటే నేరుగా పార్లమెంట్‌కు వచ్చి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (EVMs) అలాగే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశాలపై చర్చించాలని ఆమె సవాల్ విసిరారు. పార్లమెంట్ అనేది కేవలం ఒక వేదిక మాత్రమే కాదని, మీలాంటి సీనియర్ నేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి మాట్లాడటానికి రాజ్యాంగబద్ధమైన అత్యున్నత ప్రాంగణం అదేనని ఆమె స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ది కోసం, ప్రజలను ఆకర్షించడం కోసం ఆన్‌లైన్‌లో సవాళ్లు విసరడం మానేసి, అసలు సభలోపల వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలని ఆమె హితవు పలికారు. కేవలం ఒక్క రోజు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ఈ అంశాలపై చర్చించడానికి సిద్ధమని ప్రకటించిన విషయాన్ని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేశారు. ప్రభుత్వమే స్వయంగా చర్చకు ఆహ్వానిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు ఆ సదవకాశాన్ని ఉపయోగించుకోకుండా వెనకంజ వేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. కేవలం ఆరోపణలు గుప్పించి, తాము లేవనెత్తిన అంశాలకు అధికార పక్షం ఇస్తున్న సమాధానాలను వినకుండానే సభ నుంచి వాకౌట్ చేయడం లేదా సబ్‌ను స్తంభింపజేయడం రాహుల్ గాంధీ గారికి అలవాటుగా మారిందని ఆమె విమర్శించారు. నిజంగా ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే, సభలోపల చర్చ జరిగే సమయంలో చివరి వరకు కూర్చుని అధికార పక్షం ఇచ్చే సమాధానాలను వినే ఓపిక ఉండాలని ఆమె చురకలంటించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నివాసంలో నిర్వహించిన 'మోసపూరిత పార్లమెంట్' (Mock Parliament) కార్యక్రమంపై కూడా నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజమైన పార్లమెంట్‌ను పక్కన పెట్టి, ఇళ్లలో ఇలాంటి ప్రత్యామ్నాయ డ్రామాలు ఆడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆమె అభివర్ణించారు. అలాంటి వినూత్న కార్యక్రమాలకు సమయం కేటాయించగలిగిన రాహుల్ గాంధీకి, దేశ ప్రజల ముందు నిజాలు నిరూపించడానికి అసలైన పార్లమెంట్ భవనం ఎందుకు కనిపించడం లేదని ఆమె ప్రశ్నించారు. "డరో మత్" (భయపడకండి) అంటూ ఎప్పుడూ నినాదాలు చేసే రాహుల్ గాంధీ, ఇప్పుడు తానే స్వయంగా నిజాలకు భయపడి సభను వదిలి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు ఆరోపణలతో సుదీర్ఘ జాబితాలను సోషల్ మీడియాలో వదలడం కాదని, దమ్ముంటే పక్కా ఆధారాలతో పార్లమెంట్ సాక్షిగా చర్చకు రావాలని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.       [Nirmala Sitharaman, Rahul Gandhi, Narendra Modi, Indian Parliament, EVM Debate, Special Intensive Revision, Voter List Revision, Amit Shah, Congress Party, Indian Politics]
పులివెందులలో నాలుగు దశాబ్దాల  వైఎస్ కుటుంబ పాలనకు గండి పడింది.  పులివెందుల మునిసిపాలిటీని కైవసం చేసుకోవడం వ్యక్తిగతంగా తనకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రయత్నించినా జగన్ పరాజయాన్ని అడ్డుకోలేకపోయారు.  అసలు గతంలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కకుండా వైసీపీ అభ్యర్థి ఘోరంగా పరాజయం పాలైన రోజే పులివెందులపై జగన్ పట్టు సడలిందన్న సంగతి తేటతెల్లమైంది.  2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.  ​పులివెందుల ప్రజలే కాదు, యావత్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలో ఆయనే చెప్పాలి. అధికారంలో లేకపోతే ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఉండరు. బెంగళూరు యలహంక ప్యాలెస్ లో మకాం వేసి, అతిథి మాదిరిగా వచ్చిపోతూ ఉంటారు. నిజంగా పులివెందులలో పట్టు నిలుపుకోవాలంటే ఆయన చేయవలసిన ప్రయత్నాల పట్ల ఆయనకే స్పష్టత లేదు. తన పార్టీ కార్యకర్తల్లో ఆయన మనోధైర్యం నింపే ప్రయత్నం చేయలేదు.  ఒకరకంగా చెప్పాలంటే ప్రయత్నం చేసే ఉద్దేశం కూడా ఆయనకు ఉన్నట్లు కనిపించదు.   ​ఎన్నికకు ముందు రోజు వచ్చి పులివెందులలో ఉండి ఎన్నికను నడిపిస్తానని చెప్పారు. ఆ తర్వాత ఎన్నిక రోజు ఒంటిగంటకు వస్తానని తన హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ నాటకీయంగా పదిగంటలకే హెలికాప్టర్ అక్కడకు చేరేలాగా ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఎగరడం మొదలుపెట్టాడు. ముందస్తు సమాచారం ఇవ్వకపోతే   గందరగోళం అవుతుందని ఆయనకు   తెలుసు. జగన్ మోహన్ రెడ్డి కోరుకునేది అటువంటి అయోమయ పరిస్థితినే. తన హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి కూడా ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది అని చెప్పాలనేది ఆయన ప్రయత్నమని పులివెందులలో చిన్న పిల్లాడు కూడా చెబుతాడు. ఆయన రాజకీయ జీవితం మొదలైన దగ్గర్నుంచీ ఇదే నాటకీయత. అయినా ఒంటిగంటకు వచ్చి ఆయన ఎన్నికలను ఏమి శాసిస్తారు? ​పులివెందులలో ఉండి కూడా ఓటు వేయని జగన్  ప్రజాస్వామ్యం గురించి ఎలా మాట్లాడతారు?  ప్రభుత్వం అరాచకం చేస్తున్నది అని పోరాటం చేయాలనుకున్నా ప్రజాస్వామ్యంలో అతి విలువైన ఓటు హక్కును ఉపయోగించుకుని అప్పుడు ధర్నాకు దిగవచ్చు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఓటు వేయడానికి వెళ్లాలన్నా కాన్వాయ్ కావాలి. అధికార దర్పం, పటాటోపం అంటే ఆయనకు అమితమైన ఆసక్తి. ఆయన ధర్నా చేయడానికి లోపల కూర్చున్న ఏజెంట్లే దిక్కయ్యారంటే పులివెందులలో జగన్ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అవగతమౌతుంది.   ఇక తెలుగుదేశం విషయానికి వస్తే పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకుంది. ఈ క్రమంలో టీడీపీ  కొంత క్రమశిక్షణ తప్పినా వైసీపీకి సానుభూతి రాకపోవడానికి కారణం జగన్ అధికారంలో ఉన్నప్పటి చర్యలే కారణాలని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతూనే ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను జగన్‌కు ఒక గుణపాఠంగా చూపించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుందని, 2024 లో తాను ఓటమి చెందినప్పుడే జగన్ మోహన్ రెడ్డికి తెలుసు.   భయంకరమైన ఓటమిని చూసిన రోజు, ముఖ్యంగా తాను నిలబెట్టాలనుకున్న రాజధాని ప్రాంతం కూడా తనను కాదన్న రోజు చంద్రబాబు పోరాడి గెలిచిన విధానాన్ని చూసి కూడా జగన్..  ఇప్పటికీ తన గెలుపు ప్రజల బాధ్యత అనుకుంటున్నారు. దార్శనికుడు అని పేరున్న చంద్రబాబు లాంటివాడికే ఎన్నికల్లో కుస్తీ పట్టక తప్పడం లేదు, తాయిలాలు ప్రకటించక తప్పడం లేదు. అలాంటిది తన మాటమీద తనకే నిలకడ లేని జగన్   ప్రజలే తనను గెలిపించాలనీ, నిలబెట్టాలనీ ఆయన ఎలా అనుకుంటున్నారన్నది ఆయనకే తెలియాలి. ​పులివెందుల ప్రజలు తనపట్ల ఉన్న అసంతృప్తిని తాను అధికారంలో ఉన్నప్పటి నుండే వ్యక్తపరుస్తున్నారు. తనకు కూడా గతంలో వచ్చినంత మెజారిటీ రానప్పుడే జగన్ విషయం అర్ధం చేసుకుని ఉంాలి.   కానీ జగన్ అలా అనుకోవడం లేదు. జగన్ విధానాల కారణంగానే  వైసీపీ కార్యకర్తలకు  ప్రభుత్వాన్ని  నిలదీసే నైతిక ధైర్యం కరువైంది . ​జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తంతు సక్రమంగా జరగడం లేదు కాబట్టి పోలింగ్ మళ్లీ జరగాలన్నారు. కానీ పులివెందులలో కూడా యాభై శాతానికి పైబడిన ఓటింగ్ నమోదయింది. జగన్ ఒకవైపు ఆర్భాటం చేస్తూ ఉండగానే జనం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ ఎప్పుడూ ఎలా జరుగుతుందో ఈ పర్యాయం కూడా అదే మాదిరిగా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చోట్లా రికార్డెడ్ గానే పోలింగ్ జరిపించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీంతో న్యాయస్థానాలు కూడా వైసీపీ రీపోలింగ్ పిటిషన్లను డిస్మిస్ చేశాయి. ఇక పులివెందుల విషయానికి వస్తే.. జగన్ ధర్నా చేస్తున్న సమయంలోనూ పులివెందుల ప్రజలు ఆయనను పట్టించుకోకుండా తమ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లి పోయారు.  జగన్ పులివెందుల కోట బద్దలు కావడం ఆయన రాజకీయ భవిష్యత్ విషయంలో ఇస్తున్న సంకేతాలేమిటన్నదానిపై పరిశీలకులు పలు రకాల విశ్లేషణలకు చేస్తున్నారు. వాటిలో ఏ విశ్లేషణా కూడా జగన్ కు ఇసుమంతైనా ఊరడింపు కలిగించేలా లేదు.  [YCP Loose Pulivendula Municipality, YS Jagan Mohan Reddy, TDP vs YCP, Andhra Pradesh Local Body Elections, YS Family Stronghold, Telugu One] 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా భావించే జిల్లాలో టీడీపీ గణనీయమైన విజయాలు నమోదు చేసింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకోగా.. మరో మున్సిపాలిటీని బీజేపీ దక్కించుకుంది.జిల్లాలోని బద్వేల్, రాజంపేట, రాయచోటి, మైదుకూరు మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఫలితాలతో ఆయా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు, యర్రగుంట్ల మున్సిపాలిటీని ఎన్డీఏ కూటమి మిత్రపక్షమైన బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ కూటమి పార్టీలే విజయం సాధించినట్లయింది.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఈ ఫలితాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు సాధించిన విజయాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఫలితాలు వెలువడిన ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవాలు నిర్వహించారు.మొత్తంగా కడప జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను టీడీపీ, ఒక మున్సిపాలిటీని బీజేపీ దక్కించుకోవడంతో పురపాలక ఎన్నికల్లో కూటమి తన ఆధిపత్యాన్ని  చాటుకుంది.     [ Kadapa Municipal Election Results 2026, TDP Victory in Kadapa, YSRCP, BJP Yerraguntla, Badvel Municipality, Rajampet Municipality, Rayachoti Municipality, Mydukur Municipality, YS Jagan, NDA Alliance, Andhra Pradesh Municipal Elections ]
ALSO ON TELUGUONE N E W S
Filmmaker Sandeep Reddy Vanga has reacted strongly to the criticism linking his films, particularly Animal and Arjun Reddy, to the disturbing chainsaw massacre at a school. Following the horrific incident, several social media users criticised the filmmaker, arguing that the extreme violence portrayed in his films could have a harmful influence on youngsters and encourage such disturbing behaviour. Responding to the backlash, Vanga took to X and accused certain members of the film industry of exploiting a tragedy to settle personal scores. He questioned their concern for the victims and their families, arguing that the focus should be on understanding the larger problem rather than finding cinema an easy scapegoat.  His strongly worded post read: "When someone commits a heinous crime, the first response should be empathy & an attempt to understand the larger problem. Not finding a convenient scapegoat in cinema. It is becoming increasingly clear that your concern is not for the victims or their families, but that you're using a horrific tragedy as a dirty excuse to settle your personal scores. This is especially directed at those failed frustrated jobless male/female actors, few directors, producers & parasites, who suddenly appoint themselves as social reformers whenever an opportunity arises to take a dig at someone else's work. A tragedy deserves empathy, not opportunism. Learn the difference." The filmmaker's response has once again brought the debate surrounding cinematic violence and its potential influence on audiences into focus. While Vanga has defended his creative choices, the discussion over the responsibility of filmmakers and the impact of violent imagery continues to generate strong reactions. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  కన్నుల్లో నీ రూపమే.. గుండెల్లో నీ ధ్యానమే, ఏటో వెళ్లిపోయింది మనసు అంటూ నిన్నే పెళ్లాడుతా' తో తెలుగు సినిమాకి సరికొత్త ప్రేమని, రూపాలని అందించిన ఫెయిర్ నాగార్జున, టబు.. సాధారణంగా సాంగ్స్ కి తెర చుట్టూ లైటింగ్ వేయడం కామన్. కానీ ఆ ఇద్దరు స్క్రీన్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే కూడా తెర చుట్టూ లైటింగ్ వేశారంటే ఆ కాంబో సృష్టించిన ప్రేమ సునామిని అర్ధం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా సెల్యులాయిడ్ ని షేక్ చేయబోతున్నారా అనే టాక్ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. టబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రీసెంట్ గా ఆమె క్యారక్టర్ కి సంబంధించిన    గ్లింప్స్ రిలీజ్ చేసారు. ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే గంభీరమైన రాజకీయ నాయకురాలి (పొలిటికల్ లీడర్) పాత్రలో కనిపిస్తున్నారు. పాతకాలం నాటి రేడియో వాయిస్, నూలు చీరకట్టులో ఆమె నడిచివచ్చే రాచరికపు నడక, ఆమె కళ్లలో కనిపించే పౌరుషం చూస్తుంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఆమె క్యారక్టర్ ఉండబోతోందో అర్థమవుతోంది. అదృష్టం కన్నా కష్టపడటాన్నే నమ్మే నాయకురాలిగా టబు కనిపిస్తుండగా, నాగార్జునకు ఆమె గట్టి పోటీ ఇచ్చే ప్రతినాయక ఛాయలున్నక్యారక్టర్ అనే విషయం ఈజీగా అర్దమవుతుంది. కొంత ముందైతే అలనాటి క్లాసిక్ మూవీ 'పండంటి కాపురం' లో జమున లా ప్రేమలో మోసపోయిన క్యారక్టర్ అయి ఉండవచ్చని అంటున్నారు. ఇది కూడా చదవండి: సీన్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే: సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటంటే!   ఏది ఏమైనా ఒకప్పడు అమృతాన్ని కురిపించే స్వచ్ఛమైన, కల్మషం లేని ప్రేమని కురిపించిన ఈ జంట ప్రత్యర్థులుగా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100 వ చిత్రం  కింగ్ 100’ (లాటరీ కింగ్) కాగా  ఆర్. ఏ. కార్తీక్ దర్శకుడు..రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్.   [Nagarjuna King 100 Tabu Glimps Released, Nagarjuna King 100, Tabu character glimpse, Mahanthi Jhansi Rani, King 100 Tabu look, Nagarjuna 100th movie, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]  
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'దాదా'. 'వీరసింహారెడ్డి' తర్వాత బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పుడు ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. 'దాదా' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను దీపావళి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 8న దీపావళి పండుగ సందర్భంగా బాలయ్య అభిమానులకు ఫస్ట్ సింగిల్‌తో సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'డాకు మహారాజ్' సినిమాల పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా థమన్ ఇచ్చే మ్యూజిక్ థియేటర్లలో మంచి హైప్ క్రియేట్ చేస్తుంటుంది. దీంతో 'దాదా' ఆల్బమ్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గోపీచంద్ మలినేని ఈసారి బాలకృష్ణను పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించబోతున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల కానుంది. ఇది కూడా చదవండి: 'ఈ నగరానికి ఏమైంది' గ్యాంగ్ మళ్ళీ వచ్చింది.. ఈసారి అంతకు మించి.!       [Dada First Single, Balakrishna Dada Movie, Dada Movie Songs, Thaman Songs, Nandamuri Balakrishna, Gopichand Malineni, Kajal Aggarwal, Manchu Manoj, Telugu Songs]  
  హిట్టు నా కేర్ ఆఫ్ అడ్రెస్స్ అంటూ సూర్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6 న 'సీన్' మూవీతో సెల్యులాయిడ్ ముందు మరోసారి కలెక్షన్స్ తుఫాన్ ఉంచే హామీతో వస్తున్నాడు. క్రైం థ్రిల్లర్ కావడంతో పాటు ప్రమోషన్స్ లో సూర్యలో దాగి ఉన్న మరో కొత్త విశ్వరూపం చూస్తుంటే హామీ నెరవేర్చుకుంటాడని అభిమానులు చాలా గట్టి నమ్మకంతోనే ఉన్నారు.     సీన్ కి సంబంధించి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రీసెంట్‌గా అధికారికంగా స్క్రీనింగ్ పూర్తి చేసింది. వీక్షించిన సెన్సార్ సభ్యులు  ‘యూఏ 16+’ (UA 16+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో  రన్‌టైమ్, ఇన్‌సైడ్ టాక్‌కు సంబంధించి వస్తున్న వివరాలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సూర్య క్యారక్టర్ అత్యంత వైవిధ్యంగా ఉండబోతోంది. ఎవరి మాట వినని, పూర్తి దూకుడు స్వభావం మరియు ఆవేశం ఉన్న ఇంబరాజ్ అనే కఠినమైన పోలీస్ ఆఫీసర్‌గా సూర్య కనిపిస్తున్నాడు.కొన్నేళ్ల కిందట మిస్టరీగా మారిన ఒక క్లిష్టమైన కేసును మళ్లీ రీఓపెన్ చేసి దర్యాప్తు చేయడం ఈ చిత్ర కథాంశం. అయితే, ఒక సిన్సియర్ పోలీస్ అయినప్పటికీ, ఎలాంటి క్రమశిక్షణ లేని గందరగోళం సృష్టించే ఒక వింత టీమ్‌ని సూర్య ఎంచుకోవడం కథలో అసలు మలుపు. ఈ టీమ్‌లో భాగమైన నెస్లెన్ (ఈశ్వరన్) మరియు ఇతర నటీనటుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని సెన్సార్ టాక్ చెబుతోంది.        సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి అందుతున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం, సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మరింత వేగంగా, ఊహించని ట్విస్టులతో సాగుతుంది. సూర్య నటన, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలిచాయని సమాచారం. జీతూ మాధవన్ దర్సకత్వం, సుశిన్ శ్యామ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని, థియేటర్లలో రోమాలు నిక్కబొడుచుకునేలా యాక్షన్ సీన్లు ఉంటాయని ఇన్సైడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నజ్రియా నజీమ్ కీ రోల్ లో కనిపిస్తుండగా  సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. సెన్సార్ టాక్ పాజిటివ్‌గా రావడంతో అభిమానులు దీపావళి సెలబ్రేషన్స్ ని ముందుగానే చేసుకుంటున్నారు.      [Suriya Scene Movie First Review, Suriya Scene movie, Scene first review, Scene censor talk, Suriya Jithu Madhavan, Scene movie runtime, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకి ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇందులో నలుగురి కుర్రాళ్ల పాత్రలకు ప్రేక్షకులంతా కనెక్ట్ అయ్యారు. మళ్లీ ‘ఈ నగరానికి ఏమైంది 2’ చిత్రంలో నలుగురు కుర్రాళ్లు రాబోతోన్నారు. ఈ సారి నలుగురి కుర్రాళ్లలో శ్రీనాథ్ మాగంటి కనిపించబోతోన్నారు. కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. ENE2 చిత్రాన్ని నవంబర్ 19న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే మళ్లీ ఆ నాలుగు పాత్రలు హైలెట్ అవబోతోన్నాయని అర్థం అవుతోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ ఎప్పటిలానే తమ టైమింగ్‌తో ఆకట్టుకున్నారనిపిస్తోంది. ఇక ఆ గ్యాంగులో కొత్తగా చేరిన శ్రీనాథ్ సైతం అదరగొట్టేశాడు. ఆల్రెడీ ఆడియెన్స్‌లో రిజిష్టర్ అయిన పాత్రలో మెప్పించడం అంటే అంత సాధారణ విషయం కాదు. అయితే ఈ ట్రైలర్‌ను చూస్తే శ్రీనాథ్ ఈ కార్తిక్ పాత్రలో ఒదిగిపోయాడనిపిస్తోంది. ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్‌లో కార్తీక్‌గా శ్రీనాథ్ కామెడీ టైమింగ్, లుక్, ప్రజెన్స్ అన్నీ ప్రత్యేకంగా నిలిచాయి. అతను తన పాత్రలోని భావాన్ని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ పాత్ర ఒక పట్టణ యువకుడు. వృత్తిపరమైన ఎదుగుదల కంటే తన అభిరుచిని ఎంచుకోవడం వల్ల ఎదురయ్యే కాన్ ఫ్లిక్ట్స్ మధ్య నలిగిపోతుంటాడు. ఈ పరిణితిని ఆ గ్యాంగ్‌లోని స్వేచ్ఛాయుతమైన స్నేహబంధంతో సమతుల్యం చేయడం అంత సులభమైన పని కాదు. ఈ సీక్వెల్‌లో కార్తిక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఇది కూడా చదవండి: 'ఈ నగరానికి ఏమైంది' గ్యాంగ్ మళ్ళీ వచ్చింది.. ఈసారి అంతకు మించి.!       [ENE Repeat Trailer, Srinath Maganti, Ee Nagaraniki Emaindi 2 Trailer, ENE Repeat Movie, Tharun Bhascker, Vishwak Sen]  
King Nagarjuna's prestigious 100th film, King100, has taken anticipation to the next level with a special glimpse introducing Tabu's character, Mahanti Jhansi Rani. Released on the occasion of her birthday, the glimpse presents Tabu in a royal, graceful and commanding avatar.  Director Ra. Karthik sets up an intriguing conflict by introducing her as an ambitious woman who believes hard work alone determines success and has no respect for those who rely on luck. With dreams of becoming a powerful political leader, Jhansi Rani is a woman driven by ambition and obsession. After 28 years, Nagarjuna and Tabu are reuniting on screen, but this time, their celebrated pairing from the cult classic Ninne Pelladutha takes an entirely different route. They are set to face each other as opposing forces. While Nagarjuna's character is associated with extraordinary luck, Tabu's Jhansi Rani despises the very idea of it. This intriguing clash between destiny and obsession sets up an interesting war between two powerful characters. Ra. Karthik presents the conflict with stylish visuals and impressive technical finesse. Devi Sri Prasad's background score adds considerable impact to the glimpse, raising expectations for the film's music. Produced by Annapurna Studios, King100 is gearing up for a grand worldwide release on December 24th. The special glimpse of Tabu has further heightened curiosity around this landmark film in Nagarjuna's career. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
చిన్న చిత్రంగా విడుదలై సెల్యులాయిడ్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'మయూఖ'.ఈ మూవీ తాజాగా అద్భుతమైన మైలురాయిని అందుకుంది. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా, కేవలం విభిన్నమైన కంటెంట్ మరియు బలమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా 25 రోజులను పూర్తి చేసుకుంది. నేటి పోటీ ప్రపంచంలో, చిన్న సినిమాలు థియేటర్లలో కనీసం ఒక వారం పాటు నిలదొక్కుకోవడమే గగనమైపోతున్న తరుణంలో, 'మయూఖ' సినిమా ఏకంగా 25 రోజుల థియేట్రికల్ రన్‌ను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఘనంగా 25 డేస్ సక్సెస్ మీట్ నిర్వహించి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె. తెరకెక్కించిన ఈ చిత్రంలో పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించగా, అమన్ మసూద్, దేవ్ డి, అభిలాష్, మురళీధర్ గౌడ్ వంటి నటీనటులు తమ అద్భుతమైన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎప్పుడూ లేనివిధంగా 'ఫ్రాంగింగ్' అనే సరికొత్త కాన్సెప్ట్ మరియు సైకో కిల్లర్ నేపధ్యం ఆధారంగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను రూపొందించడం విశేషం. దివ్య అనే యువతి హత్యతో ప్రారంభమయ్యే ఈ కథ, మయూఖ అపార్ట్‌మెంట్‌లో జరిగే అనూహ్య పరిణామాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టింది. ఇది కూడా చదవండి: కులాల్ని, మతాలని ఆమడ దూరం విసిరేసిన సినిమా: ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోవాలి!     సినిమా సక్సెస్ మీట్ వేడుకల్లో నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు మాట్లాడుతూ.. మొదట్లో చిన్న సినిమా కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని, కానీ మంచి కంటెంట్‌ను ఆదరించే ప్రేక్షకులు సినిమాను బిగ్గెస్ట్ హిట్ చేశారని భావోద్వేగంతో తెలిపారు. సీబీ మాథ్యూ అలెక్స్ అందించిన టెన్షన్ క్రియేట్ చేసే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాత శశిధర్ నల్ల ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేసిన రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి, వైవిధ్యమైన థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు 'మయూఖ' ఒక అద్భుతమైన అనుభూతిని పంచుతూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది.అక్టోబర్ 9  సెల్యులాయిడ్ రిలీజ్ డేట్.     [Mayookha Movie 25 Days Success, Mayookha movie, Payal Chengappa, Mayookha 25 days success, Shree Tej SK, Tollywood thriller, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]    
What happens when financial struggles push a group of youngsters towards a life-changing gamble? The teaser of Pocket Rockkets introduces an intriguing premise revolving around ambition, temptation and unexpected consequences. Presented by Niharika Konidela's Pink Elephant Pictures in association with Maximum City Studios, the film is written and directed by Rudra Atri. The teaser captures the struggles and aspirations of a young group before taking them into the unpredictable world of casinos. Roulette tables, gambling machines and humorous exchanges establish an entertaining yet suspenseful atmosphere. The central idea revolves around an opportunity that could change their fortunes, but the risks involved make their journey equally unpredictable. Featuring Trinadh Varma, Nirmal and Shriya Kontham, the film also has JD Chakravarthy in a pivotal role. Produced by Padmaja Konidela, Rahul Raghavendra and Rahul Nimmakuri, with Ramesh Manyam as executive producer, the technical team includes cinematographer Edurolu Raju, music composer Gyaani and editor Anwar Ali. With its youthful ensemble, interesting premise and blend of humour and suspense, Pocket Rockkets promises an entertaining ride. The film arrives in cinemas on December 11, 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.  ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ‘జైలర్ 2’ సినిమా థియేటర్లలో ఇంకా స్ట్రాంగ్‌గానే రన్ అవుతున్నప్పటికీ.. ఓటీటీ డీల్ కారణంగా త్వరగానే డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో.. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్ చేసేలా డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 12 లేదా 13 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రజినీకాంత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి థియేటర్లలో సంచలనం సృష్టించిన ‘జైలర్ 2’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. నవంబర్ 12 లేదా 13న స్ట్రీమింగ్ మొదలైతే మాత్రం డిజిటల్ ప్రేక్షకులకు పండగే.  ఇది కూడా చదవండి: బాలయ్య vs మంచు మనోజ్.. ‘దాదా’లో రక్తపాతం లేని వార్.!       [Jailer 2 OTT Release Date, Jailer 2 Movie OTT, Jailer 2 Amazon Prime Video, Jailer 2 OTT Telugu, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander, Telugu Film News]  
Superstar Rajinikanth has once again rewritten Tamil cinema's box-office history. Jailer 2, directed by Nelson Dilipkumar, has emerged as the new Industry Hit, surpassing the existing records and becoming the highest-grossing Tamil film of all time. The sequel has crossed the Rs.800 crore worldwide gross mark in just 19 days, setting an unprecedented benchmark for Kollywood. Renowned producer and trade analyst G Dhananjheyan took to social media to celebrate the achievement, stating, "Every box office record has been broken and we should all celebrate the Team #Jailer2 for giving us the New Industry Hit." He further expressed confidence that the film would cross Rs.900 crore worldwide, appreciating the team for delivering such a remarkable achievement for Tamil cinema. According to trade estimates, Jailer 2 has collected approximately Rs.812 crore worldwide by the end of its 19th day, with its India gross standing at Rs.537.75 crore and overseas collections contributing Rs.274.25 crore. The film has also surpassed Rajinikanth's own 2.0 to claim the all-time Tamil cinema box-office record. It has emerged as the second-highest-grossing Indian film of 2026, behind Dhurandhar: The Revenge. Featuring an ensemble cast including Mohanlal, Shivarajkumar, SJ Suryah, Vidya Balan, Mithun Chakraborty, Jackie Shroff, Ramya Krishnan and Yogi Babu, the film is produced by Kalanithi Maran under Sun Pictures. Anirudh Ravichander composed the music.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు మనుషుల జీవన శైలిని , బాధ్యతలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ , గర్భనిరోధక బాధ్యతలు ఎక్కువగా మహిళల మీదే ఉంటూ వచ్చాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల గర్భనిరోధక మాత్రలు లేదా పద్ధతులు అన్నీ మహిళల శారీరక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ మారుతున్న కాలానికి తగినట్టుగా వైద్య శాస్త్రం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా పురుషుల కోసం ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలను తీసుకువచ్చే దిశగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ కొత్త  ఆవిష్కరణ భవిష్యత్తులో గర్భనిరోధక పద్ధతులపై  చాలా అంచనాలు సృష్టిస్తోంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  గర్బనిరోధక మాత్రలు.. సాధారణంగా మహిళలు వాడే గర్భనిరోధక మాత్రలు వారి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో కొన్ని రకాల శారీరక మార్పులు లేదా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ పురుషుల కోసం తయారు చేస్తున్న ఈ సరికొత్త  మాత్రల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎలాంటి హార్మోన్ మార్పులకు గురిచేయవు. కేవలం పురుషుల శరీరంలో ఉండే శుక్రకణాల కదలికలను మాత్రమే నేరుగా ప్రభావితం చేసేలా ఈ మందులను రూపొందిస్తున్నారు. మానవ శరీరంలో , పురుషుల వ్యవస్థలో ప్రత్యేకంగా ఉండే ఒక ఎంజైమ్ పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. శుక్రకణాలు ముందుకు కదలడానికి , మహిళల అండం వరకు సులభంగా చేరుకోవడానికి ఈ ప్రత్యేక ఎంజైమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా కనిపెడుతున్న  ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఎంజైమ్ కొన్ని గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల శుక్రకణాలు సాధారణ పద్ధతిలో ముందుకు కదలలేవు. ఫలితంగా అవి అండం వరకు చేరే సామర్థ్యాన్ని కోల్పోతాయి కాబట్టి  గర్భధారణ జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. పురుషుల కోసం కనిపెడుతున్న ఈ కొత్త  గర్భనిరోధక మాత్రల గురించి శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా మింగాల్సిన అవసరం ఉండదు. శారీరక సంబంధానికి కేవలం ముప్పై నిమిషాల ముందు ఈ మాత్రను తీసుకుంటే సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశలో జరిపిన పరీక్షల ప్రకారం ఈ మందు ప్రభావం శరీరంలో కొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో జరిగే క్లినికల్ పరీక్షలు , పరిశోధనలు విజయవంతమైతే పురుషులు రోజూ ఎలాంటి మందులు వాడకుండా కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే వెసులుబాటు కలుగుతుంది. ఈ మాత్రలు తీసుకుంటే పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుందా అని చాలా మందిలో ఒక  సందేహం కలుగుతుంది . అయితే ఈ మాత్రల ప్రధాన ఉద్దేశం పురుషులలో శుక్రకణాలు పుట్టకుండా చేయడం కాదు. కేవలం తాత్కాలికంగా వాటి కదలికలను నిలిపివేయడం లేదా మందగించడం మాత్రమే. ఈ  మాత్ర  ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత శుక్రకణాలు నార్మల్ గా  తమ సాధారణ స్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ మందు ప్రభావం పోయిన తర్వాత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందా లేదా అనేదానిపై మరింత లోతైన పరీక్షలు అవసరం అంటున్నారు. ఈ కొత్త ఆవిష్కరణను ప్రస్తుతం జంతువులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మనుషులపై వీటిని వాడే ముందు వాటి భద్రత , సరైన మోతాదును నిర్ణయించడం  చాలా ముఖ్యం. ఏవైనా దుష్ప్రభావాలు వస్తాయా లేదా అని నిరంతరం పరిశీలించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు అన్నీ విజయవంతమైతే భవిష్యత్తులో గర్భనిరోధక బాధ్యతలను కేవలం మహిళలు మాత్రమే కాకుండా  భాగస్వాములిద్దరూ సమానంగా పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. అయితే ఈ మాత్రలు కేవలం గర్భధారణను మాత్రమే నివారిస్తాయి కానీ ఎలాంటి లైంగిక  వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వలేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు                             *రూపశ్రీ.
గుండెపోటు (Heart Attack) అనగానే చాలామందికి ఛాతీలో తీవ్రమైన నొప్పి గుర్తుకొస్తుంది. అయితే గుండెకు సంబంధించిన సమస్యలు కొన్నిసార్లు గ్యాస్ నొప్పిగా అనిపించవచ్చు. గ్యాస్ నొప్పి అనుకుని గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు. మరి గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి మధ్య తేడా ఏమిటి? గుండెపోటు వచ్చే ముందు శరీరం ఎలాంటి హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది? నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి (Stress), నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం, పని ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఒత్తిడి వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా? జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భీష్మ చౌదరి గారు గుండె ఆరోగ్యానికి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. గుండెపోటు లక్షణాలను ఎలా గుర్తించాలి? గ్యాస్ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయకూడని సంకేతాలు ఏమిటి? ఒత్తిడి, నిద్రలేమి గుండెపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? వంటి సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోవచ్చు. గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడంతో పాటు, గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించడం ఎంతో ముఖ్యం. ఛాతీలో నొప్పి, బిగుతుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమటలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఆహారం తినేటప్పుడు ఒక్కోసారి పొరపాటున నాలుక పంటికి తగిలి కొరుకుడు పడుతూ ఉంటుంది. సాధారణంగా ఇది తొందరపాటులో తినడం వల్ల జరుగుతుందని చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ ఇది కేవలం అజాగ్రత్త వల్ల మాత్రమే కాకుండా, పంటి వరుస సరిగ్గా లేకపోవడం, నోటి ఆరోగ్యంలో సమస్యలు లేదా శరీరంలో కొన్ని పోషకాల లోపం వల్ల కూడా జరుగుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం.  అసలు ఇలా పదే పదే కొరుక్కోవడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే.. నాలుక మన నోటిలో ఎంతో సున్నితమైన భాగం. ఇది ఆహారాన్ని నమలడానికి, మింగడానికి , మాట్లాడడానికి చాలా ముఖ్యం. అందువల్ల తరచూ నాలుక కొరుక్కునే సమస్య ఎదురైతే, దాని వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం. దీన్ని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పంటి అమరిక.. పంటి అమరిక సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొన్నిసార్లు పన్ను సరిగ్గా లేకపోయినా, పంటి అంచు చాలా పదునుగా ఉన్నా, లేదా పంటికి చేసిన డెంటల్ ట్రీట్మెంట్  సరిగ్గా అమరకపోయినా భోజనం చేసేటప్పుడు నాలుక ఆ భాగంలో తగిలి గాయమవుతుంది. అలాగే దంతాల వరుస సరిగ్గా లేని సందర్భాలలో ఆహారం నమిలేటప్పుడు నాలుక పళ్ల మధ్యకు వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో దంత వైద్యులను సంప్రదించి పరీక్ష చేయించుకోవడం మంచిది. విటమిన్ల లోపం.. కొన్నిసార్లు శరీరంలో విటమిన్ల లోపం వల్ల కూడా నాలుకకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి 12, ఫోలెట్ లేదా ఐరన్  లోపించినప్పుడు నాలుక మీద మంట, నొప్పి లేదా వాపు రావడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి సరైన పోషకాహారం తీసుకోవాలి. తొందరగా తినడం.. భోజనం చేసేటప్పుడు తొందరపడటం, ఎక్కువ వేగంగా నమలడం, లేదా తినే సమయంలో వేరే విషయాల గురించి మాట్లాడుతూ తినడం వల్ల కూడా నాలుక కొరుక్కునే అవకాశం ఉంది. భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా, నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా నాలుక కొరుడుపడి గాయమైతే వెంటనే శుభ్రమైన నీటితో నోటిని కడుక్కోవాలి. రక్తం వస్తుంటే మెత్తటి గుడ్డతో కొద్దిగా ఒత్తిపట్టాలి. గాయం పూర్తిగా తగ్గే వరకు కారంగా, పుల్లగా లేదా చాలా వేడిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ రక్తం ఆగకపోతే, గాయం పెద్దదిగా ఉంటే లేదా వాపు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.                             *రూపశ్రీ.