LATEST NEWS
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!  విద్యార్థులు అక్షరాలు నేర్చుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన పాఠశాలలో ఊహించని ఘోర ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపపు యంత్రంతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గోపిక లక్ష్మి అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడగా, ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయాలపాలైంది. తరగతి గదిలోనే జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తరగతి జరుగుతుండగా చొరబడి దాడి.! శనివారం ఉదయం పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 10 నుంచి 10.30 గంటల మధ్య 30 మందికి పైగా విద్యార్థులు తరగతి గదిలో ఉండగా ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపపు యంత్రంతో లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఉన్న పదో తరగతి విద్యార్థిని గోపిక లక్ష్మిని లక్ష్యంగా చేసుకుని ముఖం, మెడ, తల, వీపు భాగాల్లో దాడి చేశాడు. దాడి తీవ్రతకు బాలిక కుడిచేయి తెగిపోయింది.అదే సమయంలో దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినిపైనా నిందితుడు దాడి చేయడంతో ఆమె కూడా గాయపడింది. ఒక్కసారిగా రంపపు యంత్రం శబ్దం, విద్యార్థుల కేకలతో పాఠశాల ప్రాంగణం భయానకంగా మారింది. ప్రాణభయంతో కొందరు విద్యార్థులు తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. మరికొందరు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రికి తరలింపు.. విద్యార్థినుల పరిస్థితి విషమం.! ఘటన జరిగిన వెంటనే ఉపాధ్యాయులు స్పందించి పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులను తొలుత సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు.ప్రధాన బాధితురాలికి మెడ, ముఖం, ఉదర భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించినట్లు సమాచారం. మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. పోలీసుల అదుపులో నిందితుడు  హేమంత్.! ఈ ఘటన అనంతరం పాఠశాలకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.తాజా సమాచారం ప్రకారం, దాడికి పాల్పడిన వ్యక్తిని హేమంత్‌గా గుర్తించిన పోలీసులు ధర్మవరం రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు.అతడు బాధిత విద్యార్థినికి బంధువని ప్రాథమిక విచారణలో తేలింది. బాలిక ప్రేమను నిరాకరించడంతోనే హేమంత్ ఈ దాడికి పాల్పడ్డాడనే ప్రచారం జరుగుతోంది. అయితే నిందితుడికి బాలికతో ఉన్న సంబంధం, దాడికి దారితీసిన అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరో కీలక అంశం పాఠశాల భద్రత. పాఠశాలలో మరమ్మతులు, నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో నిందితుడిని పనివాడిగా భావించి లోపలికి అనుమతించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.మరోవైపు, ఎన్నికల విధుల కారణంగా పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉందని తరగతి ఉపాధ్యాయురాలు తెలిపారు .పాఠశాల ఆవరణలోకి ఎలక్ట్రిక్ రంపపు యంత్రంతో ఓ వ్యక్తి ప్రవేశించి తరగతి గది వరకు ఎలా చేరుకోగలిగాడనే ప్రశ్నలు తల్లిదండ్రులు, స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. స్పందించిన సీఎం చంద్రబాబు.. విద్యార్థిని ఆరోగ్యంపై ఆరా ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తరగతి గదిలోనే బాలికపై దాడి జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. బాధిత విద్యార్థినికి అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నిందితుడిని పట్టుకుని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. మంత్రి నారా లోకేశ్ భావోద్వేగ స్పందన.! విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి చెల్లిని తరగతి గదిలో నెత్తుటి మడుగులో చూసిన తర్వాత కన్నీళ్లు ఆగడం లేదని పేర్కొన్నారు. రాప్తాడులో జరిగిన ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.ఉన్మాద చర్యలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఆడపిల్లలు, మహిళల జోలికి రావాలంటేనే భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాలికల భద్రతపై ఆందోళన.! విద్యార్థినిపై పాఠశాల తరగతి గదిలోనే ఇంతటి దాడి జరగడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన విద్యాసంస్థల్లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. పాఠశాలల్లోకి వచ్చే వ్యక్తుల వివరాలు, వారి అనుమతులు, భద్రతా పర్యవేక్షణపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.       [ Raptadu school attack, CM  Chandrababu Naidu, Raptadu school attack, Anantapur news, Paritala Sunitha, Raptadu ZP High School, AP Police, Andhra Pradesh CM, Student Safety, Breaking News AP, Anantapur News ]
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు. చైనా వ్యాపార ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమే జో క్వున్‌ఫెయ్ (Zhou Qunfei). సాధారణ కార్మికురాలిగా మొదలైన ఆమె ప్రయాణం.. అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక సామ్రాజ్యానికి అధినేత్రిగా ఎదిగే వరకు సాగింది. కష్టాల నుంచి విజయ శిఖరాలకు.! జో క్వున్‌ఫెయ్ జీవితం పూలబాట కాదు. చిన్నతనంలోనే కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదువుకు దూరమై, జీవనోపాధి కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఓ పరిశ్రమలో వాచ్ గ్లాసుల తయారీ పనితో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. రోజువారీ కూలీగా పనిచేస్తూనే తయారీ రంగంలోని మెళకువలను నేర్చుకున్నారు. అయితే, సాధారణ కార్మికురాలిగానే మిగిలిపోవాలని ఆమె అనుకోలేదు. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలనే పట్టుదలతో ముందడుగు వేశారు. చిన్న ప్రయత్నం.. ప్రపంచ స్థాయి సంస్థ.! తన అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెట్టుబడిగా మార్చుకున్న జో.. 2003లో లెన్స్ టెక్నాలజీ సంస్థను స్థాపించారు. గాజు తయారీ రంగంలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ, సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సంస్థను అభివృద్ధి చేశారు. ఆమె కృషికి ఫలితంగా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే టచ్‌స్క్రీన్ గ్లాసుల తయారీలో లెన్స్ టెక్నాలజీ కీలక స్థానాన్ని సంపాదించుకుంది. యాపిల్ వంటి అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలకు సరఫరాదారుగా ఎదిగింది. దీంతో జో క్వున్‌ఫెయ్ పేరు ప్రపంచ వ్యాపార రంగంలో మార్మోగింది. స్మార్ట్‌ఫోన్ల నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు.! స్మార్ట్‌ఫోన్ గ్లాసుల తయారీతోనే ఆమె వ్యాపారాన్ని పరిమితం చేయలేదు. ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ గ్లాస్, ఇతర అత్యాధునిక తయారీ రంగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా సంస్థను విస్తరించారు. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా వ్యాపార వ్యూహాలను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేసిన ఆమె.. నేడు ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల సరసన నిలవడం విశేషం. తన వ్యాపార విజయాలతో చైనాలోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. మహిళా పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి.! జో క్వున్‌ఫెయ్ విజయగాథలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆమె పట్టుదల. పుట్టిన పరిస్థితులు, ఎదురైన కష్టాలు మన భవిష్యత్తును నిర్ణయించలేవని ఆమె జీవితం చాటిచెబుతోంది. సరైన లక్ష్యం, నిరంతర శ్రమ, కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఉంటే అసాధ్యమనుకున్న లక్ష్యాలను సైతం చేరుకోవచ్చని నిరూపిస్తోంది. నేడు ఆమె ప్రయాణం యువతకు, ముఖ్యంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలకు స్ఫూర్తినిస్తోంది. కేవలం సంపదను సంపాదించడమే కాదు.. తన ఆలోచనలను ప్రపంచ స్థాయి వ్యాపారంగా మార్చుకోవచ్చని ఆమె కథ చెబుతోంది. ఒకప్పుడు జీవనోపాధి కోసం ఫ్యాక్టరీలో పనిచేసిన మహిళ.. నేడు ప్రపంచ టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. పరిస్థితులకు తలవంచకుండా.. కష్టాలనే మెట్లుగా మార్చుకుని విజయ శిఖరాలను అధిరోహించిన జో క్వున్‌ఫెయ్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.       [ Zhou Qunfei, China Richest Woman, Lens Technology, Self Made Billionaire, Apple Supplier Success Story, China Richest Woman, Telugu One, Telugu News ]
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఆయన రాజకీయ విమర్శలు, వ్యూహాలు, ప్రెస్ మీట్లే. ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి రెడ్డి ఆ తరువాత క్రమంగా పార్టీలో ప్రాభవం, పలుకుబడి కోల్పోయారు. దరిమిలా 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత ఆయన పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం ప్రకటించి వ్యవసాయమే తన వ్యాపకమని ప్రకటించారు. అయితే కొద్ది కాలానికే రాజకీయ సన్యాసంపై యూటర్న్ తీసుకుని సొంత పార్టీ అంటూ ప్రకటనలు గుప్పించారు. పనిలో పనిగా జగన్ పై విమర్శలూ గుప్పించారు. విజయసాయి తొలి నుంచీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ట్రెండ్ మార్చారు. ఇన్ స్టా గ్రాం రీల్స్ తో సందడి చేస్తున్నారు.  ఇటీవల   సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విజయసాయి  రాజకీయ విషయాలకే పరిమితం కాకుండా, విభిన్న అంశాలపై  రీల్స్ రూపొందిస్తూ  నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. తాజాగా  తారకరత్న కుమార్తెతో కలిసి ఆయన ఇటీవల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్  అయ్యింది.    అయితే విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే రాజకీయాల్లోకి సొంత పార్టీతో రీఎంట్రీ ఇవ్వబోతున్న విజయసాయి, ఇలా రీల్స్ లో నెట్టింట, నెటిజనులలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.   [Vijay Sai Reddy Instagram reels, New Political Strategy, AP politics, videos, digital politics, Telugu One]
అర్నాబ్ పెను తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో పెను విలయం సృష్టించింది. ఈ పెను తుపాను కారణంగా భారీ స్థాయిలో ఆస్తి, పంట నష్టం సంభవించింది. తుపాను హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం కనిష్టానికి తగ్గంది కానీ ఆస్తి, పంట నష్టం అపారంగా వాటిల్లింది.  ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. రాష్ట్రంలో జరిగిన నష్టానికి తగిన సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి న చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో, కేంద్రం తక్షణమే స్పందించి సహాయ చర్యలను ముమ్మరం చేసింది. అర్నాబ్  ధాటికి తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉప్పాడ వంటి తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రతకు మత్స్యకారుల బోట్లు, వలలు, ఇతర పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న పలువు స్థానికులను, కార్మికులను రెస్క్యూ టీమ్స్   సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పాటు రహదారులపై చెట్లు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.   ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ తుఫాను కారణంగా రాష్ట్రంలో సుమారు రూ. 4 వేల600 కోట్ల మేర ఆస్తి, పంట  నష్టం వాటిల్లింది.   గతంలో వచ్చిన హుద్‌హుద్, తిత్లీ వంటి తుఫానుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందని అధికార వర్గాలు వెల్లడించాయి.   ఈ సంక్షోభం నుంచి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరించడం, మునిగిపోయిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను సరిచేయడం వంటి అత్యవసర పనులకు   ప్రాధాన్యత ఇస్తున్నారు. మత్స్యకారులు కోల్పోయిన బోట్లకు, జీవనోపాధికి తగిన నష్టపరిహారం అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తూ, వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచారు.  అయితే ఏపీని ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు రావడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  అర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు. ఇందుకు తమిళనాడు సర్కార్ క్షణం ఆలోచంచకుండా సరే అంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిపవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా ఎన్డీయే తరఫున ప్రచారం చేశారు. అంటే తమిళనాడు సీఎం విజయ్ కు, ఆయన పార్టీ టీవీకేకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీ వినతికి తక్షణమే స్పందించి ఏపీకి తమిళనాడు విద్యుత్ సిబ్బందిని, అవసరమైన సామగ్రిని పంపేందుకు అంగీకరించారు.   అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాలలో  విద్యుత్ పునరుద్ధరణ పనులకు సహాయపడటానికి తెలంగాణ కూడా విద్యుత్ సిబ్బందిని పంపింది.   ఎన్నికలలో రాజకీయ వైరం సహజమే కానీ, కానీ విపత్తు సహాయక చర్యలు దానికి రాజకీయ విభేదాలకు అతీతంగా ఉండాలన్న సందేశాన్నిఏపీ, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు తమ చేష్టల ద్వారా చాటాయి. రాష్ట్రల మధ్య సమైక్యతకు, పరస్పర సహకారానికి ఇటువంటి చర్యలు ఎంతగానో దోహదం చేస్తాయని పరిశీలకులు అంటున్నారు.   [Tamilnadu Telangana come forward Help AP, Cyclone Arnab, Damage, Andhra Pradesh, Chandrababu Naidu,Vijay, Revanth, Telugu One]
ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా స్థానిక ఎన్నికల వేళ.. జగన్ కు ఆయన మిత్రుడు బిగ్ షాక్ ఇచ్చారు. జగన్ రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  పాలనను, కరవును ఎదుర్కొనే విషయంలో చూపుతున్న నిర్లక్ష్యాన్ని, పాలనా వైఫల్యాలనూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఎండగడుతున్న వేళ..పొరుగు రాష్ట్రంలోని ఆయన మిత్రుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు చంద్రబాబునాయుడి పాలనా దక్షతను, విధానాలను ప్రశంసించారు.   సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.  ఒక సందర్భంలో సినీ నటుడు రజనీకాంత్ అమరావతిని, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించినప్పుడు ఆయనపై వైసీపీ సోషల్ మీడియాలోనూ, బహిరంగంగానూ  విమర్శల దాడికి దిగింది.    కానీ పాపం, తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ముందుచూపును, కరవు సమర్థవంతమైన నిర్వహణను ప్రస్తుతిస్తే.. మింగలేక కక్కలేక అన్నట్లు మౌనం వహించింది.      ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేంటంటే.. వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మంచి దోస్తులు. వారిరువురి మధ్యా రాజకీయ, వ్యక్తిగత మైత్రీ బంధం అందరికీ తెలిసిందు.  అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కు తెలంగాణలో రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి అక్కడి ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించడం రాజకీయ అవసరం. అందుకోసం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనతో పోలుస్తూ రేవంత్ వైఫల్యాలను ఎండగట్టడం ఆ పార్టీకి అనివార్యం.   ఆ రాజకీయ అనివార్యత కారణంగానే కేటీఆర్ చంద్రబాబును ఆకాశానికెత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. అందు కోసం ఆయన జగన్ తో మైత్రిని పట్టించుకోలేదు. లెక్క చేయలేదు.  చంద్రబాబును ప్రశంసించిన ఎవరిపైనైనా పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ముద్ర వేసి అనుచిత వ్యాఖ్యలతో, విమర్శలతో విరుచుకుపడే వైసీపీ ఇప్పుడు మౌనం వహించడంగమనార్హం.  కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తో సంబంధాలు దెబ్బతింటుందనే భయం, అలాగని మౌనం వహిస్తే.. చంద్రబాబు సమర్థతను అంగీకరించినట్లౌతుందన్న ఆందోళనతో వైసీపీ సతమతమౌతున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.  [KTR Big Shock To Jagan, Praises CBN, Telangana, Andhra Pradesh Politics, Political Necesacities, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన పెద్దమ్మ అమల్ రాజశేఖరన్ (92) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. విజయ్ తండ్రి చంద్రశేఖరన్ సోదరుడు రాజశేఖరన్ భార్యే అమల్ రాజశేఖరన్. వయసు మీద పడటంతో పాటు వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. అమల్ రాజశేఖరన్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరంతా విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో ఆమె వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్నారు. 92 ఏళ్ల వయసులో ఆమె మరణవార్త విజయ్ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అమల్ రాజశేఖరన్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, పలువురు మంత్రులు నివాళులర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు అంతిమ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.     [Tamil Nadu CM Vijay, Vijay Family News, Amal Rajasekaran, Vijay Aunt Death, Thalapathy Vijay News, Tamil Cinema News]
  బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి పెట్టింది పేరైన ప్రముఖ నిర్మాత, దర్శకుడు సంజయ్ గుప్తా  కన్నుమూశారు.  గురువారం రాత్రి   ముంబైలోని తన నివాసంలోని బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తూ జారిపడటంతో తలకి తగిలిన బలమైన గాయం కారణంగా తుదిశ్వాస విడిచినట్లు పోలీసులు, సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి.  శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న వర్సోవా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేదా కుట్ర కోణం లేదని వారు తేల్చిచెప్పారు. అయినప్పటికీ, ఎంతో ప్రతిభావంతుడైన ఒక గొప్ప స్టోరీ టెల్లర్ ఇలా అనూహ్యంగా కన్నుమూయడం చిత్ర పరిశ్రమని కలిచి వేస్తుంది. దర్శకుడిగా సంజయ్ గుప్తా ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. 1994లో సంజయ్ దత్, ఆదిత్య పంచోలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఆతిష్: ఫీల్ ది ఫైర్' చిత్రంతో దర్శకుడిగా తన కెరీర్‌ విజయవంతంగా ప్రారంభించారు. ఆ తర్వాత ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యాన్ని, క్రైమ్ థ్రిల్లర్ కథలని అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్  సృష్టించుకున్నారు. ముఖ్యంగా ఆయన కెరీర్‌లో 'కాంటే', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా', 'షూటవుట్ ఎట్ వడాలా', 'ముసాఫిర్', 'జిందా', 'కాబిల్', 'జజ్బా', 'ముంబై సాగా' వంటి ఎన్నో సంచలన బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ హిట్ 'కాబిల్' చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం. ఇది కూడా చదవండి: వివాదంలో ఆదర్శ కుటుంబం: నిర్మాత ఆవేదన! కేవలం క్లాసిక్ సినిమాలే కాకుండా, మారుతున్న కాలానికి తగినట్లుగా ఓటీటీ ప్రేక్షకుల కోసం కూడా ఆయన పనిచేశారు. ఆయన చివరిసారిగా దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా 'ది మిరాండా బ్రదర్స్' చిత్రం 2024లో జియోహాట్‌స్టార్ ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ పొందింది. స్వయంగా కథ సమకూర్చడంతో పాటు నిర్మాణ బాధ్యతలని  విజయవంతంగా నిర్వహించారు. ఇలా తన జీవితాంతం సినిమా పరిశ్రమతోనే ప్రయాణం చేసిన సంజయ్ గుప్తా అకస్మాత్తుగా మరణించడంతో సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.   ఆయన ఆప్తమిత్రుడు, ప్రముఖ ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇంట్లో తలకు గాయం కావడంతో సంజయ్ గుప్తా మరణించారనే వార్త తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఎంతో ఉత్సాహంగా ఉండే అద్భుతమైన స్టోరీ టెల్లర్‌ను ఇండస్ట్రీ కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాకేష్ రోషన్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భార్య అను లేఖీతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తిన సంజయ్ గుప్తా ఆకస్మిక మరణం బాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ తీరని లోటుగా మిగిలిపోతుంది. అయన వయసు 59 సంవత్సరాలు.        [Sanjay Gupta Passes Away, Sanjay Gupta death, Bollywood director, bathroom slip accident, Sanjay Gupta movies, Shootout at Lokhandwala,Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News ]    
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటే అదిరిపోయే మాస్ బీట్స్, వినసొంపైన మెలోడీలు, జానపద శైలిలో సాగే పాటలు గుర్తొస్తాయి. తన సంగీతంతో ఎన్నో సినిమాలను విజయాల బాట పట్టించిన ఆయన ఇప్పుడు నటుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా సంచలనం సృష్టించిన వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆయనే సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోసం డీఎస్పీ చేసిన ఓ వినూత్న ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది జానపద వాద్య కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేయించారు. ప్రస్తుతం సినిమా పాటల రికార్డింగ్‌లో కంప్యూటర్ బీట్స్, ఆధునిక సంగీత పరికరాల వినియోగం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ‘ఎల్లమ్మ’ కథా నేపథ్యానికి తగ్గట్టుగా సహజమైన జానపద సంగీతాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో డీఎస్పీ ఈ ప్రత్యేక ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దేశంలోని భిన్న ప్రాంతాలు, సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే వంద మంది సంప్రదాయ జానపద రిథమ్ కళాకారులను ఒకే చోటుకు తీసుకొచ్చి వారితో లైవ్‌లో పాటను రికార్డ్ చేశారు. వివిధ ప్రాంతాల జానపద వాయిద్యాల దరువులు ఒకే పాటలో వినిపించబోతుండటం ఈ టైటిల్ సాంగ్ ప్రత్యేకతగా నిలవనుంది. త్వరలోనే ఈ పాటను ఫస్ట్ సింగిల్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ అనే పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన పాటలను అందించిన ఆయన, ఇప్పుడు హీరోగా ఎలా మెప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి వేణు యెల్దండి కథ, దర్శకత్వం అందిస్తున్నారు. ‘బలగం’లో తెలంగాణ గ్రామీణ జీవితం, కుటుంబ బంధాలు, మనుషుల మధ్య అనుబంధాలను హృద్యంగా చూపించిన వేణు.. ఇప్పుడు ‘ఎల్లమ్మ’తో మరోసారి పల్లె నేపథ్యంలో సాగే భావోద్వేగ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు డీఎస్పీ సంగీతం కూడా తోడవడంతో పాటలపై ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి కూడా నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. మురళి జి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి వంద మంది జానపద కళాకారుల దరువులతో డీఎస్పీ రూపొందించిన ఈ టైటిల్ సాంగ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.     [Devi Sri Prasad, DSP, Yellamma Movie, Yellamma Title Song, Venu Yeldandi, Dil Raju, 100 Folk Artists, Telugu Movies 2027]
ఆదర్శ కుటుంబం ఫస్ట్ డే 16 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ ముఖంలో చిరు నవ్వులు చిందిస్తూ ఉంది. టాక్ కూడా పాజిటివ్ గా వస్తుండటంతో  రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడం పక్కా అనే నమ్మకంతో మేకర్స్, అభిమానులు ఉన్నారు. అలాంటి ఈ టైంలో ఒక వివాదస్పద విషయం ఆదర్శ కుటుంబాన్ని చుట్టుకుంది. ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై వై.జి. భరత్ దర్శకత్వంలో మంచి వెంకట్ నిర్మిస్తున్న హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'పర్ణశాల'. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఫోక్ సాంగ్ 'జిమ్ జిమ్ తార' సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. స్థానిక జానపద కళాకారిణి జి. లక్ష్మీదేవి స్వయంగా రచించి, ఎంతో మధురంగా ఆలపించిన ఈ గ్రామీణ లయ బాణీ యూట్యూబ్ మరియు ఇతర మాధ్యమాలలో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఈ పాట రిపీటెడ్ బీట్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రెండ్ చేశారు. అయితే, ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ప్రత్యేకమైన జానపద గీతాన్ని 'ఆదర్శ కుటుంబం' లో ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా సుమారు 15 సెకన్ల పాటు వినియోగించడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది కూడా చదవండి: టాప్ హీరోయిన్ మధుబాల పాలరాతి సమాధి ఏమైంది..అక్కడ ఏం జరుగుతుంది!   తమ సినిమా థియేటర్లలోకి అధికారికంగా విడుదల కాకముందే, ప్రమోషన్స్ ద్వారా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తున్న ఈ పాటని పెద్ద సినిమాలలో ఉపయోగించడం పట్ల 'పర్ణశాల' నిర్మాత మంచి వెంకట్ మాట్లాడుతు 'అనధికారికంగా తమ మేధో సంపత్తిని, పాటని  ఉపయోగించడం వల్ల తమ చిత్రానికి దక్కాల్సిన గుర్తింపు, ప్రయోజనం దెబ్బతింటుంది.  ఇండస్ట్రీలో చిన్న సినిమాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి మనుగడను ప్రశ్నార్థకం చేసేలా పెద్దవాళ్ళు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. పెద్ద సినిమాల హంగామా మధ్య చిన్న చిత్రాలు తమ ఉనికిని కాపాడుకోవడమే అత్యంత కష్టతరంగా మారిన ప్రస్తుత తరుణంలో, ఇలాంటి పరిణామాలు మరింత నిరాశకు గురిచేస్తున్నాయని ఆయన వాపోయారు. మరోవైపు, కేవలం ప్రమోషనల్ కంటెంట్ లేదా చిన్న బిట్ రూపంలో వాడినప్పటికీ, కాపీరైట్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వాడటంపై చట్టపరమైన చర్యల గురించి కూడా చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 'జిమ్ జిమ్ తార' వివాదంపై 'ఆదర్శ కుటుంబం' మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.      [Aadarsha Kutumbam Jim Jim Tara Song Controversy,Adarsha Kutumbam, Parnasala movie, Jim Jim Tara song, Venkat Manchi, Tollywood news, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్‌పైనే ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో ఇప్పటివరకు అనేక పేర్లు వినిపించాయి. తాజాగా ఈ రేసులో ఓ తెలుగమ్మాయి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెనే సాత్విక వీరవల్లి. రామ్ చరణ్ సరసన కథానాయికగా ఆమెను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. నిజానికి ఈ సినిమా కోసం మొదట సారా అర్జున్, రుక్మిణి వసంత్, అనీత్ పడ్డ, అనస్వర రాజన్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే సుకుమార్ తన కథకు, అందులోని పాత్ర స్వభావానికి సరిపోయే కొత్త ముఖం కోసం చూస్తున్నారని, ఈ క్రమంలో సాత్విక వీరవల్లిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఇప్పటికే దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఆ సినిమా ఇంకా విడుదల కాకముందే రామ్ చరణ్ వంటి స్టార్ హీరో సరసన అవకాశం దక్కించుకోవడం నిజమైతే, ఆమె కెరీర్‌కు ఇది పెద్ద మలుపు అవుతుంది. ఇంతకీ సాత్విక వీరవల్లి ఎవరు? అమెరికాలో జన్మించి పెరిగిన ఆమెకు తెలుగు కుటుంబ నేపథ్యం ఉంది. చదువులోనూ మంచి ప్రతిభ కనబరిచిన సాత్విక, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్, వాండర్‌బిల్ట్ యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. చదువుతో పాటు భారతీయ శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ పొందారు. నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె గురించి పెద్దగా పరిచయం లేకపోయినా, రామ్ చరణ్–సుకుమార్ సినిమాలో అవకాశం దక్కిందనే వార్తతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక ‘RC17’ విషయానికి వస్తే.. ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నవంబర్ 1న జరగనున్నాయి. ఈ వేడుకలో హీరోయిన్ ఎంపికపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సాత్విక పేరు ఖరారైతే, తొలి సినిమా విడుదల కాకముందే ఇంతటి భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకున్న నటిగా ఆమె వార్తల్లో నిలుస్తారు. మరి ఈ తెలుగమ్మాయి నిజంగానే రామ్ చరణ్ సరసన నటించబోతున్నారా? అన్నది అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టమవుతుంది.     [Satvika Veeravalli, Ram Charan, Sukumar, RC17, Ram Charan New Movie, Aakasamlo Oka Tara, Dulquer Salmaan, Telugu Actress]
Rockstar Devi Sri Prasad is making a unique musical attempt for his acting debut, Yellamma. In a first-of-its-kind effort in Indian cinema, the composer brought together 100 traditional folk rhythm artists from different parts of India and recorded them at the same time for the film's title track. DSP aims to capture the raw energy and distinct cultural essence of India's folk music through this massive musical collaboration. Bringing artists representing diverse folk traditions under one roof, the recording is expected to give the Yellamma theme song a distinctive sound and authentic folk flavour. The much-awaited title song, which will also mark the film's first single, is set to be released soon. Directed by Venu Yeldandi, who earned National Award recognition for Balagam, Yellamma is being produced by Dil Raju and Shirish on a lavish scale. The film's shoot is progressing at a brisk pace, with the makers aiming for a worldwide release on 5th March, in Telugu, Tamil, Hindi, Malayalam and Kannada. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఇక డిజాస్టర్స్ చాలు, ఈ సారి హిట్ పక్కా అంటూ  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నిన్న 'కల్ట్' తో తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ప్రెజెంట్ అయితే కల్ట్ కి కూడా నెగిటివ్ టాక్ రన్ అవుతూ ఉంది. మూవీ స్టార్ట్ అయిన నలభై నిమిషాల దాకా విశ్వక్ సేన్ కనపడకపోవడం ఏంటని ఫ్యాన్స్ బాగానే అలిగినట్టున్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా తమ గుండె లోతుల్లో ఉన్న బాధని వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 1.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టుగా తెలుస్తుంది ఒక రకంగా అవి షాకింగ్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. భారతదేశ వ్యాప్తంగా 1.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ నమోదు కాగా, విదేశీ మార్కెట్ నుంచి  20 లక్షల గ్రాస్ రాబట్టింది. ఈ విధంగా మొత్తం వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ సరిగ్గా 1.30 కోట్లకు చేరాయి. దేశవ్యాప్తంగా సుమారు 1,240 షోలలో ఈ సినిమా ప్రదర్శించబడగా, ప్రతి ప్రదర్శనకు సగటున 7,661 వసూలైంది. థియేటర్లలో మొత్తం 93,932 మంది ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం ఫస్ట్ డే కలెక్షన్స్!      రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అత్యధికంగా  1 కోటి గ్రాస్ రాగా, కర్ణాటక నుంచి. 6 లక్షలు, తమిళనాడు నుంచి  2 లక్షలు, కేరళ నుంచి  1 లక్ష మరియు మిగిలిన భారతీయ రాష్ట్రాల నుండి  లక్ష వసూలయ్యాయి. మరి వీకెండ్ ని ఏ మేర ఉపయోగించుకుంటుందో చూడాలి.   [Cult Movie First Day Collections, Vishwak Sen Cult box office, Cult Telugu movie opening collection, Cult movie worldwide gross day 1,Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News ]     [Cult Movie First Day Collections, Vishwak Sen Cult box office, Cult Telugu movie opening collection, Cult movie worldwide gross day 1, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News ]  
As excitement builds for the epic Ramayana release on 5th November, Yash is making headlines for the profound conversations the film is sparking in his own home. Serving as both the formidable Ravana and a producing partner through Monster Mind Creations, Yash recently shared his son's innocent concerns about his role. When his son realized his father was playing the villain, he emotionally asked if Ravana would ultimately lose and die. Yash used this poignant question to teach his child the vital distinction between an actor's performance and reality.  He emphasized that the central figure everyone should emulate is Lord Rama, and that walking a righteous path is what truly matters. Yash explained to his son that portraying the full narrative is necessary for the audience to grasp the story's true significance. This intimate father-son dialogue offers a beautiful glimpse into how the timeless epic continues to inspire meaningful family conversations, perfectly bridging the gap between grand cinema and real-world values. Ranbir Kapoor, Sai Pallavi are playing Lord Rama and Maa Sita roles with Namit Malhotra, DNEG producing the film. Nitesh Tiwari is directing it with Sunny Deol as Hanuman. Second part of the film will release for next Diwali and some reports the shoot for the second part is still not begun.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    మధుబాల.. క్షీరసాగర మధనం జరిగినప్పుడు అమృతంతో పాటు అందం కూడా పుట్టిందేమో అనేంత అందం ఆమె సొంతం. ఆ అందానికి అద్భుతమైన నటనని కూడా జోడించి 1950 వ దశకంలో భారతీయ చిత్ర పరిశ్రమని, అభిమానులని, ప్రేక్షకులని తన కనుసన్నల్లో ఉంచుకుంది. అంతటి గొప్ప నటీమణి కేవలం 36 ఏళ్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధితో చనిపోయారు. కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆమె తండ్రి అతావుల్లా ఖాన్ తీవ్రమైన మానసిక వేదనని అనుభవించారు. మధుబాల ఖననం చేసిన రోజున ఆమె భౌతిక కాయంపై, సమాధిలోనూ విపరీతంగా అత్తరు పోయించారట. ఎంతలా అంటే ఆ సువాసనలు ఆ శ్మశాన వాటికలో నెలల తరబడి నిలిచిపోయాయని ఆమె సోదరి మధుర భూషణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో పంచుకున్నారు. ముమ్మరమైన అనారోగ్య సమస్యలు, మూడు గుండెపోట్లు, బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడైనప్పటికీ అతావుల్లా ఖాన్ క్రమం తప్పకుండా కూతురి సమాధి వద్దకు వెళ్లి కుర్చీ వేసుకొని గంటల తరబడి ఏడ్చేవారట. ముస్లిం ఆచారాల ప్రకారం మధ్య భాగం తెరిచి ఉంచాల్సి ఉన్నప్పటికీ, కూతురిపై ఉన్న అపారమైన ప్రేమతో ఆయన ఆ సమాధిని పూర్తిగా పాలరాతి (మార్బుల్) కట్టడంగా తీర్చిదిద్దారు. అయితే కాలక్రమేణా అతావుల్లా ఖాన్ కన్నుమూసిన తర్వాత ఆ పాలరాతి నిర్మాణం చుట్టూ వివాదాలు చెలరేగాయి. ముంబైలోని జుహు ముస్లిం కబరిస్థాన్‌లో స్థల కొరత తీవ్రంగా ఉండటం, కొత్త ఖననాల కోసం జాగా సర్దుబాటు చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఆ పాలరాతి సమాధి నిర్మాణాన్ని ధ్వంసం చేసి సుమారు 3 అడుగుల మేర మట్టి పోసి చదువు చేశారు. తమ ఆచారాల ప్రకారం సెలబ్రిటీలైనా సాధారణ వ్యక్తయినా సమాధుల విషయంలో ప్రత్యేక మినహాయింపులు ఉండవని, స్థలాల కొరత కారణంగా పాత సమాధులపై మళ్లీ ఖననం చేయాల్సి వస్తుందని ట్రస్ట్ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: కల్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!  ఈ ఘటనతో మధుబాల జాడ కోల్పోయామని, ఆమె సమాధి పూర్తిగా కనుమరుగైందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎవరో చెప్పగా అక్కడికి వెళ్లి చూస్తే కేవలం 'మధుబాల' అనే పేరుతో చిన్న గుర్తు మాత్రమే మిగిలిందని ఆమె సోదరి తెలిపారు. అదే శ్మశాన వాటికలో కేవలం 5 నుంచి 10 మీటర్ల దూరంలోనే దిలీప్ కుమార్, పర్వీన్ బాబీ, మహమ్మద్ రఫీ, నౌషాద్ వంటి దిగ్గజాల సమాధులు కూడా ఉండటం గమనార్హం. ఒక వెండితెర మహారాణి తుది విశ్రాంతి స్థలం ఇలా కనుమరుగైపోవడం సినీ చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయంగా మిగిలిపోయింది. ఆ అందం  విశ్వం నుంచి దూరమైంది 1969 ఫిబ్రవరి 23      [Madhubala Grave Mystery Mumbai, Madhubala grave, Madhubala marble tomb, Juhu Muslim cemetery, Mumtaz Jehan Begum Dehlavi, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. NBK 112గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి సంగీతం అందించేది ఎవరనే విషయంలో గత కొద్ది రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొదట తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్‌కు పనిచేయనున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, ఆయన స్థానంలో జీవీ ప్రకాశ్ కుమార్‌ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై తాజాగా చిత్రబృందం స్పందించింది. సంగీత దర్శకుడి ఎంపికపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు ఎవరినీ అధికారికంగా ఖరారు చేయలేదని కొరటాల శివ టీమ్ వెల్లడించింది. సినిమా గురించి వచ్చే అనధికారిక వార్తలను నమ్మవద్దని, పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. దీంతో అనిరుధ్, జీవీ ప్రకాశ్ పేర్లతో సాగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది. ఇక ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు, కొరటాల శివ తన సినిమాల్లో చూపించే సామాజిక అంశాలు, పవర్‌ఫుల్ యాక్షన్‌కు మంచి కలయిక కుదురుతుందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో కొరటాల శివ ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’, ‘దేవర’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న తన 111వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే కొరటాల శివతో చేయబోయే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అందువల్ల ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెల్లడయ్యే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే. అనిరుధ్ అయినా, జీవీ ప్రకాశ్ అయినా.. బాలయ్య సినిమాకు ఎలాంటి సంగీతం అందిస్తారనే ఆసక్తి మాత్రం అభిమానుల్లో కనిపిస్తోంది.     [Nandamuri Balakrishna, Koratala Siva, NBK 112, Anirudh Ravichander, GV Prakash Kumar, SLV Cinemas, Balakrishna New Movie]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
 విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..! శరీరానికి కావాల్సిన విటమిన్లు , పోషకాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సాధారణంగా కాల్షియం, ఐరన్ లేదా విటమిన్-సి వంటి వాటి గురించే ఎక్కువగా చర్చిస్తూ ఉంటాము. కానీ మన శరీరంలో విటమిన్-డి పాత్ర ఎంత ముఖ్యమైనదో చాలా మందికి సరిగ్గా తెలియదు. ఎముకలను బలంగా ఉంచడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని అందరూ అనుకుంటారు. అయితే నేటి కాలపు వైద్యులు చెబుతున్న దాని ప్రకారం విటమిన్-డి మన శరీరంలోని ఎముకలకు మాత్రమే కాకుండా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు కూడా చాలా అవసరం. ఎండలో తిరిగితే లభించే ఈ విటమిన్ లోపిస్తే దంపతులలో పిల్లలు పుట్టే అవకాశాలపై ప్రభావం పడుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో కలుగుతోంది. ఈ విషయంలో వైద్య నిపుణులు , పరిశోధనలు ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుంటే.. మన దేశంలో ఎండకు ఎటువంటి కొదవ ఉండదు. సంవత్సరంలో ఎక్కువ రోజులు సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. అయినప్పటికీ మనలో చాలా మంది విటమిన్-డి లోపంతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఆరోగ్య నిపుణులు దీనిని ఒక రకమైన సైలెంట్ సమస్యగా చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఎలాంటి పెద్ద లక్షణాలు లేకుండానే శరీరం లోపల ఉండి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటుంది. ఇటీవలి కాలంలో జరిగిన పలు వైద్య అధ్యయనాలు ఈ విటమిన్ లోపానికి పురుషులు , మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలకు మధ్య గట్టి సంబంధం ఉందని వెల్లడించాయి. మహిళలకు.. మహిళల విషయంలో చూస్తే విటమిన్-డి లోపం వారి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. మహిళల నెలసరి క్రమంగా రావడానికి , అండాశయాల నుంచి ప్రతి నెల ఆరోగ్యకరమైన అండం విడుదల కావడానికి కొన్ని రకమైన హార్మోన్లు చాలా అవసరం. విటమిన్-డి మన శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేస్తూ ఈ ప్రక్రియను నియంత్రించడంలో సహకరిస్తుంది. శరీరంలో దీని స్థాయి తగ్గినప్పుడు హార్మోన్ల పనితీరు మందగించి అండాల నాణ్యత , సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఇది నేరుగా పూర్తిగా సంతానలేమికి కారణం కాకపోయినా గర్భం దాల్చడాన్ని కష్టతరం చేయడంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. పురుషులకు.. పురుషుల ఆరోగ్యం విషయానికి వస్తే వారిలో కూడా సంతానోత్పత్తి సామర్థ్యంపై విటమిన్-డి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పురుషులలో వీర్యకణాల సంఖ్య, వాటి నాణ్యత , అవి కదిలే వేగం సక్రమంగా ఉండటంలో ఈ విటమిన్ ముఖ్యమైన బాధ్యత నిర్వహిస్తుంది. పురుషుల శరీరంలో వీర్యకణాలు ఉత్పత్తి అయ్యే చోట ప్రత్యేకమైన విటమిన్-డి రిసెప్టర్లు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని , వీర్యకణాల తయారీని నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరంలో విటమిన్-డి తగినంత లేకపోతే వీర్యకణాల నాణ్యత తగ్గిపోయి తద్వారా సంతానోత్పత్తి సమస్యలు ఎదురయ్యే అవకాశం పెరుగుతుంది.  ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సాధారణంగా ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా మన శరీరంలో విటమిన్-డి ఎంత మోతాదులో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ లోపం ఉన్నట్లు తేలితే ఆహారపు అలవాట్లలో , జీవనశైలీలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సరిదిద్దుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం పూట కొంత సమయం ఎండలో గడపడం చాలా మంచిది. దీనితో పాటు గుడ్డు సొన, చేపలు, , విటమిన్-డితో కూడిన పౌష్టికాహారాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒకవేళ లోపం చాలా ఎక్కువగా ఉంటే డాక్టర్ల సలహా మేరకు తగిన సప్లిమెంట్లను వాడుకోవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడమే ఎప్పుడూ మంచిది.                                                                                                                                           *రూపశ్రీ.
ప్రతి రోజూ మనం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల గురించి వింటూనే ఉంటాం. అయితే వాటిలో అత్యంత భయపెట్టే , ప్రాణాంతకమైన సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. పేరు వినగానే చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇక మరణమేనా అనే అభద్రతా భావం కలుగుతుంటుంది. కానీ సరైన అవగాహన ఉండి, సకాలంలో స్పందిస్తే ప్రాణాలను కాపాడుకోవడం సాధ్యమవుతుంది. అసలు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండేందుకు, ఒకవేళ అది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. దీని గురించి వివరాలు తెలుసుకుంటే.. బ్రెయిన్ స్ట్రోక్.. ప్రతి నిమిషం ఎంతో విలువైనది.. మనుషులను తీవ్రమైన అనారోగ్యానికి లేదా మరణానికి గురిచేస్తున్న సమస్య బ్రెయిన్ స్ట్రోక్.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సమస్య ఇది. గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 65 లక్షల నుంచి 73 లక్షల మంది స్ట్రోక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మన మెదడులోని ఏదైనా భాగానికి అకస్మాత్తుగా రక్త ప్రసరణ నిలిచిపోయినా లేదా తగ్గిపోయినా ఈ ప్రమాదం వస్తుంది. దీనివల్ల మెదడులోని కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందక అవి వేగంగా చనిపోవడం ప్రారంభిస్తాయి. సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే స్ట్రోక్ విషయంలో ప్రతి ఒక్క నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు గుర్తించకపోవడమే సమస్య.. బ్రెయిన్ స్ట్రోక్ అనేది హఠాత్తుగా వచ్చినప్పటికీ, దాని వెనుక ఉండే అసలు ప్రమాదాలు మాత్రం సంవత్సరాల ముందే మన శరీరంలో పుట్టుకొస్తుంటాయి. కానీ చాలా మందికి ఈ ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన ఉండదు. స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తుంటారు. దీనివల్ల వైద్యులు చికిత్స అందించడానికి అవసరమైన ఎంతో విలువైన సమయం వృథా అయిపోతుంది. స్ట్రోక్ బారిన పడిన రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో దాదాపు 73 నుంచి 80 శాతం మంది రోగులలో స్ట్రోక్  లక్షణాలు ప్రారంభమైన సుమారు నాలుగున్నర గంటల కంటే ఎక్కువ సమయం గడిచాక ఆసుపత్రికి చేరుకుంటున్నట్లు తేలింది. లక్షణాలపై అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లక్షణాల గురించి అవగాహన ఉంటే చాలా తొందరగా ట్రీట్మెంట్ పొందే వెసులుబాటు ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చేది కాదు.. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదు. దీని వెనుక ప్రధానంగా హై బ్లడ్ ప్రెషర్ అనగా అధిక రక్తపోటు, మధుమేహం , కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. ఈ అనారోగ్యాలు చాలా కాలం పాటు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు బయటపడకుండానే శరీరం లోపల పెరుగుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్నామని భావించే యువకులు కూడా ఈ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఐసీఎంఆర్ , ఇండియాబీ పరిశోధనల ప్రకారం మన దేశంలో సుమారు 35.5 శాతం మంది వయోజనులు హై బ్లడ్ ప్రెషర్ తో, 87.3 శాతం మంది డిస్లిపిడెమియా అనగా రక్తంలో కొలెస్ట్రాల్ లేదా కొవ్వు స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో, అలాగే 11.4 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. రక్తనాళాలు దెబ్బతినడం వల్లే.. అధిక రక్తపోటు రక్త నాళాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే డయాబెటిస్ ,  కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం కూడా రక్త నాళాలను దెబ్బతీస్తాయి. ఇవన్నీ కలిసి బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును విపరీతంగా పెంచుతాయి.  స్ట్రోక్ రావడానికి చాలా సంవత్సరాల ముందే ఏర్పడే ప్రమాదకర పరిస్థితులను చాలామంది నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ సమస్య మరింత పెరుగుతుంది. అలాగే  స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా లక్షణాలను గుర్తించలేక వైద్య సహాయం అందడంలో ఆలస్యం చేయడం వల్ల మరణం సంభవిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నామని లైట్ తీసుకోకండి.. చూడటానికి పూర్తిగా ఆరోగ్యంగా కనిపిస్తున్న యువతలో కూడా హై బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యల కారణంగా స్ట్రోక్ ముప్పు పొంచుకుని ఉంటోంది. ముఖంలో ఒక వైపు వంకర పోవడం, మాట తడబడటం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా బలహీనత కలగడం లేదా శరీర సమతుల్యత దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని కేవలం సాధారణ నీరసం, అలసట లేదా వయసు ప్రభావం అనుకుని లైట్ తీసుకుంటారు. ఈ చిన్న నిర్లక్ష్యమే ప్రాణాల మీదికి తెస్తుంది. స్ట్రోక్ నుండి బయట పడే మార్గం.. స్ట్రోక్ సమస్య నుండి,  దానికి గల కారణాల  నుంచి బయటపడాలంటే రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సలహాలు పాటించడం, రోజువారీ జీవితంలో అకస్మాత్తుగా ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే.. వాటిని  ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం ఎంతో అవసరం. ముఖంలో తేడాలు రావడం, మాట్లాడటంలో ఇబ్బంది కలగడం వంటి చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాంతక పరిస్థితుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యమనే సత్యాన్ని గ్రహించి ముందస్తు జాగ్రత్తలు పాటించడమే బ్రెయిన్ స్ట్రోక్ నుండి రక్షణ పొందే ఉత్తమ మార్గం.                                                                                                                                              *రూపశ్రీ
ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం, ఛాతీలో బిగుతుగా అనిపించడం, దగ్గు, పిల్లికూతలతో కూడిన శ్వాస.. ఇవన్నీ ఆస్తమా (Asthma) లక్షణాలు కావచ్చు. ముఖ్యంగా ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఊపిరి అందకపోతే ప్రాణభయం కలుగుతుంది. అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది? ఊపిరితిత్తుల్లో ఆస్తమా సమస్య ఎలా మొదలవుతుంది? ఆస్తమా అటాక్ సమయంలో ఇన్‌హేలర్ అందుబాటులో లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వీడియోలో సీనియర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆస్తమాకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను వివరించారు. ఆస్తమా రావడానికి గల కారణాలు, శ్వాసనాళాల్లో జరిగే మార్పులు, ఆస్తమా సమస్యను ప్రేరేపించే అంశాల గురించి అవగాహన కల్పించారు. దుమ్ము, ధూళి, వాతావరణంలో మార్పులు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, మందులు వంటి అంశాలు కొందరిలో ఆస్తమా లక్షణాలను ఎందుకు పెంచుతాయో తెలుసుకోవచ్చు. ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు భయం, ఆందోళన వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరింత పెరుగుతుందా? ఆస్తమా ఉన్నవారు ఎప్పుడూ ఇన్‌హేలర్‌పైనే ఆధారపడాల్సి ఉంటుందా? బ్రాంకియల్ ఆస్తమా (Bronchial Asthma), కార్డియాక్ ఆస్తమా (Cardiac Asthma) మధ్య తేడా ఏమిటి? ఈ రెండు సమస్యలను ఎలా గుర్తించాలి? ఇన్‌హేలర్లు, అల్లోపతి స్ప్రేలు ఎలా పనిచేస్తాయి? హోమియోపతిలో ఆస్తమా చికిత్స, అత్యవసర సమయంలో ఉపయోగించే SOS మందుల గురించి డాక్టర్ ఏం చెబుతున్నారు? ఆస్తమా ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆస్తమా అటాక్‌పై భయాన్ని ఎలా అధిగమించాలి, శ్వాస సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. ఆస్తమా ఉన్నవారు వైద్యుల సూచన లేకుండా ఇన్‌హేలర్లు లేదా ఇతర prescribed మందులను ఆపకూడదు. తీవ్రమైన శ్వాస ఇబ్బంది ఎదురైతే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. హోమియోపతి మందులను నిరూపితమైన ఆస్తమా అత్యవసర చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారికి, తరచూ దగ్గు, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నవారికి ఈ వీడియో ఉపయోగకరమైన అవగాహన అందిస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)