Home

»

Latest News

వివాదంలో ఆదర్శ కుటుంబం: నిర్మాత ఆవేదన!

Oct 31, 2026 2:39PM


ఆదర్శ కుటుంబం ఫస్ట్ డే 16 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ ముఖంలో చిరు నవ్వులు చిందిస్తూ ఉంది. టాక్ కూడా పాజిటివ్ గా వస్తుండటంతో  రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడం పక్కా అనే నమ్మకంతో మేకర్స్, అభిమానులు ఉన్నారు. అలాంటి ఈ టైంలో ఒక వివాదస్పద విషయం ఆదర్శ కుటుంబాన్ని చుట్టుకుంది.

ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై వై.జి. భరత్ దర్శకత్వంలో మంచి వెంకట్ నిర్మిస్తున్న హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'పర్ణశాల'. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఫోక్ సాంగ్ 'జిమ్ జిమ్ తార' సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. స్థానిక జానపద కళాకారిణి జి. లక్ష్మీదేవి స్వయంగా రచించి, ఎంతో మధురంగా ఆలపించిన ఈ గ్రామీణ లయ బాణీ యూట్యూబ్ మరియు ఇతర మాధ్యమాలలో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఈ పాట రిపీటెడ్ బీట్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రెండ్ చేశారు. అయితే, ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ప్రత్యేకమైన జానపద గీతాన్ని 'ఆదర్శ కుటుంబం' లో ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా సుమారు 15 సెకన్ల పాటు వినియోగించడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి: టాప్ హీరోయిన్ మధుబాల పాలరాతి సమాధి ఏమైంది..అక్కడ ఏం జరుగుతుంది!

 


తమ సినిమా థియేటర్లలోకి అధికారికంగా విడుదల కాకముందే, ప్రమోషన్స్ ద్వారా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తున్న ఈ పాటని పెద్ద సినిమాలలో ఉపయోగించడం పట్ల 'పర్ణశాల' నిర్మాత మంచి వెంకట్ మాట్లాడుతు 'అనధికారికంగా తమ మేధో సంపత్తిని, పాటని  ఉపయోగించడం వల్ల తమ చిత్రానికి దక్కాల్సిన గుర్తింపు, ప్రయోజనం దెబ్బతింటుంది.  ఇండస్ట్రీలో చిన్న సినిమాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి మనుగడను ప్రశ్నార్థకం చేసేలా పెద్దవాళ్ళు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. పెద్ద సినిమాల హంగామా మధ్య చిన్న చిత్రాలు తమ ఉనికిని కాపాడుకోవడమే అత్యంత కష్టతరంగా మారిన ప్రస్తుత తరుణంలో, ఇలాంటి పరిణామాలు మరింత నిరాశకు గురిచేస్తున్నాయని ఆయన వాపోయారు. మరోవైపు, కేవలం ప్రమోషనల్ కంటెంట్ లేదా చిన్న బిట్ రూపంలో వాడినప్పటికీ, కాపీరైట్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వాడటంపై చట్టపరమైన చర్యల గురించి కూడా చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 'జిమ్ జిమ్ తార' వివాదంపై 'ఆదర్శ కుటుంబం' మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.   

 

[Aadarsha Kutumbam Jim Jim Tara Song Controversy,Adarsha Kutumbam, Parnasala movie, Jim Jim Tara song, Venkat Manchi, Tollywood news, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com