LATEST NEWS
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు  అన్నామలై రాజీనామాను పార్టీ హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను అన్నామలై తన రాజీనామా లేఖ అందజేశారు. అంతకు ముందు విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అన్నామలై తెలియజేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తును అన్నామలై వ్యతిరేకించారు. దీంతో ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి. ఆయనను పార్టీలోనే కొనసాగేలా బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బీజేపీ హై కమాండ్ అన్నామలై రాజీనామాను శుక్రవారం (జూన్ 5) ఆమోదించింది.   అన్నామలై తమిళ్‌ ఫస్ట్ అనే నినాదంతో ఓ సరికొత్త ప్రాంతీయ పార్టీని పెట్టబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబున్నాయి.  
 కర్నాటక సీఎంగా  డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి మంత్రిమండలి ఏర్పడిన స్వల్ప వ్యవధిలోనే ఆయన కేబినెట్ లో అసంతృప్తి రాజుకుంది.  ఆశించిన మంత్రిత్వ శాఖ దక్కలేదన్న అసంతృప్తితో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి  శాఖ తనకు  కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది.   మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.  బెంగళూరు అభివృద్ధి శాఖను తనకు అప్పగిస్తానని డీకే శివకుమార్ గతంలో ఇంటికి వచ్చి మరీ  హామీ ఇచ్చారనీ,  ప్రమాణ స్వీకారానికి ముందు రోజు కూడా ఆయన అదే మాట చెప్పారనీ రామలింగారెడ్డి అన్నారు.  ఇప్పుడు మాట తప్పారనీ చెప్పిన  అందుకే మంత్రి పదవిని వదులుకుంటున్నట్లు ప్రకటించారు.  తాను కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు.  
కేంద్రంలో అధికారమే లక్ష్యంగా, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే..  2023లో ఇండియా'కూటమిగా ఏర్పడ్డాయి.  అయితే ఆ లక్ష్యం దిశగా ఈ కూటమి అడుగులు మాత్రం తడబడుతున్నాయి.   2029 లోక్‌సభ ఎన్నికలకు మూడేళ్ల ముందే ఈ కూటమి మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.  పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాల్సిన ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఎవరికి వారే యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ తో ఇండియా కూటమిలోని మెజారిటీ పక్షాలు విభేదిస్తున్నాయి. ఒక్కటొక్కటిగా తిరుగు బావుటా ఎగురవేస్తున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో ఈ నె 8న జరగనున్న  17 పార్టీల ఇండియా కూటమి సమావేశాన్ని తాము పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు తాజాగా   డీఎంకే  ప్రకటించింది.  దశాబ్దాలుగా తమకు నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, తమిళనాడు రాజకీయాల్లో తమకు తీరని ద్రోహం చేసిందని డీఎంకే  పేర్కొంది.  ఈ   సంక్షోభానికి అసలు కారణం ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే. ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ, దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను కాంగ్రెస్ పార్టీ   పక్కన పెట్టేసి.. తమిళనాడులో  ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రముఖ  నటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో కాంగ్రెస్ చేతులు కలపడం డీఎంకేకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత  ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు. తాము ఇకపై ఇండియా కూటమిలో భాగం కాబోమని, లోక్‌సభలో కూడా కాంగ్రెస్ పక్కన కాకుండా తమకు విడిగా సీట్లు కేటాయించాలని డీఎంకే  ఏకంగా స్పీకర్‌ను కోరింది.   అయితే.. కాంగ్రెస్ కు కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి తిరస్కారం ఎదురు కావడం ఒక్క తమిళనా డుకే పరిమితం కాలేదు.  మరికొన్ని కీలక రాష్ట్రాల్లోనూ ఇదే రకమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల పరాజయం తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్   అంతర్గత విభేదాలు, సొంత పార్టీ నేతల తిరుగుబాట్లతో కుదేలౌతోంది. అలాగే.. ఉత్తరాదిలో కూటమికి అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా సీట్ల సర్దుబాటు ఫ్రేమ్‌వర్క్ నుంచి అధికారికంగా తప్పుకుని కూటమికి దూరం జరిగింది.  తమిళనాడులో మతతత్వ శక్తులను అడ్డుకోవడానికి, స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడానికే తాము టీవీకే తో చేతులు కలిపామని కాంగ్రెస్ సమర్థించుకుంటున్నప్పటికీ..  కూటమిలోని  ప్రాంతీయ పార్టీలు మాత్రం కాంగ్రెస్ అనుసరిస్తున్న స్వార్థ రాజకీయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి.  ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతుండటం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒకే స్క్రీన్‌పై ఇద్దరు క్రేజీ హీరోలు కనిపిస్తే ఆ మజానే వేరు. ఇప్పుడు అలాంటి ఒక సూపర్ కాంబినేషన్‌ను సెట్ చేసి ట్రేడ్ వర్గాల్లో భారీ హల్చల్ సృష్టిస్తున్నారు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). విక్టరీ వెంకటేష్ (Venkatesh), నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గురించి నెట్టింట ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా అధికారిక ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 18న సాంప్రదాయ పూజా కార్యక్రమంతో ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూన్ 22 నుండి ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ నడుస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు ‘జనవరి 13 విడుదల’ అనే వెరైటీ టైటిల్‌ను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్ సరసన టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇక విక్టరీ వెంకటేష్ జోడీగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో అనిల్ రావిపూడి మొదటగా కళ్యాణ్ రామ్ మరియు కృతి శెట్టిలపై వచ్చే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ లోపు వెంకటేష్ తన మునుపటి సినిమా బాధ్యతల నుండి ఫ్రీ అయి ఈ క్రేజీ మల్టీస్టారర్ సెట్స్‌లోకి అడుగుపెడతారు. ఈ సినిమాను ఒక పక్కా ఫ్యామిలీ అండ్ పండగ ఎంటర్‌టైనర్‌గా అనిల్ రావిపూడి మలుస్తున్నారు. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్స్ తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు కళ్యాణ్ రామ్ తోడవడంతో బిజినెస్ పరంగా కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.  నిర్మాతలు ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్ ని బట్టి చూస్తే.. ఈ సినిమా 2027 జనవరి 13న విడుదలయ్యే అవకాశముంది.   
  జననాయగన్.. ఇళయ దళపతి చేసిన చివరి మూవీ..ఎంటైర్ విజయ్ కెరీర్ లోనే కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామాకి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలని ఒక్కసారిగా షాకింగ్ కి గురి చేస్తుంది. విజయ్  'జన నాయగన్‌' కి సంబంధించి అన్ని థియేట్రికల్ హక్కుల ఒప్పందాలని రద్దు చేసుకోవాలని నిర్మాతలకి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సాధారణంగా ఒక అగ్ర హీరో సినిమా వాయిదా పడితే బిజినెస్ పరంగా వడ్డీల భారం పెరుగుతుంది. 'జన నాయగన్‌' చిత్రం బిజినెస్ వందల కోట్లలో జరిగింది. సినిమా విడుదల నిరవధికంగా ఆలస్యమవుతుండటంతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. పంపిణీదారులు ఎవరూ తన సినిమా వల్ల రూపాయి కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా థియేట్రికల్ డీల్స్ మొత్తాన్ని రద్దు చేసి, బయ్యర్ల నుంచి తీసుకున్న అడ్వాన్స్ మొత్తాలని పూర్తిగా వెనక్కి ఇచ్చేయాలని నిర్మాత వెంకట్ కె. నారాయణకి  విజయ్ సూచించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక అగ్ర నటుడి సినిమాకి  సంబంధించి ఇంత భారీ స్థాయిలో రిఫండ్స్ ఇవ్వడం, ఒప్పందాలను రద్దు చేసుకోవడం ఇదే మొదటిసారి అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. also read: Raghava lawrence: రాజకీయాల్లోకి లారెన్స్.. విజయ్ ఖాళీ చేసే తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ! దీంతో వ్యాపార లావాదేవీల కంటే  నైతిక బాధ్యతకే విజయ్ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అభిమానులు  కొనియాడుతు జన నయగాన్ రిలీజ్ కోసం ఎంతో అతృతతో వెయిట్ చేస్తున్నారు  
బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు రచ్చ రవి (Racha Ravi) గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వెండితెరపై 'బలగం' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో తన మార్కు నటనతో, డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే ఎప్పుడూ నవ్విస్తూ, వినోదాన్ని పంచే రచ్చ రవిలో ఒక గొప్ప భావుకుడు, అద్భుతమైన రచయిత ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాన్ని నిజం చేస్తూ, ఆయన తాజాగా కలం పట్టి రాసిన సరికొత్త పుస్తకం ‘నీ రుణం తీరేది ఎట్ల?’ (Nee Runam Teeredi Etla?) ఇప్పుడు పాఠకుల గుండెలను పిండేస్తోంది. సమాజంలో అమ్మ ప్రేమని, నాన్న బాధ్యతను చాలామంది చాలా రకాలుగా వర్ణిస్తూ రాస్తుంటారు. కానీ మనల్ని నడిపించే అమ్మమ్మల త్యాగాలను, వారి నిస్వార్థమైన ప్రేమానురాగాలను గుర్తించేవారు చాలా అరుదు. సరిగ్గా ఇదే పాయింట్‌ను ఎంచుకుని రచ్చ రవి ఈ ఎమోషనల్ పుస్తకానికి రూపకల్పన చేశారు. మదర్స్ డే సందర్భంగా విడుదలైన ఈ పుస్తకానికి ప్రస్తుతం తెలుగు పాఠకుల్లో, సాహిత్య వర్గాల్లో విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ పుస్తకాన్ని రచ్చ రవి కేవలం ఒక కథలా కాకుండా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే అమ్మమ్మ ప్రేమను, ఆమె పడిన కష్టాలను, మన ఎదుగుదల కోసం ఆమె చేసిన త్యాగాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు.అమ్మమ్మతో మనకున్న అనుబంధాన్ని, ఆ అనుభూతులను ఈ పుస్తకంలో ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు. అందుకే ఈ పుస్తకం చదువుతున్నంత సేపు ప్రతి పాఠకుడు తమ సొంత బాల్యంలోకి వెళ్ళిపోతూ, ఎమోషనల్ అవుతున్నారు.  ఈ పుస్తకం ధరను ₹275 గా నిర్ణయించారు. మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే ఈ పుస్తకానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అమ్మమ్మ ప్రేమకు ప్రతీకగా నిలిచే ఈ పుస్తకం యొక్క కథాంశం డిజిటల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది. రచ్చ రవి కేవలం తెరపై నవ్వించడమే కాదు, సమాజంలో మనుషుల మధ్య అంతరించిపోతున్న బంధాలను, ఆప్యాయతలను గుర్తుచేయడంలో కూడా తానేంటో నిరూపించుకున్నారు. "నీ రుణం తీరేది ఎట్ల?" అంటూ ఆయన రాసిన ఈ పుస్తకం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. కుటుంబ విలువలకు అద్దం పడుతూ, హృదయాన్ని కదిలించేలా సాగే ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన ఒక గొప్ప అనుభూతి అనడంలో ఎలాంటి సందేహం లేదు.  
     రాఘవ లారెన్స్.. ఈ పేరుకి సౌత్ సినీ ప్రేమికులకి మధ్య దశాబ్దాల అనుబంధం ఉంది. కొరియోగ్రాఫర్ గా, దర్శకుడుగా, నటుడుగా అనేక మంది అభిమానులని సంపాదించుకున్నాడు. సామిజిక సేవ పరంగా కూడా ముందు ఉంటూ ఎంతో మంది  పేద వాళ్ళని ఆదుకుంటూ వస్తున్నాడు.  త్వరలోనే లారెన్స్  క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడని, దళపతి విజయ్ పిలుపు మేరకు  టీవీకే పార్టీలో చేరబోతున్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. టీవీకే పార్టీ ఆశయాలైన అవినీతి రహిత పాలన, పారదర్శకతకి లారెన్స్ సేవా దృక్పథం సరిగ్గా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి జరగబోయే ఉపఎన్నికల్లో టీవీకే తరఫున లారెన్స్  బరిలోకి దిగే అవకాశం ఉందని టాక్ . ఈ నియోజకవర్గం నుంచి గతంలో విజయ్ పోటీ చేసి భారీ మెజారిటీ సాధించడంతో, ఇప్పుడు ఆ స్థానాన్ని తన నమ్మకస్థుడైన మిత్రుడు లారెన్స్ కి అప్పగించాలని విజయ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. Also read: యూట్యూబర్ నందు ఫ్యామిలీకి షాక్.. ఎవరు ఊహించని  నోటీసులు జారీ ఈ పరిణామాలు తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి సాంప్రదాయ పార్టీలకు పెద్ద సవాలుగా మారనున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే ద్రవిడ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికాయి. విజయ్ కి 100 శాతానికి పైగా సినీ తారలు మరియు అభిమానుల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ వంటి దిగ్గజాలు విజయ్ ని అభినందించారు. ఇప్పుడు లారెన్స్ వంటి ప్రజాదరణ ఉన్న నటుడు పార్టీలోకి వస్తే టీవీకే బలం మరింత రెట్టింపు అవుతుందని క్యాడర్ ఉత్సాహంగా ఉంది. సినిమా గ్లామర్ తో పాటు సామాజిక సేవా గుర్తింపు ఉన్న లారెన్స్ ఎంట్రీ ఇస్తే తిరుచ్చి ఉపఎన్నిక వన్ సైడ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. 
He-Man and The Masters of the Universe is finally hitting the theatres on 5th June. Fans of the popular animated series have been eagerly waiting to revisit the legendary world of Eternia. He-Man and the Masters of The Universe is extra special for fans in India as the film has been released in four local languages, including Hindi, Tamil, Telugu and Malayalam. The cherry on the icing is that some of the most familiar and celebrated voices from India have stepped in to lend their voices to the film's popular characters, He-Man and Skeletor. Let's take a look at the cast:  Jaaved Jaaferi - Skeletor Known for his incredible versatility and distinctive voice, Jaaved Jaaferi takes on the role of the dreaded Skeletor in the Hindi version. Blending menace with personality, he brings a memorable flair to the iconic villain, elevating Eternia's battle for power. Meezaan Jafri - Prince Adam / He-Man Bringing charm and infectious energy to the role, Meezaan voices Prince Adam, the young royal who transforms into the mighty He-Man in the Hindi version. His spirited performance captures both Adam's vulnerability and He-Man's unwavering courage, making the iconic hero relatable for a new generation of fans. Karthik - He-Man With a career spanning decades, Karthik brings warmth, charisma and heroism to Prince Adam's transformation into He-Man in the Tamil version. Widely loved for his effortless screen presence and unwavering popularity among audiences, his voice perfectly captures the courage and heart of Eternia's greatest defender. Adithya Menon - Skeletor With his commanding voice and strong screen persona, Adithya Menon is a natural fit for the menacing Skeletor across the Tamil, Telugu and Malayalam versions. Bringing gravitas and intensity to the iconic villain, he adds a powerful layer to the character's relentless quest for power. Arjun Sarja - Duncan Veteran star Arjun Sarja lends his voice to Duncan in the Tamil version, the trusted ally and mentor figure in Eternia. By portraying strong, dependable characters throughout his career, Arjun brings authority, wisdom and emotional depth to Duncan, taking the role a notch higher. Nikhil Siddhartha - He-Man One of Telugu cinema's most popular contemporary stars, Nikhil Siddhartha steps into the shoes of He-Man with energy and conviction in the Telugu version. His youthful appeal and strong connection with audiences make him an exciting choice to voice the legendary hero. Rao Ramesh - Duncan Known for his distinctive voice, Rao Ramesh brings warmth and wisdom to Duncan in the Telugu version. His performance adds an emotional grounding to the character while reflecting the mentor's unwavering loyalty to Eternia. Unni Mukundan - He-Man With his commanding screen presence and action-hero image, Unni Mukundan is an ideal voice for He-Man in Malayalam. He brings strength, determination and a sense of nobility that perfectly aligns with the protector of Castle Grayskull. Harish Uthaman - Duncan Known for his impactful performances, Harish Uthaman lends a reassuring and grounded presence to Duncan in the Malayalam version. His voice captures the character's experience, resilience and unwavering commitment to protecting Eternia. By bringing together some of the most popular voices from cinema, He-Man and The Masters of the Universe promises an experience that feels both epic and deeply local for audiences across regions. As the battle for Eternia unfolds on the big screen, these actors ensure that the legendary characters resonate with fans in every language.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  యూట్యూబర్ నందు అలియాస్ రామానందన్ కుటుంబం యూకే వీసాల రెన్యూవల్ ప్రక్రియ పేరుతో నమ్మించి  లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లుగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితులు కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుని  ప్రారంభించారు. ఇందులో భాగంగానే  రామానందన్ కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ కావడం సంచలనం సృష్టిస్తోంది. దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు  లుక్ అవుట్  జారీ చేశారు. ఈ స్కామ్‌లో దాదాపు 15 లక్షల వరకు భారీ మోసం జరిగినట్లు ఒక కేసు నమోదైంది. నందుస్ వరల్డ్ (Nandu's World) ఛానల్ ద్వారా ఏర్పడిన పరిచయాలు, నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఈ దందా సాగించినట్లు తెలుస్తోంది. నమ్మి డబ్బులు ఇచ్చిన అమాయక బాధితులు ఇప్పుడు తాము మోసపోయామని గ్రహించి మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు సమర్పించుకున్నాక కూడా వీసాలు రాకపోగా, అడిగితే సరైన సమాధానం చెప్పకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసుల ఎదుట వాపోయారు. కేవలం ఈ ఒక్క కేసే కాకుండా, దీని వెనుక ఇంకా పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని, బాధితుల సంఖ్య మరియు మోసం విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. also read: Pawan Kalyan: వైరల్ అవుతున్న హేమ వీడియో.. మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించే ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల హవా నడుస్తున్న తరుణంలో, ఇలాంటి సెలబ్రిటీల నమ్మకమైన మాటలను నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. వీసాలు, ఉద్యోగాలు, ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో యూట్యూబర్లు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మితే భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్‌గా వెలిగిన వ్యక్తి ఇలా వీసా రిన్యూవల్ ఫ్రాడ్‌లో ఇరుక్కోవడం నెటిజన్లని  సైతం విస్మయానికి గురిచేస్తోంది.
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత హోదాలో హైదరాబాద్ లో మాట్లాడుతు 'తెలంగాణలో కూడా తమ పార్టీని విస్తరిస్తామని, రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన రాజకీయంగా పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి 'రండి దొర.. మీరొస్తానంటే మేమొద్దంటామా? కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా? అది చెప్పి రండి అంటు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు.  ప్రకాష్ రాజ్ చేసిన ఆ  వివాదాస్పద వ్యాఖ్యలపై నటి హేమ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసారు. అందులో ఆమె మాట్లాడుతు ప్రజాస్వామ్యంలో రాజకీయ విధానాలని, ప్రభుత్వ నిర్ణయాలని  విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి దూషణలకి దిగడం ఎంతవరకు సమంజసం. పవన్ కళ్యాణ్‌ గారిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయగానే మీకు ఎక్కడి లేని ఉత్సాహం, మూడ్ వచ్చేస్తుందా!.పవన్ కళ్యాణ్‌ గారిని  రాజకీయంగా విమర్శించండి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించండి. కానీ వ్యక్తిత్వ హననానికి దిగకండి. అయన వ్యక్తిత్వం గురించి కోట్లాది మందికి తెలుసు. గతంలో ఇలాంటి విమర్శలు చేసిన వారు ఏమయ్యారో చరిత్రలో చూసుకోండి అంటూ ప్రకాష్ రాజ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. హేమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  also read: Pandu Master: యాక్సిడెంట్ కి గురైన పండు మాస్టర్‌కి అండగా ఎమ్మెల్యే సాబ్.. ఖర్చు గురించి ఆలోచించొద్దు అంటూ భరోసా ప్రముఖ నిర్మాత, పవన్ ఆప్తుడు బండ్ల గణేష్ కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్ ని తప్పుబడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.   
భారతీయ సినిమా పరిధి ప్రాంతీయ సరిహద్దులను దాటి ప్రపంచ స్థాయికి విస్తరించింది. ఒకప్పుడు కేవలం వంద కోట్ల కలెక్షన్లు సాధించడమే ఒక అద్భుతంగా భావించే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు, మొదటి రోజే ఏకంగా ₹100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం మన స్టార్ హీరోలకు ఒక సరికొత్త రికార్డు బెంచ్‌మార్క్‌గా మారింది. డే 1 వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్లలో ఈ ఘనత సాధించిన అగ్ర నటుల జాబితా ఇండస్ట్రీలో సరికొత్త సంచలనాలకు దారితీస్తోంది. ఈ రేసులో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో నిలిచారు. ప్రభాస్ నటించిన సినిమాల్లో ఏకంగా 6 చిత్రాలు మొదటి రోజే ₹100 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. బాహుబలి 2 చిత్రంతో మొదలైన ఈ రికార్డుల పరంపర సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 AD, ది రాజా సాబ్ చిత్రాల వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ భారీ రికార్డుతో ప్రభాస్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే తిరుగులేని బాక్సాఫీస్ కింగ్‌గా అవతరించారు. ప్రభాస్ తర్వాతి స్థానంలో దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, షారూఖ్ ఖాన్, రామ్ చరణ్ తలో 2 సినిమాలతో నిలిచారు. దళపతి విజయ్ నటించిన లియో, గోట్ చిత్రాలు మొదటి రోజే ₹100 కోట్ల క్లబ్‌లో చేరాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో ఈ ఘనత సాధించారు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో తన సత్తా చాటారు. ఇక 'ఆర్ఆర్ఆర్'తో ఒకసారి ఈ ఘటన సాధించిన రామ్ చరణ్, ఇప్పుడు 'పెద్ది'(Peddi)తో మరోసారి సంచలనం సృష్టించారు. ఈ సినిమా మొదటిరోజు రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం. ఇక కేవలం ఒక సినిమాతో ఈ మైలురాయిని అందుకున్న స్టార్ హీరోల జాబితా కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సంచలన చిత్రం పుష్ప 2 ది రూల్ తో మొదటి రోజే ₹100 కోట్ల కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టారు. బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్ ధురంధర్ ది రివెంజ్ చిత్రంతో, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంతో ఈ క్లబ్‌లో స్థానం సంపాదించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రంతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ (OG) చిత్రంతో మరియు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ యానిమల్ చిత్రంతో మొదటి రోజే ₹100 కోట్ల మార్క్‌ను దాటి బాక్సాఫీస్ దగ్గర తమ మాస్ పవర్‌ను నిరూపించుకున్నారు. ఈ గణాంకాలు భారతీయ సినిమా మార్కెట్ ఎంత భారీగా విస్తరించిందో స్పష్టం చేస్తున్నాయి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు. తరువాత  దాని గురించి పశ్చాత్తాపపడతారు. చాలా వరకు ప్రతి వ్యక్తి తన నిర్ణయం సరైనదని నమ్ముతాడు, కానీ కాలక్రమేణా, వారి భ్రమలు తొలగిపోతాయి. ఒక వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయం వారి మనస్సు , మెదడు డైరెక్షన్ ద్వారా నడుస్తుంది.  ఈ విషయాన్ని స్వయానా ఆచార్య  చాణక్యుడు స్పష్టం చేశాడు. మనిషి మనస్సు , మెదడు పూర్తీ సామరస్యంతో లేనంత వరకు, వారి నిర్ణయాలు తప్పు అని రుజువవుతాయని చాణక్యుడు నమ్ముతాడు. మనస్సు , మెదడు సంపూర్ణ సామరస్యంతో లేకపోతే, వారి సొంత మనస్సే వారికి శత్రువుగా మారుతుంది.ఒక వ్యక్తికి తన సొంత మనస్సే శత్రువుగా మారడానికి గల ఐదు కారణాలను ఆచార్యుడు స్పష్టంగా వివరించాడు.  అవేంటో తెలుసుకుంటే.. బాలెన్స్ లేకపోవడం.. నిర్ణయం తీసుకునే సామర్థ్యం  వ్యక్తి యొక్క మనఃస్థితి , మెదడుపై ఆధారపడి ఉంటుందని ఆచార్య చాణక్యుడు అంటాడు. అందువల్ల ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటే, ఆ నిర్ణయం మెరుగ్గా ఉంటుంది. అయితే వ్యక్తి భావోద్వేగాల ప్రభావంతో నిర్ణయం తీసుకున్నప్పుడు, ఫలితం ప్రతికూలంగా ఉంటుంది.  దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. దురశాతో ఆధిపత్యం చెలాయించడం.. దురాశ  మనిషిని  ఆవరించినప్పుడు, వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరని చాణక్యుడు చెబుతాడు. లాభాపేక్ష అనే ఆలోచనే మనిషిలో దురాశ పుడుతుంది.   ప్రయోజనాల కారణంగా జరిగే నష్టాల గురించి ఆలోచించరు. ఈ అలవాటు నేటికాలంలో చాలామందిలో చాలా ఎక్కువగా ఉంది.  వ్యాపారవేత్తలు కూడా అధిక లాభాల ఆశతో పెట్టుబడుల నుండి వచ్చే  నష్టాలను తరచుగా పట్టించుకోరు. చాణక్యుని దృష్టిలో, దురాశ , తొందరపాటు మనసును శత్రువుగా మారుస్తాయి. కోపం.. కోపం ముఖ్యమైన సంబంధాలను కూడా క్షణాల్లో విచ్ఛిన్నం చేస్తుంది.  చాణక్యుని ప్రకారం ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచనను, ఇతరులు చెప్పే విషయాన్ని వినాలనే ఆసక్తిని కూడా అణిచివేస్తుంది.  కోపంలో ఉన్నప్పుడు మనిషి తన కోపాన్ని బయటకు వ్యక్తం చేస్తాడు అంతే కానీ.. ఆలోచించి  జరిగిన విషయం గురించి ఆలోచించి సమస్యను పెద్దది కాకుండా ఆపే విచక్షణ ఉండదు. అందుకే తన కోపమే తన శత్రువు అని అన్నారు.ఈ కోపం మనిషి మనసును కూడా శత్రువుగా మారుస్తుంది. అతిగా ఎమోషనల్ బాండింగ్.. ఆచార్య చాణక్యుని ప్రకారం మితిమీరిన ఎమోషనల్ బాండింగ్ కూడా ఒక వ్యక్తికి హాని చేస్తుంది. ఒక వ్యక్తి ఎవరితోనైనా భావోద్వేగపరంగా చాలా గాఢంగా ముడిపడి ఉన్నప్పుడు, వారు నిజానిజాలు సరిచూసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పరిస్థితిలో భ్రమల ఏది, నిజం ఏది తెలుసుకోలేరు.  తమ భ్రమ పడే విషయమే నిజం అని కూడా అనుకుంటారు. ఈ కారణంగానే అపార్థాలు కూడా చాలా సులువుగా వచ్చేస్తాయి. సందేహంతో తీసుకునే నిర్ణయాలు.. చాణక్యుడు జ్ఞానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చాడు. అసంపూర్ణ జ్ఞానం భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది.    పూర్తి నిజం తెలుసుకోకుండా తుది నిర్ణయానికి రావడం చాలా ప్రమాదమని,  దీనివల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుందని చెబుతాడు. సందేహంతో తీసుకునే   నిర్ణయాలు కంటే వాస్తవాలను అర్థం చేసుకుని తీసుకునే నిర్ణయాలు మనిషిని నష్టానికి దూరంగా ఉంచుతాయి.                                 *రూపశ్రీ.
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా,  భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారని కూడా పేర్కొంటారు.  అయితే కేవలం జాతకాల ఆధారంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం సరిపోదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. బలమైన , సంతోషకరమైన సంబంధం కావాలంటే..  ఆలోచనలు, విలువలు, ప్రవర్తన , భవిష్యత్తు గురించి సరైన ప్రణాళిక, అవగాహన అన్నీ కూడా పొంతన కుదరడం జాతకాల కంటే ముఖ్యమైన విషయం. ఇందకోసం వివాహానికి మందు జాతకాల పొంతన కుదిరిందా లేదా అనే విషయం కంటే ఇటీవల వివాహానికి ముందు  కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా భాగస్వామిని ఎంచుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల జీవితం ఎంతో బాగుటుందని అంటున్నారు. ఇంతకీ వైవాహిక బంధంలోకి వెళ్ళేముందు కాబోయే భాగస్వామిని అడగవలసిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. సంతోషకరమైన జీవితం అంటే.. పెళ్లికి ముందు తెలుసుకోవలసిన  ముఖ్యమైన విషయం ఏమిటంటే..  సంతోషకరమైన జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం. కొందరు వృత్తికి, విజయానికి ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు కుటుంబానికి, స్థిరమైన జీవితానికి విలువ ఇస్తారు. ఇద్దరికీ జీవితంపై వేర్వేరు అంచనాలు ఉంటే, అది భవిష్యత్తులో విభేదాలకు దారితీయవచ్చు. అందువల్ల, ఇద్దరి కలలు , ప్రాధాన్యతల గురించి ఓపెన్ గా  చర్చించుకోవడం ముఖ్యం. ప్రేమ అంటే అర్థం.. ఒక సంబంధానికి పునాది ఇద్దరు భాగస్వాముల ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది. బాల్యం, కుటుంబ నేపథ్యం , గత అనుభవాలు తరచుగా మనం ప్రేమను చూసే విధానాన్ని  తీర్చిదిద్దుతాయి. భార్యాభర్తల మధ్య సంబంధంలో గౌరవం, నమ్మకం , ఒకరితో ఒకరు మాట్లాడే తీరు.. వీటన్నింటి గురించి భాగస్వామికి  ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా విషయాలలో ముడి పడి ఉంటుంది. అంచనాలు.. కుటుంబానికి సంబంధించిన అంచనాల గురించి కూడా స్పష్టంగా చర్చించుకోవాలి. వివాహం తర్వాత కుటుంబ పాత్ర, తల్లిదండ్రులతో కలిసి జీవించాలా లేక విడిగా జీవించాలా, పిల్లల గురించి  అభిప్రాయాలు, నిర్ణయాలు ఏమిటి, ముఖ్యమైన విషయాలు, నిర్ణయాలలో  కుటుంబ సభ్యుల ప్రమేయం ఎంతవరకు ఉండాలి వంటి విషయాలపై ముందుగానే స్పష్టత ఉండటం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో తలెత్తే అనేక గొడవలను ఈ స్పష్టత నివారిస్తుంది. బంధం నిర్వహణ.. ప్రతి సంబంధంలోనూ అభిప్రాయ భేదాలు రావడం సహజం, కానీ వాటిని ఎలా పరిష్కరిస్తారనేదే అత్యంత ముఖ్యం. పెళ్లికి ముందు కోపం, ఒత్తిడి లేదా అభిప్రాయ భేదాల వంటివి ఎదురైనప్పుడు   భాగస్వామి ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోవడం ముఖ్యం. వారు మాట్లాడటం  ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారా లేదా వాటిని తప్పించుకుంటారా అనేది సంబంధం ఎంత బలంగా ఉంటుంది అనే విషయంలో  కీలక పాత్ర పోషిస్తుంది. అలవాట్లు, ప్రవర్తన.. పైన చెప్పుకున్న విషయాలే కాకుండా  రోజువారీ అలవాట్లు , ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక నిర్వహణ, బాధ్యతలను నిర్వర్తించడం, ఒత్తిడి గా ఉన్నప్పుడు దాన్ని నియంత్రించుకోవడం,  పరస్పర ప్రవర్తన వంటి చిన్న విషయాలు  సంబంధాన్ని ఎన్నేళ్లు గడిచినా ఎంతో సంతోషంగా ఉంచగలవు.  ఈ అలవాట్లు వివాహం తర్వాత అకస్మాత్తుగా మారవు, కానీ ఎక్కువగా బాగా స్పష్టంగా కనిపిస్తాయి. పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందు భాగస్వాములు ఇద్దరూ మాట్లాడుకోవడం వల్ల పెళ్లి తర్వాత అబిప్రాయ బేధాలు లేదా మనస్పర్థలు రాకుండా ఉండేందుకు సహాయపడతాయి.   జీవితంలో ఒక్కసారి ముడిపడే బంధాన్ని జీవితాంతం పదిలంగా ఉంచుకోవచ్చు.                                         *రూపశ్రీ.
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. అబ్బాయిలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం పెద్దగా సమస్య కాదు, కానీ పెద్ద వయసులో అమ్మాయిలకు మంచి సంబందాలు రావడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం.  అమ్మాయిలకు వివాహానికి సరైన వయస్సు ఏమిటి అనే  విషయంపై సరైన స్పష్టత ఎక్కడా లేదు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మొదట తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ 30ఏళ్ల  తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. దీనిగురించి రెలేషన్షపి నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుంటే.. కెరీర్ అడ్డంకి.. గతంలో ఆడపిల్లల చదువు, కెరీర్ కు ఇంత ప్రాముఖ్యత లేదు.  టెంత్,  ఇంటర్,  డిగ్ర లాంటివి పూర్తవ్వగానే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. పెళ్లి తర్వాత మహిళలు కూడా ఇంటిని,  భర్త,  పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ ఉండే వారు. కానీ నేటికాలంలో అలా లేదు.. తల్లిదండ్రులు ఆడపిల్లలను కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఆడపిల్లలు తమ కెరీర్ ను అద్బుతంగా మలుచుకోవడంలో సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల ఆడపిల్లలు కూడా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుని సెటిల్ కావడానికి సమయం పడుతోంది.  అది కాస్తా 30 ఏళ్ల వరకు వివాహానికి దూరం ఉండేలా చేస్తోంది. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతోంది.  ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టతరంగా మారింది. అబ్బాయిలకు కాస్త బెటర్.. అమ్మాయిల మాదిరిగానే పెద్ద వయసు అబ్బాయిలకు  కూడా వివాహం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అబ్బాయి బాగా సంపాదిస్తే చిన్న వయసు అమ్మాయిల నుండి సంబంధాలు వస్తుంటాయి.  తల్లిదండ్రులు  తమ కూతురికి  ఆర్థిక భద్రత కల్పించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అయితే అమ్మాయిల విషయంలో అలా కాదు. ఒక అమ్మాయి ఎంత సంపాదించినా, ఆమె పెద్దది అయితే మంచి జత దొరకడం కష్టంగా ఉంటుంది. అబ్బాయిలు ఆశించడమే పెద్ద సమస్య.. కాలం ఎంత మారినా అది మగవారి ఆలోచనలు మార్చలేకపోతోంది.  మగవాళ్లకు తమ భార్యల పట్ల ఉన్న అవగాహన పెద్దగా మారలేదు. చాలా మంది మగవాళ్లు ఎక్కువగా ఆశిస్తున్నారనే మాట చాలా నిజం.  భార్య అటు ఉద్యోగం చేసి సంపాదించాలి,  అలాగే ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్నీ ఆమె చేసి భర్తకు సేవలు చేస్తూ పిల్లలను కూడా చూసుకోవాలని కోరుకుంటారు.  చాలా సార్లు తమ తల్లితో భార్యను పోలుస్తారు,  వస్త్రధారణ నుండి అమ్మాయి పరిచయాల వరకు, స్నేహితులు, వ్యక్తిగత స్పేస్ వంటి విషయాలలో కూడా ఆబ్బాయిలు అమ్మాయిలను చికాకు పెడతారు. ఇలాంటివి అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఇవి కాస్తా వైవాహిక జీవితంలో అడ్డంకులకు కారణం అవుతున్నాయి. అమ్మాయిల వయసు పెరిగితే ఇదే సమస్య.. 30ఏళ్ళ తర్వాత అమ్మాయిలకు వివాహం విషయంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య అమ్మాయి సంతానోత్పత్తి ఆమె వయస్సుతో ముడి పడి  ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయి సంతానోత్పత్తి తగ్గుతుంది. అమ్మాయి పెద్దదైతే ఆ జంట పిల్లల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకుండా చేస్తుంది. నేటి కాలంలో అమ్మాయిలు ఆర్థిక విషయం నుండి చాలా వరకు స్వతంత్రత కలిగి ఉన్నారు.  తన సొంత ఆలోచన ఉంటుంది. ఆమె తన భర్త లేదా కుటుంబం చెప్పే ప్రతిదానితో ఏకీభవించలేదు. ఆమె తన సొంత ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే భార్యభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తోంది. సరైన వయసు.. మేజర్ అయితే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి అర్హత పొందుతారు. కానీ వివాహానికి  సరైన వయసు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది.  అమ్మాయిలు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం వివాహానికి ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ కెరీర్ ను తొందరగా సెటిల్ చేసుకుని సరైన జోడి వెతుక్కుని హాయిగా సెటిల్ అవుతున్నారు.  అంటే.. వివాహం విషయంలో అబ్బాయిల  ఆలోచన కూడా ముఖ్యం.  వారు కూడా మారితేనే భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుంటుంది.                           *రూపశ్రీ.  
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అసలు అంత కోపం ఎందుకు వస్తుంది అనే విషయం కూడా అర్థం కానట్టు ఉంటుంది. కోపం అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు.. అది  మనస్సు , శరీరానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు, వారి శరీరం పూర్తిగా అల్లకల్లోలానికి గురవుతుంది. అతిగా కోపం తెచ్చుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయ నిజం ఏమిటో తెలుసుకుంటే.. మెదడులోని ఈ భాగమే కారణం... మన మెదడులో అమిగ్డాలా అనే ఒక చిన్న ప్రాంతం ఉంటుంది. దీనిని  శరీరపు అలారం అని కూడా పిలవవచ్చు. మనకు ఏదైనా విషయం గురించి బాధగా అనిపించినప్పుడల్లా, ఈ అలారం వెంటనే మోగుతుంది. కోపానికి లోనయ్యే వ్యక్తులలో ఈ ప్రాంతం చాలా చురుకుగా ఉంటుంది. ఇది మెదడులోని ఆలోచనా భాగాన్ని అడ్డుకుంటుంది, దీనివల్ల తొందరగా కోపం వచ్చే వారు  ఆలోచించకుండానే మాటలు మాట్లాడతారు లేదా పనులు చేస్తారు. కోపం రాగానే జరిగేది ఇదే.. అమిగ్డాలా చురుకుగా మారినప్పుడు అది అడ్రినలిన్ , కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్లను శరీరంలోకి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ల విడుదల శరీరంలో ఈ క్రింది ప్రధాన మార్పులకు కారణమవుతుంది. గుండె కొట్టుకోవడం చాలా వేగంగా అవుతుంది. రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. కండరాలు పూర్తిగా వ్యాకోచిస్తాయి. శ్వాస చాలా వేగంగా , నిస్సారంగా మారుతుంది. ముఖానికి, చేతులకు రక్త ప్రసరణ పెరగడం వల్ల ముఖం ఎర్రగా మారుతుంది. మితిమీరిన కోపం ఏదైనా వ్యాధికి సంకేతమా? పదే పదే  మితిమీరిన కోపం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నిరంతర కోపం శరీరాన్ని ఎప్పుడూ  ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది గుండెపోటు, పక్షవాతం , నిద్రలేమి వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మానసిక ఒత్తిడి, కుంగుబాటు లేదా నిద్రలేమి కూడా కోపం పెరగడానికి దోహదం చేస్తాయి. మితిమీరిన కోపాన్ని ఎలా శాంతపరచాలి? కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అసాధ్యం కాదు. కోపం వచ్చినప్పుడల్లా వెంటనే దీర్ఘంగా, లోతుగా శ్వాస తీసుకోవాలి. 1 నుండి 10 వరకు అంకెలను వెనక్కి లెక్కించండి. కాసేపు ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లడం, చల్లటి నీళ్లు తాగడం కూడా కోపాన్ని  తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ యోగా, ధ్యానం చేయడం మనసును ప్రశాంతపరచడానికి, అమిగ్డాలాను నియంత్రించడానికి సహాయపడుతుంది.                                   *రూపశ్రీ.
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు.  కొందరు బెడ్ టీని ఇష్టపడితే, మరికొందరు రోజంతా చాలా కప్పులు తాగుతారు.  వయసుకు తగ్గట్టు ఎంత టీ తాగాలి? దీని గురించి చాలామందికి తెలియదు.  అధికంగా టీ తాగడం వల్ల క్రమంగా శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. టీ ఆరోగ్య ప్రయోజనాలు.. టీలోని కెఫీన్ , ఇతర సమ్మేళనాలు శరీరానికి శక్తిని అందిస్తాయి, అయితే టీని  అధికంగా తీసుకున్నప్పుడు హానికరంగా కూడా మారుతుందని వైద్యులు అంటున్నారు. కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల, ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయంగా మారింది. చాలామంది పాలతో కాఫీలు, టీలు మానేసి గ్రీన్ టీ ఇష్టపడుతున్నారు.  ఈ సమ్మేళనాలకు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ , కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంతో సంబంధం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. పరిశోధనల ప్రకారం  గ్రీన్ టీ జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగే వ్యక్తులు  బరువు   విషయంలో పర్పెక్ట్ గా,  మొత్తం ఆరోగ్యం విషయంలో ఎంతో నిలకడగా   ఉంటారని పరిశోధనలో తేలింది.  రోజులో ఎంత టీ తాగాలి? ఎంత పరిమాణంలో టీ తాగడం సరైనది అనే విషయం చాలామందిని గందరగోళానికి గురిచేస్తుంది.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది వయస్సు, ఆరోగ్య పరిస్థితి , జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా టీనేజర్లు , యువకులు రోజుకు 1 నుండి 2 కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ ఉన్న టీ తాగకూడదు. ఆరోగ్యంగా ఉన్న పెద్దలు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ పరిమాణం మంచిదని  చెబుతున్నారు.  అంతకంటే ఎక్కువ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. టీ ఎక్కువగా తాగితే.. ఎక్కువగా టీ తాగడం హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల చంచలత్వం, నిద్రలేమి, తలనొప్పి, కడుపు నొప్పి , ఆందోళన వంటి సమస్యలు పెరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారు తీసుకునే కెఫిన్ పరిమాణంపై శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం, గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ లవర్స్ ఇవి గుర్తుంచుకోవాలి.. టీ తాగే సమయం కూడా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. వైద్యుల ప్రకారం, టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ దాని పరిమాణం, సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.