LATEST NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట  పర్యటన తీవ్ర రాజకీయ దుమారానికి,  ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పరిసరాల్లో ప్రతిష్టాత్మకమైన శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు  శనివారం (మే23) యాదగిరిగుట్ట పర్యటన చేపట్టారు. అయితే..  అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ అధికారిక పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులకు,  కీలక అధికారులకు  సమాచారం ఇవ్వలేదనీ, తగిన ఆహ్వానం అందలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈ   ప్రొటోకాల్ లోపం తలెత్తిందని ప్రతిపక్షాలు, కొందరు స్థానిక నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.   అదలా ఉండగా, సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా,  అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు   కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఏకంగా 15 నిమిషాల పాటు హెలికాప్టర్ లోనే వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీ పర్యటనలో స్థానిక యంత్రాంగం ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించడంపై సచివాలయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఎం పర్యటనలో జిల్లా కలెక్టరేట్, పోలీస్ యంత్రాంగం వైఫల్యంపై ఉన్నతాధికారులు నివేదిక కోరినట్లు సమాచారం. 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ నిజానికి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ అన్నారు.  కడప పర్యటనలో భాగంగా లోకేష్, రాయలసీమ అభివృద్ధి, గత ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడారు.  జగన్   మాటలు తప్పడం, మడమ తిప్పడంలోనే దిట్ట అన్న లోకేష్..   ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని   గణాంకాలతో సహా ఎండగట్టారు. జగన్ హయాంలో సీమ ప్రాంత ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.   రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో   టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టంగా వివరించారు. గతంలో అంటే 2014 - 2019 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 11,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తుచేశారు.  అయితే.. సీమ బిడ్డనని గొప్పలు చెప్పుకునే జగన్ తాను సీఎంగా ఉన్న  ఐదేళ్ల ముఖ్యమంత్రి కాలంలో కేవలం రూ. 2,700 కోట్లు మాత్రమే కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు కేటాయించినప్పుడు, దానివల్ల రాయలసీమకు జరిగే నష్టాన్ని ఆపడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిన డ్రిప్ ఇరిగేషన్  అంటే బిందు సేద్యం ) వ్యవస్థను జగన్  రద్దు చేసి రైతుల పొట్ట కొట్టారని విమర్శించారు.   టీడీపీ  హయాంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో, అలాగే మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందించి అండగా నిలిచిందని గుర్తు చేశారు.  తన  వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన నటన చూస్తే  ఆయనకు భాస్కర్ అవార్డు ఖాయంగా వస్తుందని ఎద్దేవా చేశారు.  సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైతే, ఆ ఘోరమైన నిజాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుపైకి నెట్టేందుకు జగన్ ఎంతటి డ్రామాలు ఆడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.  మిషన్ రాయలసీమ  పేరుతో ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్,  డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నామన్న లోకేష్ . పుట్టపర్తిలో  ఐదో తరం యుద్ధ విమానాల (ఎఎంసీఏ) తయారీ కేంద్రానికి రూ. 15,803 కోట్లతో శంకుస్థాపన చేయడం రాయలసీమ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు. జగన్ పాలన కేవలం ఫ్యాక్షనిజం, కమిషన్ల చుట్టూ తిరిగితే, తమ కూటమి ప్రభుత్వం ఫైటర్ జెట్ల తయారీతో సీమ యువతకు ఉపాధి కల్పిస్తోందని గర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ పునరుద్ఘాటించారు.
 రాజకీయ విశ్లేషకుడిగా, విద్యావేత్తగా   గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఎప్పుడూ తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణలు  చేసే ఆయన, తాజాగా ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో  కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,  మంత్రి నాదెండ్ల మనోహర్‌లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. . అమిత్ షా పేరుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని  జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయనపై కేసు పెట్టారు.  కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు, ఆ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రసారం చేసిన  టీవీ ఛానెల్‌పై కూడా పోలీసులు కేసు నమోదు అయ్యింది.   ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల జరిగిన ఒక టెలివిజన్ డిబేట్‌లో   గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. గతంలో ఒకానొక సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్   ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారనీ,   ఆ సందర్భంగా వారు మాజీ సీఎం జగన్ ను అరెస్టు చేయాలని   అమిత్ షాను కోరారనీ చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్..   అమిత్ షా రాజకీయాల్లో  ఇన్‌స్టంట్ ఫ్రెండ్,  లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనే వ్యత్యాసాలు ఉంటాయనీ,  చంద్రబాబు నాయుడు ఇన్‌స్టంట్ ఫ్రెండ్,   జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని పవన్, నాదెండ్ల మనోహర్ లకు తేల్చి చెప్పారనీ అన్నారు.   అంతే కాకుండా జగన్ విషయంలో వైఖరి మార్చుకోవాలని కూడా అమిత్ షా పవన్, నాదెండ్లకు సలహా ఇచ్చారని నాగేశ్వర్ ఆ డిబేట్ లో చెప్పారు.   ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.  అమిత్ షా అసలు అనని మాటలను అన్నట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కల్పించి చెబుతున్నారని..  కావాలనే కూటమి నేతల మధ్య, ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు  తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమిత్ షా, పవన్ కల్యాణ్‌ల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ జనసేన కార్యకర్తలు కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌,  ఆ చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసిన టీవీ ఛానెల్ పై కేసు నమోదు చేశారు. 
    తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన తెలుగువన్ వాస్తవ వేదికలో ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై ఆసక్తికరమైన  విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని సాగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలజీవన్ మిషన్’ పథకం చుట్టూ ఇప్పుడు వివాదం ముదిరింది. పవన్ కళ్యాణ్ తన శాఖ పరంగా కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపి, రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకురావడంలో విజయం సాధించారు. అయితే, కేంద్రం నుంచి విడుదలైన ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి చేరిన కేవలం అరగంట వ్యవధిలోనే మళ్ళించబడ్డాయనే ఆరోపణలు రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ నిధులు నేరుగా ‘మెఘా కృష్ణారెడ్డి’కి చెందిన సంస్థల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయనే అంశం ఇప్పుడు ప్రభుత్వ పారదర్శకతపై పెద్ద ప్రశ్న మార్క్‌గా నిలిచింది. రాజకీయ వ్యూహాలు మరియు అంతరార్థాలు: ఈ వ్యవహారంలో తెరవెనుక నడుస్తున్న రాజకీయ వ్యూహాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ నిధుల సాధన కోసం శ్రమిస్తుంటే, మరోవైపు ఆ నిధులు కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోవడం వెనుక ఉన్న శక్తులెవరనేది మిస్టరీగా మారింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న అంతర్గత సత్సంబంధాలను, ఏపీ కార్బైడ్స్ వంటి పరిశ్రమల్లో భాగస్వామ్యాలను గుర్తుచేస్తూ ప్రస్తుత రాజకీయ నాయకుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఎన్నికల ముందు ప్రత్యర్థులుగా కనిపించే నాయకులు, తెరవెనుక ఒకే మంచం ఒకే కంచం అన్నట్లుగా వ్యవహరిస్తారనే వాదనకు బలం చేకూరుతోంది. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయనే భావన వ్యక్తమవుతోంది. ఇసుక రవాణాలో ప్రతి టిప్పర్‌కు భారీగా వసూళ్లు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా కాంట్రాక్టర్ల పెత్తనం మారకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే సంకేతాలు అందుతున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావం: ఈ నిధుల మళ్ళింపు ఉదంతం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక రాష్ట్ర మంత్రి కష్టపడి తెచ్చిన నిధులు, ఆయన ప్రమేయం లేకుండానే మళ్ళిపోవడం వల్ల ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణను వ్యతిరేకిస్తూ, ఎక్కువ మంది పిల్లలను కనాలని, మూడో బిడ్డకు రూ. 30 వేలు, నాలుగో బిడ్డకు రూ. 40 వేలు ఇస్తామని సరికొత్త పథకాలను ప్రకటిస్తున్నప్పటికీ, ప్రజల్లో నమ్మకం కలిగించడంలో విఫలమైతే ఆశించిన ఫలితం ఉండదు.  ప్రజల చదువు, ఆరోగ్యం, ఎదుగుదలకు ప్రభుత్వం అండగా ఉంటుందనే సంకేతాలు ఇవ్వనంత కాలం ఇటువంటి పథకాలు కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోతాయి. పాలనలో పారదర్శకత లోపిస్తే, రాబోయే రోజుల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, అది వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉంది. ఇలాంటి వివరాలు కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.  
  నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం(21-5-26న) మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గం, పొలిట్‌బ్యూరో నియామకం తర్వాత తొలిసారి జరిగినఈ సమావేశానికి వర్చువల్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ భేటీలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు.  ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్‌కు సంబంధించిన ఒక తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.ఈ సారి మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.  టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, మహిళల భాగస్వామ్యంతో అమలు చేసిన కార్యక్రమాలను మహానాడు వేదికగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మహిళల భాగస్వామ్యంతోనే ప్రతి సంక్షేమ పథకాన్ని రూపొందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై మహానాడులో సమగ్ర చర్చ జరగాలని దిశానిర్దేశం చేశారు.ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేలా మహానాడును నిర్వహించాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.  కార్యక్రమానికి రెండు రోజుల ముందే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరినీ మహానాడులో భాగస్వాములను చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహానాడు ప్రారంభానికి ముందు రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లలో దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహాలకు నివాళులు అర్పించి కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే ఎన్టీఆర్ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ చరిత్రను నేటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక ప్రజెంటేషన్లు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన రాజకీయ, సామాజిక మార్పులను మహానాడు వేదికగా ప్రదర్శించాలని సీఎం మార్గనిర్దేశం చేశారు.
ALSO ON TELUGUONE N E W S
Rukmini Vasanth has been growing in popularity post her successful debut in Sapta Sagaradache Ello and now, she has grown in prominence to act in Yash's Toxic and NTR's Dragon. Recently, a series of morphed pictures went viral on social media, falsely showing her in a bikini.  Many netizens mistook the visuals for genuine content, sparking widespread discussion online and leading some to believe they were authentic images. However, the actress quickly addressed the issue to clear the air. Taking to her Instagram story, she confirmed that the circulating media is completely fake and issued a strong warning to those creating and spreading the content. She wrote, "My team and I have come across certain AI-generated images being circulated online claiming to be me. I want to state clearly that these images are entirely fake and fabricated. The creation and circulation of such manipulated content is deeply irresponsible and a serious violation of privacy." She further added that her team is taking strict action against the culprits. "We are taking this matter seriously and initiating the necessary legal and cybercrime action against those involved in creating and spreading these images," she stated. Concluding her message, she requested the public not to encourage such acts, writing, "Requesting everyone to refrain from sharing or engaging with such content." Such content has been rampant on social media with earlier Rashmika Mandanna famously, being victim of Deep Fake videos.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తక్కువ కాలంలోనే సౌత్ ఇండియా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). ముఖ్యంగా 'సప్త సాగరదాచే ఎల్లో' సినిమాలో ప్రియ అనే సాంప్రదాయబద్ధమైన పాత్రలో ఆమె చూపించిన హావభావాలు, పలికించిన పద్ధతికి తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్స్ అయిన 'టాక్సిక్', 'డ్రాగన్' సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోంది. అయితే, తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని షాకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర సంచలనం సృష్టించింది. రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రుక్మిణి వసంత్ బికినీ ధరించినట్లు ఉన్న కొన్ని ఫోటోలు, చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ విపరీతంగా షేర్ అయ్యాయి. నిన్నటివరకు హోమ్లీ లుక్‌లో చూసిన తమ అభిమాన కథానాయికను ఇలాంటి బోల్డ్ అవతారంలో చూసేసరికి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు ఆమె గ్లామర్ లుక్‌ను అభినందిస్తూ కామెంట్లు పెట్టగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఈ ఫోటోల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంటర్నెట్‌లో ఈ రచ్చ కాస్తా ముదరడంతో, ఎట్టకేలకు ఈ వివాదంపై స్వయంగా రుక్మిణి వసంత్ క్లారిటీ ఇచ్చారు. ఆ వైరల్ అవుతున్న బికినీ ఫోటోలు పూర్తిగా ఫేక్ అని, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగించి సృష్టించిన మార్ఫింగ్ ఫోటోలని ఆమె స్పష్టం చేశారు. తన ప్రమేయం లేకుండా, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ కొందరు ఆకతాయిలు కావాలనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కంటెంట్ తనను ఎంతగానో మానసిక వేదనకు గురిచేసిందని, దీనిపై తన లీగల్ టీమ్ ఇప్పటికే అప్రమత్తమైందని తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. సినిమా స్టార్స్‌ను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న ఈ ఏఐ డీప్‌ఫేక్ (AI Deepfake) సంస్కృతిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏఐ మార్ఫింగ్ ముఠాల పట్ల సైబర్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, సెలబ్రిటీల ప్రైవసీని కాపాడేందుకు కొత్త చట్టాలు తీసుకురావాలని పరిశ్రమ వర్గాల నుండి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.   https://x.com/rukminitweets/status/2058069100765810878
  స్టార్ డైరెక్టర్ ఈ సారి హిట్ ని తన కాంపౌండ్ లో ఉంచుకోవాలని విజయ్ సేతుపతి తో స్లమ్ డాగ్  33 టెంపుల్ రోడ్ ని తెరకెక్కిస్తాన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుండగా ఈ చిత్రంతో పూరి మళ్ళీ తన సత్తా చాటాలని ఫ్యాన్స్ చాలా బలంగా కోరుకుంటున్నారు.ఇక పూరి సినిమాల్లో బిజీగా ఉన్నా సరే 'పూరి మ్యూజింగ్స్" ద్వారా పలు జీవిత సత్యాలకి సంబంధించిన అంశాలపై నెటిజన్స్, అభిమానులతో  పంచుకుంటూ ఉంటారు.  రీసెంట్ గా 'యాటిట్యూడ్"  గురించి మాట్లాడుతు నీ యాటిట్యూడ్ వల్ల నీ చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచం ఏమీ మారిపోదు, కానీ నీ లోపల ఉన్న అంతర్గత ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. జీవితంలో ఎదురయ్యే విపత్తులని  మనం ఎలా స్వీకరిస్తామనేది పూర్తిగా మన మానసిక దృక్పథం పైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే, ఎంతటి కష్టమైన పరిస్థితులనైనా ఎదిరించి నిలబడగలరు దీనికి ఉదాహరణగా ఒకసారి సముద్రంలో సంభవించిన పెను తుపాను దాటికి రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఆ ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన ఒక వ్యక్తి రోడ్డుపై కూర్చుని విపరీతంగా ఏడుస్తూ కుంగిపోతాడు. అదే ప్రమాదం బారిన పడిన మరొక వ్యక్తి మాత్రం, ఒక చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ నవ్వుతో కనిపిస్తాడు. ఇక్కడ ఒకరు సర్వం కోల్పోయానని బాధపడితే, మరొకరు ప్రాణాలతో బతికి ఉన్నందుకు సంతోషపడతాడు. అంటే, మన చుట్టూ జరిగే సంఘటనలు అందరికీ ఒకేలా ఉన్నా, వాటిపై మనం చూపే స్పందన మాత్రమే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. మీలో గనుక ఎప్పుడూ నెగెటివ్ మైండ్  ఉంటే, దేవుడు ఇచ్చే దీవెనలు కూడా మీకు దరిద్రంగానే అనిపిస్తాయి. అదే మీరు కాన్షియస్ మైండ్ అంటే  స్పృహతో కూడిన మనసుతో ఉంటే, జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం  ఒక సరికొత్త అవకాశంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఏ సంఘటన  కేవలం నీకు మాత్రమే వ్యతిరేకంగా జరగదు. విశ్వంలో ప్రతిరోజూ ఎన్నో మార్పులు జరుగుతుంటాయి, అందులో నువ్వు  కేవలం ఒక భాగస్వామి  మాత్రమే. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే మనకు సరైన యాటిట్యూడ్ ఎంతగానో సాయం చేస్తుంది. ఎప్పుడూ ఏడుస్తూనే బతకాలని అనుకునే వాళ్లకి ఈ ప్రపంచంలో ఏడవడానికి రోజూ వేల కారణాలు కనిపిస్తాయి. బయట సమాజంలో జరిగే దేనిపైనా మనకు నియంత్రణ ఉండదు. కానీ, వాటిని చూసి మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది మాత్రం 100 శాతం మన చేతుల్లోనే ఉంటుంది. రైట్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని ఈ ప్రపంచంలో ఎవరూ, ఎప్పటికీ ఓడించలేరు. ఎందుకంటే అలాంటి వ్యక్తి జీవితానికి ఎప్పుడూ ఎదురెళ్లడు. కాలంతో పాటు, జీవితమనే ప్రవాహంలో ఒదిగిపోతూ కొట్టుకుపోతుంటాడు కాబట్టి అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు. వర్షం వస్తే తడవాల్సిందే, ఎండ తీవ్రంగా ఉంటే ఆ వేడిని భరించాల్సిందే. అప్పుడే మనలో నిజమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి భయపడే బలహీనమైన లక్షణం మీలో ఉంటే, దాన్ని నెమ్మదిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. Also read: Sneha Ullal: 16 ఏళ్లకే సినీ ఎంట్రీ ఎందుకు ఇవ్వాల్సివచ్చిందంటే..స్నేహ ఉల్లాల్ భావోద్వేగం ఈ సమాజంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. మన క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ, మనం ఒరిజినల్‌గా ఉంటే చాలు. ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం ఎవరి కోసమో నటించాల్సిన అవసరం లేదు. మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మన సింప్లిసిటీలోనే స్పష్టంగా అర్థమవుతుంది. జీవితంలో వచ్చే ఎన్నెన్నో కష్టాలన్నింటినీ తట్టుకోవాలన్నా, కింద పడినా మళ్లీ ఫీనిక్స్ పక్షిలా పైకి లేవాలన్నా, గమ్యం వైపు వేగంగా పరిగెత్తాలన్నా మనకు ప్రాథమికంగా కావాల్సింది ఒకే ఒక్కటి యాటిట్యూడ్ అని పూరి తెలిపాడు.       
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతూ '#Mega158' ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.  'వాల్తేరు వీరయ్య' చిత్రానికి చార్ట్‌బస్టర్ సాంగ్స్ అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ (DSP) ను కాదని, ఈ కొత్త ప్రాజెక్ట్‌లోకి మరో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్‌ను ఎంపిక చేశారు. మెగా హీరోలకు ఎన్నో లెక్కలేనన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్.. ఈ సినిమా నుండి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? మెగా కాంపౌండ్‌కు ఆయన దూరం కావడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం 'ఎల్లమ్మ' అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారు. యాక్టింగ్ కోసం నెలకు 15 రోజులు కేటాయిస్తూ, మిగిలిన 15 రోజులు మాత్రమే సంగీతానికి ఇస్తానని ఆయన చెప్పినప్పటికీ, అదే సమయంలో కొన్ని పెద్ద సినిమాల విషయంలో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ ఆయనపై కొంత నెగిటివిటీకి కారణమయ్యాయి.  ముఖ్యంగా 'పుష్ప 2', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి భారీ చిత్రాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) విషయంలో ఆలస్యం జరగడం, ఆయా చిత్రాలకు థమన్‌తో పాటు ఇతర మ్యూజిక్ డైరెక్టర్లతో రీ-రికార్డింగ్ చేయించాల్సి రావడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ కారణాల వల్లే చిరంజీవి, బాబీ చిత్ర బృందం ఈసారి దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో థమన్‌ను తీసుకోవడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు, సంగీత దర్శకుడు థమన్‌కు మెగా కాంపౌండ్‌తో మంచి అనుబంధం ఉంది. గతంలో చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రానికి థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇది చిరంజీవితో థమన్ చేయబోయే రెండో సినిమా. అంతేకాకుండా, దర్శకుడు బాబీ లాస్ట్ మూవీ అయిన బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్రానికి కూడా థమనే అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అటు హీరో చిరంజీవితో, ఇటు దర్శకుడు బాబీతో ఉన్న ఈ ప్రత్యేక సింక్ కారణంగా థమన్ '#Mega158' ప్రాజెక్ట్‌లోకి చాలా సులభంగా ఎంట్రీ ఇచ్చారు. మరి 'వాల్తేరు వీరయ్య'ను మించి ఈ కొత్త సినిమాకు థమన్ ఎలాంటి మ్యాజిక్‌ను అందిస్తారోనని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
Recent videos of Tamil superstar Ajith Kumar playing turf cricket have taken social media by storm. In the viral clips, the actor is seen deeply involved in the game, effortlessly taking on multiple roles on the field. He batted, bowled, fielded, and even kept wickets, impressing everyone with his exceptional fitness and agility. Seeing his active and energetic gameplay, fans are having a fun time on the internet, jokingly suggesting that he is ready to play for Chennai Super Kings (CSK) in IPL 2027. This is not the first time Ajith's passion for cricket has been highlighted. Over the years, he has often been spotted playing the sport on the sets of his movies. During the shooting of the blockbuster Mankatha, he regularly played cricket with the cast and crew to unwind and build team spirit. Ajith has always been a multi-talented sportsman well beyond the silver screen. He has previously participated in State and National level shooting competitions, showcasing his sharp focus and discipline. Currently, the actor is deeply invested in motorsports. He proudly owns the AK Racing team and is actively concentrating on his professional racing career, participating as both an owner and a driver in gruelling 12-hour and 24-hour endurance competitions across the world.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)బ్లాక్ బస్టర్ హిట్ సింహాలో బాలకృష్ణతో జత కట్టిన భామ స్నేహ ఉల్లాల్(Sneha Ullal). ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్ వంటి విజయవంతమైన చిత్రాలతో కూడా చేసి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఐశ్వర్య రాయ్ పోలికలతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ బ్యూటీ, కెరీర్ ఆరంభంలోనే భారీ ఆఫర్లు అందుకుంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలతో పాటు కొన్ని భావోద్వేగ విషయాలని  పంచుకుంది. ఆమె మాట్లాడుతు కేవలం  16 ఏళ్ల వయసులోనే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' తో పరిచయమయ్యాను.  అంత చిన్న వయసులోనే  అడుగుపెట్టడానికి మా అమ్మ  ఆరోగ్యం. ఆ సమయంలో అమ్మ  క్యాన్సర్ బారిన పడటంతో, అమ్మ వైద్య ఖర్చులు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాల్సిన బాధ్యత పడింది.బాలీవుడ్ ఎంట్రీతో ఒకే ఒక్క రాత్రిలో స్టార్‌డమ్ లభించినప్పటికీ, మానసికంగా తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. ఆ వయసులో సినిమా ప్రపంచం గురించి, గ్లామర్ ఇండస్ట్రీలోని నెగెటివిటీ గురించి  కనీస అవగాహన కూడా లేదు.  Also read: Sitara Entertainments: నాగవంశీ చేతికి బ్లాస్ట్ జోన్.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బ్లాస్టే సినిమాల్లోకి రావడం వల్ల  అమూల్యమైన టీనేజ్ జీవితాన్ని పూర్తిగా కోల్పోయాను. తోటి పిల్లల్లా స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం, ఎంజాయ్ చేయడం వంటి లేవు. కంటి నిండా నిద్ర, ప్రశాంతత అన్నీ కోల్పోవాల్సి వచ్చింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తీవ్రమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్  బారిన పడటం వల్ల దాదాపు 4 సంవత్సరాల పాటు నడవలేని స్థితికి చేరుకున్నాను . రక్తం తక్కువైపోయి, కనీసం అరగంట పాటు నిలబడే ఓపిక కూడా లేకపోవడంతో పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మళ్ళీ నటిస్తానని స్నేహ చెప్పుకొచ్చింది.  
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఎప్పుడూ వైవిధ్యాన్ని చూపిస్తుంటారు. శనివారం ఉదయాన్నే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సరికొత్త వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. నైట్ మ్యాచ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో తీసిన కొన్ని అద్భుతమైన క్లిప్పింగ్స్‌లో అజిత్ కుమార్ తన స్పోర్ట్స్ ప్యాషన్‌ను మరోసారి బయటపెట్టారు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ తరహాలో వికెట్ల వెనుక గ్లోవ్స్ తొడుక్కుని స్టంప్స్ వెనుక నిలబడటం, ఆ తర్వాత అంతే ఏకాగ్రతతో బ్యాట్ పట్టుకుని క్రీజులో అడుగుపెట్టడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. లైట్ల వెలుతురులో రాత్రి వేళ జరిగిన ఈ మ్యాచ్‌ బహుశా ఆయన పార్ట్-టైమ్ రేసర్‌గా కొనసాగుతున్న యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోనే జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ వీడియోలో అజిత్ కుమార్ వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు బంతిని అందుకున్న తీరు, ఆపై బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన షాట్లు ఆడిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన కొట్టిన కొన్ని షాట్లను చూసి అభిమానులు 'వాట్ ఏ షాట్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అభిమానులైతే ఈ క్రికెట్ వీడియోకు అజిత్ కుమార్ సినిమాల్లోని ఐకానిక్ డైలాగులను, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జత చేసి క్రేజీ ఎడిటింగ్స్‌తో రీల్స్, వీడియోలను వైరల్ చేస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తన మనసుకు నచ్చిన క్రీడల కోసం ఆయన సమయాన్ని కేటాయించే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. నిజానికి అజిత్ కుమార్‌కు క్రికెట్ అంటే జీవితకాలంగా ఉన్న ఒక గొప్ప ఇష్టం. గతంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లను వీక్షించడానికి స్టేడియానికి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన కుమారుడు ఆద్విక్‌తో కలిసి క్యాజువల్‌గా క్రికెట్ ఆడుతూ మైదానంలో సమయాన్ని గడుపుతుంటారు. ఈ క్రికెట్ ముచ్చట్లు ఒకవైపు నడుస్తుండగానే, అజిత్ కుమార్ తన ప్రొఫెషనల్ రేసింగ్ కెరీర్‌పై కూడా అంతే శ్రద్ధ చూపిస్తున్నారు. రాబోయే 2026 లీ మాన్స్ కప్ రేసుల్లో పాల్గొనడానికి ఆయన సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు అంతర్జాతీయ స్థాయి కార్ రేసింగ్, ఇంకోవైపు ఇలా క్రికెట్ గ్రౌండ్‌లో సిక్సర్లు కొట్టడం కేవలం అజిత్ కుమార్‌కు మాత్రమే సాధ్యమంటూ అభిమానులు కాలర్‌ ఎగరేస్తున్నారు.   https://x.com/Nelson_Ji/status/2058050098677129296
King Nagarjuna marks exactly four decades in Telugu cinema today. His acting career began when his debut film, Vikram, hit the screens on May 23, 1986. Interestingly, this date carries another deep emotional connection for him. Years later, on May 23, 2014, the Akkineni family's multi-starrer Manam was released. It was a significant project as it marked the final on-screen appearance of the legendary ANR. Reflecting on this rare coincidence and his 40-year journey, Nagarjuna took to X to thank the audience: "Thank you for all the blessings and love being showered on me today May 23!! the date I cannot forget!! The day which I had the honour of producing and releasing the last film MANAM of my legendary father ANR the film which I had the privilege of working both with my father and my sons. Years ago MAY 23 also gave me the opportunity to release my first film Vikram, an opportunity to entertain you, to be blessed and loved by all of you. My deepest gratitude to all the fans who have stood by me all these years. Looking forward for many more May 23 ‘s" On the work front, Nagarjuna is currently busy shooting for his milestone 100th project, tentatively referred to as King100. The film is being directed by Ra. Karthik with Tabu playing a prominent role.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
అక్కినేని వారసుడు అఖిల్ సరికొత్త రగ్గడ్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'లెనిన్' (LENIN). మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. 'మనోడు వస్తున్నాడు' అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ టీజర్ అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపడమే కాకుండా, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. (Akhil Akkineni) "ఏమంటివి ఏమంటివి" అంటూ సీనియర్ ఎన్టీఆర్ 'దాన వీర సూర కర్ణ'లోని డైలాగ్ తో,  ఒక గ్రామీణ నాటక రంగానికి సంబంధించిన సీన్‌తో టీజర్ ను ఆసక్తికరంగా ప్రారంభించారు. ఆ తర్వాత బైక్ మీద వెళ్తూ.. "డైలాగ్ ఎలా చెప్పాను?" అని భాగ్యశ్రీ బోర్సే అడగగా, "ఎన్టీఆర్ అంత కాకపోయినా బానే చెప్పావులే" అని అఖిల్ అనడం సరదాగా ఉంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే ఒకరికొకరు ఇచ్చే కౌంటర్లు టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. "నేను భారత మిట్ట ఆర్గనైజర్ ని" అంటూ అఖిల్ తన పాత్ర స్వభావాన్ని తెలియజేసే సీన్స్ వినోదాన్ని, మాస్ ఎలిమెంట్స్‌ను సమానంగా పంచుతున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో మునుపెన్నడూ లేని విధంగా పూర్తి మాస్ లుక్‌లో ఆయన అదరగొట్టాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. పండుగ వాతావరణం, ఎద్దుల బండ్లు, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రాణంగా నిలిచింది. టీజర్ ముగింపులో అఖిల్ చేతిలో కొడవలి పట్టుకుని విలన్లపై విరుచుకుపడే యాక్షన్ సీన్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చింది. "నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా" అంటూ అఖిల్ చెప్పిన డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం.  అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'లెనిన్' సినిమా జూన్ 26న విడుదల కానుంది. అఖిల్ కోరుకుంటున్న భారీ విజయాన్ని ఈ సినిమా అందిస్తుందని అక్కినేని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.   
  ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్( Sitara Entertainments)కి ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. బడా,చోటా హీరోలతో సినిమాలు నిర్మించడంతో పాటు పంపిణి రంగంలోనూ తమ సత్తా చాటుతూ వస్తుంది. ఈ కోవలోనే యాక్షన్ కింగ్ అర్జున్ నుంచి వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్'(Blast Zone). తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులని  సితార  కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించడంతో టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ బ్లాస్ట్ జోన్ పై ఆసక్తి పెరిగింది.    సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో ఇండియన్ సినిమాను తన సంగీతంతో ఊపేసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించడం విశేషం. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అదిరిపోయే మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్  ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని ప్రమోషన్స్ లో  మేకర్స్ చెబుతున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాని  షేక్ చేస్తోంది. మార్షల్ ఆర్ట్స్‌తో కూడిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్, గుండెను హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్  ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, అందులోని సభ్యులు మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణులు కావడం, ఒకానొక ప్రమాదకరమైన పరిస్థితిలో వారి జీవితాలు ఎలాంటి ప్రమాదంలో పడ్డాయి అనే కథాంశంతో తెరకెక్కగా అభిరామి, ప్రీతి ముకుందన్ కీ రోల్స్  లో కనిపిస్తున్నారు. Also read: kara: కర ఓటిటి డేట్ ఇదే.. ధనుష్ ఫ్యాన్స్ చెయ్యాల్సింది ఇదే  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గతంలో 'లియో', 'దేవర', 'భ్రమయుగం' వంటి విభిన్న భాషల భారీ చిత్రాలని  తెలుగులో పంపిణీ చేసి ఘన విజయాలని  అందుకుంది. ఇప్పుడు అదే నమ్మకంతో 'బ్లాస్ట్ జోన్' హక్కులను సొంతం చేసుకోవడం గమనార్హం. మే 28న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. సితార వంటి అగ్ర సంస్థ చేతుల్లోకి బ్లాస్ట్ జోన్ వెళ్లడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో  భారీ స్థాయిలో స్క్రీన్లు దక్కే అవకాశం ఉంది.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా మంచి గ్రేడ్‌లు సాధించడం అని చాలామంది అనుకుంటారు. కానీ పిల్లలలో  మానసిక బలాన్ని పెంపొందించడం, వారు భవిష్యత్తులో గొప్పగా ఎదగడం మరీ ముఖ్యంగా నాయకత్వ లక్షణాలతో ఉండటం చాలా ముఖ్యం.  ఆత్మవిశ్వాసం అనేది ఏ బిడ్డ వ్యక్తిత్వానికైనా పునాది. అది వారికి తమ మనసులోని మాటను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని, అలాగే వైఫల్యాల నుండి నేర్చుకుని ఓపికతో ముందుకు సాగే బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు కాలక్రమేణా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. అయితే, ఈ లక్షణాలు రాత్రికి రాత్రే పుట్టేవి కాదు.. వీటికి చిన్నతనం నుండే సరైన మార్గదర్శకత్వం అవసరం. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడి వారు లీడర్లుగా తయారవ్వాలంటే.. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను పెంచే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి నాయకత్వ లక్షణాలు పెంచే టిప్స్.. వ్యక్తీకరణ..  పిల్లలకు వారి అభిప్రాయాలను, భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇవ్వడం వల్ల వారు స్వేచ్ఛగా తమను తాము వ్యక్తపరచుకోవడానికి , వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. విజయాల గుర్తింపు.. పిల్లలు ఒక చిత్రాన్ని గీసినా లేదా ఒక పద్యాన్ని చదివినా, వారి కృషిని ప్రశంసించాలి. ఇలా మెచ్చుకోవడం వల్ల  పిల్లలలో తాము గౌరవించబడుతున్నామనే భావన కలుగుతుంది, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను రెండింటినీ పెంచుతుంది. విలువలు,సంప్రదాయాలు.. పిల్లలను కుటుంబ సంప్రదాయాలు, పండుగలు , ఆచారాలతో అనుసంధానించడం వారిలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి , వారి గుర్తింపు పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. సహనం, ఓర్పు..  గెలవడం ఎల్లప్పుడూ అవసరం కాదని, వెంటనే  ఫలితాలు ఆశించాల్సిన అవసరం లేదని పిల్లలకు నేర్పించడం ముఖ్యం. ఓర్పు, సహనం వారు పరిణతి చెందడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు..  సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్రలేవడం , రాత్రి సమయానికి నిద్రపోవడం,  వంటివి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని అంతర్గతంగా బలపరుస్తాయి. ఇది క్రమశిక్షణ , ఆత్మనియంత్రణను కూడా నేర్పిస్తుంది. వైఫల్యాల నుండి నేర్చుకోవడం..  పిల్లలు చేసే  ఏదైనా పనిలో  విఫలమైతే, వైఫల్యం అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని వారికి వివరించాలి. ఇది వైఫల్యం  తర్వాత తిరిగి లేచి ముందుకు సాగడాన్ని వారికి నేర్పుతుంది, ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కీలకం అవుతుంది. చెప్పేది వినాలి..   పిల్లలతో నిష్కపటంగా మాట్లాడాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల, వారు తమ సమస్యలను, ప్రశ్నలను  పంచుకోగలరనే నమ్మకం వారిలో పెరుగుతుంది . వినయం..  ఇతరులకు సహాయం చేయడం, చిన్న విషయాలకే కృతజ్ఞత చూపడం, అందరితో మర్యాదగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పాలి. ఇవి వారు ఇతరులతో మమేకమవ్వడానికి, సమాజంలో గౌరవం సంపాదించుకోవడానికి సహాయపడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పైవన్నీ నేర్పిస్తూ ఉంటే.. పిల్లలు తప్పకుండా తమ జీవితంలో ఆత్మవిశ్వాసంలో ఉంటారు.  నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుని వారి జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా వాడుతూ ఉంటారు. వేసవి కాలం వస్తోందని అనిపించగానే కూలర్లు సిద్దం చేస్తుంటారు. అయితే.. చాలామంది కూలర్ విషయంలో ఎదుర్కునే సమస్య చల్లదనం రాకపోవడం. కూలర్ ఎంత స్పీడ్ లో ఉన్నా చల్లదనం లేకపోవడం,  గదిలో ఉన్నవారికి చెమట పట్టడం, మరీ ముఖ్యంగా ముఖం మీద జిడ్డుగా మారడం వంటివి జరుగుతూ ఉంటాయి.  దీనికి కూలర్ సరిగా పనిచేయడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ దీనికి అసలు కారణం చాలామంది చేసే పొరపాట్లే..  ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుంటే.. గదిని పూర్తీగా మూసి ఉంచడం.. ఏసీ వాడేటప్పుడు గదిలోని కిటికీలు, తలుపులన్నీ ఎలాగైతే మూసి ఉంచాలో, కూలర్ విషయంలో కూడా అలాగే చేయాలని  తరచుగా అనుకుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. కూలర్లు గాలిలోకి తేమను విడుదల చేస్తాయి. గదిని పూర్తిగా మూసి ఉంచితే, ఆ తేమ బయటకు వెళ్లలేక, గాలిలో విపరీతమైన తేమ ఏర్పడుతుంది. అందువల్ల, గాలి ప్రసరణ జరిగేలా , గదిలోని నిస్సారమైన గాలి బయటకు వెళ్లేలా చేయడానికి, ఒక కిటికీని లేదా తలుపును కొద్దిగా తెరిచి ఉంచాలి. కూలర్ అమరిక.. కూలర్‌ను గది మధ్యలో లేదా గోడకు ఆనించి, దానికి స్వచ్ఛమైన గాలి అందని చోట ఉంచితే, అది గదిలోని వేడి గాలిని బయటకు పంపుతూనే ఉంటుంది. కూలర్‌ను ఎల్లప్పుడూ కిటికీ లేదా తలుపు దగ్గర ఉంచాలి. తద్వారా అది బయటి నుండి స్వచ్ఛమైన గాలిని లోపలికి లాగి, దానిని లోపలికి పంపుతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్.. బయట విపరీతమైన వేడి, తేమ ఉన్నప్పుడు, కేవలం కిటికీ తెరవడం ద్వారా కూలర్‌లోని తేమను బయటకు పంపడం కష్టమవుతుంది. గదిలో తప్పకుండా ఒక చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను అమర్చాలి.   కూలర్‌ను నడుపుతున్నప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా ఆన్ చేయాలి. ఇది గదిలోని జిగటగా ఉండే వేడి గాలి మొత్తాన్ని బయటకు లాగి, గదిని చల్లగా ఉంచుతుంది. కూలర్ ప్యాడ్స్.. కొన్నిసార్లు  సంవత్సరాల తరబడి కూలర్ పక్క ప్యాడ్‌లను మార్చకుండా ఉంటారు.  వాటిపై దుమ్ము, ఉప్పునీరు పేరుకుపోయి, తెల్లటి పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల గాలి లోపలికి వెళ్లదు,  కూలర్ ఫ్యాన్‌లా కేవలం వేడి గాలిని మాత్రమే బయటకు పంపుతుంది. అందువల్ల, ప్రతి సీజన్‌లో కూలర్ ప్యాడ్‌లను తప్పకుండా మార్చాలి. కూలర్ లో హనీకూంబ్ ప్యాడ్స్ ఉంటే వాటిని బయటకు తీసి బాగా శుభ్రం చేయాలి. సూర్యరశ్మి.. గది గోడలు లేదా కిటికీలపైకి నేరుగా సూర్యరశ్మి పడితే, అవి వేడెక్కుతాయి. కూలర్‌లోని గాలి వేడెక్కిన గోడలను తాకినప్పుడు దాని ప్రభావం తగ్గిపోతుంది. అందువల్ల, పగటిపూట కిటికీలకు మందపాటి, ముదురు రంగు కర్టెన్లను వేయాలి. ఇది సహజంగా గది ఉష్ణోగ్రతను తగ్గించి, కూలర్ వేగంగా చల్లబడటానికి సహాయపడుతుంది. వాతావరణం చాలా వేడిగా ఉంటే, కూలర్‌లోని వాటర్ ట్యాంక్‌లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి.  దీనివల్ల నీరు వెంటనే చల్లబడుతుంది. కూలర్ నుండి వచ్చే గాలి ఎయిర్ కండిషనర్ లాగా అనిపిస్తుంది.                                     *రూపశ్రీ.
హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు. పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ. మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది. మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.  పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన. కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు. కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం                                    ◆నిశ్శబ్ద.
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది శరీరానికి మేలు చేయడానికి బదులుగా హాని కలిగించే  పదార్థాలను బ్రేక్పాస్ట్ లో తింటారు. ఖాళీ కడుపుతో కొన్ని రకాల బ్రేక్పాస్ట్ లను  తినడం  జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. రోజంతా నీరసంగా, చిరాగ్గా  ఉంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన, సమతుల్యమైన అల్పాహారం శక్తిని అందించడమే కాకుండా, బరువు నియంత్రణ, మెరుగైన జీవక్రియ , మానసిక ఏకాగ్రతకు కూడా సహాయపడుతుంది. బ్రేక్పాస్ట్ లో  ఏ పదార్థాలను నివారించాలో , ఏ అలవాట్లు  ఆరోగ్యానికి హాని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుంటే.. వేయించిన, నూనే ఆహారాలు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేయించిన, నూనెతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. పూరీలు, కచోరీలు, సమోసాలు,  బజ్జీలు  వంటి వేయించిన ఆహారాలు  కడుపులో భారంగా అనిపించేలా చేస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ ఆలస్యం అయి, ఎసిడిటీ, గ్యాస్, నీరసం పెరగవచ్చు. దీర్ఘకాలంలో, ఇలాంటి అలవాట్లు బరువు పెరగడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా దారితీయవచ్చు. ప్యాకింగ్ జ్యూసులు.. ఉదయం పూట తీపి బ్రెడ్ లేదా తృణధాన్యాలతో చేసిన బ్రెడ్ వంటివి లేదా  ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడం ఆరోగ్యకరమని చాలామంది అనుకుంటారు.  కానీ వీటిలో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, కొద్దిసేపటికే అకస్మాత్తుగా పడిపోతాయి. ఇది శరీర శక్తి స్థాయిలను ప్రభావితం చేసి, త్వరగా ఆకలి వేయడానికి దారితీస్తుంది. అధిక చక్కెర ఉన్న ఆహారాలను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం , మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. టీ, కాఫీలు.. చాలామంది  రోజును కేవలం టీ లేదా కాఫీతో గడిపేస్తుంటారు. మరికొంతమంది  ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. వీటి  వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల ఎసిడిటీ , గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ఇది నీరసం, అలసట , ఏకాగ్రత లోపానికి దారితీయవచ్చు. ఇలా ఎక్కువ కాలం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. ప్రాసెస్ ఫుడ్స్.. ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ , ప్యాక్ చేసిన ఆహారాలలో ప్రిజర్వేటివ్‌లు , సోడియం అధికంగా ఉంటాయి. ఇవి తగినంత పోషణను అందించవు . పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణశక్తి బలహీనపడి, పోషకాహార లోపాలకు దారితీస్తుంది.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది. నిజానికి ఆయుర్వేదం అనేది వైద్య విదానంలా కాకుండా అది మనిషి జీవన విదానంలా చక్కగా కలిసిపోతుంది. మనిసి శరీరం  గురించి,  ఆరోగ్యం గురించి ఆయుర్వేదం ఎంతో గొప్పగా, మరెంతో లోతుగా, అదే విదంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తుంది. ఆయుర్వేదంలో ఉన్న రెండు శ్లోకాలు అర్థం చేసుకుంటే శరీరం వ్యాధులకు దూరంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఆ శ్లోకాలు ఏంటో తెలుసుకుంటే.. శరీరంలో పేరుకుపోయే విషపదార్థాలే అనేక వ్యాధులకు మూల కారణం.  ఉపవాసం, పంచకర్మ వంటి ప్రక్రియలు శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేయడానికి సహాయపడతాయి. నియంత్రణలో ఉండేలా  ఉపవాసం జీవక్రియను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, , ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని శాస్త్రీయ పరిశోధనలు కూడా చూపిస్తున్నాయి. ప్రకృతి వైద్యం శరీరం  సహజంగా వ్యాధులను తనకు తాను రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది సమతుల్య ఆహారం, యోగా, ధ్యానం, , శరీరం శుద్ది చేసే  పద్ధతులను ఉపయోగిస్తుంది. శరీరం, మనస్సు,  ఆత్మ సమతుల్యంగా ఉన్నప్పుడే మనిషి  నిజంగా ఆరోగ్యంగా ఉంటాడని ఆయుర్వేదం నమ్ముతుంది. శ్లోకం.. "లంఘనం పరం ఔషధం" అంటే ఉపవాసమే ఉత్తమమైన ఔషధం. శరీరాన్ని వ్యాధి రహితంగా ఉంచుకోవాలంటే  జంతువుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. అవి అనారోగ్యానికి గురైనప్పుడు తినడం మానేస్తాయి, కానీ మనం అనారోగ్యానికి గురైనప్పుడు అన్నీ తినేస్తుంటాము. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు 2-3 రోజులు ఉపవాసం ఉండటం నేర్చుకుంటే, తీవ్రమైన అనారోగ్యం వచ్చే ప్రమాదాన్ని కూడా తొలగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటే  కణితులు, గుండె సమస్యలు, ఫైబ్రాయిడ్ల వంటి సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావట. ఆయుర్వేదంలో ఉపవాసాన్ని శరీరం, మనస్సును శుద్ధి చేసే సాధనంగా పరిగణిస్తారు. ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండటం కాదు, శరీరానికి విశ్రాంతినిచ్చి, జీర్ణవ్యవస్థ తిరిగి క్రియాశీలం కావడానికి సమయం ఇవ్వడం. ఉపవాసం జీర్ణాశయ అగ్నిని బలపరుస్తుంది. శ్లోకం.. "సర్వేషాం రోగనాం నిదానం కూపిత మల" అంటే అన్ని వ్యాధులకు మూలం కూపిత మలం. శరీరంలోని వాత, పిత్త లేదా కఫ దోషాలు అసమతుల్యమై, కలుషితమైనప్పుడు వ్యాధులు వస్తాయి.  దీన్ని తగ్గించడం  కోసమే పంచకర్మ చేస్తారు. పంచకర్మ అనేది ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక శుద్ది ప్రక్రియ, దీని ముఖ్య ఉద్దేశ్యం శరీరం నుండి విషపదార్థాలను తొలగించి, శరీరాన్ని సమతుల్యం చేయడం. ఇందులో వామన, విరేచన, బస్తి, నస్య , రక్తమోక్షణ వంటి విధానాలు ఉంటాయి. శరీరం నుండి అసమతుల్య దోషాలను తొలగించడం, పేరుకుపోయిన విషపదార్థాలను తీసివేయడం , సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను అందించడం వీటి ప్రధాన లక్ష్యం. పంచకర్మ విశిష్టత.. శరీరంలో పేరుకుపోయిన 'ఆమ' లేదా విష పదార్థాలు అనేక వ్యాధులకు కారణమవుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ విష పదార్థాలను తొలగించడంలో పంచకర్మ సహాయపడుతుందని భావిస్తారు. పంచకర్మ తర్వాత చాలా మంది మంచి నిద్ర, తేలికదనం , శక్తిని పొందినట్లు భావిస్తారు.                          *రూపశ్రీ.