LATEST NEWS
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమైన తరుణంలో..  విశాఖపట్నానికి   భోగాపురం విమానాశ్రయం చాలా దూరంలో ఉందంటూ వైసీపీ చేస్తున్న విమర్శలను  విశాఖ జనమే ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. అసలు భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది. అసలు భోగాపురం ప్రాధాన్యత, పౌర సేవలు ఇక్కడికి మార్చడం వెనుక ఉన్న వ్యూహాలు, క్షేత్రస్థాయి సానుకూలతల విషయానికి వస్తే..  విశాఖ నుంచి  45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతికూల అంశంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేస్తోంది.  ఈ సందర్భంగా వైసీపీ విమర్శలను పరిశీలకులు తోసిపుచ్చుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా సరిగ్గా ఇటువంటి సందేహాలూ, విమర్శలూ  వ్యక్తమయ్యాయి. అప్పట్లో నగర నడిబొడ్డున ఉన్న బేగంపేట విమానాశ్రయాన్ని మూసివేసి..  నగరం బయట ఉన్న శంషాబాద్‌కు విమాన సేవలను తరలిస్తున్న సమయంలో ప్రజల నుంచి దూరం, ప్రయాణ సమయం, చివరి మైలు కనెక్టివిటీపై   వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే.. ఇప్పుడు  శంషాబాద్ విమానాశ్రయం దేశంలోనే అత్యుత్తమ,  అలాగే  ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్ట్‌లలో ఒకటిగా నిలవడమే కాకుండా, శరవేగంగా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ అవసరాలను ఎంతో సమర్థవంతంగా తీరుస్తోంది. ఇప్పుడు ఎవరి నోటీ దూరం మాట వినిపించడం లేదు. అదే తరహాలో భోగాపురం కూడా రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేకలను మార్చివేస్తుందని పరిశీలకులు చెప్పడం కాదు.. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు.  భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక విమానాశ్రయాలను నగరాలకు దూరంగా నిర్మించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే.   ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఎయిర్‌పోర్ట్‌లు నగర నడిబొడ్డున లేవు. నగరాల పరిధిలో భూముల ధరలు అత్యంత భారీగా ఉండటం..  విస్తరణకు కావలసిన  భూమి లభించకపోవడం  ఒక కారణమైతే..  నగరం నడిబొడ్డున విమానాశ్రయం ఉంటే..  ఎయిర్ పోర్టుకు  వచ్చే వాహనాల వల్ల   ట్రాఫిక్ సమస్యలు తలెత్తి జనం ఇబ్బందులకు ఎదుర్కోవలసి ఉంటుంది. బేగంపేటలో పౌర విమాన సేవలు కొనసాగిన సమయంలో తరచూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యేదన్న సంగతి విదితమే. వేగంగా విస్తరిస్తున్న విశాఖ వంటి పారిశ్రామిక నగరంలో, నగర పరిధిలోనే అంతర్జాతీయ స్థాయి రన్‌వేలు, టెర్మినళ్లు, కార్గో కాంప్లెక్స్‌లను విస్తరించడం దాదాపు సాధ్యం కాదు. ఈ విషయాన్ని నిపుణులే చెప్పారు.  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి)లో జీఎమ్‌ఆర్    భారీ పెట్టుబడులతో నిర్మించింది. దీని నిర్వహణ కూడా జీఎంఆర్ సంస్థే చేపట్టింది.  ఇంతటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే సమీపంలో మరో పోటీ విమానాశ్రయం ఉంటే ఇబ్బంది. అందుకే హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన వెంటనే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ను పౌర విమాన సర్వీసులకు మూసివేశారు. ఇప్పుుడు కూడా అలాగే..  విశాఖలోని పాత విమానాశ్రయం నుంచి  పౌర సేవలకు క్రమంగా  స్వస్తి చెప్పి.. ఆ విమానాశ్రయాన్ని  ఇండియన్ నేవీ ఆపరేషన్లకు అప్పగిస్తారు. ఇకపై షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలన్నీ భోగాపురం నుంచే రాకపోకలు సాగిస్తాయి. విశాఖపట్నంవాసులు ఈ దూర భారాన్నీ, భయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడానికి మరో కారణమేంటంటే..  విమాన ప్రయాణం అనేది ఆర్టీసీ బస్సు స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ మాదిరిగా ప్రతిరోజూ సాధారణ ప్రజలు ఉపయోగించేది కాదు. విశాఖపట్నం మొత్తం జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు నిత్యం విమానాశ్రయాన్ని సందర్శించరు. కేవలం కొద్ది శాతంగా ఉండే వ్యాపారులు, పర్యాటకులు, ఐటీ నిపుణులు, అత్యవసర ప్రయాణికులు మాత్రమే తరచూ విమానాలను ఆశ్రయిస్తారు. పైగా.. ప్రస్తుతం ఉన్న విశాఖ విమానాశ్రయం  నేవీ ఆధీనంలో ఉండటంతో పాటు, చుట్టూ కొండలు, విస్తరించిన జనావాసాలు ఉండటంతో రాత్రివేళల్లో ల్యాండింగ్‌లు, పెద్ద బోయింగ్ విమానాల రాకపోకలకు   పరిమితులు ఉన్నాయి. అంతర్జాతీయంగా నేరుగా కనెక్టివిటీ సాధించాలంటే భోగాపురం వంటి ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఒక్కటే శరణ్యం. అలాగే..  విశాఖపట్నం  భౌగోళికంగా ఉత్తరం వైపున భోగాపురం, ఆనందపురం, భీమిలి దిశగా వేగంగా విస్తరిస్తోంది. రాబోయే పది,  పదిహేనేళ్లలో విశాఖ మహానగరం భోగాపురం వరకు విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ జోన్లు, ఐటీ పార్కులు, ఏరోసిటీ, విద్యా,  వైద్య సంస్థలు, లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతుండటంతో ఆ ప్రాంతమంతా కొత్త ఆర్థిక హబ్‌గా మారబోతోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడం వల్ల కేవలం విశాఖపట్నానికే కాకుండా సమీపంలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు కూడా విమాన ప్రయాణం  సులభతరం అవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతీయ అసమానతలను తొలగించి, రవాణా, పర్యాటక, పారిశ్రామిక రంగాలలో గుణాత్మక మార్పులు తీసుకురానుంది. విశాఖ  నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికులకు దూరభారం లేదా సమయభారం అనిపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ  ఎన్ హెచ్ఏఐ పలు  రహదారి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. ప్రస్తుత జాతీయ రహదారి 16 విస్తరణ, విస్తృతమైన సర్వీస్ రోడ్ల నిర్మాణంతో పాటు, విశాఖ పోర్ట్ నుంచి నేరుగా భోగాపురం వరకు 6 వరుసల బీచ్ కారిడార్ కోస్టల్ హైవే నిర్మాణంలో ఉంది. సవరవిల్లి వద్ద నిర్మిస్తున్న ప్రత్యేక ట్రంపెట్ ఇంటర్‌చేంజ్, అనకాపల్లి, ఆనందపురం బైపాస్ రహదారులు సిటీ ట్రాఫిక్ చిక్కులు లేకుండా నేరుగా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ చేరుకునేందుకే దోహదపడతాయి. ఈ రహదారులన్నీ పూర్తయితే విశాఖ నగర కేంద్రం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 35 నుంచి 40 నిమిషాల్లో సునాయాసంగా చేరుకోవచ్చు.  ప్రయాణికుల సౌకర్యార్థం భవిష్యత్తులో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించే సమగ్ర ప్రణాళికలను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనికి తోడు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సులు, విద్యుత్ ఆధారిత ఫీడర్ బస్సు సేవలు నిరంతరం అందుబాటులో ఉంటే నగరవాసులకు కనెక్టివిటీ పరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.   Bhogapuram International Airport, Visakhapatnam Airport Connectivity,  (Bhogapuram Expressway Beach Corridor, Vizag Metro Rail Project,  North Andhra Infrastructure Development 
తమిళ రాజకీయాల్లో  కావేరి జలాల చిచ్చు రేగింది.   దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన కావేరి జలాల పంపకం సమస్య..  మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణం వివాదం తాజాగా పీక్స్ కు చేరుకున్నాయి.  కావేరి నదీ జలాల హక్కుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  తాజాగా ఈ వివాదం పెచ్చరిల్లడానికి  ప్రతిపక్షాల అఖిలపక్షం డిమాండ్ ను ముఖ్యమంత్రి విజయ్ తిరస్కరించడమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు.   ప్రతిపక్ష డీఎంకే, ఇతర పార్టీలు కావేరీ జల వివాదంపై  అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా, సీఎం విజయ్..   ఇప్పటికే శాసనసభలో కావేరి నీటి హక్కులపై ఏకగ్రీవ తీర్మానం చేశామని, అందుకే మళ్లీ ప్రత్యేకంగా అఖిలపక్ష భేటీ అవసరం లేదని అకుండబద్దలు కొట్టారు.   దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్  ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.  కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.   ప్రతిపక్షాల విజ్ఞప్తులను పక్కనబెట్టి సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం వల్ల తమిళనాడు రైతులకు న్యాయం జరగదన్నారు. సీఎం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.  అదలా ఉండగా,  కర్ణాటక ప్రభుత్వం కావేరి పరివాహక ప్రాంతంలో మేకెదాటు డ్యామ్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో, ఈ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా కర్ణాటక పర్యటనకు సిద్ధమయ్యారన్న వార్తలు విపక్షాలలో మరింత ఆందోళనకు కారణమయ్యాయి.  చర్చల ద్వారా  సమస్య తీరదనీ, న్యాయపోరాటం ద్వారానే తమిళనాడు హక్కులను కాపాడుకోవాలని విపక్షలు అంటున్నాయి. కర్ణాటక ప్రభుత్వం అక్కడ ప్రత్యేక అఖిలపక్ష భేటీ నిర్వహించి తమ రాష్ట్రంలో ఐక్యతను ప్రదర్శిస్తుంటే..  తమిళనాడులో మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు పెచ్చరిల్లుతున్నాయి.   రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి చర్చించేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లానని డీఎంకే డిమాండ్ చేస్తున్నది.   ఒకవైపు ఆందోళన బాట పట్టిన డీఎంకే, మరోవైపు క్షేత్రస్థాయిలో నీటి కొరతతో అల్లాడుతున్న రైతులు, ఇంకోవైపు న్యాయపోరాటం చేయాలనే డిమాండ్లు... ఈ పరిణామాలు  సీఎం విజయ్ కు సవాల్ గా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ కు ఎదురైన అతి పెద్ద సవాల్ ఇదేనని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   CM Vijay, Cauvery Water Dispute, Tamil Nadu Politics, TVK vs DMK, Mekedatu Dam Row
  జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు. జగన్ మాటలు, ప్రకటనలు ప్రజలలో పార్టీని చులకన చేస్తున్నాయని ఆవేదన..ప్రభుత్వ వ్యతిరేకతను మించి జగన్ మీద అపనమ్మకం ప్రజలను ప్రభావితం చేస్తుందనే భయం...రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో ఎంత మాత్రం అసంతృప్తి లేదని అందరికీ అర్ధమైపోయింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆ నిజం ఒప్పుకొంటున్నారు. పరిస్థితి ఇట్లనే వుంటే రేపటి ఎన్నికలలో నెగ్గుక రావడం దుర్లభం అన్న భయం కూడా వారిని కలత పెడుతున్నది. చాలామంది ఎమ్మెల్యేలు ఈ భయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి వైసీపీ ఎంత మాత్రం సన్నద్ధం కాలేకపోతున్నది. జిల్లా స్థాయి నాయకులు కొందరు మాత్రమే భవిష్యత్ మీద ఆశతో కొంత చురుకుగా కనిపిస్తున్నారు. కానీ కార్యకర్తలలో ఆ ఉత్సాహం, విశ్వాసం కనిపించడం లేదు. మూడు పార్టీల కూటమి, రెండు ప్రధాన కులాల కలయిక కొనసాగినంత కాలం మనమెట్లా గెలుస్తామనే నిరాశ కార్యకర్తలలో కనిపిస్తున్నది. రాజకీయ చర్చలు ఆ కోణంలోనే కొనసాగుతున్నాయి. పైస్థాయి నాయకులు మాత్రం, జగన్ ధోరణి చూసి బాధ పడిపోతున్నారు. ప్రజలలో వున్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడానికి పార్టీ అధినేతగా జగన్ సరైన రీతిలో స్పందించడం లేదన్నది వారి అభిప్రాయం. గత పాలనలో జరిగిన పొరపాట్లు లేదా మహా పాపాల వల్ల తాము ఓడిపోయామని, మళ్లీ అధికారం వస్తే ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుంటామనే విశ్వాసాన్ని ప్రజలలో కలిగించడానికి జగన్ ఎంత మాత్రం ప్రయత్నం చేయడం లేదు.  జమీన్ రైతు సౌజన్యంతో...!
  రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక.. నిలబడి పోరాడే క్షేత్రస్థాయి కార్యకర్తల స్వార్థరహిత త్యాగాల పునాదులపైనే మార్పు రూపుదిద్దుకుంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించిన నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ వ్యక్తపరిచిన భావోద్వేగం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తీవ్ర ఆంక్షలు ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పసుపు సైన్యం ప్రదర్శించిన తెగువ, చూపించిన ఆత్మీయతను ఆయన గుర్తు చేసుకున్న తీరు సభలోని ప్రతి ఒక్కరి గుండెలను తాకింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో సుదీర్ఘంగా 45 రోజుల పాటు సాగిన 'యువగళం' పాదయాత్ర రోజుల నాటి పరిస్థితులను లోకేష్ భావోద్వేగంతో వివరించారు. ఆ రోజుల్లో అడుగడుగునా ఎదురైన తీవ్ర ప్రతిబంధకాలు, భయానక రాజకీయ వాతావరణం, సరైన పోలీసు భద్రత లేకపోవడం వంటి సవాళ్లను సభ ముందుకు తెచ్చారు. తీవ్ర రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికార యంత్రాంగం వైపు నుంచి తగినంత రక్షణ లభించకపోయినా, రోప్ పార్టీ సరిగా లేని సమయంలో కూడా సామాన్య పసుపు సైనికులు స్వయంగా రక్షణ కవచంగా నిలిచారని పేర్కొన్నారు. "నడువు అన్న.. ఎవరు వస్తారో తోలు తీద్దాం" అంటూ సామాన్య గ్రామీణ యువకులు, పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టి అండగా నిలబడడం కేవలం ఒక రాజకీయ సంఘటన కాదు; అది ఒక లోతైన భావోద్వేగ బంధానికి నిదర్శనం. ఈ పోరాట ప్రయాణంలో కేసులు, వేధింపులు, ఆర్థిక నష్టాలను తట్టుకుని నిలబడిన కార్యకర్తల త్యాగమే నేడు పార్టీకి మళ్లీ ఊపిరి పోసిందని లోకేష్ ఆవేదనతో, కృతజ్ఞతతో వ్యాఖ్యానించారు. "ఈ రోజు మేమందరం వేదికపై గౌరవప్రదంగా కూర్చున్నామంటే, దానికి వెనుక ఉంది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అపారమైన త్యాగం" అని విస్పష్టంగా ప్రకారించారు. తమ నాయకుడికి ఆపద వస్తుందేమోనన్న భయంతో స్వయంగా వీధుల్లోకి వచ్చి, కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ దృశ్యాలు తన గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని చెప్పారు. కష్టకాలంలో తోడుగా నిలిచిన వారిని అధికారంలోకి వచ్చాక కూడా గుర్తుపెట్టుకోవడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యం. భయం నీడలో జీవించిన ప్రజలకు, కార్యకర్తలకు ఆనాడు లభించిన ధైర్యమే నేటి మార్పుకు బీజం వేసింది. ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లా వేదికగా సాగిన ఈ సమావేశం, కేవలం ఒక సాధారణ రాజకీయ ఉపన్యాసంగా కాకుండా, క్షేత్రస్థాయిలో రక్తం చిందించిన సామాన్య కార్యకర్తలకు నాయకుడు అర్పించిన భావోద్వేగ కృతజ్ఞతా నీరాజనంగా నిలిచింది. Nara Lokesh Speech, Nara Lokesh Kurnool Visit, Yuva Galam Padayatra Kurnool, TDP Cadre Sacrifice, Nara Lokesh Emotional Speech, Kurnool TDP Meeting, Lokesh Kurnool Padayatra 45 Days,Telugu Desam Party Activists https://youtube.com/shorts/Q-CVoV6OKuo?si=3ri-MoSdU9wLQZsG
భక్తులు శ్రీరాముడిపై ఉన్న అపారమైన విశ్వాసంతో తమ కష్టార్జితాన్ని హుండీలో కానుకలుగా సమర్పిస్తారు. అలా సమర్పించిన ప్రతి రూపాయి వెనుక పవిత్రమైన విశ్వాసం, ఆధ్యాత్మిక చింతన  ఉంటాయి. అలాంటి కానుకలు దుర్వినియోగమైతే భక్తల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అయోధ్య రామాలయానికి భక్తుల సమర్పించిన విరాళాల విషయంలో అదే జరిగింది. అయోథ్య రాముడికి భక్తుల సమర్పించిన విరాళాల్లో 7.5 కోట్ల రూపాయల మేర  అవకతవకలు జరిగా యన్నవార్తలు దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.  ఆ అవకతవకలకు, అక్రమాలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో విపక్షాలు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశాయి.  అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆ పూజారికి  లోక్‌సభలో  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా పలువురు  విపక్ష ఎంపీలు   విరాళాలు వేస్తుండగా, పప్పు యాదవ్ వారిచ్చిన సొమ్మును తన జేబులో వేసుకుంటూ చోరీ జరిగిన విషయాన్ని చాటారు. ఆ సందర్భంగా ఎంపీలు చఢావా చోర్, గద్దీ ఛోడ్ అంటూ   బిగ్గరగా నినాదాలు చేశారు. అయోధ్య విరాళాల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.   Ayodhya donation row, Pappu Yadav protest, Rahul Gandhi, Parliament Makar Dwar, Ram Mandir hundi theft, Opposition protest
ALSO ON TELUGUONE N E W S
  స్టార్ హీరో ధనుష్(Dhanush)పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే వార్తలు రోజు రోజుకి హీట్ రాజేస్తున్నాయి. ఆ విషయంపై ధనుష్ స్పందించకపోయినా ధనుష్ వ్యవహార శైలి మాత్రం అందుకు తగట్టుగానే ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా జరిగిన బర్త్ డే వేడుకలే ఒక ఉదాహరణ. ధనుష్, ఇటీవల తమిళనాడులోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయాన్ని సందర్శించాడు. ధనుష్ తో పాటు తన ఇద్దరు కుమారులు యాత్ర, లింగ కూడా పాల్గొనడంతో సామాజిక మాధ్యమాల్లో అందుకు  సంబంధించిన వీడియోలు, ఫోటోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి.   సాంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి  ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న ధనుష్ అరుణాచలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్రమైన గోపూజలో పాల్గొన్నాడు . . కి ఆలయ అర్చకులు ప్రత్యేక మర్యాదలతో స్వాగతం పలికి, రుద్రాక్ష మాలని బహుకరించా రు.   అయితే ఈ ఆలయ సందర్శన కేవలం ఒక దైవదర్శనానికే పరిమితం కాలేదు. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ధనుష్ రాజకీయ అరంగేట్రంపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ధనుష్ కూడా రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారా అనే సందేహాలు సినీ, రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఆయన ముందస్తు రాజకీయ అడుగుల కోసమే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారా అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. తమిళనాడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, ధనుష్ వేస్తున్న ప్రతి అడుగు విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. Also read: ఈ వారం ఓటిటి, థియేటర్స్ లో సినిమాల జాతర.. కిక్ ప్రాప్తిరస్తు    ధనుష్ ప్రస్తుతం తన 77 వ చిత్రం 'ఓం' తో బిజీగా ఉన్నాడు. శరవేంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిరంతరం షూటింగ్‌లతో  బిజీగా ఉండే ధనుష్ శివ భక్తుడనే విషయం తెలిసిందే. Dhanush, OM, Rajinikanth, Tiruvannamalai  
Ravi Teja's Irumudi has been steadily building excitement with its emotionally driven promotional content. After the impactful glimpse and the popular first single Irumudi Kattu, the makers have now unveiled Yaalalo Yaalalo, a soothing melody that shines a light on the film's emotional core. The song offers a touching glimpse into the heartwarming relationship between Ravi Teja's character and his daughter, played by Baby Nakshatra. Composed by GV Prakash Kumar, Yaalalo Yaalalo is a soft, melodious track that beautifully captures the innocence and joy shared by the father-daughter duo. The visuals portray them enjoying simple moments together while Priya Bhavani Shankar, playing the mother, attempts to keep both of them in line. These everyday family interactions feel natural and relatable, making the song emotionally engaging. Ravi Teja impresses with a restrained and believable performance as a devoted father who is willing to go to any extent to make his daughter happy despite his financial struggles. Baby Nakshatra steals the show with her effortless screen presence, while Priya Bhavani Shankar adds warmth to the family dynamic with her grounded performance. Written and directed by Shiva Nirvana, who also choreographed the song, every frame is crafted with care to highlight the emotional bond at the story's center. Hesham Abdul Wahab and Sadika KR's soulful vocals, coupled with Anantha Sriram's heartfelt lyrics, further elevate the track, while GV Prakash Kumar delivers another memorable melody. Produced by Mythri Movie Makers on a grand scale, Irumudi is gearing up for its worldwide theatrical release on August 21. With Yaalalo Yaalalo striking an emotional note, the film has only raised expectations for what promises to be an emotionally rich entertainer with a divine touch. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
After delivering the critically acclaimed Court, Nani's production house Unanimous Productions is ready with another intriguing project. Starring Nithiin in the lead and produced by Deepthi Ganta, Alias Rukmini was officially announced with an interesting title glimpse that has immediately sparked curiosity among audiences. The glimpse introduces a mysterious writer named Rukmini, who is known for penning bold and quirky novels such as Garam Gopal, Ameku Athanante Ishtam, and Vratham Venkanna. Just when it appears that Rukmini is the celebrated author, the twist arrives—Nithiin's character Krishna is revealed to be the actual writer, publishing the books under his wife's name. The reason behind this unusual decision is left unanswered, making it the biggest talking point of the announcement video. Nithiin sports a completely fresh look with spectacles and a simple makeover that suits his writer's character perfectly. Nani's voice-over adds charm and intrigue throughout the glimpse, and his closing line, "I love the script," serves as a strong endorsement of the film's content. Directed by Dhandora fame Murali Kanth, Alias Rukmini promises a novel concept blended with entertainment. Vijai Bulganin's background score complements the mysterious tone of the teaser, enhancing its emotional and curious mood. With an unusual premise, Nithiin in a refreshing role, and Nani backing yet another content-driven film, Alias Rukmini has made a strong first impression. The film is set to go on floors soon, and expectations are already building for this intriguing entertainer. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  మంత్ స్టార్టింగ్ లోకి వచ్చేసాం, ఖర్చులు ఉంటాయి అని డల్ అవ్వాల్సిన అవసరం లేదు. మై హునా అంటూ ఓటిటి వేదికగా పలు క్రేజీ చిత్రాలు, సిరీస్ లు మీలో జోష్ తీసుకురావడానికి కోటి ఆశలతో పకడ్బందీగా ముస్తాబు అయ్యి కూర్చుకున్నాయి . మరి ఆ లిస్ట్ ఏంటో చూసేయండి.   ఈ వారం ఓటీటీ రేసులో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న ప్రధాన చిత్రం అక్కినేని అఖిల్ రీసెంట్ హిట్ మూవీ 'లెనిన్'. జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా, ఇప్పుడు ఆగస్టు 7 నుండి ZEE5 ఓటీటీ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌కి  రాబోతోంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త రూరల్ మాస్ లుక్‌లో కనిపించాడు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గ్రామీణ నేపథ్యం, రాజకీయాలు మరియు మహాభారత, రామాయణ ఛాయలతో రూపొందిన ఈ కథ ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించగా, నటుడు శివాజీ కీలక పాత్రలో కనిపించారు. లెనిన్ మాత్రమే కాకుండా, వివిధ భాషల నుంచి వస్తున్న పలు క్రేజీ డబ్బింగ్ చిత్రాలు మరియు సీక్వెల్ సిరీస్‌లు కూడా డిజిటల్ లవర్స్‌ను ఆకట్టుకోనున్నాయి. తమిళం నుంచి విశేష ఆదరణ పొందిన 'హృదయం మురళి' (ఇదయం మురళి), 'వంద దేవుళ్లు' (నూరు సామి), మరియు 'మై వాసప్ ఆవుంగా' వంటి విభిన్న చిత్రాలు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్నాయి. దీనితో పాటు సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్‌తో కూడిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్', క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'వదంది 2' వంటి భారీ వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కావడానికి సన్నాహాలు చేసుకున్నాయి. Also read: ఆ గుడిలో ప్రముఖ హీరోయిన్ పూజలు..  పైత్యం అంటూ  విమర్శిస్తున్న నెటిజెన్స్  మరోవైపు థియేటర్లలో కూడా పలు ఆసక్తికరమైన చిత్రాలు విడుదలవుతుండటం విశేషం. యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటుడిగా పరిచయమవుతున్న 'డిసి', మరియు మాధవన్ నటించిన 'జీడీ నాయుడు' బయోపిక్ వంటి విభిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఆయన బ్లాక్‌బస్టర్ హిట్ 'దూకుడు' భారీ ఎత్తున రీ-రిలీజ్ కాబోతుండటం అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నింపుతోంది.ఇలా సుమారు ఇరవై మూడుకి పైగా సినిమాలు, సిరీస్‌లు మీ కోసమే వస్తున్నాయి. ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 వరకు ప్రసారమయ్యే ఈ వినోదాల లైనప్‌లో యాక్షన్, థ్రిల్లర్, కాన్సెప్ట్ డ్రామా, హారర్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు చోటుచేసుకున్నాయి.కాబట్టి సినీ  కిక్ ప్రాప్తిరస్తు. Lenin, Korean Kanakaraju, akhil, varun, lokesh kanagaraj  
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'వారణాసి'. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'వారణాసి' గురించి రాజమౌళి చెప్పిన విశేషాలు.. సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్తున్నాయి.  ఈ సినిమాతో మనల్ని రాజమౌళి ఒక అద్భుతమైన టైమ్ ట్రావెల్ అండ్ గ్లోబల్ అడ్వెంచర్‌కు తీసుకెళ్లబోతున్నారు. జక్కన్న మాటల్లోనే చెప్పాలంటే.. ఈ సినిమా వారణాసి పుణ్యక్షేత్రంలో ప్రారంభమై, మైనస్ డిగ్రీల గడ్డకట్టే అంటార్కిటికా మంచు ఖండానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆఫ్రికా దట్టమైన అడవుల్లోకి పయనిస్తుంది. అంతటితో అయిపోలేదు.. అక్కడి నుంచి సమయాన్ని కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తిప్పుతూ.. ప్రాచీన రోమన్ సామ్రాజ్యం కాలానికి తీసుకెళ్తుంది. చివరికి మళ్లీ కథ వారణాసిలోనే ముగుస్తుంది. ఇంతటి సుదూర ప్రయాణాన్ని, విభిన్నమైన ప్రపంచాలను ఒకే కథలో బంధించడం కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే అద్భుతం. ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. అంతేకాదు, సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సుల షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. కేవలం మిగిలిన 20 శాతం చిన్న చిన్న సీన్లు, క్యారెక్టర్ డ్రామా సీన్స్ మాత్రమే ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. వారణాసి టీజర్ పై కూడా రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను టీజర్‌లో కథను ఎక్కువగా రివీల్ చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే కొన్ని సెకన్ల వీడియోతో ఈ సినిమా స్థాయికి న్యాయం చేయలేము. అందుకే కథను రివీల్ చేయకుండా, ప్రేక్షకులు థియేటర్లలో ఎలాంటి అద్భుతమైన అనుభూతిని పొందబోతున్నారో చూపించడానికే ఆ ప్రత్యేక వీడియోను రూపొందించాం" అని జక్కన్న స్పష్టం చేశారు. ఇక ఈ సినిమా విజువల్ ఎక్స్‌పీరియన్స్ గురించి రాజమౌళి చెప్పిన విషయాలు మైండ్ బ్లోయింగ్. అంటార్కిటికాలో ఉండే 300 అడుగుల ఎత్తైన మంచు కొండలు, ప్రాచీన రోమ్‌లోని వేలాదిమంది సైనికులతో కూడిన మహా రణరంగం.. వీటి పరిమాణాన్ని, ఆ గంభీరతను సాధారణ స్కీన్ల మీద చూపిస్తే ఆ ఇంపాక్ట్ రాదు. అందుకే ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన IMAX ఆస్పెక్ట్ రేషియో (IMAX Aspect Ratio) ని ఎంచుకున్నట్లు వెల్లడించారు.  మొత్తానికి రాజమౌళి మాటలను బట్టి చూస్తే.. 'వారణాసి' మూవీ మనం ఊహించిన దానికంటే బిగ్ స్కేల్ లో ఉండబోతుందని అర్థమవుతోంది.     Varanasi, SS Rajamouli, Mahesh Babu  
2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత హీరో నితిన్ బాక్సాఫీస్ దగ్గర హిట్ చూడలేదు. సరైన సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నితిన్.. గతేడాది వచ్చిన 'తమ్ముడు' సినిమాతోనూ నిరాశపరిచాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని, కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్యపై భారం వేశాడు. "నా భార్య.. నా వైఫ్" అంటూ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో నితిన్ హీరోగా ఒక సరికొత్త సినిమా అనౌన్స్ అయింది. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాని సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు. ఈ చిత్రానికి 'అలియాస్ రుక్మిణీ' అనే డిఫరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేస్తూ.. తాజాగా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. నాని వాయిస్ తో రూపొందించిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. "దేని గురించి ఈ కథ" అని నాని అడగగా.. "కృష్ణ గురించి" అని దర్శకుడు చెప్తాడు. కానీ, స్క్రీన్ మాత్రం రుక్మిణి పేరుతో పలు పుస్తకాలు దర్శనమిస్తాయి.  దాంతో "ఇది కృష్ణ కథ అన్నావ్. అసలు ఈ రుక్మిణీ ఎవరు?" అని నాని అడుగుతాడు. పుస్తకాల దగ్గర పడుకొని ఉన్న నితిన్.. నిద్ర లేచి, కళ్లద్దాలు పెట్టుకొని "నా భార్య.. నా వైఫ్" అని చెబుతాడు.  'అలియాస్ రుక్మిణీ' టైటిల్ గ్లింప్స్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా ఉంది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఈ గ్లింప్స్ కి మరింత అందాన్ని తీసుకొచ్చింది. త్వరలోనే  'అలియాస్ రుక్మిణీ' షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో నితిన్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.     Alias Rukmini, Title Glimpse, Nani, Nithiin  
పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' నుంచి 'తబాహి' అనే సాంగ్ బయటకొచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ సాంగ్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మధ్య ఉన్న కొన్ని ఇంటిమేట్ సీన్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. పెళ్లైన ఒక మహిళ అయ్యుండి కియారా ఇలాంటి సీన్స్ ఎలా చేస్తుంది అని కొందరు నీతులు చెబుతూ.. ఆమెతో పాటు, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రాను కూడా టార్గెట్ చేస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పాటలో నటించిన మన హీరో యశ్ కి కూడా పెళ్లై పిల్లలు ఉన్నారు. కానీ ఆయన విషయంలో ఎవరూ ఒక్క మాట కూడా అనడం లేదు. మరి అదే సీన్‌లో కనిపించిన కియారాను మాత్రం ఎందుకు వేధిస్తున్నారు? ఈ జెండర్ డబుల్ స్టాండర్డ్స్‌పై ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ వివాదంపై ప్రముఖ నటి, ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న హుమా ఖురేషి ఘాటుగా స్పందించారు. ఒక ప్రముఖ టాక్ షోలో మాట్లాడిన హుమా ఖురేషి.. ఈ రకమైన ట్రోలింగ్‌ను "సిక్ అండ్ డిస్‌గస్టింగ్" అని అభివర్ణించారు. సమాజంలో కొంతమంది మనస్తత్వం ఎంత దారుణంగా ఉందో ఈ ట్రోల్స్ నిరూపిస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హుమా ఖురేషి మాటల్లోనే చెప్పాలంటే.. "ఈ రకమైన నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్న జనాన్ని మనం మాటలతో మార్చలేం. దానికి వివరణలు ఇచ్చుకుంటూ కాలయాపన చేయడం అనవసరం. అసలైన సమాధానం ఆగస్టు 26న థియేటర్లలో 'టాక్సిక్' సినిమా రూపంలో వస్తుంది. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ప్రదర్శించిన ప్రతిభతో వీరందరికీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇస్తారని, చివరికి విజయానందం మాదే" అన్నారు. నిజ జీవితంలో సమాజం ఎంతో దయతో కూడుకుని ఉన్నప్పటికీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచం మాత్రం చాలా విషపూరితంగా తయారైందని ఆమె ఆవేదన చెందారు. అంతేకాకుండా, ఈ సినిమాలో నటించిన విదేశీ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా కియారా అద్వానీకి మద్దతుగా నిలిచారు. "నటుల పని ఒక కథలోని పాత్రలకు జీవం పోయడం. కెమెరా ముందు అలా కనిపించడం వారి వృత్తిధర్మం. యశ్ కి పెళ్లై పిల్లలు ఉన్నప్పుడు లేని అభ్యంతరం, కియారా విషయంలోనే ఎందుకు వస్తోంది? పురుషుడికి ప్రశంసలు, స్త్రీకి నిందలా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు.  కేజీఎఫ్ తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో 'టాక్సిక్'పై భారీ అంచనాలు ఉన్నాయి. కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి లాంటి ప్రముఖ తారగణంతో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.     Toxic Movie, Tabaahi Song, Yash, Kiara Advani, Huma Qureshi
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. విలక్షణమైన పాత్రలతో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆయన, ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ పై విజయ్ సేతుపతికి ఉన్న అపారమైన గౌరవం మరియు అభిమానం ఈ వ్యాఖ్యల ద్వారా మరొకసారి ప్రతిబింబించింది. ఇటీవల జరిగిన ఒక ముఖ్యమైన వేడుకలో విజయ్ సేతుపతి పాల్గొని, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంచలనాత్మక చిత్రం 'జైలర్ 2'లో తాను ఒక ప్రత్యేక అతిథి పాత్రలో ఎందుకు నటిస్తున్నానో బహిరంగంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి విజయ్ సేతుపతి చాలా కాలం క్రితమే సినిమాల్లో అతిథి పాత్రలు లేదా క్యామియో రోల్స్ చేయడాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. హీరోగా వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న సమయంలో ఇతర సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం తన సొంత సినిమాల మార్కెట్‌పై ప్రభావం చూపుతుందనే ఆలోచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఏదైనా సినిమాలో ఒక స్టార్ హీరో అతిథి పాత్ర పోషిస్తే, ప్రమోషన్ల సమయంలో పోస్టర్లపై ఆ అతిథి నటుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దీనివల్ల ఆయన ప్రధాన కథానాయకుడిగా నటిస్తున్న ఇతర చిత్రాల బిజినెస్ మరియు ప్రేక్షకుల్లో ఉండే అంచనాలపై స్పష్టమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ సాంకేతిక మరియు వ్యాపారపరమైన కారణాల దృష్ట్యా ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్యామియోలు చేయకూడదని ఆయన చాలా గట్టిగా నిశ్చయించుకున్నారు. అయితే, ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని కూడా విజయ్ సేతుపతి ఒక్క వ్యక్తి కోసం బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఆ ఏకైక వ్యక్తి భారతీయ సినీ జగత్తును ఏలుతున్న ఏకైక సూపర్ స్టార్ రజనీకాంత్. 'జైలర్ 2' సినిమాలో రజనీ సార్ సరసన మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశం రాగానే విజయ్ సేతుపతి తన పాత నిబంధనలన్నింటినీ పక్కనపెట్టి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ, ఒక పబ్లిసిటీ పోస్టర్‌పై రజనీ సార్ ఫోటోతో పాటు నా ఫోటో ఉంటే, సహజంగానే ప్రతి ఒక్కరి దృష్టి మరియు దృష్టి కోణం కేవలం రజనీ సార్‌పైనే ఉంటుంది తప్ప నన్ను ఎవరూ ప్రత్యేకంగా గమనించరని, అందుకే ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి భయాలు లేదా సందేహాలు లేవని చాలా వినమ్రంగా చెప్పారు. రజనీ సార్ లాంటి మహానటుడితో కలిసి పనిచేసే ప్రతీ క్షణం ఒక గొప్ప అనుభవమని, ఆయన పక్కన నటించే అవకాశం వస్తే ఏ నియమాన్నైనా సంతోషంగా పక్కన పెట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. గతంలో రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'పేట' చిత్రంలో విజయ్ సేతుపతి శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను, విమర్శకులను విశేషంగా మెప్పించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సూపర్ స్టార్ కోసం తన సొంత నిబంధనను పక్కనబెట్టి 'జైలర్ 2'కు సైన్ చేయడం చూసి సినీ అభిమానులు విజయ్ సేతుపతి యొక్క సమర్పణ భావాన్ని మరియు వినయాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన మొదటి భాగం 'జైలర్' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా అపారమైన కలెక్షన్లను రాబట్టి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న ఈ భారీ సీక్వెల్ 'జైలర్ 2' పై కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులలో మరియు చిత్రసీమలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ అద్భుతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్, విజయ్ సేతుపతి కాంబినేషన్ మళ్లీ వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.     Vijay Sethupathi, Rajinikanth, Jailer 2
చిత్రసీమలో ఒక్కోసారి కొన్ని సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, చెప్పలేని భావోద్వేగాలను కూడా మోసుకొస్తాయి. అలాంటి ఒక అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టానికి ప్రస్తుతం టాలీవుడ్ వేదికవుతోంది. నాగార్జున హీరోగా 2010లో వచ్చిన 'కేడీ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తనదైన స్టైలిష్ మేకింగ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) మనమధ్య లేకపోయినా, ఆయన కన్న కల మాత్రం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కావడానికి సిద్ధమైంది. గతేడాది 2025 డిసెంబర్‌లో ఆయన అకాల మరణం చెందగా, ఆయన మరణించిన దాదాపు 8 నెలల తర్వాత ఆయన ఆఖరి డ్రీమ్ ప్రాజెక్ట్ థియేటర్లలోకి వస్తుండటం సినీ ప్రియులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది. దివంగత దర్శకుడు కేకే తెరకెక్కించిన ఈ చివరి చిత్రం పేరు 'KJQ' (కింగ్ – జాకీ – క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఒక పవర్ ఫుల్ పీరియడ్ క్రైమ్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించారు. నాచురల్ ఎమోషన్స్, తీవ్రమైన మానసిక సంఘర్షణలు మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్ కలయికతో రూపొందిన ఈ చిత్రంపై కేకే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టాలెంట్ ఉన్నప్పటికీ మొదటి సినిమా ప్లాప్ కావడంతో సరైన అవకాశాలు రాక, ప్రముఖ దిగ్గజ దర్శకుడు మణిరత్నం వద్ద పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, చాలా ఏళ్ల విరామం తర్వాత ఈ 'KJQ' ద్వారా పరిశ్రమలో మళ్లీ ఒక గ్రాండ్, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. ఈ సినిమాలో 'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రతిభావంతుడైన నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా, 'మార్కో' మరియు 'కే - ర్యాంప్' ఫేమ్ యుక్తి తరేజా కథానాయికగా నటించింది. అంతేకాకుండా 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల కూడా ఈ చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఎస్.ఎల్.వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించారు. పూర్ణచంద్ర తేజస్వి అద్భుతమైన సంగీతాన్ని అందించగా, నాగేష్ బనెల్ సినిమాటోగ్రఫీ మరియు శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ మూవీని ఈ ఏడాది ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అత్యంత ఘనంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్నేహితుల దినోత్సవం (Friendship Day) సందర్భాన్ని పురస్కరించుకుని సినిమాలోని ప్రత్యేకమైన 'నువ్వే తోపు' అనే సాంగ్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. స్నేహం యొక్క విలువను చాటిచెప్పేలా ఉన్న ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గతంలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో దర్శకుడు కేకే ఈ చిత్రం అవుట్‌పుట్ పట్ల ఎంతో ధీమా వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తూ సినిమా విడుదల చూసేలోపే ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు. కిరణ్ కుమార్ క్రియేటివిటీకి, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఒక గొప్ప నివాళిగా ఈ 'KJQ' నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. టీజర్, ట్రైలర్‌తో ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ఆఖరి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.
Cast: Dora Sai Teja, Nithin Prasanna, Prakash Thakur Crew: Written by Vijay Kumar, Aditya Devulapally Cinematography by Aswin Lenin Music by Rishi M Directed by Aditya Devulapally   For a long time, vertical dramas were simply seen as quick, disposable content. Dhandha confidently steps in to change that conversation entirely, proving it is proper cinema meant for a mobile screen. Spread across 26 short episodes with a total runtime of just 64 minutes, it understands momentum perfectly and never loses its grip on the viewer. Let's discuss about this gripping series.   Plot: Aravind (Dora Sai Teja) is a brilliant 22-year-old B.Tech student who is deeply obsessed with money and power. He quickly discovers that his intelligence is much more valuable in Hyderabad's dark cybercrime ecosystem than in a normal classroom. What begins as a simple game of manipulation soon grows into a large, organized network of phishing scams, illegal call centers, extortion, and gang politics. Will his dangerous ambition take him to the top? Watch the series to know more.   Analysis: Dora Sai Teja is absolutely stunning in the role of Aravind. He completely disappears into the character, playing a calm, manipulative, and arrogant anti-hero without ever becoming annoying. It is a commanding performance that proves he is much more than just a popular YouTube star. Nithin Prasanna makes a solid mark as Aditya Singh, providing a great counterbalance, while Prakash Thakur is highly memorable as a local gangster. Debut director Aditya Devulapally handles the series with wonderful confidence. He never treats the vertical format as a limitation, giving the show the grand visual scale of a theatrical crime drama. The screenplay by Vijay Kumar and Aditya is extremely engaging, using fourth-wall narration effectively to pull the audience into continuous criminal mind games. Technically, the series punches way above its weight. Aswin Lenin's cinematography gives a moody, atmospheric look to Hyderabad's underbelly. Rishi M's background score is a major highlight, constantly building tension and elevating the overall attitude of the show. The climax is emotionally satisfying while setting up genuine anticipation for the second season.   Positives: Dora Sai Teja's brilliant performance. Strong and highly confident direction. Gripping cybercrime plot and mind games. Excellent background score by Rishi M. Cinematic visual quality in a vertical format. Negatives: The total 64-minute runtime leaves you wanting more. Major character conflicts are held back for Season 2.   Bottomline: A stylish crime thriller that uses vertical content format to good use.    Rating: 2.75/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.  చాణక్య నీతిలో ఆయన చెప్పిన విషయాలు నేటికీ ప్రజలు ఆచరించదగిన  విధంగా ఉన్నాయి.  మనిషి జీవితంలో ఆప్తులకు,  సన్నిహితులకు, స్నేహితులకు.. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు.  వీటి కారణంగా జీవితంలో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది.  ముఖ్యంగా ఎవరితోనూ షేర్ చేసుకోకూడని విషయాలు కొన్ని ఉంటాయి.  ఆ విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల లైఫ్ బిందాస్ గా ఉంటుందట. నలుగురిలో గౌరవంగా, మర్యాదగా,  బిందాస్ గా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన నాలుగు విషయాలు తప్పక పాటించాలి. అవేంటో తెలుసుకుంటే..  ఆర్థిక నష్టాలు.. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో  పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లితే  ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు తన సిద్ధాంతంలో చెబుతాడు.  ఆర్థిక పరిస్థితి బలహీనపడినప్పుడు చుట్టూ ఉన్నవారు మెల్లిగా దూరం జరుగుతారు,  పైగా గౌరవించడం కూడా మానేస్తారు. అందుకే ఆర్థికంగా నష్టపోతే ఎవరికీ చెప్పకూడదు. ఇంటి గొడవలు.. ఇంట్లో గొడవ జరిగినా లేదా కుటుంబ సభ్యులతో  అభిప్రాయ భేదం వచ్చినా, ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. కుటుంబ తగాదాలను గోప్యంగా ఉంచుకోవాలి. కుటుంబ తగాదాలను ఇతరులతో పంచుకోవడం వల్ల, దాన్నే అదనుగా తీసుకుని సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించేవారు చాలా మంది ఉంటారు. ఇది  జీవితంలో తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అవమానం.. సమాజంలో మిమ్మల్ని ఎవరైనా అవమానించినా లేదా మాటలతో ఎవరైనా మిమ్మల్ని దూషించినా, ఆ విషయాన్ని  ఎదుటి వ్యక్తితో ఎప్పటికీ పంచుకోకూడదు. ఒకవేళ  ఆ అవమానం గురించి ఎవరికైనా చెబితే, ఆ వ్యక్తి మిమ్మల్ని గౌరవించడం మానేసే అవకాశం ఉంది. పైగా వాళ్లు అన్నప్పుడు లేని నొప్పి నేను అనగానే ఎందుకొచ్చింది వంటి మాటలు కూడా అంటారు. అందుకే  జీవితంలో ఎదురైన అవమానాల గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు.  ప్రణాళికలు..   ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం  పనిలో విజయం సాధించాలనుకుంటే చేయబోయే పనుల ప్రణాళికలు ఎవరికీ చెప్పకూడదు.  ఎవరైనా ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు,  తరచుగా తమ ప్రణాళికను ఇతరులతో షేర్ చేసుకుంటారు. కానీ కొందరు ఇలా గోల్స్ పెట్టుకున్న వారిని ఎగతాళి చేస్తారు, మరికొందరు మాటల ద్వారా  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి దానిని సాధించకుండా అడ్డుకుంటారు.                                 *రూపశ్రీ
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు చాలా వరకు స్నేహితులు,  బంధువులు, సన్నిహితులు,  ఆఫీసు కొలీగ్స్.. ఇలా చాలామందిని అప్పు అడుగుతూ ఉంటాం.  అలాగే వారు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. కానీ నేటికాలంలో డబ్బు తీసుకున్నంత సులువుగా దాన్ని తిరిగి ఇవ్వరు.  పైగా డబ్బు తీసుకుని.. ఇస్తాంలే ఎక్కడికి పోతాం.. అని దబాయించే వారు కూడా ఉంటారు. ఈ కారణంగానే కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే చాలా భయం వేస్తుంది.  కానీ ఎవరైనా అప్పు అడిగినప్పుడు.. లేదు అని చెప్పడం చిన్న పదమే అయినా.. అది తగిన కారణంగా కనిపించదు.  లేదని చెప్పినా కొందరు పదే పదే అప్పు కావాలని, ఎవరితో అయినా అప్పు ఇప్పించమని కూడా అడుగుతుంటారు.  అప్పు ఇవ్వడం అనే సమస్య నుండి తప్పించుకోవడం,  ఎదుటి వ్యక్తితో ఉన్న సంబంధం ఏదీ పాడు చేసుకోకుండా ఉండటం కత్తిమీద సాము లాంటిది.  ఎవరైనా అప్పు అడిగితే.. వారు బాధపడకుండా లేదని చెప్పడానికి కొన్ని మార్గాలు  ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. వెంటనే సమాధానం ఇవ్వకూడదు.. ఎవరైనా అకస్మాత్తుగా డబ్బు అడిగినప్పుడు, ఆలోచించకుండా వెంటనే "అవును" లేదా "కాదు" అని చెప్పకుండా, కొంత సమయం తీసుకోవాలి. ఆ తరువాత ఎదుటివారితో మర్యాదగా "నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఈ నెలకు నా బడ్జెట్ , బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలి" అని చెప్పవచ్చు. ఇలా చెప్తే.. మీరే ఆర్థికంగా డబ్బుకు వెతుక్కుంటున్నారని అప్పు అడిగిన వారు అర్థం చేసుకుంటారు. ఇలా సమయం అడగడం వల్ల  ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది, ఒకవేళ  తర్వాత లేదని చెప్పాల్సి  వచ్చినా..  ఎదుటి వారు అపార్థం చేసుకోరు. ఎందుకంటే అడిగిన వెంటనే లేదని చెప్తే.. అప్పు అడిగిన వారు అపార్థం చేసుకుంటారు. అప్పు సూత్రం.. ఎవరైనా అప్పు అడిగినప్పుడు వారికి లేదని చెప్పడం కంటే.. అప్పు సూత్రం పాటించడం మంచిది.  అప్పు సూత్రం ప్రకారం.. ఎవరికీ అప్పు ఇవ్వడం అనేది పెట్టుకోకూడదు.  ఎలాంటి పరిస్థితులలో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు.  అప్పు అనే కారణం వల్ల సంబంధాలు నాశనం అవుతాయి.  అప్పు తీసుకున్నవారు కొన్నిసార్లు తిరిగి ఇవ్వలేకపోతే.. అప్పు ఇచ్చిన వారు చాలా బాధపడాల్సి వస్తుంది.  డబ్బు అనేది అంత సులువుగా లభించేది కాదు.  కాబట్టి అప్పు అనే కారణంతో సంబంధాలు పాడు చేసుకోను,  ఎవరికీ అప్పు ఇవ్వకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాలి.  ఇలా చెప్తే ఎదుటి వారు సంబంధాలకు విలువ ఇచ్చేవారు అయితే.. అర్థం చేసుకుంటారు. బాధ్యతలు, ఖర్చులు వివరించడం.. ప్రతి ఒక్కరికీ బాధ్యతలు ఉంటాయి. ఎవరైనా అప్పు అడిగితే, పరిస్థితిని వివరించవచ్చు. పిల్లల ఫీజులు కావచ్చు, ఆరోగ్య సమస్యల ఖర్చులు కావచ్చు,  బ్యాంకు లోన్లు కావచ్చు, అప్పులు కావచ్చు.. వాటిని వివరించి అప్పు ఇవ్వలేనని చెప్పవచ్చు. ఇలా సమస్యల గురించి చెబితే.. వివేకవంతుడైన మనిషి ఎవరైనా అర్థం చేసుకుంటారు. ప్రత్యామ్నాయ సహాయం.. చాలామంది డబ్బు అప్పుగా అడిగినప్పుడు.. అప్పు అడిగినవారు నిజంగా అవసరంలో ఉండి, మీరు అప్పు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే.. డబ్బు కాకుండా ఏదైనా పనుల రూపంలో డబ్బు వచ్చే మార్గంలో సహాయం చేయవచ్చు. ఆ పనుల ద్వారా వారికి డబ్బు సహాయం అందితే అప్పు అడిగిన వారు కూడా చాలా తృప్తి పడతారు. ఆరోగ్య సమస్యల కోసం డబ్బు అవసరమైన వారికి స్వచ్చంద సంస్థల నుండి డబ్బు ఇప్పించడం,  ఎవరైనా సహాయం చేసే వారి గురించి చెప్పడం లాంటివి చేయవచ్చు.  దీని వల్ల వారికి అవసరం తీరుతుంది. లేదని చెప్పడం.. కొన్నిసార్లు దాటవేసి మాట్లాడటం కంటే, నిజం సూటిగా చెప్పడమే మేలు. అయితే చెప్పే విధానం చాలా గౌరవంగా,  మర్యాదగా ఉండాలి. చెప్పడానికి నాకు బాధగానే ఉంది కానీ  నేను అప్పు ఇచ్చేంత ఆర్థిక స్థితిలో లేను అని సున్నితంగా ఎదుటివారిని నొప్పించకుండా చెప్పవచ్చు.. ఈ విషయం గుర్తుంచుకోవాలి.. చాలామంది అప్పు అడగగానే చాలా చులకనగా,  చిరాకుగా, కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటారు.  కానీ ఇలా చేయడం తప్పు.. అప్పు అడిగిన వారు అవసరంలో అడుగుతారు.. వారికి మర్యాదగా,  గౌరవంగా సమాధానం చెప్పాలి.                                       *రూపశ్రీ.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు. పిల్లలను పెంచడం అంటే కేవలం వారిని పెంచడం మాత్రమే కాదు,అందుకోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండాలి, ఇందుకోసం సహనం కూడా చాలా అవసరం.  ఈ విషయాన్ని చాలామంది  తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. పిల్లలలో మంచి విలువలు, క్రమశిక్షణను పెంపొందించడం గురించి మాట్లాడినప్పుడల్లా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు అనుసరించే పిల్లల పెంపకం విధానాల గురించి మాట్లాడుతుంటారు.. అయితే జపాన్ ప్రజలు అనుసరించే విధానాలు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటాయి.  పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా పిల్లలను క్రమశిక్షణలో ఉంచడం జపాన్ దేశీయుల ప్రత్యేకత.. అందుకోసం వారు ఏం చేస్తారో.. పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా ఎలా క్రమశిక్షణలో ఉంచాలో తెలుసుకుంటే.. పిల్లలను  క్రమశిక్షణతో పెంచే జపనీస్ పెంపకం నియమాలు.. జపాన్ దేశం చాలా వేగంగా అభివృద్ది చెందుతోంది.   పిల్లల పెంపకం విషయంలో కూడా జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ దేశంలోని ప్రజలు పిల్లల పెంపకంలో ఒక పద్ధతిగా మైండ్‌ఫుల్‌నెస్‌ను ఉపయోగిస్తారు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి ఐదు పెంపక నియమాలను పాటిస్తారు. ఇతరులకు మర్యాద ఇవ్వడం.. జపాన్‌లో పిల్లలకు ఎంత చిన్నవారైనా సరే, మొదటి నుంచే ఇతరులను మర్యాదగా పలకరించడం నేర్పిస్తారు. ఈ పద్ధతి ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రవర్తించినప్పుడు, పిల్లలు  సహజంగానే క్రమశిక్షణను నేర్చుకుంటారు. ఇతరుల ఎమోషన్స్  పట్టించుకోవడం.. జపాన్ సామూహిక అవగాహనను పాటిస్తుంది, ఇది వ్యక్తులను క్రమశిక్షణతో ఉండేలా చేసే ఒక నియమం. ఇది ఒకరి ప్రవర్తన గురించి వారికి అవగాహన కల్పించడానికి, తమ ఎమోషన్స్ తో పాటు ఇతరుల ఎమోషన్స్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతుంది.  దీని వల్ల కేవలం అందరికీ ఒకరి గురించి మరొకరు మీద శ్రద్ద,  గౌరవం ఏర్పడతాయి. ఇంట్లోకి వచ్చే ముందు షూ విప్పడం.. జపనీస్ జీవనశైలిలో ఇంటి బయట బూట్లు విప్పాలనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తారు. ఇక్కడి ఇళ్లకు 'జెంకెన్' అని పిలువబడే ఒక ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంటుంది. అతిథులు , కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ ద్వారం వద్ద తమ బూట్లను తప్పనిసరిగా విప్పాలి. ఈ ఆచారం వెనుక  ఇంటి పరిశుభ్రత , మనస్సు  స్వచ్ఛతగా ఉండటం వంటి కారణాలు ఉంటాయట. ఒకసారి ఒక పనినే చేయడం.. పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడానికి, వారు ఒకేసారి అనేక పనులు చేయకుండా, ఒకే పనిపై దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల పిల్లల ఆసక్తి, శ్రద్ద, పనులలో ఫలితాలు మెరుగ్గా ఉండటం వంటివే  కాకుండా, వారి వినికిడి, దృష్టి , గ్రహణశక్తి కూడా రెట్టింపు అవుతాయి.                                  *రూపశ్రీ.  
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం. అయితే పేరు అనేది కేవలం పిలవడానికి మాత్రమే కాకుండా, వ్యక్తి జీవితంపై, వ్యక్తిత్వంపై, ఆలోచనా విధానంపై కూడా ప్రభావం చూపుతుందని భారతీయ సనాతన సంప్రదాయం చెబుతోంది. ఈ భక్తివన్ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డా. అనంత లక్ష్మి గారు, పిల్లలకు పేరు ఎలా ఎంపిక చేయాలి, నామకరణంలో పాటించాల్సిన శాస్త్ర నియమాలు, జన్మ నక్షత్రం ఆధారంగా పేరు ఎందుకు పెట్టాలి, పేరుకు ఉన్న ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ ప్రాముఖ్యత వంటి అనేక ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తారు. అలాగే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు పేరు ఎంపికలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందిస్తున్నారు. పిల్లలకు పేరు పెట్టాలని ఆలోచిస్తున్న ప్రతి తల్లిదండ్రులు, అలాగే హిందూ ధర్మం, నామకరణ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా పంచుకోండి. ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, దేవాలయాల మహిమ, పండుగల ప్రాముఖ్యత కోసం మా Bhakthi One యూట్యూబ్ ఛానల్‌ను సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. చిట్బొట్ల మధుసూదన్ శర్మ మోకాళ్ల నొప్పిని తగ్గించేందుకు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక సహజమైన చిట్కాను వివరించారు. కేవలం మూడు సాధారణ వంటింటి పదార్థాలు అయిన వెల్లుల్లి, పసుపు, నూనెతో తయారయ్యే ఈ మిశ్రమాన్ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు రాయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను స్పష్టంగా వివరించారు. ఈ చిట్కా మోకాళ్ల నొప్పి, కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడవచ్చని ఆయన తెలిపారు. అయితే ఫలితాలు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి మారవచ్చు. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక నొప్పి ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: • మోకాళ్ల నొప్పికి సహజమైన ఇంటి చిట్కా • వెల్లుల్లి, పసుపు, నూనెతో మిశ్రమం తయారీ విధానం • రాత్రి ఎలా ఉపయోగించాలి? • ఈ చిట్కా వల్ల కలిగే ప్రయోజనాలు • ఎవరెవరు ఉపయోగించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ల ఆరోగ్యం, కీళ్ల సంరక్షణ, సహజ వైద్య చిట్కాలు మరియు ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి.