LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన దక్షిణ కొరియా పర్యటన అద్భుత విజయాలను సాధించింది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో  పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలలో ప్రపంచ స్థాయి కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు ఖరారయ్యాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది.. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీలో 5 వేల కోట్ల రూపాయల  పెట్టుబడితో   తన మూడో భారతీయ ఉత్పాదక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికే ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభం కానుండగా, దీని ద్వారా  పదిహేనువందల మంది ఐటీ, ఎలక్ట్రానిక్స్ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే  వైజాగ్ వేదికగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీపీ) ఏర్పాటు చేయాల్సిందిగా ఎల్‌జీ ప్రతినిధులను లోకేష్ కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా సెమీకండక్టర్ రంగంలో అగ్రగామిగా ఉన్న అపాక్ట్  వైజాగ్ వేదికగా ఏసిప్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో   468 కోట్ల పెట్టుబడితో  ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ కేంద్రం ద్వారా ఏడాదికి 96 మిలియన్ల సెమీకండక్టర్ పరికరాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనితో పాటు ఏపీ యువతకు సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్  సాంకేతికతల్లో నైపుణ్య శిక్షణ అందించేందుకు అపాక్ట్ అంగీకరించింది. ఆటోమొబైల్,  స్మార్ట్ హెల్త్‌కేర్ విభాగాలలో కూడా ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రముఖ కొరియన్ ఆటోమొబైల్ టెక్నాలజీ దిగ్గజం హ్యుందాయ్ మోబిస్  ప్రతినిధులతో లోకేష్ జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి.  తిరుపతి లేదా అనంతపురం పరిసనాలకల్లో..  ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ యూనిట్‌తో పాటు రాష్ట్రంలో ఈవీ సెమీకండక్టర్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి హ్యుందాయ్ హెబిస్ ముందుకు వచ్చింది.   అలాగే రూ. 300 కోట్ల పెట్టుబడితో సరికొత్త స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్ ఉత్పాదక రంగాన్ని ప్రారంభించేందుకు షూఆల్స్  సంస్థ ముందుకొచ్చింది. దీని ద్వారా రాష్ట్రంలో 3 వేలకు పైగా  కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. వీటితో పాటు సోలమ్ గ్రూప్   శ్రీసిటీలో  338 కోట్ల రూపాయల అంచనాతో ఈవీ ఛార్జర్ పవర్ మోడ్యూల్స్,  ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సౌకర్యాన్ని వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో స్టార్టప్ ఇకోసిస్టమ్‌ను పటిష్టం చేసేందుకు అమరావతి వేదికగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్  ద్వారా వచ్చే ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లను సృష్టించి, ఒక లక్ష ఉద్యోగాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ ప్రకటించారు.  వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ అనే అద్భుతమైన విజన్‌తో కొరియా దేశపు ఇన్నోవేటివ్ స్టార్టప్‌లను ఏపీకి ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఇండియా, కొరియా స్టార్టప్ కారిడార్, అలాగే  ప్రత్యేక కొరియా డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. అమరావతిని క్వాంటం మరియు ఏఐ క్యాపిటల్‌గా మార్చేందుకు సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌ను డేటా సెంటర్లు, ఏఐ సర్వర్ల ఏర్పాటుకు ఆహ్వానించారు. మొత్తంగా గత 24 నెలల్లో దాదాపు 240 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ కీలక ప్రగతి సాధించిందని, ఈ కొరియా పర్యటన రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని లోకేష్ పేర్కొన్నారు. Nara Lokesh South Korea Tour, AP Investments 2026, LG Sri City Plant, APACT Semiconductor AP
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంఒక వినూత్న తరహా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా..  ఈసారి హైదరాబాద్ నగర పరిధిలోని మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  ఒకవేళ ఇదే జరిగితే..  సైబరాబాద్,  మల్కాజ్‌గిరి కంటే ముందే జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎన్నికలను నవంబర్ నెలలో నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నప్పటికీ, అధికారిక షెడ్యూల్,  తుది తేదీలపై  స్పష్టత రావాల్సి ఉంది. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. 2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ   బీఆర్ఎస్   ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ   48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం  44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో తీవ్ర మార్పు చోటు చేసుకుంది.   ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.  ఈ నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలూ..  గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే తెరవెనుక వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.  ఒకేసారి ఎన్నికలు పెడితే యంత్రాంగంపై పడే భారం..  శాంతిభద్రతల సమస్యలు, రాజకీయంగా వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం  జీహెచ్ఎంసీకి విడతల వారీ ఎన్నికల ప్లాన్ ను తెరపైకి తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా ఐటీ హబ్ అయిన సైబరాబాద్, అత్యంత పెద్ద నియోజకవర్గ పరిధి కలిగిన మల్కాజ్‌గిరిలను పక్కన పెట్టి, మొదట కోర్ సిటీ అయిన జీహెచ్ఎంసీపైనే ఫోకస్ పెట్టడం వెనుక  పెద్ద వ్యూహమే ఉందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.   Hyderabad Municipal Elections, GHMC Polls 2026, Telangana Political News, Cyberabad Elections
మండల అధ్యక్ష పదవులు కాంగ్రెస్ లో చిచ్చు రేపాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ లో రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు తెగబడ్డాయి. విషయం ఏమిటంటే..   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకాలపై చెలరేగిన అసంతృప్తి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.  మండల అధ్యక్షుల నియామకాలను వ్యతిరేకిస్తూ అసమ్మతి వర్గం చలో గాంధీభవన్‌కు బయలుదేరింది. ఈ వర్గాన్ని  అర్వపల్లి చౌరస్తా వద్ద ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్యా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. లాఠీ చార్జితో పరిస్థితిని అదుపు చేశారు.  ఈ ఘటనతో అర్వపల్లి చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   conflict among Congress factions, flare up over posts, Suryapet district, Arvapalle, Stones, Sticks, Teluguone
వైసీపీలో అంతర్గత వైషమ్యాలు, కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీలో రెండు వర్గాలు రోడ్డున పడి కొట్టుకున్నాయి. వైసీపీ మహిళా కార్యకర్తలైతే జుట్టూ జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక పురుష క్యాడర్ చొక్కాలు చించుకుని మరీ వీరంగమాడారు. ఈ గొడవ ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ కార్యాలయం సాక్షిగా, అదీ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జరిగింది.  వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కాళ్లు తొక్కుతున్నారంటూ కొంతమంది పురుష క్యాడర్ ను నిలదీశారు. దీంతో అక్కడ రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలతో దాడులకు పాల్పడ్డారు.  మహిళలు జుట్టూజుట్టూ  పట్టుకుని కొట్టుకుంటే... పురుషులు చొక్కాలు చించుకున్నారు. దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో గందరగోళం ఏర్పడింది. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఘర్షణకి దిగడం చర్చనీయాంశంగా మారింది. YSR, Birth Anniversary, Ongole, Groups, Quarrel
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. గన్నవరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. అయితే, ఆయనపై కేవలం పవన్ కళ్యాణ్ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను దూషించారనే కారణంతోనే కాకుండా, అత్యంత కఠినమైన  ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. కేవలం దళిత క్రిస్టియన్ శంఖారావం సభలో మాట్లాడిన వ్యాఖ్యల కోణంలోనే కాకుండా..  ఆయన వెనుక ఉన్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో ఎండగట్టారు. గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం. ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో ఆయన విడుదల చేసిన కొన్ని వీడియోలను పోలీసులు పెన్ డ్రైవ్ రూపంలో న్యాయస్థానానికి సమర్పించారు. నిషేధిత సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు సంస్థకు చెందిన కేశవరావు, హిడ్మా వంటి అగ్రనేతలను కీర్తిస్తూ..  వారు అమరజీవులని, మళ్లీ పుడతారని, యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని రావణ్ వ్యాఖ్యానించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అమాయక గరిజన యువతను టార్గెట్ చేసుకుని దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించేలా ఈ ప్రసంగాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. ఈ పరిణామాలపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ  రామకృష్ణ తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఉపా' చట్టం కింద ఒకసారి కేసు నమోదైతే సాధారణ ఐపీసీ సెక్షన్లలాగా బెయిల్ రావడం సులభం కాదన్నారు. అయితే.. ఈ చట్టాన్ని శాంతిభద్రతలు సజావుగా ఉన్న ఏపీలో ప్రయోగించడం ఆందోళన కు గురిచేస్తోందనీ,  ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఒకరు నేరస్థుడిగా, మరొకరు ప్రజాసేవకుడిగా మారిపోయే సంప్రదాయం సరికాదన్నారు. ప్రస్తుతం ప్రశ్న రావణ్ ముందున్న ఏకైక మార్గం హైకోర్టును ఆశ్రయించడమేనన్న ఆయన..  ప్రశ్న రావణ్.. ఆయన తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్  దాఖలు చేసి, ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరే అవకాశం ఉందన్నారు. హైకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాల ద్వారా వీడియో కంటెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి..  ఒకవేళ ఆ ప్రసంగాల వల్ల సమాజంలో తక్షణ నష్టం లేదా హింస జరగలేదని భావిస్తే రావణ్‌కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని  రామకృష్ణ అభిప్రాయపడ్డారు.  Prashna Ravana Arrest AP, Former Judge Ramakrishna Interview,  UAPA Case Andhra Pradesh, Ravana Remand Report, AP Politics Telugu News  
ALSO ON TELUGUONE N E W S
  అఖిల్ అక్కినేని రేపు 'లెనిన్'తో సెల్యులాయిడ్ పై సత్తా చాటడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాత  వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ గా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్స్ ఇప్పటికే అఖిల్ కట్ అవుట్స్ తో నిండిపోవడంతో పాటు అఖిల్ నినాదాలతో మారుమోగిపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద లెనిన్ క్లీన్ హిట్ లేదా సూపర్ హిట్ హోదాని దక్కించుకోవాలంటే ఏ స్థాయిలో వసూళ్లని  రాబట్టాలనే లెక్కలపై ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.  ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అన్ని ఖర్చులు కలుపుకొని థియేట్రికల్ రన్‌లో సేఫ్ జోన్‌కు రావాలన్నా, సూపర్ హిట్ స్టేటస్ సాధించాలన్నా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లని రాబట్టాల్సి ఉంటుంది. షేర్ పరంగా చూసుకుంటే, డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చి లాభాల బాట పట్టడానికి కనీసం 25 కోట్ల రూపాయల మేర వరల్డ్‌వైడ్ షేర్ సాధించాల్సి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే థియేట్రికల్ విడుదలకు ముందే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా 34 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసి జాక్‌పాట్ కొట్టడం నిర్మాతలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. Also read: Rashmika: రష్మిక భారీ రిస్క్..ఫ్యాన్స్ కోసం 80 అడుగుల నుంచి దూకేసింది ఈ 34 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్‌లో డిజిటల్, శాటిలైట్ హక్కులని  ప్రముఖ సంస్థ జీ (ZEE) నెట్‌వర్క్ ఏకంగా 19 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోగా, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా మరో 9 కోట్ల రూపాయలు వచ్చాయి. అలాగే ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ-సిరీస్ 6 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆర్టిస్టుల పారితోషికాలు, ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషన్స్ అన్నీ కలిపి సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే ఈ స్థాయి రికవరీ రావడం గమనార్హం. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు కొన్ని డబ్బింగ్ చిత్రాల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, మొదటి రోజు థియేటర్లలో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం 50 కోట్ల రూపాయల గ్రాస్ టార్గెట్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , మనం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో లెనిన్ మీ అందరకి పరిచయం కాబోతున్నాడు.  akhil, lenin, nagarjuna, bhagyashri borse
  పెళ్లి తర్వాత అయినా సరే తగ్గేదెలే అంటూ రష్మిక వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంది. హజ్బండ్ విజయ్ దేవరకొండతో 'రణబలి' చేస్తుండగా తన లిస్ట్ లో ఉన్న మరో మూవీ 'మైసా'. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతుండగా రష్మిక గ్లామర్ రోల్ లో  కాకుండా, వ్యవస్థపై ధిక్కార స్వరం వినిపించే గోండు తెగకి చెందిన ఒక పవర్‌ఫుల్ గిరిజన మహిళగా, నక్సలైట్ క్యారక్టర్ కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. భావోద్వేగాలు, కోపం, ఆవేశం కలగలిపిన ఈ విలక్షణమైన రోల్ కోసం రష్మిక పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. 'మైసా' లో హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సహజత్వం కోసం రష్మిక మందన్న ఏకంగా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ డైరెక్టర్ ఆండిలాంగ్, అలాగే ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ పర్యవేక్షణలో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో వారం రోజుల పాటు ప్రత్యేక కంబాట్ శిక్షణ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె ప్రతిరోజూ ఏకంగా 8 గంటల పాటు కఠోర శ్రమతో కూడిన మార్షల్ ఆర్ట్స్, గిరిజనుల సాంప్రదాయ పోరాట విధానాలపై కసరత్తులు చేయడం విశేషం. శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా మారాలని నిర్ణయించుకుని ఈ రిస్క్ తీసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూల్‌ను కేరళలో పూర్తి చేశారు. కొచ్చిలోని దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, నిరంతరం కురిసే వర్షాల మధ్య దాదాపు 16 రోజుల పాటు ఈ యాక్షన్ షెడ్యూల్ సాగింది. ఈ షూటింగ్ సమయంలో రష్మిక నిజంగానే ప్రాణాలకు తెగించి సాహసాలు చేసింది. కేరళలోని ప్రసిద్ధ అతిరపల్లి జలపాతం వద్ద ఎలాంటి డూప్ సహాయం తీసుకోకుండా, ఏకంగా 80 అడుగుల ఎత్తు నుండి కిందకు జంప్ చేసి చిత్ర యూనిట్‌తో పాటు సినీ వర్గాలని  సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నీటిలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రష్మిక తన మోకాళ్లు, కాళ్లకు ప్రత్యేకమైన మెడికల్ టేపింగ్ వేసుకుని మరీ అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ పూర్తి చేసింది. Also read: మన్మధ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక యూత్ ని ఎవరు ఆపలేరు  ఈ కేరళ షెడ్యూల్ అనుభవాలను రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రకృతి అందాలు, జలపాతాల మధ్య సాగిన ఈ ప్రయాణం తనకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని, అయితే శారీరకంగా ఈ యాక్షన్ సీన్ల కోసం తాను ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తున్న 'మైసా' చిత్రం రష్మిక కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. గ్లామర్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ఆమె చేస్తున్న ఈ వీరోచిత పోరాటం వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.    
అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin). మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాలతో రేపు(జూలై 10) థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే ఈ సినిమా నుంచి మొదట హీరోయిన్‌గా అనుకున్న శ్రీలీలను ఉన్నట్టుండి మార్చేసి, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఈ హీరోయిన్ చేంజ్‌పై సోషల్ మీడియా వేదికగా రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. శ్రీలీలకు లక్ కలిసిరావడం లేదని, అందుకే సెంటిమెంట్ పరంగా ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారంటూ కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అఖిల్ అక్కినేని 'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఈ సినిమా చేయడంతో, ఈ హీరోయిన్ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని అక్కినేని అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో, 'లెనిన్' చిత్ర నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ హీరోయిన్ రీప్లేస్‌మెంట్ వివాదంపై, శ్రీలీలపై వస్తున్న నెగెటివ్ ట్రోల్స్‌పై స్పందిస్తూ అసలు నిజాన్ని చెప్పారు. ఒక మంచి సినిమా రూపొందే క్రమంలో కొన్నిసార్లు అన్నీ అనుకూలంగా కలిసి వస్తాయని, ఈ సినిమా టేక్ ఆఫ్ అయిన తర్వాత కూడా హీరోయిన్, కెమెరామన్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయని ఆయన అంగీకరించారు. అయితే సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా శ్రీలీల వల్ల సినిమాకు బ్యాడ్ జరుగుతుందనే పుకార్లలో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో పాపం శ్రీలీల తప్పేం లేదని, కేవలం డేట్స్ అడ్జస్ట్‌మెంట్ సమస్యల వల్లే శ్రీలీలను మార్చాల్సి వచ్చిందని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఇక ఫైనల్ ప్రొడక్ట్ చూసిన తర్వాత చిత్ర యూనిట్ అంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామని నిర్మాత పేర్కొన్నారు. కొన్ని సినిమాలకు మంచి జరగాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఊహించని మార్పులు సహజంగానే జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు స్క్రీన్ మీద భాగ్యశ్రీ బోర్సే పెర్ఫార్మెన్స్ చూసుకున్న తర్వాత.. అసలు ఈ పాత్రను దర్శకుడు మురళి కిషోర్ కేవలం ఆమె కోసమే రాశాడా అన్నంత అద్భుతంగా కుదిరిందని ప్రశంసించారు. భాగ్యశ్రీ ఈ సినిమాలో నటన పరంగా చాలా బాగా చేసిందని, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక పెద్ద అసెట్ కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నాగవంశీ ఇచ్చిన ఈ సాలిడ్ క్లారిటీతో శ్రీలీల ఎగ్జిట్‌పై గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారాలకు పూర్తిగా తెరపడినట్లయింది.     Lenin Movie, Akhil Akkineni, Bhagyashri Borse, Naga Vamsi, Sreeleela  
  20 ఏళ్ల క్రితం కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'మన్మధ'(Manmadha). పన్నెండేళ్ల వయసు వాళ్ళు కూడా టికెట్ల కోసం థియేటర్ దగ్గర తిష్ట వేసి మరి చూశారంటే మన్మధ ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో అయితే చాలా రోజులు హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. మెంబర్ ఆఫ్ సెంటర్స్ లో అర్ధ శతదినోత్సవం కూడా జరుపుకుంది. శింబు, జ్యోతిక జంటగా చేసారు.  జూలై 18న ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో రీ రిలీజ్ చేయనున్నట్టు  చిత్ర బృందం అధికారకంగా   స్పష్టం చేసింది. ఈ మేరకు  ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి.నేటి జనరేషన్ ప్రేక్షకులు ఎగబడి చూస్తున్న రొమాంటిక్ సైకో థ్రిల్లర్ జోనర్‌కి  2004లోనే ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడొస్తున్న 'ఆర్ఎక్స్ 100', 'బేబీ' వంటి సినిమాల కంటే ఎంతో భిన్నమైన, బలమైన కథాంశంతో, అద్భుతమైన ట్విస్టులతో అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా తమిళ్‌తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది. శింబు ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) లో అద్భుతంగా నటించి మెప్పించారు. ప్రేమికుడిగా అమాయకత్వాన్ని, సైకో కిల్లర్‌గా క్రూరత్వాన్ని శింబు  పండించిన తీరు ఇప్పటికీ ప్రేక్షకులకి గుర్తిండిపోయింది. ఈ చిత్రానికి ఏ.జె. మురుగన్ దర్శకత్వం వహించినప్పటికీ, హీరో శింబు స్వయంగా ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. శింబు కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలిచిన ఈ సినిమా విజయానికి మరో ముఖ్య కారణం సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా.  అందించిన ప్రతీ పాట, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఒక అద్భుతం. ముఖ్యంగా లవ్ థీమ్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎలివేట్ చేసే మ్యూజిక్ ప్రేక్షకులని  థియేటర్లలో కట్టిపడేసింది. ఇరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. సింధు తులాని, మందిరా బేడి, అతుల్ కులకర్ణి, యాగా గుప్తా వంటి వారు కీ రోల్స్  పోషించారు. ఇప్పటికే పలు డబ్బింగ్ సినిమాలు రీ-రిలీజ్‌లో తెలుగు బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్ సాధించాయి, మరి జూలై 18న థియేటర్లలోకి రాబోతున్న ఈ కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'మన్మధ' ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి. ఒకరితో ప్రేమలో ఉండి మరొకరితో శృంగారం చేసే యువతులే టార్గెట్ గా   చిత్ర  కధాంశం తెరకెక్కింది.  
అక్కినేని వారసుడు అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈసారి ఎలాగైనా పెద్ద హిట్ పట్టుదలతో ఉన్నాడు. అందుకే గ్యాప్ తీసుకుని, పూర్తి వైవిధ్యమైన కథతో వస్తున్నాడు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin). మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త రగ్గడ్ లుక్‌లో, మాస్ అవతారంలో కనిపించనున్నాడని ప్రచార చిత్రాలు చూస్తేనే అర్థమవుతోంది. నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కాంపిటీషన్ లేని సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేసింది. తొలుత మే 1న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల జూన్ 26 కి పోస్ట్‌పోన్ చేశారు. ఆ తర్వాత క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నిర్మాత నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని జులై 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడే అఖిల్‌కు ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది. సమ్మర్‌లో సోలోగా రావాలనుకున్న 'లెనిన్' చిత్రానికి ఇప్పుడు జులై 10న సోలో రిలీజ్ దక్కే ఛాన్స్ లేకుండా పోయింది. ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో ఏకంగా నాలుగైదు డబ్బింగ్ సినిమాలతో గట్టి పోటీ పడాల్సి వస్తోంది. ఈ పోటీలో మొదటిగా చెప్పుకోవాల్సింది మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ గురించి. ప్రభాస్ 'సలార్' సినిమాలో వరదరాజ్ మన్నార్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన పృథ్విరాజ్, ఇప్పుడు 'ఐ నో బడీ' (I, Nobody) అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌తో జులై 10న థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను తెలుగులోనూ భారీగా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ స్రవంతి మూవీస్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంయుక్తంగా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుండటంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.  దీనితో పాటు కోలీవుడ్ యంగ్ హీరో అధర్వ మురళి కూడా టాలీవుడ్ మార్కెట్‌పై కన్నేశాడు. ఆయన నటించిన 'ఇదయం మురళి' అనే చిత్రాన్ని తెలుగులో 'హృదయం మురళి' (Hrudhayam Murali) పేరుతో అదే రోజున విడుదల చేస్తున్నారు. కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఒక కీలక పాత్ర పోషించడం విశేషం. ఇక వీటితో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటించిన 'లవ్ ఓ లవ్' (Love Oh Love) అనే చిత్రం కూడా జులై 10నే థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాతో తెలుగు యూట్యూబర్ నాగదుర్గ హీరోయిన్ గా పరిచయమవుతుండటం విశేషం. అలాగే మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'వసుదేవ సుతం' సినిమా కూడా అదే రోజున లక్‌ను పరీక్షించుకోబోతోంది.  ఒక్కోసారి డబ్బింగ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ ఫైట్ లో తెలుగు స్టార్స్ కి షాకిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ఆ అవకాశం ఉండదని, లెనిన్ అవుట్ పుట్ అదిరిపోయిందని అంటున్నారు. అఖిల్ సహా టీమ్ అంతా 'లెనిన్' రిజల్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ డబ్బింగ్ సినిమాల బాక్సాఫీస్ క్లాష్‌ను తట్టుకుని 'లెనిన్' ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.     Akhil Akkineni, Lenin Movie, I Nobody, Hrudayam Murali, Vasudheva Sutham  
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చేసింది. రామ్ చరణ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో జూన్ 4న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, ఐదు వారాల తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) లో అడుగుపెట్టింది. జులై 9, గురువారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ప్రియులను అలరిస్తోంది.  అయితే ఈ ఓటీటీ రిలీజ్‌లో అందరూ ఊహించినట్లుగానే రన్ టైమ్ విషయంలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఈ సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాలు ఉండగా, కొన్ని కారణాల వల్ల కొన్ని సీన్స్ కట్ చేసి 3 గంటల 5 నిమిషాలకు తగ్గించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అదే క్రిస్ప్ వర్షన్ అయిన 3 గంటల 5 నిమిషాల రన్ టైమ్‌తోనే ఈ చిత్రం అందుబాటులోకి రావడం గమనార్హం. ఈ భారీ చిత్రానికి 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.  థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'పెద్ది', కేవలం కంటెంట్ బలంతోనే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రామ్ చరణ్ కెరీర్‌లో హైయెస్ట్ సోలో గ్రాసర్ గా నిలిచింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం సౌత్ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుండగా, హిందీ వెర్షన్ మాత్రం జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. విజయనగరం జిల్లాలోని కొండ కింది ఊరు నేపథ్యంలో సాగుతుంది. వందలాది మంది ప్రజలు నివసిస్తున్నప్పటికీ, ఆ ఊరికి ప్రభుత్వం తరఫున ఎలాంటి గుర్తింపు ఉండదు. కనీస రహదారి సౌకర్యాలు గానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గానీ ఆ ఊరి ప్రజలకు అందవు. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ ఊరి మనుషులను చాలా చిన్నచూపు చూస్తుంటారు, చివరికి వారు చేసే కూలీ పనుల్లోనూ తీవ్ర వివక్ష చూపిస్తారు. ఆ ఊరిలోనే పుట్టి పెరిగిన యువకుడే పెద్ది (రామ్ చరణ్). రోజూ విజయనగరం వెళ్లి కూలీ పనులు చేసుకునే పెద్ది, క్రికెట్‌లో అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడు. అతని ఆట తీరు చూసి విజయనగరం, బొబ్బిలి జట్లు క్రికెట్ బెట్టింగ్ మ్యాచ్‌లలో ఆట కూలీగా పెద్దిని వేలంలో పోటీ పడి మరీ పాడుకుంటూ ఉంటాయి. అయితే, తన ఊరిలో జరిగిన ఒక విషాద మరణం పెద్ది ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కేవలం డబ్బు కోసం కాకుండా, తన ఊరికి ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం తీసుకురావడం కోసమే ఆడాలని అతను గట్టిగా నిర్ణయించుకుంటాడు. అందుకోసం అందరూ ఆడే క్రికెట్‌ను వదిలేసి, మట్టి కుస్తీ (రెజ్లింగ్) బాట పడతాడు. ఆ తర్వాత పెద్ది జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? కుస్తీ పోటీల్లో జాతీయ స్థాయికి వెళ్లినప్పటికీ అతనికి ఆశించిన గుర్తింపు ఎందుకు దక్కలేదు? చివరకు తన ఊరి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం పెద్ది ఎంచుకున్న మరో సంచలన క్రీడ ఏంటి? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కథ. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ విజువల్ ఎమోషనల్ రైడ్‌ను చూడవచ్చు.     Ram Charan, Peddi Movie, OTT, Netflix, TeluguOne  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' (Fauzi) సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ నుంచి ఒక కలవరపెట్టే వార్త నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మకు, హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్ సమయంలో ఒక ప్రమాదకరమైన విషపురుగు కరిచిందని, ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు మొదలయ్యాయి. ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్‌లో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ప్రభాస్ అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ గాసిప్స్ చూసి ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, రాజేష్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పెడుతూ ఆయన పర్సనల్ అసిస్టెంట్ (PA) సుభాశిష్ పాండా రంగంలోకి దిగారు. వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ ఆయన అధికారికంగా ఒక వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. రాజేష్ శర్మకు ఎలాంటి విషపురుగు కాటు వేయలేదని, అలాగే ఎటువంటి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సోకలేదని ఆయన ఆ వీడియోలో స్పష్టంగా వివరించారు. కేవలం కొందరు తమ స్వార్థం కోసం, వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఎంతో గౌరవంగా సాగుతున్న ఒక సీనియర్ నటుడి ఆరోగ్యంపై ఇలాంటి పుకార్లు పుట్టించడం కరెక్ట్ కాదని హితవు పలికారు. అసలు రాజేష్ శర్మ హాస్పిటల్‌లో చేరడానికి గల నిజమైన కారణాన్ని కూడా సుభాశిష్ పాండా ఈ సందర్భంగా బయటపెట్టారు. రాజేష్ శర్మకు కొంతకాలంగా డయాబెటిస్ (షుగర్) సమస్య ఉందని, ఆ షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గుల వల్ల ఆయన కాలు కొద్దిగా వాచిందని తెలిపారు. ఆ చిన్న వాపునకు సరైన చికిత్స అందించడం కోసమే తాము హాస్పిటల్‌లో చేర్పించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కూడా అవుతారని ఈ వీడియో ద్వారా ఫ్యాన్స్‌కు పూర్తి భరోసా ఇచ్చారు. రాజేష్ శర్మ ఎక్కడికి వెళ్లినా, ఏ షూటింగ్‌లో పాల్గొన్నా పీఏగా తాను ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటానని సుభాశిష్ స్పష్టం చేశారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో 'ఫౌజీ' షూటింగ్ షెడ్యూల్స్ చాలా ప్రశాంతంగా, సేఫ్‌గా జరుగుతున్నాయని, అక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటన ఏదీ చోటుచేసుకోలేదని చెప్పారు. దయచేసి సోషల్ మీడియా వేదికగా నిజానిజాలు తెలుసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా నకిలీ వార్తలను షేర్ చేయవద్దని, వైరల్ చేయవద్దని ఆయన కోరారు. ఈ అధికారిక క్లారిటీతో రాజేష్ శర్మ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది.     Prabhas, Fauzi Movie, Rajesh Sharma, TeluguOne  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని కథానాయకులకు కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ సమాజం పట్ల ఎంతో బాధ్యత, సామాజిక స్పృహ ఉంది. మన స్టార్ హీరోలు చాలా మంది తమ సంపాదనలో కొంత భాగాన్ని నిరంతరం ప్రజా సేవ కోసమే కేటాయిస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ అండ్ ఐ బ్యాంకుల ద్వారా లక్షలాది మందికి ప్రాణదానం, కంటిచూపును ప్రసాదిస్తుంటే, నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గా ఎంతో మంది పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ అండగా నిలుస్తున్నారు. మరికొందరు నటులు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను రన్ చేస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు ఎలాంటి పబ్లిసిటీ, హంగామా ఆశించకుండా గుప్తదానాలు చేయడానికి ఇష్టపడతారు. కుడిచేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదనే సామెతను వారు అక్షరాలా పాటిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి కోవకే చెందుతారు ఒకప్పటి టాలీవుడ్ యాక్షన్ స్టార్, ప్రస్తుత సీనియర్ నటుడు సుమన్. దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్ల కుటుంబాల కోసం ఆయన చేసిన ఒక అద్భుతమైన త్యాగం ఇప్పుడు వెలుగులోకి వచ్చి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి, భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నగర పరిసరాల్లో ఒక్క గజం స్థలం కొనాలన్నా సామాన్యులకు సాధ్యం కాని పరిస్థితి, కోట్లలో వ్యాపారం జరుగుతోంది. అలాంటిది టాలీవుడ్ హీరో సుమన్ ఏకంగా వందల కోట్ల రూపాయల విలువైన భారీ భూభాగాన్ని సైనికుల కోసం ఉచితంగా విరాళంగా ఇచ్చి తన రియల్ హీరో మనసును చాటుకున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ వంటి దక్షిణాది భాషల్లో అగ్ర కథానాయకుడిగా వెలిగిన సుమన్, చాలా ఏళ్ల క్రితమే భవిష్యత్తు అవసరాల కోసం హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న భువనగిరి ప్రాంతంలో సుమారు 170 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అక్కడ ఒక భారీ సినిమా స్టూడియోను నిర్మించి, ఆ తర్వాత దానిని కమర్షియల్ ప్రయోజనాల కోసం వాడుకోవాలనేది ఆయన అసలు ప్రణాళిక. కానీ సరిగ్గా అదే సమయంలో భారతదేశ సరిహద్దుల్లో కార్గిల్ యుద్ధం సంభవించింది. ఆ ఘోర యుద్ధంలో దేశ రక్షణ కోసం ఎంతో మంది భారతీయ సైనికులు శత్రువులతో పోరాడుతూ వీరమరణం పొందారు. టీవీల్లో, వార్తల్లో అమర జవాన్ల భౌతిక కాయాలను, వారి కుటుంబాల రోదనలను చూసిన సుమన్ మనసు తీవ్రంగా చలించిపోయింది. దేశం కోసం సర్వస్వం ధారపోసిన ఆ అమర జవాన్ల కుటుంబాలకు, సైనికులకు తన వంతుగా ఏదో ఒక పెద్ద సహాయం చేయాలని ఆయన బలంగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన భార్య ఒక అద్భుతమైన సలహాను ఇచ్చారు. భువనగిరిలో ఉన్న తమ 170 ఎకరాల భూమిని సైనికుల సంక్షేమం కోసం ఇచ్చేస్తే బాగుంటుందని ఆమె సూచించడంతో, సుమన్ మరో క్షణం కూడా ఆలోచించకుండా ఆ మొత్తం 170 ఎకరాల స్థలాన్ని సైనికులకు, వారి కుటుంబాల అవసరాలకు పూర్తిగా ఉచితంగా రాసిచ్చేశారు. ఈ అసాధారణమైన దాన గుణం గురించి సుమన్ ఎప్పుడూ ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. అయితే ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో యాంకర్ ఈ ప్రస్తావన తీసుకురావడంతో సుమన్ ఈ విషయాన్ని స్వయంగా అంగీకరిస్తూ అసలు నిజాలను పంచుకున్నారు. తన భార్య ఇచ్చిన మంచి ఆలోచన వల్లే ఈ గొప్ప కార్యం సాధ్యమైందని ఆయన ఎంతో వినమ్రంగా చెప్పుకొచ్చారు. కెరీర్ మధ్యలో కొన్ని వివాదాల వల్ల రేసులో వెనకబడినప్పటికీ, గోడకు కొట్టిన బంతిలా మళ్లీ పుంజుకుని శివాజీ వంటి సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సుమన్ చేసిన ఈ 170 ఎకరాల భూరి విరాళం గురించి తెలిసి నెటిజన్లు, అభిమానులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రీల్ హీరో మాత్రమే కాదు, మీరు నిజమైన రియల్ హీరో అంటూ సామాజిక మాధ్యమాల్లో కొనియాడుతున్నారు.     Suman land donation, Suman 170 acres donation to soldiers, Tollywood hero Suman
టాలీవుడ్ క్రియేటివ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అందాల తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా వ్యవహారం ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ గత కొంతకాలంగా గాఢమైన ప్రేమలో మునిగితేలుతున్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ప్రచారం సాగుతోంది. ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తూ తాజాగా ఈ లవ్ బర్డ్స్ మరోసారి జంటగా కెమెరా కంటికి చిక్కారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్న ఒక అద్భుతమైన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరినీ చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ క్రేజీ కాంబినేషన్‌పై క్రేజీ కామెంట్స్ చేస్తూ వీడియోను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. నిజానికి వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎలా మొదలైందనే ఆసక్తికరమైన చర్చ కూడా ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి 'ఓంశాంతి శాంతి శాంతి' అనే వెబ్ ఒరిజినల్ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లీడ్ రోల్స్ పోషించారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సమయం నుంచే వీరిద్దరి అభిరుచులు కలవడంతో స్నేహం కాస్తా ప్రేమగా మారిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ ప్రేమ వార్తలు నెట్టింట ఎంతగా వైరల్ అవుతున్నప్పటికీ అటు తరుణ్ భాస్కర్ గానీ, ఇటు ఈషా రెబ్బా గానీ దీనిపై అధికారికంగా ఎక్కడా నోరు విప్పడం లేదు. మీడియా ముఖంగా ఎవరైనా ప్రశ్నిస్తే సున్నితంగా దాటవేస్తూ వస్తున్నారు. కానీ ఒకానొక సందర్భంలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, తనకు జీవితంలో అన్నీ ఈషానే అని, తను నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఓపెన్‌గా క్లూ ఇచ్చారు. దాంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే అనుమానాలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇక టాలీవుడ్ లవ్ హిస్టరీని గమనిస్తే, గతంలో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఇలాగే ఎయిర్‌పోర్ట్‌లలో జంటగా కనిపిస్తూ తమ రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా మెయింటైన్ చేశారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఇప్పుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా సైతం సరిగ్గా అదే బాటలో నడుస్తున్నారని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. విజయ్-రష్మిక తరహాలోనే ఈ సరికొత్త జంట కూడా చాలా సైలెంట్‌గా వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటూ, త్వరలోనే తమ పెళ్లి గురించిన ఒక అఫీషియల్ గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది.     Tharun Bhaskar, Eesha Rebba
సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తనదైన అల్లరితో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి. తెలుగులో సుధీర్ బాబు సరసన 'భలే మంచి రోజు' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నదాన్ని అప్పట్లో మన ప్రేక్షకులు పెద్దగా గుర్తించలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో పరాజయం అందుకోవడంతో వామికా తన మకాం బాలీవుడ్‌కు మార్చేసింది. అక్కడ వరుస క్రేజీ ఆఫర్లతో అదరగొడుతూ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయింది. కేవలం హిందీలోనే కాకుండా ఇప్పుడు పాన్-ఇండియా స్టార్‌గా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో అడివి శేష్ మోస్ట్ అవేటెడ్ స్పేస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'G2' (గూఢచారి 2) లో నటిస్తూ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. దీనితో పాటు తమిళంలో జీని, DC సినిమాలతో పాటు పలు క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు, వెబ్ సిరీస్‌లు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా వామికా గబ్బి చేసిన జపాన్ పర్యటన ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. జపాన్ వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ అత్యంత సాంప్రదాయకమైన సుమో రెజ్లింగ్‌లో పాల్గొంది. పాల్గొనడమే కాకుండా ఏకంగా విన్నర్‌గా కూడా నిలిచి అందరినీ షాక్‌కు గురిచేసింది. కొండలాంటి భారీ సుమో రెజ్లింగ్‌ వీరుణ్ణి వామికా ఓడించడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆమె గెలిచిన ట్రిక్ ఏంటో అస్సలు మిస్ అవ్వకుండా తెలుసుకోవాల్సిందే. మ్యాచ్ కోసం వామికా గాలితో నింపిన ఒక పెద్ద సుమో సూట్ వేసుకుని నేరుగా రింగ్‌లోకి దూకేసింది. మొదట రింగ్‌లోకి దిగి చాలా గంభీరంగా బిల్డప్ ఇస్తూ భారీ సుమో లాగే ఫోజులు ఇచ్చింది. ఆ తర్వాత అకస్మాత్తుగా నవ్వుతూ వెళ్లి ఆ సుమో రెజ్లర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి గట్టిగా హగ్ చేసుకుంది. ఆ తర్వాత అసలు సిసలైన ఫైట్ మొదలైంది. ఎంత బలం ఉపయోగించి నెట్టినా ఆ కొండలాంటి రెజ్లర్ అంగుళం కూడా కదల్లేదు. సుమో బలముందు తన ఆటలు సాగవని గ్రహించిన వామికా వెంటనే రూట్ మార్చేసింది. అకస్మాత్తుగా తన కంటిలో ఏదో పడినట్టు విపరీతంగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది. పాపం ఆ భోళా సుమో రెజ్లర్ అది నిజమేనని నమ్మి, ఆమెకు హెల్ప్ చేద్దామని జాలితో దగ్గరకు వచ్చాడు. సరిగ్గా ఇదే సందు అనుకున్న వామికా.. అస్సలు ఊహించని విధంగా అతడిని ఒక్కసారిగా రింగ్ అవతలికి నెట్టేసి మ్యాచ్ గెలిచేసింది. ఈ నమ్మించి ముంచేసే ఫన్నీ విక్టరీ తర్వాత రింగ్‌లోనే ఆమె వేసిన క్రేజీ డ్యాన్స్ వీడియోకి అసలైన హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ ఫన్నీ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వామికా గబ్బి.. ఇలాంటి ట్రిక్స్‌తో మ్యాచ్‌లు ఎలా గెలవాలో తెలుసుకోవడానికి తన దగ్గర నోట్స్ తీసుకోవాలంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ గా మారింది. ఇక నెటిజన్లు సైతం వామికా వీడియోపై చాలా సరదాగా స్పందిస్తున్నారు. "అలాంటి అందమైన అమ్మాయి అడగాలే కానీ.. ఆమె కోసం ఎన్నిసార్లు అయినా ఓడిపోవడానికి సిద్ధం" అని ఒకరు కామెంట్ చేయగా, "చాలా బాగా బురిడీ కొట్టించి గెలిచావ్ వామికా" అంటూ ఇంకొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి వామికా చేసిన ఈ అల్లరి జపాన్ సుమోని కూడా ముంచేసి నెట్టింట నవ్వులు పూయిస్తోంది. https://www.instagram.com/reel/Dafnuy2t9Ql/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==     Wamiqa Gabbi, G2 Movie Heroine, Wamiqa Gabbi Funny Video
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితులు ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తాయి. చాలా మంది పిల్లలు మొదట్లో పాఠశాలలో తమకు ఎదురయ్యే విషయాలను, తమ మనసులోని విషయాలను  మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత కేవలం పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా..  కొత్తగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ప్రతిరోజూ పిల్లలను అడాగాల్సిన ప్రశ్నలు.. నచ్చిన విషయం.. ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి.  ఈ ప్రశ్న పిల్లలో సానుకూల విషయాలను వెలికితీయడానికి సహాయపడుతుంది.  కొందరు పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన విషయాన్ని గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది.  అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు  స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు,  ఏ విషయాన్ని అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి.. పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, మాట్లాడారు అనే విషయాలు కొత్త స్నేహితుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా,  ఎవరితో అయినా కలవడంలో  ఇబ్బంది ఫీలవుతున్నారా?  అనే విషయాలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది. ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి.. కొందరు పిల్లలు స్కూల్ లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిలల్లు బడికి  వెళ్లాలంటే భయపడటారు.  ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి.. పిల్లలను  ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. తద్వారా పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అన్ని చెబుతూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి,  వారిలో బావ వ్యక్తీకరణ వంటివి మెరుగు పడతాయి.                          *రూపశ్రీ.
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు,  గొడవలు, అతిగా స్పందించడం, జోక్యం చేసుకోవడం వంటివి కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. వీటి వల్ల బంధాల మధ్య దూరం పెరుగుతుంది. అయితే నేటికాలంలో బంధాలు బలంగా ఉండాలంటే మైక్రో ప్రైవసీ పాటించాలట. ఇంతకీ మైక్రో ప్రైవసీ అంటే ఏంటి? ఇది బంధాలను బలంగా ఉంచడంలో ఎలా సహాయపడుతుంది? తెలుసుకుంటే.. మైక్రోప్రైవసీ.. మైక్రో-ప్రైవసీ అనేది నేటికాలంలో సంబంధాల గురించి జాగ్రత్త చేసే ఒక మార్గం. సంబంధంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరమని ఇది చెబుతుంది. ఈ స్పేస్  వ్యక్తికి మానసిక స్వేచ్ఛను అందిస్తుంది , సంబంధం భారంగా మారకుండా నివారిస్తుంది. ప్రేమ అంటే ప్రతీదాన్నీ నియంత్రించడం కాదని, ఒకరి హద్దులను మరొకరు గౌరవించుకోవడం కూడా అని మైక్రో ప్రైవసీ నొక్కి చెబుతుంది. మైక్రో-ప్రైవసీ సంబంధాలలో ఒక బాలెన్స్ ను క్రియేట్ చేస్తుంది.  దీనివల్ల ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా ఎవరి ఐడెంటిటీ వారికి ఉంటుంది. మైక్రో ప్రైవసీలో అసలు అర్థం.. మైక్రోప్రైవసీలో ఉండే  ముఖ్యమైన అంశం  భాగస్వామి లేదా కుటుంబ సభ్యుని  పర్సనల్ ఫీలింగ్స్ ను, పర్సనల్  సమయాన్ని గౌరవించడం. ఎప్పుడూ వారితో టచ్‌లో ఉండటం లేదా ప్రతి కదలికను గమనించడం అనేది  సంబంధాలను బలహీనపరుస్తుంది. దానికి బదులుగా, ఒకరికొకరు కొంత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ, ఒత్తిడి లేకుండా సంబంధాన్ని కొనసాగించడం ముఖ్యం. అతిగా డిపెండ్ అవడాన్ని, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ను నియంత్రణలో ఉంచడంలో కూడా మైక్రో ప్రైవసీ సహాయపడుతుంది. మైక్రో ప్రైవసీ ఎందుకు అవసరం.. మైక్రో ప్రైవసీ  సంబంధాలలో నమ్మకాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరికి  వారి స్వంత సమయం, స్పేస్  ఉన్నప్పుడు, వారు మానసికంగా మరింత ప్రశాంతంగా, బాలెన్స్డ్ గా  ఉంటారు. ఇది సంబంధాలలో అనవసరమైన ఒత్తిడిని తగ్గించి ఎక్కువ కాలం బంధాలు పదిలంగా ఉండేలా చేస్తుంది. మైక్రో ప్రైవసీ పాటించే వ్యక్తులు తమ ఐడెంటిటీని కూడా కోల్పోకుండా ఉంటారు.  ఒకరి ముందు ఒకరు తక్కువ కాదు అనేలా బందాలు ఉంటే.. ఆ బంధాలు ఎన్నేళ్ళైనా పదిలంగా ఉంటాయి. ఇలా  చేయాలి.. భార్యాభర్తలలో ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఒంటరిగా సమయం గడపాలని, అభిరుచులను కొనసాగించాలని, లేదా స్నేహితులతో సమయం గడపాలని కోరుకున్నప్పుడు, వారికి అంతరాయం కలిగించకుండా లేదా ప్రశ్నించకుండా వారి ఇష్టాలను గౌరవించడం, వారి అభిరుచులను కొనసాగించడంలో మద్దతు ఇవ్వడం వంటివి మైక్రో ప్రైవసీకి చక్కని ఉదాహరణ.  ఇది ఈ రోజు కొత్తగా  చెప్పాల్సిన విషయమేమీ కాదు.. కానీ కొందరికి అర్థం కావాలంటే కొన్ని ప్రత్యేక మార్గాలలో చెప్పాలి. అందుకే దీన్ని మైక్రో ప్రైవసీ అంటున్నారు.  ఈ మార్గాన్ని పాటిస్తే బంధాలు పదిలంగా ఉంటాయి.                                  *రూపశ్రీ.
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అవసరానికి మించి మొబైల్ వాడటం క్రమంగా వ్యసనంగా మారి మన ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వీడియోలో Dr. వేణుగోపాల్ మొబైల్ వ్యసనం వల్ల మెదడులో జరిగే మార్పులు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం, నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలను చాలా సులభంగా వివరించారు.  అలాగే మొబైల్‌కు బానిస కాకుండా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు, స్క్రీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలి, పిల్లలు మరియు యువతలో మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు.  మొబైల్‌ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ దానిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. మొబైల్ వ్యసనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.  
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో , శక్తిని నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నేటికాలంలో మారుతున్న జీవనశైలి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం,  పోషకాహార లోపాల కారణంగా, చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి12 ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాలలో లభిస్తుంది కాబట్టి, శాకాహారులకు విటమిన్ బి12 లోపం కనిపిస్తూ ఉంటుంది.  టెస్ట్ లలో  విటమిన్ బి12 లోపం ఉన్నట్లు తేలితే, ఆహార , జీవనశైలి మార్పుల ద్వారా విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు.  విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుంటే.. విటమిన్ బి12 లోపిస్తే కనిపించే లక్షణాలు..  ఎప్పుడూ  అలసటగా మరియు బలహీనంగా అనిపించడం.  చేతులు మరియు పాదాలలో జలదరింపు లేదా తిమ్మిరిగా ఉండటం,   తలతిరగటం,  చర్మం పసుపు రంగులోకి మారడం,  దేని మీదా ఏకాగ్రత లేకపోవడం,  మానసిక స్థితిలో వేగంగా  మార్పులు ఉండటం. విటమిన్ బి12 లోపం అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారాలు.. విటమిన్ బి12 లోపాన్ని అదిగమించడానికి పాలు , పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచి మార్గం. ముఖ్యంగా శాకాహారులు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి.  పాలు, పెరుగు, పనీర్ , జున్ను వంటి పాల ఉత్పత్తులలో విటమిన్ బి12తో పాటు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను ఉంటాయి.  కాల్షియం మరియు ప్రోటీన్ కూడా ఉంటాయి.  గుడ్లు, చేపలు, చికెన్ , మాంసం మొదలైన వాటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.  మాంసాహారులు వీటిని తీసుకోవచ్చు.   ఈ ఆహారాలలో ఉండే విటమిన్ బి12ను శరీరం సులభంగా వినియోగించుకుంటుంది. గుడ్డు సొనలో విటమిన్ బి12 ఉంటుంది. చేపలు , చికెన్‌లో ప్రోటీన్ , అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా , బాలెన్స్డ్ గా  తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 స్థాయిలను సులువుగా పెంచుకోవచ్చు. శాకాహారులకు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు విటమిన్-బి12 కోసం , బలవర్ధక ఆహారాలు బాగా సహాయపడతాయి. బలవర్ధక ఆహారాలు అంటే విటమిన్లు , ఖనిజాలతో కూడిన ఆహారాలు. చాలా రకాల  బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, సోయా పాలు లేదా బాదం పాలు వంటి మొక్కల ఆధారిత పాలు,  న్యూట్రిషనల్ ఈస్ట్‌లో విటమిన్ బి12 ఉంటుంది. వీటిని  రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12   లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సప్లిమెంట్ల విషయంలో.. విటమిన్ బి12 లోపం తీవ్రంగా ఉంటే, కేవలం ఆహారం ద్వారా దానిని భర్తీ చేయడం కష్టం . అటువంటి సందర్భాలలో డాక్టర్ విటమిన్ బి12 సప్లిమెంట్లు, టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లను సిఫార్సు చేయవచ్చు. విటమిన్ బి12 లోపానికి చికిత్స అనేది వ్యక్తి వయస్సు, ఆరోగ్య స్థితి , లోపం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, పరీక్షలు చేయించుకోకుండా , డాక్టర్‌ను సంప్రదించకుండా ఎక్కువ కాలం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది కాదు.                                 *రూపశ్రీ.
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా? థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఈ వీడియోలో సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ థైరాయిడ్ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో, రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు ఏమిటో వివరంగా చెబుతున్నారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: థైరాయిడ్ అంటే ఏమిటి? థైరాయిడ్ రావడానికి ఆహారపు అలవాట్లు ఎంతవరకు కారణం? థైరాయిడ్ ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు తగ్గించాల్సిన లేదా మానాల్సిన ఆహారాలు అయోడిన్, సెలీనియం, జింక్ వంటి పోషకాల ప్రాముఖ్యత థైరాయిడ్ రోగులు పాటించాల్సిన ఆరోగ్యకరమైన డైట్ చిట్కాలు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు థైరాయిడ్ సమస్యలను నియంత్రించుకోవాలనుకునే వారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది.