LATEST NEWS
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ను నిన్న హడావిడిగా గుంటూరు జీజీహెచ్ నుండి డిశ్చార్జ్ చేసి విజయవాడ సబ్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీని పై ఒక పక్క రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఐతే తాజాగా ఈ వ్యవహారం పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేవలం రాజ‌కీయ కార‌ణాల‌తోనే అచ్చెన్నాయుడును హాడావిడిగా గుంటూరు జీజీహెచ్ నుండి డిశ్చార్జ్ చేసి త‌ర‌లించార‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ప్ర‌భుత్వ వైద్యుల‌పై ఒత్తిడి తెచ్చి ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేశార‌ని, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా దీని పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వెంక‌టేష్ అనే వ్య‌క్తి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసుపై విచార‌ణ శుక్ర‌వారం జ‌రిగే అవ‌కాశం ఉంది.
వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని కోరేందుకు కొంతమంది ఎంపీలు న్యాయ సలహాదారులతో సహా ప్రత్యేక విమానం లో ఢిల్లీకి వెళ్తున్నారు. వీరంతా రేపు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘు రామ రాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపీల ఈ పర్యటన పై రఘురామరాజు స్పందించారు. ఆ ఎంపీల ఢిల్లీ పర్యటనతో ఎటువంటి ప్రయోజనం ఉండదని అయన తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు తన పై జరుగుతున్న వ్యవహారమంతా జగన్ కు తెలియకుండా జరుగుతోందని భావించానని ఐతే ప్రత్యేక విమానం లో ఎంపీలను ఢిల్లీకి పంపిస్తున్నారంటే ఇదంతా జగన్ కనుసన్నలలోనే జరుగుతోందని స్పష్టమౌతోందని అయన అన్నారు. అయినా ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిని సస్పెండ్ చేస్తే ఇక పార్లమెంట్‌లో ఎవరు మిగులుతారన్నారు. అంతే కాకుండా తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మరోసారి అయన స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి భూములు అమ్మొద్దని చెప్పానని, తర్వాత సీఎం జగన్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇసుక, పేదలందరికీ ఇల్లు పథకంలో ఉన్న తప్పులను మాత్రమే తాను ఎత్తి చూపానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నరసాపురం ఎంపీ ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం పై ఆ లేఖలో కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో దూరదృష్టితో తీసుకున్న ఈ పరిపాలనా నిర్ణయంతో 80 కోట్ల మంది పేదలకు మేలు చేస్తుందని అలాగే ప్రధాని మోదీని దయగల మనిషిగా చరిత్ర గుర్తిస్తుందంటూ రఘురామ కృష్ణంరాజు తన లేఖలో ప్రశంసించారు.
ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ నిధులను దుర్వినియోగం చేశారంటూ జీవీకే గ్రూప్ కంపెనీల చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎండీ గునుపాటి వెంకట సంజయ్ రెడ్డి, కొన్ని ఇతర సంస్థలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపైన సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో.. 2012-18 మధ్య రూ. 705 కోట్లను అక్రమంగా వాడుకున్నారంటూ సీబీఐ ఆరోపించింది. బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులను అక్రమంగా మళ్లించారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో జీవీకే రెడ్డి, సంజయ్ రెడ్డితో పాటు మరో 12 సంస్థలపైనా కేసు నమోదైంది. ఈ మేరకు జూన్ 27 రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సీబీఐ బుధవారం ముంబయి, హైదరాబాద్‌లలో జీవీకే రెడ్డి, ఆయన కుమారుడికి చెందిన కార్యాలయాలు.. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని పలు కార్యాలయాలు సహా మొత్తం 6 ప్రదేశాలలో సోదాలు చేసింది.  ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(ఎంఈఎఎల్) అనేది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, మరికొన్ని విదేశీ సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్. ముంబయి విమానాశ్రయ అభివృద్ది, నిర్వహణ, నవీకరణ కోసం దీన్ని ఏర్పాటుచేశారు. ఇందులో జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాటా 50.5 శాతం కాగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటా 26 శాతం. ఈ వెంచర్ సంస్థ‌పై వచ్చే ఆదాయంలో వార్షిక రుసుముగా 38.7 శాతం మొత్తాన్ని ఎంఏఈఎల్ ఏఏఐకి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, నవీకరణకు వినియోగించాల్సి ఉంటుంది. సీబీఐ ఆరోపణల ప్రకారం ప్రధానంగా అవినీతి ఇక్కడే జరిగింది. బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులను అక్రమంగా మళ్లించారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. ఇందుకోసం 9 ప్రయివేటు సంస్థలను వాడుకుందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఇలా రూ. 310 కోట్ల నిధులను దారి మళ్లించి ముంబయి విమానాశ్రయ పరిసరాల్లో 200 ఎకరాలను రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌కు జీవీకే వినియోగించుకుందని సీబీఐ ఆరోపించింది. జీవీకే గ్రూప్ కంపెనీ ప్రతినిధుల నేరపూరిత చర్యల వల్ల ఏఏఐ తీవ్రంగా నష్టపోయిందని, ఎంఐఏఎల్ వద్ద ఉన్న రూ. 395 మిగులు నిధులను జీవీకే అనుబంధ కంపెనీల్లోకి తరలించారని పేర్కొంది. జీవీకే కారణంగా రూ. 705 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ అధికార వర్గాలు వెల్లడించాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన తర్వాత కొన్ని రోజులు కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడిచాయి. తరువాత వలస కార్మికుల కోసం శ్రామిక రైళ్లను ప్రభుత్వం నడుపుతోంది. మొన్న జూన్ నెల నుండి సాధారణ ప్రయాణీకుల కోసం కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా స్టార్ట్ చేసింది రైల్వే డిపార్ట్ మెంట్. మొత్తం గా 230 రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఐతే రైలు ప్రయాణం అంటే మనకు సినీ కవి ఆరుద్ర గారి ఒక మాట తప్పకుండా గుర్తుకొస్తుంది. అది "నేను ఎక్కవలసిన రైలు ఒక జీవిత కాలం లేటు" అని. వీటి దుంప తెగ మనం ముందుగానే రైల్వే స్టేషన్ కు చేరుకుంటే మన్మ ఎక్కవలసిన రైళ్లు మాత్రం తాపీగా గంటల కొద్దీ ఆలస్యంగా వస్తుంటాయి. ఐతే తాజాగా భారతీయ రైల్వే ఈ రోజు ఒక అద్భుతమైన రికార్డ్ నెలకొల్పింది. అదేంటంటే భారతీయ రైల్వేల చరిత్రలో తొలిసారి అన్ని రైళ్లు 100 శాతం సరైన సమయానికి గమ్యాన్ని చేరుకున్నాయి. రైల్వే బోర్డు చైర్మన్ వైకే యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం 30 రాజధాని రైళ్లు, 200 ప్రయాణికుల రైళ్లు ఏ మాత్రం ఆలస్యంగా నడవకూడదని, నిర్ణీత సమయానికి చేరుకోవాలని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లను ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్య తక్కువే అయినా ఆలస్యం కావొద్దని అయన స్పష్టం చేశారు. దీంతో రైల్వే చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్ ఈ రోజు నమోదైంది.
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ముంబయి తలోజా జైలు సిబ్బంది ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారని వస్తున్న వార్తలపై.. వరవరరావు అల్లుడు వేణుగోపాల్ స్పందించారు. తమకు జైలు అధికారులు సమాచారం అందించారనడం వాస్తవం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జైల్లో ములాఖాత్ లు లేనందున వారానికోసారి ఫోన్ చేసే వీలు కల్పించారని, దాంతో ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులకు వరవరరావు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. వారం కింద ఉన్న ఆరోగ్య స్థితిలోనే, బలహీనంగానే ఉన్నారని తెలిపారు. అంతేతప్ప 'వరవరరావు ఆరోగ్యం విషమం'.. 'జైలు అధికారుల నుంచి కుటుంబానికి సమాచారం'.. 'హుటాహుటిన ముంబాయి ప్రయాణమవుతున్న కుటుంబం' అంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని, దానిపై రేపు విచారణ జరుగుతుందని వేణుగోపాల్ తెలిపారు.
ALSO ON TELUGUONE N E W S
  'స్వామి రా రా', 'కేశవ', 'రణరంగం' సినిమాలు తీసిన దర్శకుడు సుధీర్ వర్మ, ఓ వెబ్ సిరీస్ చేయడానికి సుముఖంగా ఉన్నాడు. నవీన్ చంద్ర హీరోగా అతడు ఓ థ్రిల్లర్ సిరీస్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అమెరికాలో ఫిలింమేకింగ్ కోర్స్ చేసి వచ్చిన ఓ యువకుడు చెప్పిన కథ నచ్చడంతో ఇద్దరూ 'యస్' అన్నారట. హవాలా రాకెట్ నేపథ్యంలో కథ ఉంటుందనీ, లాక్‌డౌన్‌కి ముందే కథ ఫైనలైజ్ చేశారనీ, 'ఆహా' ఓటీటీ కోసం ఈ సిరీస్ చేస్తున్నారని సమాచారం. నవీన్ చంద్ర నటించిన 'భానుమతి రామకృష్ణ' సినిమాను శుక్రవారం (జూన్ 3న) నుండి 'ఆహా'లో చూడొచ్చు. ప్రస్తుతం అతడు రానా 'విరాటపర్వం', కీర్తీ సురేష్ 'మిస్ ఇండియా', వరుణ్ తేజ్ 'బాక్సర్' సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు కొరియన్ హిట్ 'మిడ్ నైట్ రన్నర్స్'ను రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో సుధీర్ వర్మ రీమేక్ చేస్తున్నాడు. ఆ సినిమాలో నవీన్ చంద్ర విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తరవాత వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తారట.
  టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీదకు మరో డైరెక్టర్ కుమారుడు హీరోగా రావడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు తెలుగులో దర్శకుల కుమారులు హీరోలుగా సక్సెస్ అయినవాళ్లు అంతలేరని చెప్పాలి. దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్,  దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చినా విజయాలు అందుకోలేదు. మరో దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ కి తెలుగులో విజయాలు లేకున్నా, తమిళంలో హీరోగా సెటిల్ అయ్యాడు. సతీష్ వేగేశ్న కుమారుడు ఈ సెంటిమెంట్ మార్చాలని కోరుకుందాం. 'శతమానం భవతి', 'శ్రీనివాస కళ్యాణం', 'ఎంత మంచివాడవురా' సినిమాలకు దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న ఉన్నారు కదా. ఆయన కొత్త సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో ఆయన కుమారుడు సమీర్ హీరో. అతడికి అదే తొలి సినిమా. కరోనా తగ్గిన తరవాత షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. మిగతా కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
  ఏటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుద‌లైన రామ్‌గోపాల్ వ‌ర్మ లేటెస్ట్ ఫిల్మ్ 'నేక్డ్' (తెలుగులో 'న‌గ్నం').. ఆయ‌న ఖ‌ర్చు పెట్టిన దానితో పోలిస్తే ప‌ది రెట్లు ఎక్కువ‌గా డబ్బులు సంపాదించి పెట్టింది. కేవ‌లం 22 నిమిషాల నిడివి క‌లిగిన ఆ అడ‌ల్ట్ షార్ట్ ఫిల్మ్‌ను షూట్ చేయ‌డానికి ఆయ‌న ఎన్ని రోజులు టైమ్ తీసుకున్నాడో తెలుసా?  కేవ‌లం రెండు రోజులు! అవును. రెండంటే రెండు రోజుల్లో ఆ ఫిల్మ్‌ను తీసేశాడు వ‌ర్మ‌. అందులో ఒక అపార్ట్‌మెంట్‌లో ప‌నిమనిషిగా ప‌నిచేస్తూ ఆ అపార్ట్‌మెంట్‌కు ఓన‌ర్ అయితే ఎలా ఉంటుందోన‌ని ఊహ‌ల్లో తేలే పాత్ర‌ను పోషించిన తార పేరు శ్రీ రాపాక అలియాస్ స్వీటీ. ఆమెకు రోజుకు రూ. ల‌క్ష చొప్పున రెండు రోజుల‌కు రెండు ల‌క్ష‌లు రెమ్యూన‌రేష‌న్ ఇచ్చాడు ఆర్జీవీ. ఫిల్మ్‌లో అత్య‌ధిక భాగం వ‌క్ష స్థ‌లాన్ని, తొడ‌ల‌ను ప్ర‌ద‌ర్శించే ఆ ప‌నిమ‌నిషి పాత్రను చేసిన శ్రీ రాపాక.. హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిందంటే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. అంత‌కంటే ఆశ్చ‌ర్యం క‌లిగించేంది.. ఆమె యు.ఎస్‌.లో మాస్ట‌ర్స్ డిగ్రీ చేసింది. అలాంటి ఉన్న‌త విద్యావంతురాలు అలాంటి న‌గ్న పాత్ర చేయ‌డం ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే క‌దా!!
  దేశంలోని అత్యంత అంద‌మైన న‌టుల్లో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ ఒక‌ర‌నేది నిర్వివాదం. "మ‌హేశ్ అనే పేరులోనే వైబ్రేష‌న్ ఉంద‌"నే ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ 'అష్టా చ‌మ్మా' మూవీలోని డైలాగ్ ఓ నానుడిలా మారిపోయింద‌నేదీ నిజం. రెండు ద‌శాబ్దాల పైగా జ‌ర్నీలో హీరోగా అన్ని ర‌కాల ఎత్తుప‌ల్లాలు ఆయ‌న చ‌విచూశాడు. హీరోగా ఇప్ప‌టిదాకా చేసింది 25 సినిమాలే అయిన‌ప్ప‌టికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ఇటు ఇండియా, అటు ఓవ‌ర్సీస్ ఏరియాల రెండింటిలోనూ ఆయ‌న అనేక రికార్డుల‌ను సృష్టించాడు. నిజం చెప్పాలంటే, బాలీవుడ్ స‌ర్కిల్స్‌లో ఎక్కువ‌మందికి తెలిసిన తెలుగు పేర్ల‌లో, ఎక్కువ మంది గౌర‌వించే తెలుగు న‌టుల్లో మ‌హేశ్ ముందున్నాడు. ఇక సోష‌ల్ మీడియా విష‌యానికి వ‌స్తే, త‌న వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌ర విష‌యాల‌ను త‌ర‌చుగా షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్నాడు మ‌హేశ్‌. గురువారం, ఈ సూప‌ర్ స్టార్ ట్విట్ట‌ర్ ప్లాట్‌ఫామ్‌పై 10 మిలియ‌న్ (ఒక కోటి) ఫాలోయ‌ర్స్‌ను క్రాస్ చేసిన మొద‌టి సౌత్ ఇండియ‌న్ యాక్ట‌ర్‌గా మ‌రో రికార్డ్ సృష్టించాడు. ట్విట్ట‌ర్‌లో మ‌హేశ్‌కు స‌మీపంలో మ‌రో ద‌క్షిణాది న‌టుడు లేడు. హ్యాష్‌ట్యాగ్స్‌, స్పెష‌ల్ పోస్టుల ద్వారా ఈ ఘ‌న‌త‌ను సోష‌ల్ మీడియాలో సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్  సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ప‌ని విష‌యానికి వ‌స్తే.. ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌లో 'స‌ర్కారు వారి పాట' మూవీని చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు మ‌హేశ్‌.
  కరోనా కేసులు ప్రతిరోజూ పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. మెగాస్టార్ రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ తప్ప మిగతా ఎవరూ షూటింగ్స్ స్టార్ట్ చేయలేదు. ఈ సమయంలో గోపీచంద్ ముందుకు రావడం డేరింగ్ స్టెప్ అనుకోవాలి. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెండుసార్లు రెడీ అయిన రాజమౌళి, మళ్ళీ క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో తేజ షూటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా 'అలిమేలుమంగ వెంకటరమణ'. ఆగస్టు నుండి షూటింగ్ స్టార్ట్ చేయడానికి హీరో, డైరెక్టర్ రెడీ అవుతున్నారని సమాచారం. గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం 50 మెంబర్స్ క్రూతో షూటింగ్ చేయడానికి తేజ ప్లాన్ రెడీ చేశారట. ఈ సినిమా షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా  జరిగితే మిగతావాళ్లకు ఎగ్జాంపుల్‌గా ఉంటుంది. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు హీరోయిన్‌ను ఫైనలైజ్ చేయాలని అనుకుంటున్నారు. కాజల్ అగర్వాల్, నయనతార, అనుష్క పేర్లు హీరోయిన్ రేసులో ఉన్నాయి.
మంచి కథ వస్తే వెబ్ సిరీస్ చేయడానికి తాను సిద్ధమని హీరో రాజశేఖర్, నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ తెలిపారు. వెబ్ కంటెంట్ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆమె స్పష్టం చేశారు. 'దొరసాని'తో జీవితా రాజశేఖర్ దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక కథానాయికగా పరిచయం అయ్యారు. అంతకు ముందు శివాని హీరోగా '2 స్టేట్స్' రీమేక్ మొదలైంది. అయితే, మధ్యలో సినిమా ఆగడంతో శివాని డెబ్యూ ఆలస్యమైంది. ప్రశాంత్ వర్మ అందించిన కథతో 'పెళ్లి గోల' వెబ్ సిరీస్ దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న ఫాంటసీ ప్రేమకథా సినిమాతో కథానాయికగా శివాని ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నాలుగైదు రోజుల మినహా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని అన్నారామె.  "ఓటీటీలో సినిమా విడుదలకు నేను వ్యతిరేకం కాదు. వీలైనంత మందికి నా సినిమా చేరువ కావాలని కోరుకుంటాను. సినిమా రిలీజ్ విషయంలో మా ప్రొడక్షన్ హౌస్ డెసిషన్ తీసుకుంటుంది. అలాగే, వెబ్ సిరీస్ చేయడానికి నాకు ఇబ్బంది లేదు. కంటెంట్ బావుంటే ప్రజలు ఆదరిస్తారు" అని శివాని రాజశేఖర్ అన్నారు. 
  న‌టి పూన‌మ్ బ‌జ్వా గుర్తుందిగా!.. 'మొద‌టి సినిమా', 'బాస్', 'ప‌రుగు' వంటి సినిమాల్లో మెరిసిన ఆమె ఈ మ‌ధ్య 'య‌న్‌.టి.ఆర్‌: క‌థానాయ‌కుడు' చిత్రంలో ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వ‌రి పాత్ర‌లో క‌నిపించింది. పాపుల‌ర్ అండ్ కాంట్రావ‌ర్షియ‌ల్‌ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజ‌న్‌లో పూన‌మ్‌ కంటెస్టెంట్‌గా క‌నిపించనున్న‌దంటూ ఆన్‌లైన్‌లో జోరుగా ప్ర‌చారం న‌డుస్తోంది. బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన అక్కినేని నాగార్జున ఈ నాలుగో సీజ‌న్‌కూ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ఖాయ‌మైన విష‌యం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం స‌మంత హోస్ట్‌గా ఎంపికైందంటూ జ‌రిగిన ప్ర‌చారంలో నిజం లేద‌ని తేలిపోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా, ఈ షో ప్రిప‌రేష‌న్ ప‌నులు బాగా ఆల‌స్య‌మ‌య్యాయి. ఆగ‌స్ట్‌లో స్టార్ మా చాన‌ల్‌లో బిగ్ బాస్ 4 షో మొద‌ల‌వుతుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. అయితే మునుప‌టి సీజ‌న్ల‌తో పోలిస్తే ఈ సీజ‌న్‌లో ప‌లు మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని తెలుస్తోంది. థ‌ర్డ్ సీజ‌న్ 100 రోజుల పాటు న‌డిచి బ్లాక్‌బ‌స్ట‌ర్ కాగా, ఫోర్త్ సీజ‌న్‌లో ఈ షోను 50 రోజుల‌కు కుదించార‌ని వినిపిస్తోంది. కంటెస్టెంట్లు కూడా 12 మందే ఉంటారంట‌. అందుక‌ని నిర్వాహ‌కులు సాధ్య‌మైనంత ఎక్కువ‌గా షోకు గ్లామ‌ర్‌ను అద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో హంసానందిని, శ్ర‌ద్ధా దాస్ వంటి తార‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా పూన‌మ్ బ‌జ్వా పేరు ఖాయ‌మైంద‌నీ, ఆమె కూడా కాంట్రాక్ట్‌పై సంత‌కం చేసింద‌నీ స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ షోకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెల్ల‌డ‌వ‌నున్న‌ది.
హాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ ఎక్కువ. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్... ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమా ట్రెండ్ ఇటీవల కాలంలో పెరుగుతోంది. హిందీలో 'గోల్ మాల్' ఫ్రాంచైజీలో ఐదు సినిమాలొచ్చాయి. 'దబాంగ్'లో మూడు సినిమాలు వచ్చాయి. సౌతిండియాలో సూర్య 'సింగం' సిరీస్‌లో మూడు సినిమాలు చేశాడు. అయితే, ఇవన్నీ 2000 తరవాత స్టార్ట్ అయినవే. 1988లో చేసిన ఓ సినిమాకు ఇప్పటివరకు నాలుగు సీక్వెల్స్ రావడం, ఐదో సీక్వెల్ తీయడానికి రెడీ కావడం రికార్డు కదా! మలయాళ స్టార్ మమ్ముట్టి 1988లో 'ఓరు సిబిఐ డైరీ కురిప్పు' అని  సినిమా చేశారు. ఆయన కెరీర్‌లో అదొక టర్నింగ్ పాయింట్ సినిమాగా నిలిచింది. మరుసటి ఏడాది 'జాగ్రత్త' అని సీక్వెల్ చేశారు. అదీ హిట్. తరవాత 2004లో 'సేతురామ అయ్యర్ సిబిఐ', 2005లో 'నేరారియన్ సిబిఐ' చేశారు. మళ్లీ 15 ఏళ్ల తరవాత సిబిఐ సినిమా ఫ్రాంచైజీలో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కేరళలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి చిత్రీకరణలు మొదలైన తరవాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట. సౌతిండియాలో ఐదు సీక్వెల్స్ ఇప్పటివరకు రాలేదని, అన్ని సినిమాలు చేసిన రికార్డ్ మమ్ముట్టిదేనని మలయాళ ఇండస్ట్రీ అంటోంది.
  న‌టి పూర్ణ‌ను కిడ్నాప్ చేయాల‌నుకున్న ముఠా ప్ర‌య‌త్నం వారిని పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో విఫ‌ల‌మైంది. కొచ్చి (కేర‌ళ‌) పోలీస్ క‌మిష‌న‌ర్ విజ‌య్ స‌ఖారే చెప్పిన దాని ప్ర‌కారం, పూర్ణ (అస‌లు పేరు షామ్నా కాశిమ్‌)ను కిడ్నాప్ చేయ‌డం ద్వారా ఆమె కుటుంబం నుంచి డ‌బ్బులు గుంజాల‌ని ప్ర‌య‌త్నించిన 12 మంది ముఠా స‌భ్యుల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. స‌మ‌యానికి పూర్ణ ఫిర్యాదు చేయ‌డంతో త‌మ ప్లాన్‌ను అమ‌లు చేయాల‌నుకున్న ఆ నిందితుల‌ను పోలీసులు అడ్డుకోగ‌లిగారు. ఈ విష‌యాన్ని పూర్ణ కూడా ధ్రువీక‌రించింది. త‌మ కుటుంబం బ్లాక్‌మెయిల్ స్కామ్‌కు టార్గెట్ అయ్యింద‌ని ఆమె చెప్పింది. "ముందుగా నిందితులు ఒక ప‌థ‌కం ప్రకారం నాకు పెళ్లి సంబంధం తెచ్చామంటూ మా కుటుంబాన్ని సంప్ర‌దించారు. అయితే మ‌మ్మ‌ల్ని పూర్తిగా త‌ప్పుదోవ ప‌ట్టించే న‌కిలీ పేర్లు, న‌కిలీ అడ్ర‌స్‌లు, మోస‌పూరిత ఐడెంటిటీల‌తో వారు మోసం చేశార‌ని తెలియ‌డంతో మా కుటుంబం వారిపై ఫిర్యాదు చెయ్యాల‌ని నిర్ణ‌యించుకుంది. వాళ్లు బ్లాక్‌మెయిల్‌కు దిగ‌డంతో, లీగ‌ల్ యాక్ష‌న్ కోసం మేం పోలీసుల‌ను సంప్ర‌దించాం. ఇప్ప‌టికీ వాళ్ల ఉద్దేశ‌మేమిట‌నేది మాకు తెలీదు" అని త‌న ఫేస్‌బుక్ పేజీలో పూర్ణ రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఏడుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉండ‌గా, ఒక‌రు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేల‌డంతో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన న‌లుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అందిన స‌మాచారం ప్ర‌కారం పూర్ణ కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌కు చెందిన కొంత‌మంది నుంచి ఈ ముఠా సేక‌రించింది. అయితే ఈ కుట్ర‌లో సినిమా వ్య‌క్తుల‌కు భాగ‌స్వామ్యం ఉండ‌వ‌చ్చ‌నే అనుమానాల‌ను పోలీసులు తోసిపుచ్చారు. వివిధ ఫిర్యాదుల కింద ఈ ముఠాపై పోలీసులు ఏడు కేసుల‌ను న‌మోదు చేశారు. ఈ ముఠా ఈ ఏడాది మొద‌ట్లో ఇదే త‌ర‌హాలో ఎనిమిది మంది మోడ‌ళ్ల నుంచి డ‌బ్బు గుంజింద‌ని రిపోర్టులు తెలియ‌జేస్తున్నాయి.
  తెలుగు టీవీ తార న‌వ్య స్వామి కొవిడ్‌-19 పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. 'నా పేరు మీనాక్షి' (ఈటీవీ), 'ఆమె క‌థ' (స్టార్ మా) సీరియ‌ల్స్ ద్వారా ఆమె పాపుల‌ర్‌. ప్ర‌స్తుతం ఆమె సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. మూడు నాలుగు రోజుల పాటు త‌ల‌నొప్పితో బాధ‌ప‌డిన ఆమె, డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు టెస్ట్ చేయించుకోగా కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. "ఆ విష‌యం వెల్ల‌డ‌వ‌గానే, ఇంటికి వెళ్తూ తెగ ఏడ్చేశాను. నిద్ర ప‌ట్ట‌లేదు. మా అమ్మ అయితే ఇంకా ఏడుస్తూనే ఉంది. నా ఫోన్ బిజీగా మోగుతూనే ఉంది. చాలామందితో మాట్లాడుతూనే ఉన్నాను. ల‌క్ష‌ణాల గురించీ, చికిత్స గురించీ, ఇంకా అనేక విష‌యాలు అడుగుతూ నా వాట్సాప్‌కు మెసేజ్‌లు ప్ర‌వాహంలా వ‌స్తూనే ఉన్నాయి. నా ప‌ని అధ్వాన్న‌మైపోయింది. నా స‌హ న‌టుల‌ను, సాంకేతిక నిపుణుల‌ను, ఇత‌ర సిబ్బందినీ ట్ర‌బుల్స్‌కు గురి చేశాన‌నీ ఇప్ప‌టికీ గిల్టీగా ఫీల‌వుతున్నా" అని ఆమె చెప్పింది. రెండు వారాల క్రితం నుంచీ ఆమె సీరియ‌ళ్ల షూటింగ్స్‌లో పాల్గొంటూ వ‌స్తోంది. ఇప్పుడు ఆమెతో క‌లిసి ప‌నిచేసిన వాళ్లంతా కొవిడ్‌-19 టెస్టులు చేయించుకొని, క్వారంటైన్‌లోకి వెళ్లిన‌ట్లు స‌మాచారం.
ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.
* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.
* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.
* క్వారంటైన్ ను ఎప్పటి నుంచో జీవన విధానంగా మలుచుకున్న యనమల కన్నా, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలే బెటరని నేతల్లో అభిప్రాయం  * చంద్రబాబు నాయుడు 24X 7 ప్రజా క్షేత్రంలో ఉన్నా, యనమల మాత్రం పత్రికా ప్రకటనలకే  పరిమితం కావటం పై ఆక్షేపణ  ఎసెట్స్, లయబిలిటీస్ అని మనం చదువుకుంటూ ఉంటాం. ఆంధ్ర ప్రదేశ్ లో, ఆ మాట కొస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కి లయబిలిటీ గా మారిన చాలామంది నేతల్లో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు అనే భావన చాల మంది నాయకుల్లో బలంగా ఉంది.  పలుకే బంగారమాయెరా పద్ధతిలో ఆయన తనను తాను  ప్రెస్ నోట్స్ కు మాత్రమే పరిమితం చేసుకుని, సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోవటం ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నించీ చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన చాలా సీనియర్ మోస్ట్ కావటం వల్లనూ, పార్టీ లో ఆయనకు చంద్రబాబు నాయుడు అత్యంత ప్రయారిటీ ఇవ్వటం కారణం గానూ, ఎన్ఠీఆర్ ను పదవీచ్యుతుని చేసిన సమయం లో ఆయన అద్భుతమైన 'శ్రమదానం' చేసినందువల్లనూ --ఇప్పటికీ తెలుగు దేశం నాయకులు ఆయన్ను అరమోడ్పు కన్నులతో, ఆరాధ్య పూరిత దృక్కులతో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అలా, తనదైన శైలిలో- పార్టీ లో 'సరిలేరు నాకెవ్వరు' టైటిల్ పెట్టుకుని మహరాజులా వెలిగిపోతున్న యనమల రామకృష్ణుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మీద ప్రెస్ రిలీజ్ లో చెడా మడా నిప్పులు చెరిగేశారు. అలా చెరిగిన నిప్పులలో-కొన్ని నిప్పురవ్వలను మీ కోసం ప్రత్యేకంగా అందచేస్తున్నాం.  రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో వైసిపి ప్రభుత్వ వైఫల్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల, ఉపశమన చర్యలు శరవేగంగా చేపట్టాలని, ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు. "విపత్తుల్లో ప్రజలను కాపాడేవాడే పాలకుడు. ఆపదల్లో అండగా ఉండటం నాయకత్వ లక్షణం. అలాంటిది ప్రజలను కష్టాల్లో వదిలేయడం రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే.  రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతం. పాలకుల ఉదాసీనత వల్లే  రాష్ట్రంలో కరోనా విస్తృతం. వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించిన రూ 11,399కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు..? రూ 11,399కోట్ల బడ్జెట్ పెట్టి, కరోనా మాస్క్ లకు రూ 30కోట్లే ఇస్తారా," అంటూ ఆవేశంగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను నిలదీశారు.  ఇదేనా మీరు చెప్పిన ‘‘నాడు-నేడు’’..? నాడు సీఎంగా చంద్రబాబు ఇలాగే చేశారా..? నేడు సీఎంగా మీరెలా చేస్తున్నారో ప్రజలే చూస్తున్నారంటూ కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను కడిగి పారేశారు. విపత్తుల్లో చంద్రబాబు పనితీరుకు, మీ పనితీరుకు ప్రజలే బేరీజు వేస్తున్నారంటూ కూడా హెచ్చరించారు. " టిడిపి ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ పెట్టకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? డాక్లర్లు, వైద్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు ఉండేవేనా..? మెడ్ టెక్ జోన్ పై చేసిన ఆరోపణలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గత ఏడాది రూ 2,27,975కోట్ల బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు. తొలి 6నెలల్లో 35%కూడా ఖర్చు చేయలేదు. రెవిన్యూ వ్యయమే తప్ప కేపిటల్ వ్యయం శూన్యం. 65% నిధులు మీవద్దే ఉంటే ఉద్యోగుల జీతాల్లో కోతలు ఎందుకు," అంటూ యనమల ఆ పత్రికాప్రకటనలోనే ఆగ్రహం తో ఊగిపోయారు.  కరోనా నిరోధానికి నిధులు ఎందుకివ్వరు..? డాక్టర్లు, సిబ్బందికి మాస్క్ లు, రక్షణ ఉపకరణాలు ఎందుకు కొనరు..?పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల పనులు నిలిపేశారు. అమరావతి సహా అభివృద్ది పనులన్నీ నిలిపేశారు.  విపత్తు నిర్వహణకు, నరేగా కు, 14వ ఆర్ధిక సంఘ నిధులు, డివల్యూషన్ నిధులు, కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఏం చేశారు..? 11నెలల్లో అభివృద్ది శూన్యం, పేదల సంక్షేమం నిల్.. కరోనా ఉపశమన చర్యలు కూడా మొక్కుబడిగానే.. డిసెంబర్ లోనే విదేశాల్లో కరోనా ప్రభావం ప్రారంభం. జనవరి 3వ వారంలో మనదేశంపై కరోనా ప్రభావం. నాలుగో క్వార్టర్ పై కరోనా ప్రభావం చూపింది. మరి మొదటి 3క్వార్టర్లలో మీరు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏమిటి..? కరోనా రాకముందు ఏం చేయలేదు, కరోనా వచ్చాక చేసిందేమీ లేదని కూడా జగన్ మోహన్ రెడ్డి లెక్క తేల్చేశారు.  కరోనాపై కేంద్ర మార్గదర్శకాలు గాలికొదిలేశారు. లాక్ డౌన్ కు వైసిపి నేతలే తూట్లు పొడుస్తున్నారు. కరోనా వ్యాప్తి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సాహమా..? ఈ విపత్తులోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తారా..?కరోనాలోనూ మీ అవినీతి,అక్రమాలు మానుకోరా, అంటూ నిప్పులు చెరిగారు. లోడింగ్ కార్మికులకు కరోనా సోకితే బాధ్యత ఎవరిది..? లాక్ డౌన్ పీరియడ్ లో వందల లారీల్లో ఇసుక తరలింపులా..? ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారు..? మద్యం అక్రమ విక్రయాలను ప్రోత్సహిస్తారా, అని కూడా తన ప్రెస్ రిలీజ్ లో ఆయన ప్రశ్నించారు.  ఏడాది గడుస్తున్నా పరిపాలనపై సీఎంకు అవగాహన లేదు. సంబంధిత శాఖలపై ఏ ఒక్కమంత్రికి పట్టు దొరకలేదు. స్వప్రయోజనాలే తప్ప ప్రజారోగ్యంపై వైసిపి నేతలకు శ్రద్ద లేదు. టిడిపి హయాంలో ఏ అభివృద్ది పని ఆగలేదు. ఏ సంక్షేమ పథకం రద్దు చేయలేదు. పైగా అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించాం. అనేక అభివృద్ది ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. విపత్తుల్లో బాధిత ప్రజానీకాన్ని ఆదుకున్నాం. హుద్ హుద్ లో, తిత్లి తుపాన్ లో ఎలా ఆదుకున్నామో ప్రజలకు తెలుసునని కూడా యనమల గుర్తు చేశారు.  విపత్తులంటే సీఎం జగన్ కు భయం. ఎప్పుడు విపత్తులు వచ్చినా పత్తా ఉండరు. తిత్లి తుపాన్ లో, మొన్న గోదావరి, కృష్ణా వరదల్లో ఎక్కడ ఉన్నారో ప్రజలు మరిచిపోలేదు. పాలకుల నిర్లక్ష్యం  ప్రజలకు శాపం కారాదు. ఇప్పటికైనా కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేయాలి. ఫ్రంట్ లైన్ వారియర్లకు రక్షణ ఉపకరణాలు అందజేయాలి. వైద్య ఆరోగ్య శాఖకు నిధులు విడుదల చేయాలి. రైతుల వద్ద పంట ఉత్పత్తులు వెంటనే కొనుగోలు చేయాలి. ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇలా ఆయన ప్రెస్ రిలీజ్ సాంతం ఆయన జగన్ మోహన్ రెడ్డి ని కడిగేసి, నిప్పులు చెరిగి చంద్రబాబు నాయకత్వం పట్ల తన విధేయతను ను ఎప్పటిలాగానే-కాగితం రూపేణా తీర్చుకున్నారు. "జగన్ మోహన్ రెడ్డి ఈ ఎనిమిది నెలల నుంచే క్వారంటైన్ లో ఉన్నారు. మా యనమల వారు రాజ్యం చేసినంత కాలం ఎక్కువ సమయం క్వారంటైన్ లో గడిపిన సన్నివేశాలను, సందర్భాలను ఇప్పుడో సరి మేము గుర్తు చేసుకుంటున్నాం, ఎలాగూ కరోనా కారణంగా కాస్తంత వీలు చిక్కింది," అంటూ టీ డీ పీ నాయకులు నిట్టూరుస్తున్నారు.
  * మూడు శతాబ్దాలలో మూడు కరువుల ను ఎదుర్కున్న ఆంధ్ర ప్రదేశ్ * 1791-95, 1832-1833, 1929-39 మధ్య ఎదుర్కున్న కరువుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి * రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు శాసనాల్లో-ఇలాంటి కరువును ఎలా ఎదుర్కోవాలో స్పష్టం గా రాసి ఉంది * వెంకటాద్రి నాయుడు వంటి జనహిత పాలకుల విధానాలే ఇప్పుడు మనకి శ్రీరామ రక్ష మరో రెండు నెలలు కరోనా తన కోరలను, పంజాను ఇలాగే విసిరితే, ఆంద్ర ప్రాంతం లోనే కాదు, దేశం లోనే చాలా ప్రాంతం లో మూడు శతాబ్దాల నాటి డొక్కల కరువు పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో (1791-95) ఒకటిన్నర కోటి మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెప్తాయి. డొక్కల కరువుగా కూడా పేరు గడించిన ఈ కరువులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభైలక్షల మంది బలయ్యారు. కరువు వల్ల ప్రాణ నష్టమే కాదు పశువులు, విత్తనాలూ నష్టమయ్యేవి. రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మరలా కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తరచూ కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొలదీ సన్నకారు రైతులు, కూలీలు సుదూరమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయారు. 1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు బీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.     కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు. పలువురు మహనీయులు డొక్కల కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు తమవంతు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు. వారిలో కొందరి పేర్లు:   సర్ సి.పి.బ్రౌన్ గా ఆంద్ర ప్రజానీకానికి సుపరిచితుడైన ఆంగ్ల అధికారి, 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు చేసిన సేవలు, పలువురు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. అలాగే, ఏనుగుల వీరాస్వామయ్య అనే యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు కూడా పేదలకు ఆ సమయం లో అండగా నిలిచాడు వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన వీరాస్వామయ్య నందన కరువులో చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.     కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై గా చెన్నై ప్రాంతం లో పేరున్న సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన తన దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, 1929-39 సంవత్సరాల మధ్య వచ్చిన మరో కరువు ను కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. దీనివల్ల, గుంటూరు జిల్లా లోనూ , ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన కరువు వల్ల , దాదాపు 50 వేల అధికారిక మరణాలు నమోదైనట్టు ఆ సమయం లో గుంటూరు జిల్లాలో తహసీల్దార్ గా పని చేసిన పత్రి లక్ష్మీ నరసింహారావు రాసుకున్న డైరీ లో లభ్యమైన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆయన అప్పట్లో బ్రిటీష్ యంత్రాంగానికి రాసిన లేఖలు, తర్వాత అప్పటి బ్రిటీష్ అధికారులు తీసుకున్న నష్ట నివారణ చర్యల ప్రస్తావన కూడా ఆయన డైరీ లో ప్రముఖంగా ఉంది. అంటే, గడిచిన మూడు శతాబ్దాల కాలం లో ఆంధ్ర ప్రాంతం మూడు రకాల కరువును ఎదుర్కొని, చరిత్రలో నిలిచిపోయే విషాదాలను నమోదు చేసుకుంది. ఇప్పుడు , కరోనా సన్నద్ధత చర్యల విషయం లో వెనుకంజ వేస్తె, ఎకానమీ రివర్సల్ జరుగుతుందని, దానివల్ల సంభవించే విపరిణామాలు వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై, తిండి గింజలకు వెతుక్కునే పరిస్థితి వస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సుప్రీంకోర్టు లో రాష్ట్ర  ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయం మరియు ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలని ఆదేశాలు. ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఆరు వారాల తర్వాత కూడా పరిస్తితిపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఈసి కి అప్పగించిన సుప్రీంకోర్టు. దీంతో పాలక వై ఎస్ ఆర్ సీ పీ నిరాశకు గురైంది.  ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టులో విచారణ విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం, స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం వాదనలు విన్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తెలిసిందే. ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్న ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ పిటిషన్ లో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి . రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఎన్నికలకు నిర్వహణ కు సంబంధించి ఇది సుప్రీం తీర్పుకు విరుద్దం. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం. ఈ వ్యవహారం పై చీఫ్ సెక్రటరీ కి, ఎన్నికల కమిషనర్ కు మధ్య లేఖల యుద్ధం కూడా నడిచింది. హైకోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం తగునా, అని కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాల నీ కూడా కోరింది. పంతాని కి పోయినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రంకోర్టు లో చుక్కెదురైంది.
  బంగారు తెలంగాణ భ్రమల్లో జనాన్ని ముంచెత్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేయడం మినహా రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిదిద్దడానికీ, వనరుల సక్రమ వినియోగానికీ, పేదల దీనస్థితిని తొలగించడానికి చేపట్టిన చర్యలేమీ ఈ బ‌డ్జెట్‌లో లేవు. అవధులు లేని హామీలతో ప్రజలను నిరంతరం మభ్యపెట్టే కేసీఆర్‌ సర్కారు ఎత్తుగడలో భాగంగానే అంకెల గారడీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను తీర్చిదిద్దారు. రాష్ట్రం ఏర్పడితే.. అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుం దనీ, సంపదను పెంచడమే కాదు, పంచడమూ జరుగుతుందనీ ఎంతగానో ఆశించిన ప్రజలకు ఈ బడ్జెట్లన్నీ నిరాశనే మిగిల్చాయి. ప్రణాళికలు, పథకాలు, ప్రకటనలు, నిధులు, వ్యూహాలు.. అన్నీ కాగితాలకూ, అంచనాలకూ, అంకెలకే పరిమితమ వుతున్నాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడంలేదు. ప్రజలపై పన్నుపోటు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమంతా పరివర్తనా సూత్రాన్ని అంగీకరించా లంటూ ఎడ్మండ్‌ బర్క్‌ను ఆర్థికమంత్రి ఉటంకించారు. నిజమే ఈ పరివర్తన ఏమిటి? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమా? వ్యవసా యాన్ని నీరుగార్చి రైతులను ఆత్మహత్యలకు గురిచేయడమా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కుల వృత్తులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్లు చెప్పిన మాటలు వినసొంపు గానే ఉన్నాయి. పల్లెల పరిపుష్టతకు ప్రాణాధారమైన వ్యవసాయం గాలిలో దీపంగా మారింది. రైతు జీవితం తెగిన గాలిపటమైంది. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2750మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటే సర్కారు మాత్రం 340 ఆత్మహత్యలే జరిగినట్లు చెబుతూ కేవలం 40మందికే పరిహారం ఇచ్చింది. అసలు రైతుల బతుకులపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.5,942.97కోట్లు కేటాయించినా.. ఖర్చుచేసేది ఎంత అన్న ప్రశ్న తలెత్తుతున్నది. గత బడ్జెట్లలో నీటి ప్రాజెక్టులకు 25వేలకోట్లు కేటాయించి, 10వేలకోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టుల కన్నా ప్రచారానికే ఎక్కువ నిష్ఫత్తిలో దుర్వినియోగం చేస్తున్న ఘనత ఈ సర్కార్‌ది. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టును నిర్దిష్టంగా పూర్తిచేయలేదు. 2013-14లో 49,23,003 హెక్టార్లలో సాగు ఉండగా, 2015-16లో 41,74,532 హెక్టార్లలోనే సాగైనట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. సాగు ఎందుకు తగ్గింది? ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 2013-14లో వచ్చిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు 6,844 కాగా, 2015-16లో కేవలం 3,779 మాత్రమే వచ్చాయి. పెట్టుబడులు రాక కూడా మూడువేల కోట్ల నుంచి పదిహేను వందల కోట్లకు తగ్గింది. పారిశ్రామికాభివృద్ధిరేటు గ్రాఫ్‌ పడిపోయిన విషయం సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది టీఎస్‌ ఐపాస్‌ కింద 3,325 పరిశ్రమలకు అనుమతులిచ్చారు. కాబట్టి అవన్నీ వచ్చినట్లుగా భావించాలంటున్నారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా ఊహించుకొంటూ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ అంచనాలు మాత్రమేనని ఆర్థిక సర్వే చెప్పింది. మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు అయ్యే ఖర్చును బడ్జెట్‌లో చూపించలేదు. రైతుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రయివేటు అప్పులు, పెట్టుబడి ఖర్చులు, విత్తన సమస్యలు, మద్దతు ధర వంటి సమస్యలే అన్నదాతల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఈ అంశాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టిపెట్టిన సంకేతాలేవీ ఈ బడ్జెట్‌లో కనిపించడంలేదు. రాష్ట్రంలో అత్యధిక మందికి అత్యవసర మైన ఈ అంశాలను బడ్జెట్‌ పూర్తిగా విస్మరించింది. పారిశ్రామిక సంక్షోభం నేపథ్యంలో ఉపాధి సమస్య వేధిస్తోంది. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నాయి. మద్యం మహమ్మారి పేదల ప్రాణాలను ఆబగా హరిస్తోంది. వీటిని పరిష్కరించే యోచన లేకుండా కలగూరగంపగా తయారుచేసిన ఈ బడ్డెట్‌తో ముందుముందు అప్పులు, పన్నులు, విద్యుత్‌ భారాలు ప్రజల నడ్డి విరిచేస్తాయని చెప్పకతప్పదు.
ఇండియన్ క్రికెట్‌లోనే కాకుండా వరల్డ్ క్రికెట్‌లోనే నంబర్ వన్ క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటూ వస్తున్న విరాట్ కోహ్లీ తాజా న్యూజిలాండ్ పర్యటనలో బ్యాట్స్‌మన్‌గా దారుణంగా విఫలమవడం ఇండియన్ క్రికెట్ ప్రేమికుల్నే కాకుండా అతని అభిమానుల్నీ తీవ్రంగా నిరాశపరచింది. టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా మూడు ఫార్మట్లలోనూ బ్యాట్స్‌మన్‌గా అతను విఫలమవడం విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరచింది. మూడు ఫార్మట్లలో కలిపి 11 ఇనింగ్స్ ఆడిన విరాట్ చేసిన మొత్తం పరుగులు కేవలం 218.  న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టెస్ట్ ప్లేయర్‌గా నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న విరాట్, సిరీస్ ముగిసే సరికి రెండో ర్యాంకుకు దిగజారాడు. విరాట్ పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మళ్లీ నంబర్ వన్ ర్యాంకును అందుకున్నాడు. టెస్టుల్లో ఓవరాల్‌గా 53.62 యావరేజ్ కలిగిన విరాట్, న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్ ఆడి సాధించిన యావరేజ్ ఎంతో తెలుసా? కేవలం 9.5.  ఈ నాలుగు ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ సాధించడం మాట అటుంచి ఏ ఇన్నింగ్స్‌లోనూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లో అత్యని హయ్యెస్ట్ స్కోర్ 19 రన్స్. ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతను ఈ స్కోర్ చేశాడు. అతను ఈ టెస్ట్ సిరీస్‌లో చేసిన పరుగులు వరుసగా.. 2, 19, 3, 14. మొత్తం రన్స్ 38. అతనికంటే ఎక్కువగా 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి 44 పరుగులు చేయడం గమనార్హం. టెస్టుల్లో 2011లో అరంగేట్రం చేసిన విరాట్ ఇంత ఘోరంగా ఆడటం ఇది రెండోసారి మాత్రమే. ఇదివరకు 2016-17లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 9.2 యావరేజ్‌తో 46 పరుగులు చేశాడు. అతని కెరీర్ మొత్తమ్మీద అదే అతని పూరెస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌తో దాని దగ్గరకు వచ్చాడు. ఇక రెండో టెస్ట్ సందర్భంగా మైదానంలో కోహ్లీ ప్రవర్తన అతనికి చెడ్డపేరు తీసుకొచ్చింది. కెప్టెన్‌గానూ అతను టెస్ట్, వన్డే సిరీస్‌లో విఫలమయ్యాడు. మొదట వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన అతడు ఇప్పుడు 0-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్‌కు సమర్పించుకున్నాడు. గుడ్డిలో మెల్లగా మొదటగా జరిగిన టీ20 సిరీస్‌ను మాత్రం 5-0తో వైట్ వాష్ చేయగలిగాడు. అయితే అందులోనూ బ్యాట్స్‌మన్‌గా అతను వైఫల్యం చెందాడు. అంతర్జాతీయంగా 82 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ యావరేజ్ 50.80. కానీ ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతని సగటు 26.25 మాత్రమే. అతడి హయ్యెస్ట్ స్కోర్ 45. మిగతా మూడు మ్యాచ్‌లలో వరుసగా 11, 38, 11 స్కోర్లు చేశాడు. రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ పరుగుల వర్షం కురిపించడం వల్లే టీ20ల్లో భారత జట్టు విజేతగా నిలవగలిగింది. గాయం కారణంగా వన్డే, టెస్ట్ సిరీస్‌లలో రోహిత్ లేని లోటు సుస్పష్టంగా కనిపించింది. ఫాంలో ఉన్న కె.ఎల్. రాహుల్‌ను టెస్టుల్లోకి తీసుకోకుండా విరాట్ తీవ్ర తప్పిదం చేశాడని విశ్లేషకులంతా ముక్త కంఠంతో విమర్శిస్తున్నారు. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ యావరేజ్ 25 మాత్రమే. టూర్ మొత్తం మీద అతడు హాఫ్ సెంచరీ చేసింది ఈ వన్డే సిరీస్‌లోనే. అది మొదటి వన్డేలో 51 పరుగులు చేశాడు. మూడు రకాల ఫార్మట్లలో ఒక ఇన్నింగ్స్‌లో అతడి హయ్యెస్ట్ స్కోర్ ఇది. ఆ తర్వాత రెండు వన్డేల్లో అతడు చేసిన రన్స్ వరుసగా 15, 9. ఇప్పటివరకూ 248 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ టోటల్ యావరేజ్ 59.33 కావడం గమనార్హం. ఈ గణాంకాలే న్యూజిలాండ్ టూర్‌లో అతడు ఏ స్థాయిలో వైఫల్యం చెందాడో తెలియజేస్తున్నాయి. బౌలర్ నుంచి వచ్చే బంతిని అతని కన్ను నిశితంగా గమనిస్తుందనీ, దాని గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి, చాలా వేగంగా స్పందించి షాట్ కొడతాడనీ కోహ్లీని విశ్లేషకులతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అయితే అతని చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందని, అందుకే అలవోకగా ఫోర్లు కొడతాడని అంటుంటారు. ఫ్రంట్ ఫుట్ ఆడటంలో విరాట్‌ని మించిన వాడు లేడని కూడా వాళ్లు కితాబునిస్తుంటారు. అంటే అనేకమంది ఇతర బ్యాట్స్‌మెన్ కంటే అతడు ఎక్కువగా కవర్ డ్రైవ్స్ ఆడతాడు. చాలామంది స్క్వేర్ కట్ కొట్టే బంతుల్ని అతడు కవర్ డ్రైవ్ కొడతాడు. అంతేకాదు, చాలామంది దూరంగా పోతుందని వదిలేసే బంతుల్ని కూడా విరాట్ కవర్ డ్రైవ్స్ ఆడతాడు. అంత లాఘవంగా ఆ షాట్లను ఆడతాడని అతను పేరుపొందాడు. అలాంటివాడు రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడు ఎల్బీడబ్ల్యూ అయిన తీరు నిర్ఘాంతపరచింది. అయితే తన బ్యాటింగ్‌లో ఎలాంటి లోపమూ లేదని అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ క్యాచ్ అవుట్ అయ్యాక, న్యూజిలాండ్ టూర్‌లో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి అడిగినప్పుడు "నా బ్యాటింగ్ బాగానే ఉంది" అని జవాబిచ్చాడు విరాట్. కొన్నేసి సార్లు స్కోర్లు బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబించవనీ, బంతిని సరిగా ఎగ్జిక్యూట్ చెయ్యకపోవడం వల్ల అవుటవ్వాల్సి వస్తుందనీ అతను చెప్పాడు. జట్టు గెలిస్తే.. 40 పరుగులు చేసినా గొప్పగానే ఉంటుందనీ, జట్టు ఓడితే.. సెంచరీ చేసినా వేస్టయిపోతుందనీ అతను వాదించాడు. కానీ న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ బాడీ లాంగ్వేజ్‌లోనే తేడా కనిపించిందనీ, బ్యాటింగ్ చేసేటప్పుడు మునుపటి ఈజ్ అతనిలో లోపించిందనీ క్రికెట్ అనలిస్టులు చెప్తున్న మాట. తదుపరి సిరీస్‌కైనా మనం మునుపటి గ్రేట్ బ్యాటింగ్ పర్ఫార్మర్‌ను విరాట్‌లో చూడగలమా? వెయిట్ చేద్దాం.
తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.
21వ శ‌తాబ్దం వ‌చ్చేసింది. ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అని అంద‌రికీ అన్ని సౌక‌ర్యాలూ అందుబాటులో ఉంటున్నాయి. ఆరోగ్య‌ప‌రంగానూ, సాంకేతికంగానూ మున్ముందుకి అడుగులు వేస్తున్నాం. అన్నింటికీ మించి ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల వివ‌క్ష‌త త‌గ్గింద‌న్న అంచ‌నాలూ ఉన్నాయి. నిజానికి ఆడ‌పిల్లల జీవితాలు ఏమాత్రం మార‌లేదంటూ ఓ ప‌రిశోధ‌న వెలువ‌డింది. ఇంగ్లండులోని లివ‌ర్‌పూల్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కులు ఆడ‌పిల్ల‌ల మ‌న‌స్థితి మీద ఒక అధ్య‌య‌నం చేశారు. ఒక‌టీ రెండూ కాదు... ఏకంగా 14 ఏళ్ల పాటు గ‌ణాంకాల‌ను సేక‌రించారు. ఇందుకోసం 2000-2001లో జ‌న్మించిన దాదాపు ప‌దివేల మంది పిల్ల‌ల‌ను నిశితంగా గ‌మ‌నించారు. 3, 5, 7, 1, 14 ఏళ్ల‌లో వారి మ‌న‌స్త‌త్వం ఎలా ఉందో అంచ‌నా వేసే ప్ర‌య‌త్నం చేశారు. అనేక ప్ర‌శ్నాప‌త్రాల ద్వారా పిల్ల‌ల మ‌న‌స్థితిని గ‌మ‌నించారు. మ‌గ‌పిల్ల‌లైనా, ఆడ‌పిల్ల‌లైనా చిన్న‌ప్పుడు అంతా సంతోషంగానే క‌నిపించారు. వారి మ‌న‌సుల్లో పెద్ద‌గా క‌ల‌త క‌నిపించ‌లేదు. కానీ వ‌య‌సు పెరుగుతున్నకొద్దీ... ఆడ‌పిల్ల‌ల మ‌న‌సు కుంగిపోవ‌డాన్ని గ‌మ‌నించారు. ఇలా కాస్తోకూస్తో కాదు... ప‌ధ్నాలుగో ఏడు వ‌చ్చేసరికి దాదాపు నాలుగోవంతు మంది ఆడ‌పిల్ల‌లలో డిప్రెష‌న్ తాలూకు ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. అదే మగ‌పిల్ల‌లో అయితే కేవ‌లం ప‌దిశాతం లోపుమంది పిల్ల‌ల‌లోనే డిప్రెష‌న్ సూచ‌న‌లు క‌నిపించాయి. కుటుంబ ఆర్థిక‌ప‌రిస్థితులు క‌నుక బాగోలేక‌పోతే.... డిప్రెష‌న్‌కు లోన‌య్యే ప్ర‌మాదం మ‌రింత తీవ్రంగా ఉండ‌టం మ‌రో విషాదం. సాధార‌ణంగా పిల్ల‌లు త‌మ మ‌న‌సులోని దుగ్ధ‌ను స్ప‌ష్టంగా చెప్పుకోలేరు. కుటుంబంలోని పెద్ద‌లే, పిల్ల‌ల మ‌న‌సులోని విచారాన్ని ఊహించే ప్ర‌య‌త్నం చేయాలి. దుర‌దృష్ట‌వ‌శాత్తూ మ‌గ‌పిల్ల‌లని మ‌న‌సుని ప‌సిగ‌ట్టేసే పెద్ద‌లు, ఆడ‌పిల్ల‌ల మ‌న‌సులో ఏం మెదులుతోందో ఏమాత్రం ఊహించలేక‌పోతున్నార‌ట‌. దాంతో ఆడ‌పిల్ల‌ల మ‌న‌సుని సాంత్వ‌న ప‌రిచే ప‌రిస్థితులు లేక‌, వారు మ‌రింత‌గా డిప్రెష‌న్‌లోకి కూరుకుపోతున్నారు. పైగా మ‌గ‌పిల్ల‌ల‌తో పోలిస్తే ఆడ‌పిల్ల‌లు ఎదుర్కొనే ప‌రిస్థితులు విభిన్నంగా ఉంటాయి. శారీరికంగానూ, మాన‌సికంగానూ వారు ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఎదిగేకొద్దీ ఏదో ఒక రూపంగా వారికి వివ‌క్ష ఎదుర‌వుతూనే ఉంటుంది. ఇవ‌న్నీ కూడా వారి మ‌న‌సుల మీద చెర‌గ‌ని గాయం చేస్తాయి. మ‌గ‌పిల్ల‌లతో పోలిస్తే, ఆడ‌పిల్ల‌ల‌ని మ‌రింత కంటికిరెప్ప‌లా కాపాడుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఈ ప‌రిశోధ‌న గుర్తుచేస్తోంది. దీనిని త‌ల్లిదండ్రులు ఓసారి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే... ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తు మ‌రింగ బాగుంటుందేమో! - నిర్జ‌ర‌.  
అతనో పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగి. సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేయడంలోనే అతనికి అంతులేని తృప్తి ఉండేది. అలా పనిచేసని ప్రతిసారీ అతనికి పై అధికారుల నుంచి అభినందనలో, పదోన్నతలో లభించేసరికి... తను ఆ సంస్థకి ఉన్నతికి ఎంతగా అవసరమో తెలిసొచ్చేది. అలాంటి ఉద్యోగి ఓ అర్ధరాత్రి వేళ తన ఇంటికి చేరుకునేసరికి, అక్కడ తన పదేళ్ల కొడుకు ఇంకా మేలుకునే కనిపించాడు. ‘‘ఇంత రాత్రయ్యింది ఇంకా పడుకోలేదా’’ అంటూ చిరాగ్గా కొడుకుని అడిగాడు ఉద్యోగి. అతని మనసులో ఇంకా ఉద్యోగం తాలూకు చిరాకు అలానే ఉంది. ‘‘లేదు! నీతో కలిసి తిందామని ఎదురుచూస్తున్నాను’’ అన్నాడు కొడుకు దీనంగా. ‘‘నాతో నీకు పోటీ ఏమిటి! సమయానికి తిని, చదువుకొని, పడుకోక..’’ అంటూ విసుగ్గా భోజనాల బల్ల దగ్గరకి చేరుకున్నాడు తండ్రి. కొడుకు ఏమీ మాట్లాడకుండా ఒకో ముద్దా నిదానంగా తింటున్నాడు. అలా తింటూనే తండ్రి వంక చూస్తున్నాడు. తండ్రి ఇంకా తన ఆఫీసు వ్యవహారాల నుంచి బయటపడలేదు. తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ, ఏవో మెయిల్స్ చూసుకుంటూ అన్యమనస్కంగా భోజనం చేస్తున్నాడు. ‘‘నాన్నా! నువ్వు రోజుకెంత సంపాదిస్తావు?’’ అని హఠాత్తుగా అడిగాడు కొడుకు. ఆ మాటలకి తండ్రికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ‘‘నీకసలు బుద్ధుందా! పెద్దవాళ్లను ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని తెలియదా! అయినా అడిగావు కాబట్టి చెబుతున్నా విను. నా జీతం రోజుకి రెండువేలు. నా తోటివారందరికంటే అది రెట్టింపు. ఎంత కష్టపడితనే నేను ఈ స్థాయికి చేరుకున్నానో తెలుసా!’’ అన్నాడు తండ్రి. అతని మాటలలో తెలియని గర్వమేదో తొణికిసలాడింది. కొడుకు కాసేపు ఏం మాట్లాడలేదు. అటు తరువాత బిక్కుబిక్కుమంటూ ‘‘నాన్నా! నాకు ఓ వేయి రూపాయలు ఇవ్వగలవా!’’ అంటూ అడిగాడు.   ఆ మాటలతో తండ్రిలోని కోపం నషాళానికంటింది. ‘‘ఇందాకేమో! నీ జీతం ఎంత అని అడిగావు. ఇప్పుడేమో ఓ వేయి రూపాయలు ఇమ్మంటున్నావు. ఇలా నన్ను విసిగించడానికేనా ఇంత రాత్రివేళ మెలకువగా ఉన్నది. అయినా అంత డబ్బుతో నీకేం పని...’’ అంటూ నానా తిట్లూ తిట్టి చివరికి ఓ వేయి రూపాయల నోటు కొడుకు మొహం మీద విసిరికొట్టాడు. కొడుకు కళ్లమ్మట నీళ్లు తిరుగుతుండగా నిదానంగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. తండ్రి భోజనం పూర్తయ్యింది. ఇక పడుకుందామనుకుంటూ ఉండగా కొడుకు గుర్తుకువచ్చాడు. ‘పాపం తెలిసీతెలియని వయసు. వాడిని మరీ ఎక్కువగా తిట్టాను. ఆఫీసులో కోపమంతా వాడిమీదే చూపించాను,’ అని జాలిపడుతూ ఓసారి కొడుకు గదిలోకి తొంగిచూశాడు. కొడుకు ఇంకా మెలకువగానే ఉన్నాడు. వాడి ముందు బోలేడు చిల్లర ఉంది. ‘వాడేదో కొనుక్కోవాలనుకొని డబ్బులు పోగేసినట్లున్నాడు. దానికి తక్కువ కావడంతో నన్ను అడిగాడు పిచ్చివెధవ’ అనుకున్నాడు. కొడుకు భుజం మీద చేయివేసి- ‘ఏం నాన్నా! ఏం కొనుక్కోవాలనుకుంటున్నావు. నేను ఇచ్చిన డబ్బుతో లెక్క సరిపోతుందా’ అని అనునయంగా అడిగాడు. కొడుకు బెరుకుగా- ‘‘నాన్నా వచ్చే సోమవారం నా పుట్టినరోజు. ఆ రోజు నువ్వు నాతోపాటు ఇంట్లోనే ఉంటావా!’’ అని అడిగాడు. ‘‘అబ్బే సోమవారమా! ఇంకేమన్నా ఉందా. అయినా మరీ అత్యవసరం అయితే తప్ప నేను సెలవు పెట్టనని నీకు తెలుసు కదా..’’ అన్నాడు తండ్రి తడుముకోకుండా.   కొడుకు మరేం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న చిల్లరనంతా తండ్రి దగ్గరకి జరిపాడు. దాని మీద ఇందాక తండ్రి ఇచ్చిన వేయి రూపాయలు కూడా పెట్టాడు. ‘‘నాన్నా నీ రోజు జీతం రెండు వేలన్నావు కదా! ఇవిగో రెండువేలు. ఇవి తీసుకునన్నా నాతో ఒక్కరోజు గడపవా ప్లీజ్. నేను ఆర్నెళ్ల నుంచి దాచుకున్న డబ్బంతా కలిపి వేయి రూపాయలయ్యింది. దానికి నువ్వు ఇందాక ఇచ్చిన వేయి రూపాయలు కలిపితే రెండేవేలవుతాయి. ఇవి తీసుకుని నా పుట్టినరోజు నాతోనే గడుపు ప్లీజ్‌!’’ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. తండ్రికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తాను ఎదుగుతున్నాడని సంబరపడ్డాడే కానీ, ఆ ఎదిగే క్రమంలో ఏ లోతుల్లోకి జారిపోతున్నాడో ఇన్నాళ్లూ అతను గ్రహించలేకపోయాడు. ఎదుగుదల అందరికీ అవసరమే! కానీ దానికోసం దేన్ని ఎంతవరకు వదులుకోవాలి అన్నదే ప్రశ్న. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.  
అనగా అనగా ఒక అన్యోన్యమైన జంట. వాళ్లిద్దరినీ చూసి చుట్టుపక్కల వాళ్లందరికీ ముచ్చటగా ఉండేది. అలాగని వారు అందరికంటే అందంగా ఉండేవారని కాదు! ఎప్పుడూ కొట్టుకోకుండా ఉండేవారనీ కాదు! కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా కలిసిమెలిసి ఉండేవారు. అలాంటి వారిద్దరి మధ్యా ఒక కథ నడిచింది...   ఒక రోజు భర్త ఇంటికి వస్తూనే ‘నేను ఇవాళ దాంపత్యం గురించి ఒక అద్భుతమైన ఉపన్యాసం విని వస్తున్నాను’ అన్నాడు. ఏం చెప్పారేంటి ఆ ఉపన్యాసంలో!’ అంటూ ఆసక్తిగా అడిగింది భార్య. ‘భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదంట. అందుకోసం ఒకరిలో ఒకరికి నచ్చని విషయాలు ఏమన్నా ఉంటే, వాటి గురించి ముందుగానే చర్చించుకుని తేల్చుకోవాలంట!’ అంటూ చెప్పుకొచ్చాడు భర్త. భార్య ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ‘ఈ ఉపన్యాసం విన్న తరువాత నాకు ఓ ఉపాయం తట్టింది. ఇవాళంతా కూర్చుని నీలో నచ్చని విషయాలు ఏమున్నాయో, ఒక కాగితం మీద రాస్తాను. నువ్వు కూడా నాలో నచ్చని విషయాలు ఏమేం ఉన్నాయో ఒక కాగితం మీద రాసి ఉంచు. అలా కాగితాలలో రాసుకున్న లోపాల గురించి రేపు చర్చించుకుందాం’ అంటూ హడావుడిగా గదిలోకి వెళ్లి ఒక పెన్నూ, కాగితం పట్టుకున్నాడు.   మరుసటి రోజు ఉదయం వేళకి భర్త వంటింట్లోకి ఒక మూడు కాగితాలు తీసుకువచ్చాడు. ‘నీలో నాకు నచ్చని విషయాల జాబితా ఒకటి తయారుచేశాను. అవన్నీ చదువుతాను విను’ అంటూ బడబడా ఆ మూడు కాగితాలలో రాసిన ‘భార్యలోని లోపాలను’ చదవసాగాడు. జాబితాని చదవడం పూర్తయిన తరువాత హుషారుగా ‘ఇప్పుడు నీ జాబితాని కూడా చదువు. తరువాత వాటిలో విషయాల గురించి చర్చించుకుందాం.’ అన్నాడు భర్త. భార్య మాత్రం నిశ్శబ్దంగా ఒక కాగితాన్ని తీసుకుని భర్త చేతిలో పెట్టింది. ఆశ్చర్యం! అది ఖాళీగా ఉంది. ‘అదేంటీ నువ్వు రాసేందుకు నాలో ఒక్క లోపం కూడా కనిపించలేదా!’ అని అడిగాడు భర్త.   ‘నేను కూడా మీలో లోపాలని రాద్దామనే కూర్చున్నాను. కానీ మన బంధాన్ని నాశనం చేసేంతటి లోపాలు ఏవీ మీలో కనిపించలేదు. ఒకవేళ ఏదన్నా చిన్న లోపం కనిపించినా, ఒకోసారి దాని వల్ల ఉపయోగం కూడా కనిపించేది. పోనీ మీలో నాకు నచ్చని విషయాలను రాద్దామా అంటే... నాకు నచ్చనంత మాత్రాన వాటిని లోపాలుగా ఎలా అనుకోగలను. మీరు మీలాగా ఉంటే చాలు అనిపించింది. ఎప్పటిలాగే ప్రేమని పంచుతూ, బాధ్యతగా చూసుకుంటే ఉంటే చాలనిపించింది,’ అంది భార్య. భర్తకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ కళ్ల నుంచి నీరు ఆగలేదు. అంత ఉద్వేగంలో కూడా, తన చేతిలో ఉన్న కాగితాలను చించడం మాత్రం మర్చిపోలేదు.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
తేనంత తియ్యనిది మరొకటి లేదు" అంటూ మనం తియ్యదనానికి పోలిక కోసం తేనెని సూచిస్తాం. ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం ఈ తేనే అని చెప్పవచ్చు. అద్భుతమైన తియ్యదనం, అరుదైన లక్షణాలు స్వంతం చేసుకున్న తేనే సహజసిద్ధమైన యాంటీబయోటిక్. అందుకే మన పెద్దవాళ్ళు తేనెని "సర్వరోగ నివారిణి" అంటారు. ఎన్నో అనారోగ్యాలకు తేనే చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. సరే అసలు మనం ఉపయోగించే తేనే మంచిదా...? కాదా..? ఎలా తెలుసుకోవాలి..? ఈ వీడియో చూస్తే సరే. https://www.youtube.com/watch?list=PLvS3k4MyaWFe6JbWpk_Syg1nJcwWkRFtQ&v=sMINAsZuqGM
Ginger belongs to the same family of Turmeric which is ‘Zingiberaceae`. Probably that has something to do with the medicinal properties of ginger. Ginger is said to have originated in china. But Indians are the ones who have used it in huge proportions for culinary as well as the medicinal purpose. Even today India is the leading producer of ginger. The contents such as Gingerol are responsible for its pungent smell as well as the herbal properties. The day to day ailments like cough and cold are always treated with the extracts of ginger in our society. Some of the other well known and well proved medicinal qualities of ginger are as follows. For Digestion:     Ginger is known for thousands of years for its positive effect on our digestion. The taste of ginger itself would provoke the digestive juices. Having a ginger tea after meals would certainly aid the digestive process. It’s antibacterial and anti fungal properties would keep the intestines safe from the foreign bodies. However people with stomach ailments like ulcers are not advised to take huge quantities of raw ginger without the advice of a professional. Against Tumors:     Even The American Cancer Society has agreed that the extract from ginger has either slowed down or prevented the growth of cancerous tumors in the animals. In another study it was found that the cancer cells died when they came into contact with the ginger solution. Ginger was found to be helpful against ovarian, breast and colon cancers. In Nausea:     The feeling of sickness associated with vomiting sensation is called nausea. It might occur during pregnancy, while travelling on bus, while being on ship, while undergoing chemotherapy… The smell of ginger itself can relieve much of nausea. Ginger when taken during such situation is found to act as good as a medicine available in the drugstore. Even the Naval cadets were found to be relived from sea sickness after consuming ginger. Anti inflammatory:   The ingredient of Gingerol mentioned before is found to be anti-inflammatory as well as analgesic (that reduces pain). That is the reason why ginger is advised frequently for the patients suffering from rheumatoid arthritis and Osteoarthritis. In a few studies, when the patients suffering from the above ailments were regularly given the supplements extracted from ginger… the mobility of their joints seems to have improved and the pain associated with stress on joints seems to have been relived. Ginger is found to work as analgesic in migraines and menstrual pain as well. Diabetic and cardiovascular diseases:     No health article can be complete without mentioning these two ailments that are associated with our day to day lifestyle and are major causes for our health troubles. Ginger was proved to encourage the intake of insulin into muscles thereby decreasing the levels of glucose in bloodstream. Regular intake of ginger was also associated with the decrease of triglycerides and LDL cholesterol levels which are major culprits for diabetics as well heart diseases. Besides minerals like Magnesium, Manganese, Phosphorus, Potassium and Zinc would ensure a free flow of blood towards the heart. As the herbal values associated with ginger seems to be elevating day by day, the saying in future might be as follows - `A pinch of ginger a day keeps the doctor away`     --Nirjara
  రోజులు మారిపోతున్నాయి. రోజులతో పాటుగా అలవాట్లూ మారిపోతున్నాయి. కాస్త ఆకలి వేసినప్పుడు ఇడ్లీలో, పకోడీలో తినే పరిస్థితి దాటిపోయి... బ్రెడ్డు మీద వెన్న రాసుకునే అలవాటు మొదలైంది. కానీ ఇలా దేని మీద పడితే దాని మీద వెన్నని రాస్తే ఆకలి తీరడం మాట అటుంచి అనారోగ్యం పాలవుతామని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వెన్న భారతీయులకి కొత్తేమీ కాదు. మన రోజువారీ జీవితంలో పాలు, వెన్న, నెయ్యి శుభ్రంగా కలిసిపోయాయి. ఈ పదార్థాలు లేనిదే మన ఆహారాన్ని ఊహించుకోవడమే కష్టం. కానీ కొద్ది రోజులుగా వెన్న మీద పరిశోధకుల కన్ను పడింది. ఇందులో ఉండే విపరీతమైన కొవ్వు వల్ల గుండెపోటు, చక్కెర వంటి సమస్యలు ఏర్పడతాయంటూ హెచ్చరించడం మొదలుపెట్టారు. ఇలాంటి మాటలు విన్న భారతీయులు కూడా అనాదిగా వస్తున్న తమ అలవాట్లలో లోపం ఏదన్నా ఉందేమో అని భయపడి అసలు వెన్నకే దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు వెన్న జోలికే పోవడం మానుకున్నారు. నిజానికి ఆయుర్వేదం ప్రకారం వెన్నకి అద్భుతమైన గుణాలెన్నో ఉన్నాయి. ఆకలిని పెంచడంలోనూ, వాతపిత్త దోషాలను నివారించడంలోనూ, జీర్ణవ్యవస్థని మెరుగుపరచడంలోనూ, శక్తిని అందించడంలోనూ... వెన్నకు తిరుగులేదంటారు ఆయుర్వేద నిపుణులు. ఇక పిల్లలపాలిట అయితే ఇది అమృతంలా పనిచేస్తుందట. మరి అలాంటి వెన్నకి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నారేంటా అని జనం సందిగ్థంలో పడిపోయారు. కానీ బోస్టనుకు చెందిన డా॥లారా చేసిన ఒక పరిశోధనతో అసలు విషయం బయటపడింది. వెన్నకీ గుండెజబ్బులు, చక్కెర వంటి వ్యాధులకీ పెద్దగా సంబంధం లేదని తేల్చిపారేశారు లారా. నేరం వెన్నది కాదనీ, దాంతో పాటుగా పుచ్చుకునే బ్రెడ్‌, బంగాళదుంపలు వంటి పదార్థాలదే అంటున్నారు ఈ పరిశోధకురాలు. దేని మీద పడితే దాని మీద వెన్నని పూసేసుకొని, ఆ తరువాత వచ్చే అనారోగ్యాలకు వెన్నను దోషిగా నిలబెట్టడం మంచిది కాదంటున్నారు. లారా తన పరిశోధన కోసం దాదాపు ఆరు లక్షలమంది ఆరోగ్యవిధానాలను నిశితంగా పరిశీలించారు. అదీ విషయం! రోజుకి కాస్తో కూస్తో వెన్నని మితంగా పుచ్చుకోవడంలో తప్పులేదనీ... అయితే ఆ వెన్నని దేని మీద పూస్తున్నారో కూడా గమనించుకోవాలని ఈ పరిశోధనతో తేలుతోంది. పైగా వెన్న పేరుతో బయట లభించే కృత్రిమ వెన్న (margarine) పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ కృత్రిమ వెన్నని తయారుచేసేందుకు రకరకాల నూనె పదార్థాలని ఉపయోగిస్తారనీ, ఇవి శరీరంలోనే పేరుకుపోతాయని చెబుతున్నారు. అచ్చు వెన్నలాగే ఉండే ఈ margarineని బేకరీలలో విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటారు. సహజమైన వెన్నని చూసి భయపడేకంటే ఇలాంటి కృత్రిమ పదార్థాలకు, బేకరీ ఆహారాలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.